Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

మాపై నమ్మకంతోనే పరిశ్రమలు

 

కేంద్రం రాయితీలిస్తే  మరిన్ని వచ్చేవి
12 పారిశ్రామిక విధానాలు తెచ్చాం
కనిగిరి నిమ్జ్‌ చేపడతాం
రామాయపట్నానికి అనుసంధానిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
పరిశ్రమలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల
ఈనాడు - అమరావతి

31main5a.jpg

ప్రభుత్వ విధానాలు.. నిరంతర పర్యవేక్షణ.. విశ్వసనీయత కారణంగానే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చాలా మంది పోటీపడినా.. మనపై ఉన్న విశ్వసనీయత కారణంగానే కియా మోటార్స్‌, ఇసుజు, జియో, అశోక్‌లేలాండ్‌, అపోలో టైర్స్‌ తదితర సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. వెనకబడిన రాష్ట్రాలకు ఇచ్చే రాయితీలు మనకూ ఇచ్చి ఉంటే మరింత మంది పారిశ్రామికవేత్తలు వచ్చేవారని వివరించారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదికలో ‘పరిశ్రమలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి’పై రూపొందించిన శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. సేవలు, పారిశ్రామికం, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. ‘నాలుగున్నరేళ్లు రాత్రింబవళ్లు పనిచేశాం. ప్రపంచమంతా తిరిగాం. అధికారులు నిరంతరం శ్రమించారు. వ్యక్తిగతంగా నాపై ఉన్న విశ్వసనీయత కూడా ఇందుకు ఉపయోగపడింది’ అని చంద్రబాబు చెప్పారు. నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని.. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో రూపాయి అవినీతి లేకుండా అన్ని అనుమతులు ఇప్పించే విధానం తెచ్చామని అన్నారు. 12 పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టామన్నారు. విశాఖ ఐటీ కారిడార్‌ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కేంద్రంపై సీఎం మండిపడ్డారు. దుగరాజపట్నం నౌకాశ్రయం, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవకు నిధులు మంజూరులోనూ కేంద్రం అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. పెట్రో కెమికల్‌ కారిడార్‌ విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తోందని.. దీన్ని తామే ఏర్పాటు చేయించబోతున్నట్లు వివరించారు. నిమ్జ్‌ల(జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి) ప్రకటన తప్పితే కేంద్రం పైసా విదల్చలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరి నిమ్జ్‌ తామే చేపట్టి రామాయపట్నానికి అనుసంధానించబోతున్నట్లు వెల్లడించారు.

31main5b.jpg

ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) స్థాపనకు ప్రత్యేక విధానం తీసుకురాబోతున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రభుత్వమే షెడ్లు నిర్మించడంతో పాటు మార్కెటింగ్‌, ఆర్‌అండ్‌డీ విషయంలోనూ సహకారం అందిస్తామన్నారు.
ఇంటికో పారిశ్రామికవేత్త.. కుటుంబానికో స్మార్ట్‌ఫోన్‌: కుటుంబానికో స్మార్ట్‌ఫోన్‌.. ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా 15 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటింటికి అంతర్జాలం అందించబోతున్నామని సీఎం వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా 300 పైగా పరికరాలు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేసి ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు. ఖాయిలా పరిశ్రమలు పునరుద్ధరించే దిశగా రూ.100 కోట్లు నిధులు కేటాయించామని తెలిపారు. చక్కెర పరిశ్రమలకు చేయూత అందిస్తున్నామన్నారు.

మేజర్‌ పోర్టుల స్థాయిలో..: మేజర్‌ పోర్టుల స్థాయిలోనే రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం ఏర్పాటవుతాయన్నారు. కర్నూలు విమానాశ్రయంలో సోమవారం ట్రయల్‌్ రన్‌ విజయవంతమైందన్నారు. పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ తేదీలను సీఎం ప్రకటించారు.

 

 
Link to comment
Share on other sites

  • Replies 1.1k
  • Created
  • Last Reply
తిరుక్షేత్రంలో పారిశ్రామిక కళ 

 

తిరుపతికి వరుస కడుతున్న అంతర్జాతీయ సంస్థలు 
కలిసొచ్చిన భౌగోళిక అనుకూలతలు 
ఎలక్ట్రానిక్‌, హార్డ్‌వేర్‌ రంగాల్లో అపూర్వ ప్రగతి 
యువతకు పెద్ద ఎత్తున లభిస్తున్న ఉపాధి 
ఫలిస్తున్న రాష్ట్ర  ప్రభుత్వ కృషి

