Jump to content

polavaram


Recommended Posts

9 minutes ago, sonykongara said:
పోలవరంలో పనితనం మెరుగుపడాలి
శాశ్వత నిర్మాణమైనందున  మరింత దృష్టి పెట్టాలి
చిన్నచిన్న లోపాలే నాణ్యతపై ప్రభావం చూపుతాయి..
ప్రాజెక్టు అధికారులతో  నిపుణుల కమిటీ ఛైర్మన్‌ శర్మ

ఈనాడు-అమరావతి: పోలవరం ప్రాజెక్టులో పనితనం మరింత మెరుగుపడాలని కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ ఛైర్మన్‌ వై.కె.శర్మ సూచించారు. ఇది శాశ్వత కట్టడమైనందున మరింత దృష్టి పెట్టాలని అన్నారు. ప్రాజెక్టు ప్రధానడ్యాం పనులను పరిశీలించిన నిపుణుల కమిటీ బృందం గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం పోలవరం అధికారులతో సమావేశమైంది. స్థూలంగా చూస్తే అంతా సంతృప్తికరమేనని, సూక్ష్మంగా చూసిన సందర్భంలో కొన్ని లోపాలు సరిదిద్దాల్సి ఉందని అన్నారు. ఈ సమావేశంలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీరు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. స్పిల్‌వేలో షట్టర్ల మధ్య కొంత గ్యాప్‌ వస్తోందని, చీలికలుగా కనిపిస్తోందని వారన్నారు. షట్టర్ల మధ్య ఉన్న సందుల(గ్యాప్‌) నుంచి కొంత ముద్ద(స్లర్రీ) కారడం కనిపిస్తోందని, అక్కడ కాంక్రీటు వద్ద రాళ్లు కనిపిస్తున్నాయని ప్రస్తావించారు. అలాంటి చోట మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శర్మ అన్నారు. జాయింట్ల వద్ద జాగ్రత్తలు తీసుకోకపోవడం మంచిది కాదని, ఇవి చిన్న విషయాలైనా కట్టడం నాణ్యతపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. స్పిల్‌వే 2, 3 బ్లాకుల వద్ద వాలులో పైకి స్టీల్‌ ఎందుకు కనిపిస్తోందని ప్రశ్నించారు. మొదట్లో కేంద్ర జలసంఘం నిపుణుల సూచనల ప్రకారమే పనులు చేశామని, ఈ ఇబ్బంది ఉందని గతంలో సూచించగా మసూద్‌ కమిటీ మార్పులు సూచించిందని గుత్తేదారు ప్రతినిధి వివరించినట్లు సమాచారం. మూడునెలలకోసారి నాణ్యతను పరిశీలిస్తున్నామని ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ ప్రతినిధులు చెప్పారు. అలాకాకుండా మధ్యమధ్యలోనూ వచ్చి సూచనలు ఇవ్వాలని జలసంఘం ప్రతినిధులు చెప్పారు. కన్సల్టెన్సీ సేవలందిస్తున్న వ్యాప్కోస్‌ వారితోనూ మాట్లాడారు. గ్యాలరీలో గ్రౌటింగు పనులు ఇప్పటినుంచే చేసుకుంటూ వెళ్లాలని చెప్పారు. నిపుణుల కమిటీ బృందం ధవళేశ్వరం బ్యారేజీని పరిశీలించింది. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణాలో నీరు చేరుతున్న పవిత్రసంగమ ప్రాంతాన్ని కూడా చూసింది.

istham vachinattu hadavidi ga kattesi, modhatikae mosam thaemaakandi ani vignapthi. hadavidi ga katteste, naanyatha pai drusthi lepote, kotha sachivaalayam lo water leak and bengal fly over laanae avuthundhi.

Link to comment
Share on other sites

పోలవరానికి భూమ్‌ యంత్రాలు
10-09-2018 03:22:12
 
636721465293666588.jpg
పోలవరం, సెప్టెంబరు 9: నిర్మాణ పనుల్లో భాగమయ్యేందుకు భూమ్‌ ప్రెజర్‌ యంత్రాలు ఆదివారం పోలవరం చేరుకున్నాయి. దేశంలోనే అతి పెద్దదైన ఈ యంత్రం ద్వారా 63 మీటర్ల ఎత్తు వరకు కాంక్రీటు పోయవచ్చు. స్పిల్‌వే నిర్మాణంలో భాగంగా 53 అడుగుల ఎత్తులో కాంక్రీటు వేయాల్సి ఉంది. ఇందుకోసం చైనాలో తయారుచేసిన రెండు భూమ్‌ ప్రెజర్‌ యంత్రాలను తీసుకొచ్చారు. ప్రస్తుతం రెండు వచ్చాయని, త్వరలోనే మరో యంత్రం వస్తుందని నవయుగ సీనియర్‌ మేనేజర్‌ క్రాంతి చెప్పారు.
Link to comment
Share on other sites

