Jump to content

Amaravati


Recommended Posts

ఏపీ-సింగపూర్‌ మధ్య చారిత్రక ఒప్పందం: ఈశ్వరన్‌
07-06-2018 13:48:18
 
636639761070418193.jpg
 
అమరావతి: ఆంధ్రప్రదేశ్-సింగపూర్‌ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరిందని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ పేర్కొన్నారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఆయన భేటీ అయ్యారు. ఇరువురి మధ్య స్నేహపూరిత సంబంధాలు, భాగస్వామ్యాలు, ఒప్పందాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. అనంతరం ఈశ్వరన్ మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఒప్పందాలు చేసుకున్నామన్నారు. విస్తృత ప్రయోజనాల కోసం ఏపీతో కలిసి పనిచేస్తామన్నారు. అమరావతి పార్టనర్‌షిప్‌ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. వరల్డ్‌ సిటీ సమ్మిట్‌లో అమరావతి నిర్మాణాన్ని ప్రస్తావిస్తామని ఈశ్వరన్‌ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

జులై నుంచి విజయవాడ-సింగపూర్‌ విమాన సేవలు

010844070618BRK80A.JPG

విజయవాడ: నవ్యాంధ్ర ప్రజలకు శుభవార్త. జులైలో విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చే నెలలో విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సేవలు ప్రారంభించనున్నట్లు సింగపూర్‌ సమాచార శాఖ మంత్రి ఈశ్వరన్‌ ప్రకటించారు.

రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా సింగపూర్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న మూడో అత్యున్నత సమావేశాల్లో పాల్గొనేందుకు సింగపూర్ సమాచార శాఖ మంత్రి ఈశ్వరన్ గురువారం ఉదయం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. అమరావతిలో స్టార్టప్‌ ప్రాంతం ‘ ఫేజ్‌ జీరో’ అభివృద్ధిపై ఇరువురు చర్చించారు. ఏడీపీ, సింగపూర్‌ కన్సార్షియం మధ్య అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌ సిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు తెలిపారు.

సింగపూర్‌ సంస్థలు ముందుకొస్తే ఈ ప్రాజెక్టు మరింత వేగవంతమవుతుందన్నారు. అమరావతికి బృహత్‌ ప్రణాళిక ఇచ్చిన సింగపూర్‌... నిర్మాణంలోనూ భాగస్వామ్యం వహిస్తోందన్నారు.

Link to comment
Share on other sites

అంకురించిన అభివృద్ధి
‘సింగపూర్‌’ పనులిక  వేగవంతం
  కీలక ఒప్పందాలపై సంతకం
  ఇదో చరిత్రాత్మక దినం
  ఇక ప్రతి 3 నెలలకు పురోగతి
  సీఎం చంద్రబాబు వెల్లడి
  6 నెలల్లో ఒక రూపు
సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ వెల్లడి
7ap-main4a.jpg
ఇదో చరిత్రాత్మక దినం. అన్ని ప్రక్రియలనూ పూర్తి పారదర్శకంగా నిర్వహించాం. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి ఒప్పందాల ప్రక్రియలన్నీ పూర్తి చేసి ఇప్పుడు కార్యాచరణలోకి దిగుతున్నాం. ఇకపై కచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించుకుని సకాలంలో వాటిని పూర్తి చేస్తాం. ప్రతి 3 నెలలకు క్షేత్ర స్థాయిలో పురోగతి కనిపిస్తుంది.
                               - ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈ రోజు ముఖ్యమైన మైలురాయిని దాటాం. అంకుర ప్రాంత అభివృద్ధి ప్రణాళికల అమలుకు ఈ రోజు చేసుకున్న రెండు ఒప్పందాలు చాలా కీలకం. అన్నీ జాగ్రత్తగా చూసుకోవడంవల్ల కొంత సమయం పట్టింది. వెల్‌కం సెంటర్‌ (ఫేజ్‌ జీరో) నిర్మాణంతో ప్రాజెక్టు ప్రారంభిస్తాం. మరో 6 నెలల్లో చాలా పురోగతి కనిపిస్తుంది.
           - సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌
ఈనాడు - అమరావతి
అమరావతి అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. అత్యంత కీలకమైన 1691 ఎకరాల అంకుర ప్రాంత అభివృద్ధి శ్రీకారం చుట్టుకుంది. న్యాయ, ఆర్థికపరమైన అడ్డంకులను దాటుకుని వచ్చిన ఈ ప్రాజెక్టు అత్యంత వేగంగా పూర్తయ్యేలా సింగపూర్‌ సంస్థలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం రెండు కీలక ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సింగపూర్‌ కమ్యూనికేషన్లు, సమాచారశాఖల మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ సమక్షంలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులు, సింగపూర్‌ సంస్థల డైరెక్టర్లు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం అంకుర ప్రాంతంలో ఉత్ప్రేరకాభివృద్ధిలో భాగంగా త్వరలోనే ‘ఫేజ్‌ జీరో’ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు సింగపూర్‌ సంస్థలు ప్రకటించాయి. సింగపూర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం కోసం ఏర్పాటైన సంయుక్త కార్యాచరణ అమలు కమిటీ (జేఐఎస్‌సీ) మూడో సమావేశం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో గురువారం జరిగింది. మొదట చంద్రబాబు, ఈశ్వరన్‌ మధ్య ముఖాముఖి చర్చలు, అనంతరం జేఐఎస్‌సీ సమావేశం జరిగాయి. సమావేశంలో సింగపూర్‌, విజయవాడ మధ్య నేరుగా విమాన సర్వీసులు, ఏటా 10వేల మందికి శిక్షణనిచ్చేలా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు, వచ్చే నెలలో సింగపూర్‌లో జరిగే వరల్డ్‌ సిటీస్‌ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్‌ భాగస్వామ్యం వంటి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఒప్పందాలు జరిగాయి. ఆ తర్వాత చంద్రబాబు, ఈశ్వరన్‌ విలేకరులతో మాట్లాడారు. అంకుర ప్రాంత అభివృద్ధికి ఈ రోజు నుంచి లెక్కింపు (జీరో డేట్‌ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌) మొదలైందని చంద్రబాబు ప్రకటించారు. ‘రాజధానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకునేందుకు ఉత్ప్రేరకాభివృద్ధి ఒక ప్రధాన మాధ్యమం. మౌలిక వసతులు, పర్యాటకం, విద్య, సేవారంగాల్లో సమీకృతాభివృద్ధికి సింగపూర్‌ కన్సార్టియం సహకారం కావాలి’ అని కోరారు. ఏపీకి సింగపూర్‌ వంటి రాజధాని నిర్మిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పానని, అధికారంలోకి వచ్చిన వెంటనే సింగపూర్‌ వెళ్లి రాజధాని నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరానని తెలిపారు.

పారిశ్రామికాభివృద్ధిపైనా దృష్టి: ఈశ్వరన్‌
‘ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ, ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధిపైనా మేం దృష్టి పెడుతున్నాం. ఆహారం, వ్యవసాయం, రవాణా, పట్టణ ప్రణాళికా రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందించేందుకు సింగపూర్‌లో ప్రత్యేకంగా అమరావతి పార్టనర్‌షిప్‌ కార్యాలయం (ఏపీవో) ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్‌కు కంపెనీలను తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. జులైలో సింగపూర్‌లో వరల్డ్‌ సిటీస్‌ సమ్మిట్‌లో చంద్రబాబు పాల్గొంటారు. అమరావతి గురించి వివిధ దేశాలకు వివరించేందుకు అదో మంచి అవకాశం’ అని ఈశ్వరన్‌ పేర్కొన్నారు.

సింగపూర్‌కు నెల రోజుల్లో విమానం..
‘జులై 8న సింగపూర్‌ నుంచి వచ్చిన విమానం గన్నవరం విమానాశ్రయంలో దిగాలి. దీనికి అవసరమైన అన్ని ప్రక్రియలూ పూర్తి చేయండి’ అని జేఐఎస్‌సీ సమావేశంలో అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మౌలిక వసతులపరంగా అంతా సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని గన్నవరం విమానాశ్రయం డైరెక్టరు మధుసూదనరావు తెలిపారు.

10 వేల మందికి శిక్షణనిచ్చేందుకు ‘మెష్‌’
ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), సింగపూర్‌కు చెందిన స్కిల్స్‌ ఎస్‌జీ వెంచర్స్‌ కన్సార్షియం సంయుక్త భాగస్వామ్యంలో మల్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ స్కిల్స్‌ హబ్‌ (మెష్‌) ఏర్పాటవుతుంది. నెల రోజుల్లోనే కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మొదట లక్ష చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో దీన్ని ప్రారంభిస్తారు. రెండో దశలో 5 లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తారు. ఏటా 10వేల మందికి శిక్షణనివ్వడం దీని లక్ష్యం. జేఐఎస్‌సీ భేటీ ముగిసిన వెంటనే సింగపూర్‌ ప్రతినిధులతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో కోగంటి సాంబశివరావు సమావేశమై చర్చలు జరిపారు. భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

జులై 8న సింగపూర్‌కు చంద్రబాబు
సింగపూర్‌లో జులై 8 నుంచి 10 వరకూ జరిగే వరల్డ్‌ సిటీస్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును ఈశ్వరన్‌ ఆహ్వానించారు. దీనికి ఆయన అంగీకారం తెలిపారు. జులై 8న జరిగే మేయర్స్‌ ఫోరంలోనూ, 9న ప్రారంభ ప్లీనరీ సెషన్‌లోనూ సీఎం ప్రసంగిస్తారు. జులై 10న సీఆర్‌డీఏ కమిషనరు ఈ సదస్సులో పాల్గొని అమరావతి గురించి వివరిస్తారు. అమరావతి ప్రణాళిక, అభివృద్ధిని ప్రదర్శించేందుకు ఒక పెవిలియన్‌ను కేటాయిస్తారు.

సంతకాలు చేసింది వీరే..
భాగస్వాముల ఒప్పందంపై ఏడీసీ తరపున సీఎండీ లక్ష్మీ పార్థసారధి, ఎస్‌ఏఐహెచ్‌ డైరెక్టర్‌ వినమ్ర శ్రీవాస్తవ సంతకాలు చేశారు. కాడాపై సీఆర్‌డీఏ తరపున కమిషనరు శ్రీధర్‌, ఏడీపీ తరపున డైరెక్టర్‌ టియో బాన్‌ సెంగ్‌ (కెల్విన్‌ టియో) సంతకాలు చేశారు.

ముఖ్యమంత్రికి ‘రాజధాని స్కెచ్‌’ల బహూకరణ
ఈశ్వరన్‌కు చంద్రబాబు గౌతమ బుద్ధుడు ధ్యానముద్రలో ఉన్న బొమ్మను బహుమతిగా అందజేశారు. రాజధాని ప్రాంతంలోని ప్రజల జీవన విధానంపై సింగపూర్‌కు చెందిన నిపుణులు వేసిన స్కెచ్‌లతో రూపొందించిన చిత్రపటాన్ని చంద్రబాబుకు ఈశ్వరన్‌ అందజేశారు.

7ap-main4b.jpg
ఒప్పందాలివీ..
* అంకుర ప్రాంత అభివృద్ధికి సంబంధించి సింగపూర్‌ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్స్‌ హోల్డింగ్స్‌ (ఎస్‌ఏఐహెచ్‌), అమరావతి అభివృద్ధి సంస్థల (ఏడీసీ) మధ్య భాగస్వాముల (షేర్‌ హోల్డర్స్‌) ఒప్పందం.
* ఎస్‌ఏఐహెచ్‌, ఏడీసీ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పడిన ఏడీపీతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) రాయితీ, అభివృద్ధి ఒప్పందం.

జేఐఎస్‌సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చర్చలకు వచ్చిన మరిన్ని ముఖ్యాంశాలు..
* అంకుర ప్రాంతంలో ఫేజ్‌ జీరో ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్న వెల్‌కం గ్యాలరీ, సందర్శకుల కేంద్రం, ప్రదర్శన కేంద్రాలకు సంబంధించి ఊహాత్మక చిత్రాలను ఏడీపీ ప్రదర్శించింది. వచ్చే ఏడాది ఆరంభం నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని ఏడీపీకి ఈశ్వరన్‌ సూచించారు.
* మాధ్యమిక, ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్ని ‘స్టూడెంట్‌ ఎక్స్ఛేంజ్‌’ కార్యక్రమం కింద సింగపూర్‌ పంపుతామని ముఖ్యమంత్రి ప్రతిపాదించగా ఈశ్వరన్‌ అంగీకారం తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్‌లో ‘కనస్ట్రక్షన్‌ మెటీరియల్‌ సిటీ’ ఏర్పాటు చేస్తున్నామని, సింగపూర్‌ సంస్థలు ముందుకొస్తే ప్రాజెక్టు వేగవంతమవుతుందని సీఎం పేర్కొన్నారు.
* అమరావతిలో హరిత భవనాల ఆవశ్యకతపై సింగపూర్‌కు చెందిన బిల్డింగ్‌ అండ్‌ కనస్ట్రక్షన్‌ అథారిటీ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. 2030 నాటికి సింగపూర్‌లోని 80 శాతం భవనాల్ని హరిత ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది.
* ఏపీ- సింగపూర్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటుపై చర్చ జరిగింది. సింగపూర్‌ బిజినెస్‌ ఫెడరేషన్‌ (ఎస్‌బీఎఫ్‌), సీఐఐ కలిసి దీన్ని ఏర్పాటు చేస్తాయి.
* అమరావతిలో వినూత్నమైన పట్టణ నిర్వహణ విధానాల్ని అమలు చేసేందుకు ఇన్నోవేషన్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తారు.
* ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ మధ్య విస్తృత సహకారానికి అవకాశమున్న నాలుగు రంగాలను ఏపీవో, ఏపీఈడీబీ గుర్తించాయి. అవి. 1.నిర్మాణ, అర్బన్‌ సొల్యూషన్‌ రంగాలు. 2. రవాణా, అనుసంధానత 3. వ్యవసాయ, ఆహార శుద్ధి 4. పర్యాటకం. వీటిపై జేఐఎస్‌సీ సమావేశంలో చర్చ జరిగింది.

