పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా...!
******************************
బాపు గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారి శ్రీనాథకవిసార్వభౌమ సినిమా షూటింగ్
రామకృష్ణ స్టూడియోలో జరుగుతున్నరోజులు...
తండ్రి సినిమా అందునా పౌరాణికం కావడంతో ఆసక్తిగా షూటింగ్ కి వీలున్నప్పుడల్లా వచ్చేవాడు బాలయ్య... అదే స్టూడియోలో ఇంకో సెట్లో ఇంద్రజ హీరోయిన్ గా పరిచయమయిన జంతర్ మంతర్ షూటింగ్ కూడా జరుగుతుంది....
ఒకరోజు సాయంత్రం తండ్రి సినిమా షూటింగ్ చూడడానికొచ్చిన బాలయ్యకి జంతర్ మంతర్ షూటింగ్ జరుగుతున్న సెట్ పక్కగా వెళ్తుండగా ఒక చిన్నకుర్రోడు లైట్ పట్టుకుని కనిపించాడు, ఎంతసేపట్నుంచి పట్టుకునిఉన్నాడో దాని బరువుమోయలేకనో అలసిపోయి కళ్ళుతిరిగిపడిపోయేలా కనిపించాడు....
షాట్ మధ్యలో ఉంది... వెంటనే బాలయ్య వేగంగా వెళ్ళి పడిపోబోతున్న కుర్రోడిని పక్కకి జరిపి షాట్ పూర్తయ్యేదాకా బాలయ్యే లైట్ పట్టుకున్నాడు...
ఇది గమనించిన డైరెక్టర్ భరత్ పరిగెత్తుకుంటూ వచ్చి లైట్ చేతుల్లోకి తీసుకున్నాడు, షాట్ పూర్తవ్వగానే ఆగ్రహంతో బాలయ్య డైరెక్టర్ ని "పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా" అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు...
మామూలుగానే బక్క చిక్కి ఉన్న ఆ పిల్లాడు, పొద్దున్నుంచి ఏమి తినకపోవడంతో నీరసంగా కనిపించాడు, ఆ పిల్లాడిని తీసుకెళ్ళి కడుపునిండా అన్నంపెట్టి వాళ్ళ తల్లితండ్రుల్ని తీసుకుని రమ్మని స్టూడియో సిబ్బందితో చెప్పాడు...
ఒక అరగంటలో ఆ కుర్రోడితో స్టూడియో మేనేజర్ తిరిగివచ్చాడు, పక్షవాతంతో తండ్రి, మూర్ఛరోగంతో తల్లి మంచానపడ్డారని తెలుసుకుని బాలయ్య చలించిపోయాడు, వెంటనే తార్నాకలోని హాస్పిటల్లో చేర్పించమని వాళ్ళ వైద్యానికి అయ్యే ఖర్చు అంత తానే భరిస్తానని చెప్పి, ఆ కుర్రోడిని తార్నాకలోని సరస్వతి శిశుమందిర్ లో చేర్పించి చదువు పూర్తయ్యేదాకా ఖర్చులన్నీ తానే భరించాడు...
కష్టపడి చదువుకున్న ఆ కుర్రోడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని బంకురా జిల్లాలో సీఐ గా పనిచేస్తున్నాడు, ఇప్పటికీ జూన్ 10 వ తారీకు ఈ భూమిమీద ఎక్కడున్నా దగ్గిర్లోని హాస్పిటల్ కి వెళ్ళి రక్తదానం చేస్తుంటాడు...
బాలయ్య గురించి ఇవేవీ రాయరు...
ఎందుకంటే ఇవేవీ బాలయ్య ప్రచారంకోసం బాకా కొట్టుకోడు, ఎక్కడా చెప్పుకోడు, పబ్లిసిటీ పిచ్చి లేని Powerful Man, తనకి తెలిసిన సూత్రం ఒక్కటే "మానవసేవే మాధవ సేవ"
టాప్ హీరో సినిమా టైం లో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది గురూజీ, మొత్తం సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది గుమ్మడి కాయ కొట్టేశారు, ఆ సినిమాలో చేసిన జూనియర్ ఆర్టిస్టులందరికీ పట్టు బట్టలు పంపించారు బాలకృష్ణ గారు, "దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు, పేద కళాకారులకు పట్టు బట్టలు ఇవ్వడం గొప్ప శుభ పరిణామం" అని ఒక జర్నలిస్టు ఆ ఘటనను తనదైన శైలిలో సితార పత్రికలో రాశారు...
బాలయ్యకు కల్మషం ఉండదు, మనసులో ఒకటి బయటొకటి అనే మాటే లేదు, బోళా మనిషి, నిజాయితీకి నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం, ముక్కు సూటి మనిషి, తనకు తప్పు అనిపిస్తే Spot జడ్జిమెంట్ ఉంటుంది, బాలయ్యంటే బాలయ్యే మరోమాట లేదు, మనిషేమో అగ్నిపర్వతం మనసేమో మంచు పర్వతం, అభిమానుల ముద్దుల బాలయ్య, బంగారుకొండ బాలయ్య ...!!
👑
Finally Oka maata , Balayya & Tarak kalisipovali ani manaspurtiga korukuntunna 💖💖
#జై_బాలయ్య #NBK #balakrishna #NandamuriBalakrishna #NTR #nandamuritarakaramarao