sonykongara Posted September 24, 2017 Author Posted September 24, 2017 విశాఖ- చెన్నై కారిడార్ అభివృద్ధి మంత్రి అమర్‌నాథ్ రెడ్డి నెల్లూరు: చెన్నై- బెంగళూరు కారిడార్ కోసం ప్రభుత్వం రూ.5,500 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులతో మంత్రులు నారాయణ, అమర్‌నాథ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. విశాఖ- చెన్నై కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి అమర్‌నాథ్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. కోస్టల్ ప్రాంతాన్ని కోస్టల్ ఎంప్లాయిస్ జోన్‌గా మారుస్తామని చెప్పారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పరిశ్రమలు పెట్టేందుకు రూ.50 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. భారతదేశంలోకెల్లా ఏపీని నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఉన్న ప్రతి పేదవాడికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామని మంత్రి తెలిపారు.
sonykongara Posted November 17, 2017 Author Posted November 17, 2017 వీసీఐసీకి రూ.3,187 కోట్ల రుణం ఈనాడు, అమరావతి: విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్(వీసీఐసీ) ప్రాజెక్టు కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి తీసుకోనున్న రూ.3,187 కోట్ల రుణానికి సంబంధించి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. గురువారం పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు తీసుకోవడానికి ఆ సంస్థలో ఒప్పందాలు, తదుపరి కార్యకలాపాలు కొనసాగించే వీలు కల్పిస్తూ ప్రభుత్వం అనుమతులిచ్చింది.
sonykongara Posted November 22, 2017 Author Posted November 22, 2017 తీరం... పారిశ్రామికం 22-11-2017 02:14:01 ప్రత్యేక సదుపాయాలకై ‘అపిక్టా’ బిల్లు అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): తీరప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి కోసం సర్వస్వతంత్రంగా వ్యవహరించేలా రాష్ట్ర పరిశ్రమలశాఖ అసెంబ్లీలో మంగళవారం ‘ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ యాక్టు(అపిక్టా)’ను ప్రవేశపెట్టింది. పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి ప్రవేశ పెట్టిన ఈ బిల్లుపై చర్చ జరగాల్సి ఉంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్లకుపైగా ఉన్న సముద్ర తీర ప్రాంతంలో పరిశ్రమలను స్థాపించేందుకు అవసరమైన రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు, నిరంతర విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే... సముద్ర తీర పరిరక్షణ చర్యలూ చేపట్టేందుకు వీలుగా ‘అపిక్టా’ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రధానంగా వైజాగ్ -చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు-చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్‌లను ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఈ అపిక్టా బిల్లును ప్రవేశపెట్టారు. ఈ కారిడార్ల పరిధిలో స్థాపించే పరిశ్రమలకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. సరుకులు ఉత్పత్తి చేసిన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారునికి చేరేలా రవాణా వ్యవస్థనూ రూపొందించనున్నారు. ఈ బిల్లు ప్రధానోద్దేశం... తీరప్రాంతంలో నోడ్‌లను ఏర్పాటు చేసి పారిశ్రామికవాడలను అభివృద్ధి చేయడం. ఈ అపిక్టాకు సీఎం చైర్మన్‌గా బోర్డు ఏర్పాటు చేస్తారు. పరిశ్రమలశాఖ ప్రత్యేక/ముఖ్య కార్యదర్శి బోర్డు సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. అపిక్టా పరిధి విస్తృతంగా ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాలు, గ్రామకంఠాల నుంచి మినహాయింపును ఇచ్చారు. అపిక్టా పని ఏంటి? పారిశ్రామిక నోడ్ల ఏర్పాటు చేసేందుకు రూపొందించే మాస్టర్‌ప్లాన్‌లను అపిక్టా ఆమోదం తెలుపుతుంది. మారుతున్న అభివృద్ధికి అనుగుణంగా ప్రతి ఆరేళ్లకు మాస్టర్‌ప్లాన్‌ను పునఃపరిశీలన చేస్తుంది. నోడ్ల పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనపై అపిక్టా ప్రత్యేక దృష్టి సారిస్తుంది. పారిశ్రామిక నోడ్‌కు జాతీయ రహదారిని, ఓడరేవును, విమానాశ్రయాన్ని అనుసంధానం చేసేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. నోడ్‌లో పురపాలక సేవలనూ అందిస్తారు. ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వహణ సులువుగా జరిగేందుకు వీలుగా తగు ప్రమాణాలు పాటించేలా అపిక్టా పర్యవేక్షణ చేస్తుంది. పారిశ్రామిక కారిడార్‌లో అపిక్టా అనుమతి లేకుండా ఎలాంటి భవనాన్నీ నిర్మించేందుకు వీల్లేదు. ఎలాంటి తవ్వకాలూ చేపట్టకూడదు. ఇవన్నీ అపిక్టా ఆమోదంతోనే చేయాలి. అపిక్టా నియమ నిబంధనలు పాటించని సంస్థలు అపరాద రుసుసు చెల్లించాల్సి వస్తుంది. నోడ్‌లో ఏర్పాటుచేసే పారిశ్రామిక సంస్థల స్థాయిని అనుసరించి యూజర్ చార్జీలు, ఫీజులు, బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది.
