Jump to content

Amaravati


Recommended Posts

రాజధాని రహదారుల సందర్శనకు అవకాశం?
29-05-2018 01:24:42
 
ఆంధ్రజ్యోతి, అమరావతి: రాజధానిలో అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు సహా పలు ప్రాధాన్య రహదారుల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ఆ రోడ్లను వారు ప్రత్యక్షంగా చూసేందుకు అవకాశం కల్పించాలనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలా చేయడం ద్వారా ఆశించిన విధంగానే రాజధానిలో రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తారని.. తద్వారా అమరావతి రూపకల్పన ప్రక్రియ మరింత వేగంగా చేపట్టేందుకు అవసరమైన సానుకూల భావన వారిలో నెలకొంటుందన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది.
 
ఇదే సమయంలో అమరావతి నిర్మాణంలో ఆశించిన పురోగతి లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవంలేదని తెలియజెప్పేందుకూ ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రాజధాని రహదారులను 3 సర్క్యూట్లుగా చేసి, వాటిని సందర్శించేందుకు ప్రజలకు అవకాశం కల్పించనున్నారని తెలిసింది.
Link to comment
Share on other sites

విదేశాల్లో ఆర్జించిన సంపాదనలో కొంత మొత్తాని ఎన్నారైలు సైతం విరాళాలుగా రాజధాని నిర్మాణం కోసం ఇస్తున్నారని చెప్పారు.

ఇప్పటివరకు రూ.75 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తెలిపారు.

Link to comment
Share on other sites

రాజధాని 8వేల ఎకరాల్లోనే
30-05-2018 03:28:07
 
  • మిగతాది రోడ్లకు, మౌలిక వసతులకే
  • 75 వేల ఎకరాల్లో ‘గుజరాత్‌’ దొలేరా
  • జగన్‌, పవన్‌కు కనిపించడం లేదా?
  • మహానాడులో టీడీపీ సీనియర్ల ఆగ్రహం
అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణం ఇష్టం లేకనే వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ సీనియర్‌ నేతలు మండిపడ్డారు. గుజరాత్‌లోని దొలేరా నగర నిర్మాణానికి 75 వేల ఎకరాలు సేకరించారని.. ఇది వారి కళ్లకు కనిపించడం లేదా అని నిలదీశారు. మహానాడు వేడుక మూడో రోజైన మంగళవారం ‘ప్రజా రాజధాని-మన అమరావతి-అద్భుత ఆవాస యోగ్యం-ఆనంద నగరం’ అన్న తీర్మానంపై చర్చ జరిగింది. నిధుల వినియోగ పత్రాలను (యూసీ) పంపలేదన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యలపై ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. యూసీలనీ ప్రదర్శించారు.
 
 
యూసీలపై ఇవిగో ఆధారాలు..
‘నిరుడు డిసెంబరులో రూ.1582 కోట్లకు తొలి యూసీ పంపించాం. నీతి ఆయోగ్‌ దీన్ని పరిశీలించి.. 2017-18కి మరో రూ.1000 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి లేఖ రాసింది. కానీ కేంద్రం రాష్ట్రప్రభుత్వాన్ని నమ్మకుండా నలుగురు సభ్యుల బృందాన్ని అమరావతికి పంపింది. ఆ బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చి అన్నీ పరిశీలించి.. ఇచ్చిన 1500 కోట్లూ ఖర్చయ్యాయి.. నడుస్తున్న పనులకుగాను 2017-18కి మరో రూ.650 కోట్లు ఇవ్వాలని చెప్పింది. అనంతరం మార్చి 27న అప్పటివరకు అయిన ఖర్చు రూ.1514 కోట్లకు అప్‌డేటెడ్‌ యూసీ పంపాం. మూడోసారి మరో అప్‌డేటెడ్‌ యూసీ పంపాం. రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చామని, ఆ మొత్తమంతా ఖర్చుచేశారని కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఓ ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది. కానీ అమరావతికి రూ.2500 కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారు’ అని మంత్రి సుజయ్‌కృష్ణ పేర్కొన్నారు.
 
