Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
మోదీ-కేసీఆర్‌ జోడీ!
07-09-2018 02:33:16
 
636719047760482553.jpg
  • ప్రధాని కనుసన్నల్లోనే గులాబీ బాస్‌
  • ఆ జోడీని దెబ్బకొట్టడమే లక్ష్యం కావాలి
  • కాంగ్రెస్ తో కలిసినా అక్కడికే పరిమితం
  • పొత్తులపై నిర్ణయంలో టీ-టీడీపీకి స్వేచ్ఛ
  • పార్టీ ముఖ్యులతో చంద్రబాబు భేటీ
అమరావతి(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. మోదీ, కేసీఆర్‌ జోడీని దెబ్బకొట్టే దిశగానే తెలంగాణలో తమ అడుగులు ఉండాలని ఆ పార్టీ నిర్ణయించింది. తెలంగాణలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం, పొత్తులపై టీ-టీడీపీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని తీర్మానించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాత్రి అమరావతి సచివాలయంలో మంత్రులు, కొందరు పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు, ఆ తర్వాత కేసీఆర్‌ నిర్వహించిన విలేకరుల సమావేశం... దానికి ముందూ వెనుకాచోటు చేసుకున్న పరిణామాలు, టీడీపీ అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ప్రధాని మోదీతో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఒక అవగాహనకు వచ్చారని తాజా పరిణామాలతో స్పష్టమవుతున్నట్లు ఈ సమావేశం అభిప్రాయపడింది. ‘‘అసెంబ్లీ రద్దుకు ముందు కేసీఆర్‌ రెండు మూడుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి వచ్చారు. ఆయన వెళ్లి వచ్చిన మరుక్షణం జోనల్‌ వ్యవస్థపై ఆగమేఘాలపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ అయ్యాయి.
 
 
అసెంబ్లీ రద్దుపై మంత్రివర్గ తీర్మానాన్ని కేసీఆర్‌ ఇవ్వగానే... గవర్నర్‌ ఆయనను కూర్చోబెట్టి అప్పటికప్పుడు దానిని ఆమోదించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నియమిస్తూ లేఖ కూడా ఇచ్చి పంపారు. బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కేసీఆర్‌ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇవన్నీ టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య సయోధ్య, సాన్నిహిత్యాన్ని స్పష్టంగా చూపించాయి’’ అని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో జగన్‌, పవన్‌ ఇద్దరూ మోదీ నడిపిస్తున్న శక్తులే అనే అంచనాకు వచ్చారు. ఏపీలో బీజేపీతో తాము తెగదెంపులు చేసుకోకమునుపే... తెలంగాణలో బీజేపీ తమతో బంధం తెంచుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘అక్కడ టీఆర్‌ఎ్‌సతో సంబంధాలు నెలకొల్పుకోవాలన్న యోచన మోదీ మనసులో ముందు నుంచే ఉంది. అందుకే అక్కడ ముందే తలుపు తీసి పెట్టుకొన్నారు’’ అని ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్‌ మంత్రి ఒకరు పేర్కొన్నారు.
 
 
టీడీపీపై విమర్శలు ఎందుకు?
సభ రద్దు జరిగిన వెంటనే కేసీఆర్‌ టీడీపీని విమర్శించడంపైనా ఈ భేటీలో చర్చ జరిగింది. ‘‘తెలంగాణలో టీఆర్‌ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ. మనం ప్రధాన ప్రత్యర్థులం కాదు. టీడీపీని, నన్ను తిట్టాల్సిన అవసరం ఏమిటి? మనల్ని బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టాలన్నది వారి లక్ష్యం. ఇది కూడా మోదీ, షాల వ్యూహమే. వారి వ్యూహాన్ని కేసీఆర్‌ అమలు చేస్తున్నారు’’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సోదర భావంతో కలిసి ప్రయాణించాలని, ఇద్దరూ అభివృద్ధి కావాలని టీడీపీ కోరుకుంటోందని తెలిపారు.
 
