sonykongara Posted June 19, 2016 Posted June 19, 2016 దుగరాజపట్నం పోర్టు లాభదాయకం కాదు!తేల్చి చెప్పిన నివేదిక? విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో దుగరాజపట్నం పోర్టు ప్రాజెక్టు ఏమాత్రం లాభదాయకం కాదని విశాఖపట్నం పోర్టు అధికారులు తేల్చారు. విశాఖ పోర్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో దీనిని నిర్మించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. దానికనుగుణంగా సాధ్యాసాధ్యాల నివేదికను ఇవ్వాలని కేంద్రం విశాఖ పోర్టు అధికారులను ఆదేశించింది. దీనిపై పోర్టు అధికారులు విస్తృత అధ్యయనం చేశారు. ఈ నెల 15వ తేదీన తుది నివేదికను కేంద్రానికి పంపారు. ఇది లాభదాయకం కాదని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి ఉత్తర దిశలో కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే విస్తృతమైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందిన కృష్ణపట్నం పోర్టు ఉంది. దక్షిణ దిశలో కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఎన్నోర్, కట్టుపల్లి పోర్టులు పక్కపక్కనే ఉన్నాయి. వాటి నుంచి వచ్చే పోటీని తట్టుకుని కొత్తగా వ్యాపారావకాశాలు సృష్టించుకోవడం కష్టసాధ్యం. పోర్టును జాతీయ రహదారితోనూ, రైల్వేలైనుతోనూ అనుసంధానించడం అనేది అత్యవసరం. వీటి నిర్మాణానికి కూడా అదనంగా రూ. వందల కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి. ప్రతిపాదిత దుగరాజపట్నం పోర్టు ప్రాంతం జాతీయ రహదారికి చాలా దూరంలో ఉంది. పోర్టు నుంచి జాతీయరహదారిని కలపడానికి సుమారు రూ. 720 కోట్ల వరకు వ్యయమయ్యే అవకాశం ఉంది. గూడూరు - దుగరాజపట్నం రైల్వేలైను నిర్మించాలంటే సుమారు రూ. 310 కోట్ల వరకు వ్యయమవుతుంది. వీటిని నిర్మిస్తామని ఆయా మంత్రిత్వశాఖలు స్పష్టమైన హామీ ఇస్తే తప్ప పనులు ప్రారంభించడానికి అవకాశం లేదు. భవిష్యత్తులో విస్తరించడానికి కూడా పర్యావరణ పరమైన అడ్డంకులు ఏర్పడనున్నాయి. సమీపంలోనే పులికాట్ సరస్సు ఉంది. దీని వల్ల కాలుష్య రహిత సరకులు మాత్రమే రవాణా చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పోర్టు నిర్మాణం పూర్తి చేసి అది కనీస లాభాల్లోకి ప్రవేశించే వరకు ప్రభుత్వ పరమైన ఆర్థిక అండదండలు ఇవ్వాలి. ఇందుకు వీలుగా ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’ పేరిట కొంత మొత్తం కేంద్రం కేటాయించాల్సి ఉంటుంది. ఇది సుమారు రూ.1200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సుమారు 300 ఎకరాల భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం తదితరాలన్నీ కలిపి మరో రూ. 270 కోట్ల వరకు వ్యయమవుతుంది. ఆయా వ్యయాలన్నింటినీ భరించగలిగితేనే పోర్టు నిర్మాణం కొద్దిగా లాభదాయకంగా మారే అవకాశం ఉంటుంది. రూ. 8 వేల కోట్ల భారీ వ్యయమవుతుందని భావిస్తున్న దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని ఎన్నో ప్రతికూలతల నడుమ విజయవంతంగా నిర్వహించడం కూడా కష్టసాధ్యమైన విషయమేనని విశాఖ పోర్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అధికారులు ఏఈ కామ్ అనే కన్సెల్టీన్సీ సంస్థతో కూడా విస్త్రతస్థాయిలో అధ్యయనం చేయించారు. ఇది కూడా ఈ పోర్టు లాభదాయకం కాదనే నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దుగరాజపట్నం పోర్టును నిర్మిస్తాయా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
Madhu.T Posted June 19, 2016 Posted June 19, 2016 adi actual ga ramayapattanam ki ravali.. mana peddalu pekasam meed seetakannu vesaru..
sonykongara Posted June 19, 2016 Author Posted June 19, 2016 adi actual ga ramayapattanam ki ravali.. mana peddalu pekasam meed seetakannu vesaru.. adi bill lo pettaru brother.
swas Posted June 19, 2016 Posted June 19, 2016 adi actual ga ramayapattanam ki ravali.. mana peddalu pekasam meed seetakannu vesaru.. AP reorganization bill lo port idi This port is not feasible as big ports are near idi fix
sonykongara Posted June 19, 2016 Author Posted June 19, 2016 adi actual ga ramayapattanam ki ravali.. mana peddalu pekasam meed seetakannu vesaru..
