Jump to content

vijayawada metro update


sonykongara

Recommended Posts

  • Replies 324
  • Created
  • Last Reply
మెట్రో రైల్‌ ప్రాజెక్టు టెండర్లకు రంగం సిద్ధం
 
636115054491029983.jpg
మెట్రో రైలు ప్రాజెక్టులో ఏలూరు, బందరు రోడ్లకు ఒకేసారి టెండర్లు !
భూమి స్వాధీనం చేసిన వెంటనే రంగంలోకి
ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజీ రూ.7.8 కోట్లు
ఏఎంఆర్‌సీ లోగోకు రెండు డిజైన్స్ సిద్ధం

త్వరలో అధికారికంగా ఖరారు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ ):
మెట్రో రైల్‌ ప్రాజెక్టులో ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు కారిడార్లకు ఒకేసారి టెండర్లు పిలవటానికి రంగం సిద్ధమవుతోంది. అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన (ఏఎంఆర్‌సీ), ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)లు సంయుక్తంగా రెండు కారిడార్లకు సంబంధించి ఒకేసారి టెండర్లు పిలవాలని నిర్ణయించాయి. జిల్లా యంత్రాంగం భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసి, వాటిని స్వాధీనం చేయగానే టెండర్లు పిలవబోతున్నాయి. ఏలూరు కారిడార్‌లో కోచ డిపో నిర్మాణం చేపట్టవలసి ఉండగా.. కాస్త ముందుగా ఈ కారిడార్‌ పనులు చేపట్టినా.. నెల రోజుల వ్యవధిలోనే బందరు రోడ్డు కారిడార్‌ పనులు కూడా ప్రారంభిస్తారు. 2019 ఫిబ్రవరి ఏలూరు రోడ్డు కారిడార్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో, ఈ కారిడార్‌ పనులను వేగవంతంగా నిర్వహించటానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
ఏలూరు, బందరు రోడ్డు కారిడార్ల వివిధ విభాగాలకు సంబంధించిన పనులను సింగిల్‌ టెండర్‌ విధానంలోనే టెండర్లు పిలుస్తారు. బందరు రోడ్డులో సివిల్‌, ఎలక్ర్టికల్‌, కోచ పనులను ఒకే కాంట్రాక్టర్‌కు ఇస్తారు. అలాగే ఏలూరు కారిడార్‌కు సంబంధించి కూడా ఇదే విధానంలో సింగిల్‌ కాంట్రాక్టర్‌కే పనులు అప్పగిస్తారు.
అతి స్వల్పంగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ
నగర మెట్రో రైల్‌ ప్రాజెక్టులో భాగంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అతి స్వల్పంగా రూ.7.8 కోట్లు మాత్రమే ఉంది. దీనిని బట్టి వ్యక్తిగతంగా నష్టపోయే వారి సంఖ్య చాలా తక్కువుగా ఉంటోందని తెలుస్తోంది. ఏలూరు, బందరు రోడ్లకు సంబంధించిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో బీసెంట్‌ రోడ్డు, మాచవరం డౌన ప్రాంతాల్లో మినహా పెద్దగా దుకాణాలు, పూర్తిగా భవనాలు పోయే పరిస్థితి లేదు.
లోగోకు రెండు డిజైన్లు

అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన (ఏఎంఆర్‌సీ)కి అధికారిక లోగోను మరికొద్ది రోజుల్లో ప్రకటించబోతున్నారు. అమరావతి లోగోకు సంబంధించి ప్రజల నుంచి కూడా డిజైన్లను స్వీకరించారు. వీటితో పాటు ఏఎంఆర్‌సీ కూడా ఆర్కిటెక్ట్‌ సంస్థలతో లోగోలను రూపొందిస్తోంది. అన్నింటినీ పరిశీలించాక రెండు లోగోలను ఎంపిక చేశారు. పరిశీలించిన మీదట ఒక దానిని ఎంపిక చేసి అధికారికంగా ప్రకటిస్తారు.
 
