Jump to content

Recommended Posts

  • Replies 283
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Posted
ఈ ఏడాది 50 కోట్ల మొక్కలు నాటాలి : చంద్రబాబు
 
విజయవాడ: రాష్ట్రంలో ఈ ఏడాది 50కోట్ల మొక్కలు నాటాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు రోజుల వర్షాలకు అనంతపురం జిల్లాలో 24 వేల పంటకుంటలు, 2 వేల చెక్ డ్యాముల్లోకి నీరు చేరిందని, చిత్తూరు జిల్లాలో 8347 పంటకుంటల్లో జలకళ సంతరించుకుందన్నారు. పంటకుంటలు, ఇంకుడు గుంతల తవ్వకాల పనులను వేగవంతం చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో ఏరియల్ సీడింగ్ కోసం మూడు వేల కిలోల విత్తనాలు సిద్దం చేయాలన్నారు. పదివేల పాఠశాలల్లో స్కూల్ నర్సరీలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
Posted

Oka large scale program laaga teesukuni state mottham roads pakkana manchi trees plant cheste baaguntadhi! 

NGO's and students ni use chesukuni program execute cheste baaguntadhi!

Posted

Oka large scale program laaga teesukuni state mottham roads pakkana manchi trees plant cheste baaguntadhi! 

NGO's and students ni use chesukuni program execute cheste baaguntadhi!

Elago 4 lines, 6lines, 8 lines roads antunaru ga better roads madyalo flower trees tho nimpandi

Posted

Oka large scale program laaga teesukuni state mottham roads pakkana manchi trees plant cheste baaguntadhi! 

NGO's and students ni use chesukuni program execute cheste baaguntadhi!

NGOs ni indulo touch cheyyaka povatamu better. Ippatike crying started.

Posted
పంట.. కుంట
 
636002525921491400.jpg
  • నిండిన పంట కుంటలు
  • పెరిగిన భూగర్భ జలాలు
  • అన్నదాతల్లో ఆనందం
  • నీరు-చెట్టు ఫలితమిది
  • సీఎం లక్ష్యం నెరవేరింది
  • ఉమ, సునీత ఉద్ఘాటన
  • పంటలకు ప్రత్యేక పూజలు
హైదరాబాద్‌/అనంతపురం/కర్నూలు/రాప్తాడు, మే 30(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఆలోచనల నుంచి ఉద్భవించిన ‘పంట కుంటలు’ పథకం.. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుత ఫలితాన్ని ఇస్తోంది. అన్నదాతలకు నీటి కష్టాలు దూరమవ్వాలనే ఉద్దేశంతో ప్రతి పొలంలోనూ వాన నీటిని ఒడిసి పట్టేలా పంట కుంటలు ఏర్పాటు చేయాలని సీఎం ఇచ్చిన పిలుపులో భాగంగా పలు జిల్లాల్లో రైతులు తమ పొలాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ఈ పంట కుంటలు నిండు కుండల్లా మారి.. అన్నదాతల గుండెల్లో ఆనందం నింపుతున్నాయి. అదేవిధంగా భూగర్భ జల మట్టం కూడా భారీస్థాయిలో పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం హైదరాబాద్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు సాధారణంగానే నమోదైనా.. భూగర్భ జల మట్టాలు మాత్రం ఘనంగా పెరిగాయని పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమమే కారణమని తెలిపారు. నీరు-చెట్టు పనులతో ఆశించిన సత్ఫలితాలు సాధించామన్నారు. ఈ నెలలో 92.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని, కురిసిన వాన నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 40,817 చెరువుల్లో 1,820 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడికతీతను చేపట్టామని తెలిపారు. ఫలితంగా 6.45 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. 66,240 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని చెప్పారు. రూ.277.61 కోట్లతో పంట సంజీవిని పనులకుగాను 7,455 పూర్తయ్యాయని, మరో 1,96,416 పంట సంజీవిని పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి వివరించారు. రాష్ట్రంలో 708 కోట్లతో 3,04,888 నీటి నిల్వ నిర్మాణాలు(వాటర్‌ హార్వెస్టింగ్‌) చేపట్టామన్నారు. ఈ నెలలో కురిసిన వర్షాలకు భూగర్భ జల మట్టాలు 13.83 నుంచి 12.44 మీటర్లకు చేరాయని వివరించారు.
 