 
‘అమరావతికి 33 వేల ఎకరాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అందులో 50 శాతం రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి, 30 శాతం భూములు రైతులకు ఇవ్వగా.. ఇక మిగిలింది 8 వేల ఎకరాలే. ఐదుగురు సభ్యులున్న జగన్‌ కుటుంబానికి బెంగళూరులో 27 ఎకరాల ప్యాలెస్‌ ఉండొచ్చు. కానీ వెయ్యేళ్లు ఉండే అమరావతికి మాత్రం భూములు అక్కర్లేదా?’ అని మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ హెచ్చరించారు. ’గుజరాత్‌లో నాలుగు మహానగరాలున్నా ఐదోది దొలేరా నగరాన్ని నిర్మిస్తున్నారు. అది 75 వేల ఎకరాల్లో ఉంది. పవన్‌, జగన్‌ కళ్లకు కనిపించడం లేదా?’ అని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ ఎన్‌ వర్మ ప్రశ్నించారు.
 
 
‘ఇటీవల కర్నూలు నుంచి అమరావతి వస్తున్నాను. వినుకొండ దగ్గర మావాళ్లతో భోజనాలకు ఆగాను. అక్కడో 60 ఏళ్ల పెద్దాయన ఉన్నాడు. ఆయనతో మాట కలిపా. మోదీ పాలన ఎలా ఉందో మూడు ముక్కల్లో చెప్పమని అడిగా.. మూడెందుకు.. రెండు ముక్కల్లో చెబుతానన్నాడు. ఆయన సన్యాసీ కాదు..సంసారీ కాదు అన్నాడు. అదేంటని అడిగాను.. భార్య ఉన్నా, బంధువులున్నా ఉన్నారని చెప్పుకోడు.. అందుచేత సంసారి కాదు.. ఆయన సన్యాసి కూడా కాదు.. ఎందుకంటే కోట్ల రూపాయల ఖరీదైన కోట్లు వేసుకుంటాడు అని చెప్పాడు’ వాల్మీకి ఫెడరేషన్‌ చైర్మన్‌ బీటీ నాయుడ పేర్కొన్నారు. కాగా, ఇదే తీర్మానంపై రాజధానికి భూములిచ్చిన రైతులు గంటా పవన్‌, కడియాల రాఘవరావు, కొమ్మినేని సాంబశివరావు కూడా మాట్లాడారు.
Link to comment
Share on other sites

ధొలేరాపై ఎంతో ప్రేమ!..మాపై సవతి చూపా!
అలాంటి నగరాలు గుజరాత్‌కే కావాలా?
రాజధాని లేని ఏపీకి వద్దా?
మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజం
ఈనాడు - అమరావతి
29ap-politics1a.jpg

గుజరాత్‌లో నిర్మిస్తున్న ధొలేరాపై ఎంతో ప్రేమ కనబరుస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ...ఆంధ్రప్రదేశ్‌పై సవతి ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. ధొలేరా నగర అభివృద్ధి విశేషాలు, గొప్పతనం గురించి మోదీ ప్రసంగించిన వీడియోలను మహానాడు వేదికపై మంగళవారం ప్రదర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.‘‘దిల్లీ కంటే రెండు రెట్లు, షాంఘై కంటే ఆరు రెట్లు పెద్ద నగరంగా ధొలేరాను అభివృద్ధి చేస్తామని మోదీ చెబుతున్నారు. అలాంటి నగరాలు కేవలం గుజరాత్‌కే కావాలా? విభజన తర్వాత రాజధానే లేని ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం వద్దా?...’’ అని సూటిగా ప్రశ్నించారు. విజయవాడలో జరుగుతున్న మహానాడు మూడోరోజైన మంగళవారం ‘‘ప్రజా రాజధాని-మనఅమరావతి-అద్భుత ఆవాసయోగ్యం-ఆనంద నగరం’’ తీర్మానంపై జరిగిన చర్చలో  ప్రసంగించారు. ‘‘రూ.98 వేల కోట్లతో ధొలేరా నగరాన్ని నిర్మించుకుంటున్నారు.. అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టుకుంటారు. అక్కడ మెట్రో కావాలి. అమరావతికి మాత్రం రూ.1,500 కోట్లతో సరిపెడుతున్నారు. ఓ విగ్రహానికి ఇచ్చిన డబ్బు కూడా రాజధానికి ఇవ్వరా? ఇది న్యాయమా? దీనిపై మన రాష్ట్రంలోని నాయకులూ సమాధానం చెప్పాలి...’’ అని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వకపోతే...తామేందుకు పన్నులు కట్టాలని ప్రశ్నించారు.

