Jump to content

AIIMS


sonykongara

Recommended Posts

  • Replies 203
  • Created
  • Last Reply
  • 3 weeks later...
  • 1 month later...
  • 3 weeks later...
  • 1 month later...
  • 3 weeks later...
శరవేగంగా... ఎయిమ్స్‌
03-01-2019 10:50:41
 
636821094417543331.jpg
  • త్వరలో ప్రారంభానికి కేంద్రం సన్నాహాలు
  • ఓపీడీతోపాటు నాలుగు భవనాలు అప్పగించాలని ఆదేశాలు
  • 2020 మార్చి నాటికి పూర్తిస్థాయిలో ఆవిష్కృతం
 
మంగళగిరిలో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ఎయిమ్స్‌ ఆసుపత్రిని ఈ నెలలో ప్రారంభించేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రూ.1618 కోట్ల వ్యయంతో 183 ఎకరాల విస్తీర్ణంలో ఎయిమ్స్‌ ఆసుపత్రిని రెండు దశలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తొలిదశ కింద ఓపీడీ బ్లాకుతోపాటు సిబ్బంది నివాసిత, వైద్య విద్యార్థుల వసతిగృహ భవన సముదాయాలను రూ.272.54 కోట్ల వ్యయంతో కేఎంవీ ప్రాజెక్ట్సు లిమిటెడ్‌ సంస్థ నిర్మిస్తుండగా... రెండవ దశ కింద రూ.601 కోట్ల ఒప్పంద కాంట్రాక్టుపై హాస్పిటాలిటీకి చెందిన అన్నీ భవన సముదాయాలను ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్మిస్తుంది. మొత్తంగా 2020 మార్చి నాటికి మంగళగిరిలో ఎయిమ్స్‌ పూర్తిస్థాయిలో ఆవిష్కృతం కానుంది.
 
మంగళగిరి: సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో ఎయిమ్స్‌ను ప్రారంభించి వైద్యసేవలను ఎలాగైనా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం పట్టుదలతో ఉంది. తొలిదశ పనులు పూర్తయ్యేందుకు ఈ ఏడాది మార్చి 13వరకు గడువున్నప్పటికీ, ఈ నెలలోనే ఎయిమ్స్‌ను ప్రారంభించనున్నామంటూ నిర్మాణసంస్థలకు కేంద్రం స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. ఎయిమ్స్‌లో అతి ప్రధానమైన ఓపీడీ బ్లాకును జీ+5 భవన సముదాయంగా రూ.100 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తుండగా, దానిలో కనీసం తొలి రెండు అంతస్తులతో పాటు మరో నాలుగు భవనాలను జనవరి మొదటి వారానికల్లా పూర్తిచేసి అప్పగించాలని నిర్మాణ ఏజెన్సీలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఆయా పనులను శరవే గంగా పూర్తి చేస్తున్నారు.
 
wref.jpgమంగళగిరిలో నిర్మించనున్న ఎయి మ్స్‌ కోసం మొత్తం రూ. 1618 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇందులో రూ.1090 కోట్లను నిర్మాణ పనులకుగాను, రూ.528 కోట్లను ఆసుపత్రి నిర్వహణ సామగ్రి కోసం ఖర్చుచేస్తారు. మంగళగిరి ఎయిమ్స్‌ నిర్మాణ పనులకు పర్యవేక్షణ ఏజెన్సీగా నోయిడాకు చెందిన హెచ్‌ఎస్‌సీసి (ఇండియా) లిమిటెడ్‌ను కేంద్రం నియమించింది. ఈ సంస్థ పర్యవేక్షణలో నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. నాణ్యమైన వై ద్యవిద్య, వైద్యరంగంలో అధునాతన పరిశోధనలు, సంపూర్ణ ఆరోగ్యరక్షణ ప్రధాన ధ్యేయాలుగా ఎయిమ్స్‌ ఆవిష్కృతమవుతోంది.
 
hawrw.jpgతొలిదశ ప్యాకేజీ కింద మొత్తం 24 భవనాలను నిర్మిస్తున్నారు. వీటిలో అయిదు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, మరో మూడు నీటి ట్యాంకులు కాగా, మిగతా 16 బహుళ అంతస్తుల భవనాలుగా వున్నాయి. ఈ భవనాలకు సంబంధించి కాంక్రీట్‌ పనులు 75 శాతం పైగా పూర్తయ్యాయి. రెండవ దశ కింద ఓ పది వరకు ముఖ్య భవనాలు వుండగా, మరో 15 వరకు చిన్న తరహా భవన నిర్మాణాలున్నాయి. ఈ రెండవ దశ పనులు ప్రస్తుతానికి 15శాతం వరకు పూర్తయ్యాయి.
 
