Jump to content

Amaravati

Recommended Posts

ఐటీకి చిరునామా ఏపీ 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

11business13a.jpg

ఈనాడు డిజిటల్‌, గుంటూరు: దేశంలో సాంకేతికత రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా మారింది. భవిష్యత్తులో సంపద ఎంత ఉందనేది ముఖ్యం కాదు డేటా ఎంత ఉందన్నదే కొలమానంగా నిలుస్తుంది. ఆ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని సాహితీ కన్‌స్ట్రక్షన్స్‌లో నిర్మిస్తున్న వాగ్దేవి టెక్నో పార్కు, హిత క్యాపిటల్‌కు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  సాంకేతికతను వినియోగిస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామని, అంతేకాకుండా ప్రతి పనిలో కచ్చితత్వం, జవాబుదారీతనం, అవినీతి రహిత పాలన అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. గత రెండేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలో ప్రథమస్థానంలో నిలుస్తున్నామని, భవిష్యత్తులో ప్రపంచంలోని ఐదు దేశాలలో ఒక్కటిగా నిలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న డేటావేర్‌ హౌసింగ్‌ ద్వారా విద్య, వైద్య రంగాల్లోని డేటాను వినియోగించుకోవడం ద్వారా వచ్చే ఫలాలు దేశం మొత్తం ఉపయోపడతాయని అన్నారు. హైదరాబాద్‌కు బాహ్యవలయ రహదారి నిర్మించడానికి చొరవ చూపబట్టే త్వరితగతిన ఆ ప్రాంతం అంతా అభివృధ్ధి చెందిందని తెలిపారు.  కార్యక్రమంలో సినీనటులు జగపతిబాబు, రమ్యకృష్ణ, సాహితీ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Andhra CM N Chandrababu Naidu to lay foundation for Iconic Bridge today

The 3.2 km bridge, which will be built at a cost of Rs 1387 crore, is expected to be constructed in two years.

Published: 12th January 2019 09:00 AM  |   Last Updated: 12th January 2019 09:00 AM   |  A+A-

Krishna bridge

The conceptual design of Iconic Bridge to be constructed across Krishna river as part of development of capital Amaravati

By Express News Service

VIJAYAWADA: After planning the tallest Assembly complex and Secretariat in Amaravati, the State government will now build an Iconic Bridge with the tallest pylon in India. Chief Minister N Chandrababu Naidu will lay the foundation for the bridge at 10 am on Saturday.

The six-lane bridge, which will be constructed by L&T Constructions, will have a 170-metre-tall pylon. According to information, the Signature Bridge in New Delhi inaugurated a few months ago, currently has the tallest pylon at 154 meters. While the length of the bridge, which will be built from Pavitra Sangamam at Ibrahimpatnam to N 10 road near Uddandarayunipalem in Amaravati, is 3.2 km, the cable-stayed (iconic) portion will be 480 metres.

The officials from Amaravati Development Corporation Ltd (ADCL) said the bridge will take two years to be completed. “Once it is ready, the bridge will shorten the distance between the Hyderabad highway and Amaravati by 40 km, thus saving two hours of time. It will reduce the burden of vehicles on Vijayawada,” they said. The bridge is likely to cost Rs 1,387 crore.

The piles for the foundation will be laid at 40-metre to 50-metre depth. The bridge will have a right of way of 35 meters, with a 2.5-m-wide footpath on either side. The bridge’s design was finalised after considering the vertical clearances.

Link to comment
Share on other sites

ఇబ్రహీంపట్నంలోనూ ల్యాండ్ పూలింగ్: చంద్రబాబు
12-01-2019 13:50:24
 
636828978249103323.jpg
విజయవాడ: కృష్ణా జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతి రైతులు సహకరించినట్లు సహకరిస్తే ఇబ్రహీంపట్నంలోనూ ల్యాండ్‌పూలింగ్‌కు సిద్ధమన్నారు. అమరావతి రైతులను స్ఫూర్తిగా తీసుకోడానికి సిద్ధమేనా అని ప్రశ్నిస్తే రైతుల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వచ్చింది. ఇబ్రహీపట్నం ప్రాంతంలో అద్భుతమైన నగరాన్ని నిర్మించుకుందామన్నారు. రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఉన్నామని తెలిపారు. కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన చేశాక చంద్రబాబు మాట్లాడారు.
Link to comment
Share on other sites

రాజధాని అమరావతి పరిధిలో మరో రెండు కీలక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేశారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని రాజధానితో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెన, నీటిశుద్ధి ప్లాంట్‌కు ఆయన భూమిపూజ చేశారు.