జగన్‌ అడిగితే ఒక్క సెంటు కూడా ఇచ్చే వారు కాదు: రాజధాని నిర్మాణం కోసం నేను భూములడిగితే రైతులు స్వచ్చంధంగా ముందుకొచ్చి 33 వేల ఎకరాలు ఇచ్చారు. అదే జగన్‌ అడిగితే ఒక్క ఎకరా కాదు కదా ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చేవారు కాదు. ఇస్తే అవినీతిలో కుప్పకూలిపోతాయని ప్రజల భయం. గతంలో వాన్‌పిక్‌, లేపాక్షీ భూముల్లో కుంభకోణాలే తప్ప ఏం జరగలేదు. ప్రభుత్వ నిధులన్నీ అమరావతిలోనే ఖర్చు చేస్తున్నామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజధానిలో 5 వేల ఎకరాలను విక్రయించుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం మనం అప్పు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాం. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయడంలో సోమా కంపెనీ డబ్బులు లేవని వెనకపడితే వారికి రూ.10 కోట్లు అడ్వాన్సు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.... అది మన వల్లే ఆగిపోయిందని సాక్షి పత్రిక తప్పుడు వార్తలు రాస్తోంది. అలాంటి వార్తలతో ప్రజలను మభ్యపెట్టే రోజులు పోయాయి.

భాజపాకు అద్దె మైకు...వైకాపాకు సొంత మైకు: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా నియమితుడైన వ్యక్తి భాజపాకు అద్దె మైకు.... వైకాపాకు సొంత మైకు. వైకాపాలోకి వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకుని అనారోగ్యం పేరిట చివరి క్షణంలో ఆసుపత్రిలో చేరారు. ఆయన కూడా తెదేపాను విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి తీవ్రం నష్టం జరుగుతుంటే అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఆ తప్పులను ఎత్తి చూపించలేకపోయారు. ఇప్పుడు రాష్ట్రానికి భాజపా అన్యాయం చేస్తుంటే..పదవి కోసం కక్కుర్తి పడ్డారు. తెదేపా పదవి కోసమో... పనులు కోసమో లేదు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిని వదిలి పెట్టం. రాజధానికి 200 ఎకరాలు చాలవా? అని ఒకాయన అంటాడు..రేపు నేను అధికారంలోకి వస్తే రైతులకు భూములు తిరిగిచ్చేస్తానని..రాజధానిని మార్చేస్తానని మరొక ఆయన అంటున్నాడు. ఇలాంటి వారి వల్ల ప్రజల్లో, పెట్టుబడిదారుల్లోనూ అనిశ్చిత ఏర్పడుతోంది.
రూ.45 వేల కోట్లతో మొదటి దశ: అమరావతి బృహత్‌ ప్రణాళికను సింగపూర్‌ ప్రభుత్వం మనకు ఎప్పుడో ఇచ్చేసింది. నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ ఆకృతులు సిద్ధం చేస్తోంది. ఇటీవల ఆ సంస్థ అధిపతి ఇక్కడ పర్యటించి ప్రపంచంలో అమరావతికి అమరావతే పోటీగా ఉంటుందని చెప్పారు. మొదటిదశలో రూ.45 వేల కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాం. 2050 నాటికి అమరావతిలో 35 బిలియన్‌ డాలర్లు జీడీపీ రాబట్టడమే లక్ష్యం. 2025 నాటికి ఇక్కడ 35 లక్షల జనాభా ఉంటుంది. రాజధాని నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వమని పిలుపిస్తే రూ.75 కోట్లు ప్రజలిచ్చారు. ప్రజలు ఇంత స్ఫూర్తి కనబరుస్తున్నా..కేంద్రం మాత్రం నిధులు విదల్చడం లేదు.

