Jump to content

AIIMS


sonykongara

Recommended Posts

  • Replies 203
  • Created
  • Last Reply

ఎయిమ్స్‌ నిర్మాణ ఆకృతి ఖరారు

2018-19 నుంచి కొన్ని కోర్సులు ప్రారంభించే అవకాశం

2 నెలల్లో నిర్మాణాలకు భూమి పూజ!

ఈనాడు, అమరావతి: ఎయిమ్స్‌ నిర్మాణానికి అమెరికా సంస్థ రూపొందించిన ఆకృతి (డిజైన్‌)ని కేంద్రం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. నిర్మాణాల్ని చేపట్టే సంస్థల ఎంపిక కోసం టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టింది. 1600 కోట్ల రూపాయలతో ఎయిమ్స్‌ నిర్మాణాల్ని కేంద్రం చేపట్టనుంది. మరో వంక..2018-19 విద్యా సంవత్సరంలోనే ఎంబీబీఎస్‌, నర్సింగ్‌ వైద్య కోర్సుల్లో ప్రవేశాలను మొదలుపెట్టే విషయమై కూడా సమాలోచనలు జరుపుతోంది. ఎంబీబీఎస్‌లో 50, నర్సింగ్‌ కోర్సులో 50 మంది చొప్పున తొలిఏడాది చేర్చుకోవాలని యోచిస్తోంది. తాత్కాలిక విధానంలో తరగతుల్ని ఎక్కడ చేపట్టాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. వైద్య కళాశాలల్లో తరగతులను నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని సంబంధిత వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ కోర్సులతోపాటు పారామెడికల్‌, ఇతర కోర్సులను నిర్వహించాలని భావిస్తోంది. రెండు నెలల్లో నిర్మాణాలకు సంబంధించిన భూమి పూజను జరిపే అవకాశాలున్నాయి. తొలిదశలో 950 పడకలతో రోగులకు వైద్యసేవల్ని అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైద్యులు, ఇతర ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా వసతి గృహాలను నిర్మించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ నిర్మాణాలకు ఏడాదిన్నర నుంచి రెండు సంవత్సరాల వరకు సమయం పడుతుందని భావిస్తున్నారు. నాగపూర్‌ (మహారాష్ట్ర), కల్యాణి (పశ్చిమ బెంగాల్‌) ఎయిమ్స్‌ నిర్మాణాల ఆకృతిని కేంద్రం ఖరారు చేయబోతున్నట్లు తెలియవచ్చింది. ఏపీతోపాటు ఇక్కడ కూడా ఎయిమ్స్‌ నిర్మాణాలను చేపట్టనున్నారు. ఈ మూడు నిర్మాణాలలో స్వల్ప మార్పులు మినహా మొత్తం ఒకేలా ఉండబోతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అవసరమైతే అంతర్జాతీయ స్థాయిలో ప్రకటనలు జారీచేసైనా ఎయిమ్స్‌ సంచాలకులను నియమించాలన్న దానిపైనా కేంద్ర వర్గాలు ఆలోచిస్తున్నాయి. ఈ నియామకానికి ముందు అవసరమైన కమిటీలను కేంద్రం ఏర్పాటు చేయనుంది.

Link to comment
Share on other sites

  • 1 month later...

ali ledu sulu ledu koduku peru somalingam ani, ee matram daaniki appude peru pettala? mundu compound wall complete cheyyandi saami

Delhi AIIMS ki emi peru pettaledhu... ikkada inko name petti konni rojula taruvata idhi AIIMS standard kadantaremo...

Link to comment
Share on other sites

Delhi AIIMS ki emi peru pettaledhu... ikkada inko name petti konni rojula taruvata idhi AIIMS standard kadantaremo...

 

peru pettina, chivarlo AIIMS ani tagilistaru emo le.

 

ayina ee vishayam lo mana valla ki intha athyutsaham enduko teliyatam la. BJP vallu kuda intha varaku public ga demand cheyya ledu.

 

National institutions ki name petta kudadu ani rule vunnatlundi (IITs, IIMs ...etc). mari idi aa category lo ki enduku raado?

