Jump to content

Amaravati


Recommended Posts

 

చంద్రబాబును కలిసిన నార్మన్‌ఫోస్టర్‌ ప్రతినిధులు

 

అమరావతి: సీఎం చంద్రబాబును నార్మన్‌ఫోస్టర్‌ ప్రతినిధులు కలిశారు. ఈ సమవేశంలో రాజధాని డిజైన్లను సీఎం పరిశీలించారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సహా వివిధ నిర్మాణాలపై ఆయన పలు సూచనలు చేశారు. పరిపాలనా నగరానికి ఉత్తరం వైపు ఎన్టీఆర్ విగ్రహం, దక్షిణాన అంబేద్కర్ విగ్రహం ఉండాలని సూచించారు. సచివాలయం, హెచ్ఓడీల ఆఫీస్‌లు పక్కపక్కనే నిర్మించాలన్నారు. సచివాలయం, హెచ్ఓడీల భవనాలకు అభిముఖంగా నివాస సముదాయాలు ఉండాలన్నారు. పరిపాలనా నగరంలో ప్రైవేటు ఆస్తులకు చోటులేదని స్పష్టంచేశారు. అమరావతి నగరాన్నివీక్షించేందుకు అత్యంత ఎత్తులో టవర్‌ నిర్మించాలని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో చంద్రబాబు చెప్పారు.

 

:super:  :terrific:

Link to comment
Share on other sites

అమరావతి ఆకృతులపై ఏకాభిప్రాయం

22brk151a.jpg

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది. రాజధానిలో నిర్మించే ఆకృతులపైఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు. మరో 2 వారాల్లో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు తుది ఆకృతులను అందించనున్నారు. శాసనసభ, శాసనమండలికి మధ్యలో సెంట్రల్‌ హాల్‌ నిర్మాణం చేపట్టనున్నారు. నగరానికి రెండు వైపులా అతిపెద్ద పార్కులు, ఓ వైపు పరిపాలనా భవంతులు మరోవైపు ప్రజల సందర్శనకు కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నారు. సాంస్కృతిక భవనం, ఎగ్జిబిషన్‌ సెంటర్‌, వాణిజ్య కూడలి వంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిరంతరం నీటి ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలపైనా చర్చించారు. రాజ్‌భవన్‌కు సమీపంలోనే ముఖ్యమంత్రి నివాస భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Link to comment
Share on other sites

cheppevi anni okesari chepppa vacchuga chavadobbudu enduku

 

Guntur Agri university buildings ki engineers and university officials 2 month back and forth exchanges dwara finalize chesina designs ni CBN 2 minutes lo reject chesadu. appudu nenu kuda ilane feel ayya.

 

recent ga vacchina designs super ga vunnayi. Now, I am glad those designs were rejected by CBN.

