Jump to content

Bhavani IslandTourism Corporation


sonykongara

Recommended Posts

  • Replies 348
  • Created
  • Last Reply

సంపద సృష్టిలో టూరిజమే గొప్ప: సీఎం
భవానీ ద్వీపంలో మల్టీమీడియా లేజర్‌ షో
డాన్సింగ్‌ మ్యూజికల్‌ ఫౌంటైన్‌ ప్రారంభం
విజయవాడ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మంచి పర్యాటక హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వీటన్నిటినీ అభివృద్ధి చేయడం ద్వారా సంపద సృష్టిస్తామని తెలిపారు. సోమవారం రాత్రి భవానీద్వీపంలో పర్యాటక అభివృద్ధి సంస్ధ నేతృత్వంలో దేశంలోనే వినూత్నమైన మొట్టమొదటి మల్టీమీడియా లేజర్‌ షో-డాన్సింగ్‌ మ్యూజికల్‌ ఫౌంటైన్‌ను ఆయన ప్రారంభించారు. ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో అద్భుత పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలను చూస్తారని చెప్పారు. కృష్ణానది పవిత్రమైన నది అని, ఈ ప్రాంతంలో సంపద ఉండడానికి కృష్ణానదే ప్రధాన కారణమన్నారు.
 
సంపద సృష్టిలో పర్యాటక రంగాన్ని మించినది లేదని తెలిపారు. అరకులోయలో బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తే కిక్కిరిసిన జనం వచ్చారని, మంచు దృశ్యాలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు వస్తున్నారని చెప్పారు. కోనసీమ, పాపికొండలు, పట్టిసీమ, రుషికొండ, కైలాసగిరి, దిండి, మారేడుమిల్లి, లేపాక్షి, అరకు, పులికాట్‌ సరస్సు, కొల్లేరు సరస్సు వంటి అనేక పర్యాటక ప్రాంతాలు మనకున్నాయని గుర్తుచేశారు. వీటన్నిటినీ మరింతగా అభివృద్ధి పరచాలని, తిరుపతి, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, కాణిపాకం తదితర పుణ్య క్షేత్రాలతో నవ్యాంధ్ర ఆధ్యాత్మిక, పర్యాటకధామంగా ఉందన్నారు. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉందని, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రంలో చక్కటి ఉపాధి కేంద్రాన్ని సృష్టించుకోవచ్చన్నారు. విజయవాడ నగరంలో బాపు మ్యూజియాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని, త్రీడీ ఫొటోలను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మొగల్రాజపురం, ఉండవల్లి గుహలు చారిత్రక సంపదని, కొండపల్లి కోట, బొమ్మల గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
 
ప్రకాశం బ్యారేజీ కట్టి 60 ఏళ్లు అయిందని, బ్యారేజీ ఎగువన మరో బ్రిడ్జి కడతామని చెప్పారు. అప్పుడు పులిచింతల నుంచి సముద్రం వరకు కృష్ణానదిలో నీళ్లు నిల్వ ఉంటాయని, పర్యాటకాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. ఇక్కడి ప్రజలు పర్యాటకులకు గైడ్‌గా వ్యవహరించి మర్యాదగా మెలగాలన్నారు. చక్కటి ఆతిథ్యం ఇవ్వాలని కోరారు. వ్యవసాయ పర్యాటకం కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయన్నారు.

Link to comment
Share on other sites

పర్యాటకంతోనే ఆర్థిక ప్రగతి 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 
భవానీద్వీపంలో తేలియాడే ఫౌంటేన్‌ ప్రారంభం 

