Jump to content

sonykongara

Members
  • Posts

    66,907
  • Joined

  • Last visited

  • Days Won

    90

Reputation Activity

  1. Like
    sonykongara got a reaction from 3mar in Vizag (Araku Valley) Coffee   
    అక్కడి కాఫీకి అమరావతి ఫిదా అయింది !
      అరకు కాఫీకి కలెక్టర్ల సదస్సులో ప్రశంసలు  విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి): అరకు కాఫీ ఘుమఘుమలు రాజధాని అమరావతిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో అతిథుల కోసం అరకు కాఫీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రితో పాటు, రాష్ట్రంలో అన్ని జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఇతర అధికారులు అరకు కాఫీని రుచి చూసి అమోఘంగా వుందని ప్రశంసల వర్షం కురిపించారు. పంట, మార్కెటింగ్‌ వంటి అంశాలపై ఆరా తీశారు. విశాఖపట్నం కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను ముగ్గురు నలుగురు కలెక్టర్లు ఇదే అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాఫీ పంట సాగుకు అనుకూలమైన వాతావరణం, దిగుబడులు, మార్కెటింగ్‌, రైతులకు లాభదాయకత వంటి అంశాలపై చర్చ జరిగింది. వీటిపై జీసీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవిప్రకాశ మాట్లాడుతూ అరకు కాఫీకి బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చిందని, రిటైల్‌ మార్కెటింగ్‌ పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇన్‌స్టంట్‌ కాఫీ యంత్రాలను నగరాల్లో అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు.
  2. Like
    sonykongara got a reaction from 3mar in Amaravati Real Estate   
  3. Like
    sonykongara got a reaction from 3mar in Amaravati Real Estate   
  4. Like
    sonykongara got a reaction from 3mar in Amaravati Real Estate   
  5. Like
    sonykongara got a reaction from sagar_tdp in VUDA City Central Park, Visakhapatnam   
  6. Like
    sonykongara got a reaction from akhill in Vizag Airport   
  7. Like
    sonykongara got a reaction from SeemaSatthaa in Vizag-chennai Industrial Corridor   
    ADB approves $631 million loan for Vizag-Chennai industrial corridor The loan includes $500 mn for financing infrastructure and a $125 million component to help policy interventions by the governmentSubhayan Chakraborty  |  New Delhi  September 20, 2016 Last Updated at 12:35 IST
       