 
 
 

 

Link to comment
Share on other sites

ఎకరం రూ.4 కోట్లు!
అంకుర ప్రాంతంలో తొలి దశలో  కనీస ధర ఇది
  అంతకంటే తక్కువకు విక్రయించ కూడదు
  70 శాతం విక్రయించి, పెట్టుబడులు వచ్చాకే రెండో దశ అభివృద్ధి
  ఏడీపీకి సీఆర్‌డీఏ షరతులు
ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలోని అంకుర ప్రాంతంలో మౌలిక వసతులు అభివృద్ధి చేసిన తర్వాత ప్రతి ఎకరం కనీస విలువ రూ.4 కోట్లకు తగ్గకుండా విక్రయించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) షరతు విధించింది. 1691 ఎకరాల్లో అంకుర ప్రాంత ప్రధాన అభివృద్ధిదారుగా వ్యవహరిస్తున్న అమరావతి డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్‌ (ఏడీపీ)తో సీఆర్‌డీఏ గురువారం అభివృద్ధి, రాయితీ ఒప్పందం చేసుకుంది.  సింగపూర్‌ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌(ఎస్‌ఏఐహెచ్‌), రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అంకుర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సంయుక్తంగా ఏడీపీని నెలకొల్పిన విషయం తెలిసిందే. ఏడీపీలో ఎస్‌ఏఐహెచ్‌కి 58 శాతం, ఏడీసీకి 42 శాతం వాటా ఉంది. ఏడీపీకి ఎస్‌ఏఐహెచ్‌ రూ.306 కోట్లు, ఏడీసీ రూ.222 కోట్లు తమ మూలధన వాటాగా జమచేయాలి. మిగతా నిధుల్ని వివిధ బ్యాంకులు, రుణ వితరణ సంస్థల నుంచి ఏడీపీ సమకూర్చుకుంటుంది.

* మొత్తం 1691 ఎకరాల్ని మూడు దశల్లో, 15 ఏళ్ల వ్యవధిలో ఏడీపీ అభివృద్ధి చేస్తుంది. తొలి దశలో 656 ఎకరాలు, రెండో దశలో 514 ఎకరాలు, మూడో దశలో 521 ఎకరాలు అభివృద్ధి చేయాలి.
* ప్రతి ఐదేళ్లకు ఒక దశ అభివృద్ధిని పూర్తి చేయాలి.
* 1691 ఎకరాలపై ఏడీపీకి సీఆర్‌డీఏ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) మాత్రమే ఇస్తుంది. యాజమాన్య హక్కు సీఆర్‌డీఏ వద్దే ఉంటుంది.
* అంకుర ప్రాంత అభివృద్ధి, మార్కెటింగ్‌, కొనుగోలుదారులతో విక్రయ, లీజు ఒప్పందాలు చేసుకునేందుకే ఏడీపీకి అధికారం ఉంటుంది. తుది సేల్‌ డీడ్‌పై సీఆర్‌డీఏనే సంతకం చేస్తుంది. అప్పుడే అది చెల్లుబాటవుతుంది.
* ప్రతి దశలో అభివృద్ధి చేసిన భూమిలో 70 శాతం విక్రయించి, పెట్టుబడులు తీసుకొచ్చినప్పుడే తదుపరి దశ అభివృద్ధి మొదలవుతుంది.
* అంకురప్రాంతంలో ఏడీపీ ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించాలి. వివిధ రంగాలకు చెందిన అగ్రశ్రేణి సంస్థల్ని ఆకర్షించాలి.
* అభివృద్ధి చేసిన ప్లాట్లను వేలం ద్వారాగానీ, సంప్రదింపుల ద్వారాగానీ విక్రయించాలి. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలకు, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సంస్థలకే విక్రయించాలి.
* మొదటి దశలో విక్రయించే భూముల కనీస ధర ఎకరానికి రూ.4 కోట్లకు తగ్గకూడదు. రెండు, మూడు దశల్లో భూముల కనీస ధరను ఏడీపీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో ఏర్పాటయ్యే కమిటీ నిర్ణయిస్తుంది.

ఒప్పందంలో ప్రధానాంశాలు..
ఎస్‌ఏఐహెచ్‌, ఏడీసీ మధ్య గురువారం భాగస్వాముల (షేర్‌ హోల్డర్స్‌) ఒప్పందం జరిగింది.
* ఏడీపీలో మొత్తం ఆరుగురు డైరెక్టర్లు ఉంటారు.  రాష్ట్ర ప్రభుత్వం నియమించినవారు ఇద్దరుంటారు.
* ప్రాజెక్టుకి సంబంధించిన వార్షిక వ్యాపార ప్రణాళిక, బడ్జెట్‌, ఆర్థిక ప్రణాళికలను ఏడీపీ బోర్డు ఆమోదించాలి.
* కంపెనీల చట్టం ప్రకారం భాగస్వామ్య కంపెనీలకు వర్తించే నిబంధనలన్నీ ఏడీపీకి వర్తిస్తాయి.

అంకుర ప్రాంత అభివృద్ధిలో ప్రధాన లక్ష్యాలు...
* రాజధానిలో ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చి, ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించడం ద్వారా మొత్తం రాజధానికి ప్రమాణాలు నిర్దేశించడం.
* ప్రాజెక్టు మొదలైన మూడేళ్లలోగా 8.07 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం కలిగిన బహుళ ప్రయోజకర భవనాల్ని నిర్మించాలి.
* ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు నుంచి పది ప్రధాన కంపెనీల్ని  ఆకర్షించాలి. 2-3 పారిశ్రామిక/వాణిజ్య క్లస్టర్లను ఈ ప్రాంతానికి తీసుకురావాలి.
* 15 ఏళ్ల వ్యవధిలో 2.50 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించాలి.
* అమరావతిలో సింగపూర్‌ ప్రభుత్వం ప్రాజెక్టు ఫెసిలిటేషన్‌ ఆఫీసు (పీఎఫ్‌ఓ) ఏర్పాటు చేయాలి.
* ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ (ఏపీఐపీఏ), కేపిటల్‌ రీజియన్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ (క్రిపా)లను ఏర్పాటు చేయాలి.

Link to comment
Share on other sites

అమరావతి ఆరంభం
08-06-2018 02:57:29
 
636640234581226081.jpg
  • సింగపూర్‌ కన్సార్షియంతో స్టార్టప్‌ ఏరియాపై ఒప్పందాలు
  • వేగంగా పట్టాలెక్కనున్న పనులు
  • 15ఏళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు
  • సింగపూర్‌ను మించి అభివృద్ధి: సీఎం
అమరావతి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణంలో మరో అడుగు పడింది. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి సంబంధించిన రెండు ప్రధాన ఒప్పందాలపై సింగపూర్‌, ఆంధ్రప్రదేశ్‌ మధ్య గురువారం సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ పాల్గొన్నారు. 6.84 చ.కి.(1691 ఎకరాలు)లో స్టార్టప్‌ ఏరియాను అభివృద్ధి పరుస్తారు. అమరావతిని ప్రపంచశ్రేణి ఆర్థిక నగరంగా, బ్రహ్మాండమైన వాణిజ్య ప్రదేశంగా మార్చేందుకు ఒప్పందాలు బాటలు వేయబోతున్నాయి. భారీసంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఉపకరించే ఈ ప్రాజెక్టును స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో సింగపూర్‌ కన్సార్షియం గతంలోనే దక్కించుకున్న సంగతి తెలిసిందే. 3 దశల్లో, 15 సంవత్సరాల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో ఏడీసీకి 48%, సింగపూర్‌ ప్రభుత్వానికి చెందిన అమరావతి సింగపూర్‌ ఇన్వెస్ట్ మెంట్స్‌ హోల్డింగ్స్‌కు 52% భాగస్వామ్యం ఉంటుంది.
 
 
తొలిదశలో భాగంగా 1691 ఎకరాల్లోని 646 ఎకరాలను ఐటీ, బ్యాంకింగ్‌, రిటైల్‌, బిజినెస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర రంగాల కోసం కన్సార్షియం అభివృద్ధి చేస్తుంది. సుప్రసిద్ధ వర్తక, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు వచ్చేలా చొరవ తీసుకుంటుంది.షేర్‌హోల్డర్స్‌ ఒప్పందంపై సింగపూర్‌ అమరావతి ఇన్వెస్ట్ మెంట్స్‌ హోల్డింగ్స్‌ (ఎస్‌.ఎ.ఐ.హెచ్‌.), అమరావతి డెవలప్ మెంట్‌ పార్ట్‌నర్స్‌ (ఏడీపీ) ప్రతినిధులతోపాటు ఏడీసీ సీఎండీ డి. లక్ష్మీ పార్థసారధి, కన్సెషన్‌ అండ్‌ డెవలప్ మెంట్‌ అగ్రిమెంట్‌ (‘కాడా’)పై ఎస్‌.ఎ.ఐ.హెచ్‌., ఏడీపీ ప్రతినిధులు, ఏపీసీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ సంతకాలు చే శారు. ఆంధ్రప్రదేశ్‌- సింగపూర్‌ ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ (జేఐఎస్ సీ) 3వ సమావేశం విజయవాడలో నిర్వహించగా అందులోనే సంతకాలు జరిగాయి. వివిధ రంగాల్లో ఇప్పటి వరకూ చేసిన కృషిని సమీక్షించడంతోపాటు దానిని మరింత ముందుకు తీసుకెళ్లడంపై విస్తృతంగా చర్చించారు. స్టార్టప్‌ ఏరియా ద్వారా 15 ఏళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు, రూ.10వేల కోట్ల మేరా పన్నులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
 
 
ఇది చారిత్రాత్మకం: చంద్రబాబు
ఒప్పందాలపై సంతకాల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ అమరావతి చరిత్రలో ఈ రోజు నిలిచిపోతుందన్నారు. అమరావతి సింగపూర్‌ మాదిరిగా కాదు, దానికంటే అద్భుతంగా రూపుదిద్దుకోవడం తథ్యమని ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణం ఈ ఒప్పందాలతో పరుగులు తీస్తుందన్నారు. ఇప్పటి వరకూ చర్చలు, ప్లానింగ్‌లకే పరిమితమైన స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి మొదలైందని, అది నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, సంపద సృష్టి, ఆర్థిక కార్యకలాపాలు అంతర్జాతీయస్థాయిలో జరిగేలా బాటలు వేస్తుందని పేర్కొన్నారు.
 
 
క్రమబద్ధమైన, ప్రణాళికాయుతమైన అభివృద్ధి, మార్కెటింగ్‌లలో పేరొందిన సింగపూర్‌ అనుభవాలు అమరావతిని కూడా అనతికాలంలోనే అగ్రగామిగా నిలిచేలా చేస్తాయన్నారు. విస్తారమైన నదీతీరం, అత్యుత్తమమైన మానవ వనరులు ఉన్న అమరావతి సింగపూర్‌ మాదిరిగా కాకుండా దానిని మించి అభివృద్ధి పరచేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయన్నారు. అన్ని అధికార లాంఛనాలు పూర్తయినందున సింగపూర్‌ కన్సార్షియం వెంటనే పనులు ప్రారంభిస్తుందని చెప్పారు. ఇకపై ప్రతి 3, 6, 9, 12 నెలలకు రాజధానిలో స్పష్టమైన పురోగతి కనిపించడం తథ్యమన్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌ ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.
 
గన్నవరం టు సింగపూర్‌ విమాన సర్వీసులు
గన్నవరం నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు.. వచ్చే నెలలో దీనికి శ్రీకారం చుట్టేందుకు ప్రణాళిక వేశారు. సింగపూర్‌లో జరిగే వరల్డ్‌ సిటీస్‌ సదస్సుకు మొదలయ్యేలా చూస్తామన్నారు. ఏ నగరమైనా అంతర్జాతీయస్థాయికి ఎదగాలంటే అంతర్జాతీయ ఎయిర్‌ కనెక్టివిటీ ప్రధానమని చంద్రబాబు చెప్పారు.
 
