Jump to content

vijayawada metro update


sonykongara

Recommended Posts

  • Replies 324
  • Created
  • Last Reply

Gannavaram starting lo government land vunte akkade coach depot pettochhu kada. Elago second stage lo Gannavaram varaku extend cheyyali adi ippude take up chesthe better.

plan mrachali pushpa lu  time nasanam chestharu atu itu tipputhu  loan ippati ke kastam ga undi, Gannavaram daka ante maro 2500 cr kavali anta.

Link to comment
Share on other sites

మెట్రోరైల్‌ భూసేకరణకు అభిప్రాయ సేకరణ

విజయవాడ: అమరావతి మెట్రోరైల్‌ ప్రాజెక్టు భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. బుధవారం పెనమలూరు మండలం పోరంకి, కానూరు గ్రామపంచాయతీల పరిధిలో భూములు, స్థలాలు ఇళ్లు కోల్పోతున్న వారి నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. సబ్‌ కలెక్టర్‌ సృజన, మెట్రో అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బొడె ప్రసాద్‌ ఈ సమావేశంలో పాల్గొని తన అభిప్రాయం వెల్లడించారు. బందరు రోడ్డును 150 అడుగుల మేర విస్తరిస్తున్న దృష్ట్యా మెట్రో కారిడార్‌ సైతం అందులోనే నిర్మించేలా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. అలాగే మెట్రో స్టేషన్ల కోసం కొత్తగా భూసేకరణ జరిపి ఇళ్లు తొలగించకుండా.. రహదారి మధ్యలోనే స్టేషన్లు నిర్మించాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో రోడ్డు మధ్యలోనే స్టేషన్లు నిర్మించిన విషయాన్ని వారు ప్రస్తావించారు. అభివృద్ధికి తాము అడ్డుకాదని. అయితే భూసేకరణ జరుగుతున్న తీరు సరిగా లేదని స్థానికులు ఆక్షేపించారు. స్థానికుల అభిప్రాయాలతో ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఏకీభవించారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించి తగిన నిర్ణయం తీసుకుంటామని సబ్‌ కలెక్టర్‌ సృజన తెలిపారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
విజయవాడ మెట్రో రైల్‌ సర్వే పనులు ముమ్మరం
 
636108995287899488.jpg
 (విజయవాడ): మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు సర్వే వేగవంతం చేశారు. మొదటగా మెట్రో ప్రాజెక్టు పనులను ఏలూరు రోడ్డులో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఏలూరు రోడ్డులో మెట్రోరైలు స్టేషన్లు వచ్చే ప్రదేశాల్లో నష్టపోయే భవన యజమానులతో సబ్‌ కలెక్టర్‌ సమావేశం నిర్వహించగా భూమి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని సబ్‌ కలెక్టర్‌ సృజన పేర్కొన్నారు. అధికారులు మాత్రం సర్వేపనులను వేగవంతం చేయడంతో భవన యజమానుల్లో గందరగోళం నెలకొంది. రెండు రోజులుగా ఏలూరు రోడ్డులో మెట్రో స్టేషన్లు వచ్చే ప్రదేశాల్లో ఏ మేరకు స్థలం అవసరమవుతుందో గుర్తించే పనిలో నిమగ్న మయ్యారు. గురు, శుక్రవారాలు వరుసగా రెవెన్యూ అధికారులు సర్వే పనులు ప్రారంభించడంతోపాటు ఫైనల్‌ మార్కింగ్‌లు కూడా చేశారు. స్థలం ఇచ్చేది లేదని చెపుతున్నప్పటికీ మార్కింగ్‌లు ఎలా చేస్తారని కొంతమంది యజమానులు ప్రశ్నిస్తుండగా మరికొంతమంది స్థలం తీసుకుంటే ఏ రేటు ఇస్తారంటూ సర్వే చేసేందుకు వచ్చిన అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాము సర్వేచేసి మార్కింగ్‌ చేసేందుకు మాత్రమే వచ్చామని ప్రభుత్వం ఏ రేటు ఇచ్చి భూములు తీసుకుంటుందనేది తెలియదని చెబుతుండటంతో భవన యజమానులు సందిగ్ధంలో పడ్డారు. స్థలసేకరణ ప్రారంభిస్తే ఎన్నిరోజులు సమయం ఇస్తారు? ఎంత రేటు ఇస్తారు అన్నదానిపై స్పష్టత ఇస్తే బావుంటుందన్నది కొందరి ఆలోచన. అధికారులు మాత్రం ఇటువంటి విషయాలపై ఏ నిర్ణయం చెప్పకుండా వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది.
నిడమానూరులోనే మెట్రో కోచ్ డిపో : -మెట్రో రైల్‌ పీడీ రాధాకృష్ణారెడ్డి
మెట్రో కోచ డిపో నిడమానూరులో ఏర్పాటు చేస్తారని ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణారెడ్డి తెలిపారు. డిపో ఏర్పాటు చేయబోయే పంటపొలాలను పరిశీలించేందుకు ఆయన శుక్రవారం నిడమానూరు వచ్చారు. ఆయనను కలిసేందుకు వచ్చిన స్థానిక రైతులతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఆమోదంతోనే కోచ డిపో ఏర్పాటు చేస్తామని చెప్పారు. భూసేకరణ తమ బాధ్యతకాదని రెవెన్యూ అధికారులు చూసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలవనున్నట్టు చెప్పారు. మెట్రో ప్రాజెక్ట్‌ విషయంలో ఎవరికీ ఇబ్బందిలేకుండా నిర్ణయాలు ఉంటాయన్నారు. ఇప్పటికే ఏలూరురోడ్డు ఫేస్‌లో స్టేషన్లు వచ్చే ప్రదేశాల్లో మార్కింగ్‌ చేస్తున్నామని చెప్పారు. నిడమానూరు నుంచి గన్నవరం వరకు పొడిగించాలని వచ్చిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రతిపాదనను సెకండ్‌ఫే్‌సలో ఆమోదించే అవకాశం ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో నిడమానూరునుంచి గన్నవరం వరకు పొడిగించే ఆలోచన జరిగితే మాత్రం నిడమానూరు ఊరులోనుంచి మెట్రోరైలు వెళుతుందని తెలిపారు.
Link to comment
Share on other sites