    The Asian Development Bank (ADB) has approved a $631 million loan to develop the proposed Vishakhapatnam- Chennai industrial corridor, the first such along a coastline in India.
    Part of the larger East Coast Economic Corridor (ECEC) that will extend 2,500 km from Kolkata in West Bengal and Tuticorin in Tamil Nadu, the government expects the project to bring manufacturing and export industries to India's east coast.
    The ECEC also includes a large number of ports which are currently underutilized but may be leveraged to improve India's trade capabilities with South East Asia.  
    The ADB loan includes $500 million for financing infrastructure like roads, power generation and drinking water, among others, and a $125 million component to help policy interventions by the government.
    On Tuesday, ADB officials said the loan would be disbursed as soon as the Andhra Pradesh government finalized awarding the contracts to various developers for creating infrastructure within the project area.
    The first tranche of $245 million is expected to reach the government by the first quarter of 2017, officials added.
  8. Like
    sonykongara got a reaction from 3mar in pattiseema   
  9. Like
    sonykongara got a reaction from 3mar in Amaravati to Anantapur Expressway   
  10. Like
    sonykongara got a reaction from 3mar in Amaravati to Anantapur Expressway   
  11. Like
    sonykongara got a reaction from 3mar in Nagarjuna konda,Anupu   
  12. Like
    sonykongara got a reaction from 3mar in Nagarjuna konda,Anupu   
  13. Like
    sonykongara got a reaction from Dravidict in Amaravati   
  14. Like
    sonykongara got a reaction from 3mar in AP govt Brahmin welfare schemes   
  15. Like
    sonykongara got a reaction from 3mar in AP govt Brahmin welfare schemes   
  16. Like
    sonykongara got a reaction from murali@nbkfan in Prakasam Barrage Beautification   
    ప్రకాశం బ్యారేజీకి రూ. 9కోట్లతో 14గేట్లు
      వరదప్రవాహం, ఇతర అవసరాల కోసమే..  పూర్తికావస్తున్న అప్రానపనులు  పుష్కరాలలో తొక్కిసలాటకు అస్కారం లేకుండా..  15మి.వెడల్పుతో నూతన వంతెన  (ఆంధ్రజ్యోతి, విజయవాడ)
    ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్యారేజీకి సంవత్సరాల కిందట ఏర్పాటుచేసిన పలుగేట్లను తీసివేసి, దాదాపు రూ. 9కోట్లతో 14నూతన గేట్లను అమర్చుతున్నారు. వీటిలో తాడేపల్లివైపు ఎనిమిది, ఇంద్రకీలాద్రివైపు ఆరుగేట్లు ఉండగా.. ఇప్పటి వరకు ఒకగేటును ఏర్పాటుచేశారు. దీంతోపాటు ప్రకాశం బ్యారేజీ దిగువన చేపడుతున్న అప్రానపనులు కూడా పూర్తికావచ్చాయి. దాదాపు రెండున్నర నెలల కిందట చేపట్టిన ఈ పనులు 70శాతం అయ్యాయి. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న ఈ అప్రానపనుల్లో 15మి.వెడల్పు గల బ్రిడ్జి, అప్రాననుంచి ర్యాంపు నిర్మాణ పనులు నెలరోజుల్లో పూర్తిచేయనున్నారు.   రూ. 200కోట్లతో డెల్టా ఆధునికీకరణ పనులు