‘‘రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు అని అప్పుడు చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను. దీనిని ప్రజలు ఆమోదించారు. ఏపీలో అధికారం ఇచ్చారు. తెలంగాణలో పదిహేను సీట్లలో గెలిపించారు. ఈ సుహృద్భావాన్ని కేసీఆర్‌ అందుకోవడం లేదు. భావోద్వేగాలు రెచ్చగొట్టి లాభం పొందాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే సందర్భం లేకుండా మనపై పడుతున్నారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వస్తుందో, తిరిగి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందో కూడా కేసీఆర్‌ చెబుతున్నారని... గవర్నర్‌, ఎన్నికల కమిషన్‌ చెప్పాల్సిన విషయాలు కూడా ఆయనే చెబుతున్నారంటే వెనుక ఎవరు ఉన్నారో తేలిగ్గా అర్థమవుతోందని రాయలసీమకు చెందిన మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.
 
 
పొత్తులపై తర్జనభర్జన
తెలంగాణలో రాజకీయ ప్రత్యమ్నాయాలపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. సీనియర్‌ మంత్రి యనమల రామకృష్ణుడు తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. ‘‘కేంద్రంలో మరోసారి మోదీ వస్తే మనకు నష్టం. మోదీని, ఆయన మిత్రులను ఓడించి తీరాలి. ఆంధ్రప్రదేశ్‌లో మనం సొంతంగా ఆ పని చేయగలం. ఇక్కడ మనకు ఎవరి సహకారం అవసరం లేదు. తెలంగాణలో బీజేపీ వ్యతిరేక పార్టీల్లో బలంగా ఉన్న వారితో కలిస్తే తప్పేమీ లేదు. కానీ, ఆ పొత్తు ఆ రాష్ట్రానికే పరిమితం కావాలి. మనకు జాతీయ స్థాయి రాజకీయ దృక్పథం కూడా అవసరం. మనకు అవకాశం ఉన్న ప్రతిచోటా బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులను బలోపేతం చేయాలి. దక్షిణాదిలో ఆ పార్టీకి చోటు లేకుండా చేయాలి’’ అని యనమల సూచించారు. తెలంగాణలో ఒకవేళ కాంగ్రె్‌సకు మద్దతు ఇవ్వాల్సి వస్తే దానివల్ల ఏపీలో ఇబ్బంది వస్తుందేమోనని మంత్రి కొల్లు రవీంద్ర సందేహం వ్యక్తం చేశారు.
 
 
‘‘ఇవి రెండు వేర్వేరు రాష్ట్రాలు. ఎక్కడి పార్టీలు అక్కడ ఉన్నాయి. అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి అక్కడ ఏం చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీకి ఇద్దాం. నేను శనివారం అక్కడకు వెళ్తున్నాను. అక్కడి నేతలతో మాట్లాడతాను. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొంటాను. అక్కడైనా... ఇక్కడైనా ఒకటి మాత్రం స్పష్టం. మోదీ మళ్లీ రావడం దేశానికి నష్టం. దాని ప్రాతిపదికపైనే పార్టీ నడుస్తుంది’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు, పవన్‌ కల్యాణ్‌ పార్టీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోందని ఒక మంత్రి చెప్పారు. బీజేపీతో పవన్‌ నిత్య సంబంధాల్లో ఉన్నారని, టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లలో చీలిక తేవడానికే ఈ ప్రయత్నమని మరో మంత్రి వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