విజయవాడ: రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రైతులకు పాట్ల పంఫిణీ, స్విస్ ఛాలెంజ్, ఎన్టీటీ కేసులపై చర్చించారు. నాలుగు గ్రామాల్లో పంపిణీ పూర్తయిందని, మరో రెండు గ్రామాల్లో పంపిణీ పూర్తవుతుందని సీఆర్డీఏ అధికారులు చంద్రబాబుకు వివరించారు. పాట్లు పూర్తి అయిన గ్రామాల్లో అంతర్గత రోడ్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు. మంత్రి నారాయణ సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ ఈ సమీక్షకు హజరయ్యారు.

Link to comment
Share on other sites

+1

Endhuku ee cbn ki aatram... Vallaki leni dhuradha endhuku... Vadileyyi Swamy.. Prasantham ga rest tisuko... Mi lo gola nikendhuku :kick:

not true... everyone wants metro.. but no one wants to give the lands...

 

on the other side... nidamanuru lo lands expensive even before capital coming here. capital ayina taruvata inko 25-30% or even 100% anna perigi vuntayi as it is very close to Vijayawada. govt vallu ichhedhi very little.. appudu ela istaru.

 

govt kavalidindhi 15-20 acres anukunta ikkada. deniki oka 100cr vadulukovataniki govt enduku alochistundho artham kaadhu. intha money karchu pettetappudu 100cr kosam ee gola enduko.