    డెల్టా ఆధునికీకరణ నిమిత్తం 2009లో రూ. 200కోట్లను కేటాయించారు. విజయవాడ నగర పరిధిలో ఉన్న కాలువలు, ప్రకాశంబ్యారేజి, లాకుల్లో మరమ్మతులు, అభివృదిఽ్ధ పనులను వీటితో చేపట్టాల్సి ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం గేట్లను మార్చుతున్నారు. అయితే 2004లో బ్యారేజికి సంబంధించి మొత్తం 70 గేట్లను మార్చారు. అయితే ఈ బ్యారేజికి అమర్చిన గేట్లలో విజయవాడవైపు ప్రారంభంలో ఉన్న 6గేట్లను, తాడేపల్లి వైపు ప్రారంభంలో ఉన్న ఎనిమిదిగేట్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వరద సమయంలో కోతకు గురై వచ్చిన బురదమట్టి, ఇసుక, గుర్రపుడెక్క తదితర వాటిని కూడా ఈ గేట్ల ద్వారానే బయటకు పంపుతారు. అధిక వాడకం్ల, సక్రమంగా నిర్వహణ చేయకపోవటం వల్ల ఈ 14గేట్లు బాగా పాడైపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఈ 14గేట్లను మార్చుతున్నారు.   పూర్తికావస్తున్న అప్రాన పనులు
    కృష్ణా పుష్కరాలు, భవిష్యత అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న రెండునెలల క్రితం బ్యారేజీ దిగువన చేపట్టిన అప్రానపనులు కూడా పూర్తికావస్తున్నాయి. దాదాపు రూ. 15కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. దీంతోపాటు బ్యారేజీ దిగువ నుంచి జాతీయరహదారికి 10 మీటర్ల వెడల్పుతో ఒక ర్యాంపును నిర్మించబోతున్నారు. దీనికోసం ఇప్పటి వరకు 100మీటర్ల గోడను పూర్తిచేశారు. దీనిపక్కనే ఒక ర్యాంపు ఉన్నప్పటికీ, పుష్కరాల కోసం అత్యధిక జనం వచ్చే అవకాశం ఉండటంతో మరొకటి నిర్మిస్తున్నారు.
    త్వరలో పనులు పూర్తి
    ప్రస్తుతం బ్యారేజీకి సంబంధించిన పనులన్నీ చకచక జరుగుతున్నాయి. గేట్ల నవీకరణ పనులు త్వరలోనే పూర్తిచేస్తాం. ఇరిగేషన ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఈ పనులన్నింటిని త్వరగా చేయించేందుకు ఆదేశాలు జారీచేశారు. అప్రాన పనులు కూడా దాదాపు పూర్తికావొచ్చాయి. పుష్కరాల సమయంలో ఈ అప్రానపై షవర్స్‌ (జల్లుస్నానం) ఏర్పాటుచేయాల్సి ఉంది. ర్యాంపు పనుల్ని కూడా మొదలుపెట్టాం.
    - ఆర్‌. రవికిరణ్‌, ప్రకాశం బ్యారేజీ సూపర్‌వైజర్‌
  17. Like
    sonykongara got a reaction from NTRYoungTiger in Greater Vijayawada   
  18. Like
    sonykongara got a reaction from MVS in pattiseema   
  19. Like
    sonykongara got a reaction from 3mar in pattiseema   
  20. Like
    sonykongara got a reaction from 3mar in pattiseema   
  21. Like
    sonykongara got a reaction from minion in AP Government’s transitional headquarters   
    సచివాలయ నిర్మాణ పనులు మూడొంతులు పూర్తి
      21కి ఐదో బ్లాక్‌ సిద్ధం నెలాఖరుకు మరికొన్ని ఫ్లోర్లు. ఆగస్టు 15కి ఉద్యోగుల రాక పుష్కరాల నాటికి పాలన ఆరంభం అమరావతి: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. వాతావరణం పొడిగా ఉండడంతో భవనాల బయట పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఐదు భవనాల్లో ఇంటీరియల్‌ పనులు చకచకా జరుగుతున్నాయి. ఐదో బ్లాక్‌ పై ఫ్లోర్‌ ఈనెల 21నాటికి సిద్ధమవుతుందని భావిస్తున్నారు. మిగిలిన నాలుగు భవనాల్లో గ్రౌండ్‌ ఫ్లోర్లు నెలాఖరుకు, పై ఫ్లోర్లు ఆగస్టు 10నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. అన్ని బ్లాకులు కూడా పూర్తయ్యాకే తాత్కాలిక సచివాలయం నుంచి పాలన చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని గ్రౌండ్‌ ఫ్లోర్లు ఈ నెలాఖరుకు, పై ఫ్లోర్లు కృష్ణా పుష్కరాల లోపు ప్రారంభించనున్నట్లు సమాచారం. మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మొదటి నాలుగు బ్లాకుల్లో కింద ఫ్లోరింగ్‌, పైన సీలింగ్‌ పనులు సాగుతున్నాయి. సచివాలయంలో అంతర్గత రోడ్లు యంత్రాలతో చదును చేస్తున్నారు. సచివాలయ ప్రాంగణంలో మురుగు నీరు, వర్షపు నీరు బయటికి వెళ్లేందుకు ఐదో కిలోమీటర్ల పైపులైను వేస్తున్నారు. మరుగుదొడ్లకు సెప్టిక్‌ ట్యాంకులను భూగర్భంలో అమర్చుతున్నారు. తాగునీటి రిజర్వాయర్‌ నిర్మాణ దశలో ఉంది. అసెంబ్లీ, శాసన మండలికి ఉద్ధేశించిన ఆరో బ్లాకు పిల్లర్ల దశలోనే ఉంది. మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రోడ్డును ఏడు మీటర్ల వెడల్పు చేసే పని ప్రారంభమైంది.
  22. Like
    sonykongara got a reaction from karthik_tdp in AP power sector   
  23. Like
    sonykongara got a reaction from MVS in pattiseema   
    కృష్ణానదికి గోదావరి జలాల మళ్లింపు
      ప.గో: పట్టిసీమ నుంచి కృష్ణానదికి 1750 క్యూసెక్కుల గోదావరి జలాలను అధికారులు మళ్లించారు. నేడు అదనంగా మరో 350 క్యూసెక్కుల నీరు విడుదల చేసే అవకాశం ఉంది. పోలవరం కుడి కాలువకు నీటి ప్రవాహం వల్ల ఇబ్బంది వస్తే వెంటనే మరమ్మతులు చేస్తామని పట్టిసీమ సీజీ రమేష్‌బాబు తెలిపారు.
  24. Like
    sonykongara got a reaction from RamaSiddhu J in APSRTC Parcel Service   
    దూసుకుపోతున్న ఆర్టీసీ పార్శిల్‌
       రెండు వారాల్లో 2.50 కోట్ల ఆదాయం   పెరుగుతున్న లగేజీ బుకింగ్స్‌   ధర తక్కువ.. ఉపయోగించుకోండి: ఎండీ సాంబశివరావు  హైదరాబాద్‌, జూన్ 15(ఆంధ్రజ్యోతి): రోడ్డు రవాణా సంస్థ ప్రవేశ పెట్టిన పార్శిల్‌ సర్వీస్‌ రాష్ట్రంలో దూసుకుపోతోంది. ప్రైవేటు పార్శిల్‌తో పోల్చుకుంటే ధర తక్కువ కావడంతో బుకింగ్స్‌ రోజు రోజుకూ పెరుగుతున్నాయి. జూన 1న ప్రారంభించిన ఆర్టీసీ పార్శిల్‌ సర్వీస్‌కు తొలివారంలోనే రోజుకు రూ.10 లక్షల కలెక్షన రాగా రెండో వారం ముగిసే నాటికి రోజుకు రూ.25 లక్షలకు చేరింది. మొత్తం మీద రెండు వారాల్లోనే ఆర్టీసీకి పార్శిల్‌, కొరియర్‌ ద్వారా రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సంస్థ ఎండీ సాంబశివరావు తెలిపారు. తాము అనుకున్న లక్ష్యాల కన్నా మరింత ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశముందన్నారు. బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకు మాత్రమే ఉన్న పార్శిల్‌ సర్వీసును భవిష్యత్తులో ఇంటికి చేర్చేలా చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో 12,600 బస్సులున్న ఆర్టీసీలో కొన్నేళ్లుగా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. వాటిని తగ్గించుకునేందుకు యాజమాన్యం బస్‌ చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం వేస్తూ వస్తోంది. ప్రస్తుత ఎండీ సాంబశివరావు సైతం మొదట్లో బస్సు చార్జీలు పెంచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎం చంద్రబాబు అందుకు ససేమిరా అనడంతో రెండు, మూడు సార్లు ప్రయత్నించి చివరికి నామమాత్రపు చార్జీలు పెంచారు. అయితే, సిబ్బందికి 43ు ఫిట్‌మెంట్‌ పెంచడంతో ఆ మొత్తం ఎందుకూ సరిపోలేదు. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు.. సూచించారు. దీంతో ఆర్టీసీ పార్శిల్‌ సర్వీస్‌ ప్రారంభమైంది.