గేట్ల ఘట్టం
దసరా నుంచి అమరిక
పోలవరంలో మరో అడుగు
10ap-main2a.jpg

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టులో మరో కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. త్వరలోనే గేట్ల బిగింపు పనులు ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టులో 48 గేట్ల ఏర్పాటుకు సంబంధించిన స్కిన్‌ ప్లేట్ల తయారీ పూర్తి అయింది. ఒక తలుపు మొత్తం ఒకేసారి పూర్తిగా రూపొందించి ఏర్పాటు చేయడం సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల ముందస్తుగా స్కిన్‌ ప్లేట్ల రూపంలో తయారు చేసుకుని 8 భాగాలను స్పిల్‌ వే వద్దకు తీసుకువెళ్లి అక్కడ అన్నింటినీ కలిపి అమరిక ప్రారంభిస్తారు. గేట్ల అమరిక పనులు దసరా నుంచి ప్రారంభించి నవంబరు నుంచి ఉద్ధృతంగా సాగేలా చూడాలనే లక్ష్యంతో ఇంజినీర్లు పని చేస్తున్నారు. ఇప్పటికే గేట్ల అమరికకు సంబంధించి స్పిల్‌వేలో 43వ బ్లాకులో జె.బోల్టులు (ఆర్మ్‌డ్‌ గడ్డర్లు బిగించే క్లాంప్‌లు) బిగించి కాంక్రీట్‌ వేసే ప్రక్రియ ప్రారంభమైంది. రూ.460 కోట్ల విలువతో గేట్ల తయారీ చేపట్టి కొలిక్కి తీసుకువచ్చారు.

దేశంలో 450 ప్రాజెక్టులకు గేట్ల ఆకృతులను రూపొందించిన ప్రముఖ ఇంజినీర్‌ ఎం.కన్నమనాయుడు పోలవరం గేట్లకు ఓ రూపం తీసుకొచ్చారు. గేట్ల తయారీకి 18 వేల మెట్రిక్‌ టన్నుల ఇనుము అవసరం కాగా ఇప్పటివరకు ‘సెయిల్‌’ నుంచి 11,100 టన్నులు పోలవరం చేరుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు దాదాపు 500 మంది రేయింబవళ్లు చేస్తున్నారు. ఒక్కో గేటు 275 టన్నుల బరువు ఉంటుంది. వీటిని పైకి, కిందకి లేపడానికి రెండు సహాయ కేంద్రాలు (కంట్రోల్‌ రూమ్‌లు) ఏర్పాటు చేసే ఆలోచనలో ఇంజినీర్లు ఉన్నారు. పశ్చిమ జర్మనీలో తయారు చేసే హైడ్రాలిక్‌ సిలిండర్లను గేట్లు లేపడానికి ఉపయోగించనున్నారు.

Link to comment
Share on other sites

పోలవరం చరిత్రలో మరో అధ్యాయం
నేడు స్పిల్‌వే గ్యాలరీని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన యంత్రాంగం
పోలవరం, న్యూస్‌టుడే
weg-top1a.jpg

నదుల అనుసంధాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి, ఎన్నో సంచలనాలకు, రికార్డులకు వేదికైన పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో అధ్యాయానికి బుధవారం శ్రీకారం చుడుతున్నారు. ప్రాజెక్టు స్పిల్‌వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని ప్రారంభించడంతోపాటు అందులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి నడవనున్నారు. ఆయనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

గ్యాలరీలో నడక సంక్లిష్టం అయినప్పటికీ అన్ని శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు చేశారు. ఇటు అధికార యంత్రాంగం, అటు ఎస్పీ రవిప్రకాష్‌ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. గ్యాలరీలో వైద్య బృందాలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, అత్యవసరమైతే తరలించేందుకు అంబులెన్సులు సిద్ధం చేశారు. దాదాపు రెండు వేల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. మరో వెయ్యి మంది గ్రేహౌండ్స్‌, సీఆర్‌ఫీఎఫ్‌ దళాలు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా వైపున ఉన్న అడవుల్లో క్యూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిసరాలను పోలీసుల స్వాధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు మార్గాన వచ్చే ప్రజాప్రతినిధులకు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఎవరి వాహనాలు ఎక్కడ పార్కింగ్‌ చేయాలో సూచించారు. ముఖ్యమంత్రి బందోబస్తును 11 సెక్టార్లుగా విభజించారు. అటు ప్రజలు.. ఇటు ప్రజాప్రతినిధుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టు హిల్‌వ్యూపై నుంచి ముఖ్యమంత్రి పర్యటించే మార్గాల్లో కాన్వాయ్‌ ట్రయిల్‌ రన్‌ను ఎస్పీ మంగళవారం పర్యవేక్షించారు.