14ap-main5a_3.jpg

ఎటుచూసినా కొండలు, బండలతో నిండి పచ్చదనం కరవైన ప్రాంతం. నీటి జాడ లేని, సారవిహీనమైన బీడు భూములతో కూడిన ప్రాంతం. ప్రతి ఏటా ముఖం చాటేసే వర్షపాతం, సాగునీటి సౌకర్యం కానరాని ప్రాంతం. అదే చిత్తూరు జిల్లాలో తూర్పు దిశలోని తిరుపతి-శ్రీకాళహస్తి మధ్య ప్రాంతం. ప్రకృతి కరుణలేని అక్కడి నిస్సార భూములు నేడు పారిశ్రామికవాడల పునాదులకు వేదికలవుతున్నాయి. సరికొత్త సిరుల పంటకు సుక్షేత్రాలుగా మారుతున్నాయి. 
నవ్యాంధ్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం ఫలితాలు చిత్తూరు జిల్లాలో ప్రతిబింబిస్తున్నాయి. యువతకు ఉపాధి రూపంలో ఆ ఫలాలు అందుతున్నాయి. ఆధ్యాత్మికధామాలుగా భాసిల్లుతున్న తిరుపతి, శ్రీకాళహస్తి పరిసరాలు నేడు ఎలక్ట్రానిక్‌, హార్డ్‌వేర్‌ పరికరాల తయారీ కేంద్రాలుగా ఎదుగుతున్నాయి. ఈ ప్రాంతం ఎలక్ట్రానిక్‌ హబ్‌గా, సిలికాన్‌ సిటీగా కొత్త రూపు సంతరించుకుంటోంది. నాలుగేళ్లలో సాధ్యమైన ఈ ప్రగతి ప్రస్థానాన్ని అవలోకనం చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వ కృషి తేట‌తెల్లం అవుతుంది.

తిరుపతి పరిసరాలను ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కేంద్రంగా మారుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సెల్‌కాన్‌ సంస్థ భారీ ఎత్తున సెల్‌ఫోన్లను ఉత్పత్తి చేస్తుండగా, డిక్సన్‌ సంస్థ టీవీలు, సీసీ కెమెరాలు తయారు చేస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో అపోలో టైర్స్‌, ఖజారియాతోపాటు మరికొన్ని సంస్థలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి.

14ap-main5b_3.jpg

14ap-main5e.jpg

ప్రత్యేకంగా ఈఎంసీ జోన్లు 
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ప్రభుత్వం రెండు ఎలక్ట్రానిక్‌ పరికరాల ఉత్పత్తి కేంద్రాలను (ఈఎంసీ) ఏర్పాటు చేసింది. 
ఈఎంసీ-1లో 122 ఎకరాలు కేటాయించింది. ఇందులో 19.28 ఎకరాల స్థలం తీసుకున్న సెల్‌కాన్‌.. రూ.150 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తులను ప్రారంభించింది. ఇందులో 1,500 మంది పని చేస్తున్నారు. 
సమీపంలోనే కార్బన్‌ సంస్థ రూ.300 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను నెలకొల్పింది. మొత్తంగా ఈఎంసీ-1లో సుమారు రూ.960 కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమలను స్థాపించడం ద్వారా 15వేల మందికి ఉపాధి లభించనుందని అంచనా. 
దీనికి సమీపంలోనే 514.67 ఎకరాల విస్తీర్ణంలో ఈఎంసీ-2ని విస్తరిస్తున్నారు. 
ఇందులో 129.35 ఎకరాల్లో సుమారు రూ.797 కోట్ల పెట్టుబడితో పది కంపెనీలు తమ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయి. తద్వారా 5,660 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 
ప్రస్తుతానికి డిక్సన్‌ కంపెనీ రూ.150 కోట్ల పెట్టుబడితో అడుగు పెట్టింది. 900 మందికి ఉపాధినిస్తోంది. 
ఈ రెండు క్లస్టర్లలోనూ పనిచేస్తున్నది 80 శాతం మంది మహిళలే కావడం విశేషం. 

14ap-main5d.jpg

14ap-main5c.jpg

 శ్రీసిటీ ఆలంబనగా 
దేశంలో బాగా విజయవంతమైన ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్‌)లో శ్రీసిటీ ఒకటి. ఆదిలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న ఈ పారిశ్రామిక క్షేత్రం.. నేడు దేశ, విదేశీ కంపెనీలకు నెలవై మరో ప్రపంచాన్ని తలపిస్తోంది. శ్రీసిటీ విస్తరణతో చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో పరిస్థితులు మారాయి. చెన్నై-విశాఖ పారిశ్రామిక నడవలో.. శ్రీసిటీ ప్రధాన మజిలీగా ఎదిగింది. ఇక్కడ 27 దేశాలకు చెందిన 180 సంస్థలు కార్యకలాపాలు సాగిస్తుండగా.. సుమారు 40 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ఇసుజి, క్యాడ్‌బరీ, పెప్సికో, కోల్గేట్‌ పామోలివ్‌, కెల్లాగ్‌ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు తమతమ యూనిట్లు స్థాపించాయి. యాపిల్‌ సహా ప్రపంచ ప్రఖ్యాత సెల్‌ఫోన్‌ సంస్థలకు మొబైల్‌ ఫోన్లు తయారు చేసి అందించే ఫాక్స్‌కాన్‌ కంపెనీ శ్రీసిటీలో మొబైళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రభావం సహజంగానే పొరుగున ఉన్న శ్రీకాళహస్తి, తిరుపతికి విస్తరించింది.

