Jump to content

***RIP***


girikurnool

Recommended Posts

సినీనటుడు జేవీ రమణమూర్తి కన్నుమూత 

22brk167a.jpg

హైదరాబాద్‌: సీనియర్‌ సినీ నటుడు జేవీ రమణమూర్తి కన్నుమూశారు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి. శంకరాభరణం జేవీ సోమయాజులు ఆయన సోదరుడు. మే 20, 1933లో విజయనగరం జిల్లాలో జన్మించారు.

బాల్యం నుంచే నాటకాల్లో వేషాలు వేసిన రమణమూర్తి అత్యుత్తమ ప్రదర్శన పురస్కారం అందుకొన్నారు. ఎన్‌జీవో, ఎవరు దొంగ, కప్పలు, నాటకం, కీర్తి శేషులు, కాలరాత్రి, ఫణి నాటకాల్లో నటించారు. 20వ ఏళ్ల వయసు నుంచి 43 ఏళ్ల పాటు గురజాడ ‘కన్యాశుల్కం’ స్వీయ దర్శకత్వంలో సుమారు వెయ్యిసార్లు ప్రదర్శించి గిరీశం పాత్ర పోషించారు.

1957లో ‘ఎమ్మెల్యే’ సినిమాతో తెరంగేట్రం చేసిన జేవీ రమణమూర్తి దాదాపు 150 సినిమాల్లో నటించారు. మాంగల్య బలం, బాటసారి, మరో చరిత్ర, సిరిసిరిమువ్వ, గోరింటాకు, ఆకలి రాజ్యం, సప్తపది, ఆంధ్ర కేసరి, ఆనంద భైరవి, కర్తవ్యం, ఆర్య, శంకరదాదా జిందాబాద్‌ చిత్రాల్లో నటించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...