DwstYVFUYAAoLIg.jpg
DwstYYlUwAAL5fU.jpg
DwstYYiVAAAM1_t.jpg
DwstYYkUUAAZ-Hw.jpg
Link to comment
Share on other sites

AndhraPradeshCM: రాజధాని అమరావతి పరిధిలో మరో రెండు కీలక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేశారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని రాజధానితో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెన, నీటిశుద్ధి ప్లాంట్‌కు ఆయన భూమిపూజ చేశారు. …

Link to comment
Share on other sites

Andhra Pradesh CMVerified account @AndhraPradeshCM 1m1 minute ago

CM @ncbn laid the foundation for Iconic Bridge on Krishna river today. The six-lane wide bridge will be 3.2 Km long and will be constructed at a cost of Rs. 1,387 Cr. The bridge will shorten the distance between Hyderabad-Jagadalpur National Highways to Amaravati by 40 Km.

DwsuSK9VYAAIh-v.jpg
DwsuSHWVsAEGUuW.jpg
DwsuSLDU0AAu1Un.jpg
DwsuTebU8AEypWX.jpg
Link to comment
Share on other sites

Bridge Advantages -Reduces 40 to 6 KM Dist & 2 Hrs to 10 Mins time b/w IBM & Secretariat -Amaravati Directly Connects 2 NH-65 & NH-221 Junction at IBM -Direct Connectivity b/w AP Capital 2 Telangana & Chhattisgarh Capital's -Hopefully no more Boat Capsize? -Reduces burden on BZA

DwtogKVUYAAwlJ_.jpg
Link to comment
Share on other sites

18 నెలల్లో ఐకానిక్‌ వంతెన

ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా నిర్మిస్తాం 
ప్రజలు సహకరిస్తే విజయవాడ వైపూ అభివృద్ధి 
వంతెన, తాగునీటి శుద్ధిప్లాంటు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు 
ఈనాడు డిజిటల్‌, విజయవాడ

12ap-main3a_2.jpg

‘కృష్ణానదికి రెండువైపులా అభివృద్ధి చేసుకునేందుకు అపారమైన అవకాశాలున్నాయి. ఈ రోజు కొంతమంది రైతులు అడుగుతున్నారు. మీరంతా గుంటూరు జిల్లా వైపే అభివృద్ధి చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో కూడా చేస్తే బాగుంటుందని. దానికి నేను సిద్ధమే. మీరు కూడా రాజధాని ప్రాంత రైతుల్లాగా ముందుకు వచ్చి సహకరించాల్సి ఉంది. దానికి మీరు సిద్ధమైతే చెప్పండి. వెంటనే వచ్చేస్తాం. అందరూ కూర్చొని మాట్లాడుకొని చెప్పండి. మీకు అన్యాయం జరగదు. అమరావతిలాగానే ఇటువైపు సమాంతరంగా నగరాన్ని నిర్మిద్దాం.’

- ముఖ్యమంత్రి చంద్రబాబు

‘సమర్థ నాయకత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. దీనికి మన నాయకుడు దివంగత నందమూరి తారకరామారావు నిదర్శనం. అవినీతికి పాల్పడటం ఇష్టంలేక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని అనుకున్న లక్ష్యాలను సాధించుకున్నారు. నేను కూడా మీకు అండగా ఉంటాను. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి రెండు కీలకమైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. తొలుత రూ.1387 కోట్లతో నిర్మిస్తున్న ఐకానిక్‌ వంతెనకు, రూ.745.65 కోట్లతో రాజధాని తాగునీటి అవసరాలకు నిర్మించే నీటిశుద్ధి ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కృష్ణా నది అమరావతికి ఒక వరం. ఈ నది లేకపోతే ఇంత సుందరమైన నగరాన్ని నిర్మించే అవకాశం ఉండేది కాదు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఆలోచన మాత్రమే ఉంది. దీనికి రాజధాని ప్రాంత రైతులు ముందుకు వచ్చి భూములు ఇవ్వడంతో అమరావతి నగర రూపకల్పన జరిగింది. కేంద్రం డబ్బులు ఇవ్వనప్పటికీ రాష్ట్రంలో సంపద సృష్టించేందుకు చర్యలన్నీ తీసుకుంటున్నాం.’ అని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని, బ్రహ్మాండమైన మసీదు, చర్చిని నిర్మిస్తామన్నారు.