sonykongara Posted November 29, 2017 Author Posted November 29, 2017 వైజాగ్-చెన్నై కారిడార్లో రూ.2200 కోట్లతో అభివృద్ధి పనులు: అమరనాథ్‌రెడ్డి29-11-2017 17:07:58 గుంటూరు: వైజాగ్-చెన్నై కారిడార్లో రూ.2200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతాయని అమరనాథ్‌రెడ్డి తెలిపారు. చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిపై ఒప్పందం చేసుకున్నామని అమరనాథ్‌రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో కేంద్రంతో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుందని అమరనాథ్‌రెడ్డి చెప్పారు. కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద 12,500 ఎకరాలు అభివృద్ధి చేస్తామన్నారు. ఏర్పేడు-శ్రీకాళహస్తి, కర్నూలు-ఓర్వకల్లుల్లో అభివృద్ధికి ఏపీ ప్రతిపాదన చేసిందని అమరనాథ్‌రెడ్డి వెల్లడించారు. రూ.10 నుంచి 12 వేల కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అమరనాథ్‌రెడ్డి తెలిపారు. ఒప్పందం అమల్లోకి వస్తే రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశామని ఆయన అన్నారు. రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అమరనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.
sonykongara Posted December 7, 2017 Author Posted December 7, 2017 నక్కపల్లి భూ నిర్వాసితులకు తీపి కబురు07-12-2017 13:50:17 పారిశ్రామిక కారిడార్ భూములకు నష్టపరిహారం సొమ్ము విడుదల రూ.420 కోట్లు మంజూరు.... వారం పది రోజుల్లో బ్యాంకు ఖాతాలకు జమ నక్కపల్లి(విశాఖ జిల్లా): విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం నక్కపల్లి మండలంలో భూములు ఇచ్చిన రైతులు ఎట్టకేలకు పరిహారం సొమ్ము అందుకోనున్నారు. జిరాయితీ, డి.పట్టాదారులకు సుమారు రూ.420 కోట్లు విడుదల చేసినట్టు తెలిసింది. ఈ సొమ్ము వారం నుంచి పది రోజుల్లో ఆయా నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని సమాచారం. సుమారు ఏడాదిన్నర నుంచి పరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతులు, ఈ సమాచారం తెలియడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం నక్కపల్లి మండలంలో చందనాడ, రాజయ్యపేట, డీఎల్‌పురం, వేంపాడు రెవెన్యూ గ్రామాల పరిధిలో 2,310 ఎకరాల జిరాయితీ, 1330.93 ఎకరాల డి.పట్టా భూములను ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరించింది. జిరాయితీలో 950 ఎకరాలకు సంబంధించి పరిహారాన్ని గత ఏడాది చెల్లించారు. మిగిలిన 1,360 ఎకరాలకు దాదాపు రూ250 కోట్లు చెల్లించాల్సి వుంది. వీటితో పాటు 1330.93 ఎకరాల డి.పట్టా భూములకు ఎకరాకు రూ.13 లక్షల చొప్పున దాదాపు రూ.170 కోట్లు చెల్లించాలి. కానీ ఎన్ని రోజులు అయినా డబ్బులు చేతికి అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని నిర్వాసితులు పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పారు. ఇటీవల రైతు సంఘం నాయకులు, ఎమ్మెల్యే అనిత, తదితరులు సీఎం చంద్రబాబునాయుడుని, ఏపీఐఐసీ చైర్మన్, ఎండీలను కలిసి నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి, పరిహారం సొమ్ము పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా జిరాయితీ భూములకు సంబంధించి రూ.250 కోట్లు, డి.