ఈనాడు డిజిటల్‌, విజయవాడ: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి పుష్కల వనరులున్నాయని, వాటి ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడ భవానీద్వీపంలో నీటిపై తేలియాడే మ్యూజికల్‌ ఫౌంటేన్‌, లేజర్‌షోను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. విజయవాడ చరిత్రలో ఇది కీలక ఘట్టమని, రూ.16 కోట్లతో ఏర్పాటుచేసిన ఫౌంటేన్‌పై నగర చరిత్రను తెలియజేసే ప్రదర్శన అద్భుతంగా ఉందని కొనియాడారు. రోజూ వైవిధ్యభరితంగా ప్రదర్శన ఉండేలా ప్రత్యేక చొరవ చూపించాలని అధికారులకు సూచించారు. కృష్ణా నది వల్లే ఈ ప్రాంత ప్రజలు ఆర్థికంగా స్థిరపడ్డారని, ప్రపంచవ్యాప్తంగానూ గుర్తింపు సాధించారని తెలిపారు. కేవలం ఒక దీవిలోనే సింగపూర్‌ ఆర్థికంగా అభివృద్ధి చెందిందని, అలాంటిది కృష్ణా నదిలో సహజసిద్ధంగా ఏర్పడిన ఏడు దీవులు ఉన్నాయని అన్నారు. వీటిని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తే అపారమైన ఉపాధి, ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం దీనిపైనే దృష్టి సారించామని తెలిపారు. నదిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువన కూడా బ్యారేజీలు నిర్మిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ పర్యాటకులు వస్తేనే ఆర్థికాభివృద్ధి బాగుంటుందని, అందుకే వారిని రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అతిథులను సాదరంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, అప్పుడే వారు మళ్లీమళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. మంత్రులు భూమా అఖిలప్రియ, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఏపీటీడీసీ ఛైర్మన్‌ జయరామరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Link to comment
Share on other sites

 

మాల్దీవుల తరహాలో ఏపీలో పర్యాటకం 
జాతీయ మెరైన్‌ మ్యూజియంగా ఐఎన్‌ఎస్‌ విరాట్‌ 
పర్యాటక వారసత్వ బోర్డు ద్వితీయ సమావేశంలో సీఎం ఆమోదం 
28ap-state1a.jpg

ఈనాడు అమరావతి: మాల్దీవుల తరహాలో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆ దీవుల్లో కేవలం 4కోట్ల మంది జనాభా ఉంటే 30-40 సీప్లేన్‌లున్నాయని తెలిపారు. ప్రపంచస్థాయి ఉత్తమ పర్యాటక గమ్యస్థానంగా భవానీద్వీపాన్ని అభివృద్ధి చేయాలని.. ఇక్కడున్న ఏడు ద్వీపాలను ఒక్కోదాన్ని ఒక్కో దృక్పథంతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటక వారసత్వ బోర్డు నిర్ణయించింది. సీబీటీ స్టూడియోపాడ్‌ కన్సార్టియం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ గురించి ముఖ్యమంత్రికి పర్యాటక శాఖ ప్రత్యేక కమిషనర్‌ హిమాన్షుశుక్లా వివరించారు. మొత్తం 7 ద్వీపాల్లో మొదటివిడతలో 792 ఎకరాల్లోని ఒక ద్వీపాన్ని, 515 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మరో మూడు ద్వీపాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.300 కోట్లతో 15నెలల వ్యవధిలో రుషికొండలో ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌకను జాతీయ స్థాయి మెరైన్‌ మ్యూజియంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. బోర్డు ద్వితీయ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో జరిగింది. పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా, ఇతర అదికారులు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. 9పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది.

బోర్డు ఆమోదం తెలిపినవాటిలో... 
మధురవాడ కొండపైన 5నక్షత్రాల హోటల్‌ ఏర్పాటుకు పార్క్‌ గ్రూపు ప్రతిపాదనలు సమర్పించినట్లు అధికారులు తెలపగా.. ‘‘పోటీ పెట్టండి, అక్కడ కనీసం 3హోటళ్లు రావాలి. వచ్చే అయిదేళ్లలో విశాఖలో 25వేల అదనపు హోటల్‌గదులు రావాలి, ప్రస్తుతం 2500 గదులు కూడా లేవ’’ని సీఎం వ్యాఖ్యానించారు. బీ స్వదేశ్‌దర్శన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతో చేపట్టనున్న అరకు ట్రైబల్‌ సర్క్యూట్‌ అంచనా వ్యయం రూ.163.02కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ.127.41కోట్లు, రాష్ట్రం వాటా రూ.35.61కోట్లు. ఇందులో సాహస కార్యక్రమాల జోన్‌, బోటింగ్‌ ఎరీనా, కళా ప్రదర్శన కేంద్రం, గిరిజన ప్రదర్శనల కోసం ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, 150మీటర్ల సస్పెన్షన్‌ వంతెన, వజ్రాలకొండలో కృత్రిమ స్కైయింగ్‌ 
తదితరాలుంటాయి.