అమరావతికి అడ్డం పడితే ఖబడ్డార్‌!
రాజధాని నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఇచ్చి...రూ.2,500 కోట్లు ఇచ్చామంటారా? వాటికే లెక్కచెప్పనప్పుడు ఇంకా నిధులెలా ఇస్తామంటారా? సింగపూర్‌ వద్దే ఇంకా బృహత్‌ ప్రణాళికలు ఉన్నాయని అంటారా? రూ.24 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిస్తే పిలవలేదంటారా? రూ.1,632 కోట్ల విలువైన పనులకు సంబంధించి తాజా వినియోగ పత్రాలను పంపిస్తే అవన్నీ తప్పని మభ్యపెడతారా? కేంద్రం ఆటలు చెల్లవు. అమిత్‌షా వ్యాఖ్యలు ఎవరూ నమ్మరు. రాజధానికి డబ్బులివ్వకుండా అణగదొక్కాలని ప్రయత్నించడమేంటి. అనుమతులు ఇవ్వమని బెదిరించడం ఏం న్యాయం? అమరావతికి అడ్డం పడితే ఖబడ్డార్‌! ఈ ప్రాజెక్టుపై మనం డబ్బులు ఖర్చు పెట్టినా...నిధులివ్వడానికి కేంద్రం నెపాలు వెతుకుతుండటం మంచి పద్ధతి కాదు.

Link to comment
Share on other sites

AmaravatiVerified account @PrajaRajadhani 10m10 minutes ago

 
 

APCRDA is inviting EoI from all interested parties for the Amaravati Corporate Street Initiative. The EOI document can be downloaded from the APCRDA website: http://crda.ap.gov.in . The due date for submission of EOI Application is extended to June 20, 2018, 03:00 PM.

Link to comment
Share on other sites

గడువులోగా అమరావతిలో ఉద్యోగులకు ఇళ్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కొత్త రూపు సంతరించుకుంటోంది. భారీ గృహనిర్మాణ సముదాయాల నిర్మాణ పనులు చకచక సాగుతుండటంతో కొత్త రూపు కనిపిస్తోంది. అమరావతిలోని రాయిపూడి, నేలపాడు, అనంతవరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్‌.. నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. మొత్తం 61 టవర్లలో 3,840 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో టవర్‌లో 12 అంతస్తులు ఉంటాయి. రూ. 2,600కోట్లతో ఈ గృహాలను నిర్మిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో ప్రారంభమైన నిర్మాణ పనులు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు.

Link to comment
Share on other sites

రాజధాని లేఅవుట్లలో సకల సౌకర్యాలు
31-05-2018 09:05:32
 
636633543394665608.jpg
  • 12 జోన్లుగా విభజించి అభివృద్ధి
  • ఇప్పటికే ఆరు జోన్లలో ప్రారంభమైన నిర్మాణ పనులు
  • రూ. 14,749 కోట్లు కేటాయించిన సీఆర్‌డీఏ
గుంటూరు(ఆంధ్రజ్యోతి): విశాలమైన రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, కేబుల్స్‌, తాగునీరు, వంటగ్యాస్‌ పైపులన్లు వంటి సకల సౌకర్యాలతో అమరావతి రాజధాని నగరంలో లేఅవుట్ల అభివృద్ధి ప్రారంభమైంది. రాజధానిలో ఏపీ సీఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌లో పొందుపరిచిన లేఅవుట్లను మొత్తం 12జోన్లుగా విభజించి ఆరు జోన్లలో నిర్మాణ పనులను మొదలు పెట్టారు. ఇందుకోసం పెద్దమొత్తంలోనే నిధులను సీఆర్‌డీఏ కేటాయించింది. జోన్‌-1, 2, 3, 6, 7, 10లలో గత కొద్ది రోజుల నుంచి గ్రౌండ్‌ వర్కులు వేగవంతంగా జరుగుతున్నాయి. మిగతా జోన్ల పనులకు కూడా టెండర్లు నిర్వహించి త్వరలోనే ప్రారంభిస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి.
 