రెండవ దశలో కీలకమైన హస్పిటాలిటీ విభాగాలతో పాటు వైద్య, నర్సింగ్‌ కళాశాలలు, ల్యాబ్‌లను నిర్మిస్తున్నారు. జీ+6 భవన సముదాయంగా నిర్మిస్తున్న హాస్పిటల్‌ బ్లాకు ఎయిమ్స్‌ నిర్మాణాల్లోనే అతి పెద్దది...అతి కీలకమైంది. దీనిలో 960 సాధారణ పడకలతో పాటు ఐసీయూ (86 పడకలు), అత్యవసర విభాగం (యాభై పడకలు), 15 రకాల సూపర్‌ స్ఫెషాలిటీ విభాగాలు, మరో పది రకాల సాధారణ విభాగాలు వుంటాయి. జీ+1 భవన సముదాయంగా నిర్మిస్తున్న ఆయుష్‌ విభాగంలో 30 పడకలు వుంటాయి. ఇవిగాక ఏటా వంద సీట్లతో కూడిన వైద్య కళాశాల, ఏటా 60 సీట్లతో కూడిన నర్సింగ్‌ కళాశాల, కార్యనిర్వహాక బ్లాకు, ఆడిటోరియం, నైట్‌ షెల్టర్‌, హాస్టళ్లు తదితర భవన సముదాయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.
 
యుద్ధప్రాతిపదికన వసతులు
arwrf.jpgఎయిమ్స్‌కు అవసరమైన విద్యుత్‌, తాగునీరు, ప్రధాన రహదార్లను రాష్ట్రప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయిస్తోంది. కృష్ణానది నుంచి రూ.15 కోట్ల వ్యయంతో ప్రత్యేక తాగునీటి పథకాన్ని, రూ.35 కోట్ల వ్యయంతో 132/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్షేషన్‌ను, హైవే నుంచి తూర్పుముఖంగా ఎయిమ్స్‌లోకి ప్రవేశించేందుకు రూ.10 కోట్ల వ్యయంతో 100 అడుగుల రహదారిని నిర్మిస్తోంది. వీటిలో కృష్ణా జలాల పథకం మినహా మిగతా రెండు పనులు ఈ నెల మాసాంతంలోగా పూర్తి చేయనున్నారు. రెండు దశలుగా సాగుతున్న ఎయిమ్స్‌ నిర్మాణ పనుల్లో 2500 మంది కార్మికులు, 350 మందికి పైగా సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తున్నారు. నిర్మాణ పనుల్లో ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్తలను పకడ్బందీగా చేపడుతున్నారు.
Link to comment
Share on other sites

ఎయిమ్స్‌లో ఓపీ సేవలు

 

మార్చి నుంచి మొదలు
వైద్యుల నియామకాలకు ఇంటర్వ్యూలు పూర్తి

6ap-state1a_2.jpg

ఈనాడు, అమరావతి: కల నెరవేరుతోంది. రాజధాని అమరావతి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు త్వరలో అత్యున్నతస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో ఓపీ సేవలు మార్చి తొలి వారంలో ప్రారంభం కాబోతున్నాయి. ఒకే భవనంలో 12 విభాగాల్లో ఈ సేవలు అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణుల నియామకాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు వేగంగా పూర్తయి, పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరి చివరి వారంలోనే ఓపీ సేవలు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రతి రోజూ 400 నుంచి 500 మంది వరకు ఓపీ సేవలకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సేవలకు  నామమాత్రంగా రూ.10 ఫీజు తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు. 2020 ఆగస్టుకు ఎయిమ్స్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి కృషి చేస్తున్నారు.

తక్కువ ధరలకు పరీక్షలు, ఔషధాలు
ఓపీ రోగులకు రక్త పరీక్షలు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌, ఇతర పరీక్షలు చేసేందుకు పరికరాలను సమకూరుస్తున్నారు. పరీక్షలు, ఔషధాలు.. బయటి మార్కెట్‌తో పోలిస్తే 50 శాతం తక్కువ ధరకు లభించనున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో సీటీ స్కాన్‌ రుసుము రూ.3-5 వేల వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ‘సీజీహెచ్‌ఎస్‌’ ప్రకారం ఎయిమ్స్‌లో సీటీ స్కాన్‌కు రూ.1600 తీసుకునే అవకాశం ఉంది. రోగుల కోసం 50 చేతి కుర్చీలు, 15 స్ట్రెచర్లు, 18 పల్స్‌ ఆక్సిమీటర్లు, అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగుల కోసం 15 ‘ఎమర్జెన్సీ రిక్వైర్‌మెంట్‌ ట్రాలీ’లను అందుబాటులోకి తెస్తున్నారు.