12ap-main3b_1.jpg

దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకే.. 
రాజధానిలో నిర్మాణాలు జరగడం లేదంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. అందుకే రాజధానిలో జరుగుతున్న పనులను ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాజధానిలో రూ.40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ముందుకెళ్తున్నాయని వివరించారు. అందులో ఈ ఐకానిక్‌ బ్రిడ్జ్‌ ఒకటన్నారు. కేవలం వంతెనలా కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతోపాటు, మన వారసత్వ సంపదైన కూచిపూడి భంగిమను ప్రతిబింబించేలా నిర్మించాలనుకున్నామని తెలిపారు. అందుకే ఈ వంతెనకు కూచిపూడి ఐకానిక్‌ బ్రిడ్జ్‌గా నామకరణం చేస్తున్నానని తెలిపారు. 18 నెలల్లో వంతెన పూర్తి చేయాలని ఆదేశించినట్లు సీఎం వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కిడారి శ్రావణ్‌, నారాయణ, ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

తస్మాత్‌ జాగ్రత్త..!?
13-01-2019 03:30:19
 
636829470204193762.jpg
  • శాంతిని కబలించే శక్తులున్నాయ్‌.. వాటి ఉచ్చులో పడకండి
  • గిట్టనివారు అసూయ పడేలా రాష్ట్రాభివృద్థి తథ్యం: సీఎం
  • ఐకానిక్‌ బ్రిడ్జ్‌, నీటి శుద్ధి ప్లాంట్‌కు శంకుస్థాపన
  • వంతెనకు కూచిపూడి సొబగు
అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రశాంతతకు మారుపేరైన కృష్ణాజిల్లాలో అవాస్తవాలు ప్రచారం చేస్తూ అశాంతిని రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటి ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సమాజంలోని వివిధ వర్గాల సంక్షేమం కోసం భారీగా పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని అన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు మరెక్కడైనా ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ‘మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణలో కూడా అమలవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పలు పథకాలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం, నదుల అనుసంధానం జరుగుతోంది. పింఛన్లు ఎన్నో రెట్లు పెంచాం’ అని సీఎం చెప్పారు. రాజధానిలోని ఉద్ధండరాయునిపాలెం, కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ప్రదేశాన్ని కలుపుతూ నిర్మించే ఐకానిక్‌ వంతెనకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శంకుస్థాపన చేశారు. అమరావతి వాసులకు సురక్షితమైన మంచినీటిని అందించేందుకు నీటిశుద్ధి కేంద్రం నిర్మాణానికి కూడా ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. భవిష్యత్‌లో ఇలాంటి ఐకానిక్‌ వంతెనలు మరో 3, ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌రోడ్లు ఈ రెండు జిల్లాలను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తాయన్నారు. ఆ వివరాలు...
 
ప్రగతిపథంలో కృష్ణా
‘కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి వేదికగా మారిన పవిత్ర సంగమ ప్రదేశంలోనే ఐకానిక్‌ వంతెనకు శంకుస్థాపన చేయడం ద్వారా మరో చరిత్రకు శ్రీకారం చుట్టాం. కృష్ణా-గుంటూరు జిల్లాలను మరింత దగ్గర చేయడమే కాకుండా రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రదేశాలను అమరావతికి చేరువ చేయనున్న ఈ భారీ సేతువు చరిత్రాత్మకమైనది. అమరావతి ఆవిర్భావానంతరం గుంటూరు జిల్లాలోనే అత్యధిక అభివృద్ధి జరుగుతోందన్న అభిప్రాయం ఉంది. ఈ వంతెన ఆ లోటును తొలగించి కృష్ణా జిల్లా కూడా ప్రగతి పథంలో పరుగులు తీసేలా చేయనుంది.’
 