స్ఫూర్తిదాయకం: ఈశ్వరన్‌
రెండు కీలక ఒప్పందాలు జరిగిన ఈ రోజు సింగపూర్‌-ఆంధ్రప్రదేశ్‌ సంబంధాల్లో మైలురాయి లాంటిదని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ పేర్కొన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిలిపేందుకు ఒప్పందాలు దోహద పడతాయన్నారు. ఇప్పటికే విజయవాడలో ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించామని, ‘వెల్‌కం సెంటర్‌ ప్రాజెక్ట్‌’ పేరిట పనులను ముమ్మరంగా చేపడతామన్నారు. 6 మాసాల్లోనే వీటి ఫలితం కనిపిస్తుందని చెప్పారు. సింగపూర్‌ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అమరావతి రైతులు ప్రత్యక్ష పర్యటనల ద్వారా తెలుసుకున్న విధంగానే.. తమ విద్యార్థులు, ఉపాధ్యాయులను ఇక్కడికి పంపించి, రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుందో తెలుసుకునే వీలు కల్పిస్తామన్నారు. వరల్డ్‌ సిటీస్‌ సమిట్‌లోనూ అమరావతి ప్రస్తావిస్తామన్నారు. రాజధాని గ్రామాల జీవనాన్ని చిత్రీకరిస్తూ 30 మంది సింగపూర్‌ విద్యార్థులు రూపొందించిన చిత్రాలను ఈశ్వరన్‌ బహూకరించారు. 
Link to comment
Share on other sites

రాజధాని జిల్లాల్లో పెరిగిన రిజిస్ర్టేషన్ల టార్గెట్‌
08-06-2018 07:08:13
 
636640385018863833.jpg
  • విజయవాడ, గుంటూరులపైనే గురి
  • కృష్ణాకు రూ.715 కోట్లు..
  • గుంటూరుకు రూ.693.55 కోట్లు..
  • మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు ప్రణాళిక
విజయవాడ: రాజధాని ప్రాంతంలో కీలకమైన కృష్ణా, గుంటూరు జిల్లాల రిజిస్ర్టేషన్‌ లక్ష్యాన్ని గణనీయంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది. కృష్ణాజిల్లాకు ఓవరాల్‌గా రూ.715.39 కోట్ల లక్ష్యాన్ని విధించగా, గుంటూరు జిల్లాకు రూ.693.55 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. ర్యాపిడ్‌ గ్రోత్‌కు అవకాశం ఉన్న విజయవాడ నగరంతో పాటు, గుంటూరు నగరాలకు ఒక రకంగా భారీ టార్గెట్‌లనే నిర్దేశించింది. రానున్న రోజుల్లో అభివృద్ధి కావాల్సిన అమరావతి నగరానికి కూడా ఈ ఆర్థిక సంవత్సరం గణనీయంగా ఆదాయ టార్గెట్‌ను ఫిక్స్‌ చేసింది.
 
 
కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే.. 2018 - 19 ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా రూ.100 కోట్లు అదనంగా లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. వాస్తవంగా 2016 - 17 ఆర్ధిక సంవత్సరం కంటే రూ.100 కోట్లు తక్కువగానే నిర్దేశించినట్టు చెప్పుకోవాలి. 2016 - 17 ఆర్థిక సంవత్సరం కృష్ణా జిల్లాకు రూ.831.65 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేవలం రూ.531.59 కోట్ల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించటం జరిగింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో పెద్ద నోట్ల రద్దు జర గటంతో ఆ ప్రభావం కాస్తా రిజిస్ర్టేషన్స్‌పై భారీగానే చూపింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కిందటి ఆర్థిక సంవత్సరం 2017 - 18కు రాష్ట్ర ప్రభుత్వం రూ.637.15 కోట్ల టార్గెట్‌ను నిర్దేశించింది. కిందటేడాది ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్‌ను దాటుకుంటే రూ.638.77 కోట్ల ఆదాయాన్ని సాధించింది. దాదాపుగా రూ.కోటి ఆదాయాన్ని అదనంగా సాధించటం జరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సారి రూ.715.39 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగింది.
 
 
కృష్ణాజిల్లాలో మచిలీపట్నం, విజయవాడ, విజయవాడ ఈస్ట్‌ డివిజన్‌లు ఉన్నాయి. విజయవాడ డీఐజీ కార్యాలయం పరిధిలోకి ఈ మూడు డివిజన్లు వస్తాయి. మూడు డివిజన్లకు ముగ్గురు డి స్ర్టిక్ట్‌ రిజిస్ర్టార్లు ఉంటారు. రిజిస్ర్టేషన్స్‌ పరిభాషలో మాత్రం వీటిని డివిజన్లుగా కాకుండా జిల్లాలుగా భావిస్తాయి. ఈ క్రమంలో మచిలీపట్నం డివిజన్‌ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.137.83 కోట్ల ఆదాయాన్ని నిర్దేశించటం జరిగింది. మచిలీపట్నం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి అత్యధికంగా రూ.33.31 కోట్లు, గుడివాడ 24.31 కోట్లు, కానుమోలు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు రూ.12.17 కోట్ల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించట జరిగింది. అవనిగడ్డ, చల్లపల్లి, కవుతవరం, మొవ్వ, ముదినేపల్లి, పామర్రు, పెడన, బంటుమల్లి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో రూ.3 - 9 కోట్ల లోపు లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగింది.
 
 
విజయవాడ, రూరల్‌ ప్రాంతాల్లో..
విజయవాడ డివిజన్‌ పరిధిలో కిందటి సంవత్సరం ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్‌ కంటే అదనంగా సాధించటం జరిగింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రూ.337.30 కోట్ల టార్గెట్‌ను విధించటం జరిగింది. పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి అత్యధికంగా రూ.118.44 కోట్ల టార్గెట్‌ను నిర్ణయించారు. విజయవాడ రిజిస్ర్టార్‌ కార్యాలయం పరిధిలో రూ.98.32 కోట్లు, ఇబ్రహీంపట్నం, రూ.39.69 కోట్లు, నున్న రూ.24.08 కోట్లు, జగ్గయ్యపేట సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి రూ.23.94 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగింది. కంచికచర్ల నందిగామ రిజిస్ర్టేసన్‌ కార్యాలయాలకు రూ.18 కోట్ల లోపే లక్ష్యాన్ని నిర్దేశించారు. విజయవాడ ఈస్ట్‌ డివిజన్‌ పరిధిలో 240.26 కోట్ల లక్ష్యాన్ని విధించింది. గుణదల రూ.79.80 కోట్లు, కంకిపాడు రూ.45.47 కోట్లు, గన్నవరం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి రూ.39.81 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. తిరువూరు, నూ జివీడు, మైలవరం, విస్సన్నపేట సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యా లయాలకు రూ.8 - 23 కోట్ల లోపు లక్ష్యాన్ని విధించారు.
 
 
గతేడాది అసాధారణ ఆదాయం..
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కంటే కిందటి ఆర్థిక సంవత్సరంలో పలు చిన్న సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు అసాధారణ ప్రగతి చూపాయి. విజయవాడ డివిజన్‌ పరిధిలోకి వచ్చే జగ్గయ్యపేట సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి రూ.15.44 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా.. రూ.2704 కోట్ల మేర సాధించటం జరిగింది. అంటే 175.13 శాతం మేర ఆదాయం పెరిగింది. మచిలీపట్నం డివిజన్‌ పరిధిలోకి వచ్చే కానుమోలు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి రూ.9.87 కోట్ల ఆదాయాన్ని నిర్దేశించగా.. రూ.10.28 కోట్లను సాధించింది. అంటే 111.22 శాతం మేర ఆదాయం పెరిగింది. విజయవాడ ఈస్ట్‌ డివిజన్‌ పరిధిలోకి వచ్చే విస్సన్నపేట సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి రూ.9.87 కోట్లు నిర్దేశించగా.. రూ.11.34 కోట్లు సాధించటం జరిగింది. అంటే 115.65 శాతం మేర ఆదాయాన్ని సాధించటం జరిగింది.
 
 
గుంటూరుకు..
గుంటూరు డివిజన్‌కు అత్యధికంగా రూ.378.39 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగింది. ప్రధానంగా ఈ డివిజన్‌ పరిధిలోని మంగళగిరికి అత్యధికంగా రూ.90.87 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. గుంటూరు ఆర్‌ఓ కార్యాలయం పరిధిలో రూ.84.26 కోట్లు, నల్లపాడు రూ.59.73 కోట్లు, కొరిటెపాడు రూ.57.92 కోట్లు, పెదకాకాని రూ.38.05 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. చేబ్రోలు, పత్తిపాడు, తాడికొండలకు రూ.8 కోట్ల నుంచి రూ.25 కోట్ల లోపు లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగింది. ఆ తర్వాత నరసరావుపేట డివిజన్‌కు రూ.185.18 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగింది. ఇందులో నరసరావుపేట రూ.46.28 కోట్లు, చిలకలూరిపేట రూ.23.02 కోట్లు, సత్తెనపల్లి రూ.16.80 అమరావతి రూ.16.05 కోట్లు, గురజాల రూ.12.90 కోట్లు, బాపట్ల రూ.12.70 కోట్ల మేర లక్ష్యాఽన్ని విధించింది. ఇదే డివిజన్‌లో క్రోసూరు కాకుమాను, మాచర్ల, ఫిరంగిపురం, పెదకూ రపాడులకు రూ.6 - 7 కోట్ల మధ్యన లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగిది. తెనాలి డివిజన్‌ మొత్తంగా రూ.104. 68 కోట్లను ఈ సారి లక్ష్యంగా నిర్దేశించింది.
 
 
అమరావతి డివిజన్‌కు ..
అమరావతి రాజధాని కోర్‌ పరిధిలోకి వచ్చే అమరావతి డివిజన్‌ పరిధిలోకి అనంతవరం, మందడం, తుళ్ళూరు, ఉండవల్లి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు వస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఈ కార్యాలయాల పరిధిలో మొత్తం రూ.25.30 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగింది. అనంతరం రూ.2.48 కోట్లు, మందడం రూ.7.52 కోట్లు, తుళ్ళూరు రూ.7.65 కోట్లు, ఉండవల్లి రూ.7.65 కోట్ల మేర లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగింది.
division-lakshyam.jpg 
Link to comment
Share on other sites

మాకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చి తీరాల్సిందే..: తాడేపల్లి రైతులు
08-06-2018 07:23:33
 
636640394222135542.jpg
  • సీడ్‌యాక్సిస్‌ రోడ్డు నిర్వాసితులతో గుంటూరు జేసీ చర్చలు
తాడేపల్లి/విజయవాడ: తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి నుంచి అమరావతి వరకు వెళ్లే సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు మార్గంలో భూములు కోల్పోతున్న వారితో గుంటూరు జేసీ ఇంతియాజ్‌ గురువారం తాడేపల్లిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలువురు రైతులు, నేతలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో భూములు విలువైనవని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ గురించి రైతులకు, భాదితులకు జేసీ ఇంతియాజ్‌కు వివరించగా రైతులు, బాధితులు తిరస్కరించారు. ఈ సమావేశానికి రైతులు, పట్టాలు కలిగిన నివాస స్థలాలవారు 65 మంది హాజరు కావల్సివుండగా కేవలం 18 మంది మాత్రమే హాజరయ్యారు.
 
 
మిగిలిన వారి అభ్యంతరాలనూ సేకరిస్తామని జేసీ చెప్పారు. పలువురు రైతులు, ప్లాట్ల యజమానులు మాట్లాడుతూ విజయవాడలో ఏ ఆధారాలు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి గజానికి రూ.40 వేలు చెల్లించారని.. తమకు అలాంటి ప్యాకేజీలు ఇవ్వాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో బండ్ల శ్రీనివాసరావు, తహసీల్దార్‌ పద్మనాభుడు, డీటీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ఇదిగో అమరావతి ఆంధ్రుల ప్రగతి గీతి
amr-top1a.jpg
రాష్ట్ర విభజన జరిగిన తరువాత పరిపాలన తరలించడానికి విజయవాడలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరైన వసతి లేక బస్సులోనే పడుకున్నారు. బస్టాండ్‌ కన్నా అధ్వానంగా ఉందంటూ గన్నవరం విమానాశ్రయాన్ని చూసి అప్పటి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఆవేదన చెందారు. ఇరకుసందులు, గందరగోళంగా ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరులు కనిపించేవి.. ఎక్కడ ఉండాలో? పాలన ఎలా చేయాలో? అనే సందిగ్ధ పరిస్థితి.... ఇదంతా నాలుగేళ్ల క్రితం నాటి మాట...
మరి ఇప్పుడు
అమరావతి రాజధాని పరిధిలో అభివృద్ధి పరవళ్లు తొక్కుతోంది. ప్రధానంగా విజయవాడ, గుంటూరు నగరాల కేంద్రంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు సాగుతున్నాయి. గత నాలుగేళ్లలో ప్రారంభమైనన్ని ప్రాజెక్టులు.. గత శతాబ్ద కాలంలోనూ జరగలేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రూ.వందల కోట్ల పైవంతెనలు.. వేల కోట్ల విలువైన రహదారుల పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. మౌలికవసతులు, సుందరీకరణ పనులు, పర్యాటక ప్రాజెక్టులు చకచకా పూర్తవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు, సంస్థలు పదుల సంఖ్యలో కొలువు దీరాయి. దీంతో అన్ని రంగాల్లోనూ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే రాజధాని ప్రాంతం ప్రగతి పథంలో సాగుతోంది. ఐటీ రంగం, ప్రముఖ విశ్వ విద్యాలయాలు, తయారీ రంగం, పరిశ్రమలు ఇలా ఒకటేమిటి అనేక మౌలిక వసతులూ సమకూరుతున్నాయి.
- ఈనాడు, అమరావతి జిల్లా బ్యూరో
కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం..
ప్రాజెక్టు వ్యయం: రూ.237 కోట్లు
రాజధాని అమరావతి ప్రాంతానికి భవిష్యత్తులో వరద నీటి ముంపు లేకుండా ఉండేందుకు చేపడుతున్న ప్రాజెక్ట్‌ ఇది. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పనులను జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి.

ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం..
ప్రాజెక్టు వ్యయం: రూ.1535 కోట్లు
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయం తెలంగాణకు కేటాయించడంతో.. ఏపీ కోసం గుంటూరులో కొత్తగా నిర్మిస్తున్నారు. రూ.100 కోట్లతో ఇప్పటికే భవన నిర్మాణాలు పూర్తి చేసి.. విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. మరో రూ.200 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు.

దుర్గగుడి పైవంతెన...
ప్రాజెక్టు వ్యయం: రూ.448 కోట్లు
రాజధానిలో నిర్మిస్తున్న అతి పెద్ద పైవంతెన. రూ.448 కోట్లతో 2.5కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల పైవంతెన, దాని కిందన 5కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల రహదారి నిర్మాణం జరుగుతోంది. విజయవాడలోని భవానీపురం నుంచి చేపడుతున్న రహదారి నిర్మాణం ఇప్పటికే తుది దశకు చేరింది. పైవంతెన పనులు 65శాతం పూర్తయ్యాయి. 2019 జనవరి నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి తాజాగా ఆదేశించారు.

గన్నవరం విమానాశ్రయం...
ప్రాజెక్టు వ్యయం: రూ.320 కోట్లు
గన్నవరం విమానాశ్రయంలో రూ.160 కోట్లతో నూతన టెర్మినల్‌ భవనం పూర్తి చేశారు. మరో రూ.2.5 కోట్లతో పాత టెర్మినల్‌ భవనాన్ని అంతర్జాతీయ సర్వీసుల కోసం సిద్ధం చేశారు. ప్రస్తుతం రూ.150 కోట్లతో రన్‌వే విస్తరణ, ఇతర అభివృద్ధి పనులను చేపడుతున్నారు.

 
 
 

 

Link to comment
Share on other sites

ద్యరంగంపై ప్రత్యేక ముద్ర
amr-top2a.jpg
క్లిష్టతరమైన, అంతుచిక్కని వ్యాధులకు వైద్యసేవలు పొందాల్సి వస్తే వ్యయ, ప్రయాసలకోర్చి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు వెళితేతప్ప వారికి ఆ సేవలు అందేవి కావు.  ఒక్క సాధారణ ప్రజలే కాదు.. ప్రజాప్రతినిధులు సైతం తమకు అవసరమైన వైద్యసేవల కోసం నిమ్స్‌ను ఆశ్రయించేవారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్‌)ను నిమ్స్‌కు దీటుగా అభివృద్ధి చేస్తూ అన్ని రకాల వైద్యసేవలు స్థానికంగా అందేలా చొరవ తీసుకుంది. ఇంతేకాకుండా వైద్యరంగంలో ఎన్నో కీలక మార్పులు వచ్చాయి.
ఈనాడు-అమరావతి
రాజధాని అమరావతి పరిధిలో ఉన్న రెండు ప్రధాన ఆసుపత్రులను దశలవారీగా అభివృద్ధి పరుస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా తీసుకుంటున్న చర్యలు సామాన్యుల్లో ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకాన్ని కలిగించాయని చెప్పటంలో సందేహం లేదు. కొత్త భవనాలు, ఆధునిక వైద్య పరికరాలు సమకూరాయి. గుండె మార్పిళ్లు, బైపాస్‌ శస్త్రచికిత్సలు, మోకాళ్లు అరిగిపోయిన వారికి మోకీలు శస్త్రచికిత్సలు, మూత్ర పిండాల వ్యాధులతో బాధపడేవారికి డయాలసిస్‌ వంటి ఖరీదైన అనేక వైద్యసేవలు అందిస్తూ జీజీహెచ్‌ పేదల్లో చెరగని ముద్ర వేసుకుంది.    ప్రజలే కాదు.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు  సైతం గుంటూరు జీజీహెచ్‌ కేంద్రంగానే వైద్యసేవలు పొందుతూ  సర్కారీ వైద్యంపై ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

* 15 కిడ్నీ శస్త్రచికిత్సలు జరిగాయి. సగటున రోజుకు 50 మందికి తగ్గకుండా 24 గంటల పాటు డయాలసిస్‌ సేవలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో రెండేళ్ల కిందట ప్రస్తుత కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ మూడు రోజుల పాటు గుంటూరు జీజీహెచ్‌లోనే ఉండి మోకీలు మార్పిడి వైద్యసేవలు పొందారు. గుంటూరు జిల్లా పాలనాధికారి  కోన శశిధర్‌ దంపతులు అన్ని రకాల వైద్య పరీక్షలు జీజీహెచ్‌లోనే చేయించుకున్నారు.
రాజధానిలో భూ కేటాయింపులు

* బీఆర్‌ షెట్టి గ్రూప్‌నకు దొండపాడులో వైద్య విద్యాలయం, ఆసుపత్రి నిర్మాణానికి 200 ఎకరాలు కేటాయించేలా సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా తొలి విడతలో 50 ఎకరాలు కేటాయించింది. ఈ సంస్ధ రూ.2,500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. 1000 పడకలతో అత్యాధునిక  ఆసుపత్రి నిర్మాణం చేయనుంది. అదేవిధంగా కేన్సర్‌ వైద్యం కోసం ప్రత్యేక ఆసుపత్రి, యునానీ వైద్యం కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని 2018 డిసెంబరు నాటికి ఆసుపత్రి నిర్మాణం అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి. యూజీ, పీజీ వైద్య విద్య బోధనకు వైద్య కళాశాలను నెలకొల్పి 2019 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

* అమృతమయి విశ్వవిద్యాలయానికి కురగల్లులో 200 ఎకరాలు కేటాయించేలా ఒప్పందం జరిగింది. తొలివిడతలో ఈసంస్థకు 50 ఎకరాలు కేటాయించగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సంస్థ రూ.1500 కోట్ల పెట్టుబడితో వైద్య విద్యాలయంతో పాటు ఇంజినీరింగ్‌ కళాశాలను నెలకొల్పుతోంది. 250 పడకలతో ఆసుపత్రి అదేవిధంగా యోగా తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకోనుంది.  ఇంజినీరింగ్‌, వైద్య విద్యలో యూజీ, పీజీ విద్య బోధనకు వీలుగా పలు నిర్మాణాలు చేపడుతోంది.

* ఇండో- యూకే సంస్థకు రాజధాని ప్రాంతంలో 50 ఎకరాలు కేటాయించారు. ఈ సంస్థ కూడా వైద్యాలయాలను నెలకొల్పుతోంది. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించింది.
* ఆగిరిపల్లి ప్రాంతంలో  ఆధ్యాత్మిక గురువు పండిట్‌ రవి శంకర్‌ గురూజీ నేతృత్వంలో యోగాలయం నిర్మాణానికి ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. అభివృద్ధికి బాటలు  పడిందిలా..
* రూ.90 కోట్ల వ్యయంతో మాతా-శిశు సంరక్షణ ప్రత్యేక ఆసుపత్రి నిర్మాణం పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు.
* రూ.7 కోట్లతో సీనియర్‌ రెసిడెంట్లకు భవనాలు
* రూ.4 కోట్లతో పాత, కొత్త ఆసుపత్రులను కలుపుతూ సర్వీస్‌ బ్లాక్‌ నిర్మాణం
* రూ.4 కోట్లతో ముఖ్యమంత్రి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ నిధి కింద మంజూరు చేసిన నిధులతో పాత భవనాల ఆధునీకరణ పనులు
* రూ.2 కోట్లతో కరెంటుకు అంతరాయం లేకుండా అత్యాధునిక జనరేటర్ల కొనుగోలుకు నిధులు మంజూరీ
* రూ.50 కోట్లతో పాత జ్వరాల ఆసుపత్రిలో నర్సింగ్‌ కళాశాల నిర్మాణం
* రూ.2 కోట్లతో రోగుల సహాయకులకు విశ్రాంత మందిరం
* రూ.20 కోట్లతో  నాట్కో ట్రస్టు ఆర్థిక సహకారంతో ప్రత్యేక కేన్సర్‌ వార్డు నిర్మాణం
* విజయవాడ కొత్త ఆసుపత్రిలో రూ.150 కోట్లతో  సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు
* విజయవాడ, గుంటూరులో తల్లీ, శిశువులు తారుమారుకాకుండా ఆర్‌ఎప్‌ఐడీ ట్యాగ్‌లు వినియోగం

 
 
 
jillalu.png

 

Link to comment
Share on other sites

ఐదులోకి అడుగు!
విభజన ఉత్పాతం... హుద్‌హుద్‌ ఉపద్రవం.. బాలారిష్టాలను దాటుకుని.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ఈ నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. అమరావతి, పోలవరం, పట్టిసీమ.. ఇప్పుడీ ఎన్నికల ఏడాదిలో.. ఈ ప్రణాళికలు, పథకాలే అజెండాగా ప్రజల ముందుకు వెళ్లటం తథ్యం! అందుకే తెదేపా సర్కారు ఐదో ఏట అడుగుపెడుతున్న ఈ తరుణంలో కీలక పథకాలు, ప్రణాళికలేమిటి? వీటి విశిష్టతలేమిటన్న దానిపై లోతైన సమీక్ష..
ఎన్నికల ఏడాది..
పథకాల బాట మీదే.. పయనం!
7ap-main1b.jpgఅప్పుడంతా అయోమయం! విభజన ఉత్పాతం.. అది మోసుకొచ్చిన అనిశ్చితి.. ఈ బాలారిష్టాల్లోనే హుద్‌హుద్‌ వంటి ఉపద్రవాలు.. అయినా ‘అవశేషాంధ్ర’లా విలవిల్లాడకుండా..  విశ్వాసంతో నిబ్బరంగా నిలబడింది నవ్యాంధ్రప్రదేశ్‌! అంతేకాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలన్న లక్ష్యంతో పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. రాజధానిని అందమైన, అత్యాధునిక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు బృహత్‌ ప్రణాళిక సిద్ధం చేశారు. పట్టిసీమతో వడివడిగా జలకళ తెచ్చారు. చిరకాల స్వప్నమైన పోలవరం వేగం పెంచారు. ఈ-పాలనతో, మరెన్నో పథకాలతో ప్రజలందరినీ ప్రతిక్షణం పలకరిస్తున్నారు. ఇప్పుడీ ఎన్నికల ఏడాదిలో.. ఈ ప్రణాళికలు, పథకాలే అజెండాగా ప్రజల ముందుకు వెళ్లటం తథ్యం! దీంతో విపక్షాల చర్చోపచర్చలూ ఈ ఏడాదంతా వీటి చుట్టూనే తిరగటం సహజం! అందుకే తెదేపా సర్కారు ఐదో ఏట అడుగుపెడుతున్న ఈ తరుణంలో ఈ కీలక పథకాలు, ప్రణాళికలేమిటి? వీటి విశిష్టతలేమిటన్న సమీక్ష సముచితం, సందర్భోచితం!!
# 1: చంద్రన్న బీమా..నిరుపేదకు ధీమా
ఒకప్పుడు ఇంటి పెద్ద మరణిస్తే నిరుపేద కుటుంబాలు కుదేలయ్యే పరిస్థితి. చదువుకునే పిల్లలు అనాథలుగా మారి కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి. అలాంటి బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ‘చంద్రన్న బీమా’తో ధీమా నింపుతోంది. యజమాని మరణంతో కుంగిపోయిన కుటుంబానికి అండగా నిలుస్తోంది. అసంఘటిత రంగంలోని కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు పది రోజుల్లోనే రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి నిలదొక్కుకునేలా చేస్తుంది.  రాష్ట్రంలో 2.47 కోట్ల మంది అంటే దాదాపు సగం జనాభా ఈ పథకం పరిధిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటిలో అత్యంత విజయవంతమైన పథకమిది. బాధిత కుటుంబాల్లోని పిల్లలకు రూ.444 కోట్లు ఉపకార వేతనాలుగా అందాయి. 2015లో రవాణా రంగంలోని కార్మికుల కోసం ప్రారంభించిన ఈ పథకం అనంతరం అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ వర్తించేలా ప్రభుత్వం మార్పులు చేసింది.
* చంద్రన్న బీమా పథకంలో చేరాలంటే.. రూ.15 వేల కన్నా తక్కువ జీతం వచ్చే 18-70 ఏళ్ల మధ్య వయసున్న అసంఘటిత రంగంలోని కార్మికులంతా ఈ పథకానికి అర్హులు. ప్రజా, సాధికార సర్వేలో నమోదుచేసుకొని ఉండాలి.
* 18-50 ఏళ్ల మధ్య పాలసీదారుల సహజ మరణానికి రూ.2 లక్షలు, 51-60 ఏళ్ల మధ్య వారికి రూ.30 వేలు సహాయంగా అందుతాయి.
* ప్రమాద బాధితుల కుటుంబాల్లోని చదువుకునే పిల్లలకు ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకార వేతనం ఇస్తోంది. రెండేళ్లలో 37 లక్షల మందికి రూ.444 కోట్ల ఉపకార వేతనం అందింది.
* పూర్తి అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.2.50 లక్షలు ఇస్తున్నారు.
చంద్రన్న బీమా కింద గత రెండేళ్లలో 1.52 లక్షల కుటుంబాలకు రూ.2 వేల కోట్ల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.