పట్టా భూములకు రూ.170 కోట్లు చెల్లించాల్సి వుందని, నిర్వాసిత రైతుల కోసం నిధులు మంజూరైన మాట వాస్తవమేనని నర్సీపట్నం ఆర్డీవో కోరాడ సూర్యారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్తిబాబు బుధవారం సాయంత్రం ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. ఎమ్మెల్యే అనిత కృషి వల్లే పరిహారం మంజూరైందని డీఎల్‌పురం సర్పంచ్ గింజాల లక్ష్మణరావు చెప్పారు. భూ రికార్డుల పరిశీలన అనంతరం చెల్లింపులు: ఆర్డీవో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం ఏపీఐఐసీ సేకరించిన డి.పట్టా భూములకు సంబంధించి ,రికార్డులను మరోసారి తనిఖీ చేస్తున్నామని, పూర్తిస్థాయిలో పరిశీలన అనంతరమే పరిహారం చెల్లింపులు వుంటాయని నర్సీపట్నం ఆర్డీవో కోరాడ సూర్యారావు చెప్పారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను నాలుగు విభాగాలుగా పరిశీలన చేస్తున్నామని, ఇప్పటికే సర్వే పూర్తయిందని, మరోసారి సమగ్ర వివరాలు పొందుపర్చాల్సివుందన్నారు. డి. పట్టాదారులెంతమంది వున్నారు? పట్టాభూములను ఎవరైనా అమ్మేస్తే ప్రస్తుతం సాగులో ఎవరున్నారు? ప్రభుత్వ భూముల్లో రికార్డుల ప్రకారం ఆక్రమణదారులెంతమంది వున్నారు? రెవెన్యూ రికార్డుల్లో లేకుండా ప్రభుత్వ భూముల్లో ఆక్రమణదారులు ఎంత మంది వున్నారు? అన్న వాటి వివరాలను క్రోడీకరించాల్సి వుందని, వీలైనంత త్వరలో ఈ పని పూర్తవుతుందన్నారు. తహీసల్దార్ రాణీ అమ్మాజీ, డీటీ శ్రీనివాస్, సర్వేయర్ శ్రీరామ్మూర్తితో ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు.
sonykongara Posted February 22, 2018 Author Posted February 22, 2018 కదలని ఏపీ కారిడార్లు 22-02-2018 04:27:00 బుందేల్ ఖండ్‌కు కొత్తగా రక్షణ కారిడార్ రూ.20కోట్లతో ప్రకటించిన ప్రధాని బీజేపీ పాలిత ప్రాంతానికి వరం అమరావతి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు అతీగతీ లేదు. రాష్ట్రంగుండా వెళ్లే బెంగళూరు-చెన్నై కారిడార్ సంగతీ తేలడంలేదు. కానీ... తమ సొంత పార్టీ పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌కు ప్రధాని మోదీ భారీ వరం ప్రకటించారు. వెనుకబడిన ప్రాంతమైన బుందేల్‌ఖండ్‌లో 2.5 లక్షల మందికి ఉపాధి లభించే... రూ.20వేల కోట్ల విలువైన ‘రక్షణ ఉత్పత్తుల సమాహారం’ (డిఫెన్స్ ప్రొడక్షన్ కారిడార్) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లఖ్‌నవ్‌లో జరుగుతున్న పారిశ్రామికవేత్తల సదస్సులో ఈ ప్రకటన చేశారు. దేశంలో రెండు రక్షణ ఉత్పత్తుల కారిడార్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. ఇందులో ఒకటి... ఇప్పటికే చెన్నై-బెంగళూరు మధ్య ఏర్పాటు చేయనున్నారు. రెండో కారిడార్‌ను యూపీలో ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ బుధవారం ప్రకటించారు. ‘‘బుందేల్‌ఖండ్ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రక్షణ కారిడార్‌ను ఆగ్రా, అలహాబాద్, లఖ్‌నవూ, కాన్పూర్, ఝాన్సీ, చిత్రకూట్‌కు విస్తరిస్తున్నాం. దీనివల్ల రూ.20వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది’’ అని వివరించారు. ఏపీ కారిడార్‌లు ఎందాకా? కేంద్రం ప్రకటించిన వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లు ఇప్పటిదాకా ముందుకు కదల్లేదు. చెన్నై-బెంగళూరు కారిడార్ ప్రతిపాదనల దశనే దాటలేదు. వైజాగ్ - చెన్నై కారిడార్‌కు ఆసియా డెవల్‌పమెంట్ బ్యాంకు నుంచి 79.8 కోట్ల డాలర్ల రుణాన్ని ఇప్పించింది. దీనిని 2019లోగా వాడుకుంటే ఆ మొత్తాన్ని భరిస్తామని కేంద్రం పేర్కొంది. ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వం రూ.535 కోట్లను భూ సేకరణ, ఇతర అవసరాలకు చెల్లింపులు జరిపింది. ప్రాజెక్టుపై కొర్రీల మీద కొర్రీలను వేస్తూ కేంద్రం కాలయాపన చేస్తోంది. ఫలితంగా 2019లోగా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్న ఆశలు ఆవిరయ్యాయి. కాళ్లు కట్టేసి పరిగెత్తమన్నట్లుగా కేంద్రం తీరు ఉందనే విమర్శలున్నాయి. వెనుకబడిన బుందేల్‌ఖండ్‌కు ప్రత్యేక సహాయం చేయాల్సిందే. అదే సమయంలో...రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు కూడా చేయూతనివ్వాలి. బుందేల్‌ఖండ్ ప్యాకేజీ తరహాలో ఈ జిల్లాలకు ఏటా రూ.50 కోట్ల చొప్పున ఇస్తామన్నారు. రెండేళ్లు ఇచ్చి వదిలేశారు. పరిశ్రమలకు పన్ను ప్రోత్సాహకాలు కూడా జీఎస్టీ నేపథ్యంలో అమలు కావడంలేదు.
sonykongara Posted March 21, 2018 Author Posted March 21, 2018 పారిశ్రామికీకరణకు చేయూత కరవువిశాఖ-చెన్నై నడవా మంజూరు చేసినా అభివృద్ధికి నిధులివ్వని కేంద్రంజాతీయ కారిడార్ ట్రస్ట్ పరిధిలోకి తేవాలని కోరినా దక్కని ఫలితంతొలి దశ 11 ప్రాజెక్టుల్లో ఒక్కదానికే టెండరు ఖరారుఈనాడు - అమరావతి రాష్ట్ర విభజనతో తీవ్ర ఆర్థికలోటు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికీకరణకు దోహదపడేలా విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ)ని కేంద్రం మంజూరు చేసినా...దాని అభివృద్ధిపరిచేందుకు అవసరమైన నిధులు మాత్రం ఇవ్వడం లేదు. కేంద్రం నుంచి ఆర్థికసాయం పొందేందుకు వీలుగా జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్టు (ఎన్‌ఐసీడీఐటీ) పరిధిలోకి వీసీఐసీని చేర్చాలని విన్నవించినా పట్టించుకోవడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకుని, మరికొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పెట్టుబడి పెట్టి ఈ కారిడార్ అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. విభజన చట్టంలోని సెక్షన్ 93లో వీసీఐసీ గురించి పొందుపరిచారు. దాని ప్రకారం 2014 జూన్ 2 నుంచి ఆరు నెలల్లోపు దీనిపైన అధ్యయనం చేయించి, దిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్ తరహాలోనే నిర్దిష్ట కాలపరిమితిలోగా అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా కేంద్రం నుంచి తగిన ప్రోత్సాహం లేదు. బిడ్డింగ్ దశలోనే అనేకం..తూర్పుకోస్తా ఆర్థిక కారిడార్‌లో అంతర్భాగంగా వీసీఐసీని ప్రభుత్వం చేపట్టింది. ఇది దేశంలోనే తొలి కోస్తా ఆర్థిక కారిడార్. దీని పరిధిలో విశాఖపట్నం (6,931 ఎకరాలు), మచిలీపట్నం (12,145 ఎకరాలు), శ్రీకాళహస్తి-ఏర్పేడు (26,425 ఎకరాలు), దొనకొండ (17,117 ఎకరాలు) నోడ్‌లను ప్రతిపాదించింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సహకారంతో దీన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళిక. అందులో