నేడు ముఖ్యమంత్రి రాకకు ముమ్మర ఏర్పాట్లు
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణంలో అంతర్భాగమైన గ్యాలరీలో నడిచేందుకు బుధవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. డీఐజీ రవికుమార్‌మూర్తి, ఎస్పీ రవిప్రకాష్‌, ప్రాజెక్టు సీఈ వి. శ్రీధర్‌, జిల్లా సంయుక్త కలెక్టరు వేణుగోపాలరెడ్డి మంగళవారం ప్రాజెక్టులో చేపట్టిన పనులను పరిశీలించారు. ప్రాజెక్టు హిల్‌వ్యూ కొండపై హెలీకాఫ్టర్‌లో దిగిన సీఎం అక్కడ నుంచి రోడ్డు మార్గాన స్పిల్‌వే 48వ బ్లాక్‌ వద్దకు చేరుకుంటారని సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ ఆవిష్కరిస్తారని సీఈ తెలిపారు. అనంతరం ఆ బ్లాక్‌ వద్దే గ్యాలరీలో నడక ప్రారంభిస్తారని ఒకటవ బ్లాక్‌ నుంచి బయటకు వస్తారన్నారు. అందుకు అనుగుణంగా గ్యాలరీ లోపలి భాగంలో పనులు ముమ్మరం చేశామని, మంచి గాలి, చల్లదనం వచ్చేందుకు వీలుగా యంత్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయన నడక ప్రారంభించిన కొద్దిసేపటికి మంత్రులు, ఆ తరువాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను లోపలకు పంపుతామన్నారు. స్పిల్‌వే 3వ బ్లాక్‌ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక పైనుంచి ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడతారన్నారు. సీఎం పర్యటన పురస్కరించుకుని బాంబ్‌, డాగ్‌స్క్వాడ్‌ బృందాలు గ్యాలరీతోపాటు చుట్టు పక్కల పరిసరాలను ముమ్మరంగా తనిఖీలు చేశాయి. గ్యాలరీలో లైట్లు ఏర్పాటు చేశారు. 26వ బ్లాక్‌లో పనులు మాత్రం పనులు సాయంత్రం వరకు జరుగుతూనే ఉన్నాయి. అంతా బురదమయం కావడంతో తొలగించే ఏర్పాటు చేస్తున్నారు. మెట్ల వద్ద జారిపోకుండా ఇసుకబస్తాలు వేయిస్తున్నారు. 48వ బ్లాక్‌ వద్ద గ్యాలరీలోకి ముఖ్యమంత్రి ఇతర ప్రజాప్రతినిధులు దిగేందుకు వీలుగా మెట్లు ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. అవతలవైపున ఒకటో నెంబరు బ్లాక్‌వద్ద మాత్రం మెట్లు సిద్ధం చేశారు. తెల్లవారేసరికి వైద్యబృందాలు, ఆక్సిజన్‌ సిలిండర్లు గ్యాలరీ వద్దకు చేరుకుంటాయన్నారు. 2, 26, 34 బ్లాక్‌ల వద్ద వైద్యులతోపాటు అంబులెన్సులు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు కొద్దిమందిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఒక్కసారిగా అందరూ లోపలకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. అంచెలంచెలుగా పంపుతామన్నారు. గోతులమయమైన ప్రాజెక్టు రోడ్డును యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేస్తున్నారు.

ఇది ప్రతిష్ఠాత్మకం
ప్రాజెక్టు స్పిల్‌వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీలో నిర్వహించనున్న నడక పోలీసులకు ప్రతిష్ఠాత్మకమని ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ అన్నారు. బుధవారం ప్రాజెక్టులో సీఎం పర్యటనను పురస్కరించుకుని చేయాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అలసత్వం వహిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్‌, సీఐ ఎం. రమేష్‌బాబు తదితరులు ఉన్నారు.

 
Link to comment
Share on other sites

గ్యాలరీ చరిత్రాత్మక ఘట్టం
13-09-2018 02:58:01
 
636724042826434624.jpg
  •  పోలవరమంటే జగన్‌కు తెలియదు
  •  మూడున్నరేళ్లలో 60% పూర్తి: లోకేశ్‌
పోలవరం, సెప్టెంబరు 12: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, కేఎస్‌ జవహర్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, లోకేశ్‌లతో పాటు సభాపతి కోడెల శివప్రసాదరావు, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు హాజరయ్యారు. స్పిల్‌వే వద్ద రైతులతో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో కూడా వీరు పాల్గొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా.. ప్రాజెక్టు పనులను పరుగులు తీయిస్తున్న చంద్రబాబును అనేక విధాలుగా కొనియాడారు. ‘వైసీపీ అధ్యక్షు డు వైఎస్‌ జగన్‌కు పోలవరం ప్రాజెక్టు అంటే ఏమిటో తెలియదు. కానీ.. జైలు తలుపుకు ఎన్ని ఊచలుంటా యో బాగా తెలుసు.
 