14ap-main5f.jpg

 

తిరుపతి-శ్రీకాళహస్తి పరిసరాలకు గల అనుకూలతలు 
పరిశ్రమల స్థాపనకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు, భౌగోళిక అనుసంధానత, రవాణా, ఎగుమతి సదుపాయాలు. 
పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీటిని అందించేందుకు హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి, సోమశిల-స్వర్ణముఖి కాలువల నిర్మాణం వేగవంతం. 
150 కి.మీ. పరిధిలో తిరుపతి, చెన్నై విమానాశ్రయాలు; చెన్నై, కృష్ణపట్నం నౌకాశ్రయాలు ఉండటం. 
జిల్లా అధికారులు పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక భూనిధి(ల్యాండ్‌ బ్యాంకు)ని సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను అధీనంలోకి తీసుకున్నారు. 
జిల్లా వ్యాప్తంగా 47,872 ఎకరాల ఖాళీ స్థలాలు గుర్తించగా.. ఒక్క తిరుపతి డివిజన్‌లోనే 32,319 ఎకరాల భూమి ఉంది. జిల్లాలో ఇప్పటికే 6,614 ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించారు. 
తిరుపతి-చెన్నై, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారులు ఇప్పటికే ఉండగా.. తాజాగా చిత్తూరు-తిరుపతి-నాయుడుపేట, నాయుడుపేట-కృష్ణపట్నం పోర్టుల వరకు ఆరు వరుసల రహదారి నిర్మాణంలో ఉంది. చెన్నై-తిరుపతి-మదనపల్లె నాలుగు వరుసల రహదారి పనులు ప్రారంభించారు.

ఈనాడు, తిరుపతి

 

Link to comment
Share on other sites

విశాఖలో ‘స్థానిక’ మేళా
18-01-2019 03:22:59
 
636833785804043779.jpg
  • ఉన్న దగ్గరే ఉద్యోగం.. ఉత్తరాంధ్ర నుంచి ఏటా 5 వేల ఇంజనీర్లు
  • ఐటీ, పరిశ్రమల వృద్ధితో విశాఖలోనే కొలువు
  • సర్కారు ప్రోత్సాహకాలతో కదిలొస్తున్న ఎన్‌ఆర్‌ఐలు
  • డిగ్రి చదివితే ఏదో కంపెనీలో అవకాశం.. రెండేళ్లుగా ఐటీకి ఊపు..
  • శ్రమ, మేధోపర వనరుల వలసల్లో క్రమంగా తగ్గుదల
  • మహిళల సాధికారతను సాధించిన బ్రాండిక్స్‌ కంపెనీ
అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఉత్తరాంధ్ర అంటేనే వలసలు గుర్తుకొస్తాయి. పక్క ప్రాంతాలు మొదలు, దూరపు జిల్లాలు, వేరే రాష్ట్రాల దాకా, ఈ వలస కథలు విస్తరించాయి. ఈ ప్రాంతంలో ఉపాధిలో కాస్త మెరుగ్గా విశాఖపట్నం ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం, విజయనగరం నుంచి పనుల కోసం విశాఖకు ఏటా వేలాది వస్తుంటారు. అలాంటి విశాఖ.. రాష్ట్ర విభజనకు ముందు ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల విషయం వచ్చేసరికే తానూ వలసబాట పట్టాల్సిన పరిస్థితి! ఏ హైదరాబాద్‌కో, బెంగళూరుకో ఇక్కడి మేధ తరలిపోతుండేది. నాలుగున్నరేళ్ల తరువాత చూస్తే, ఉత్తరాంధ్రలోని మిగతా జిల్లాలకు సైతం తానే ఐటీ ఉద్యోగాలు ఇచ్చే స్థితికి విశాఖపట్నం చేరుకొంది.
 
సైబర్‌ క్షేత్రాలు, పరిశ్రమల్లోకి పెట్టుబడుల ప్రవాహం మొదలయ్యాక.. క్రమంగా వలసలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఐదు వేల మంది ఏటా ఇంజనీరింగ్‌ పట్టభద్రులు ఉపాఽధి కోసం విశాఖపట్నం వస్తుండగా, వారిలో నైపుణ్యం ఉన్నవారికి ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలు తమ వద్ద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఇలాంటి పరిస్థితిని ఊహించడానికి ఉండేది కాదు. ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలతో చర్చించి విశాఖలో కంపెనీలు ఏర్పాటు చేయించింది. వారికి అవసరమైన భవనాలను సేకరించడానికి ‘డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్కు’ స్కీమును ప్రారంభించింది. అందులో ప్లగ్‌ అండ్‌ ప్లే సౌకర్యాలు సమకూర్చింది. అద్దెలో 50 శాతం రాయితీ ప్రకటించింది.
 
medtech.jpg123.jpgమెడ్‌టెక్‌తో మారిన ఉద్యోగ చిత్రం..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన ఏపీ మెడికల్‌ టెక్నాలజీ పార్క్‌ (ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌)తో విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ప్రపంచదేశాల నుంచి ఏటా సుమారు రూ.30 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలు దిగుమతి చేసుకుంటున్న భారత్‌, రానున్న రోజుల్లో ఎగుమతి చేసే స్థాయికి వెళ్లాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని రూపకల్పన చేశారు. విశాఖనగర శివారు పెదగంట్యాడలో 270 ఎకరాలను మెడ్‌టెక్‌ పార్కుకు కేటాయించారు. 2016 ఆగస్టు 19వ తేదీన మెడ్‌టెక్‌ జోన్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 2018 డిసెంబరు 13న ఫేజ్‌-1ను ప్రారంభించి రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు.
 