* అమరావతిలో... రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలో రూ.15.8కోట్ల అంచనా వ్యయంతో 2018 నవంబరులో స్పీడ్‌ బోట్‌ రైడ్‌ నిర్వహిస్తారు. ఇందులో ఏపీ నుంచి ఇద్దరు ప్రతినిధులు పోటీపడతారు. 33దేశాల నుంచి రైడర్లు ఈ పోటీలకు రానున్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

* అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో మెగా శిల్పారామం ఏర్పాటు.బీ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్‌లో 15 ఎకరాల్లో రూ.200 కోట్లతో లగ్జరీ బీచ్‌రిసార్ట్స్‌. బీ కడప జిల్లాలోని గండికోటలో రూ.7.5కోట్ల అంచనా వ్యయంతో రోప్‌వే ఏర్పాటు.

* ఇవేగాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టుల్లో రూ.16.7కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

* షెరటాన్‌ 5 నక్షత్రాల హోటల్‌కు మార్చి 1న శంకుస్థాపన: రూ.200 కోట్లతో విజయవాడలో ఎన్‌ఏసీ గ్రూపు ఏర్పాటు చేయదలచిన షెరటాన్‌ 5నక్షత్రాల హోటల్‌కు మార్చి 1న శంకుస్థాపన నిర్వహిస్తున్నామని దానికి రావాలంటూ ఆ గ్రూపు ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
పర్యాటకుడ్ని రప్పించి..మెప్పిస్తేనే..! 
మన ద్వీపాలు మాల్దీవులవుతాయి 
పక్కా ప్రణాళిక.. పౌరస్పృహ ప్రధానం 
అతిచిన్న ద్వీపదేశం పర్యాటకానికి ఆదర్శం 
ఈనాడు, అమరావతి 
amr-sty1a.jpg

విజయవాడ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న భవానీ ద్వీపంతో పాటూ, పక్కనే ఉన్న మరికొన్ని ద్వీపాలను కలిపి మాల్దీవుల తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. భవానీద్వీపాన్ని మాల్దీవుల తరహాలో అభివృద్ధి చేస్తే రాజధాని ప్రాంతం పర్యాటకంగా తిరుగులేని అభివృద్ధిని సాధిస్తుంది. మాల్దీవులు దక్షిణాసియాలోని ద్వీపదేశం. పర్యాటకానికి స్వర్గధామం. ఏటా లక్షల మంది పర్యాటకులు మాల్దీవులకు వెళ్లి వస్తుంటారు. ఆసియాలోనే భూభాగం, జనాభాలో అత్యంత చిన్న దేశం మాల్దీవులు. ఈ దేశం ప్రధాన ఆదాయం పర్యాటకమే. దేశ ఆదాయంలో 28 శాతం, విదేశీ మారకద్రవ్యంలో 60 శాతం పర్యాటకం ద్వారానే సమకూరుతోంది.

కృష్ణా నదిలో స్వచ్ఛమైన మంచినీటి మధ్యలో వెలిసిన భవానీద్వీపం గుంటూరు, కృష్ణా జిల్లాలకు మధ్యలో 132 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనిలో విజయవాడకు సమీపంలో ఉన్న కేవలం 15 ఎకరాల భూమిని మాత్రమే పర్యాటకంగా అభివృద్ధి చేశారు. దానిలోనూ కేవలం కొన్ని కాటేజీలు, నాలుగు జారుడు బల్లలు, మూడు ఉయ్యాలలను పెట్టి.. దశాబ్దాలుగా వదిలేశారు. భవానీద్వీపానికి ప్రయాణికులను తీసుకెళ్లడం, తిరిగి తేవడానికి పర్యాటక శాఖ పడవలను వినియోగిస్తున్నారు. ఇటీవల ఓ నాలుగైదు ప్రైవేటు బోటింగ్‌ సంస్థలకు అనుమతి ఇచ్చారు. మొత్తం భవానీద్వీపాన్ని అభివృద్ధి చేసి, పక్కనే ఉన్న మరికొన్ని ద్వీపాల్లో మాల్దీవుల తరహాలో సౌకర్యాలను కల్పించగలిగితే.. అమరావతి రాజధానికి భారీగా విదేశీ, స్వదేశీ ఆదాయాన్ని ఆర్జించడానికి దోహదపడుతుంది.