ఎక్కడా మధ్యవర్తుల్లేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా పరిహారం చెల్లింపు మొత్తం పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తుండటం ఈ పథకం ప్రత్యేకత.

# 2: పోలవరం..నవ్యాంధ్రకు జీవనాడి
7ap-main1c.jpg
2014 జూన్‌
బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించే ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని 10 గిరిజన గ్రామాలు అక్కడ ఉన్నాయి. సరైన పునరావాసం, ప్యాకేజీ ఇస్తేనే ఊరు వదులుతామని గిరిజనులు తెగేసిచెబుతున్నారు. పనులు ఎలా చేస్తామని గుత్తేదారు ప్రశ్న. అవకాశం ఉన్నంతే చేయండి అంటూ అధికారుల నుంచి సమాధానం. ప్రాజెక్టు పనులు సాగకపోవడానికి ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్న దృశ్యం అది. పోలవరం పూర్తవుతుందనే నమ్మకం ఏ కోశానా లేని రోజులవి.

2018 జూన్‌ 8
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సగానికి పైగా పూర్తయింది. ఎంతో సవాలుతో కూడుకున్న గోదావరి అంతర్భాగ డ్యాంల నిర్మాణం కొలిక్కి వచ్చేసింది. దేశంలో ఇంతవరకూ ఎక్కడా నిర్మించనంతటి డయాఫ్రం వాల్‌ నిర్మాణం ఇక నాలుగు రోజుల్లో పూర్తి కానుంది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలలో పునాది పనులుగా పేర్కొనే జెట్‌ గ్రౌటింగ్‌ పనులు మూడొంతులకు పైగా పూర్తయ్యాయి. గడిచిన మూడేళ్లలో పోలవరంలో సాధించింది అంతా ఇంతా కాదు. స్పిల్‌ వే పనులు ఊపందుకున్నాయి. సమాంతరంగా ప్రాజెక్టుకు తలుపుల తయారీ కొలిక్కి వచ్చేసింది. మట్టి పని భారీ ఎత్తున జరిగింది.

* ఇక పోలవరం ఒక భరోసా. 2020 నాటికైనా ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు కాలువల్లో ప్రవహించడం ఖాయమనే నమ్మకం ఏర్పడుతోంది. 194.66 టీఎంసీల నీటిని నిల్వచేసే స్థాయిలో పునరావాసం పూర్తి కాకపోవచ్చేమో కానీ... 42.5 మీటర్ల స్థాయికి అన్ని పనుల్ని పూర్తిచేసి పోలవరంలో నీళ్లు నిలబెట్టి కాలువల ద్వారా మళ్లించే కల ఒక ఏడాది, రెండేళ్లలో సాకారమవుతుందనే నమ్మకాన్ని ఈ పనులు కల్పిస్తున్నాయి.
* పోలవరంపై ఇప్పటి వరకు చేసిన ఖర్చు  రూ.13,466 కోట్లు
* 2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రాష్ట్రం చేసిన ఖర్చు రూ.8330.55 కోట్లు
* కేంద్రం రాష్ట్రానికి తిరిగి ఇచ్చింది రూ.5342.26 కోటు
(మరో రూ.1400 కోట్లు తిరిగి ఇచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం)

ఇదీ ప్రాజెక్టు...
* నిల్వ సామర్థ్యం- 194.60 టీఎంసీలు 
* లైవ్‌ స్టోరేజీ- 75.20 టీఎంసీలు
* విద్యుదుత్పత్తి- 960 మెగావాట్లు 
* కృష్ణాకు నీటి మళ్లింపు- 80 టీఎంసీలు
* కొత్తగా నీరిచ్చేది- విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో 15.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు 
* విశాఖకు తాగు నీరు - 23.44 టీఎంసీలు
* ఆయకట్టు స్థిరీకరణ- 8 లక్షల ఎకరాలు(ఉభయ గోదావరి, కృష్ణా డెల్టాల్లో 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగం)
* తాగునీటి సౌకర్యం- 540 గ్రామాల్లోని 28.5 లక్షల మందికి
* ఇతర రాష్ట్రాలకు నీటి మళ్లింపు- ఒడిశాకు 5 టీఎంసీలు, ఛత్తీస్‌గఢ్‌కు 1.5 టీఎంసీలు

# 3: పరిశ్రమలు.. కొత్త ఒరవడి
పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. విభజన తర్వాత- గత నాలుగేళ్లలో ఏపీకి అనేక పరిశ్రమలు వచ్చాయి. కియా మోటార్స్‌, అపోలో టైర్స్‌, హీరో మోటార్స్‌.. ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఒక చరిత్ర. దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌ భారత్‌లో తన మొట్టమొదటి కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్రానికి రావటం విశేషం. ఈ యూనిట్‌ను కియా అనంతపురం జిల్లాలో రూ13,500 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ప్రభుత్వం ఎకరా రూ.6 లక్షల చొప్పున 580 ఎకరాలకుపైగా భూమిని కేటాయించింది. మౌలిక సదుపాయాలు, ఇతర రాయితీల కింద మరో రూ.650 కోట్లను ఖర్చు చేసింది. కియా మోటార్స్‌ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 11,000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. అపోలో టైర్స్‌, హీరో మోటార్స్‌తోనూ ఇలాంటి ప్రయోజనమే చేకూరనుంది.
కియా కార్ల యూనిట్‌ కోసం ఇతర రాష్ట్రాలూ ప్రయత్నించినా... చివరికి ఏపీనే నెగ్గింది.
# 4: పట్టిసీమ.. కరవు సీమలో నీటి కళ

కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంలో కీలక అధ్యాయం పట్టిసీమ ఎత్తిపోతల పథకం. నీళ్లు వృథాగా పోతున్న చోట నుంచి కరవుతో అల్లాడుతున్న చోటికి మళ్లించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ఒక్క కృష్ణా డెల్టాలోనే రూ.18 వేల కోట్ల పంటను రైతుల ఇళ్లకు చేర్చింది. గోదారమ్మకు రాయలసీమతో బంధమేసింది. రాయలసీమకు రూ.7,400 కోట్ల ప్రయోజనాన్ని అందించింది. గడిచిన మూడేళ్లలో కృష్ణా డెల్టాకు 138 టీఎంసీల నీళ్లిచ్చింది. శ్రీశైలం నుంచి దిగువకు నీరు వదలనవసరం లేకుండానే నేరుగా సీమ జిల్లాలకు నీటిని తరలించే భరోసా ఇచ్చింది. రెండేళ్లలో సీమకు ఏకంగా 200 టీఎంసీలను మించిన నీళ్లు ఇచ్చింది. చెరువులను నీళ్లతో నింపింది. వేసవి ఎద్దడిని తీర్చింది.

పట్టిసీమ ఇచ్చింది 160 టీఎంసీలు
గోదావరి వరదను 160 టీఎంసీలుగా పట్టిసీమ ఎత్తిపోసింది. పోలవరం కుడి కాలువ మార్గంలో పంటలకు, తాగునీటికి కొంత పోగా కృష్ణా డెల్టా పొలాల్లో 138 టీఎంసీలు పారింది. కృష్ణ నుంచి ప్రవాహాలే నామమాత్రమై శ్రీశైలంకూ చుక్కనీరూ దక్కని రోజుల్లో 10 లక్షలకు పైగా ఎకరాల్లో ఈ పథకం జీవం పోసింది. ఖర్చు పెట్టింది దాదాపు 1600 కోట్ల పైమాటే అయినా.. రూ.వేల కోట్ల పంటను ఇళ్లకు చేర్చింది. 2015-16 నుంచి గోదారమ్మ ఈ ఎత్తిపోతల రూపంలో ఎలా ఆదుకుందో గమనిస్తే....

రాయలసీమకూ ప్రాణాధారమై...
కృష్ణమ్మలో ప్రవాహాలు తగ్గిపోతున్న తాజా వాస్తవంలోనూ పట్టిసీమ రాయలసీమకు జీవాధారమవుతోంది. ఈ నీటి వల్ల రాయలసీమలోని అనేక చెరువులు, కాలువలు జలకళను సంతరించుకున్నాయి. జలాశయాల్లో నీటిని నింపగలిగారు. గత రెండు సంవత్సరాలుగా 100 టీఎంసీలకు పైగా నీటిని రాయలసీమకు శ్రీశైలం నుంచి ఇవ్వగలిగారు. 2016లో రూ.3060 కోట్ల పంట సాధించారు. 2017లో రూ.4300 కోట్ల వరకు దిగుబడులు వచ్చాయని ఒక అంచనా. తాగునీటి పథకాలకు రెండేళ్లలో నీటిని ఎత్తిపోయకుండా ఏటవాలుగా సరఫరా చేయడమూ వ్యయాన్ని తగ్గించి ప్రయోజనం కల్పించింది.
201718లో కృష్ణా డెల్టా కింద 1081608 ఎకరాలు సాగవ్వగా దానికోసం 118.01 టీఎంసీల నీరు అవసరమైంది. అందులో 85.66 టీఎంసీల నీరు ఒక్క పట్టిసీమ ద్వారానే అందటం విశేషం.