సీఎం అవ్వాలన్న కోరిక తప్ప ఆయనకు వేరే ధ్యాసే లేదు. అలాంటివారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి. నాలుగు దశాబ్దాల కలగా ఉన్న పోలవరాన్ని కేవలం నాలుగేళ్లలో 60 శాతానికి పైగా పూర్తిచేసిన ముఖ్యమంత్రికి అభినందనలు’ అని అయ్యన్న తెలిపారు. ‘స్పిల్‌వేలో గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రాత్మక ఘట్టం. ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకోవడం మా అదృష్టం’ అని కాల్వ పేర్కొన్నారు. ‘పోలవరంపై విమర్శలు చేస్తున్న జగన్‌కు బుద్ధి ఉండాలి. చంద్రబాబు రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారు. కేంద్ర సహకారం లేకపోయినా పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని ఆదినారాయణరెడ్డి చెప్పారు. పోలవరాన్ని నిర్మిస్తున్న సీఎం అపర భగీరథుడు అని జవహర్‌ అభిప్రాయపడ్డారు. ‘పోలవరం నిర్మించాలన్న కల 1941లో తెరపైకి వచ్చినా.. ఆరు దశాబ్దాలపాటు కలగానే ఉండిపోయింది. చంద్రబాబు పవిత్ర సంకల్పంతో పోలవరాన్ని చేపట్టి బుధవారం గ్యాలరీ ప్రారంభించారు. కిలోమీటరు మేర కుటుంబ సభ్యులతోపాటు తన మనవడు దేవాన్ష్‌తో కలసి నడవడం ఒక చరిత్ర. 2019కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లు కృషి చేస్తున్నారు’ అని దేవినేని ఉమ చెప్పారు.
 
‘పోలవరంలాంటి ప్రాజెక్టును నిర్మించాలంటే ఐదు తరాలు పడుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబా బు కేవలం మూడున్నరేళ్లలో 60 శాతం పనులు పూర్తి చేశారు. నాలుగు తరాలు చేయలేని పనిని ముఖ్యమంత్రి చేస్తున్నారు. గ్యాలరీలో ఉన్న 200 మెట్లను ఎవరికీ అందనంత వేగంతో దిగి పైకి ఎక్కారు. మన కోసం మన పిల్లల భవిష్యత్‌ కోసం చేస్తున్న కృషి చరిత్రలో నిలిచిపోతుంది’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.
 
చంద్రబాబు కృషీవలుడు: స్పీకర్‌ కోడెల
స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. చంద్రబాబు నిత్య కృషీవలుడు, ప్రజల మనిషి అని కొనియాడారు. గ్యాలరీ ప్రారంభోత్సవం తన జీవితంలో మర్చిపోలేని రోజని చెప్పారు.
 
ప్రపంచ రికార్డులన్నీ పోలవరంలోనే: నవయుగ
2019 జూన్‌ నాటికి కాఫర్‌ డ్యాంలను పూర్తి చేసి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లిస్తామని ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కృష్టా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు ముందుగా సాగునీరు అందించి ఆ పంటలు తుపానుల బారిన పడకుండా కాపాడుతున్నామని గుర్తుచేశారు. పోలవరం పనుల పూర్తిలో ఇప్పటికే రికార్డులు బద్దలవుతున్నాయని నవయగ ఎండీ శ్రీధర్‌ అన్నారు. ప్రతి పనిలోనూ రికార్డు సృష్టిస్తామని, ప్రపంచ రికార్డులన్నీ పోలవరంలోనే ఉండేవిధంగా చూస్తామని చెప్పారు.
 
మట్టిలో కూరుకుపోయిన బస్సు
పెదవేగి: పోలవరం పర్యటనకు బయలుదేరిన ప్రజాప్రతినిధుల బస్సు మట్టిలో కూరుకుపోయింది. దీంతో వారిని వేరొక బస్సులో పోలవరం పంపించారు. క్రేన్‌, ట్రాక్టరు సాయంతో అరగంటపాటు కష్టపడి మట్టిలో దిగబడిన బస్సును బయటకు తీశారు.
 
 
మమ్మల్నీ ఉపయోగించుకోండి: విష్ణు
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించిందని.. సీఎం ఆధ్వర్యంలో పనులు వేగంగా సాగుతున్నాయని విష్ణుకుమార్‌రాజు చెప్పారు. పనులు ఇంత వేగంగా జరగడానికి కారకులైన కాంట్రాక్టరు, అధికారులను అభినందించాలన్నారు. దీని నిర్మాణంలో కేంద్రం సహకారం అందిస్తుందని, మరింత సహకారానికి తమ ను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...