జలమే మాల్దీవులకు బలం.. 
మాల్దీవుల్లో చేపలపై ఆధారపడి బతికే రోజుల్లో దేశ జీడీపీ చాలా తక్కువ ఉండేది. హిందూ మహాసముద్రంలో అరేబియా సముద్రానికి దగ్గరలో ఉన్న ఈ ద్వీపంలో ప్రస్తుతం 4.30 లక్షల జనాభా ఉంటున్నారు. 1192 ద్వీపాల సమూహంతో గొలుసు మాదిరిగా సముద్రంలో అక్కడక్కడా విసిరేసినట్టుగా ఉండే దేశమిది. వీటిలో కొన్ని ద్వీపాలలో జనాభా నివసిస్తారు. మరికొన్నింటిని ప్రత్యేకంగా పర్యాటకుల కోసం సౌకర్యాలను కల్పించి ఉంచారు. వారికున్న ప్రధాన బలం సముద్ర జలాలు. వీటినే తమ దేశ పెట్టుబడిగా పెట్టి.. సౌకర్యాలను కల్పించారు.

జల క్రీడలకు పెట్టింది పేరు.. 
మనిషికి అత్యంత ఇష్టమైనది జలం. నీటిలో ఎంతసేపైనా గడిపేందుకు నూటికి 99 శాతం మంది ఆసక్తి చూపిస్తుంటారు. మాల్దీవులు ప్రధానంగా దీనిపైనే దృష్టి పెట్టింది. ప్రపంచంలో ఎన్ని రకాల జలక్రీడలు ఉన్నాయో.. అన్నీ మాల్దీవుల్లో అందుబాటులో ఉన్నాయి. బోటింగ్‌తో పాటూ పారా సైలింగ్‌, బనానా రైడింగ్‌, స్నోర్కెలింగ్‌, విండ్‌ సర్ఫింగ్‌, కయాకింగ్‌, స్కూబా డైవింగ్‌, తెల్లని ఇసుక బీచ్‌ల్లో ఈత, సముద్రంపై టెన్నిస్‌, ఫుట్‌బాల్‌, గోల్ఫ్‌ కోర్స్‌, బీచ్‌ వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, సైక్లింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, స్నూకర్‌, డార్ట్స్‌, టేబుల్‌ అండ్‌ జెయింట్‌ చెస్‌..వంటివన్నీ ఏ ద్వీపానికి వెళ్లినా అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా రాత్రి వేళ సైతం ఆడుకునేలా దీపాల వెలుగుల్లో ఇవన్నీ అందుబాటులో ఉంటాయి.

నీటి మధ్యలోనే కాటేజీలు.. 
మాల్దీవుల ప్రజల జీవనశైలిని సూచించే సంప్రదాయబద్ధమైన కాటేజీలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇవన్నీ.. నీటి మధ్యలోనే ఉంటాయి. ద్వీపం నుంచి చెక్క వంతెనలను నీటిలోనికి వేసి వాటి మీదుగా నడుచుకుంటూ వెళ్లి కాటేజీలకు చేరుకునేలా ఏర్పాట్లు ఉంటాయి. దీంతో ఏ కాటేజీలో ఉన్నా.. సముద్రపు నీటిలోనే ఉన్నట్టుగా ఉంటుంది. ఆ కాటేజీల వద్దకే అన్నీ తెచ్చి అందిస్తారు. ఈ కాటేజీల్లోనూ రకరకాలుంటాయి. అన్నీ గుడిసెల మాదిరిగానే పైభాగంలో ఉండి.. కిందన సింగిల్‌, డబుల్‌, ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌లలోనూ, డూప్లెక్స్‌గానూ అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్‌ పూల్‌ విల్లా, కుటుంబ విల్లా, నీటి విల్లా, హనీమూన్‌ విల్లా, బీచ్‌ విల్లా.. ఇలా రకరకాలుగా ఎవరికి కావాల్సినవి వారికుంటాయి. హోదాను బట్టి ప్రత్యేకంగా కాటేజీల్లోనే స్విమ్మింగ్‌ పూల్‌ ఉంటాయి.

ప్యాకేజీలు దేనికదే ప్రత్యేకం.. 
మాల్దీవులకు వెళ్లేవారెవరైనా హాయిగా గడిపి రావాలనే భావనతోనే ఉంటారు. అందుకే.. వారికి తగ్గట్టుగా ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. అన్ని దేశాల నుంచి మాల్దీవులకు వెళ్లేందుకు ప్రత్యేక ప్యాకేజీలను.. రవాణాతో సహా అక్కడ ఉండేందుకు, తినేందుకు, గడిపేందుకు అవసరమైన అన్నింటితో కలిపి ప్రత్యేక ధరల్లో అందుబాటులో ఉన్నాయి. సామాన్యులకు సైతం భారం కాని రీతిలో ఈ ప్యాకేజీలను అందిస్తుంటారు. పర్యాటకులను ఎలా ఆదరించాలో, ఎలా రప్పించాలనే అంశాలలో అక్కడి ప్రజలు, ప్రభుత్వం కలిసికట్టుగా ముందుకెళుతుంటారు. అందుకే.. స్థానిక యువతకు అతిపెద్ద ఉపాధి మార్గంగా ఇదే మారిందిప్పుడు. హోటళ్లు, కాటేజీలు, జలక్రీడలు, గైడ్లుగా.. ఇలా వేల సంఖ్యలో కొలువులు పుట్టుకొచ్చాయి. స్థానిక కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయి.