భాగంగా మొదటి, రెండో దశలకు రూ.4,170 కోట్లు రుణమిచ్చేందుకు ఏడీబీ ముందుకొచ్చింది. తొలిదశ కోసం రూ.1,570 కోట్లు మంజూరు చేసింది. విధానపరమైన విభాగాల కింద రూ.803 కోట్లు, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యల కోసం మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు రూ.32 కోట్లు మంజూరు చేసింది. ఇవి కాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు దశల్లోనూ రూ.1,434 కోట్లు పెట్టుబడులు పెట్టాలనేది ప్రణాళిక. తొలిదశలో భాగంగా పారిశ్రామిక, పట్టణ మౌలిక వసతులు, రోడ్లు, పవర్ ప్రాజెక్టులు తదితర 11 ప్రాజెక్టులు చేపట్టాలనేది ప్రతిపాదన. వీటిల్లో ఒక్కదానికే టెండర్లు ఖరారయ్యాయి. మిగతావన్నీ ఇంకా బిడ్డింగ్ దశలోనే ఉన్నాయి. రెండు సార్లు లేఖలు రాసినా...దేశవ్యాప్తంగా పారిశ్రామిక కారిడార్లను ఒకే తరహాలో అభివృద్ధి చేసేందుకు, సమన్వయం చేసుకునేందుకు పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ (డీఐపీపీ) నియంత్రణలో కేంద్ర జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్టు (ఎన్‌ఐసీడీఐటీ)ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే వీసీఐసీలో ప్రతిపాదించిన విశాఖపట్నం, మచిలీపట్నం, శ్రీకాళహస్తి-ఏర్పేడు, దొనకొండ నోడ్‌లను ఎన్‌ఐసీడీఐటీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ గతేడాది జూన్ 9వ తేదీన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యమంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన సీఎం చంద్రబాబు కూడా కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రికి లేఖ రాశారు. అయినా ఇప్పటివరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. వీసీఐసీ మొదటిలో దశలో చేపట్టే పలు ప్రాజెక్టులు-వాటి ప్రస్తుత స్థితిగతులు * నాయుడుపేట పారిశ్రామిక క్లస్టర్‌లో రోజుకు పది లక్షల లీటర్ల పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధిచేసే కర్మాగార నిర్మాణం. - ప్రాజెక్టు అంచనాలపైన ప్రాథమిక నివేదికను ఏడీబీకి సమర్పించారు * నాయుడుపేట పారిశ్రామిక క్లస్టర్‌లో రోజుకు 21 మిలియన్ లీటర్ల నీటి సరఫరా. - ప్రాజెక్టు అంచనాలపైన ప్రాథమిక నివేదికను ఏడీబీకి సమర్పించారు. * నాయుడుపేట పారిశ్రామిక క్లస్టర్‌లో ఘనవ్యర్థాల నిర్మూలన, అంతర్గతరోడ్లు, విద్యుత్తు, వన్‌స్టాప్ సెంటర్ ఏర్పాటు. -నిర్మాణ పనులు అప్పగించారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. * కాపులుప్పాడ, నక్కపల్లి, చందనాడ, అచ్యుతాపురంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు సరఫరా సామర్థ్యం పెంపు. -ఆర్థిక ప్రతిపాదనలు తయారు చేయాలని ఏడీబీ సూచించింది. * రాచగున్నేరి, నాయుడుపేట, ఏర్పేడులో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు సరఫరా సామర్థ్యం పెంపు. -ప్రాజెక్టు అంచనాలపై ప్రాథమిక నివేదికను ఏడీబీకి సమర్పించారు. * ముదసర్లోవ సరస్సు నవీకరణ, అభివృద్ధి -డీపీఆర్ సిద్ధమైంది. * ముదసర్లోవ/మేఘాద్రి గడ్డలో 3 మెగావాట్ల సౌర విద్యుత్తు పార్కు నిర్మాణం. -టెండర్లు పిలిచారు. * విశాఖపట్నం పరిధిలో 3 రహదారులను వాహన రహిత జోన్లుగా మార్చుట. -డీపీఆర్ సిద్ధమైంది.