వైద్యులకు తెలుగు భాషపై శిక్షణ
కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అనుసరించి పీజీ అర్హత వైద్యుల నియామకాలకు పుదుచ్చేరి జిప్‌మర్‌ ఆధ్వర్యంలో ఇటీవలే ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తయింది. త్వరలో ఫలితాలు వెల్లడించనున్నారు. పలు రాష్ట్రాల నుంచి వైద్యులు వస్తుండడంతో.. వారికి తెలుగు భాషపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రోగులు తెలుగులో చెప్పేది అర్థం చేసుకోవడం, వారికి తెలుగులో వివరించడానికి వీలుగా ఈ శిక్షణ ఉంటుంది.

6ap-state1b_2.jpg

తక్కువ ఖర్చుతో విలువైన సేవలు
తక్కువ ఖర్చుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విలువైన వైద్య సేవలు తీసుకురావడం ఎయిమ్స్‌ ప్రధాన ఉద్దేశం. వైద్య పరీక్షలతో పాటు ఔషధాలను 50 నుంచి 60 శాతం తక్కువ ధరకు అందిస్తాం. ఆస్పత్రి బయట కూడా ఔషధ దుకాణాన్ని ఏర్పాటు చేస్తాం. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ‘అమ్రిత్‌’ (అఫర్డ్‌బుల్‌ మెడిసిన్స్‌ అండ్‌ రిలైబుల్‌ ఇంప్లాంట్స్‌ ఫర్‌ ట్రీట్‌మెంట్‌) ద్వారా బ్రాండెడ్‌ మందుల విక్రయాలు జరుగుతాయి.

- శ్రమదీప్‌ సిన్హా, ఎయిమ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఎయిమ్స్‌లో త్వరలో అవుట్‌ పేషెంట్‌ సేవలు

 

అధ్యక్షుడు టి.ఎస్‌.రవికుమార్‌ వెల్లడి

28ap-state2a_3.jpg

ఈనాడు, అమరావతి: మంగళగిరి ఎయిమ్స్‌లో అవుట్‌ పేషెంట్‌ విభాగం సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందించేలా.. అవుట్‌ పేషెంట్‌ విభాగాన్ని రెండు మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని మంగళగిరి ఎయిమ్స్‌ అధ్యక్షుడు డాక్టర్‌ టి.ఎస్‌.రవికుమార్‌, డైరెక్టర్‌ ముకేష్‌ త్రిపాఠి సోమవారం వెల్లడించారు. 44 మంది వైద్య నిపుణులు ఇక్కడ అందుబాటులో ఉండి సేవలందిస్తారని చెప్పారు. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో వీరు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2020 నాటికి ఎయిమ్స్‌ ప్రాంగణం పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని రవికుమార్‌ తెలిపారు. మంగళగిరితో పాటు మంజూరైన నాగ్‌పుర్‌ ఎయిమ్స్‌ కంటే ఇక్కడ పనులు త్వరితగతిన జరుగుతున్నాయని వెల్లడించారు. రెండేళ్లలో ఎయిమ్స్‌ ప్రాంగణంలో 12 వైద్య విభాగాల ద్వారా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తామని తెలిపారు. వీటిద్వారా అత్యాధునిక వైద్యసేవలు నామమాత్రపు ధరకే ప్రజలకు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకూ ఎయిమ్స్‌ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు రవికుమార్‌ తెలిపారు.