Link to comment
Share on other sites

  • 1 month later...
15రోజుల్లో ప్రారంభం కానున్న మంగళగిరి ఎయిమ్స్‌ ఆసుపత్రి
 
 
636387254593954320.jpg
  •  నిర్మాణ పనులకు టెండర్లు ఖరారు
  •  మరో పక్షం రోజుల్లో ప్రారంభం కానున్న పనులు
  •  రెండు ప్యాకేజీలుగా రూ.600 కోట్ల వ్యయం
  •  వెల్లడించిన మంత్రి కామినేని శ్రీనివాస్‌
 
మంగళగిరి: ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణ పనులు మరో పక్షం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రూ.600 కోట్లకు పైగా వ్యయంతో రెండు ప్యాకేజీలుగా ఎయిమ్స్‌ నిర్మాణ పనులకు టెండర్లను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. రూ.300 కోట్ల వ్యయంతో ఓపీ విభాగంతోపాటు సిబ్బంది క్వార్టర్లు, మరో రూ.300 కోట్ల వ్యయంతో ఆసుపత్రి భవనాలు, వైద్య కళాశాల భవనాలను నిర్మించనున్నారు. ఈ రెండు కాంట్రాక్టులను రాష్ట్రానికే చెందిన సంస్థలే దక్కించుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే రూ.8.5 కోట్ల వ్యయంతో ప్రతిపాదిత ఎయిమ్స్‌ స్థలం 192 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఈ పనులు చివరి దశలో వున్నాయి. ఎయిమ్స్‌ స్థాపన కోసం 2015 డిసెంబరు 19న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఇరవై మాసాల అనంతరం టెండర్ల ప్రక్రియను పూర్తిచేసుకుని నిర్మాణ పనులకు కేంద్ర మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ శుక్రవారం తన మంగళగిరి పర్యటనలో ఎయిమ్స్‌ నిర్మాణ పనుల ప్రారంభాన్ని గురించి ప్రకటన చేశారు. ఒకేసారి అన్నీ కలిసొచ్చినట్టు అటవీ శాఖ భూములను సైతం డీరిజర్వు చేస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులను వెలువరించడం విశేషం. ఇదే సందర్భంలో ఎయిమ్స్‌ టెండరు ప్రక్రియ కూడా యాదృచ్ఛికంగా పూర్తయింది.
67 సంవత్సరాల క్రితం ఆరోగ్య సేవల నిమిత్తం ఎంపిక చేయబడిన స్థలం నేడు అత్యున్నత వైద్య సేవా కేంద్రంగా పరిఢవిల్లనుంది. అప్పట్లో పాలకులు యాదృచ్ఛికంగానో... లేక దూరాలోచనతోనే ఆహ్లాదకరమైన సువిశాల వాతావరణంతో కూడిన బ్రహ్మాండమైన స్థలాన్ని ఎంపిక చేసి టీబీ శానిటోరియంను ఏర్పాటు చేశారు. 1985లో శానిటోరియం స్థానే దేశంలోనే తొలిసారిగా వైద్య కళాశాలలకు ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ, చివరి క్షణంలో అది విజయవాడలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా తప్పిపోయింది. ఆ తరువాత ఈ స్థలంలో యూనివర్సిటీ జనరల్‌ ఆసుపత్రిని కొన్నాళ్లపాటు నిర్వహించినా... ఆనక 2005లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం సీరియస్‌గా నిర్ణయించింది. అప్పట్లో అది కాస్తా... జిల్లాల ప్రాతిపదిక ప్రాంతీయ భేదం పొడసూపడంతో కార్యరూపం దాల్చలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్‌, ఎన్‌ఐడీ వంటి సంస్థలను ఇదే స్థలంలో ఏర్పాటు చేసేందుకు భూకేటాయింపులు చేసి నిర్మాణాలు ప్రారంభించారు. అయినప్పటికీ ఈ స్థలానికి ఎయిమ్స్‌ రాసిపెట్టి ఉండటంతో ఆ కేటాయింపులు సైతం రద్దు చేయడం గమనార్హం. కానీ, చిట్టచివరకు ఏకంగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు నెలవుగా మారింది. అంటే... 67 ఏళ్ల నాటి స్థల ఎంపిక పరిణామం మంగళగిరిలో సుప్రసిద్ధ ఎయిమ్స్‌ ఆసుపత్రి ఏర్పాటుకు దారితీసింది.
రాష్ట్ర విభజన వరాలలో ఒకటిగా ప్రాప్తించిన ఎయిమ్స్‌కు 13 జిల్లాలలో ఇంతకంటే అనువైన పరిస్థితులతో కూడిన ప్రదేశం మరోటి లేదని... ఆ మాటకొస్తే యావత్‌ దేశంలో వున్న ఎయిమ్స్‌ ఆసుపత్రులలోకెల్లా మంగళగిరి ఎయిమ్సే అత్యుత్తమ ఎయిమ్స్‌గా అవతరిస్తుందని నాటి స్థల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ఏది ఏమైనా రూ.1680 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌ ఆసుపత్రితో మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. మంగళగిరికి ఓ వైపు రాజధాని నగరం ఆవిర్భవిస్తుండగా... మరోవైపు ఎయిమ్స్‌ ఆసుపత్రి... ఇంకోవైపు అయిదు వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో మంగళగిరికి మహావైభవం రానుంది.
Link to comment
Share on other sites

ఎయిమ్స్‌ టెండర్లు ఖరారు



  • 600కోట్లతో భవనాల నిర్మాణం: కామినేని

 