sonykongara Posted July 17, 2018 Author Posted July 17, 2018 పర్యావరణ హితంగా విశాఖ-చెన్త్నె పారిశ్రామిక నడవ పరిశ్రమలశాఖ కమిషనర్ సిద్ధార్థ్‌జైన్ ఈనాడు-అమరావతి: విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవను (వీసీఐసీ) పర్యావరణ అనుకూలంగా రూపొందించాలని పరిశ్రమలశాఖ కమిషనర్ సిద్ధార్థజైన్ అన్నారు. విజయవాడలో సోమవారం వీసీఐసీపై పరిశ్రమల, వాణిజ్య వ్యవహారాలశాఖ, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) సంయుక్తంగా భాగస్వామ్య ప్రభుత్వశాఖల అధికారులు, గుత్తేదారులు, పర్యావరణ నిపుణులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీగా ఉపాధి లభించి, ఎక్కువ కాలం వృద్ధి ఫలాలు దక్కాలంటే పర్యావరణానికి నష్టం కలగకుండా చూడాలని సూచించారు. సామాజిక పరిరక్షణ నిబంధనల నిపుణుడు వి.చంద్రశేఖరన్ మాట్లాడుతూ పట్టా భూములున్న వారితోపాటు చాలాకాలం నుంచి భూముల్లో నివాసం ఉంటున్న, సాగు చేసుకుంటున్న వారు కూడా పరిహారానికి అర్హులేనన్నారు. గ్రామాల్లో నిర్వాసితులకు రూ.5 లక్షల పరిహారం లేదంటే 20 ఏళ్లపాటు నెలకు రూ.2 వేలు చొప్పున ఇవ్వాలన్నారు.
sonykongara Posted July 20, 2018 Author Posted July 20, 2018 వీసీఐసీ పనులు వేగవంతం20-07-2018 03:28:10 అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్(వీసీఐసీ) ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడానికి సకాలంలో సాయం అందించాలని ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులను సీఎస్ దినేశ్‌కుమార్ కోరారు. గుర్తించిన నాలుగు ఇండస్ర్ట్రియల్ క్లస్టర్లలో పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రాజెక్టు ప్రగతిపై చర్చించేందుకు గురువారం సచివాలయంలో సీఎ్‌సతో ఏడీబీ ఉపాధ్యక్షుడు వెన్కాయ్ ఝాంగ్ భేటీ అయ్యారు. వీసీఐసీ కోసం ఏడీబీ రూ.5,544కోట్ల రుణం అందిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా విశాఖ, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి- ఏర్పేడుల్లో నాలుగు పారిశ్రామిక ప్రాంతాల ఏర్పాటుకు ప్రతిపాదించారు.
sonykongara Posted October 12, 2018 Author Posted October 12, 2018 AP plans to control pollution along VCIC DECCAN CHRONICLE. Published Oct 12, 2018, 1:35 am IST Updated Oct 12, 2018, 1:35 am IST To lessen the problems of high carbon pattern of growth, sustainable transport initiatives are necessary as well as renewable energy production. N. Chandrababu Naidu Vijayawada: After being in the top position consecutively for two times in Ease of Doing Business, Andhra Pradesh has embarked on another journey to attain Ease of Living for the people in the state, as stated by Chief Minister N. Chandrababu Naidu, and is taking up initiatives such as electric vehicles and solar power projects to mitigate pollution caused due to industrial and infrastructure development. “To do so, the government of Andhra Pradesh began with Visakhapatnam and Chennai Industrial Corridor (VCIC) by utilising Urban Climate Change Resilience Trust Fund,” commissioner of industries Siddharth Jain said on Thursday. According to the commissioner, the government is taking up activities that mitigate environmental impact due to projects involved in the infrastructure developm-ent activities for the corridor. As per the Ease of Living standards laid down by the CM, it is necessary to have clean environment, healthy living alongside modern facilities and industrial development. Hence, reduction of emissions and production of electricity need to be done simultaneously. To achieve this, the government of AP is taking up several solar power projects in the state and did the same in the context of infrastructure development as part of the VCIC. To lessen the problems of high carbon pattern of growth, sustainable transport initiatives are necessary as well as renewable energy production.