7ap-main1dd.jpg
 పరిశ్రమల పురోగతి
ఇప్పటికే ప్రారంభమైనవి 
* రూ.38,919 కోట్ల పెట్టుబడులతో.. 334 పరిశ్రమలు వచ్చాయి!
* 1,32,332 మందికి ఉపాధి దక్కింది.
 ప్రారంభానికి సిద్ధం
* రూ.1,512 కోట్లతో.. 14 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధం!
* వీటితో మరో 2,634 మందికి ఉపాధి తథ్యం!
 త్వరలో రానున్నవి
* మరో 153 పరిశ్రమల పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
* ఇవి ప్రారంభమైతే 1,73,618 మందికి ఉపాధి లభిస్తుంది.
 మున్ముందు
* 691 పరిశ్రమలు నెలకొల్పేందుకు ఇటీవలే సివిల్‌ పనులు మొదలయ్యాయి
మొత్తం నాలుగేళ్లలో
* రూ.4,55,692 కోట్లతో 1193 పరిశ్రమలు నెలకొల్పేందుకు ఒప్పందాలు జరిగాయి.
* వీటితో 13,53,655 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా
# 5: అమరావతి ఆంధ్రకు చుక్కాని
7ap-main1d.jpg
రాజధాని అమరావతి రూపంలో ఒక మహా నగరాన్ని నిర్మించే అవకాశం ఆంధ్రప్రదేశ్‌కు లభించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో కొత్తగా నిర్మిస్తున్న అతి పెద్ద నగరం ఇదే..! 217 చ.కి.మీ.ల విస్తీర్ణం(53,748 ఎకరాలు)లో అమరావతి నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలోని ఆధునిక నగరాలతో పోలిస్తే అత్యంత వేగంగా నిర్మాణం జరగడం అమరావతి ప్రత్యేకత. భూ సమీకరణ మొదలుపెట్టిన మూడున్నరేళ్లలోనే వివిధ ప్రణాళికలు, ఆకృతులు సిద్ధంచేసుకుని నిర్మాణాలూ ప్రారంభించారు. మరో ఆరు నెలల్లో రాజధానిలో నిర్మాణాలన్నీ పూర్తిస్థాయిలో మొదలవుతాయి. ప్రస్తుతం రూ.24 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. వచ్చే కొన్ని నెలల్లో మరో రూ.ఆరేడు కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అమరావతిని నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
* రైతులకు పదేళ్ల కౌలు చెల్లించడం, భూమిలేని పేదలకు నెలకు రూ.2500 చొప్పున పదేళ్లపాటు పింఛను, గూడులేని నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం వంటివి ఇక్కడి ప్రత్యేకతలు.
* మొత్తం సీఆర్‌డీఏ ప్రాంతానికి, రాజధాని అమరావతికి, సీడ్‌ కేపిటల్‌కు సింగపూర్‌ ప్రభుత్వం వేర్వేరుగా ప్రణాళికలు రూపొందించి ఇచ్చింది. ఇవన్నీ వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పకడ్బందీగా రూపొందించిన ప్రణాళికలు.
* 45.129 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాలను ప్రభుత్వం ఏడు నెలల్లో నిర్మించింది. 2017 మార్చిలో బడ్జెట్‌ సమావేశాలు మొదలుకొని శాసనసభ సమవేశాలూ ఇక్కడే నిర్వహిస్తోంది.
* రాజధానిలో 9 థీమ్‌ సిటీలు, 29 టౌన్‌షిప్‌లు ఉంటాయి. గ్రిడ్‌ ప్యాటర్న్‌లో టౌన్‌షిప్‌లను డిజైన్‌ చేశారు. కార్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్‌, వినోద కేంద్రాలు వంటి వసతులన్నీ... 10-15 నిమిషాల నడక దూరంలోనే ఉండేలా తీర్చిదిద్దడం విశేషం.
7ap-main1e.jpg
భేషుగ్గా భూ సేకరణ
* రైతుల నుంచి స్వచ్ఛందంగా భూములు తీసుకోవడానికి అమలుచేసిన భూ సమీకరణ విధానం దేశంలోనే వినూత్నం.
* 34 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. ఇంత భారీఎత్తున భూ సమీకరణ దేశంలో ఎక్కడా జరగలేదు.
* రైతులతో  స్వయంగా ముఖ్యమంత్రే పలు దఫాలు సంప్రదింపులు జరిపి మెరుగైన ప్యాకేజీ ఇచ్చారు.
* రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇస్తున్నారు. 28-29%  భూమి రైతులకు తిరిగి వెళుతోంది.
* అమరావతి నిర్మాణానికి సింగపూర్‌, జపాన్‌, జర్మనీ, ఇంగ్లండ్‌ వంటి దేశాల ఆసక్తి!
7ap-main1f.jpg
# 6: విద్యుత్తు రంగం.. సంక్షోభం నుంచి ‘వెలుగుల’ వైపు
7ap-main1g.jpg
గంటల తరబడి విద్యుత్తు కోతలు.. పరిశ్రమలకు పవర్‌ హాలీడేలు..రోజుకు 22 మిలియన్‌ యూనిట్ల కొరత- రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ రంగ పరిస్థితి ఇది. తెదేపా అధికారం చేపట్టిన ఆరు నెలల వ్యవధిలోనే ఈ సంక్షోభం నుంచి రాష్ట్రం పూర్తిగా గట్టెక్కింది. మిగులు విద్యుత్తు సాధించే స్థాయికి చేరుకుంది. పవర్‌ హాలీడేల మూలంగా పరిశ్రమలు మూతపడటం, ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం, పెట్టుబడి దారులు రావడానికే భయపడే పరిస్థితి నుంచి దిగ్గజ పరిశ్రమల యూనిట్లు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పే స్థాయికి విద్యుత్తు సరఫరా మెరుగుపడింది. కోతల్లేకుండా వినియోగదారులకు నిరంతర విద్యుత్తు అందించే స్థాయికి ఎదిగింది.
* కాలుష్య రహిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపు రాష్ట్రంలో పెద్ద ఉద్యమంలా సాగింది. ఐదురెట్ల మేర సామర్థ్యాన్ని పెంచుకుంది. గత నాలుగేళ్ల వ్యవధిలో 5310 మెగావాట్ల సౌర, పవన విద్యుదుత్పాదక సామర్థ్యం సాధించిన ఘనత ఏపీ సొంతమైంది.
* దేశంలోనే అన్ని చోట్లా ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటుచేసిన తొలి జిల్లాగా తూర్పుగోదావరి ఘనతకెక్కింది.
* భవిష్యత్తులో విద్యుత్తు ఛార్జీలు పెంచ బోమని ప్రకటించిన తొలి రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది.
* 2016 జూన్‌ నాటికి రాష్ట్రంలోని అన్ని గృహాలకు విద్యుత్తు కనక్షెన్లు ఇచ్చిన మూడో రాష్ట్రంగా గుర్తింపు పొందింది.
* ఎల్‌ఈడీ బల్బులు: ఇంధన పరిరక్షణ, సామర్థ్య చర్యల పెంపులో భాగంగా రూ.218 కోట్ల విలువైన 2.18 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను రాష్ట్రవ్యాప్తంగా అమర్చారు.
* సౌర విద్యుత్తు పంపుసెట్లు: ఒక్కోటి రూ.5 లక్షల విలువైన పంపుసెట్టును రూ.55 వేలకే అంది స్తున్నారు. ఇప్పటివరకూ 25 వేల పంపుసెట్లు పంపిణీ చేశారు.
* గత నాలుగేళ్లలో కృష్ణపట్నం క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్తు, నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ జల విద్యుత్తు, ఆర్‌టీపీపీ నాలుగో దశ విద్యుత్కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
* 2017-18లో విద్యుత్తు కొనుగోలులో 17 శాతం పునరుత్పాదక విద్యుత్తు రంగం నుంచే సేకరించగా.. 2014-15లో ఇది 5 శాతం మాత్రమే.
7ap-main1h.jpg
 #7: రియల్‌టైం గవర్నెన్స్‌.. పరిపాలనలో అత్యాధునికత
7ap-main1i.jpg
ఐటీ, ఆధునిక పరిజ్ఞానాల్ని ఉపయోగించి ప్రజలకు ఆన్‌లైన్‌లో సేవలందించే ప్రక్రియల్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు మెరుగైన, పారదర్శక పాలన, సత్వర సేవలందించేందుకు, దుబారాను, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రియల్‌టైం గవర్నెన్స్‌, ఇ-ప్రగతి, ఇ-ఆఫీసు  వంటి వినూత్న విధానాల్ని దేశంలోనే మొదటిసారిగా అమల్లోకి తెచ్చింది.

రియల్‌టైం గవర్నెన్స్‌
అది విజయవాడ సమీపంలోని ఒక భవనం. కార్పొరేట్‌ కార్యాలయాన్ని, బీపీఓ కేంద్రాన్ని తలపిస్తుంది. షిఫ్ట్‌కి 700 మంది చొప్పున 2 వేల మంది పనిచేస్తుంటారు. ఫోన్లు చేస్తూ.. సమాచారం తీసుకుంటూ.. దాన్ని విశ్లేషిస్తూ బిజీగా కనిపిస్తారు. ఇక్కడ్నుంచి రోజూ సుమారు 15.50 లక్షల మందికి ఫోన్లు వెళతాయి. ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందన తెలుసుకోవడం, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, ఎవరైనా ప్రమాదంలో ఉంటే వెంటనే స్పందించడం, సంబంధిత విభాగాల్ని అప్రమత్తం చేయడం, నేర నియంత్రణ, ట్రాఫిక్‌, వాతావరణ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం నిరంతరం చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘పరిష్కార వేదిక’(రియల్‌టైం గవర్నెన్స్‌(ఆర్టీజీ)) కార్యాలయం. రోజూ అన్ని లక్షల మందిని సంప్రదించే వ్యవస్థ దేశంలో ఇంకెక్కడా లేదు.ఇంతటి వినూత్న, భారీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌కే ప్రత్యేకం.
* మీకు సకాలంలో రేషన్‌ అందకపోవచ్చు. మీ ఇంటి ముందు రోడ్డు గుంతలు పడి ఉండొచ్చు. ఏ ప్రభుత్వ ఉద్యోగో మిమ్మల్ని లంచం అడిగి ఉండొచ్చు. సమస్య ఏదైనా.. 1100 నెంబర్‌కి ఫోన్‌చేసి మీ సమస్య చెబితే... దాన్ని పరిష్కరిస్తారు. రోజూ ఇలాంటి ఫోన్లు 25 వేల వరకు వస్తాయి. సమస్య పరిష్కారమైందీ లేనిదీ పరిష్కార వేదిక వాళ్లే మీకు ఫోన్‌ చేసి తెలుసుకుంటారు. ఇలాంటి విధానం దేశంలోనే మొదటిసారి.
* మీరో కొత్త వాహనం కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం దళారులకు కమీషన్లు ఇచ్చుకోవడం, గంటల తరబడి క్యూల్లో నిలబడడం గతంలో మామూలే. ఇప్పుడా అవసరం లేదు. వాహనం కొనుక్కున్న షోరూంలోనే రిజిస్ట్రేషన్‌ జరిగిపోతుంది.
* కొత్త ఇంటిని కట్టుకోవడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే చాలు, కొన్ని రోజుల్లోనే ప్లాన్‌ అప్రూవల్‌ వచ్చేస్తుంది.
* ప్రభుత్వ సిబ్బంది, అధికారుల అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల్ని సంబంధిత జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు పంపించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎవరైనా డబ్బులు తీసుకుంటే వెనక్కి ఇప్పించిన సంఘటనలున్నాయి. అవినీతిపై ఇంత వరకు 3297 ఫిర్యాదులు వచ్చాయి.
* ‘మీ కోసం’ వెబ్‌సైట్‌, ఏపీ సీఎం కనెక్ట్‌ యాప్‌, సామాజిక మాధ్యమాలు, ముద్రణ, ప్రసార మాధ్యమాల ద్వారాను, జన్మభూమి, ఇంటింటికీ తెలుగుదేశం వంటి కార్యక్రమాల్లోను వచ్చిన ఫిర్యాదులు, అర్జీల పరిష్కారాన్ని ఆర్టీజీ పర్యవేక్షిస్తుంది. ఇలాంటి ఫిర్యాదులు ఇంత వరకు 1.5 కోట్ల వరకు వచ్చాయి.
* ప్రత్యేక సెన్సర్ల ద్వారా రైతుల పొలాల్లో తేమను, రిజర్వాయర్లలో జల మట్టాలను, భూగర్భ జలాలను పర్యవేక్షించడం వంటి వినూత్న కార్యక్రమాలనేకం ఆర్టీజీ ద్వారా చేస్తున్నారు. డ్రోన్‌లు, నిఘా కెమేరాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్‌ తరగతులు వంటివి దీనిలో భాగం.

#8:విదేశీ విద్య.. పేదలకు కొత్త ఆశ
7ap-main1j.jpg
ప్రతిభ ఉన్నా విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్య చదవాలంటే ఆర్థికంగా సహకరించని కుటుంబ నేపథ్యం. ఏం చేయాలో అర్థంకాక ఉన్న దాంతో సంతృప్తి పడే పరిస్థితి. బడుగు, బలహీన వర్గాలకు విదేశీ విద్య అంటే అందని ద్రాక్ష అనుకునే స్థితి. అలా భావించిన వారే ఇప్పుడు ధైర్యంగా విదేశీ గడ్డపై ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదవాలన్న కలలను నిజం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక దన్ను ఇస్తుండడమే ఇందుకు కారణం. దాదాపు 15 దేశాల్లోని వర్సిటీల్లో వివిధ కోర్సులు అభ్యసించే అవకాశం ఏపీలోని పేద విద్యార్థులకు కలుగుతోంది. అంబేద్కర్‌ ఓవర్సీర్‌ విద్యా నిధి, ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు వర్గాలకు చెందిన విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు ప్రభుత్వం నేరుగా డబ్బు అందిస్తోంది. ఇందుకోసం ఒకొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఇస్తోంది. వీరి కోసం ప్రభుత్వం రూ.160 కోట్లకు పైగా ఖర్చుచేసింది. ఆయా వర్గాల నుంచి ఏటా 5 వేల మందిని విదేశాలకు పంపేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకూ 2300 మందికి పైగా విద్యార్థులు విదేశాలకు వెళ్లారు.
#9: నిరుద్యోగ భృతి.. యువతకు భరోసా

సామాజిక భద్రతా చర్యల్లో భాగంగా అరకోటి మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... తాజాగా నిరుద్యోగులకు చేయూత అందించేందుకు శ్రీకారం చుట్టింది. దాదాపు 10 లక్షల మంది యువతకు నెలకు రూ.వెయ్యి చొప్పున భృతిని చెల్లించనుంది. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో అతి పెద్ద సంక్షేమ పథకంగా రూపుదాల్చనుంది. డిగ్రీ/డిప్లమో పూర్తిచేసుకున్న యువత ఉద్యోగ దరఖాస్తులు కొనుగోలుకు, పోటీ పరీక్షలు రాయడానికి వెళ్లేటప్పుడు ప్రయాణ ఖర్చులకు, ఉద్యోగాల సాధన కోసం అవసరమైన శిక్షణ పొందేందుకు...ప్రభుత్వం చెల్లించే భృతి సొమ్ము ఎంతో కొంత ఉపయోగపడనుంది. ఓ అయిదేళ్లు తర్వాత నిరుద్యోగ భృతి పొందే వారి సంఖ్య 13.75 లక్షలకు, పదేళ్ల తర్వాత 17.50 లక్షలకు చేరనున్నట్లు అంచనా. ఇదే జరిగితే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే అతి పెద్ద వర్గం యువతే కానుంది.