మెట్రో రైలు ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు
- గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
విజయవాడ రూరల్‌ : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీ మోహన్‌ తెలిపారు. ఈ మార్పులకు మెట్రో ప్రాజెక్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి అంగీకరించినట్లు పేర్కొన్నారు. మెట్రో పాత డిజైన్‌ ప్రకారం ఎనికేపాడులోని మసీదును తొలగించాల్సి ఉందన్నారు. దీంతో స్థానిక ముస్లిం నాయకులు తనను కలిసి మసీదు తొలగించకుండా చూడాలని కోరారన్నారు. అలాగే నిడమానూరులో ప్రయాణీకులు ఎక్కేందుకు స్టేషన్‌ ప్రతిపాదనలేదన్నారు. ఈ నేపథ్యంలో తాను మెట్రో ఎమ్‌డిని కలిసి ఈ రెండు సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. నిడమానూరులో మెట్రో స్టేషన్‌ ఏర్పాటుకు ఆయన అంగీకరించారన్నారు. స్థానిక ప్రజల అభ్రిపాయాలకు అనుగుణంగానే మెట్రో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని వివరించారు.
Link to comment
Share on other sites

త్వరలో ‘మెట్రో’ భూ సేకరణ నోటిఫికేషన్‌
 
636123565400744099.jpg
  • డాఫ్టు రెడీ.. రైతులు, భవన యజమానులకు నోటీసులు
  • మార్కెట్‌ ధరకే పరిహారం?
  • ఏలూరు, బందరు రోడ్డు కారిడార్లకు టెండర్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బెజవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు త్వరలో కార్యరూపం దాల్చనుంది. ప్రాజెక్టుకు భూముల సేకరణకు రెండు వారాల్లో నోటిఫికేషన్‌ వెలువడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే డ్రాఫ్టు నోటిఫికేషన్‌ సిద్ధమైంది. విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు మొత్తం 75ఎకరాల భూమి కావాల్సి ఉంది. కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం భూ సేకరణకు రూ.468 కోట్లు అంచనా వేయగా ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా రూ. 300 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ.168 కోట్లనూ మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్‌ బాబు ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) ఈ నెలలోనే టెండర్లకు రంగం సిద్ధం చేస్తోంది. ఏలూరు, బందరు రోడ్ల కారిడార్లకు ఒకేసారి టెండర్లు పిలవనుంది. భూ సేకరణ ను రెండు నెలల్లో పూర్తి చేస్తామని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) చైర్మన్‌, ఎంఏయూడీ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్‌కు ఇటీవల కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాబు హామీ ఇచ్చారు. భూములు స్వాధీనం చేసే నాటికి టెండర్లును ఖరారు చేసి పనులు అప్పగించవచ్చని డీఎంఆర్‌సీ భావిస్తోంది. భూ సేకరణకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే భవన నిర్మాణ యజమానులతో పాటు, శివారు నిడమానూరు, పెనమలూరు గ్రామాల రైతులకు నోటీసులు కూడా ఇస్తోంది. మెట్రో భూముల్లో కోచ్‌ డిపో కోసమే ఎక్కువగా అవసరమౌతున్నాయి. నిడమానూరులో 50 ఎకరాలను కోచ్‌ డిపో నిర్మాణానికి ప్రతిపాదించారు. అయితే నిడమానూరులో కొందరు రైతులు తమ భూములను డెవలపర్లకు ఇచ్చామని, మెట్రోకు ఇస్తే నష్టపోతామని ఆందోళనలో ఉన్నారు. ఇక విజయవాడలోని ఏలూరురోడ్డు, బందరు రోడ్డు కారిడార్లలోని భవన యజమానులు తమకు అన్యాయం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌ ధరకే మెట్రో రైల్‌ ప్రాజెక్టు భూ సేకరణ చేయాలన్న ఉద్దేశ్యంతో కృష్ణా జిల్లా యంత్రాంగం ఉంది. ప్రాజెక్టు టెండర్ల విషయానికి వస్తే.. డీఎంఆర్‌సీ గతంలో ఓసారి టెండర్లు పిలిచింది. అప్పటికి ఇంకా భూ సేకరణ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో టెండర్ల ఖరారును వాయిదా వేసింది. కిందటి సారి కేవలం ఒక ఏలూరు 13 కి.మీల. కారిడార్‌లో 5 కి.మీ., 4 కి.మీలకు వేర్వేరుగా టెండర్లు పిలిచారు. ఈ దఫా ఏలూరు కారిడార్‌, బందరు కారిడార్‌ (13.27 కి.మీ) కూడా కలిపి మొత్తం 26 కి.మీలకుపైగా టెండర్లు పిలవబోతున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