‘కరువు’ తీరింది: పరిటాల
కరువు జిల్లా అనంతపురంలో ఇటీవల కురిసిన వర్షాలతో పంట కుంటలు పూర్తిగా నిండాయని.. దీంతో జిల్లాలో నీటి కరువు తీరిపోయిందని రాష్ట్ర మంత్రి పరిటాల సునీత అన్నారు. పంట కుంటల్లో నీళ్లు కళకళలాడుతున్నాయని దీంతో సీఎం చంద్రబాబు లక్ష్యం నెరవేరిందని పేర్కొన్నారు. అనంతపురంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి పంట కుంటలు పొంగిపొర్లడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారన్నారు. సోమవారం రాప్తాడు, అయ్యవారిపల్లి, హంపాపురం గ్రామాల మధ్య వర్షపు నీటితో నిండు కుండల్లా తొణికిసలాడుతున్న పంట కుంటలను మంత్రి సునీత పరిశీలించి పూజలు చేశారు. గలగల పారుతున్న పండమేరు వంకలో కొబ్బరికాయ కొట్టి పూలు జల్లి పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లా రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు రూ.600 కోట్లతో లక్ష పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అన్నారు. జిల్లాలో కురిసిన వర్షానికి పంట కుంటలు నిండడంపై తిరుపతి మహానాడులో సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. నీటితో నిండిన ఫారం పాండ్లు, పండమేరు వంక ఫొటోలు, వీడియో చూసి సీఎం ఆనందించారని చెప్పారు. ఖరీ్‌ఫలో పంటకు రక్షక తడి అందించేందుకు జిల్లాలో రూ.160 కోట్లతో రైతులకు రెయిన్‌గన్లు అందించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పంట కుంటలు ఏర్పాటు చేసుకున్న రైతులతో మంత్రి మాట్లాడారు. పంట కుంటల ప్రయోజనాన్ని వారికి వివరించారు.
 
కర్నూలులో..
కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్నపెండేకల్‌ గ్రామంలో రైతులు ఏర్పాటు చేసుకున్న పంట కుంటలు పూర్తిగా నిండాయి. రెండు రోజుల కిందట కురిసిన వర్షంతో ఇవి కళకళలాడుతున్నాయి. ఈ జిల్లాలో ఇప్పటికి 30 వేల కుంటలు తవ్వారు.
 
సీఎం లక్ష్యం నెరవేరుస్తాం: కలెక్టర్‌
అనంతపురంలో లక్ష పంట కుంటలు తవ్వాలని సీఎం నిర్ణయించిన లక్ష్యాన్ని త్వరలోనే నెరవేరుస్తామని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ తెలిపారు. జిల్లాలో ఇప్పటికి 53 వేల కుంటలు తవ్వారని, వీటిలో 9,600 పూర్తిగా నిండాయని, మరో 17,500 కుంటల్లో ఆశించిన మేరకు నీరు చేరిందని వివరించారు. జిల్లాలో సుమారు 7 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవుతుందని, అందులో 50 శాతం పంటకి ఈ నీరు ఉపయోగపడుతుందన్నారు. వాటికి అనుసంధానంగా రెయిన్‌ గన్లు కూడా తెప్పిస్తున్నట్టు చెప్పారు.
Posted

50 crore mokkalu natadam antey ground level lo chala corruption jarugutundi.....

Better concentrate on a group of mandals.... Where CM can monitor regularly....

Increasing greenery is a never ending process.... Which should be done incrementally

Posted

India tarapuna climate control lo bhagam ga, students cheyha drive petti, excessive ga trees plant chesi maintain chesina students ki extra credit ani oka 5% isthe better anukunta

Posted

India tarapuna climate control lo bhagam ga, students cheyha drive petti, excessive ga trees plant chesi maintain chesina students ki extra credit ani oka 5% isthe better anukunta

elantidi edo okati cheyyali.

Posted

చెట్లు నాటడం సంస్కృతి కావాలి
చెట్లు నాటడాన్ని సంస్కృతిగా మారాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పుట్టినరోజు, చనిపోయిన రోజు, పండుగలు, వేడుకలకు గుర్తుగా ఒక చెట్టును నాటే విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. అలాగే బహుమతులుగా పూలకు బదులు చెట్లు ఇచ్చే సంస్కృతిని అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఐదు లక్షల మంది ఉన్నారని ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటాలన్నారు. అలాగే విద్యార్థులు, డ్వాక్రా సంఘాలు, ఎన్జీవోలు, ప్రజలు అందరూ భాగస్వాములై చెట్లు నాటాలన్నారు. అలాగే పంటకుంటల కార్యక్రమాన్ని కూడా ఉద్యమంలా చేపట్టాలన్నారు.

Posted

Rain fills up 25,000 farm ponds in Anantapur, says Collector

30VJ_RAIN_G95C9_30_2874219f.jpg

Tangible gains:District Collector Kona Sasidhar visiting form ponds filled with rainwater at Kotanka in Garladinne mandal of Anantapur district on Sunday. Photo: R.V.S. Prasad

62 mandals of the district receive widespread rain

District Collector Kona Sasidhar said that over 25,000 farm ponds, constructed in the district under the ‘Panta Sanjeevani’ programme of the State government, were filled with water to the brim due to the widespread rains received on Saturday.