AnnaGaru Posted October 12, 2018 Posted October 12, 2018 (edited) Delhi-mumbai corridor ki direct GRANT 15,000 crores icharu(mainly Gujarat based zones ki)...indirect ga 1 lakh crores for infra..... VCIC ki ZERO GRANT and still asking AP govt to resend paperwork again&Again.... Edited October 12, 2018 by AnnaGaru
sonykongara Posted November 20, 2018 Author Posted November 20, 2018 ఇక విశాఖ-చెన్నై కారిడార్.. మొత్తం 13 రోడ్లకు ప్రతిపాదన20-11-2018 02:52:17 352 కిలోమీటర్లు.. రూ.5520 కోట్లు పారిశ్రామిక కారిడార్ డీపీఆర్‌లు రెడీ మొత్తం 13 రోడ్లకు ప్రతిపాదన తొలి దశలో మూడు రోడ్లకు టెండర్లు ఏషియన్ బ్యాంక్ నిధులతో నిర్మాణం అమరావతి (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర ముఖచిత్రం మార్చే విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్(వీసీఐసీ) నిర్మాణ దిశగా ముందడుగు పడింది. వివిధ పోర్టులు, జాతీయ రహదారులకు కారిడార్‌ను కలిపే కీలకమైన రహదారుల నిర్మాణానికి అవసరమైన డీపీఆర్‌లు సిద్ధం చేశారు. 352 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం, విస్తరణ, నాలుగు, ఆరు వరుసల అభివృద్ధికోసం రూ. 5,520 కోట్లు ఖర్చుపెట్టేలా మొత్తం 13 రహదారుల నిర్మాణానికి అవసరమైన డీపీఆర్‌లు రెడీ అయ్యాయి. ఏషియన్ డెవల్‌పమెంట్ బ్యాంకు(ఏడీబీ) ఇచ్చే రుణంతో రహదారులను నిర్మించనున్నారు. ఆ ప్రాజెక్టులను రోడ్లు భవనాల శాఖ పరిధిలోని ఏపీ రోడ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఏపీఆర్‌డీసీ) నేతృత్వంలో చేపట్టనున్నారు. తొలుత మూడు రోడ్లకు టెండర్లు పిలిచేందుకు ఆర్‌అండ్‌బీ రంగం సిద్ధం చేసింది. సామర్లకోట-రాజానగరం, నాయుడు పేట పారిశ్రామిక క్లస్టర్‌కు ఎన్‌హెచ్ 16 సంధానం, యేర్పుడు -శ్రీకాకుళం క్లస్టర్‌లను తొలి దశలో పూర్తి చేస్తారు. వీటితోపాటు విశాఖపట్నం జిల్లా నక్కపల్లి క్లస్టర్ నుంచి రహదారి అనుసంధానం చేపట్టాలని కూడా నిర్ణయించారు. 4.5కిలోమీటర్ల రహదారికి రూ. 47 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే ఇందులో కొంత భూసేకరణ సమస్య ఉన్నట్లు తెలిసింది. ఈ 4 ప్రాజెక్టులకు ఏడీబీ ఆమోదం లభించింది. తొలిదశలో.. సామర్లకోట-రాజానగరం: పొడవు 30 కి.మీ.వ్యయం 394 కోట్లపైమాటే. 308 కోట్లకు పాలనా అనుమతులు. భూసేకరణ అంచనా 100 కోట్లు. నాయుడుపేట పారిశ్రామిక క్లస్టర్‌కు ఎన్‌హెచ్ 16 సంధానం: పొడవు 8.50 కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం రూ. 154 కోట్లు. యేర్పేడు-శ్రీకాకుళం క్లస్టర్: పొడవు 9.5 కిలోమీటర్లు, నిర్మాణ వ్యయం రూ. 97 కోట్లు. రెండో దశలో.. అనకాపల్లి-అచ్యుతాపురం: 13.80 కి.మీ. రహదారి రూ. 254 కోట్లతో నిర్మాణం. ఈ రహదారి భూసేకరణ వ్యయం చాలా ఎక్కువగా ఉంది. గతంలో భూసేకరణ వ్యయం రూ. 200 కోట్లపైనే ఉంటుందని విశాఖ అధికారులు తేల్చారు. దీనిపై అభ్యంతరాలు రాగా పునఃసమీక్షించారు. వ్యయాన్ని రూ. 156 కోట్లకు కుదించినట్లు తెలిసింది. కాకినాడ-సామర్లకోట: 26.40 కి.మీ రహదారిని రూ. 683 కోట్లతో నిర్మించనున్నారు. యలమంచిలి-గాజువాక : 31.40 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని రూ. 439 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మిస్తారు. తడ-శ్రీకాళహస్తి: 44 కిలోమీటర్ల ఈ రహదారిని రూ. 417 కోట్లతో చేపట్టనున్నారు. మరికొన్ని... నెల్లూరు-కృష్ణపట్నం పోర్టు: పొడవు 23.10 కి.మీ. నిర్మాణ వ్యయం రూ. 249 కోట్లు. ఏడీబీ నుంచి గ్రీన్‌సిగ్నల్. భూసేకరణ కోసం ఎన్‌హెచ్ సంస్థకు అప్పగింత. దొనకొండ-కురిచేడు-వినుకొండ: పొడవు 30.40 కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం రూ. 358 కోట్లు. ఏడీబీ వద్ద పెండింగ్. దొనకొండ-పొదిలి: పొడవు 32.30 కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం రూ. 611 కోట్లు. ఏడీబీ వద్ద పెండింగ్. కాకినాడ సెజ్: ఈ సెజ్ పరిధిలో నిర్మించే రోడ్డు పొడవు 42.80 కి.మీ. నిర్మాణ వ్యయం రూ. 1206 కోట్లు. ఏడీబీ వద్ద నివేదిక.