బెజవాడ టు బ్రిటన్ అంటే ట్రైన్ ఏమీ వేయట్లేదు. రోప్ వే కట్టడం లేదు. ఆర్థిక సాయం ఏపీ కొత్త మార్గం అన్వేషించింది. అవునా… అంటూ కేంద్రమే నోరెళ్లబెట్టి చూస్తుండగా, ఇపుడు కొత్త కోణంలో సన్నాహాలు చేస్తోంది. మూడేళ్లలో బెజవాడ, విశాఖ మెట్రో పూర్తి చేయాలన్న తలంపుతో ఇపుడు ఏపీ చేస్తున్న ప్రయత్నం ఢిల్లీ లెవెల్లో కాదు లండన్ రేంజ్ లో చర్చనీయమవుతోంది.

అవును. ఉపాయం ఊపిరి పోస్తుంది. అవకాశాల అన్వేషణ అద్భుతాలకి దారి చూపిస్తుంది. చేతిలో పైసా లేని సమయంలోనూ కొండంత లక్ష్యాలు నిర్దేశించుకున్న ఏపీ దమ్ము దైర్యంతో అడుగేస్తోంది.ఇపుడు మెట్రో లాంటి ప్రాజెక్టుల కోసం చేస్తున్న ప్రయత్నాలు చూస్తే ఆ సంగతి అర్థమైపోతుంది. బెజవాడ మెట్రో కోసం మొదట కుదిరిన జైకా రుణాన్ని వద్దనుకుంది ఏపీ. జపాన్ సంస్థ అలవిమాలిన కండిషన్లు పెట్టడం, వడ్డీరేట్లపై కూడా పేచీకి దిగేసరికి వద్దనేసింది. కేంద్రం చూస్తూ చూస్తూ మెట్రోకి సాయం చేసే పరిస్థితి లేదు. అలాగని ఊరుకోలేం అనుకుంది. అందుకే ఇపుడు బ్రిటన్ తలుపు తడుతోంది.

బ్రిటన్ టు విశాఖ, బెజవాడ…

ఎలాగో చూద్దాం ! బ్రిటన్ లో గ్రీన్ ఎన్ జీవోస్ ఉన్నాయ్. వాటికి ఓ ప్రొవిజన్ ఉంది. ప్రకృతి సిద్ధమైన ప్రాజెక్టులు ఎక్కడ కట్టినా వాటికి సాయం చేసేందుకు, పర్యావరహణ హితం కోసం పాటుపడేందుకు అక్కడ ఓ నిధే ఉంది. అప్పుడు ఇచ్చే ఫెసిలిటీ కూడా ఉంది. ఇదే కోణంలో ఇపుడు ఏపీ రంగంలోకి దిగింది. క్లైమేట్ బాండ్స్ ఇష్యూ చేసుకునేందుకు ఇందులో వెసులుబాటు ఉంటుంది. మెట్రోరైల్ ప్రాజెక్టు ఎలాగూ గ్రీన్ ఎనర్జీనే వాడుతోంది కాబట్టి మనకి కచ్చితంగా అవకాశం ఇవ్వాలనేది ఏపీ ప్రతిపాదన. ఇలా గ్రీన్ రూట్ లో ఫండ్ కోసం ప్రయత్నాలు చేయడం, అప్రోచ్ కావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకూ కేంద్రం ఇలాంటి ఆలోచన చేసినా… రాష్ట్రాలు మాత్రం ఎప్పుడూ రంగంలోకి దిగలేదు.