sonykongara Posted June 19, 2016 Author Posted June 19, 2016 chinta mohan panbaka gabbu chesaru ramayapatnam port rakunda chesaru
sonykongara Posted June 19, 2016 Author Posted June 19, 2016 http://www.nandamurifans.com/forum/index.php?/topic/338164-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%80-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%95%E0%B1%82%E0%B0%B2%E0%B0%82/
RKumar Posted June 19, 2016 Posted June 19, 2016 Daggubati Purandheshwari & Daggubati Venkateswara Rao Lands konukkunnadi Dugarajapatnam daggara (or) Ramayapatnam?
sonykongara Posted June 19, 2016 Author Posted June 19, 2016 Daggubati Purandheshwari & Daggubati Venkateswara Rao Lands konukkunnadi Dugarajapatnam daggara (or) Ramayapatnam? donkonda daggra konnaru
Madhu.T Posted June 19, 2016 Posted June 19, 2016 Daggubati Purandheshwari & Daggubati Venkateswara Rao Lands konukkunnadi Dugarajapatnam daggara (or) Ramayapatnam? Ramayapattanam kadani talk..
RKumar Posted June 19, 2016 Posted June 19, 2016 Congress & YSRCP Jaffa batch Donakonda maathrame kaadu Dugarajapatnam, ongole daggara kooda lands baaga konnaru between 2009-14.
Suresh_Ongole Posted June 20, 2016 Posted June 20, 2016 donkonda daggra konnaruRaamayapatnam daggara purandedwari konindi
swarnandhra Posted June 20, 2016 Posted June 20, 2016 Even Ramayapatnam is not that far from Krishnapatnam port (90 km). Can't it be moved further north (closer to Ongole)?
sonykongara Posted June 20, 2016 Author Posted June 20, 2016 నెల్లూరు, జూన్ 19(ఆంధ్రజ్యోతి): దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం సాధ్యం కాదని విశాఖపట్నం పోర్టు అధికారులు తేల్చిచెప్పారు. ఈ పోర్టు నిర్మాణం ఏ మాత్రమూ లాభసాటి కాదని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం అప్పటి యుపీఏ ప్రభుత్వం ఈ పోర్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. పోర్టు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని విశాఖపట్నం పోర్టు అధికారులను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఏడాదిపాటు అధ్యయనం చేసిన నిపుణులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో అక్కడ పోర్టు నిర్మాణంతో తగిన వ్యాపారం సాగదని తేల్చి చెప్పారు. రోడ్డు, రైలు కనెక్టివిటీ లేదని, భూసేకరణకు భారీగా నిధులు ఖర్చుచేయాల్సి వస్తుందని, పర్యావరణ అనుమతులూ సాధ్యంకావని పేర్కొన్నారు.
AnnaGaru Posted June 21, 2016 Posted June 21, 2016 Even Ramayapatnam is not that far from Krishnapatnam port (90 km). Can't it be moved further north (closer to Ongole)? Motupalli near to chirala ? http://www.prakasamnris.com/history-to-be-proud-of Motupalli Motupalli was a famous sea port during Kakatiya Period. Marcopolo, a Portuguese navigator, visited this place and wrote about the prosperity and power of Andhra Desa during the reign of Kakatiya kings in his travalogue. Motipalli inscription, issued by King Ganapati, in the mid thirteenth century, specifies the rates accessed on a variety of items including scents such as sandal and civet, camphor, rose water, ivory, pearls, coral, a range of metals (copper, zinc, and lead), silk, pepper, and areca-nuts. This list gives us a good idea of the types of luxury goods that were being exported and imported through Motupalli port to other Indian regions along the coast, as well as to foreign territories.
swarnandhra Posted June 21, 2016 Posted June 21, 2016 Motupalli near to chirala ? Motupalli Motupalli was a famous sea port during Kakatiya Period. Marcopolo, a Portuguese navigator, visited this place and wrote about the prosperity and power of Andhra Desa during the reign of Kakatiya kings in his travalogue. Motipalli inscription, issued by King Ganapati, in the mid thirteenth century, specifies the rates accessed on a variety of items including scents such as sandal and civet, camphor, rose water, ivory, pearls, coral, a range of metals (copper, zinc, and lead), silk, pepper, and areca-nuts. This list gives us a good idea of the types of luxury goods that were being exported and imported through Motupalli port to other Indian regions along the coast, as well as to foreign territories. Looks like lands already acquired for this by maha metha. Motupalli is right next to the proposed port at Vadarevu. May be it is the same place but just calling it with nearby village(vadarevu).
sonykongara Posted June 22, 2016 Author Posted June 22, 2016 Looks like lands already acquired for this by maha metha. Motupalli is right next to the proposed port at Vadarevu. May be it is the same place but just calling it with nearby village(vadarevu). tfs bro.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.