 

Link to comment
Share on other sites

  • 1 month later...
నేటి నుంచి ఎయిమ్స్‌లో.. వైద్య సేవలు
12-03-2019 08:24:33
 
636879758742272470.jpg
  • ఓపీ సేవలు ప్రారంభించనున్న అధికారులు
  • రోగులకు అందుబాటులో వైద్యులు
మంగళగిరి టౌన్‌, మార్చి 11: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎయిమ్స్‌ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఓపీ సేవల విభాగాన్ని ఈ నెల 12వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ ఆధీనంలోని ప్రధానమంత్రి స్వస్త్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) నాల్గవ దశ కింద దేశంలో మంగళగిరితోపాటు నాగపూర్‌ (మహారాష్ట్ర), కల్యాణి (పశ్చిమ బెంగాల్‌) పట్టణాలకు ఎయిమ్స్‌ ఆసుపత్రులను మంజూరు చేసింది. మంగళగిరిలో పచ్చని కొండల నడుమ సువిశాలంగా వున్న టీబీ శానిటోరియంకు చెందిన 183 ఎకరాల స్థలంలో ఎయిమ్స్‌ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడ ఎయిమ్స్‌ ఆసుపత్రికి 2015, డిసెంబరు 19వ తేదీన కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనుల పర్యవేక్షణా బాధ్యతలను కేంద్రం హెచ్‌ఎస్‌సీసీకి అప్పగించింది. ఆరోగ్య సంరక్షణలో ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి, వైద్య విద్య, పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,680 కోట్ల అంచనా వ్యయం తో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం 183ఎకరాల భూమిని కేటాయించి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుంది.
 
సుమారు రూ.50కోట్ల వ్యయంతో ఎయిమ్స్‌కు కావలసిన రహదార్లు, విద్యుత్‌, తాగునీటి వంటి మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయిస్తోంది. ఎయిమ్స్‌ నిర్మాణ పనులకు సంబంధించి తొలిదశగా రూ.300 కోట్ల వ్యయంతో రూపొందించిన ప్యాకేజీ పనులను కేఎంవీ సంస్థ చేపట్టింది. శంకుస్థాపన చేసిన ఇరవై మాసాల తరువాతే నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ.. పనుల్లో వేగం పెంచి తొలిదశ నిర్మాణ పనులను దాదాపు పూర్తిచేసింది. తొలిదశలో ఓపీడీ బ్లాకుతోపాటు నివాసిత భవనాలను నిర్మిస్తున్నారు. ఎయిమ్స్‌ తూర్పు దిశగా ఆసుపత్రి, వైద్య కళాశాల భవన సముదాయాలు రానుండగా.. పశ్చిమ దిశగా హాస్టళ్లు, ఇతర సిబ్బంది భవనాలను నిర్మిస్తున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ అధ్యక్షులు డాక్టర్‌ టీఎస్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఓపీ విభాగం ప్రారంభం కానుంది. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, పీడియాట్రిక్స్‌, ఆప్తమాలజీ, కమ్యూనిటీ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్‌, ఈఎన్‌టీ, ప్రసూతి, గైనకాలజీ, రేడియాలజీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్‌, సైకియాట్రీ, దంత వైద్యులు సోమవారం నుంచి శనివా రం వరకు రోగులకు అందుబాటులో వుంటారు. ప్రస్తుతం ఓపీడీ భవనం అన్ని హంగులతో రూపుదిద్దుకున్న ధర్మశాల భవనంలో ఏర్పాటు చేశారు. మంగళగిరి పట్టణం వైపు నుంచి ఎయిమ్స్‌ ప్రాంగణంలోకి ప్రవేశించే అవకాశం కల్పించారు. ఓపీడీ విభాగం వరకు రోగులు తమ సొంత వాహనాల్లో చేరుకోవచ్చు. మొత్తానికి ఎయిమ్స్‌లో వైద్య సేవలను సార్వత్రిక ఎన్నికలలోపు ప్రారంభించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోరిక ఓపీ విభాగం ప్రారంభోత్సవంతో నెరవేరనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులు, జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు హాజరవుతారని ఎయిమ్స్‌ పరిపాలనా విభాగం ఉప సంచాలకులు సందీప్‌ సిన్హా తెలిపారు.
Link to comment
Share on other sites

మంగళగిరి ఎయిమ్స్‌లో ఓపీ సేవలకు సై

 