ముందస్తు’ ప్రచారాన్ని ప్రారంభించిన తాజా మాజీ ఎమ్మెల్యే
07-09-2018 10:26:28
 
636719127878108832.jpg
సత్తుపల్లి(ఖమ్మం): శాసనసభ రద్దుతో.. ముందస్తు ఎన్నికలకు లైన్‌క్లియర్‌ కా వడంతో... టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెం కటవీరయ్య ‘ముందస్తు’ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 8గంటలకు సత్తుపల్లి మండలం రామానగరంలో తన ప్రచారాన్ని ప్రారంభించారు. 2009, 2014 ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా గెలుపొందిన ఆయన.. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించేలా వ్యూహాలను రచిస్తున్నారు. ఈ క్రమంలో అంద రికంటే ముందస్తుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలను... నియోజకవర్గానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్న రామానగరం నుంచే ప్రారంభించే ఆనవాయితీని ఆయన కొనసాగించారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న సమాచారంతో వెంకటవీరయ్య కొద్ది నెలలుగా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి.. విసృతంగా పర్యటిస్తున్నారు. రాబోయే రోజుల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తు ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు తాను సత్తుపల్లి నుంచే.. అదీ తెలుగుదేశం పార్టీ తరపునే బరిలో దిగబోతున్నట్టు గతంలోనే స్పష్టం చేశారు. ఆమేరకు విపక్ష అభ్యర్థులందరికంటే ముందుగా ప్రచారం ప్రారంభించారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అన్న ఎన్టీరామారావు నినాదాన్ని గురువారం ఆయన తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. తొమ్మిదేళ్ల కాలంలో శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబంతో సంబంధ బాంధ్యవాలు కొనసాగించానని, ఎవరికి కష్టం వచ్చినా అండగా ఉన్నానని, అన్ని కుటుంబాల శుభకార్యాల్లో కుటుంబసభ్యుడిగా వెన్నంటి ఉన్నానని ఉద్ఘాటించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అభివృద్ధి ఒక భాగం మాత్రమేనని తమతో మమేకమై.. వారి కష్ట సుఖాల్లో ప్రజా ప్రతినిధిగా తోడుండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నా రు. ప్రజల ఆకాంక్ష మేరకు అందరిలో ఒకడిగా ఉన్నానని, ఈ నియోజకవర్గ ప్రజలు జలగం కుటుంబసభ్యులు, తుమ్మల చేసిన అభివృద్ధిని చూసారని.. ఇప్పుడు తొమ్మిదేళ్లుగా తనను, తన వ్యక్తిత్వాన్ని గమనిస్తున్నారని.. ఈ సారి కూడా తనను ఆశ్వీరదించాలని కోరుతూ ప్రచారానికి నాంది పలికారు.
 
సర్వేలో వందసీట్లు పైగా వస్తే ‘ముందస్తు’ దేనికి?
తన పర్యటనలో భాగంగా రామానగరంలో ని జరిగిన సభలో సండ్ర మాట్లాడుతూ ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాయరని, ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారన్నారు. సర్వేల్లో 100 సీట్లకు పైగా విజయం సాధిస్తారని చెబుతుంటే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించా రు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీలను నెరవేర్చకుండా, పదవుల కోసమే పాకులాడడాన్ని ప్రజలు తిప్పికొడతారన్నారు. రాజకీయ ఫిరాయింపులతో రూ. కోట్ల ప్రజాధనం వృథా కావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. సత్తుపల్లి మండలం రామానగరం నుంచే ప్రతిసారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నానని.. అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రజాదీవెనలు, ఆశీర్వాదాలు ఎప్పుడూ తనకు ఉంటాయని, తుదిశ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటానని భావోద్వేగంతో ప్రకటించారు.
 

Advertisem

Link to comment
Share on other sites

ఫిరాయింపు నేతను ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీ బడా ప్లాన్!
07-09-2018 09:31:31
 
636719094913141514.jpg
  • రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో మొదలైన రాజకీయ వేడి
 
హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హంగామా మొదలు కావడంతో రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైయింది. ఓ పక్క రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయడంతోపాటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించడంతో అందు లో రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకా‌ష్‌గౌడ్‌ పేరును ప్రకటించారు. ప్రకా‌ష్‌గౌడ్‌ పేరును ప్రకటించిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నియోజకవర్గం అంతటా సంబరాలు నిర్వహించారు. స్వీట్లు పంచారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎన్నికల జోష్‌ కనిపించింది. ఈ సారి ప్రకాష్‌గౌడ్‌ గెలుపుకోసం తామంతా పని చేస్తామని వారంతా ప్రచారం నిర్వహించారు.
 