Mr Sasidhar, who visited farm ponds at Kotanka village of the Garladinne mandal of the district, said that the government’s vision of ensuring that every drop of rainwater was captured and stored for the use of farmers in the district was bearing fruit.

“As planned, all the one lakh farm ponds will be completed as early as possible as the government has already sanctioned Rs. 600 crore for the same, making funding a certainty,” said Mr Sasidhar even as he added that several thousands of farm ponds were in various stages of construction in the district besides the 25,000 already completed. Mr Sasidhar also interacted with farmers in the Kotanka village who were happy as ponds received water.

Meanwhile, 62 of the 63 mandals in the Anantapur district received widespread rain coupled with strong winds on Saturday night, helping the farmers in their pre-sowing preparations.In all, the district received a total of 2,469.5 mm of rainfall across 62 mandals.While the Kanaganapalli mandal received the highest amount of rainfall at 100.3 mm, the Anantapur mandal received 89.9 mm followed by Vidapanakal mandal at 81.9 mm and Guntakal at 80 mm.

With the heavy downpour in the Anantapur mandal, including Anantapur town in a matter of just a few hours, the Pandameru rivulet received its first inflows and could be seen in a spate on the outskirts of the town filling up several checkdams and other water conservation structures.

Underground parking areas in several houses were inundated in Anantapur due to the sudden burst of rain.

Posted

India tarapuna climate control lo bhagam ga, students cheyha drive petti, excessive ga trees plant chesi maintain chesina students ki extra credit ani oka 5% isthe better anukunta

మొక్క నాటినా.. కుంట తవ్వినా లక్షల్లో నజరానా!

636006827385362880.jpg
  • స్థానిక సంస్థలపై సీఎం వరాలు
  • వంద పంట కుంటలు తవ్వితే 4 లక్షలు
  • ఇంటికో ఇంకుడు గుంత లక్ష్యానికి 2 లక్షలు
  • 1200 మొక్కలు పెంచితే 2 లక్షలు
  • బహిరంగ విసర్జన రహిత గ్రామానికి 5 లక్షలు
  • టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు
విజయవాడ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): జలసంరక్షణ.. మొక్కల పెంపకానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంటికో ఇంకుడుగుంత, పొలానికో పంటకుంట, ఊరికో వనం కార్యక్రమాలను విజయవంతం చేసే స్థానిక సంస్థలకు భారీగా నగదు ప్రోత్సాహకాలను సీఎం ప్రకటించారు. శనివారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో కలిపి సుమారు 6126 మందితో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో 1000 మొక్కలు నాటాలని దిశానిర్దేశం చేశారు.
 
మొక్కల పెంపకానికి నజరానాలు

వంద పంట కుంటలు తవ్విన గ్రామాలకు రూ.4 లక్షలు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇంటికో ఇంకుడుగుంత లక్ష్యాన్ని సాధించిన గ్రామానికి రూ.2 లక్షలు, ఓ గ్రామంలో మహిళా సంఘాలు 50 వర్మీ కంపోస్టు యూనిట్లను నెలకొల్పితే రూ.2 లక్షలు, మూడు కిలోమీటర్ల పొడవునా లేదా 1200 మొక్కలు నాటి, పెంచితే రూ.2 లక్షలు నగదు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. గ్రామంలో నాలుగు ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి వాటిని పెంచితే రూ.2 లక్షలు నగదు ప్రోత్సాహం ఇస్తామన్నారు. బహిరంగ విసర్జనరహిత గ్రామాలకు రూ.5 లక్షలు ప్రకటించారు. పొలంలో తవ్విన పంటకుంటల్లోకి నీరు చేరడం వల్ల ఎంతో సంతృప్తి వచ్చిందో సదరు లబ్ధిదారులతోనే ఆయా సభల్లో మాట్లాడిస్తే మిగిలిన వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని సీఎం సూచించారు. రాబోయే నెల రోజుల్లో 6 లక్షల పంటకుంటల తవ్వకం పనులు పూర్తి చేయలని నిర్దేశించారు.
 
ప్రజల సంతృప్తే లక్ష్యం కావాలి

సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో 80 శాతం సంతృప్తి, సంతోషం కనిపించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ‘నవ నిర్మాణ వారోత్సవాల్లో విభజన జరిగిన తీరుపై మరింత చర్చ జరగాలి. 2014 జూన్‌ 4 మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? రెండేళ్లలో ఎంత సాధించాం? ఇంకా సాధించాల్సింది ఎంత? ఇత్యాది అంశాలపై సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు చర్చించాలి. భవిష్యత్తుపై దిశానిర్దేశం చేసుకోవాలి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకుసాగాలి’’ అని సీఎం సూచించారు.

ee news ni baaga publicity cheste use vuntadi

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...