మంగళగిరి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎయిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి రెండు విభాగాలకు కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసిందని మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. మరో పది, పదిహేను రోజుల్లో ఈ పనులు ప్రారంభమవుతాయన్నారు. మంగళగిరి ఐటీ పార్కులోని ఏపీఎంఎ్‌సఐడీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. రూ.1680కోట్ల వ్యయంతో మంగళగిరి వద్ద చేపట్టనున్న ఈ ఆస్పత్రి పనులకు సంబంధించి ప్రహరీ నిర్మాణం పూర్తయిందన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
Central Government had started the construction of AIMS in Mangalagiri finally. The designs of the premier institute are finalized and the contract is awarded. The project is estimated to cost 1680 Crore and the first phase works will go on for 250 Crore. Currently, the compound wall works and the main entrance works are going on. The district administration is also constructing a 100 feet road connecting the building to the nearest National Highway to help the patients, doctors, HODs, and others to commute. On the other side, MBBS classes in AIIMS will begin from this year. 50 students will be admitted this year and the classes will go on in temporary buildings in Siddhartha Medical College, Vijayawada. Eight Temporary buildings will be constructed with 5 Crore.

 
Link to comment
Share on other sites

ఎయిమ్స్‌ నిర్మాణ పనులకు శ్రీకారం
 
 
636416657207511708.jpg
  • వేగంగా పనులు చేపడుతున్న కాంట్రాక్ట్‌ సంస్థ
  • రూ.272 కోట్లతో తొలిదశ పనులు
  • పూర్తి కావస్తున్న ప్రహరీ
  • భవన సముదాయాలకు ఫౌండేషన్లు
  • 18 నెలల్లో తొలిదశ పనులు ముగించాలని లక్ష్యం
  • ఆ వెంటనే రెండో దశ పనులు
మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆరంభ దశనుంచే కాంట్రాక్టు ఏజెన్సీ పనుల్లో వేగాన్ని పెంచేసింది. ప్రహరీ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. అవుట్‌ పేషెంట్‌ విభాగం నిర్మాణానికి పునాదులు తీస్తున్నారు. నివాసిత భవన సముదాయానికి ఫౌండేషన్‌ పనులు జరుగుతున్నాయి. రూ.1618 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎయిమ్స్‌ను రెండు దశలుగా నిర్మించనున్నారు. తొలిదశలో ఓపీడీ బ్లాకుతో పాటు దాదాపు అన్నీ నివాసిత భవనాలను నిర్మిస్తున్నారు.
 
 
మంగళగిరి: మంగళగిరిలో ఎయిమ్స్‌ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే 193 ఎకరాల చుట్టూ రూ.8.85 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రహరీ పనులు ముగుస్తున్న దశలో ప్రధానమైన ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించారు. రూ.1618 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎయిమ్స్‌ను రెండు దశలుగా నిర్మించనున్నారు. తొలిదశలో ఓపీడీ బ్లాకుతో పాటు దాదాపు అన్నీ నివాసిత భవనాలను నిర్మిస్తున్నారు. రెండోదశలో ఆసుపత్రికి సంబంధించిన నిర్మాణాలను పూర్తి చేస్తారు. తొలిదశ పనులను రూ.272 కోట్ల అవార్డు ఒప్పందంతో కేఎంవీ ప్రాజెక్టు సంస్థ రెండు వారాల కిందట క్షేత్రస్థాయిలో పనులను ఆరంభించింది. ప్రాంగణంలో తూర్పుదిశగా ఆసుపత్రి, వైద్య కళాశాల భవన సముదాయాలు రానుండగా పశ్చిమ దిశగా హాస్టళ్లు, ఇతర సిబ్బంది భవనాలను నిర్మిస్తున్నారు. 18 మాసాల్లో తొలిదశ నిర్మాణ పనులను ముగిస్తారు. మరికొద్ది రోజుల్లోనే రెండోదశ పనులు కూడ ప్రారంభం కానున్నాయి.
 
ఆరంభం నుంచే వేగం..
ఆరంభ దశనుంచే కాంట్రాక్టు ఏజెన్సీ సంస్థ పనుల్లో వేగాన్ని పెంచేసింది. సరిగ్గా పక్షం రోజుల కిందటే కాంట్రాక్టు సంస్థ ఎయిమ్స్‌ పనులను చడీచప్పుడు లేకుండా ప్రారంభించింది. తొలిదశ కింద రూ.300 కోట్లకు పైగా వ్యయంతో అవుట్‌ పేషెంట్‌ బ్లాకుతో పాటు మరికొన్ని నివాసిత భవనాలను నిర్మించాలని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ నిర్ణయించింది. ఈ కాంట్రాక్టును కేఎంవీ ప్రాజెక్టు సంస్థ గ్లోబల్‌ టెండర్ల విధానంలో రూ.272 కోట్లకుగాను చేజిక్కించుకుంది. నిర్మాణ పనుల ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీ హెచ్‌ఎస్‌సీసీతో అవార్డు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 18 మాసాల కాల వ్యవధిలో పనులను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాన్న సంకల్పంతో కాంట్రాక్టు ఏజెన్సీ క్షేత్రస్థాయిలో జెట్‌స్పీడుతో పనులను చేపట్టింది.
 
కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్‌ఎస్‌వై నాల్గవ దశకింద దేశంలో మంగళగిరితో పాటు నాగపూర్‌ (మహారాష్ట్ర), కల్యాణి (పశ్చిమబెంగాల్‌) పట్టణాలకు ఎయిమ్స్‌ ఆసుపత్రులను మంజూరుచేసింది. మంగళగిరిలో కొండల నడుమవున్న టీబీ శానిటోరియంకు చెందిన 193 ఎకరాల్లో దీనిని నిర్మించాలని నిర్ణయించారు. 2015 డిసెంబరు 19న కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి జగత్‌ ప్రకాష్‌నడ్డా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. ఎయిమ్స్‌ నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను కేంద్రం హెచ్‌ఎస్‌సీసీకి అప్పగించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మంగళగిరి ఎయిమ్స్‌కు ఎంపిక చేసిన స్థలానికి పలు ప్రత్యేకతలు వున్నాయి. కొండల నడుమ ఆహ్లాదకరమైన పచ్చటి వాతావరణంతో పాటు హైవేల మధ్య, రెండు వేర్వేరు రైలుమార్గాల మధ్య ఈ ప్రాంతం వుంది.
 
మంగళగిరి ఎయిమ్స్‌కు కేటాయించిన 190 ఎకరాల చుట్టూ రూ.8.85 కోట్ల వ్యయంతో 4560 మీటర్ల పొడవునా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఈ కాంట్రాక్టును కూడా కేఎంవీ ప్రాజెక్టు లిమిటెడ్‌ ముందుగానే దక్కించుకోవడం విశేషం. ప్రహరీ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఎయిమ్స్‌కు సంబంధించి హాస్పిటాలిటీకి చెందిన భవనాలన్నింటిని తూర్పు దిక్కు, ఇతరత్రా హాస్టల్స్‌, సిబ్బంది క్వార్టర్స్‌, అతిధిగృహా భవన సముదాయాలన్నింటిని పశ్చిమ ప్రాంగణంలోనూ నిర్మించనున్నారు. అంటే ఆసుపత్రి భవనాలన్నీ కొత్త హైవేకు దగ్గరగాను, నివాసిత భవన సముదాయాలన్నీ పాత హైవేకు దగ్గరగాను వుండబోతున్నాయి.
 
నిర్మాణం కోసం కేటాయించిన రూ.1618 కోట్లలో సుమారు రూ.వెయ్యి వేయి కోట్లను భవన నిర్మాణాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కోసం వెచ్చిస్తారు. మిగతా రూ.600 కోట్లను వైద్య పరికరాలు, ఫర్నిచర్‌ కోసం వినియోగించన్నుట్టు సమాచారం. తొలిదశ
భవన నిర్మాణాల కింద ప్రధానమైన అవుట్‌ పేషెంట్‌ డిపార్టుమెంట్‌ బ్లాకుతో పాటు నివాసిత భవనాల రూపంలో మరో 16 భవనాలను నిర్మించనున్నారు. ఓ పక్క వీటి నిర్మాణాలు జరుగుతుండగనే రెండోదశ నిర్మాణ పనులను కూడ త్వరలోనే ప్రారంభిస్తారు. ఈ రెండో దశలో ఆసుపత్రికి సంబంధించిన నిర్మాణాలే ఎక్కువగా వున్నాయి.
 
జోరుగా నిర్మాణ పనులు
ప్రస్తుతం ఎయిమ్స్‌ అవరణలో తొలిదశ నిర్మాణ పనులు బాగా జోరుగా సాగుతున్నాయి. ఛత్తీస్‌గడ్‌ నుంచి వందలాది మంది కూలీలను రప్పించారు. వీరందరికీ పాత శానిటోరియం తాలూకు శిథిల భవనాలలో వసతి ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో ఓ వైపు జంగిల్‌ క్లియరెన్స్‌ చేస్తూ మరో పక్క ఓపీడీ బ్లాకుకు పునాదులు తీస్తున్నారు. 2.1 మీటర్ల లోతులో పునాదులను తీస్తున్నారు. మరోపక్క రెండు హాస్టల్‌ భవనాలకు పునాదులు తీయడంతో పాటు కాంక్రీటు ఐరన్‌ బెడ్‌ వేసే పనులను కూడ చేపట్టారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...