amr-sty1b.jpg

పుష్కలంగా విమాన సర్వీసులు.. 
రవాణా వసతి సైతం పుష్కలంగా ఉండడం మాల్దీవులకు కలిసొచ్చే అంశం. ఏ దేశం నుంచి ఏ సమయంలోనైనా.. మాల్దీవులు రాజధాని మాలె అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిపోవచ్చు. రాత్రీ పగలూ తేడాలేకుండా ఏ సమయంలోనైనా పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను అందించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశారు. పర్యాటకుడు విమానాశ్రయంలో దిగిన దగ్గర నుంచి కాటేజీలు, హోటళ్లు, ట్యాక్సీలు.. ఇలా అన్నింటికీ ఒకదానితో ఒకటి అనుబంధంగా ఉంటాయి. ఎక్కడా పర్యాటకులను దోచుకోవాలనే ధోరణి కనిపించదు. తమపై నమ్మకంతో వచ్చిన వారిని మళ్లీ రప్పించేలా చేసి..ఆదాయాన్ని పెంచుకోవడమే మాల్దీవుల వాసుల విజయ రహస్యం.

హోటళ్లు, రెస్టారెంట్లు,  గ్రంథాలయం, సినిమా 
పర్యాటకులకు కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రధానంగా వసతి, ఆహారం విషయంలో సమస్య లేకపోతే ఎన్ని రోజులైనా హాయిగా ఉంటారు. మాల్దీవుల్లో అన్ని దేశాలకు చెందిన ఆహారాన్ని అందించే రెస్టారెంట్లు, హోటళ్లు పుష్కలంగా ఉంటాయి. సముద్రం అడుగున జలచరాలను చూస్తూ ఆహారం తినే రెస్టారెంట్లు ప్రత్యేక ఆకర్షణ. గాజు అద్దాల మధ్యలో ఉన్న పర్యాటకులకు అవన్నీ ఆనుకునే ఉన్నట్టుంటాయి. సముద్రం మధ్యలో కూర్చుని భారీ స్క్రీన్లలో సినిమా చూసుకునే సౌకర్యం, పుస్తకాలను చదువుకునేందుకు గ్రంథాలయాలూ అందుబాటులో ఉంటాయి. విదేశీ పర్యాటకులకు మద్యం అలవాటు ఉంటుంది. రెస్టారెంట్లలోనే వారికి తయారుచేసిన మద్యం సరఫరా చేస్తారు.

మన ద్వీపాలు వరాలే.. 
కృష్ణా నదిలో భవానీద్వీపంతో పాటూ మరో అయిదారు ద్వీపాలు ఉన్నాయి. వీటన్నింటినీ అనుసంధానించి.. వచ్చే పర్యాటకులకు ఏమేమి అవసరమవుతాయో అన్ని సౌకర్యాలనూ కల్పించగలిగితే.. మాల్దీవులకు మించిన పర్యాటక స్వర్గధామంగా రాజధాని ప్రాంతం మారుతుంది. పర్యాటకులను తొలుత రప్పించే ప్రణాళిక అవసరం. మన దగ్గర ఇదే ప్రధానంగా లోపిస్తుంటుంది. ఒక్కసారి వచ్చిన పర్యాటకుడు మరోసారి రావాలంటే భయపడేలా విచ్చలవిడిగా ధరలు పెడుతున్నారు. మొదట రప్పించి.. ఆకర్షించి.. తర్వాత అవసరమైతే పెంచే పద్ధతి చేయాలి. అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు అందరూ వచ్చి ఉండేలా ప్రత్యేక ప్యాకేజీలను రూపకల్పన చేయగలిగితే..విజయవంతమవుతాయి.

Link to comment
Share on other sites

భవానీ ఐలాండ్ కు 6 నెలల్లో కొత్త హంగులు... సియంను అబ్బురపరిచిన ప్రెజంటేషన్ ఇదే...

