Jump to content

Amaravati


Recommended Posts

6 hours ago, sonykongara said:

 

soooo happy that XLRI finally landed in Amaravati.

some bishop was telling that over the years they tried establishing this in Hyd but govts there didn't co-operate but CBN gave all the co-operation.. Hyd loss is our gain.... Hope we will see many more top institutes and companies in Amaravati in the future.

 

Link to comment
Share on other sites

విజ్ఞానానికి రాష్ట్రం చిరునామా 

 

ఉద్యోగాల సృష్టిలో ఏపీ ముందంజ 
నైపుణ్యాభివృద్ధిలోనూ రాష్ట్రానిదే అగ్రస్థానం 
ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు

17ap-main7a_3.jpg

ఈనాడు డిజిటల్‌, గుంటూరు: ‘దేశంలో మేటి విద్యాసంస్థలు అమరావతిలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఎక్కువ ఉద్యోగాలు సృష్టించిన రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉంది. నైపుణ్యాభివృద్ధిలో మనమే ప్రథమస్థానంలో ఉన్నాం. భవిష్యత్తులో అమరావతి విజ్ఞానానికి కేంద్రమవుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ‘ఆలోచన, అంచనా, ఊహాశక్తితోనే ప్రస్తుతం దిగ్గజ సంస్థలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఇలాంటి ఆలోచనలతోనే ప్రతి ఒక్కరూ ముందుకుసాగాలి. దేశం, రాష్ట్రాలు ఉజ్వల భవిష్యత్తు సాధించాలంటే విద్యపై దృష్టి పెట్టాలి. అన్ని రంగాలకు సమప్రాధాన్యం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలులో జేవియర్‌ స్కూల్‌ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) 50 ఎకరాల్లో నిర్మిస్తున్న క్యాంపస్‌కు ముఖ్యమంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీకి ప్రాధాన్యమిచ్చాం. 20 ఇంజనీరింగ్‌ కళాశాలలను 250కి పెంచాం. సైబరాబాద్‌ సిటీని ఏర్పాటుచేశాం. వాటిని సమర్థంగా వినియోగించుకున్న వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులుగా సేవలందిస్తున్నారు. ఇదే విధంగా అమరావతి సైతం వృద్ధి చెందుతుంది’ అని పేర్కొన్నారు. ‘1949లో ప్రారంభమైన ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ దేశంలో మేటి విద్యాసంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అమరావతిలో ఏర్పాటుచేసిన ఈక్యాంపస్‌ భవిష్యత్తులో మేనేజ్‌మెంట్‌ విభాగంలో ప్రపంచశ్రేణి ప్రమాణాలను అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో పార్ట్‌టైం కోర్సులు ప్రారంభించి ఎనిమిది నెలల్లో పూర్తిస్థాయి క్యాంపస్‌ను అందుబాటులోకి తేవాలని యాజమాన్యానికి సూచించారు. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ ఆధ్వర్యంలో నడుస్తున్న లయోలా స్కూల్‌ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు ఎనిమిదెకరాలు కేటాయించేందుకు హామీనిచ్చారు.

ఇంటింటికీ ఏసీ సరఫరా చేస్తాం... 
‘రాజధానిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గద్దల్లా కేంద్రం, తెలంగాణ మనపై పడుతున్నాయి. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతిని మేటి రాజధానిగా తీర్చిదిద్దుతాం’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న 11 విద్యాసంస్థల నిర్మాణంలోనూ కేంద్రం చిన్నచూపు చూస్తోందని వివరించారు. 2,912 ఎకరాల భూములిచ్చి, రూ.132కోట్లతో ప్రహరీలు నిర్మించినా పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. డిస్ట్రిక్ట్‌ పూలింగ్‌ సాంకేతికతను వినియోగించి అవసరమైన ఏసీ యంత్రాలను ఏర్పాటుచేసి రాజధానిలోని ఇళ్లకు గ్యాస్‌, విద్యుత్తు మాదిరి ఏసీని సరఫరా చేసేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నామన్నారు. గతంలో రాష్ట్రంలో తమ సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు ఫోటాన్‌, వోక్స్‌వ్యాగన్‌ సంస్థలు ముందుకొచ్చినా కాంగ్రెస్‌ హయాంలో వారంతా కొన్ని కారణాలతో వెనక్కి వెళ్లిపోయారని గుర్తుచేశారు. త్వరలో అనంతపురంలో తయారుచేస్తున్న కియా సంస్థ తొలి కారు బయటకు వస్తుందని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, గుంటూరు బిషప్‌ ఫాదర్‌ బీ చిన్నబత్తిని డీడీ, విజయవాడ బిషప్‌ ఫాదర్‌ టీ జోసెఫ్‌ రాజారావు, ఆంధ్ర జోసూట్‌ ప్రావిన్స్‌, ప్రావిన్షియల్‌ ఫాదర్‌ పీఎస్‌ అమల్‌రాజ్‌, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జంషెడ్‌పూర్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ ఈ.అబ్రహం, సీఆర్‌డీఏ కమిషనరు శ్రీధర్‌, కలెక్టర్‌ కోన శశిధర్‌ పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

