Jump to content

Bhavani IslandTourism Corporation


sonykongara

Recommended Posts

  • Replies 348
  • Created
  • Last Reply
అమరావతిలో ‘‘అద్భుత ద్వీపాలు’’
 
636235836173607747.jpg
  • కృష్ణా నదిలో ఐల్యాండ్ల అభివృద్ధి
  • 200 కోట్లతో ప్రణాళికలు
  • పీపీపీ పద్ధతిలో అమలు
  • అన్ని ఐల్యాండ్లను అభివృద్ధి చేయాలి
  • స్థానికుల విన్నపం
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : అమరావతి.. ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో స్థానం సంపాదించిన ప్రాంతం. ఆంధ్ర దేశమే కాదు.. ఆంగ్ల దేశాల్లో కూడా నామస్మరణ మారుమోగుతున్న ప్రాంతం..అంతలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమరావతిలో పర్యాటక ప్రదేశాలు ఎలా ఉండాలి? ఏ స్థాయిలో వాటిని తీర్చిదిద్దాలి? ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూడాలంటే ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టాలి? తక్కువ ఖర్చుతో పర్యాటకులకు ఎక్కువ ఆహ్లాదం ఎలా అందించాలి? అన్న ఆలోచనలో ప్రస్తుతం పర్యాటక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలన్నింటిలో ప్రత్యేకమైనది భవానీ ఐలాండ్‌.
 
సుమారు 126 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఐలాండ్‌ ఏటా అరకోటి మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈనేపథ్యంలో భవానీ ఐలాండ్‌ అభివృద్ధికి ‘భవానీ ఐలాండ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌’ (బీఐడీసీ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి హిమాన్ష్‌ శుక్లా అనే ఐఏఎస్‌ అధికారిని సీఈవోగా నియమించడంతోపాటు రూ.50 కోట్లు కూడా కేటాయించింది. ఈ కార్పొరేషన్‌ పరిధిలోకి కృష్ణా నదిలో పవిత్ర సంగమం దగ్గర నుంచి హంసలదీవి వరకూ ఉన్న ఐల్యాండ్లను తీసుకువచ్చింది. వీటిలో చిన్నా పెద్దవి కలిపి సుమారు 15 ఐల్యాండ్లను బీఐడీసీనే పర్యవేక్షిస్తుంది.
 
రూ.200 కోట్లతో ప్రణాళికలు
భవానీ ఐల్యాండ్‌ దాని చుట్టుపక్కల ఉన్న ఐల్యాండ్స్‌ను రూ.200 కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దాలని పర్యాటక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఎక్కువ భాగం అభివృద్ధి పనులను పీపీపీ పద్ధతిలో చేపట్టాలని భావిస్తోంది. భవానీ ఐల్యాండ్‌లో ప్రస్తుతం చిన్న చిన్న గార్డెన్స్‌ మాత్రమే ఉన్నాయి. మరో 5 ఎకరాలలో రూ.కోటితో మెర్జ్‌ గార్డెన్స్‌ నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు.
 
పారా మోటరింగ్‌, లగ్జరీ టెంటింగ్‌
భవానీ ఐల్యాండ్‌ చుట్టు పక్కల ఉన్న మరో ఆరు చిన్న చిన్న ఐల్యాండ్స్‌పై పర్యాటక శాఖ దృష్టి సారించింది. ఈ ఐల్యాండ్లలో కొందరు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కొంత ప్రాంతం ఖాళీగా ఉంచారు. ఇలాంటి ప్రదేశాలకు దేశ, విదేశ పర్యాటకుల్ని తీసుకువెళ్లి, మన వ్యవసాయ పద్ధతుల్ని వారికి వివరించాలన్న ఆలోచనలో పర్యాటక శాఖ ఉంది. ఇదే ప్రదేశంలో పారా మోటరింగ్‌, లగ్జరీ టెంటింగ్‌ వంటి వాటిని శాశ్వతంగా ఏర్పాటు చేసి పర్యాటకుల్ని ఆకర్షించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఏపీటీడీసీ బెరమ్‌పార్క్‌ కేంద్రంగా బోటింగ్‌ నిర్వహిస్తోంది. మరో రెండు ప్రయివేటు సంస్థలు భవానీ ఐల్యాండ్‌ కేంద్రంగా బోటింగ్‌ నిర్వహించేందుకు పర్యాటక శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
 
మరోవైపు సైలింగ్‌ క్లబ్‌ను కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. ఇలానే భవానీ ఐల్యాండ్‌తో పాటు అమరావతిలో ఉన్న ఐల్యాండ్లపై దృష్టి నిలిపిన ప్రభుత్వం వాటిని ‘‘అద్భుత ద్వీపాలు’’ గా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రచిస్తోంది. కృష్ణా నదిలో భవానీ ఐల్యాండ్‌తో పాటు ఏటిలంక, వల్లూరిపాలెం లంక వంటి అనేక ద్వీపాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం రైతులు వ్యవసాయం చేస్తున్నారు. నాగాయలంక ప్రాంతంలో అయితే అద్భుత ప్రదేశాలు దర్శనమిస్తాయి. వీటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్ల పర్యాటకుల దృష్టి అటువైపు పడటం లేదు. అమరావతి పుణ్యామా అని ఐల్యాండ్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. హంసలదీవి వరకూ ఉన్న చిన్నా, పెద్ద ఐల్యాండ్లను కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
 
US2GUNTUR.gif
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

ద్వీపాల అభివృద్ధిపై ఆరు నెలల్లో ప్రతిపాదనలు
కృష్ణా బ్యారేజీ పరిధిలో ఉన్న పలు ద్వీపాల(ఐ ల్యాండ్స్‌)ను అభివృద్ధికి ప్రతిపాదలను రూపొందించేందుకు షికాగోకు చెందిన ఓ కంపెనీ, పోర్చుగల్‌ నుంచి మరో కంపెనీ ముందుకు వచ్చాయి. ఈరెండు కంపెనీల సాంకేతిక బిడ్లు ఆమోదం పొందాయి. వీటిలో ఓ కంపెనీకి వచ్చే వారం రోజుల్లో టెండరు ఖరారు చేయనున్నారు. టెండరు దక్కిన సంస్థ ఆరునెలల్లో పూర్తిస్థాయి ప్రతిపాదనలను అందించాల్సి ఉంటుంది.