 

bhavani-island-14012018-1.jpg
share.png

భవానీ ద్వీపానికి కొత్త హంగులు అద్దెందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాజధానిలో కీలక ప్రాంతం కావడంతో అభివృద్ధి పై భవానీ ద్వీపం టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా రూ.16 కోట్లతో ప్లోటింగ్ మ్యూజికల్ లేజర్ ఫాంటేన్లను డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ద్వీపానికి వచ్చిన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపేందుకు కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్త సంవత్సరంలో ఏర్పాటు చేయనున్నారు. మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ కొత్త ప్రాజెక్టులు తయారు చేయాలని బీఐటీసీ అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది చేపట్టబోయే కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి.

 

bhavani island 14012018 2

కృష్ణానదిలో ఏడు ద్వీపాలు ఉన్నప్పటికీ తొలుత 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవానీ ద్వీపం పై అధికారులు దృష్టి సారించారు. ఇక్కడికే పర్యాటకులు ఎక్కువగా వస్తుండడంతో సరికొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మజ్ గార్డెను ఏర్పాటు చేయనున్నారు. ఈ మజ్ గార్డెన్ లోకి ఒక మార్గంలోంచి లోపలకు వెళ్లి తిరిగి బయటకు రావడానికి తికమకపడాల్సిందే. నాలుగు వైపుల నుంచి బయటకు వెళ్లేందుకు వీలుండటం, ఏ మార్గంలో వెళ్తున్నామో తెలియకపోవడంతో ఇందులోకి వెళ్లిన వారికి మజ్ గార్డెన్పై ఉత్సాహం కలిగిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే కాకుండా మిర్రర్ మజ్ ను ద్వీపంలో ఏర్పాటు చేస్తు న్నారు. ఈ మిర్రర్ మజ్ ఒక రకమైన మయసభ. అనేక అద్దాలు ఉండటంతో ఎక్కడైనా ఒక చోట నిలబడి చూస్తే అన్ని అద్దాల్లోనూ వారి ప్రతిబింబమే కనపడుతుంది. దీంతో అసలు వ్యక్తి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం కొద్దిగా కష్టమే అవుతుంది.

bhavani island 14012018 3

గోల్ఫ్ సిమ్యులేటర్... గోల్ఫ్ ఆట పై ఆసక్తి ఉన్నవారు ఈ ఆటను నేర్చుకునేందుకు గోల్ఫ్ సిమ్యూలేటర్ను ఏర్పాటు చేయనున్నారు. సిమ్యూలేటర్లో ఆడితే గోల్ఫ్ కోర్ట్ లో ఆడినట్లుగానే అనుభూతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనితో పాటు అత్యాధునిక సౌకర్యా లతో కూడిన రెస్టారెంట్ను ద్వీపంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆరోగ్యం కోసం ట్రాక్స్... ద్వీపానికి వచ్చే పర్యాటకులు ఉల్లాసంగా గడపటంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్ ను ఏర్పాటు చేస్తారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే వాకింగ్ చేసుకునే వీలుంది. దీనికి తోడు ఆధునిక వాకింగ్ ట్రాక్ను, సైక్లింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తారు. ఆసక్తి ఉన్న వారు ద్వీపంలో ఒకటి రెండు రోజులు ఉన్నా ఈ ట్రాక్స్ ను ఉపయోగించుకుంటారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend
23 minutes ago, sonykongara said:

bhavani.jpg

 

happy to see that cbn is spending time with devansh ..papam aayana okkarey vuntunnaru e vayasulo dedicating his life to people of ap 

idhi chusi yedchey vaallu kuda vunnaru ...vaalaki oka vayasu vosthadhi appudu telusudhi baadha 

Link to comment
Share on other sites

  • 3 weeks later...

http://www.eenadu.net/district/inner.aspx?dsname=Amaravati&info=amr-sty2

 

