Jump to content

AndhraPradesh Tourism


Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply

ర్యాటకం.. పరుగులు తీయిస్తాం
15-07-2017 02:59:07

 
636356843679546928.jpg
  •  పవిత్ర సంగమానికి 250 కోట్లు
  •  కల్చరల్‌ హెరిటేజ్‌గా కొండపల్లి: సీఎస్‌
 
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): పర్యాటక కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌ వెల్లడించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఆయన అధ్యక్షతన టూరిజం, కల్చర్‌, హెరిటేజ్‌ బోర్డుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ప్రతిపాదించిన ప్రాజెక్టులను త్వరిగతిన చేపట్టి పూర్తిచేసి, రాష్ట్రాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమం ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ సుమారు రూ.250 కోట్లతో 10వేల మందికి సరిపడా డివిజిబుల్‌ ఫ్లోట్‌ ఫ్లోర్‌ మల్టీపర్పస్‌ హాల్‌గ్రాండ్‌ థియేటర్‌, ఆడిటోరియం, హోటల్‌ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. కొండపల్లి కోటను కల్చరల్‌ హెరిటేజ్‌ టూరిజం డెస్టినే్‌షగా తీర్చిదిద్దుతామన్నారు. విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల ఆవరణలో సుమారు రూ.10 కోట్లతో మరో కళాక్షేత్రాన్ని నిర్మిస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో కూచిపూడి నాట్యాలయం నిర్మాణంతోపాటు అంతర్జాతీయ స్థాయి శిక్షణ కేంద్రం నిర్మిస్తామన్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై హేవలాక్‌ బ్రిడ్జిని సుమారు 116కోట్లతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు, జలవనరులు, అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉపాధి పనుల్లో జాప్యానికి తావివ్వొద్దు
ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనులు నిర్దేశించిన లక్ష్యంలోగా పూర్తి చేయాలని సీఎస్‌ దినే్‌షకుమార్‌ స్పష్టం చేశారు. నిధుల కొరత లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పనుల్లో జాప్యం వద్దని చెప్పారు. శుక్రవారం ఆయన కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి ఉపాధిహామీ పనుల పురోగతిపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 12 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువగా 1005 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలు చేపట్టడాన్ని సీఎస్‌ అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. అలాగే రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్‌ శాఖలో చేపట్టిన పనులపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...