Link to comment
Share on other sites

అమరావతిపై నార్మన్ ఫోస్టర్ సంస్థ తుది డిజైన్లు
 
636310882447389548.jpg
అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన పరిపాలనా నగరం తుది డిజైన్లను మరో రెండువారాల్లో నార్మన్ ఫోస్టర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించనుంది. అమరావతి పరిపాలనా నగర రూపకల్పనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా, అధికారులు, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు దాదాపు ఏకాభిప్రాయానికి, ఒక అవగాహనకు వచ్చారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు రూపొందించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. దీనిపై నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి పలు మార్పులు, చేర్పులు సూచించారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సహా వివిధ నిర్మాణాలు రాజధానికి తలమానికంగా వుండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన హైకోర్టు భవనం అంతగా ఆకట్టుకోవడం లేదని దానిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలని చెప్పారు. పరిపాలనా నగరానికి ఉత్తరం వైపు ఎన్టీఆర్ విగ్రహం, దక్షిణాన అంబేద్కర్ విగ్రహం వుండేలా చూడాలని నిర్దేశించారు. వీటికి నడుమ అమరావతి నగరమంతా వీక్షించేలా అత్యంత ఎత్తులో ప్రత్యేకంగా టవర్ నిర్మించాలని నిర్ణయించారు. సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయాలు పక్కపక్కనే వుండాలని, వాటికి అభిముఖంగా నివాస సముదాయాలు రావాలని ముఖ్యమంత్రి అన్నారు. పరిపాలన నగరంలో పూర్తిగా ప్రభుత్వ సొత్తు అని, ప్రైవేటు ఆస్తులకు ఎక్కడా చోటులేదని చెప్పారు. అన్నిరకాల సాంస్కృతిక ప్రదర్శనలకు వీలుగా అత్యంత అద్భుతంగా ఒక భవనాన్ని ప్రస్తుతం నిర్ణయించిన కన్వెన్షన్ సెంటర్ సమీపంలోనే నిర్మించాలని ముఖ్యమంత్రి చెప్పారు. శాసనసభ, శాసనమండలికి మధ్యలో సెంట్రల్ హాల్ వుండాలని అన్నారు. నగరానికి రెండు వైపులా అతి పెద్ద పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. బీఆర్టీ, ఎమ్మార్టీ, ఈ బస్ వేల గురించి ముఖ్యమంత్రికి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు వివరించారు. ఓవైపు పరిపాలనా భవంతులు, మరోవైపు సాధారణ ప్రజానీకం సందర్శించేలా కన్వెన్షన్ సెంటర్, సాంస్కృతిక భవనం, ఎగ్జిబిషన్ సెంటర్, వాణిజ్య కూడలి, పార్కులు వుండాలంటూ తన ఆలోచనలను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. పరిపాలనా నగరంలో నిరంతరం నీటి ప్రవాహం వుండేలా చర్యలు తీసుకోవాలని, జస్టిస్ సిటీకి పక్కనే మరో నగరానికి చోటు కల్పించాలని చెప్పారు. ప్రజాప్రతినిధులకు, న్యాయమూర్తులకు నివాస సముదాయాలపైనా చర్చ జరిగింది. రాజ్ భవన్‌కు సమీపంలోనే ముఖ్యమంత్రి నివాస భవనం రానుంది.
Link to comment
Share on other sites

అటు అంబేడ్కర్‌... ఇటు ఎన్టీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఓకే
 
636310995129065100.jpg
  • అసెంబ్లీ డిజైన్‌కూ ఆమోద ముద్ర
  • హైకోర్టు డిజైన్‌లో మార్పులకు సూచన
  • 15 రోజుల్లో ఐకానిక్‌ భవనాల డిజైన్లు
  • ఆ వెంటనే టెండర్లు... 2 నెలల్లో పనులు
  • 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్‌
  • సచివాలయం, హెచ్‌వోడీకీ ఐకానిక్‌ హంగు
  • అసెంబ్లీ, మండలి మధ్య ‘సెంట్రల్‌ హాల్‌’
  • నట్టనడుమ 600 అడుగుల ఎత్తున టవర్‌
  • ఒక శాఖ కార్యాలయాలన్నీ ఒకే భవనంలో!
  • డిజైన్లు సమర్పించిన ‘నార్మన్‌ ఫోస్టర్‌’
అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అతి కీలకమైన ‘మాస్టర్‌ ప్లాన్‌’ ఖరారైంది. మొత్తం 1350 ఎకరాల్లో అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్‌, హైకోర్టు, అధికారుల నివాస భవనాలు... ఇలాంటి కీలక నిర్మాణాలు ఏవి ఎక్కడుండాలో తెలిపే మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వ ఆమోద ముద్ర పడింది. అంతేకాదు... అద్భుతః అనిపించేలా ‘ఐకానిక్‌’ బిల్డింగ్‌లా నిర్మించాలని తలపెట్టిన అసెంబ్లీ డిజైన్‌ కూడా దాదాపుగా ఖరారైంది. 900 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే పరిపాలనా నగరిలో... శాసనసభ, శాసన మండలి, సచివాలయం, రాజ్‌భవన్‌ తదితర భవనాలు నిర్మాణం కానున్నాయి.
 
దీనికి అనుబంధంగా మరో 450 ఎకరాల్లో హైకోర్టు, ఇతర కార్యాలయాలను నిర్మిస్తారు. వీటి నిర్మాణ పనులు ఎట్టిపరిస్థితుల్లో మరో రెండు నెలల్లో మొదలు కావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ను, ప్రభుత్వ నగరిలోని రెండు ఐకానిక్‌ బిల్డింగుల (అసెంబ్లీ, హైకోర్టు) డిజైన్లపై మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ ప్రతినిధులతో ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా చర్చించారు. మాస్టర్‌ప్లాన్‌, అసెంబ్లీ ఆకృతులపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది.
 