 
మరోపక్క టీఆర్‌ఎస్‌ నుంచి టిక్కెట్‌ కోసం తీవ్రంగా పోటి పడిన ప్రకా‌ష్‌గౌడ్‌ వ్యతిరేకవర్గం నాయకులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ప్రకా‌ష్‌గౌడ్‌ను కాదని తమ కు టిక్కెట్‌ కేటాయించాలని టీఆర్‌ఎస్‌ అగ్రనాయకులు ఇద్దరు, ప్రజాప్రతినిధులతోపాటు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుడు కూడ తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. వీరు ఎవరికి వారు అటు మంత్రుల వద్ద, ఇటు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వద్ద, చివరకు సీఎం కేసీఆర్‌ వద్ద గోడు వెల్లడించుకున్నారు. ప్రకా‌ష్‌గౌడ్‌ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాడని తాము మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ ఉద్యమంలో ఉంటూ పార్టీకోసం పని చేస్తున్నామని తమను గుర్తించాలని వారు వాపోయారు. ఈ వినతులు అన్ని ఎలా ఉన్నా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకా‌ష్‌గౌడ్‌ వైపే మొగ్గు చూపాడు. వీరికి టిక్కెట్‌ రాకపోవడంతో పార్టీపై తీవ్ర నిరాశతో ఉన్నారు. మరి టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ సాధించిన ప్రకా‌ష్‌గౌడ్‌ ఈ అసంతృప్తులను కలపుకుపోవాల్సిన అవసరం ఉంది. మరికొద్ది రోజులలో తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకా‌ష్‌గౌడ్‌ వారి ఇళ్లకు వెళ్లి చర్చిస్తారని అందర్ని కలుపుకొని ప్రచారం మొదలు పెడతారిన ఆ పార్టీ సీనియర్‌ నాయకులు పేర్కొంటున్నారు.
 
 
రంగంలోకి ఇతర పార్టీలు
టీఆర్‌ఎస్‌ హంగమా షురూ కావడంతో ఇతర పార్టీలు కూడా గురువారం ఉదయం నుంచే రంగంలోకి దిగాయి. తమ పార్టీ క్యాడర్‌తో మాట్లాతూ తమ కార్యాచరణ మొదలు పెట్టారు. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి అభ్యర్థులను ప్రకటించనప్పటికీ ఈ రెండు పార్టీల నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్న నాయకులు నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాలు, కాలనీలలోని నాయకులతో మాట్లాడారు. టిక్కెట్‌ తనకే వస్తుందని మనమంతా కలసి పని చేయాలని, అధికార పార్టీ వలలో పడొద్దనే సంభాణలే అధికంగా ఉన్నాయిన ఆయా పార్టీల దిగువ స్థాయి నాయకులు పేర్కొంటున్నారు.
 
 
ఇదిలా ఉంటే.. ఈ సారి టీడీపీ కాంగ్రెస్‌ పొత్తు ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఆ రెండు పార్టీల నాయకులు కూడా ఈ ముందస్తు ఎన్నికలపై చర్చలు జరిపారు. రెండు పార్టీలలోని బడా నాయకులు కొంత మంది ఒకరికొకరు ఫోన్లు చేసుకొని పొత్తులో ఎవరికి టిక్కెట్‌ వచ్చినా కలిసి పనిచేస్తామని మనమంతా కలిసి ఉండాలని ఉమ్మడిగా టీఆర్‌ఎస్‌ను ఓడించాలని వీరంతా చర్చించారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు ఇదే విషయంపై సంభాషణలు జరిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన జరిగిన నేపథ్యంలో ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థులను ముందస్తుగానే ప్రకటిస్తాయని అనుకుంటున్నారు.
 
స్వామి ఆశీర్వాదంతో...
రాజేంద్రనగర్‌ నియోజకవర్గం టికెట్‌ నాకు కేటాయించడం సంతోషంగా ఉంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను. కేసీఆర్‌కు ధన్యవాదాలు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడానికి ప్రజలు అవకాశం కల్పించారు. మూడోసారి ప్రజల మద్దతుతో, కేసీఆర్‌ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేస్తాను. ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. - టి.ప్రకాశ్‌గౌడ్‌, తాజా మాజీ ఎమ్మెల్యే, రాజేంద్రనగర్‌ నియోజకవర్గం
 