మెడ్‌టెక్‌ పార్క్‌లో 280 కంపెనీలను ఏర్పాటుచేసి 24 వేల మందికి ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశ పనులు పూర్తయ్యే నాటికి 20 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించే స్థాయికి చేరుకోగా, మరో 60 కంపెనీలు జనవరి నుంచి ఉత్పత్తులను ప్రారంభించనున్నాయి. ఫేజ్‌-2, ఫేజ్‌-3 పనులు పూర్తయ్యేసరికి 250 కంపెనీలను ఏర్పాటుచేసి 24 వేల మందికి ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటుతో స్థానికంగా ఉంటున్న ప్రజలకు చిన్న చిన్న ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. మెడ్‌టెక్‌ జోన్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మరిన్ని ఉద్యోగాలు స్థానికులకు లభించనున్నాయి. మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటుతో చుట్టుపక్కల భూముల ధరలు భారీగా పెరగడంతో ఎంతోమంది ఆర్థికంగా బలోపేతమయ్యారు.
 
 
2VZVISK-IT-VUDA.jpg12.jpgఏ కంపెనీలో ఎందరు..
విశాఖపట్నం సీతమ్మధార వుడా కాంప్లెక్స్‌లో 2016లో తొమ్మిది కంపెనీలను ఏర్పాటు చేశారు. రెండేళ్లలో 700 మందికి ఉద్యోగాలు వచ్చాయి. టెక్‌ మహీంద్రా ఆవరణలో ఏర్పాటుచేసిన టెక్‌ హబ్‌లో 12 కంపెనీలు ప్రారంభించగా, 1,500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. హెల్త్‌కేర్‌ రంగంలో విశేష అనుభవం వున్న కాండ్యుయెంట్‌లో ఐదువేల మందికి ఉపాధి కల్పించడానికి ఒప్పందం జరిగింది. మొదట 200 మందితో ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు 25 ఎకరాలు కేటాయించారు. ‘వాక్‌ టు వర్క్‌’ విధానంలో పనిచేసే చోటే ఉద్యోగులకు నివాసం కల్పించడం ఈ సంస్థ ధ్యేయం. ఈ సంస్థ మొదటి 80 మందితో సేవలు మొదటు పెట్టింది. దశల వారీగా 1,500 మందికి ఉపాధి కల్పిస్తుంది. బీపీఓ కంపెనీలు పాత్ర, ఏఎన్‌ఎ్‌సడ బ్ల్యు కంపెనీలు చెరో 1,500 మందికి ఉపాధి కల్పిస్తాయి.
 
 
2PlugAndPlay.jpgddd.jpgప్లగ్‌ అండ్‌ ప్లే అంటే..
అడుగు పెట్టిన క్షణమే కార్యకలాపాలు ప్రారంభించడానికి వీలుగా ఒక కంపెనీకి అన్ని రకాల మౌలిక, సాంకేతిక సదుపాయాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఈ విధానానికే ప్లగ్‌ అండ్‌ ప్లే అని పేరు. ఈ పద్ధతుల్లో ప్రభుత్వం కొత్త కంపెనీకి కేటాయించే భవనంలో బ్యాండ్‌ విత్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం, నిరంతరాయ విద్యుత్‌ సరఫరా, ఏసీ వంటి సౌకర్యాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఎక్కువగా ఎన్‌ఆర్‌ఐలే పరిశ్రమలు, కంపెనీలు పెట్టడానికి విశాఖకు వస్తున్నారు. వీరంతా భూసేకరణ ప్రక్రియను పూర్తిచేసుకొని, కార్యాలయ నిర్మాణాలను పూర్తిచేసి, తమ కార్యకలాపాలను ప్రారంభించేసరికే చాలాకాలం గడిచిపోతోంది.
 
ఈ ప్రక్రియలోని విపరీత జాప్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వీలైనంతగా తగ్గించడానికే ఈ విధానాన్ని చేపట్టింది. రెండేళ్ల క్రితం ఒక కంపెనీ తన కార్యాలయం విశాఖలో పెట్టడానికి ఉత్సాహం చూపించింది. ఉడా పరిధిలోని సీతమ్మధారలో ఉన్న ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో రెండు ఫ్లోరులను తీసుకొని.. అన్ని వసతులతో సదరు కంపెనీకి ఆ ప్రదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
 
 
అవకాశాల్లో 9వ స్థానంలో..
అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న నగరాల జాబితాలో విశాఖపట్నం దేశంలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. గత నాలుగేళ్లలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన 82,756 మందికి శిక్షణ ఇవ్వగా, వారిలో 12,614 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆన్‌లైన్‌లో జావా, టాలీ, టాలీ విత్‌ జీఎ్‌సటీ, సీ లాంగ్వేజ్‌, వెబ్‌ టెక్నాలజీస్‌, ఫైథాన్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌ కోర్సుల్లో, ఆ్‌ఫ్‌లైన్‌లో టాలీ విత్‌ జీఎస్టీ, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, యాప్టిట్యూడ్‌ స్కిల్స్‌, ఇంటర్వ్యూ స్కిల్స్‌ నేర్పిస్తున్నారు. నైపుణ్యాలు సాధించినవారు ఐటీ కంపెనీలు, ఇతర రంగాల్లో మెరుగైన వేతనాలతో ఉపాధి పొందుతున్నారు.
 