భూసమీకరణ పథకం కింద రాజధాని అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికే సీఆర్‌డీఏ వివిధ లేఅవుట్లలో ప్లాట్లను కేటాయించింది. ప్రస్తుతం వాటి రిజిస్ట్రేషన్లు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ప్లాట్ల కేటాయింపు అక్కడక్కడ మినహా అంతా పూర్తికావడంతో లేఅవుట్ల అభివృద్ధిపై దృష్టి సారించింది. తుళ్లూరు, నేలపాడు, నెక్కల్లు, అనంతవరం, శాఖమూరు, ఐనవోలులలో లేఅవుట్ల అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయు. రియల్టర్లు వేసే లేఅవుట్లకు భిన్నంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. 40 అడుగుల వెడల్పు రోడ్లకు సంబంధించి మట్టి పనులు ప్రారంభమయ్యాయి. భవిష్యత్తులో మరెలాంటి గుంతలు తవ్వకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికను రూపొందించారు. తాగునీటి పైపులైన్లు, గ్యాస్‌ పైపులైన్లు, అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్స్‌, టెలిఫోన్‌, శాటిలైట్‌ టీవీ నెట్‌వర్కు కేబుల్స్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నారు.
 
సైకిల్‌, వాకింగ్‌ ట్రాక్‌లు, వాటర్‌ కెనాల్స్‌
లేఅవుట్‌లో నిర్మించబోయే ఫ్లాట్లలో నివసించే ప్రజల ఆహ్లాదం, వినోదంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతీ లేఅవుట్‌ చుట్టూత సైకిల్‌, వాకింగ్‌ ట్రాక్‌ల నిర్మాణం చేపడుతోన్నారు. కాలిబాటలు తప్పనిసరిగా అన్ని రోడ్లలో ఉంటాయి. అలానే మినీపార్కుల నిర్మాణం చేస్తున్నారు. అన్ని జోన్లలో ఎల్‌ఈడీ బల్బులు వినియోగించి విద్యుత్‌ని పొదుపు చేస్తారు. అలానే సౌర విద్యుత్‌ వినియోగానికి అవసరమైన ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. విల్లా ప్లాట్లు వేసిన లేఅవుట్లలో అయితే వాటర్‌ కెనాల్స్‌ని కూడా ప్లానింగ్‌ చేశారు.
 
భారీగా నిధుల కేటాయింపు
ప్రజలకు సంబంధించిన సౌకర్యాలతో ముడిపడి ఉన్న లేఅవుట్లలో అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడటానికి వీల్లేదని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని నగర అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో ఆయన ఈ విషయంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతో కన్సల్టెన్సీల ద్వారా జోన్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించిన సీఆర్‌డీఏ మొత్తం రూ. 14,749 కోట్లకు బడ్జెట్‌ అనుమతి తీసుకుంది. ఈ నిధులతో ప్రస్తుతం చకచకా మట్టి పనులు పూర్తి చేస్తోంది. ప్రతీ జోన్‌ని రాజధానిలో నిర్మాణం జరుగుతున్న రోడ్లకు అనుసంధానం చేస్తోంది. ఈ రోడ్లు సీడ్‌యాక్సెస్‌కు అనుసంధానమై ఉన్నందున జాతీయ రహదారి మీదకు సులువుగా చేరుకోవచ్చు. దీనివల్ల ఏ జోన్‌లో నివసించే వారు అయినా కామన్‌ ఫెసిలిటీస్‌ని సులువుగా పొందవచ్చు.
Link to comment
Share on other sites