ఇందులో కొద్దిపాటి మార్పుచేర్పులు చేసి, దాని ఫైనల్‌ డిజైన్లను ఖరారు చేయనున్నారు. హైకోర్టు డిజైన్లు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయని తెలిసింది. మాస్టర్‌ ప్లాన్‌, డిజైన్లకు సంబంధించి ఒక్కొక్క దానికి రెండేసి చొప్పున మోడల్స్‌ను ఈ సమావేశంలో ప్రదర్శించారు. పరిపాలనా నగరపు ఫైనల్‌ మాస్టర్‌ప్లానను మరో 2 వారాల్లో ఫోస్టర్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. హైకోర్టు డిజైన్లపై సీఎం సూచించిన మార్పుచేర్పులను చేసి, తుది ఆకృతులను వచ్చే నెలాఖరుకల్లా సమర్పించనున్నారు. ఫైనల్‌ డిజైన్లు సిద్ధమైన వెంటనే టెండర్లను పిలిచి, 2 నెలల్లోగా నిర్మాణ పనులు ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణంపై ఆసక్తి ఉన్నవారి కోసం ఇప్పటికే ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌’ను పిలిచారు. వాటి డిజైన్లు ఖరారైన వెంటనే టెండర్ల ప్రకియ్ర ప్రారంభిస్తారు.
Link to comment
Share on other sites

900 ఎకరాల్లో.. పరిపాలనా నగరం

రెండు నెలల్లో నిర్మాణ పనులు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

15 రోజుల్లో మార్పులతో తుది ఆకృతులు సిద్ధం చేయనున్న నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ

10 అంతస్తులతో అసెంబ్లీ భవనం

పరిపాలనా నగరం మధ్యలో ఎత్తైన టవర్‌

ఒక పక్క అంబేడ్కర్‌... మరోపక్క ఎన్టీఆర్‌ విగ్రహాలు

ప్రణాళిక దాదాపుగా ఖరారు

ఈనాడు - అమరావతి

22ap-main1a.jpg

రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో శాసనసభ, సచివాలయం సహా అన్ని భవనాల నిర్మాణ పనులు, న్యాయ నగరంలో హైకోర్టు సహా ఇతర భవనాల నిర్మాణ పనులు రెండు నెలల్లో మొదలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి తగ్గట్టుగా పరిపాలనా నగర ప్రణాళిక, ఆకృతులు సిద్ధం చేయాలని సూచించారు. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ పరిపాలనా నగర ప్రణాళిక, శాసనసభ, హైకోర్టు భవనాలకు సంబంధించి రెండేసి ఆకృతులను అందజేసింది. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. వారు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా తాము రూపొందించిన ప్రణాళిక, ఆకృతులను ప్రదర్శించారు. 900 ఎకరాల్లో పరిపాలనా నగరం, దానికి కొనసాగింపుగా మరో 468 ఎకరాల్లో న్యాయ నగరం... మొత్తం కలిపి 1368 ఎకరాలకు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన ప్రణాళికకు సీఎం కొన్ని మార్పులు చేసి ఆమోదం తెలిపారు. దీనివల్ల ప్రణాళిక దాదాపు కొలిక్కివచ్చినట్లే. పరిపాలనా నగర ప్రణాళికతో పాటు, హైకోర్టు, శాసనసభ భవనాల తుది ఆకృతులను మరో రెండు వారాల్లో నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రభుత్వానికి అందజేయనుంది. శాసనసభ భవనానికి సంబంధించి ఈసంస్థ గతంలో ఇచ్చిన ఆకృతిని కొంత మెరుగుపరచడంతోపాటు, మరో ఆకృతిని సిద్ధం చేసింది. వాటిలో ఇప్పుడు తెచ్చిన రెండో ఆకృతివైపు సీఎం మొగ్గు చూపారు. హైకోర్టుకి సంబంధించి రెండు ఆకృతులు తీసుకురాగా, అవి అంత ఆకర్షణీయంగా లేవని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆ ఆకృతులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులకు చూపించి వారి అభిప్రాయం తీసుకోవాలని తెలిపారు.

100 అడుగుల శాసనసభ భవనం..!

నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఇది వరకు నాలుగు గోళాకారపు భవనాలు, దానిపై 540 అడుగుల ఎత్తైన టవర్‌తో శాసనసభ భవన ఆకృతిని రూపొందించింది. ఇప్పుడు 100 అడుగుల ఎత్తుతో, 10 అంతస్తులతో మరో ఆకృతిని రూపొందించింది. ఈ రెండో ఆకృతి వైపు ముఖ్యమంత్రి మొగ్గు చూపారు. దానికి మరింత మెరుగులు దిద్దాలని సూచించారు. శాసనసభ, శాసనమండలి భవనానికి మధ్యలో సెంట్రల్‌ హాల్‌ ఉండాలన్నారు. శాసనసభ భవనం పైన టవర్‌ ఉండటం భద్రతా పరంగా సరైనది కాదని, టవర్‌ను విడిగా ఏర్పాటు చేయాలని సూచించారు. పరిపాలనా నగరం పొడవు 4 కిలోమీటర్లు. అటు రెండు, ఇటు రెండు కిలోమీటర్లు ఉండేలా... పరిపాలనా నగరం మధ్యలో 560 నుంచి 600 అడుగుల ఎత్తైన టవర్‌ను ఏర్పాటు చేస్తారు. సందర్శకులు ఈ టవర్‌పైకి ఎక్కితే నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. అష్కాబాద్‌, అస్థానా... ఇలా వివిధ నగరాల్లో టవర్లు విడిగానే ఉన్నాయని, అమరావతిలో కూడా విడిగానే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

22ap-main1b.jpg

రాజధానిలో ఐనవోలు వద్ద 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఇది పరిపాలనా నగరం మధ్యలో ఏర్పాటు చేసే టవర్‌కి అభిముఖంగా దక్షిణ దిశలో ఏడు కి.మీ. దూరంలో ఉంటుంది. టవర్‌కి అభిముఖంగానే ఉత్తరం పక్కన పరిపాలనా నగరంలో, కృష్ణా నది ఒడ్డున ఎత్తైన ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తారు. ఈ విగ్రహం ఎత్తు నిర్ణయించాల్సి ఉంది. రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాసాలు నదికి సమీపంలోనే ఉంటాయి. వీటికి ఒక పక్కన ట్విన్‌ టవర్స్‌ వస్తాయి. సచివాలయం, హెచ్‌ఓడీల కార్యాలయాలు పక్క పక్కనే ఉండాలని, వాటికి అభిముఖంగా నివాస సముదాయాలు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పరిపాలనా నగరం పూర్తిగా ప్రభుత్వ సొత్తని, ప్రైవేటు ఆస్తులకు ఎక్కడా చోటు లేదని స్పష్టం చేశారు. అన్ని రకాల సాంస్కృతిక ప్రదర్శనలకు వీలుగా అత్యంత అద్భుతంగా ఒక భవనాన్ని, ప్రస్తుతం నిర్ణయించిన కన్వెన్షన్‌ సెంటర్‌కు సమీపంలోనే నిర్మించాలని తెలిపారు. నగరానికి రెండు పక్కలా అతి పెద్ద పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. బీఆర్టీ, ఎమ్మార్టీ, ఈ బస్‌వేల గురించి ముఖ్యమంత్రికి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఒక పక్క పరిపాలనా భవంతులు, మరోవైపు సాధారణ ప్రజానీకం సందర్శించేలా కన్వెన్షన్‌ సెంటర్‌, సాంస్కృతిక భవనం, ఎగ్జిబిషన్‌సెంటర్‌, వాణిజ్యకూడలి, పార్కులు ఉండాలని సూచించారు. పరిపాలనా నగరంలో నిరంతరం నీటి ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోవాలని, జస్టిస్‌ సిటీకి పక్కనే మరో నగరానికి చోటు కల్పించాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులకు, న్యాయమూర్తులకు నివాస సముదాయంపైనా చర్చ జరిగింది.