Link to comment
Share on other sites

విజయవాడ మెట్రోకు కొత్త దన్ను
 
636110729413522598.jpg
జపాన్‌ ఆర్థిక సంస్థ ‘జైకా’తో తెగదెంపులు చేసుకున్న తర్వాత బెజవాడ మెట్రో ప్రాజెక్టుకు ఆర్థిక దన్ను ఇచ్చేందుకు జర్మనీ, ఫ్రెంచి దేశాల ఆర్థిక సంస్థలు ముందుకు వచ్చాయి. మెట్రో ప్రాజెక్టులో కొత్తగా కేఎ్‌ఫడబ్ల్యూ, ఏఎఫ్‌డీ ఆర్థిక సంస్థలు భాగస్వామ్యం వహించనున్నాయి. మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డికి సూచించాయి.(ఆంధ్రజ్యోతి, విజయవాడ): మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రుణ సాయం అందించటానికి జర్మనీ, ఫ్రెంచి దేశాలకు చెందిన రెండు ఆర్థిక సంస్థలు సానుకూలంగా స్పందించాయి. రుణం ఇవ్వకుండానే షరతులు పెడుతూ కంటిమీద కునుకు లేకుండా చేసిన జపాన్‌ ఆర్థిక సంస్థ (జైకా)తో ఏఎంఆర్‌సీ తెగతెంపులు చేసుకుంది. ప్రభుత్వం భూ సేకరణకు రూ.300 కోట్లు ఇచ్చిన నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగం దీనికి సంబంధించిన ప్రక్రియను చేపట్టింది. మరోవైపు ప్రాజెక్టు సలహాదారు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) చైర్మన్‌ శ్రీధరన్‌ కొద్ది రోజుల కిందట విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. టెండర్లు పిలిచి ప్రక్రియ ప్రారంభించమని సీఎం కూడా డీఎంఆర్‌సీకి సూచించారు. ఈ నేపథ్యంలో మెట్రో ప్రాజెక్టు కదలికలు వేగవంతమయ్యాయి. ఈ తరుణంలో ప్రాజెక్టుకు సత్వరం నిధులు కావాల్సి ఉంది. దీంతో రెండు రోజుల కిందట ఏఎంఆర్‌సీ ఎండీ ఢిల్లీకి పయనయ్యారు. జర్మనీ, ఫ్రెంచి దేశాల ఆర్థిక సంస్థలతో పాటు వరల్డ్‌ బ్యాంక్‌, ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తదితర సంస్థల ప్రతినిధులతో చర్చించాలని నిర్ణయించుకున్నారు. జర్మనీ, ఫ్రెంచి దేశాల ఆర్థిక సంస్థల నుంచి సానుకూల స్పందన వచ్చింది. జైకాతో ఎందుకు తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చిందో కూడా ఆయన వివరించినట్టు సమాచారం. దీంతో వెంటనే ఆయన విజయవాడ బయలుదేరారు. గతంలో జైకాకు పంపించిన ప్రతిపాదనలలో మార్పులు ఉంటే వాటిని సరిదిద్ది ఈ రెండు సంస్థలకు పంపించటానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. రెండు సంస్థల నుంచి రుణ ప్రయత్నాలు చేయాలన్నది రామకృష్ణారెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది.
అన్నీ సింగిల్‌ టెండర్లే..
ఏలూరు రోడ్డు , బందరు రోడ్డు కారిడార్‌ టెండర్లను బిట్‌ ప్యాకేజీ విధానంలో పిలవాలని గతంలో నిర్ణయించింది. ఈ విధానాన్ని తాజాగా డీఎంఆర్‌సీ ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. సింగిల్‌ టెండర్‌ విధానంలోనే టెండర్లు పిలవాలని భావిస్తోంది. బిట్‌ ప్యాకేజీ ప్రాతిపదికన టెండర్లు పిలిస్తే ఎవరైనా కాంట్రాక్టర్‌ పనులు చేయకపోతే ప్రాజెక్టును పూర్తి చేయటంలో విపరీతమైన జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పనులన్నింటినీ విభాగాల వారీగా సింగిల్‌ టెండర్‌ పిలవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సివిల్‌ నిర్మాణాలన్నీ ఒకటే టెండర్‌గా పిలుస్తారు. కోచ్‌లు, ఎలక్ర్టిఫికేషన్‌ ఇలా వేర్వేరు విభాగాల పనులన్నింటినీ సింగిల్‌ టెండర్‌ ప్రాతిపదికన టెండర్లు పిలవనున్నారు.
నవంబర్‌ మొదటి వారంలో
కేంద్రం అనుమతులు

మెట్రో ప్రాజెక్టుకు నవంబర్‌ మొదటి వారంలో అధికారిక అనుమతులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఈ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ప్రీ పబ్లిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బోర్డు ( ప్రీ పీఐబీ) కోరిన వివరాలన్నింటినీ ఏఎంఆర్‌సీ అందించింది. పబ్లిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బోర్డు (పీఐబీ) అనుమతి ఇవ్వటమే మిగిలి ఉంది. పీఐబీ ఈ నెలాఖరు లోపు ఒక నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. స్వచ్ఛ బస్‌స్టేషన్‌ !(ఆంధ్రజ్యోతి, విజయవాడ / వన్‌టౌన్‌):
ఆసియాలోనే రెండవ అతి పెద్దదైన పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌) రాష్ట్ర స్థాయిలో ‘స్వచ్ఛ బస్‌ స్టేషన్‌’ అవార్డుకు ఎంపికైంది. ఆదివారం తిరుపతిలో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ కృష్ణా రీజనల్‌ మేనేజర్‌ పీవీ రామారావుకు అవార్డును అందించారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్‌కు తలమానికంగా ఉన్న పీఎన్‌బీఎస్‌ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. ప్రయాణీకులకు మౌలిక సదుపాయాలను కల్పించే క్రమంలో భాగంగా భారీ ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. వినోదానికి కేంద్రంగా చేశారు. బస్‌స్టేషన్‌ను కాస్తా ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టేషన్‌గా రూపొందించారు. బస్‌స్టేషన్‌లో గేమ్స్‌ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. ప్రయాణీకులకు మరుగుదొడ్ల విషయంలో ఆర్టీసీ అధికారులు ముఖ్యపాత్ర పోషించారు. సిటీ బస్‌టెర్మినల్‌ను విస్తరించి బస్‌పోర్టుగా ఆధునీకరించారు. అపరిశుభ్రంగా ఉండే బస్‌స్టేషన్‌ను అందంగా, ఆకర్షణీయంగా ఆహ్లాదం పొందే ప్రదేశంగా తీర్చిదిద్దారు.
ఎండీ నండూరి సహకారం లేనిదే అభివృద్ధి లేదు
పీవీ రామారావు, ఆర్టీసీ కృష్ణా ఆర్‌ఎం