ఇ-ప్రగతి
దైనందిన సేవలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టే పని ఇకపై లేదు. అన్ని ప్రభుత్వ విభాగాల్ని, సేవల్ని డిజిటైజ్‌ చేసేందుకు ఇ-ప్రగతి పేరుతో ప్రత్యేక ఇ-గవర్నెన్స్‌ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మొదట 14 సెక్టార్లను, 800 సేవల్ని ఆన్‌లైన్‌లోకి తేవాలని నిర్ణయించారు. ఇంతవరకు రవాణా శాఖలో 60 సేవలు, పురపాలక శాఖలో 70-80 సేవల వరకు ఆన్‌లైన్‌లోకి తెచ్చారు. ప్రభుత్వ సేవలన్నీ ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో పొందేలా చేయడమే ఇ-ప్రగతి అంతిమ లక్ష్యం. వివిధ శాఖల అవసరాలకు తగ్గట్టుగా ఐటీ సేవలు, డిజిటైజేషన్‌ ప్రక్రియకు అవసరమైన తోడ్పాటునందించేందుకు ఇ-ప్రగతి యాంకర్‌ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఐటీ అప్లికేషన్లను సిద్ధం చేస్తోంది. తొలి విడతలో విద్య, పంచాయతీరాజ్‌, మౌలిక వసతుల విభాగాల డిజిటైజేషన్‌ ప్రక్రియ జరుగుతోంది.
భూధార్‌
మనుషులకు ఆధార్‌లానే భూములకు, స్థలాలకు ‘భూధార్‌’ పేరుతో ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వడం దీని ఉద్దేశం. మొత్తం భూముల్ని పక్కాగా సర్వేచేసి, శాటిలైట్‌ ఇమేజెస్‌ రూపొందిస్తారు. ప్రతి ఒక్కరి భూమికి 11 అంకెల భూధార్‌ నెంబరు కేటాయిస్తారు. కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టారు. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే భూ వివాదాలకు, మోసాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఆన్‌లైన్‌లో నెంబరు కొడితే చాలు అన్ని వివరాలూ క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియా సాఫీగా జరుగుతుంది.
ఇ-ఆఫీసు
ప్రభుత్వ కార్యాలయాల్ని కాగిత రహితంగా చేయడం, దస్త్రాలన్నీ ఆన్‌లైన్‌లోనే(ఇ-ఫైల్‌) పరిష్కరించడం ఇ-ఆఫీసు లక్ష్యం. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లోని దస్త్రాలన్నీ ఆన్‌లైన్‌ చేశారు. జిల్లాస్థాయి వరకు ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఏ ఫైలు ఎవరి దగ్గర పెండింగ్‌లో ఉంది? ఏ దస్త్రాన్ని పరిష్కరించడానికి ఎవరు ఎన్ని   రోజులు సమయం తీసుకున్నారు?   వంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ప్రజలందరి డేటా సిద్ధం
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని  కుటుంబాలు, పౌరుల సమాచారంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక డేటా బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. 4,37,43,837 మందికి సంబంధించిన సమాచారం ఇప్పుడు సిద్ధంగా ఉంది. దీన్ని వివిధ ప్రభుత్వ పథకాలతో  అనుసంధానం చేస్తున్నారు.
ఐటీ, ఔళి, ఆహార శుద్ధి, పర్యాటక రంగాల్లో ఒప్పందాలు:
గత నాలుగేళ్లలో 1657 ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఒప్పందాలు జరిగాయి. వీటి విలువ రూ. 11,27,871 కోట్లకు పైగా ఉంటుంది. వీటితో 23 లక్షల మందికి పైగా ఉపాధి లభించనుంది.

ప్రారంభమైనవి:
రూ.4,53,887 కోట్లతో ఇప్పటి వరకూ 1065 ప్రాజెక్టులు ప్రారంభమై 8.27 లక్షల మందికిపైగా ఉపాధి చూపాయి. మిగతా ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి.
ప్రభుత్వం గత మూడేళ్ల వ్యవధిలో రూ.3,233.53 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించింది. మరో రూ.2 వేల కోట్ల పంపిణీ కోసం ఏర్పాట్లు చేస్తోంది.

పరిశ్రమలకు అంతా అనుకూలం
* సుదీర్ఘ తీరప్రాంతం 
* నౌకాశ్రయాలు
విమానాశ్రయాల విస్తరణ, కొత్తవాటి నిర్మాణం
* నిరంతర విద్యుత్‌ సరఫరా
* నీటిలభ్యత 
* మౌలిక సదుపాయాల కల్పన
* అందుబాటులో సరిపడా భూములు

7ap-main1k.jpg
 
 
 

 

Link to comment
Share on other sites

ఐ లవ్ అమరావతి... ఇది ఎక్కడ పెట్టారో తెలుసా ? ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి...

Super User
08 June 2018
Hits: 197
 
iloveamaravati-08062018-1.jpg
share.png

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రత్యెక ప్రాచుర్యం కల్పించేందుకు సీఆర్డీఏ శ్రద్ధ చూపిస్తుంది. ఇందులో భాగంగా జాతీయ రహదారిలోని కనకదుర్గ వంతెన పై రాజధానికి ముఖద్వారం వంటి తాడేపల్లి సమీపంలో పెద్ద ఫౌంటైన్ ఏర్పాటు చేసింది. దీనికి రెండు వైపులా 'ఐ లవ్ అమరావతి' అని ఇంగ్లీష్ లో ఉంటుంది. నియాన్ లైట్లతో ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సిఆర్డీఏ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ లాన్, 8 భారీ ఫౌంటైన్లను ఏర్పాటు చేసారు. ఇవి వివిధ ఆకారాలతో ఎనిమిది రంగులు మార్చుకుంటూ నీటిని విరజిమ్మే తీరుని ఆకట్టుకుంటుంది. దీనిని త్వరలో సియం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

 

iloveamaravati 08062018 2

అంతే కాదు అమరావతిలో నిర్మిస్తున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకి అటూ ఇటూ, అనేక ప్రాజెక్ట్ లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆతిథ్య, పర్యాటక రంగానికి చెందిన ప్రాజెక్టులు ఎక్కువగా ఈ రహదారి పక్కనే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వెంకటపాలెం నుంచి కొండమరాజుపాలెం మధ్య ఈ రహదారి పక్కన ప్రస్తుతం ఎక్కువ గిరాకీ ఉంది. ఈ రహదారికి పక్కనే అమరావతి మెరీనా, మూడు నక్షత్రాల రిసార్ట్‌, రెండు 5 నక్షత్రాల హోటళ్లు, రెండు 4 నక్షత్రాల హోటళ్లు, ఒక సమావేశమందిరం, ఒక షాపింగ్‌ మాల్‌, హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌, ఐటీ టవర్‌, మైస్‌ సెంటర్‌, కార్పొరేట్‌ స్ట్రీట్‌ వంటివి ఇప్పటి వరకు ఉన్న ప్రతిపాదనలు. వీటిలో చాలా ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ ఇప్పటికే స్థలాలు కేటాయించింది. సీడ్‌ యాక్సెస్‌రోడ్డు తొలి దశలో ఉండవల్లి నుంచి అబ్బరాజుపాలెం వరకు 18.27 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు.

iloveamaravati 08062018 3

అమరావతి మెరీనా: వెంకటపాలెం సమీపంలో 8.3 ఎకరాల్లో వస్తుంది. ఇది పర్యాటక ప్రాజెక్టు. చిన్న చిన్న బోట్లు నిలిపే స్థలాన్నే మెరీనాగా వ్యవహరిస్తారు. కృష్ణా తీరంలో వచ్చే ఈ ప్రాజెక్టు టెండరు దశలో ఉంది. వెంకటపాలెం దగ్గర్లో ఒక 5నక్షత్రాల హోటల్‌, ఒక 4నక్షత్రాల హోటల్‌, కొండమరాజు పాలెం దగ్గర్లో ఒక 5నక్షత్రాల హోటల్‌, ఒక 4నక్షత్రాల హోటల్‌ నిర్మాణానికి రెండు ప్రముఖ సంస్థలకు సీఆర్‌డీఏ స్థలాలు కేటాయించింది. ఉండవల్లి నుంచి వెళ్లేటప్పుడు రహదారికి ఎడమ పక్కన ఇవి వస్తాయి. 3.5 ఎకరాల్లో కనీసం 50 గదులతో రిసార్టు నిర్మిస్తారు. రహదారికి కుడిపక్కన వస్తుంది. కృష్ణా కరకట్టకు, నదికి మధ్యలో 1.5 ఎకరాలు, ప్రధాన అనుసంధాన రహదారికి, కరకట్టకు మధ్యలో 2 ఎకరాలు కేటాయించారు. వెంకటపాలెం దగ్గర్లోనే ఇది వస్తుంది. వెంకటపాలెం, మందడం గ్రామాల మధ్యలో 10 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ఐటీ టవర్‌ నిర్మిస్తారు. డిజైన్లు రూపొందించే దశలో ప్రాజెక్టు ఉంది.

Link to comment
Share on other sites

అమరావతిలో నాలుగు ఫైవ్‌స్టార్ హోటళ్లు 
08-06-2018 21:01:18
 
636640884875737442.jpg
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది రాజధానిలో నాలుగు ఫైవ్‌స్టార్ హోటళ్లు ఏర్పాటు కాబోతున్నాయి. 4 ఫోర్ స్టార్‌హోటళ్లకు ప్రభుత్వం భూముల కేటాయించింది. రెండు, మూడు నెలల్లో పనులు ప్రారంభంకానున్నాయి. హోటల్ యాజమాన్యాలకు ఎకరం రూ.కోటిన్నర చొప్పున సీఆర్డీఏ భూమిని కేటాయించింది.
లింగాయపాలెంలో నోవాటెల్, మందడంలో డబుల్‌ట్రీ/హిల్టన్, శాఖమూరులో క్రౌన్‌ప్లాజా, నవులూరులో హిల్టన్ ఫైవ్‌స్టార్ హోటళ్లను ఏర్పాటు చేయబోతున్నారు. శాఖమూరులో హోటల్ దస్పల్లా ఫోర్‌స్టార్ హోటల్, మందడంలో జీఆర్టీ, కొండమరాజుపాలెంలో హాలిడే ఇన్, నవులూరులో గ్రీన్ పార్క్ ఫోర్ స్టార్ హోటల్‌కు అనుమతి లభించాయి. ఫైవ్‌స్టార్ హోటల్‌కు 4ఎకరాలు, ఫోర్ స్టార్‌ హోటల్‌కు 2ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
Link to comment
Share on other sites

ఏపీ.. మినీ సింగపూర్‌!
09-06-2018 02:29:33
 
636641104041675121.jpg
  •  అమరావతే వారి గమ్యం
  •  సింగపూర్‌లో ఖాళీ లేదు
  •  ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే
  •  అమరావతిలో వాతావరణ సారూప్యత
  •  మూడున్నర గంటలే ప్రయాణం
  •  వాణిజ్యానికి మించిన సంబంధం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘రండి! నవ్యాంధ్రను మీ సెకండ్‌ హోమ్‌గా మార్చుకోండి’...
విదేశీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఇచ్చే పిలుపు ఇది! ఇకపై సింగపూర్‌వాసులు, వాణిజ్యవేత్తలకు నవ్యాంధ్ర నిజంగానే ‘రెండో ఇల్లు’గా మారనుంది. దీనికి కారణం... ఆ దేశం స్వయంగా విధించుకున్న నిబంధనలే! సింగపూర్‌ చట్టాల ప్రకారం మొత్తం భూభాగంలో 65 శాతం విస్తీర్ణంలోనే నిర్మాణాలు చేపట్టాలి. ఆ మేరకు అక్కడ గరిష్ఠ స్థాయిలో నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇది చాలక సముద్రంలో కృత్రిమ దీవులను కూడా సృష్టించారు. అక్కడా నిర్మాణాలు పూర్తయిపోయాయి. ఇక కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు స్థలం లేదు. పాతకాలపు (హెరిటేజ్‌) కట్టడాలను కూల్చి నిర్మాణాలు చేయాల్సిందే. ఇందుకు ఆ దేశ చట్టాలు అనుమతించవు. అంటే సింగపూర్‌ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలోని కార్పొరేషన్లకు ఇక నిర్మాణాల కోసం స్థలమే లేదు. అందుకే... నవ్యాంధ్రను తమ రెండో ఇంటిగా మార్చుకోవాలని సింగపూర్‌ భావిస్తున్నట్లు సమాచారం!
 
నాలుగు రంగాల్లో కలిసి...
సింగపూర్‌ ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వ కార్పొరేషన్లు కేవలం ఇక్కడికొచ్చి ఏదో ఒక నిర్మాణం చేసేసి వెళ్లిపోవడం అన్న ఉద్దేశంతో లేవు. ముందే చెప్పినట్లు దీన్నో మినీ సింగపూర్‌గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇదే ఆలోచనతో రాష్ట్ర ఆర్థికాభివృద్ది బోర్డు(ఈడీబీ)తో నాలుగు రంగాల్లో భాగస్వామ్యం దిశగా చర్చలు చేస్తున్నారు. ఇందులో మొదటిది... నిర్మాణం-పారిశ్రామిక రంగం. రాష్ట్రంలోని బిల్డర్లతో కలిసి ఇక్కడ ఆర్థిక నగరాల నిర్మాణంతోపాటు, భవన నిర్మాణాల్లోనూ పాలుపంచుకోవాలని సింగపూర్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కొందరు బిల్డర్లు సింగపూర్‌ ప్రభుత్వ ఆహ్వానంతో అక్కడికి వెళ్లారు. సింగపూర్‌ బృందాలు కూడా ఇక్కడకు రానున్నాయి. వ్యవసాయ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోను అవకాశాలను అన్వేషించాలని, ఉన్నవాటిని ఉమ్మడిగా సద్వినియోగం చేసుకోవాలని సింగపూర్‌ ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా లాజిస్టిక్స్‌ రంగంలో సింగపూర్‌ దిట్ట. షిప్పింగ్‌, రవాణా తదితర రంగాల్లో సహకారానికి, భాగస్వామ్యానికి ఆసక్తి చూపిస్తోంది. నాలుగోది పర్యాటకం. ఈ రంగంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నింటినీ మ్యాపింగ్‌ చేసి.. అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందేలా చేయాలన్న అంశంపైనా చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఒక వ్యాపారంలాగానే కాకుండా... తమకు దగ్గరలో తమకు కావాల్సిన మరో నగరాన్ని నిర్మించుకోవడంలో భాగస్వామ్యం అవుతున్నామన్న భావన కూడా సింగపూర్‌ ప్రభుత్వంలో ఉంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ వర్గాలతో చర్చల సందర్భంగా పేర్కొన్నట్లు కూడా సమాచారం.
 