రాజధాని గ్రామాల్లో తొలగిన తాగునీటి కష్టాలు
31-05-2018 08:57:20
 
636633538469042599.jpg
ఎన్‌టీఆర్‌ సుజల పథకం ద్వారా రూ.2కే ఇరవై లీటర్ల స్వచ్ఛమైన నీటి సరఫరా
స్మార్ట్‌కార్డులు వినియోగించి అవసరం మేరకు తీసుకొంటున్న ప్రజలు
రాజధాని గ్రామాల ప్రజలకు తాగునీటి కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి. వివిధ దశల్లో శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీటిని కేవలం రూ. 2కే ఇరవై లీటర్లు పొందుతున్నారు. ప్రస్తుతానికి సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌ ట్రస్టు, మెగా ఇంజనీరింగ్‌ సంస్థ కలిసి ఏర్పాటుచేసిన ఆర్‌వో ప్లాంట్ల వద్దకు వెళ్లి క్యాన్లలో తెచ్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రజల ఇళ్లల్లోకే సురక్షితమైన నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.
 
 
గుంటూరు(ఆంధ్రజ్యోతి): గతంలో బోర్లు, చెరువుల మీద ఆధారపడి ఎలాంటి శుద్ధి చేయని నీటిని సేవించే పరిస్థితి నుంచి ఆర్‌వో ప్లాంట్‌ వాటర్‌ తాగే స్థితికి రావడంపై రాజధాని ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో తాగునీటిలో మలినాలు కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతుండేవారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా సమసిపోయింది. అమరావతి రాజధాని నగర పరిధిలోని గ్రామాలు పేరుకే కృష్ణానది చెంతన ఉన్నప్పటికీ తాగునీటికి ఇబ్బంది పడు తుండేవారు. కృష్ణానదిలో ప్రవహించే నీరు వారికి సరఫరా జరిగేది కాదు. కరకట్టకు ఇవతలి వైపున జరీబు భూముల్లో బోర్లు వేసుకొని ఆ నీటిని ఎలాంటి శుద్ధి చేయకుండా ప్రజల కు సరఫరా చేసేవారు. భూగర్భ నీరు కావడం వల్ల కొంచెం చవ్వగా ఉండేవి. క్లోరినేషన్‌ వంటి ప్రక్రియ జరగకపోవడం కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండేవారు. శాఖ మూరు, ఐనవోలు, పెదపరిమి, నేలపాడు వంటి గ్రామాల్లో అయితే చెరువు నీరే దిక్కు. వేసవి వస్తుందంటే చెరువులో నీరు అడుగంటి ప్రజలు దాహార్తి బారిన పడేవారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో సమగ్ర మంచినీటి పథకం పైలట్‌ ప్రాజెక్టుకు రూ. 10కోట్లతో రూపకల్పన చేసినా అది విజయవంతం కాలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు తీరలేదు. ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు ఎన్‌టీఆర్‌ ట్రస్టు, మెగా ఇంజనీరింగ్‌ సంస్థలతో మాట్లాడి రాజధాని గ్రామాలన్నింటికీ ఎన్‌టీఆర్‌ సుజల పథకం ద్వారా మినరల్‌ వాటర్‌ పంపిణీకి ఒప్పించారు.
 
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎన్‌టీఆర్‌ సుజల పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్‌టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఇది నిర్వహణలో ఉన్నది. కుప్పంలో వలే తొలుత వెంకటపాలెంలో రూ. 4కోట్లు ఖర్చు చేసి మాస్టర్‌ ఆర్‌వో ప్లాంట్‌ని నిర్మించారు. అక్కడ శుద్ధిచేసిన నీటిని తొలుత పైపులైన్ల ద్వారా రాజధాని గ్రామాల్లో నిర్మించిన మినీ ట్యాంకులకు పంపింగ్‌ చేసి అక్కడినుంచి ప్రజలకు విక్రయించాలని భావించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నందున ఆయా గ్రామాల్లోని మినీ ట్యాంకులకు ట్యాంకర్ల ద్వారా వెంకటపాలెంలో శుద్ధిచేసిన నీటిని తీసుకెళ్లి నింపుతున్నారు.
 
