sonykongara Posted July 20, 2016 Author Posted July 20, 2016 nenu 2 days back adigindi deeni gurinche a next day ne post vesa, miru cheusukunnaro ledo.
mahesh1987 Posted July 20, 2016 Posted July 20, 2016 a next day ne post vesa, miru cheusukunnaro ledo.ippati varaku eenadu,andhra jyothi,local leaders or associations chesai kaani Big range lo govt plan cheyaledu
sonykongara Posted July 20, 2016 Author Posted July 20, 2016 ippati varaku eenadu,andhra jyothi,local leaders or associations chesai kaani Big range lo govt plan cheyaledu neeru chettu govt de,vanam manam, vanaharati janabharathi abn eenadu media partners.
sonykongara Posted April 9, 2017 Author Posted April 9, 2017 http://www.nandamurifans.com/forum/index.php?/forum/22-politics-and-daily-news/
sonykongara Posted April 24, 2017 Author Posted April 24, 2017 ఎత్తిపోతలు..జల సిరులు జిల్లాలో ఒకే ఒకటి..కోట నరవ ఆవచెరువు వేసవిలోనూ పుష్కలంగా సాగునీరు ఏడాదిలో రెండు పంటల సాగు వేపగుంట, న్యూస్‌టుడే రెండు దశాబ్దాల కిందట వరకు చెరువు, కోనేరు లేని గ్రామాలంటూ ఉండేవికావు. నీటి సమస్యలు పెద్దగా కనిపించేవికావు. ప్రస్తుతం గ్రామాల్లో కూడా పక్కా నిర్మాణాలు జరగడంతోపాటు చివరకు చెరువులను ఆక్రమించేసి నిర్మాణాలు చేస్తున్నారు. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయి బోర్లలో నీరురాని పరిస్థితి. ఈ పరిస్థితి తమకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కోటనరవ గ్రామస్థులు ఉన్న చెరువుని అభివృద్ధి చేసుకుని ప్రస్తుత తరానికి, భావితరాలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని భావించారు. గ్రామస్థులంతా సంఘంగా ఏర్పడి చెరువు అభివృద్ధికి కృషి చేశారు. * నీరు-చెట్టు పథకంలో భాగంగా ప్రభుత్వం అందించిన నిధులతో చెరువులో పూడిక తీయడం, గట్టును పటిష్టం చేయడంతో వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉంది. ప్రస్తుతం కోటనరవ గ్రామంలో భూగర్భ జలాలు ఉండటంతోపాటు, చెరువు ఆయకట్టు కింద ఉన్న 100 ఎకరాల్లో రైతులు పంటలు పండించుకోగలుగుతున్నారు. జిల్లాలో ఎకైక ఎత్తిపోతల పథకం మేహాద్రి రిజర్వాయరు నిర్మాణం జరగక ముందు ఆవచెరువుకు బొర్రమ్మ గెడ్డ ద్వారా నీరు అందేది. రిజర్వాయరు నిర్మాణం తరువాత ఆ గెడ్డ నీరు రిజర్వాయరు వరకు వచ్చి ఆగిపోయింది. దీంతో చెరువు ఎండిపోవడం ప్రారంభమైంది. రిజర్వాయరు నిర్మాణ సమయంలో ఒక వాల్వుని ఏర్పాటు చేసి చెరువుకు నీటిని సరఫరా చేస్తామని అధికారులు చెప్పినా అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వ్యతిరేకించడంతో వాల్వుని మూసేశారు. దీంతో చెరువు పూర్తిగా ఎండిపోయి రైతులకు నీటికష్టాలు మొదలవడంతో 1994లో ప్రస్తుత ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చొరవచూపి ఎలాగైనా చెరువుకు నీరు తేవాలని సంకల్పించారు. విషయాన్ని అప్పటి మంత్రి రెడ్డి్డసత్యనారాయణకు తెలిపారు. రిజర్వాయరు కింది భాగాన ఉన్న కాలువల పక్కన ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి వాటిద్వారా చెరువులకు నీరు అందించాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో జిల్లాలో చాలా చెరువులకు ఎత్తిపోతల పథకాలు మంజూరు అయ్యాయి. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అన్నీ మూలకు చేరాయి. అయితే కోటనరవకు కేటాయించిన ఎత్తిపోతల పథకం మాత్రం ఇప్పటికీ నడుస్తూ చెరువుకు నీరు సరఫరా జరుగుతోంది. చెరువు వివరాలు ఇలా * విస్తీర్ణం : 32 ఎకరాలు * ఆయకట్టు : 100 ఎకరాలు * ఆధార పడిన రైతులు : 150మంది * పూడిక తీసిన సంవత్సరం : 2016లో వరితోపాటు కూరగాయల సాగు ఆవచెరువులో ప్రస్తుతం నీరు పుష్కలంగా ఉండటంతో రైతులు వరితోపాటు ఆరుతడి పంటలు పండిస్తున్నారు. ఇటీవల వరికోతకు రావడంతో ప్రస్తుతం రైతులు బెండ, బీర, వంగ, నువ్వులు, గేదెలకు పశుగ్రాసం పెంపకం వంటివి చేస్తున్నారు. చెరువు అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకమే కాకుండా రైతులు ఎకరానికి రూ. 200 నీటి తీరువా కింద సంఘానికి ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. పూడిక తీతకు రూ. 18లక్షలు మంజూరు గత ఏడాది చెరువుల్లో పూడికతీతకు ప్రభుత్వం నీరు-చెట్టు పథకంలో నిధులు మంజూరు చేసింది. ఈ పథకం కింద ఆవ చెరువుకు రూ. 18లక్షలు మంజూరయ్యాయి. ఆ మొత్తంతో చెరువులో పూడికను తీయించారు. ఎత్తిపోతల పథకానికి నూతన యంత్రాలు, పాడైన పైపులు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడం కోసం ఎమ్మెల్యే రూ. 20లక్షలు మంజూరు చేయించి ఎత్తిపోతల పథకాన్ని ఆధునికీకరించారు. ఫలితంగా చెరువులోనికి నీరు పుష్కలంగా వచ్చి చేరుతోంది. చేపల పెంపకానికి కొంతభాగం చెరువులో చేపల పెంపకానికి 8 ఎకరాల స్థలాన్ని సంఘం కేటాయించింది. దీనిపై వచ్చిన ఆదాయాన్ని చెరువు అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. సంఘంలో ఉన్న నిధులతోపాటు ప్రభుత్వం మరికొంత సహకరిస్తే ఈ చెరువు చుట్టూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సంఘం సభ్యులున్నారు. చాలా గర్వంగా ఉంది ఎత్తిపోతల పథకం ద్వారా జిలాల్లో ఒక్క ఆవ చెరువుకు నీరు అందించుకోగలుగుతున్నామంటే చాలా గర్వంగా ఉంది. ఎన్ని ఇబ్బందులు తలెత్తినా ఎత్తిపోతల పథకం మూలకు చేరకుండా రైతులమంతా కృషి చేసి నిలబెట్టుకున్నామనే చెప్పాలి. నాకు ఈచెరువు ఆయకట్టు కింద ఎకరం స్థలం ఉంది. ఇటీవల వేసిన వరిపైరు పుష్కలంగా పండింది. ఇప్పుడు ఆరుతడి పంటలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నా. - కర్రిరామునాయుడు, రైతు ఆహ్లాదకరంగా తయారు చేస్తాం.. ఈ చెరువు వల్ల ఆయకట్టు రైతులే కాకుండా గ్రామంలోని ప్రజలు ఎంతగానో లాభపడుతున్నారు. గతంలో వేసవి వచ్చిందంటే గ్రామంలో బోర్లు, బావులు అడుగంటిపోవేవి. పూడిక తీత పనులు పూర్తయిన తరువాత ఎత్తిపోతల పథకంతోపాటు, ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులోకి పుష్కలంగా నీరు చేరింది. ఫలితంగా బోర్లు, బావుల్లో జలకళ కనిపిస్తోంది. నరవ, కోటనరవకు వెళ్లే మార్గంలో ఈ చెరువు ఉంది. దీని నుంచి చల్లని గాలి వస్తుండటంతో స్థానికులు సాయంత్రం ఇక్కడ సేదతీరుతున్నారు. చెరువుచుట్టూ ఆహ్లాదకరమైన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎమ్మెల్యేకి విషయాన్ని తెలియజేసి ఆ దిశగా తగిన చర్యలు తీసుకుంటాం. - పొలమరశెట్టి నూకరాజు, ఆవచెరువు అభివృద్ధి సంఘం అధ్యక్షుడు
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now