 
Tags : mla prakash goud, rajendra nagar, Congress, telugudesam, TRS

Advertisement

Advertisement

Link to comment
Share on other sites

టీడీపీతో పొత్తుపై చర్చించేందుకు రంగంలోకి ముగ్గురు కీలక నేతలు!
07-09-2018 11:33:57
 
636719168366956184.jpg
హైదరాబాద్: శాసన సభను రద్దు చేస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయంతో ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. కేసీఆర్ నిర్ణయాన్ని తప్పని ఓ వైపు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే... ఎలాగైనా సరే ఈ సారి టీఆర్ఎస్‌ను ఓడిండాలని ప్రతిపక్షాలైన టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ తహతహ లాడుతోంది.!. అంతేకాదు ఇప్పటికే సీట్లు కేటాయింపులు కూడా అయిపోయాయని పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి.
 
 
ఇవన్నీ అటుంచితే... తెలంగాణలో పొత్తు విషయమై టీడీపీతో చర్చించాలని ముగ్గురు కీలక నేతలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగి హస్తం గూటికి చేరిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కీలక నేత మధుయాష్కీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బోస్ రాజులకు బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే టీడీపీ కీలక నేతలతో చర్చలు ఎప్పుడు.. ఎక్కడ జరపాలన్న దానిపై అధిష్ఠానం ప్లాన్ చేస్తోందని తెలిసింది.
 
ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో ముగ్గురు కీలక నేతలు రంగంలోకి దింపి.. తెలంగాణకు చెందిన టీడీపీ కీలక నేతలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అయ్యి చర్చిస్తారని సమాచారం. కాగా కాంగ్రెస్‌‌తో పొత్తుకు తప్పకుండా టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్నది గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసి.. టీఆర్ఎస్‌ను ఏ మేరకు ఎదుర్కొంటాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Link to comment
Share on other sites

టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరా.. అవకాశం ఇస్తే...!!
07-09-2018 10:41:05
 
636719136650838262.jpg
  • ఎన్నికలకు అంబర్‌పేట నియోజకవర్గంలో టీడీపీ సిద్ధం
  • అంబర్‌పేట నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి వనం రమేష్‌
హైదరాబాద్: ముందస్తు ఎన్నికలను ఎదుర్కోడానికి అంబర్‌పేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి, గ్రేటర్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి వనంరమేష్‌ తెలిపారు. గురువారం ఆయన నల్లకుంటలో ముందస్తు ఎన్నికలపై మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండానే సీఎం కేసీఆర్‌ మరో ఎన్నికలకు సిద్ధం కావడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. అయిదు సంవత్సరాల పాలన చేయాల్సి ఉండగా ఆరు నెలల ముందుగానే ముందస్తు ఎన్నికలకు పోవడం చూస్తుంటే కేసీఆర్‌కు ప్రతిపక్ష పార్టీల భయం పట్టుకుందని అన్నారు.
 
 
నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దండిగా ఉన్నారని తెలిపారు. అంబర్‌పేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని తెలిపారు. గతంలో టీడీపీ పక్షాన 1983లో నారాయణగౌడ్‌ గెలుపొందారని తెలిపారు. ఆ తర్వాత 1994లో సి.కృష్ణాయాదవ్‌ ఈ నియోజకవర్గంలో గెలిచారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అంబర్‌పేటలో టీడీపీ విజయం సాధిస్తుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేటికి స్థానిక ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. బీజేపీ పట్ల ప్రజలలో అసంతృప్తి ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీ పటిష్టత కోసం అంకితభావంతో పనిచేస్తున్న తమకు టికెట్‌ ఇవ్వాలని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును కోరినట్లు ఆయన తెలిపారు. అధిష్టానం అవకాశం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

arekapudi gandhi gadu 2012 macherla bielection ki karempudi ,drugi vacchi kamma kamma ani battalu chinchukunnadu, vidu mla ayyaka ventane jump kottedu ...

elections ki enno CRs karchupetti untaaru...avi recovery chesukovaali ante isumantivi thappavemo....

migatha vaallaki atta kaadhe...unna oodina adhe gochi.....thappa poyedhemuntundhi sony dude..