      ఆదాయ మార్గాలపై దృష్టి ఆర్టీసీలో సంస్కరణలు ప్రారంభించిన యాజమాన్యం పలు ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. బస్సులతో పాటు బస్టాండ్లలో సౌకర్యాలు మెరుగు పరిచి ప్రయాణికులను ఆకట్టుకోవడం వరకు ఎండీ పలు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ స్థలాలను లీజుకివ్వడం, బస్టాండు ప్రాంగణంలో మల్టీప్లెక్స్‌ థియేటర్ల నిర్మాణం ఇలా పలు మార్గాలను అన్వేషించిన యాజమాన్యం.. సొంతంగా పార్శిల్‌ సర్వీసును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీతో కాంట్రాక్టు తీసుకొని పన్నెండున్నర వేల బస్సులను వినియోగించుకొంటున్న ఏఎనఎల్‌ పార్శిల్‌ సర్వీస్‌ ఏటా ఎంతమేర వ్యాపారం చేస్తోంది. సంస్థకు ఎంత చెల్లిస్తోందన్న దానిపై ఎండీ ఆరా తీశారు. వ్యాపారం వందల కోట్లలో ఉండగా ఆర్టీసీకి దక్కుతున్నది కేవలం రూ.9 కోట్లు మాత్రమేనని తేలింది. దీంతో ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సుల ద్వారా పార్శిల్‌, అన్ని బస్సుల ద్వారా కొరియర్‌ సర్వీసు ప్రారంభించాలని లాభ నష్టాలను యాజమాన్యం అంచనావేసింది. ఏఎనఎల్‌తోపాటు బయట ప్రైవేటు పార్శిల్‌ సర్వీసుల ధరలను పరిశీలించింది. మొదట్లో రూ.332 కోట్ల వరకు ఆదాయం వచ్చినా ఆ తర్వాత ఏటా రూ.వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
      సిబ్బంది ఎంపికలోనే అప్రమత్తం ఎక్కడికక్కడ బస్‌ డిపో స్థాయిలో పార్శిల్‌ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి రీజియన్ల వారీగా అధికారులను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు. రీజియన స్థాయి అధికారులకు కొత్త కార్లు కొనిచ్చి వ్యాపారం అభివృద్ధి చేయాలని టార్గెట్లు నిర్దేశించారు. సిబ్బందిని సైతం మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి జూన 1 నుంచి పూర్తిస్థాయిలో పార్శిల్‌, కొరియర్‌ సేవలు ప్రారంభించారు. మొదట్లో రోజూ రూ.3 లక్షల కలెక్షనతో ప్రారంభమైన వ్యాపారం వారం రోజుల్లోనే రూ.10 లక్షలకు, రెండు వారాల్లో రూ.25 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది ఏఎనఎల్‌ ఉండటం వల్ల పార్శిల్‌, కొరియర్‌ ఆదాయం రూ.500 కోట్లకు మించబోదని, వచ్చే ఏడాది సెప్టెంబర్‌తో ఏఎనఎల్‌ గడువు ముగుస్తున్నందున ఆర్టీసీకి పార్శిల్‌ సేవల ద్వారా ఏటా రూ.1000 కోట్లు ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
      చౌక ధరలు! రాష్ట్రంలో పలు ప్రైవేటు కొరియర్‌, పార్శిల్‌ సంస్థలు చేస్తున్న చార్జీల కంటే ఆర్టీసీలో 20ుకి పైగా ధర తక్కువగా ఉంది. యాభై కిలోల బరువున్న బస్తాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే ప్రైవేటు పార్శిల్లో వేస్తున్న ధరకన్నా ఆర్టీసీ బాగా తక్కువ వసూలు చేస్తోంది. ఆర్టీసీ సేకరించిన సమాచారం ప్రకారం ప్రైవేటు పార్శిల్లో యాభై కిలోల బస్తాకు కిలోమీటరుకు 44 పైసల నుంచి అర్థరూపాయి వసూలు చేస్తున్నారు. అదే ఆర్టీసీలో 30 పైసలే. అంటే ప్రైవేటలో రూ.300కు పైగా అయ్యే ఖర్చు ఆర్టీసీలో రూ.200ల కన్నా తక్కువే అవుతుందని సంస్థ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ఆర్టీసీ కొరియర్‌, పార్శిల్‌ సేవల్ని వినియోగించుకోవాలని ఎండీ సాంబశివరావు ప్రజలకు విన్నవించారు.  
  25. Like
    sonykongara got a reaction from seenu454 in AP Government’s transitional headquarters   
×
×
  • Create New...