త్వరలో వైద్యుల  నియామకానికి నోటిఫికేషన్‌
డైరెక్టర్‌ డా.ముకేష్‌ త్రిపాఠి వెల్లడి

12ap-state1a_2.jpg

ఈనాడు డిజిటల్‌, గుంటూరు: ‘రోగులకు మెరుగైన, స్నేహపూర్వక వైద్యసేవలను అందిస్తాం. అందరికీ ఆరోగ్యం ద్వారా హ్యాపీ కమ్యూనిటీగా తీర్చిదిద్దేందుకు మంగళగిరి ఎయిమ్స్‌ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) కృషి చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు డా.టీఎస్‌.రవికుమార్‌ పేర్కొన్నారు. ఎయిమ్స్‌లో మంగళవారం నుంచి అవుట్‌ పేషెంట్‌(ఓపీ) వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డా.రవికుమార్‌ మాట్లాడుతూ.. శాశ్వత ఓపీ విభాగం భవనం ఆరు నెలల్లో పూర్తవుతుందన్నారు. రోజూ ఆయా విభాగాల్లో ఎంత మంది రోగులను పరీక్షించారని కాకుండా, వారి అనారోగ్య సమస్యను ఎంత వరకు తగ్గించామో పరిశీలిస్తామని పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డా.ముకేష్‌ త్రిపాఠి మాట్లాడుతూ.. ఎయిమ్స్‌ను నిర్ణీత గడువులో పూర్తిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యుల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఓపీ విభాగం సేవలు మాత్రమే అందుబాటులోకి తెచ్చామని, అత్యవసర వైద్య సేవలు ఇంకా తీసుకురాలేదని స్పష్టం చేశారు. తొలుత మంగళగిరి ఎయిమ్స్‌ అధ్యక్షుడు డా.రవికుమార్‌, డైరెక్టర్‌ డా.ముకేష్‌ త్రిపాఠి, డిప్యూటీ డైరెక్టర్‌ డా.శ్రమ్‌దీప్‌ సిన్హా, వైద్యులు ఓపీ సేవలను ప్రారంభించి వివిధ విభాగాలను పరిశీలించారు.

12ap-state1b_1.jpg

ఓపీ సేవలు పొందాలంటే: మంగళగిరి నుంచి నవులూరు దాటాక ఎయిమ్స్‌ ఉంది. ప్రస్తుతం రూ.10 ఫీజుతో ఇక్కడ ఓపీ సేవలందిస్తున్నారు. ఎలాంటి గుర్తింపు కార్డులు తీసుకెళ్లాల్సిన పనిలేదు. ఉదయం 8.30 నుంచి మ.12గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. ఉ.9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైద్యులు పరీక్షిస్తారు. ఫోన్‌ నెంబరు ఇవ్వడం ద్వారా రోగి తాలూకు వివరాలన్నీ అందులో నిక్షిప్తం అవుతాయి. సామాజిక కుటుంబ వైద్యం, చిన్న పిల్లలు, ఎముకలు, కీళ్ల చికిత్స, శస్త్రచికిత్స, జనరల్‌ మెడిసిన్‌, గర్భిణులు, గైనకాలజీ, మానసిక వైద్యం, ఈఎన్‌టీ, కంటి, చర్మ, పంటి వైద్యం తదితర 12 విభాగాల్లో ఓపీ విభాగం సేవలు అందిస్తున్నారు.

 

Link to comment
Share on other sites

పేదలకు ఆధునిక వైద్యం
 

ఎయిమ్స్‌ అవుట్‌ పేషెంట్‌ విభాగం ప్రారంభం
తక్కువ రుసుంతో సేవలు
ఈనాడు డిజిటల్‌, గుంటూరు

amr-gen2a_91.jpg

నవ్యాంధ్ర రాజధానిలో మరో మణిపూస చేరింది. అత్యాధునిక హంగులతో పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించేందుకు ఎయిమ్స్‌ సిద్ధమైంది. నామమాత్రపు రుసుముతోనే నిష్ణాతులైన వైద్యులు వైద్యాన్ని అందిస్తారు. మంగళగిరి నుంచి అతి కొద్ది దూరంలోనే నిర్మితమైన ఎయిమ్స్‌లో అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) సేవలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ధర్మశాలగా పేరుపెట్టిన తాత్కాలిక భవనంలో ఈ ఓపీ సేవలు అందిస్తున్నారు. దాదాపు రూ.275 కోట్లతో ఆయా విభాగాల పరికరాలను కొనుగోలు చేసినట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ముకేష్‌ త్రిపాఠి వెల్లడించారు. మరో ఆర్నెల్లలో శాశ్వత భవనంలోనికి ఓపీˆ సేవలు, ఇన్‌పేషెంట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