Link to comment
Share on other sites

భవానీ ద్వీపం అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక..!

ఈనాడు, అమరావతి

kri-gen1a.jpg

నవ్యాంధ్ర రాజధాని కేంద్రంగా పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విజయవాడలోని భవానీ ద్వీపం ఇక అంతర్జాతీయ స్థాయిని అందుకోబోతోంది. ఈ మేరకు బృహత్తర ప్రణాళిక రూపొందుతోంది. ఈ భవానీద్వీపం పర్యటక కార్పొరేషన్‌ సమావేశం ఇటీవల జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే రెండేళ్లలో ద్వీపాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ఆధ్వర్యంలో డిస్నీల్యాండ్‌ తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. షికాగోకు చెందిన సీబీటీ ఆర్కిటెక్ట్స్‌, భారత్‌కు చెందిన స్టూడియో పాడ్‌ కన్సార్టియంకు బృహత్‌ ప్రణాళిక బాధ్యతలు అప్పగించారు. నాలుగు నెలల్లో దీని ప్రణాళికలు సమర్పించాల్సి ఉంటుంది.

ద్వీపంలో రూ.12 కోట్లు వెచ్చించి మ్యూజికల్‌ ఫౌంటెన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లాస్‌వెగాస్‌ తరహాలో అత్యంత సాంకేతికతతో దీన్ని రూపొందిస్తారు. భవానీ సహా ఏడు ద్వీపాలను పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు. నాలుగు నెలల్లో బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సమర్పించనున్నారు. భవానీ ద్వీపం విస్తీర్ణం దాదాపు 150 ఎకరాలు. కృష్ణానది ఒడ్డునే ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం భవానీ ద్వీపంలో స్పైడర్‌ నెట్‌, వాటర్‌ స్పోర్ట్సు, బోటింగ్‌ రెస్టారెంటు, ఏపీటీడీసీ కాన్ఫరెన్సు హాలు, కాటేజీలు 24వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ద్వారా నెలకు రూ.15 లక్షల ఆదాయం వరకు వస్తోంది.

భవానీ ద్వీపంలో రోప్‌వేను ఏర్పాటు చేయనున్నారు.

డిస్నీ లాండ్‌ తరహాలో కొత్త క్రీడలు రూపొందిస్తారు. వినోదాత్మక కార్యక్రమాలు, ఎమ్యూజ్‌మెంటు పార్కులు ఉంటాయి. కాటేజీల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 24ను 100 వరకు పెంచాలనేది ప్రణాళిక. అంతర్గతంగా రహదారులు ఏర్పాటు చేస్తారు.

ప్రకాశం బ్యారేజీలో రివర్‌ కాటేజీలు కృష్ణానది వరదలను దృష్టిలో ఉంచుకొని నిర్మించనున్నారు.

15 మాస్టర్‌ బైక్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

నదీ ముఖద్వారాల అభివృద్ధిలో భాగంగా ప్రతి 50 మీటర్లు చొప్పున ఒక గేమింగ్‌ ఉండాలని నిర్ణయించారు. పద్మావతి ఘాట్‌, దుర్గాఘాట్‌, పున్నమి, భవానీ ఘాట్‌ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేశారు. సంగీత ప్రియులకు వివిధరకాల సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు

Link to comment
Share on other sites

ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

భవానీ ద్వీపంలో పర్యటించిన మంత్రి అఖిలప్రియ

19ap-state11a.jpg

భవానీపురం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని, ఏపీకి వెళ్లాలనే భావన పర్యాటకుల్లో కల్పిస్తామని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. విజయవాడ సమీపంలో కృష్ణానది మధ్యనున్న భవానీ ద్వీపాన్ని మంత్రి ఆకస్మికంగా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ద్వీపం పరిశీలనకు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటకానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో విజయవాడ, గుంటూరు, విశాఖ, కర్నూలు తదితర జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై దృష్టి సారిస్తానన్నారు. ద్వీపంలో ఐదు నక్షత్రాల హోటల్‌ నిర్మించాలనే ప్రతిపాదన గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి రాయితీలు కల్పించే దిశగా ఆలోచిస్తామన్నారు. క్షేత్ర స్థాయి పర్యటనల వల్ల వాస్తవ పరిస్థితులను తెలుసుకోవచ్చన్నారు. ద్వీపంలో పేరుకుపోయిన చెత్త పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వెంటనే చెత్తతొట్టెలు ఏర్పాటుచేయాలని సూచించారు. పార్కులోని రెస్టారెంట్లను పరిశీలించి సూచనలు చేశారు.

Link to comment
Share on other sites

కృష్ణా నదిలో గుర్తించిన ఏడు ద్వీపాలను వెంటనే సీఆర్‌డీఏ స్వాధీనం చేసుకోవాలని, అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వాటితో పాటు 250 ఎకరాల మేర ఉన్న మరో ద్వీపాన్ని గుర్తించామని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ వివరించారు. పరిపాలన నగరం అభివృద్ధి పనుల పురోగతిని ఇకపై ప్రతినెలా మూడోవారంలో సమీక్షిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం రెండు బ్రిడ్జిలు మినహా ఆగస్టునాటికి పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...