మొదట ఒక టవర్‌ ప్రారంభం
అమరావతిలో సింగపూర్‌ భాగస్వామ్యంతో నిర్మించబోయే స్టార్టప్‌ ఏరియా విస్తీర్ణం 1691 ఎకరాలు. ఇందులో అనేక ఆకాశహర్మ్యాల నిర్మాణం జరుగుతుంది. దేశ, విదేశీ కంపెనీలు, సంస్థలకు దీన్ని ఒక హబ్‌గా తయారుచేయాలన్నది లక్ష్యం. దీనిలో తొలిగా ఒక టవర్‌ నిర్మాణాన్ని ప్రారంభిస్తారని సమాచారం. ఈ టవర్‌ను సుమారు 8 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించాలన్నది ప్రాథమిక ప్రతిపాదన. ఈ టవర్‌ అనంతరం ఒకదాని వెంట మరోటిగా టవర్ల నిర్మాణం ప్రారంభిస్తారు. మొత్తంగా సింగపూర్‌ ప్రభుత్వ అవసరం దృష్ట్యా ఈ స్టార్టప్‌ ప్రాంతాన్ని ఒక గోల్డెన్‌ సిటీగా తీర్చిదిద్దుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
 
 
ఏపీనే ఎందుకంటే...
సింగపూర్‌ వాతావరణానికి, అమరావతి ప్రాంత వాతావరణానికీ మధ్య బాగా సారూప్యత ఉంది. సింగపూర్‌లో విమానం ఎక్కితే మూడున్నర గంటల్లో విజయవాడ లేదా విశాఖపట్నంలో దిగొచ్చు. మరోవైపు... నవ్యాంధ్ర ఆవిర్భావం నుంచే సింగపూర్‌తో ప్రత్యేక సంబంధాలు కొనసాగుతున్నాయి. అమరావతి నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ ప్రభుత్వమే ఇచ్చింది. రాజధానిలో కీలకమైన స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిని స్వయంగా సింగపూర్‌ కన్సార్షియం చేపట్టింది. వీటన్నింటి దృష్ట్యా నవ్యాంధ్ర తమకు ఎంతో అనుకూలమైనదని సింగపూర్‌ భావిస్తున్నట్లు సమాచారం! ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న సింగపూర్‌కు.. తమ భాగస్వామ్యంతో నిర్మాణమయ్యే నగరంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశం అమరావతి నిర్మాణానికి కూడా కలిసిరానుంది. కేవలం వ్యాపారం కోసం కాకుండా... అంతకుమించిన బంధం కోసమే అమరావతిలో సింగపూర్‌ భాగస్వామిగా మారిందని, రాజధాని నిర్మాణం అత్యద్భుతంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దేశ విదేశీ కంపెనీలను, భారీ సంస్థలను ఇక్కడకు తీసుకొచ్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్‌ కూడా తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Link to comment
Share on other sites

రాజధానిలో 8 నక్షత్ర హోటళ్ల నిర్మాణం 
భూకేటాయింపు పత్రాలు అందజేసిన సీఆర్‌డీఏ

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో నక్షత్ర హోటళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన ఎనిమిది ప్రముఖ సంస్థలకు స్థలాలు కేటాయిస్తూ శుక్రవారం ధ్రువీకరణ పత్రాలు (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌) అందజేశారు. ఆయా సంస్థల ప్రతినిధులకు సీఆర్‌డీఏ కార్యాలయంలో కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వీటిని అందజేశారు. ఐదు, నాలుగు నక్షత్రాల హోటళ్లు నాలుగేసి చొప్పున నిర్మించనున్నారు. లింగాయపాలెం వద్ద నోవాటెల్‌, మందడం వద్ద డబుల్‌ ట్రీ బై హిల్టన్‌, శాఖమూరు వద్ద క్రౌన్‌ ప్లాజా, నవులూరు వద్ద హిల్టన్‌ సంస్థలు ఐదు నక్షత్రాల హోటళ్లు నిర్మిస్తాయి. ఈ హోటళ్లకు నాలుగెకరాల చొప్పున భూమిని సీఆర్‌డీఏ కేటాయించింది. మందడం వద్ద జీఆర్‌టీ హోటల్‌, కొండమరాజుపాలెం వద్ద హాలీడేఇన్‌, శాఖమూరు వద్ద దసపల్లా, నవులూరు వద్ద గ్రీన్‌పార్క్‌ సంస్థలు నాలుగు నక్షత్రాల హోటళ్లు నిర్మించనున్నాయి. ఒక్కొక్క నాలుగు నక్షత్రాల హోటల్‌కు రెండెకరాల చొప్పున సీఆర్‌డీఏ భూమి కేటాయించింది. స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి ఎకరానికి రూ.కోటిన్నర చొప్పున ధర నిర్ణయించి కేటాయింపులు జరిపింది. ఆయా సంస్థలు మొత్తం చెల్లించాక సీఆర్‌డీఏ భూమి స్వాధీనం చేస్తుంది. ఆయా సంస్థలు భూమి స్వాధీనం చేసుకున్న మూడు నెలల్లో పనులు ప్రారంభించి మూడేళ్లలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని షరతు విధించింది.

Link to comment
Share on other sites

ఏపీ.. మినీ సింగపూర్‌!
09-06-2018 02:29:33
 
636641104041675121.jpg
  •  అమరావతే వారి గమ్యం
  •  సింగపూర్‌లో ఖాళీ లేదు
  •  ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే
  •  అమరావతిలో వాతావరణ సారూప్యత
  •  మూడున్నర గంటలే ప్రయాణం
  •  వాణిజ్యానికి మించిన సంబంధం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘రండి! నవ్యాంధ్రను మీ సెకండ్‌ హోమ్‌గా మార్చుకోండి’...
విదేశీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఇచ్చే పిలుపు ఇది! ఇకపై సింగపూర్‌వాసులు, వాణిజ్యవేత్తలకు నవ్యాంధ్ర నిజంగానే ‘రెండో ఇల్లు’గా మారనుంది. దీనికి కారణం... ఆ దేశం స్వయంగా విధించుకున్న నిబంధనలే! సింగపూర్‌ చట్టాల ప్రకారం మొత్తం భూభాగంలో 65 శాతం విస్తీర్ణంలోనే నిర్మాణాలు చేపట్టాలి. ఆ మేరకు అక్కడ గరిష్ఠ స్థాయిలో నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇది చాలక సముద్రంలో కృత్రిమ దీవులను కూడా సృష్టించారు. అక్కడా నిర్మాణాలు పూర్తయిపోయాయి. ఇక కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు స్థలం లేదు. పాతకాలపు (హెరిటేజ్‌) కట్టడాలను కూల్చి నిర్మాణాలు చేయాల్సిందే. ఇందుకు ఆ దేశ చట్టాలు అనుమతించవు. అంటే సింగపూర్‌ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలోని కార్పొరేషన్లకు ఇక నిర్మాణాల కోసం స్థలమే లేదు. అందుకే... నవ్యాంధ్రను తమ రెండో ఇంటిగా మార్చుకోవాలని సింగపూర్‌ భావిస్తున్నట్లు సమాచారం!
 
నాలుగు రంగాల్లో కలిసి...
సింగపూర్‌ ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వ కార్పొరేషన్లు కేవలం ఇక్కడికొచ్చి ఏదో ఒక నిర్మాణం చేసేసి వెళ్లిపోవడం అన్న ఉద్దేశంతో లేవు. ముందే చెప్పినట్లు దీన్నో మినీ సింగపూర్‌గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇదే ఆలోచనతో రాష్ట్ర ఆర్థికాభివృద్ది బోర్డు(ఈడీబీ)తో నాలుగు రంగాల్లో భాగస్వామ్యం దిశగా చర్చలు చేస్తున్నారు. ఇందులో మొదటిది... నిర్మాణం-పారిశ్రామిక రంగం. రాష్ట్రంలోని బిల్డర్లతో కలిసి ఇక్కడ ఆర్థిక నగరాల నిర్మాణంతోపాటు, భవన నిర్మాణాల్లోనూ పాలుపంచుకోవాలని సింగపూర్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కొందరు బిల్డర్లు సింగపూర్‌ ప్రభుత్వ ఆహ్వానంతో అక్కడికి వెళ్లారు. సింగపూర్‌ బృందాలు కూడా ఇక్కడకు రానున్నాయి. వ్యవసాయ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోను అవకాశాలను అన్వేషించాలని, ఉన్నవాటిని ఉమ్మడిగా సద్వినియోగం చేసుకోవాలని సింగపూర్‌ ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా లాజిస్టిక్స్‌ రంగంలో సింగపూర్‌ దిట్ట. షిప్పింగ్‌, రవాణా తదితర రంగాల్లో సహకారానికి, భాగస్వామ్యానికి ఆసక్తి చూపిస్తోంది. నాలుగోది పర్యాటకం. ఈ రంగంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నింటినీ మ్యాపింగ్‌ చేసి.. అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందేలా చేయాలన్న అంశంపైనా చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఒక వ్యాపారంలాగానే కాకుండా... తమకు దగ్గరలో తమకు కావాల్సిన మరో నగరాన్ని నిర్మించుకోవడంలో భాగస్వామ్యం అవుతున్నామన్న భావన కూడా సింగపూర్‌ ప్రభుత్వంలో ఉంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ వర్గాలతో చర్చల సందర్భంగా పేర్కొన్నట్లు కూడా సమాచారం.
 
మొదట ఒక టవర్‌ ప్రారంభం
అమరావతిలో సింగపూర్‌ భాగస్వామ్యంతో నిర్మించబోయే స్టార్టప్‌ ఏరియా విస్తీర్ణం 1691 ఎకరాలు. ఇందులో అనేక ఆకాశహర్మ్యాల నిర్మాణం జరుగుతుంది. దేశ, విదేశీ కంపెనీలు, సంస్థలకు దీన్ని ఒక హబ్‌గా తయారుచేయాలన్నది లక్ష్యం. దీనిలో తొలిగా ఒక టవర్‌ నిర్మాణాన్ని ప్రారంభిస్తారని సమాచారం. ఈ టవర్‌ను సుమారు 8 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించాలన్నది ప్రాథమిక ప్రతిపాదన. ఈ టవర్‌ అనంతరం ఒకదాని వెంట మరోటిగా టవర్ల నిర్మాణం ప్రారంభిస్తారు. మొత్తంగా సింగపూర్‌ ప్రభుత్వ అవసరం దృష్ట్యా ఈ స్టార్టప్‌ ప్రాంతాన్ని ఒక గోల్డెన్‌ సిటీగా తీర్చిదిద్దుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
 
 
ఏపీనే ఎందుకంటే...
సింగపూర్‌ వాతావరణానికి, అమరావతి ప్రాంత వాతావరణానికీ మధ్య బాగా సారూప్యత ఉంది. సింగపూర్‌లో విమానం ఎక్కితే మూడున్నర గంటల్లో విజయవాడ లేదా విశాఖపట్నంలో దిగొచ్చు. మరోవైపు... నవ్యాంధ్ర ఆవిర్భావం నుంచే సింగపూర్‌తో ప్రత్యేక సంబంధాలు కొనసాగుతున్నాయి. అమరావతి నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ ప్రభుత్వమే ఇచ్చింది. రాజధానిలో కీలకమైన స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిని స్వయంగా సింగపూర్‌ కన్సార్షియం చేపట్టింది. వీటన్నింటి దృష్ట్యా నవ్యాంధ్ర తమకు ఎంతో అనుకూలమైనదని సింగపూర్‌ భావిస్తున్నట్లు సమాచారం! ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న సింగపూర్‌కు.. తమ భాగస్వామ్యంతో నిర్మాణమయ్యే నగరంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశం అమరావతి నిర్మాణానికి కూడా కలిసిరానుంది. కేవలం వ్యాపారం కోసం కాకుండా... అంతకుమించిన బంధం కోసమే అమరావతిలో సింగపూర్‌ భాగస్వామిగా మారిందని, రాజధాని నిర్మాణం అత్యద్భుతంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దేశ విదేశీ కంపెనీలను, భారీ సంస్థలను ఇక్కడకు తీసుకొచ్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్‌ కూడా తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...