sonykongara Posted December 16, 2018 Author Posted December 16, 2018 పారిశ్రామిక నడవాపై నీలినీడలువీసీఐసీ అభివృద్ధిపై కేంద్రం శీతకన్నుఎన్ఐసీడీఐటీ పరిధిలో చేర్చమన్నా స్పందన లేదుమరో రెండు చోట్ల పనులకు నిధుల కొరత ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సహకారలోపంతో పారిశ్రామికరంగంలో కీలకమైన విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా (వీసీఐసీ) అభివృద్ధి మూడు అడుగులు ముందుకు... ఆరు అడుగుల వెనక్కి అన్నట్లుగా తయారైంది. విభజన చట్ట ప్రకారం కేంద్రం నుంచి సాయం అందకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ‘ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు’ (ఏడీబీ) నుంచి రుణం తీసుకొని రెండు చోట్ల పనులు ప్రారంభించింది. మొదటిదశ పనులు దాదాపు పూర్తికానున్నాయి. మరో రెండు చోట్ల పనులకు నిధులు అవసరం. కేంద్రం నుంచి ఇప్పటివరకు రూపాయి విడుదల కానందున తదుపరి కార్యాచరణపై నీలినీడలు అలుముకుంటున్నాయి. జాతీయ పారిశ్రామిక నడవ అభివృద్ధి, అమలు ట్రస్ట్ (ఎన్‌ఐసీడీఐటీ) పరిధిలో వీసీఐసీని చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. ఆ విధంగా చేరిస్తే కారిడార్ అభివృద్ధికి తగినన్ని నిధులు విడుదలవుతాయి. వీసీఐసీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే మరో రూ.15 వేల కోట్లకుపైగా అవసరం. పనులు పూర్తయి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాగానే పెట్టుబడులు పెట్టడానికి ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. కారిడార్‌ను అభివృద్ధి చేస్తే 1.10 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇప్పటివరకూ కేంద్రం నుంచి స్పందన లేదు. * రూ.4,125 కోట్ల ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) సాయం, మరో రూ.1,419 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో విశాఖపట్నం, ఏర్వేడు, శ్రీకాళహస్తిలో పారిశ్రామిక పెట్టుబడులకు వీలుగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. వివిధ దశల్లో ఉన్న ఈ పనులు మార్చిలోగా పూర్తి చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.* మచిలీపట్నం, దొనకొండలో మౌలిక సదుపాయాల కల్పనకు మరో 6 వేల కోట్లకుపైగా అవసరమని అంచనా. కేంద్రం సాయం అందిస్తే తప్ప వీటిలో పనులు చేపట్టే పరిస్థితి లేదు. అభివృద్ధి చేస్తే ప్రయోజనాలివి...* ఆరు రెట్లు పెరగనున్న స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)* తయారీ రంగ సామర్థ్యం భారీగా పెరుగుదల* మెరుగైన ఉపాధి అవకాశాలు కేంద్రం సహకరించాలి ‘విభజన చట్ట ప్రకారం వీసీఐసీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలి. రాష్ట్ర పారిశ్రామిక రంగ అభివృద్ధిలో ప్రధానమైన కారిడార్ అభివృద్ధిపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని ఐడీబీతోపాటు సొంత నిధులతో రెండు చోట్ల పనులు ప్రారంభించింది. కేంద్రం సహకరిస్తే మిగతా చోట్ల కూడా పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎన్‌ఐసీడీఐటీ పరిధిలో చేర్చాలన్న ప్రతిపాదనలపైనా స్పందించాలి.’ -ఎన్.అమర్‌నాథరెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now