Link to comment
Share on other sites

1 hour ago, chsrk said:

elections ki enno CRs karchupetti untaaru...avi recovery chesukovaali ante isumantivi thappavemo....

migatha vaallaki atta kaadhe...unna oodina adhe gochi.....thappa poyedhemuntundhi sony dude..

alanti vallu vyparalu chesukovali rajakiyalu enduku annayi..

Link to comment
Share on other sites

కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ?
07-09-2018 13:14:03
 
636719228434549248.jpg
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖకు మొదటి జాబితాలో అవకాశం దక్కకపోవడంతో అనేక ఊహాగానాలు వినబడుతున్నాయి. కొండా దంపతులు పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. మరి కొంత మంది మరి కాస్త ముందడుగు వేసి ఏకంగా కాంగ్రెస్‌ పార్టీలో రెండు టికెట్లు అడుగుతున్నారు. దాదాపు ఖాయం అయిపోయినాయన్న చర్చ నడుస్తోంది. కొండా దంపతుల కుమార్తె సుస్మితా పటేల్‌తో పాటు సురేఖకు టికెట్‌ కావాలని కేసీఆర్‌ను అడిగారంటున్నారు. దీంతో సురేఖ లేదా సుస్మితా పటేల్‌ ఎవరో ఒక్కరికే టికెట్‌ ఇస్తామని కేసీఆర్‌ చెప్పారంటున్నారు. దీంతో మొదటి జాబితాలో సురేఖకు అవకాశం దక్కలేదంటున్నారు.
Link to comment
Share on other sites

6 hours ago, sonykongara said:

arekapudi gandhi gadu 2012 macherla bielection ki karempudi ,drugi vacchi kamma kamma ani battalu chinchukunnadu, vidu mla ayyaka ventane jump kottedu ...

Around 2009-10 time lo KPHB vanabhojanalu time.. Party odipoyi baaga dull aina time anukunta. Konni districts lo Cs Kooda YSR ki supported. Appudu eeyana "brathikinantha kalam pasupu jenda kinde untam, lekapothe politics vadilesi potham. Anthe kani aa flag vadalam ani speech". 

Seems he was made dummy after he won elections. Chinna chinna panulaki Kooda ministers ribbon cutting chesevallu, officers didn't care about TDP greater MLAs when they were in TDP. Aa dummy candidates ga undaleka jumped anukunta arikepudi, maganti

Link to comment
Share on other sites

21 minutes ago, NFans NRT said:

Around 2009-10 time lo KPHB vanabhojanalu time.. Party odipoyi baaga dull aina time anukunta. Konni districts lo Cs Kooda YSR ki supported. Appudu eeyana "brathikinantha kalam pasupu jenda kinde untam, lekapothe politics vadilesi potham. Anthe kani aa flag vadalam ani speech". 

Seems he was made dummy after he won elections. Chinna chinna panulaki Kooda ministers ribbon cutting chesevallu, officers didn't care about TDP greater MLAs when they were in TDP. Aa dummy candidates ga undaleka jumped anukunta arikepudi, maganti

Same situation Sandra ki ledha

Link to comment
Share on other sites

2 minutes ago, bnalluri said:

Gandhi XXXXX koduku odipovali tummala antha kante odipovali gopinath XX gadiki kukka chavu ravali

Before 2014 elections Kcr ki tummala ki oka understanding vundhi.. idhi fact evaru opukunna opukokunna.. Khammam dist lo TDP party ni naakinchaadu vere leader ni edhaganivakunda :sleep:

Link to comment
Share on other sites

ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఇద్దరు యువకులు రేడియో టవర్ ఎక్కారు. శుక్రవారం ఎల్బీనగర్లోని చింతల్ కుంటలోని రేడియో టవర్ ను ఎక్కిన యువకులు శంకరమ్మకు టికెట్ ఇస్తేనే కిందకు దిగుతామని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు గంటల నుంచి ఇద్దరు యువకులు రేడియో టవర్ పైనే ఉండటంతో అక్కడ స్థానికులు భారీగా గుమిగూడారు.

తెలంగాణ ఉద్యమంలో ఆమరణ దీక్షకు సిద్దమైన కేసీఆర్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ.. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరాస్తాలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  2014 ఎన్నికల్లో ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ అమరవీరులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...