కృష్ణా నది మధ్యలోని భవానీ ద్వీపం అభివృద్ధికి ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. భవానీ ఐలాండ్‌ టూరిజం కార్పొరేషన్‌(బీఐటీఎస్‌) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపడుతున్నారు. ద్వీపం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తి చూపించడం... తరచూ సందర్శించడం.. ప్రత్యేక కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేయడంతో అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఒడ్డున నీటిపై తేలియాడే లేజర్‌షో, వాటర్‌ ఫౌంటేన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పిల్లలతో సహా ద్వీపానికి వచ్చే వారిని ఆకట్టుకునేలా వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు.
సరదాగా గడిపేలా.. 
ముఖ్యంగా పిల్లలు సరదాగా గడిపేలా వివిధ రకాల ఆట పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో కొన్ని రకాల ఆట పరికరాలు మాత్రమే ఉండేవి. వాటిని వినియోగించుకోవాలంటే అధిక ధరలు వసూలు చేసేవారు. ఫలితంగా సందర్శకులపై ఆర్థికంగా భారం పడేది. ప్రస్తుతం బీఐటీఎస్‌ ఆధ్వర్యంలోనే చిన్నారులు, పెద్దలు ఆటలాడుకునే విధంగా ప్రత్యేక ఉద్యాన వనాన్ని నిర్మించారు. కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఉద్యానవనాన్ని ప్రారంభించారు. అందులో ఊయలలు, జారుడు బల్లలు, పిల్లలతో కలిసి పెద్దలు ఊగే ఆట పరికరాలు తదితరాలను ఏర్పాటు చేశారు. వాటిని ఉచితంగా వినియోగించవచ్చు

ఆకట్టుకునేలా... 
సమయాన్ని తెలిపేలా పచ్చని మొక్కలతో కూడిన గడియారాన్ని రూపొందించారు. ఆ గడియారం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మేజ్‌ గార్డెన్‌ పనులు చేస్తున్నారు. దాదాపు 80్ఠ80 మీటర్ల వెడల్పుతో ఆ గార్డెన్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఏపుగా మొక్కలను పెంచుతారు. వాటి మధ్యలో నుంచి వెళ్లటం సందర్శకులకు కొత్త అనుభూతిని మిగుల్చుతుంది. మిర్రర్‌ మేజ్‌ పేరుతో ప్రత్యేక భవనాన్ని కడుతున్నారు. ఆ భవనంలో వరుసగా అనేక అద్దాలుంటాయి. సందర్శకులు అందులో నుంచి వెళ్తుంటే వారి ప్రతిబింబాలు అనేకం కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఆ భవన నిర్మాణం సాగుతోంది. లేజర్‌షో తిలకించేందుకు కూడా రూ.100 టికెట్‌ ధరను నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల నుంచి షో మొదలవుతుంది. ద్వీపంలో పెద్ద చెట్ల చుట్టూ పచ్చని మొక్కలను ఏర్పాటు చేయడం, అందమైన బొమ్మల మధ్య మొక్కలను ఉంచుతూ అందంగా తీర్చిదిద్దుతున్నారు. సందర్శకులు నడుచుకుంటూ వెళ్లేలా అందంగా కాలిబాటలు, ఆకట్టుకునేలా విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులతో ద్వీపానికి కొత్త రూపు సంతరించుకుంటోంది. ఇంకా మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. కొన్ని రోజుల్లోనే వాటిని కూడా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని బీఆర్‌టీఎస్‌ అధికారులు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

విశాఖలో రెండు 5నక్షత్రాల హోటళ్లు 
సబ్‌మెరైన్‌ పార్క్‌  విజయవాడ భవానీద్వీపంలో సీలయన్‌, 
మొసళ్ల పార్క్‌ అనుమతించిన పర్యాటక సాంస్కృతిక వారసత్వ బోర్డు 
ఈనాడు - అమరావతి 


* విజయవాడ భవానీ ద్వీపంలో సీ లయన్‌, మొసళ్ల పార్కులను ఏర్పాటు.
 

Link to comment
Share on other sites

భవానీ ద్వీపంలో యానిమల్‌ పార్కు
25-02-2018 04:10:16

విశాఖపట్నం: విజయవాడ భవానీద్వీపంలో రూ.500కోట్లతో యానిమల్‌ పార్కు ఏర్పాటుకు ఎస్సెల్‌ గ్రూప్‌ పర్యాటక శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా గ్రూప్‌ సీఈవో రాజీవ్‌ దుగ్గల్‌ మాట్లాడుతూ దేశంలో ఇటువంటి పార్కు ఇప్పటివరకూ లేదని, ఇవి జంతు ప్రదర్శనశాలకు భిన్నంగా ఉంటాయని వివరించారు. భవానీద్వీపంలోని మూడు ఐలాండ్స్‌లో సాహస క్రీడలు, వాటర్‌ స్పోర్ట్స్‌ కోసం థీమ్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు.