22ap-main1c.jpg

* 900 ఎకరాల పరిపాలనా నగరాన్ని నాలుగు బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకు ఒక కి.మీ. పొడవు, కిలో మీటరు వెడల్పు ఉంటుంది. దక్షిణం పక్కన ఉన్న మొదటి బ్లాకు మధ్య నుంచి పాలవాగు వెళుతుంది. ఈ బ్లాకులో దక్షిణం పక్కన మధ్యలో శాసనసభ భవనం వస్తుంది. ఎదురుగా పెరేడ్‌ గ్రౌండ్‌ ఉంటుంది. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు, ఎమ్మెల్యేల నివాస భవనాలు రెండో బ్లాకులో వస్తాయి. అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్‌ అధికారుల నివాసాలు కూడా ఇక్కడే ఉంటాయి. దీని మధ్యలో అర్బన్‌ పార్కు ఉంటుంది. మూడో బ్లాక్‌లో సెంట్రల్‌ పార్కు వంటివి ఉంటాయి. నాలుగో బ్లాకులో రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాసాలతో పాటు స్పోర్ట్స్‌ అరెనా, కన్వెన్షన్‌ సెంటర్‌ వంటివి వస్తాయి. పరిపాలనా నగరానికి కొనసాగింపుగా దక్షిణం వైపు న్యాయ నగరం ఉంటుంది. దీన్ని రెండు బ్లాకులుగా డిజైన్‌ చేశారు. దీనిలో మొదటి బ్లాకులో హైకోర్టు భవనం, న్యాయమూర్తుల నివాసాలు, ట్రైబ్యునల్‌ భవనాలు ఉంటాయి. రెండో బ్లాకులో వాణిజ్య, నివాస సముదాయాలుంటాయి.

22ap-main1d.jpg ప్రత్యేకంగా నమూనాలు..!

పరిపాలనా నగర నమూనాల్ని ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఎగ్జిబిట్స్‌ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. పరిపాలన, న్యాయ నగరానికి సంబంధించి ప్రణాళికను 20 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న బ్లాకుల రూపంలో సిద్ధం చేశారు. వాటిని మొదట సచివాలయంలో ఉంచారు. అక్కడ రాజధాని ఆకృతులపై ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ పరిశీలించింది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో మొదట కార్యదర్శులు, సీఆర్‌డీఏ అధికారులు సమావేశమై చర్చించారు. అనంతరం ఈ బ్లాకులను ట్రాలీ ఆటోలో ముఖ్యమంత్రి నివాసానికి తరలించారు. వాటిని నివాస భవనం వెలుపల అమర్చారు. వాటిలో నివాస, వాణిజ్య, బహుళ ప్రయోజన భవనాలు ఇలా ఒక్కో విభాగానికి ఒక రంగు విద్యుత్‌ దీపాలను వినియోగించారు. ఒక దాని తర్వాత ఒకటిగా ఆయా రంగుల విద్యుత్‌ దీపాలను వెలిగిస్తూ వాటి గురించి వివరించారు.

Link to comment
Share on other sites

మనసు దోచేలా.. మన నగరం!

నార్మన్‌ ఫోస్టర్‌ ఆకృతులపై ఒక నిర్ణయం

నీలి, హరిత నగరంగా ప్రణాళికలు

ఈనాడు, అమరావతి

kri-top2a.jpg

సుందరమైన భవనాలు... సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్మాణాలు... సెలయేర్లు.. కాలువలు.. జలరవాణా.. సైకిల్‌ ట్రాక్‌లు.. వాకింగ్‌ట్రాక్‌లు.. చోదకుడు లేని వాహనాలు, కాలుష్య రహిత బ్యాటరీ వాహనాలు.. ఒకటేమిటి ఇలా ఎన్నో విశేషాలు.. రాజధాని అమరావతి పరిపాలన నగరం సొంతం కాబోతున్నాయి. ప్రపంచంలోనే అమరావతి నగరాన్ని మేటిగా నిర్మాణం చేయనున్నారు. దానిలో పరిపాలన నగరం అమరావతికే తలమానికంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం నిర్మాణంలో భాగంగా పరిపాలన నగరం ఆకృతుల రూపకల్పన దాదాపు కొలిక్కి వచ్చింది. సోమవారంనాడు లండన్‌కు చెందిన నార్మన్‌ఫోస్టర్స్‌ సంస్థ రూపొందించిన ఆకృతులను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. అయితే కొన్ని విషయాల్లో మార్పులు చేర్పులు సూచించినట్లు తెలిసింది. మరో రెండు వారాల్లో పూర్తి స్థాయి ఆకృతులను రూపొందించి ఖరారు చేయనున్నారు. అమరావతి పరిపాలన నగరం ఆకృతులపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొన్ని మార్పులతో ఒక నిర్ణయానికి వచ్చారు.