‘రియల్‌’ చక్రం తిరిగింది
విశాఖ నగరం మధ్య నుంచి వెళుతున్న జాతీయ రహదారి వల్ల ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని గుర్తించారు. భారీ వాహనాలను బైపాస్‌ చేయడానికి ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి మధ్య ఆరు లేన్ల రహదారికి రూ.2300 కోట్లు మంజూరు చేశారు. ఆ విధంగానే సబ్బవరం మండలంలో పెట్రో యూనివర్సిటీ, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీలకు భూములు కేటాయించారు. సబ్బవరం సమీపాన ట్రై జంక్షన్‌లో అఫర్డబుల్‌ హౌసింగ్‌ కోసం 1,800 ఎకరాల ల్యాండ్‌ పూలింగ్‌కు నడుం కట్టారు. ఈ నిర్ణయాలు, ప్రాజెక్టుల వల్ల సబ్బవరం, పెందుర్తి, అనకాపల్లి, ఆనందపురం మండలాల్లో భూముల ధరలు భారీగా పెరగడంతో యజమానులు లబ్ధిపొందుతున్నారు.
 
 
రెండేళ్లలో మూడు భారీ పరిశ్రమలు
2017-18 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 602 ఏర్పాటయ్యాయి. వాటి ద్వారా 9,207 మందికి ఉపాధి కల్పించారు. రూ.10కోట్ల పెట్టుబడి దాటిన ఏడు భారీ పరిశ్రమల ద్వారా 9,122 మందికి ఉపాధి లభించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 269 ఎంఎ్‌సఎంఈల ద్వారా 2,649 మందికి, మూడు భారీ పరిశ్రమల ద్వారా మరో 632 మందికి ఉపాధి కల్పించారు.
 
 
బ్రాండిక్స్‌లో మరో దఫా కొలువులు
అచ్యుతాపురంలో ఏర్పాటుచేసిన అపెరల్‌ సిటీ బ్రాండిక్స్‌లో 18వేల మంది మహిళలు ఇప్పటికే ఉపాధి పొందుతున్నారు. అక్కడ కొత్తగా మరో నాలుగువేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఇక్కడ చేరిన తరువాత పలువురు మహిళలు సొంత గృహాలు సమకూర్చుకుని, పిల్లలను మంచి విద్య చెప్పించుకుంటున్నారు.
 
2IBPS-Logo-01.jpg1444.jpg11 వేల సీట్లలో ఏడు వేలు మనకే..
కేంద్రం ప్రవేశపెట్టిన ఐబీపీఎస్‌ పథకంలో మొత్తం 11వేల సీట్లు ఉన్నాయి. వాటిలో ఒక్క ఆంధ్రప్రదేశే ఏడువేల సీట్లను సాధించింది. వాటిలో అత్యధికం విశాఖపట్నం ఐటీ కంపెనీలే దక్కించుకున్నాయి. డిగ్రీ పాసైన వారికి హెచ్‌పీసీఎల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అనంతరం స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
Link to comment
Share on other sites

కర్నూలు ‘ఫార్మా క్లస్టర్‌’కు కేంద్రం సాయం
20-01-2019 03:53:13
 
న్యూఢిల్లీ, జనవరి 19(ఆంధ్రజ్యోతి): కర్నూలులో ఏర్పాటు చేస్తున్న ఫార్మా క్లస్టర్‌ పార్కుకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు సంబంధిత లేఖను ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌కు శనివారం కేంద్రం అందించింది. అయితే, డీపీఆర్‌ను రూపొందించి 6 నెలల్లోపు స్కీమ్‌ స్టీరింగ్‌ కమిటీకి అందించాలని ఆదేశించిం ది. కాగా, విశాఖపట్నం మెడిటెక్‌కు సాయంపై వారంలో ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్టు ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

పరి‘శ్రమ’ ఫలిస్తోంది!
20-01-2019 03:44:42
 
636835526806353901.jpg
  • వికేంద్రీకరణ విధానంలో విస్తరిస్తున్న అవకాశాలు
  •  ప్రాంతాభివృద్ధి, ఉద్యోగితే లక్ష్యంగా ప్రగతి పథకాలు
  •  5,13,753 కొత్త కొలువులు
  •  ప్రభుత్వ ప్రోత్సాహకాలతో వెనుకబడ్డ జిల్లాలూ జిగేల్‌
  •  55 వేల కోట్ల పెట్టుబడిని రాబట్టుకొన్న ప్రకాశం జిల్లా
  •  కియ కారు, హీరో జోరుతో సీమ యువతకు హుషారు
(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో పరిశ్రమల సందడి పెరిగింది. ప్రాంతాల వారీగా ఒక్కో రంగం ఒక్కో చోట వేగంగా విస్తరిస్తోంది. కరువు సీమలో ‘కారు’ ప్రయాణంతో మొదలుపెట్టి, వలసల నేల ఉత్తరాంధ్రలో ఉద్యానవన పరిశ్రమలు అందంగా రూపుదిద్దుకొంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా ప్రగతికి వీలు ఉండేది కాదు. ఏ పెద్ద పరిశ్రమ వచ్చినా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలే అనువైనవిగా చూపేవారు. వెనుకబడిన జిల్లాలను, ఇతర ప్రాంతాలను పట్టించుకునేవారే కాదు. అసలు రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా మరో ప్రాంతముందన్న ధ్యాసే లేనంతగా పెట్టుబడులూ, అవకాశాలూ, ఉద్యోగాలూ ఒకే చోట కేంద్రీకృతమయ్యాయి. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో నిజమైన పారిశ్రామిక విప్లవం ప్రారంభమయింది. అందుబాటులోని వనరులు, చేరువ లోని అవకాశాలను అందిపుచ్చుకొని ఎక్కడికక్కడ అభి వృద్ధి ప్రాజెక్టులు ఆకృతి దాల్చుతున్నాయి. ఈ వికేంద్రీకరణతో రాష్ట్ర ఆదాయం పెరగడం ఒక్కటే కాకుండా, నిరుద్యోగ యువతకు తమ ప్రాంతం దాటిపోవాల్సిన పని లేకుండానే.. ఉపాధి అవకాశాలూ లభిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు 2014లో పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే గతంలో హైదరాబాద్‌ నగర అభివృద్ధి, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థలను తీసుకువచ్చేందుకు కృషి చేసిన తరహాలోనే, నవాంధ్రప్రదేశ్‌ కోసం ప్రపంచమంతా చుట్టి పెట్టుబడుల వేట సాగించారు. అమెరికా, జపాన్‌, చైనా, సింగపూర్‌ , దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించారు. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికను రాష్ట్ర పారిశ్రామిక ఆకర్షక కేంద్రంగా మార్చేశారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు పరిశ్రమలను, కంపెనీలను తీసుకురావడానికి ప్రయత్నించారు. దీనివల్ల ప్రాంతాల మధ్య అసమానత్వ ధోరణి పోయి..సర్వతోముఖాభివృద్ధికి ఇప్పుడు బాటలు పడుతున్నాయి.
 