తాజ్‌ మహల్‌లా అసెంబ్లీ భవనం: ‘అమరావతిలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనం దేశంలో తాజ్‌మహల్‌ తర్వాత అంతటి అద్భుత కట్టంగా నిలవనుంది. స్థూపాకారంలో నిర్మిస్తున్న హైకోర్టు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సచివాలయం టవర్లు, ఈ ఐకానిక్‌ వంతెన చరిత్రలో నిలిచిపోతాయి. ఇంకా పలు ఐకానిక్‌ వంతెనలు, నిర్మాణాలతో ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటిగా నిలిచే అమరావతిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ సందర్శకులు రావడం ఖాయం. కూచిపూడి నృత్యం కృష్ణా జిల్లాలోనే పుట్టినందున, ఐకానిక్‌ వంతెనకు ‘కూచిపూడి ఐకానిక్‌ వంతెన’గా పేరు పెడుతున్నాం. గతంలో హైదరాబాద్‌లోని సైబర్‌ టవర్‌ను 14 నెలల్లోనే కట్టాం. అప్పటితో పోల్చితే ఎంతో అధునాతనమైన టెక్నాలజీ నేడు అందుబాటులో ఉంది. కాబట్టి ఐకానిక్‌ వంతెనను 15 నెలల్లో, నీటి శుద్ధి ప్లాంట్‌ను 12 నెలల్లోనే పూర్తి చేయాలి’ అని కాంట్రాక్ట్‌ కంపెనీలకు సూచించారు.
 
విమర్శకులు అసూయపడేలా 
‘అమరావతి నిర్మాణానికి సంకల్పించినప్పుడు అవసరమైన నిధులు, భూములు ప్రభుత్వం వద్ద లేవు. నేను ఒక్క పిలుపివ్వగానే రైతులు 34 వేల ఎకరాలకుపైగా భూమిని ల్యాండ్‌పూలింగ్‌లో ఇచ్చారు. అదే స్ఫూర్తితో ముందుకు కదులుతూ ప్రస్తుతం రూ.40 వేల కోట్ల విలువైన పనులు రాజధానిలో చురుగ్గా జరుగుతున్నాయి. తక్కువ కాలంలోనే విమర్శకులు అసూయ పడేలా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందడం తథ్యం. గుంటూరు, అమరావతి, విజయవాడ, ఇబ్రహీంపట్నం, గన్నవరం.. అన్నీ కలసిపోయి ఒక అత్యద్భుతమైన మహా నగరంగా రూపొందుతుంది’ అని సీఎం అన్నారు.
 
వెంకన్న, కూచిపూడి మన భాగ్యం..!
‘కూచిపూడి నృత్యంతోపాటు ప్రపంచంలోని హిందువులందరూ కొలిచే శ్రీ వేంకటేశ్వరస్వామి మన రాష్ట్రంలోనే ఉండటం మనందరి అదృష్టం. కూచిపూడి గ్రామాన్ని ఇప్పటికే అభివృద్ధి పరచాము. మన వారసత్వ సంపదైన ఈ నృత్యాన్ని కులమతాలకు అతీతంగా అందరూ సాధన చేయాలి. అమరావతిలో శ్రీ వేంకటేశ్వరుడికి అద్భుతమైన కోవెలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తోంది. ఇదే తరహాలో రాజధానిలో బ్రహ్మాండమైన మసీదు, చర్చ్‌లను కూడా కట్టబోతున్నాం. సమర్ధుడైన నాయకుడుంటేనే ఆశించిన అభివృద్ధి సాధ్యం. దివంగత ఎన్టీఆర్‌ రూపంలో రాష్ట్రానికి అద్భుత నేత లభించారు. వివేకానందుడు- ఎన్టీఆర్‌ల స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలందరూ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో కలసికట్టుగా కదిలితే ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్‌ చుక్కాని అవుతుంది. విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థకు కేంద్రం (నాలెడ్జ్‌ డ్రివెన్‌ ఎకానమీ హబ్‌)గా అమరావతిని మారుస్తాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

ముందు ayipoye ఐఏఎస్ ఐపిఎస్ buildings ni interiors తో ready చేసి, full gated community with greenary look తెచ్చి, బయట 4 లేన్ roads నుంచి వెళ్తే ఎలా vuntado chupinchandi, thn more believe how amaravati living is going to be n tht civil court also good scope to show case... ఇవి అయితే elections లోపు చాలు.... 

Link to comment
Share on other sites

అమరావతిలో ‘మైస్‌ హబ్‌’

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో వెంకటపాలెం సమీప 42 ఎకరాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో మైస్‌ హబ్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధికి ఎంపికైన గార్డెన్‌ సిటీ-సైబర్‌ సిటీ బిల్డర్స్‌ కన్సార్షియం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ఒప్పందపత్రాన్ని అందజేశారు. 22 ఎకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్‌, ప్రదర్శన కేంద్రాన్ని నిర్మిస్తారు. 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ ఉంటుంది. మిగతా 20 ఎకరాల్లో వాణిజ్య భవనాలు, హోటళ్ల నిర్మాణాన్ని చేపడతారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...