అమరావతికి మరో మణిహారం
 

ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈనాడు డిజిటల్‌, గుంటూరు

amr-gen1a_59.jpg

అమరావతిని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలులోని జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) క్యాంపస్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని గురువారం శంకుస్థాపన చేశారు. గుంటూరు బిషప్‌ ఫాదర్‌ బీ చిన్నబత్తిని డీడీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతిప్రకాశనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రజోసూట్‌ ప్రావిన్స్‌, ప్రావిన్షియల్‌ ఫాదర్‌ పీఎస్‌ అమల్‌రాజ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎక్స్‌ఎల్‌ఆర్‌ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలు కోరినా..అందుకు అనుగుణంగా ఏర్పాటుకు సహకరించలేదని, అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలా సహకరించారాని కొనియాడారు. రాబోయే రెండేళ్లలో పూర్తిస్థాయిలో కోర్సులు మొదలుపెడతామని, ఈ ఏడాది జూన్‌లో పార్ట్‌టైమ్‌ కోర్సులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జంషెడ్‌పూర్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ ఈ.అబ్రహం మాట్లాడుతూ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలో విలువ ఆధారిత మేనేజ్‌మెంట్‌ విద్యను అందిస్తున్నామని, మార్పునకు నాంది పలికే వ్యాపార నాయకులను తీర్చిదిద్దుతున్నామన్నారు. అంతర్జాతీయ వ్యాపార నాయకులను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అమరావతిలో నూతన క్యాంపస్‌ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ బిషప్‌ ఫాదర్‌ టీ జోసెఫ్‌ రాజారావు మాట్లాడుతూ ఇక్కడ బోధించబోయే ప్రతిపాదిత కోర్సుల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌తోపాటు, ఇతర ప్రోగ్రామ్స్‌ ఉంటాయన్నారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, తాడికొండ శాసనసభ్యుడు శ్రావణ్‌ కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ జానీమూన్‌, నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఫిలిప్‌ సీ థోచర్‌,  సీఆర్‌డీఏ కమిషనరు శ్రీధర్‌, గుంటూరు జిల్లా కలెక్టర్‌ శశిధర్‌, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

హైకోర్టుకు మూడు ధర్మాసనాల ఏర్పాటు
18-01-2019 03:14:07
 
అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): పాలనాపరమైన సౌలభ్యం కోసం ఏపీ హైకోర్టుకు మూడు ధర్మాసనాలు ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 21నుంచి ఇవి అమలులోకి వస్తాయి. తాత్కాలిక సీజే, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో ప్రథమ ధర్మాసనం ఏర్పాటైంది. ఇది పిల్‌, క్రిమినల్‌ కేసులు, హెబియస్‌ కార్పస్‌ వ్యవహారాలు, సుమోటో కేసులు, అన్ని రిట్‌ పిటిషన్లు తదితరాలను విచారిస్తుంది. అలాగే జస్టిస్‌ ఎస్‌వీ భట్‌, జస్టిస్‌ ఎన్‌.గంగారావుతో ఏర్పాటైన ద్వితీయ ధర్మాసనం... ఐటీ ట్రైబ్యునల్‌ అప్పీళ్లు, సెంట్రల్‌ ఎక్సైజ్‌, ఇన్‌కం ట్యాక్స్‌ కేసులు తదితరాలను విచారిస్తుంది. ఇక భూఆక్రమణలు, కుటుంబ వ్యవహారాలను జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారించనుంది. మిగిలిన ఏడుగురు న్యాయమూర్తులు వేర్వేరుగా(సింగిల్‌ జడ్జిలు)గా కేసుల విచారణ జరుపనున్నారు.
Link to comment
Share on other sites

సీఆర్డీఏ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలు
18-01-2019 20:49:28
 
636834414211243951.jpg
అమరావతి: సీఎం చంద్రబాబుతో సీఆర్డీఏ అధికారుల సమావేశమయ్యారు. సీఆర్డీఏ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. హ్యాపీ నెస్ట్ సిరీస్ రెండో ప్రాజెక్ట్ కింద 1,704 ఫ్లాట్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. వెంకటపాలెం సమీపంలో రూ.448 కోట్లతో ఐటీ పార్కు, తాత్కాలిక హైకోర్టుకు అనుబంధంగా అడ్వకేట్ బ్లాక్ నిర్మించాలని నిర్ణయించారు. అలాగే రాజధానిలో 150 ఎకరాల్లో కన్‌స్ట్రక్షన్ సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అమరావతిలో ఏడు హోటళ్ల ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...