 
పెట్టుబడుల పంట
రాష్ట్రమంతా పరిశ్రమలు వరుస కడుతున్నాయి. ఒక్క పరిశ్రమల శాఖతోనే ఎంఎ్‌సఎంఈలతో రూ.17,771.52 కోట్ల పెట్టుబడితో 41,1880 ఉద్యోగాలు .. భారీ పరిశ్రమలలో రూ.62642.76 కోట్ల పెట్టుబడితో 1,01,873 ఉద్యోగాలు దక్కాయి. మొత్తంగా ఈ నాలుగున్నరేళ్లలో రూ.2,40,414.28 కోట్ల పెట్టుబడితో 5,13,753 మందికి ఉద్యోగాలొచ్చాయి.
 
 
కడప.. ఉక్కు
ఉక్కు పరిశ్రమ: మైలవరం మండలం కంబాలదిన్నెలో రూ. 20 వేల కోట్లు పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీనికోసం మూడు వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. ఇందులో 2,300 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మిగతా ఏడు వందల ఎకరాల కోసం భూసేకరణ చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది డిసెంబరు 27వ తేదీన ఈ పరిశ్రమకు శంకుస్థాపన జరిపారు. ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక సన్నాహాలను పూర్తి చేసుకొంటున్న ఈ పరిశ్రమ పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల ఉద్యోగాలు లభిస్తాయి.
 
 
కొత్త..ప్రకాశం
రామాయపట్నం ఓడరేవు: ఉలవపాడు మండలం రామాయపట్నంలో రూ. 4,240 కోట్ల పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ ఓడరేవు కోసం 3,092 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల తొమ్మిదో తేదీన శంకుస్థాపన పూర్తి చేసుకొంది. ఈ ఓడరేవు పూర్తయితే 25 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.
 
ఆసియా పల్ప్‌
అండ్‌ పేపర్స్‌: రామాయపట్నం ప్రాంతంలోని గుడ్లూరు మండలం చేవూరు సమీపంలో రూ. 50 వేల కోట్లతో ఇండోనేషియా కంపెనీ ఈ పేపర్‌ మిల్స్‌ను నిర్మిస్తోంది. ఈ నెల తొమ్మిదో తేదీన శంకుస్థాపన పూర్తిచేసుకొన్న ఈ మిల్స్‌ కోసం 2,500 ఎకరాలను సేకరించారు. తొలి దశలో రూ. 24,500 కోట్ల విలువైన పనులను చేపడుతున్నారు. పూర్తిస్థాయిలో పేపర్‌ మిల్స్‌ సిద్ధమయితే 13 వేల మందికి ఉపాధి దొరుకుతుంది.
 
 
అనంత జోరు
కియ: వెనుకబడ్డ రాయలసీమ వాహన తయారీరంగానికి హబ్‌గా మారుతోంది. కరువు తాండవించే అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజ సంస్థ ‘కియ’ తన ప్లాంటును ఏర్పాటు చేసింది. అనంతపురం ప్లాంటులో తయారైన ‘కియ’ కారు ఈ నెల 27న మార్కెట్లోకి రానున్నది. ‘కియ’ సంస్థకు అనుబంధంగా మరిన్ని సంస్థలూ పెట్టుబడులు పెట్టాయి.
 
తూర్పు- రిఫైనరీ..
హల్దియా పెట్రో కెమికల్‌ రిఫైనరీ: కాకినాడ సెజ్‌లో రూ. 33 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. పది రోజుల క్రితం రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించిన కీలక ఒప్పందాలు కుదిరాయి. త్వరలోనే శంకుస్థాపన జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
 
 
కర్నూలు.. సోలార్‌
సోలార్‌ పార్కు: ఓర్వకల్లు సమీపంలో రూ.ఆరు వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఎకరాలను సమకూర్చింది. రెండేళ్ల క్రితం శంకుస్థాపన జరుపుకొన్న ఈ పార్కు గత ఏడాది డిసెంబరు 20వ తేదీన అందుబాటులోకి వచ్చింది. వెయ్యిమందికి ప్రత్యక్షంగా, మరో 1500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది.
 