ప్రతీ గ్రామంలో అన్ని కుటుంబాలకు స్మార్ట్‌కార్డులు పంపిణీ చేశారు. ఆ కార్డుని యంత్రంలో పెట్టి మీట నొక్కితే చాలు రూ.2 కార్డు బ్యాలెన్స్‌లో మినహాయింపు జరిగి 20లీటర్ల నీరు వస్తుంది. స్మార్ట్‌కార్డులో బ్యాలెన్స్‌ అయిపోతే ప్లాంట్‌ నిర్వాహకులే వచ్చి డబ్బులు చెల్లించుకొని మళ్లీ బ్యాలెన్స్‌ ఎక్కిస్తున్నారు. ఇలా రోజుకు ఎన్ని లీటర్ల నీటిని అయినా తీసుకొనే వెసులుబాటును కల్పించారు. వెంకటపాలెంతోపాటు హరిశ్చంద్రా పురంలోనూ వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణం చేశారు. దీని నుంచి హరిశ్చం ద్రాపురం, బోరుపాలెం, వడ్డమాను, అనంతవరం, నెక్కల్లు, బోరుపాలెం గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
Link to comment
Share on other sites

ఎల్‌ఎస్‌ఈలో అమరావతిపై ఉపన్యాసాలు!
31-05-2018 09:10:10
 
636633546165760306.jpg
  • విద్యార్థులకు రాజధాని విశిష్టతలపై అవగాహన
  • వచ్చేనెల 4నుంచి 8వరకూ పీపీపీలతో వివరణ
  • సీఆర్డీయే అధికారులకు లండన్‌ వర్సిటీ ఆహ్వానం
అమరావతి(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ (ఎల్‌ఎస్‌ఈ) విద్యార్థులు అమరావతి రూపకల్పనకు సంబంధించిన విశేషాలను తెలుసుకోనున్నారు. పకడ్బందీ ప్రణాళికతో, ప్రజల భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న అమరావతి వంటి గ్రీన్‌ఫీల్డ్‌ క్యాపిటల్‌ సిటీకి సంబంధించిన ప్రత్యేకతలను తమ విద్యార్థులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ వర్సిటీ ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులను లండన్‌కు ఆహ్వానించింది. సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ప్లానింగ్‌, రవాణా వ్యవస్థ డైరెక్టర్లు ఆర్‌.రామకృష్ణారావు, అరవింద్‌ తదితర అధికారులు వచ్చేనెల 2న ఇక్కడినుంచి బయల్దేరి వెళ్లనున్నారు.
 
ఎల్‌ఎస్‌ఈలో ఉపన్యాసాల అనంతరం వచ్చేనెల 9న తిరిగి రానున్నారు. మన రాజధాని ఏఏ అంశాల్లో ప్రపంచంలోని పలు నగరాలతో పోల్చితే అత్యుత్తమంగా, అధునాతనంగా ఉండబోతోందనే అంశాలపై 4 నుంచి 8వ తేదీ వరకు మొత్తం 5 రోజుల పాటు అధికారులు వివరించనున్నారు. ప్రధానంగా అమరావతికి సంబంధించిన ఆర్థికాంశాలు, అక్కడ అభివృద్ధి చెందబోతున్న ఆర్థిక కార్యకలాపాల గురించి తెలియజేస్తారని తెలుస్తోంది. మరెక్కడా జరగని విధంగా రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలకు పైగా భూసమీకరణ ప్రాతిపదికన సేకరించడం నుంచి మాస్టర్‌ ప్లాన్ల తయారీ, థీమ్‌ సిటీలు, ప్రతిపాదించిన వివిధ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు, పర్యావరణ పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యం, జల వనరుల అభివృద్ధి, కార్పొరేట్‌ స్ర్టీట్‌ తదితరాల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ల ద్వారా వివరించబోతున్నట్లు సమాచారం. సీఆర్డీయే ఉన్నతాధికారుల పర్యటన ముగిసిన కొద్ది వారాల తర్వాత అమరావతిని స్వయంగా పరిశీలించేందుకు ఎల్‌ఎస్‌ఈ విద్యార్థులు రాష్ట్రానికి రానున్నారు.
 
 
 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...