అమరావతికే తలమానికం..!

పరిపాలన నగరంలో ప్రభుత్వ భనాలను సుందరంగానే కాకుండా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేయనున్నారు. నార్మన్‌ఫోస్టర్స్‌ సంస్థ అందించిన ప్రణాళిక ప్రకారం నీలి, హరిత నగరంగా రూపొందించనున్నారు. అమరావతి నగరంలో పరిపాలన నగరం కృష్ణానది తీరంలో నిర్మాణం చేయనున్నారు. దీనికి గాను ఒక పాయ కృష్ణానది నుంచి పరిపాలన నగరానికి వచ్చే విధంగా రూపకల్పన చేశారు. ఈ పరిపాలన నగరంలో శాసనసభ, మండలి, సచివాలయం, ముఖ్యమంత్రి, గవర్నర్‌ నివాసాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, హైకోర్టు, ఐఏఎస్‌ల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాలు తదితర భవనాలను నిర్మించనున్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ గతంలో రూపొందించిన ఆకృతులపై విస్తృతంగా చర్చ జరిగింది. ఆ ఆకృతులను అంతర్జాలంలో అప్‌లోడ్‌ చేసి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రజల రాజధానిగా అమరావతి నిర్మాణం చేయాలనే ఉద్ధేశ్యంతో నార్మన్‌ ఫోస్టర్‌ ఆకృతులను అంతర్జాలంలో ఉంచారు. ఫేస్‌బుక్‌, ఇతర ఖాతాల ద్వారా అభిప్రాయాలను తెలిపే విధంగా సీఆర్‌డీఏ ఏర్పాట్లు చేసింది. ఈ ఆకృతులపై దేశంలోని ఉన్నత కళాశాలలకు, ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులతో కార్యశాల నిర్వహించారు. ప్రముఖులతో దేశంలోని ప్రముఖ కళాశాలలతో సీఆర్‌డీఏ కార్యాలయంలో కార్యశాలలు నిర్వహించారు. దీనికి పలువురు సూచనలు చేశారు. ఆకృతులు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింభించేలా ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. కాలుష్య రహితంగా ఉండాలని, పచ్చదనం ఎక్కువగా ఉండాలని, బ్యాటరీ వాహనాలను వాడాలని రవాణావ్యవస్థ ఏకీకృతంగా ఉండాలని సూచనలు వచ్చాయి. ప్రజాప్రతినిధులకు వీటిని ప్రదర్శించారు. వారు కొన్ని సూచలను చేశారు. వీటిన్నంటిని క్రోఢీకరించి మళ్లీ కొన్ని మార్పులు చేశారు. వీటికి మరికొన్ని మార్పులను సీఎం సూచించినట్లు తెలిసింది. మరో రెండు వారాల్లో పూర్తి స్థాయి ఆకృతులు నిర్ణయించి నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏ కార్యాలం ఎక్కడ ఉండాలి..? ఏభవం ఎక్కడ ఉండాలనే అంశాలను సీఎం సూచించినట్లు తెలిసింది. కన్వెన్షన్‌ సెంటర్‌లు, పార్కులు, భారీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అంబేద్కర్‌ స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నందున మరో వైపు ఎన్టీఆర్‌ మ్యూజియం, భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని తలపెట్టారు.

శరవేగంగా నిర్మాణాలు..!

రికార్డు స్థాయిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాజధానిలో రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఏడు ప్రధాన రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. మరో 11 రహదారులకు టెండర్లను పిలిచారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి భూసేకరణ ప్రారంభం అయింది. వీటితో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సింగపూర్‌ కన్సార్షియంతో 916 ఎకరాల్లో నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నార్మన్‌ఫోస్టర్‌ ఆకృతులు దాదాపు ఖరారైనట్లే నని అధికారులు భావిస్తున్నారు. దీంతో వీటిని నిర్మాణం ప్రారంభించేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. ప్రజల రాజధాని అమరావతి నగరం అత్యంత సుందర నగరంగా, నీలి, హరిత నగరంగా ప్రపంచంలోని అగ్రగామి నగరాల్లో ఒకటిగా వెలుగొందనుంది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...