రూ.10 రిజిస్ట్రేషన్‌
అవుట్‌ పేషెంట్‌ విభాగానికి వచ్చే రోగులు తొలుత ధర్మశాల భవనంలోకి వెళ్లగానే ఎడమవైపు టోకెన్‌ కౌంటరులో వారి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.10 రుసుం చెల్లించి,  పేరు, ఊరు తదితర వివరాలు అందిస్తే ఒక టోకెన్‌ ఇస్తారు. దాన్ని తీసుకుని రిజిస్ట్రేషన్‌ డెస్క్‌లో సంప్రదించాలి. టోకెన్‌ నంబరు వచ్చిన తరవాత అక్కడి సిబ్బందికి మీరు తమ అనారోగ్య సమస్యలను తెలియజేయాలి. అన్ని వివరాలు నమోదు చేసుకున్న తరవాత రోగి పేరిట అవుట్‌ పేషెంట్‌ కార్డు తయారవుతుంది. అందులో రోగి సంప్రదించాల్సిన విభాగాన్ని పేర్కొంటారు. ఏడాది వరకు ఈ కార్డు పని చేయనుంది. సంబంధిత విభాగానికి వెళ్లిన తరవాత అక్కడ నర్సు రోగి కార్డును పరిశీలించి రక్తపోటు, మధుమేహం, తదితర అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్షల నివేదక వచ్చిన తరవాత వైద్యుని వద్దకు పంపిస్తారు. వైద్యుడు రోగిని, ఆయన వైద్య పరీక్షల నివేదికను పరిశీలించిన అనంతరం ఆన్‌లైన్‌లో రోగి రికార్డు ఓపెన్‌ చేసి అందులో మందులు, అందించాల్సిన చికిత్స వివరాలు నమోదు చేస్తారు. పూర్తయిన తరవాత దాని ప్రతిని రోగికి అందిస్తారు. అక్కడే ఉన్న అమృత్‌ ఔషధ దుకాణంలో మందులు కొనుగోలు చేయవచ్చు. అక్కడ 15 నుంచి 70శాతం వరకు ఆయా మందులపై రాయితీ ఇస్తారు.

ఓపీˆ సేవలు మాత్రమే...
ప్రస్తుతం ఇక్కడ ఓపీˆ సేవలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర సేవలు ఇంకా ప్రారంభించలేదు. ఓపీˆకి వచ్చిన వారిలో ఎవరైనా అత్యవసర వైద్యం అందించాల్సి వస్తే ఇతర ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తారు. జీ ప్లస్‌ 1 భవనంలో మొత్తం 12 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. కమ్యూనిటీ, ఫ్యామిలీ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, ఈసీజీ, జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ తదితర సేవలు అందిస్తున్నారు. క్యాంటిన్‌ అందుబాటులో ఉంది.

మొబైల్‌ నంబరే ఆధారం
ఎయిమ్స్‌లో ఓపీ చూపించుకోవడానికి వచ్చే రోగులెవ్వరూ గుర్తింపు పత్రాలేమీ తీసుకురావక్కర్లేదు. రిజిస్ట్రేషన్‌ సమయంలో చరవాణి నంబరు విధిగా ఇవ్వాల్సి ఉంటుంది. మరోసారి సంప్రదించే సమయంలో ఓపీˆ చీటీ మర్చిపోతే మొబైల్‌ నెంబరు ద్వారా రోగి సమగ్ర వివరాలు తెలుస్తాయి. దాన్ని తీసుకుని రోగులు వైద్యుడ్ని సంప్రదించవచ్చు.

amr-gen2b_3.jpg

పలు రాష్ట్రాల నుంచి  వైద్యులు
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్యులు ఇక్కడ రోగులను పరీక్షిస్తారు. భాష సమస్య ఉన్నందున కొన్ని రోజులుగా వైద్యులకు, సిబ్బందికి తెలుగు భాష శిక్షణ తరగతులను చెబుతున్నారు. దీంతో ఇక్కడికి వచ్చే వారితో సులువుగా మాట్లాడవచ్చు. ఏ సమస్యతో వచ్చారో తెలుసుకోవచ్చు. తదనుగుణంగా చికిత్స అందించవచ్చు.
ఇలా వెళ్లాలి.. మంగళగిరి నుంచి నవులూరు వెళ్లేదారిలో ఎయిమ్స్‌ ఉంది. నవులూరు దాటిన తరవాత కుడివైపున ములుపు తీసుకోవాలి. అక్కడ నుంచి నేరుగా ఓపీˆడీ సేవలు బోర్డు ఉంటుంది. దాదాపు 500 మీటర్లు లోపలికి వెళ్లిన తరవాత భవనం కనిపిస్తుంది.
*ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం
*12 గంటల వరకు రిజిస్ట్రేషన్‌
*ఉదయం 9 నుంచి మధ్యాహ్నం
*1 గంట వరకు వైద్యుల పరీక్ష

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...