Jump to content

Sorry Telengana!


RKumar

Recommended Posts

సారీ తెలంగాణ!
23-03-2018 02:37:42
 
636573694615348630.jpg
  • ఇదేనా మీ ఆతిథ్యం?
  • సులభంగా అనుమతులన్నారు
  • రాష్ట్రానికి వస్తే పట్టించుకోరా?
  • ఇది మమ్మల్ని అవమానించడమే!
  • పెట్టుబడులపై మిమ్మల్ని సంప్రదించం
  • చైనా పారిశ్రామికవేత్తల అసంతృప్తి
  • రేపటి వరంగల్‌ పర్యటన రద్దు?
 
హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ కొత్త రాష్ట్రం, ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయన్నారు.. సులభతర వ్యాపార నిర్వహణలో మేమే నెంబర్‌ వన్‌ అన్నారు.. పరిశ్రమల స్థాపన కోసం దేశంలోనే అత్యంత అనుకూల విధానాలు మావే అంటూ ప్రపంచమంతా పర్యటిస్తారు.. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు
అత్యంత సులభంగా అనుమతులు ఇస్తామని చెబుతుంటారు. కానీ, పెట్టుబడులు పెట్టడానికి మేం సిద్ధంగా ఉన్నామంటే మా త్రం పట్టించుకోరా? సారీ తెలంగాణ. మీ ఆతిథ్యం ఇలా ఉంటుందని ఊహించలేదు. మీ ప్రచారం చూసి తెలంగాణలో పరిస్థితుల పై ఎక్కువగా ఊహించుకున్నాం. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ, మీ తీరు చూశాక తీవ్ర అసంతృప్తికి గురయ్యాం’’అని చైనా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం పేర్కొంది. 3 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించింది. ఇది తమను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ప్రతినిధులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
భారత్‌-చైనా ఆర్థిక, సాంస్కృతిక మండలి(ఐసీఈసీ) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోట ల్లో చైనా పారిశ్రామికవేత్తలతో వ్యాపార(బీ2బీ) సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొనాల్సి ఉంది. రాత్రి 7 గంటలకు సమావేశం ప్రారంభమవ్వాల్సి ఉండగా ముఖ్యఅతిథుల కోసం 8 గంటల వరకు నిరీక్షించారు. అయినా ఎవరూ రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు లేకుండానే సమావేశాన్ని ప్రారంభించి, ముగించారు. ఈ సమావేశంలో పర్యావరణం, సహజ విద్యుత్తు, మౌలిక వసతులు, గృహనిర్మాణం, ఐటీ సేవలు, పరిశ్రమల రంగాలకు చెందిన 82 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు.
 
ఇదేనా.. మర్యాద?
సమావేశం ముగిసిన తర్వాత చైనా పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత మంది చైనా ప్రతినిధులు ఒక రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమమని, వేరే ఏ దేశానికి వెళ్లినా తమకు ఘనంగా స్వాగతం పలికేవారని అసహ నం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ విధానాలు, ఇక్కడి నిబంధనలు, ఎఫ్‌డీఐ గురించి చర్చిద్దామని వస్తే పట్టించుకోలేదని ఐసీఈసీ ప్రతినిధుల ముందు వాపోయారు. గురువారం ఉదయం హెచ్‌ఐసీసీలో ఏర్పాటుచేసిన చైనా స్టాల్స్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభానికి ఐటీ మంత్రి కేటీఆర్‌, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ రాక పోవడాన్ని ప్రస్తావించారు.
 
స్మార్ట్‌సిటీ పర్యటన రద్దు..?
దేశంలో స్మార్ట్‌సిటీలుగా ఎంపికైన నగరాలు, పట్టణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న చైనా పారిశ్రామికవేత్తల ప్రతినిధుల బృందం ఈ నెల 24న వరంగల్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, ఈ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. అయినా, వెళ్లాలనుకున్న చైనా ప్రతినిధి బృందం గురు వారం ప్రభుత్వ తీరుతో వరంగల్‌ పర్యటనను రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పెట్టుబడులపై ఇక మీదట ప్రభుత్వాన్ని సంప్రదించకూడదని నిర్ణయించినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...