Jump to content

NTR as Gandhi


raaz

Recommended Posts

Old one and might be a little exaggerated but good one..

 

మన దేశానికి స్వాతంత్ర్యం రాని రోజులవి. తెల్లదొరలు కనిపిస్తే చాలు భారత ప్రజలు భగ్గుమని ‘క్విట్ ఇండియా’ అంటున్న రోజులవి. వయోభేదం లేకుండా స్వాతంత్ర్య సముపార్జన కోసం భారతీయులు నడుంబిగించి తెల్లదొరలను మనదేశం నుంచి పారద్రోలడానికి గాంధీజీ అడుగు జాడల్లో నడుస్తోన్న రోజులవి.

 

 అలాంటి సమయంలో గుంటూరులో ఉన్న ఎ.సి.కాలేజీలో ఓ సంఘటన జరిగింది. ఎ.సి.కాలేజీ పాలకవర్గం అంతా యూరోపియన్స్ వారిదే, స్టూడెంట్లు మాత్రం భారతీయులు. పర్యవసానంగా పాలకవర్గానికీ, విద్యార్థులకు మధ్య సంఘర్షణలు జరగడం మొదలయ్యాయి. వీరిమధ్య శాంతియుత సమన్వయం కుదర్చడానికి గాంధీజీ అనుచరుడైన జవహర్‌లాల్ నెహ్రు ఆ కాలేజీకి వచ్చారు. నెహ్రుగారి ఉపన్యాసం అద్భుతంగా కొనసాగుతోంది. ఇసుకవేస్తే రాలనంత విద్యార్థి జనసందోహం..సూది పడితే వినపడేంత నిశ్శబ్దం! సామరస్యధోరణి ప్రతిబింబించే ‘చాచాజీ’ భావోద్వేగపూరిత ఉపన్యాసాన్ని అందరూ ఆసక్తిగా వింటున్నారు. సరిగ్గా ఆ సమయంలో నెహ్రుని ఆశ్చర్యపరిచే దృశ్యం ఒకటి ఆయన కళ్లపడింది. ప్రేక్షకుల మధ్యలోంచి భుజాన కండువాతో, చేతికర్ర ఆసరాతో ‘మహాత్మాగాంధీ’ చకచకా నడుచుకుంటూ వేదికపైకి రాసాగారు. ఉపన్యాసధోరణిలో మునిగి ఉన్న నెహ్రు-గాంధీజీని చూడడంతోటే ఆశ్చర్యపోయి ‘బాపూజీ మీరిక్కడికెలా వచ్చారు...? పైకిరండి!’’ అంటూ ఎదురేగి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికారు. ప్రేక్షక జనాల్లో గొప్ప అలజడి..! ఆ వచ్చింది ‘నిజమైన గాంధీజీకాదని’ గుర్తుపట్టిన ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నెహ్రుతో ‘‘క్షమించాలి నెహ్రుజీ...ఆయన నిజమైన గాంధీ కాదు. మా కాలేజీలోనే చదువుతున్న బి.ఎ.విద్యార్థి అతను. విచిత్రవేషధారణ అంటే అతనికి ఎక్కువ మక్కువ’’ అని వివరించి చెప్పగా.....నెహ్రు ఆశ్చర్యపోయి..ఆహుతులైన సభికుల మధ్య వేలాది ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య ‘‘మహాత్మాగాంధీజీ వేషంలో వచ్చి నన్ను కూడా సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన ఇతనికి సువర్ణపతకాన్ని బహుమానంగా ప్రకటిస్తున్నాను’’ అని చెప్పి ఆయన ఢిల్లీ వెళ్లాక ఆ బంగారు పతకాన్ని పంపారు. ఇంతకీ ఆ బంగారు పతకాన్ని నెహ్రు ద్వారా బహుమతిగా స్వీకరించిన ఆ గాంధీ వేషధారి మరెవరో కాదు....అక్షరాలా ఎన్.టి.రామారావే....

Link to comment
Share on other sites

Papam Nehru appudu oohinchi vundadu.

 

veella vamsa peethaanni...gadagdalaadinche monagaadu ee vidhaayardhe ani.. tana kooturiki chukkalu choopinche magaadu ee  telugode ani.

 

 

Johaar Anna gaaru... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...