Link to comment
Share on other sites

భవానీ ద్వీపంలో అగ్రి టూరిజం
భవానీద్వీపం పరిసరాల్లో 70ఎకరాల్లో రూ.60కోట్లతో అగ్రిటూరిజం ప్రాజెక్టు నెలకొల్పుతాం. వ్యవసాయాన్ని పర్యాటకానికి అనుసంధానం చేస్తాం. రైతులు, గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పిస్తాం. దీనికోసం మూడు గ్రామాలను దత్తత తీసుకుంటాం. నగరాలు, పట్టణాల్లోని పిల్లలకు వ్యవసాయం ప్రాధాన్యం వివరించేలా పర్యాటకాన్ని విస్తరిస్తాం.
- మాధవీబిందు, ఎండీ, సస్యవేద ఆగ్రి టూరిజం

Link to comment
Share on other sites

పెట్టుబడులు రూ.1,450 కోట్లు
26-02-2018 08:02:22

‘కృష్ణా’కు 4000 ఉద్యోగాలు
ఎనిమిది భారీ పరిశ్రమల ఎంవోయూలు
భాగస్వామ్య సదస్సుకు హాజరైన కృష్ణా జిల్లా కలెక్టర్‌
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ అధ్యయనం
విజయవాడ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): భాగ స్వామ్య సదస్సు ద్వారా కృష్ణా జిల్లాకు రూ.1450 కోట్ల మేర వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు జరిగాయి. ఆదివారం రాత్రికి అందిన గణాంకాల ప్రకారం కృష్ణాజిల్లాకు ఈ పెట్టు బడుల ద్వారా మొత్తం 4 వేల ఉద్యోగాలను కల్పించటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయా కంపెనీలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. కృష్ణాజిల్లాకు సంబంధించి మొత్తం ఎనిమిది కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. వీటిలో ఎస్సెల్‌ గ్రూప్‌ రూ.500 కోట్ల వ్యయంతో అడ్వెంచర్‌ పార్క్‌ ను ఏర్పాటు చేయటానికి ఎంవోయూ కుదు ర్చుకుంది. ఈ సంస్థ 550 ఉద్యోగాలను కల్పి స్తామని అగ్రిమెంట్‌లో పేర్కొంది. మహీంద్రా హాలిడే సంస్థ రూ.200 కోట్ల వ్యయంతో లక్ష్మీ రిసార్ట్‌ ఏర్పాటు చేయటానికి, 800 మంది ఉద్యో గా వకాశాలను కల్పించటానికి ఎంవో యూ చేసుకుంది. స్కై వాక్‌ మెరీనా అనే సంస్థ రూ.153 కోట్లతో మెరైన్‌ టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు చేయటానికి త ద్వారా 200 మందికి ఉపాధి కల్పించటానికి ఎంవోయూ చేసుకుంది. అమ రావతి కళా వైద్యాలయం సంస్థ రూ.80 కోట్ల వ్యయంతో ఆర్ట్స్‌ ప్రాజె క్టును ఏర్పాటు చేయ టానికి ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ మొత్తంగా 1100 మంది ఉద్యో గాలు కల్పిస్తామని పేర్కొంది. అమ రావతి బోటింగ్‌ క్లబ్‌ రూ.10 కోట్ల వ్యయంతో రిసార్ట్స్‌ అండర్‌ వాటర్‌ స్కూప్స్‌ ఏర్పాటు చేయటానికి ఎంవోయూ చేసుకుంది.
 
ఈ సంస్థ మొత్తం 150 మందికి ఉద్యోగావకాశాను కల్పిస్తామని పేర్కొంది. సూర్యవేద సంస్థ రూ.55కోట్లతో 800 మందికి ఉపాధిని కల్పిం చేలా ఎకో టూరిజం ప్రాజెక్టుకు ఒప్పందం చేసుకుంది. సీకే కన్వెన్షన్‌ సంస్త రూ.40 కోట్ల వ్యయంతో 550 మందికి ఉపాధిని కల్పించేలా కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకుంది. కాంధారి హోటల్స్‌ సంస్థ రూ.3 కోట్ల వ్యయంతో 50 మందికి ఉద్యోగాలు కల్పించేలా హోటల్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఎంఓయూ కుదు ర్చుకుంది. కృష్ణాజిల్లా కలెక్టర్‌ లక్ష్మీ కాంతం ఆదివారం విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య పెట్టుబడుల సదస్సులో పా ల్గొన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈఓడీబీ)లో భాగంగా ప్రణాళికలు నిర్దేశిం చుకోవటానికి ఈ సదస్సును ఆయన ఉపయోగించుకుంటున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...