గ్రీన్ బాండ్స్ అంటే ఏం లేదు. మామూలుగా మార్కెట్ లో బాండ్స్ లో ఫండ్స్ కలెక్ట్ చేసినట్టుగానే… పర్యావరణ ఫ్రెండ్లీ ప్రాజెక్టుల విషయంలో ఈ గ్రీన్ బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఇది గ్లోబల్ గా, మరీ ప్రత్యేకించి యూరోప్ లో నడుస్తున్న ట్రెండ్. 2007 నుంచి ఇది ప్రాక్టీస్ లో ఉన్న విధానం. కేంద్రం కూడా ఎలాగూ మనం అడిగినంత సాయం అందించే పరిస్థితి లేదు అంటోంది కాబట్టి ఇపుడు సీరియస్ గానే సన్నాహాలు జరుగుతున్నాయ్. విభజన చట్టం ప్రకారం మెట్రో రైల్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పూర్తి చేయాల్సి ఉంది. రాష్ట్రవాటాగా 20 శాతం ఉంటుంది. విశాఖ మెట్రో రైల్ ను పబ్లిక్ ప్రైవేటు పాట్నర్ షిప్ బేసిస్ మీద పూర్తి చేయండి… విజయవాడ మెట్రోకి మాత్రం మేం సాయం చేస్తాం అంటోంది కేంద్రం. ఇపుడు గ్రీన్ బాండ్స్ తో లైన్ క్లియర్ అవుతుంది అంటున్నారు.

విశాఖ మెట్రో ప్రాజెక్టుకి 10 వేల కోట్లు. విజయవాడ మెట్రోకి 8 వేల కోట్లు ఖర్చవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర వాటాను కూడా ఏపీ బేర్ చేసేట్టుగా లేదు వ్యవహారం. అలాగని చూస్తూ ఊరుకోలేదు కాబట్టే ఇపుడు గ్రీన్ రివొల్యూషన్ తెచ్చే ప్రయత్నం. ఆశ్చర్యం అనిపిస్తాయ్ ఇలాంటి ప్రయత్నాలు. అన్నీ వచ్చాక అప్పుడు చూద్దాంలే అనుకొని ఊరుకుంటే ఎవరు మాత్రం అడుగుతారు ? రేపటి కోసం ఇవాళ ఆలోచిస్తోంది కాబట్టే ఏపీ ఇపుడు విశాఖ, విజయవాడల నుంచి బ్రిటన్ కి లింకు కలుపుతోంది. దూరాన్నీ… భారాన్నీ… ఆలోచనతో గెలవడం అంటే ఇదే !

.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
విజయవాడ మెట్రోకు టెండర్లు
 
విజయవాడ: విజయవాడ మెట్రోరైలుకు రూ. 1800 కోట్లతో డీఎంఆర్‌సీ టెండర్లకు ఆహ్వానించింది. మొదటగా నిడమనూరు నుంచి నెహ్రూ బస్‌స్టేషన్ వరకు. అటునుంచి పెనమలూరు నుంచి నెహ్రూ బస్‌స్టేషన్‌ కారిడార్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈ టెండర్లకు దరఖాస్తులు డిసెంబర్ 5 నుంచి మొదలుకానున్నాయి.
Link to comment
Share on other sites

అమరావతి మెట్రోకు టెండర్ల ఆహ్వానం

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి మెట్రోకు డీఎంఆర్‌సీ సోమవారం టెండర్లు ఆహ్వానించింది. రెండు మార్గాల ఏర్పాటుకు టెండర్ల దాఖలకు తుది గడువును జనవరి 19గా నిర్ణయించింది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి నిడమనూరు వరకు 13.5కి.మీల మేర తొలికారిడార్‌ను, పీఎన్‌డీఎస్‌ నుంచి పెనమలూరు వరకు 12.5కి.మీ మేర రెండో కారిడార్‌ను నిర్మించేందుకు డీఎంఆర్‌సీ టెండర్లు పిలిచింది.

Link to comment
Share on other sites

అమరావతి మెట్రోకు టెండర్ల ఆహ్వానం

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి మెట్రోకు డీఎంఆర్‌సీ సోమవారం టెండర్లు ఆహ్వానించింది. రెండు మార్గాల ఏర్పాటుకు టెండర్ల దాఖలకు తుది గడువును జనవరి 19గా నిర్ణయించింది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి నిడమనూరు వరకు 13.5కి.మీల మేర తొలికారిడార్‌ను, పీఎన్‌డీఎస్‌ నుంచి పెనమలూరు వరకు 12.5కి.మీ మేర రెండో కారిడార్‌ను నిర్మించేందుకు డీఎంఆర్‌సీ టెండర్లు పిలిచింది.

 

 

13 kms ki Metro endi :wall: :wall: :wall:

 

aa money capital buildings ki use cheyochu gaa... :blink:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...