 
చిత్తూరు సత్తా
ఇసుజు: శ్రీసిటీ సెజ్‌లో రూ. 1,500 కోట్ల పెట్టుబడితో 107 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం శంకుస్థాపన జరుపుకున్న ఈ పరిశ్రమ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దాదాపు రెండు వేలమందికి కొత్తగా ఉపాధి లభించనుంది.
 
అపోలో టైర్స్‌: వరదయ్యపాలెం సమీపంలోని సెజ్‌లో రూ. 4,125 కోట్ల పెట్టుబడి, 1,400 మందికి ఉపాధి హామీతో 265 ఎ కరాల్లో ఏర్పాటవుతోంది.
హీరో: వరదయ్యపాలెం సమీపంలోని సెజ్‌లో రూ. 1,600 కోట్ల పెట్టుబడి, 2,500 కొత్త కొలువులతో 562 ఎకరాల్లో ఏర్పాటవుతోంది.
 
 
ఉత్తరాంధ్ర- ఉద్యానవనం
 
పతంజలి: విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలంలో ఈ ఔషధ పరిశ్రమ ఏర్పాటవుతోంది. 176 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. ఈ పరిశ్రమ వల్ల రెండు వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పని దొరకనుంది.
 
ఉద్యానవన కళాశాల: ఉత్తరాంధ్రలో ఉద్యానవన రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో ఈ కళాశాల ఏర్పాటు చేశారు. వేగంగా నిర్మాణం పూర్తి చేసుకొన్న ఈ కళాశాలలో క్లాసులు కూడా ప్రారంభించారు.
gfx.jpg 
Link to comment
Share on other sites

ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో స్థలాలకు 2,400 దరఖాస్తులు

 

మొదటి విడతగా 7,200 ప్లాట్లు  సిద్ధం చేసిన ఏపీఐఐసీ
అన్ని స్థాయిల్లో పరిశీలన  తరువాతే కేటాయింపులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మొదటి విడత 31 సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్కుల్లో స్థలాల కోసం నెల రోజుల వ్యవధిలో 2,400 దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుదారులంతా స్థల విలువలో పది శాతం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించి ఖరారు చేసుకున్నారు. వీటిపై నిపుణుల బృందం మదింపు చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నది.

ఎంఎస్‌ఎంఈ పార్కుల విశేషాలు
*నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) అధికారులు మొదటి విడతగా 13 జిల్లాల్లో 31 పార్కుల్లో 7,200 ప్లాట్లు సిద్ధం చేశారు.

* 25 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో పార్కును ఏర్పాటు చేసి వీటిలో ప్లాట్‌ విస్తీర్ణం 300 గజాలు ఉండేలా లేఅవుట్‌ రూపొందించారు.
* నెల రోజుల క్రితం వీటిని ఏపీఐఐసీ వెబ్‌సైట్‌లో పెట్టి ఔత్సాహికుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.
* ఒక్కో వ్యక్తి, సంస్థకు గరిష్ఠంగా నాలుగు ప్లాట్లకు మించి కేటాయించే వీల్లేదు.
* ఎక్కువ మందికి అవకాశం కల్పించాలంటే పరిమితి తప్పదని అధికారులు చెబుతున్నారు.

ఆచితూచి కేటాయింపు
ప్లాట్‌ మొత్తం విలువలో పది శాతం మొత్తాన్ని చెల్లించినంతమాత్రాన కేటాయించే అవకాశం లేదు. ఇందుకోసం ఏపీఐఐసీ వివిధ దశల్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను నలుగురితో ఏర్పాటైన నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తోంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తెప్పించుకొని పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, పెట్టుబడి పెట్టే ఆర్థిక సామర్థ్యం, పరిశ్రమ నిర్వహణలో అనుభవం తదితర విషయాలను తెలుసుకుంటున్నారు.

జిల్లా స్థాయిలోనే ప్లాట్ల ఖరారు
రాష్ట్ర స్థాయిలో నిపుణుల కమిటీ పరిశీలించి పరిశ్రమ పెట్టేందుకు వీలుందని భావించిన వ్యక్తుల దరఖాస్తులను జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీకి పంపుతుంది. కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీ ఇలాంటి దరఖాస్తులపై మరోసారి వడపోత చేపట్టి కచ్చితంగా పరిశ్రమ ఏర్పాటు చేస్తారనుకునే వ్యక్తుల, సంస్థలకు ప్లాట్లు ఖరారు చేస్తుంది. ఈ మేరకు వారి నుంచి ఏపీఐఐసీ మిగతా 90 శాతం మొత్తాన్ని వసూలు చేసి ఎప్పటిలోగా పరిశ్రమ ఏర్పాటు చేయాలి? ఉత్పత్తి ప్రారంభించేందుకు గడువు, ఇతరత్రా నిబంధనలతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తుంది.