ఎండీ నండూరి సాంబశివరావు సహకారం లేనిదే బస్‌స్టేషన్‌ అభివృద్ధి లేదు. ప్రయాణీకులకు ప్రధానంగా మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన ఎంతో దృష్టి సారించారు. బస్‌స్టేషన్‌ ఈ రూపానికి ఆయనే కారణం. సిటీ బస్‌పోర్టును ఇటీవలే అభివృద్ధి చేయటం జరిగింది. సంస్థ ఎండీ కృషికి గుర్తింపుగా భావిస్తున్నాను.
Link to comment
Share on other sites

not true... everyone wants metro.. but no one wants to give the lands...

 

on the other side... nidamanuru lo lands expensive even before capital coming here. capital ayina taruvata inko 25-30% or even 100% anna perigi vuntayi as it is very close to Vijayawada. govt vallu ichhedhi very little.. appudu ela istaru.

 

govt kavalidindhi 15-20 acres anukunta ikkada. deniki oka 100cr vadulukovataniki govt enduku alochistundho artham kaadhu. intha money karchu pettetappudu 100cr kosam ee gola enduko.

Nidamanuru lo acre 5 crores undha??

OK.. Akkada janalu Memu land ivvam antunnaru kani rate chala ledhu ani cheppa ledhuga...

Prathi okkadu maku capital raka mundhe 5 crores ani chelpukuntunnaruga ekkada land adigina...

Link to comment
Share on other sites

not true... everyone wants metro.. but no one wants to give the lands...

 

on the other side... nidamanuru lo lands expensive even before capital coming here. capital ayina taruvata inko 25-30% or even 100% anna perigi vuntayi as it is very close to Vijayawada. govt vallu ichhedhi very little.. appudu ela istaru.

 

govt kavalidindhi 15-20 acres anukunta ikkada. deniki oka 100cr vadulukovataniki govt enduku alochistundho artham kaadhu. intha money karchu pettetappudu 100cr kosam ee gola enduko.

60acres kavali

Link to comment
Share on other sites

Nidamanuru lo acre 5 crores undha??

OK.. Akkada janalu Memu land ivvam antunnaru kani rate chala ledhu ani cheppa ledhuga...

Prathi okkadu maku capital raka mundhe 5 crores ani chelpukuntunnaruga ekkada land adigina...

enduku ledhu bro... eppudo 4-5 years back 2cr cheppevaru. nidamaru almost touched Vijayawada. Apts valana land rates baaga perigayi. 1acre lo at the minimum 25 apts anukunna. 10 apts owner ki vachiina he will get atleast 2.5cr.. This is before capital announcement. Ippudu apt 40lks anukunna 4cr... that is the least owner will get.. in general 1 acre lo inka ekkuva apts kadataru. owners almost 50% varuku teesukuntunnaru. so 1acre 5crs.. new land acq bill tho nidamanuru janalu 10cr ivvamantunnaru

Link to comment
Share on other sites

Bokkale.. Metro rakapothe evariki noppi.. Cbn ki eeka kuda oodadhu... Cbn ee metro ni vadilesthe better... Valla paatlu valle pedatharu.....

noppi common man ki... lands vunna vallaki problem enduku vuntundhi... they will be happy as they know that sometime in future they will get 6-10 cr per acre.

Link to comment
Share on other sites

metro depot akkade pettedi, 450 cr land acquisition govt anchana, 1000cr kuda saripovu naku telisi

govt also should think of alternatives. metro depot Amaravati side pettukovachhu kadha. akkada land mottam govt daggare vundhi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...