 

Link to comment
Share on other sites

సెజ్‌లో సెయింట్‌ గోబియన్‌
 

అద్దాల పరిశ్రమకు 180 ఎకరాలు కేటాయింపు
ఎకరా విలువ రూ.60 లక్షలు
1300 మందికి ప్రత్యక్ష ఉపాధి
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లోకి అద్దాల పరిశ్రమ అడుగుపెట్టబోతుంది. తమిళనాడు కేంద్రంగా నిర్వహిస్తున్న సెయింట్‌ గోబియన్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ అద్దాల తయారీ పరిశ్రమ ఈ సెజ్‌లో యూనిట్‌ నెలకొల్పడానికి ఆసక్తి చూపిస్తోంది. ఈ కంపెనీకి చెన్నైకు సమీపంలోని శ్రీపెరంబుదూర్‌తో పాటు రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోనూ గ్లాస్‌ తయారీ యూనిట్లు ఉన్నాయి. గ్లాస్‌ ఉత్పత్తుల విస్తరణలో భాగంగా మన జిల్లాలో మరో యూనిట్‌ పెట్టడానికి ఇదివరకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. గతంలోనే అచ్యుతాపురం సెజ్‌ పరిసరాలను పరిశీలించి అద్దాల తయారీకి అనువైన ప్రాంతంగా గుర్తించారు. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి భూములను కేటాయించాలని కోరారు. అయితే ఈ పరిశ్రమ కల్పించే ఉపాధి అవకాశాలు, ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేసి ముందుకు 164 ఎకరాల భూమిని రూ.84 లక్షల (ఎకరాకు) రేటుతో ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే ఈ రేటు ఎక్కువగా ఉందని ప్రత్యామ్నాయం చూడాలని మరలా సంబంధిత పరిశ్రమ వర్గం సర్కారు దృష్టికి తీసుకువెళ్లింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) కూడా పరిశ్రమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదించింది. సర్కారు ఈ ప్రతిపాదలను.. పరిశీలించి రూ.60 లక్షలు రేటుతో 180 ఎకరాలను అచ్యుతాపురం పారిశ్రామిక వాడ-2లో ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ ఉత్తర్వులు జారీచేశారు.

1300 మందికి ఉపాధి..
సెయింట్‌ గోబియన్‌ అద్దాల పరిశ్రమ ఏర్పాటైతే 1300 మందికి ప్రతక్ష్య ఉపాధి లభిస్తుందని కంపెనీ డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ప్రస్తుతం రోజుకు 3000 టన్నుల అద్దాలను ఉత్పత్తి చేస్తుంది. రాజస్థాన్‌లోని బివాడీకి సమీపంలో ఉన్న సెయింట్‌ గోబియన్‌ యూనిట్‌ దేశంలోనే పెద్దది. ఆ తరువాత స్థానంలో ఇక్కడే అంతమేర ఉత్పత్తి చేస్తామంటూ పరిశ్రమ ప్రతినిధులు సర్కారు దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే భూ కేటాయింపుల పర్వం పూర్తి చేసి క్షేత్రస్థాయిలో యూనిట్‌ను పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్సాహం చూపుతోంది. సెజ్‌లో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఉత్పత్తులను ప్రారంభించగా మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయి. వీటితో వందల సంఖ్యలోనే ఉపాధి చూపుతున్నారు. సెయింట్‌ గోబియన్‌ పరిశ్రమతో నేరుగా 1300 మందికి పరోక్షంగా, మరో 500 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని జిల్లా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అనకాపల్లి, అచ్యుతాపురం రహదారి విస్తరణతో పాటు, అచ్యుతాపురం ప్రధాన కూడలిని విస్తరించేందుకు రహదారులు భవనాల శాఖ ఇప్పటికే సిద్ధమైంది. ఈ పనులు పూర్తయితే మరిన్ని కొత్త పరిశ్రమలు రావడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

50334659_2154787621254940_7660195934738841600_n.jpg?_nc_cat=104&_nc_ht=scontent.ftpa1-2.fna&oh=c0bf883f4eb75a899a15887eb37ebb97&oe=5D014603

మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని నిర్ణయం తీసుకున్న తరువాత మాకు అనేక ఫోన్లు వచ్చాయి 

ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు వెళ్తున్నారు,మా రాష్ట్రానికి రావొచ్చు కదా అని కొంత మంది ముఖ్యమంత్రులు ఆహ్వానించారు 

వాళ్లందరికీ మేము ఒక విషయం చెప్పాము 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్కడి అధికారులు పనిచేసినంత వేగంగా ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు 

అభివృద్ధి చెయ్యాలి అనే లక్ష్యం ఉండటం వేరు,అది అమలు చెయ్యడం వేరు.అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర మాత్రమే చూసాం 

మీరు చాలా వేగంగా మాకు అనుమతులు ఇస్తున్నారు.అంతే వేగంగా డేటా సెంటర్ ఏర్పాటు చెయ్యాలి అనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం 

అమరావతి అభివృద్ధి లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో కలిసి పనిచెయ్యాలి అని నిర్ణయించుకున్నాం 

కనెక్టెడ్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటులో అదాని సర్వీసెస్ అందిస్తుంది 

విద్యుత్ సరఫరా, ఫైబర్ కనెక్టివిటీ, టెలీఫోన్, తాగునీటి తో పాటు పార్కింగ్, స్ట్రీట్ లైటింగ్, ఏసీ ఇలా అనేక సర్వీసులు అన్ని కలిపి ప్రజలకు అందించే సర్వీసెస్ ప్రస్తుతం ఇండియాలో లేవు.

- అదాని గ్రూప్ ఎండీ & సిఈఓ అనిల్ సార్దానా

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...