Jump to content

Amaravati


Recommended Posts

అమరావతికి హైకోర్టు
27-12-2018 03:14:46
 
636814783785904311.jpg
  • జనవరి 1 నుంచి ఎవరి కోర్టు వారిదే
  • గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్రపతి
  • సంక్రాంతి తర్వాత కేసుల విచారణ
  • ‘జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌’లోనే కార్యకలాపాలు
  • రాష్ట్రానికి 16 మంది న్యాయమూర్తులు
  • తెలంగాణకు 10 మంది..
నవ్యాంధ్రలో సరికొత్త ఘట్టం ఆవిష్కృతం అవుతోంది. సొంత గడ్డపై హైకోర్టు ఏర్పడుతోంది. హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టును విభజించి తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులను కేటాయిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జనవరి 1 నుంచే ఎవరి కోర్టు వారికి పనిచేస్తుంది. అమరావతిలో నిర్మిస్తున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లో హైకోర్టు కార్యకలాపాలు మొదలుకానున్నాయి.
 
 
న్యూఢిల్లీ/హైదరాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌తో ముడిపడిన కీలక ‘కార్యస్థానం’... రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విభజన అధికారికంగా పూర్తయింది! అమరావతి కేంద్రంగా ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు’ పని చేయనుంది! కొత్త సంవత్సరం... జనవరి 1వ తేదీ నుంచి నవ్యాంధ్ర, తెలంగాణ హైకోర్టులు వేటికవిగా పని చేస్తాయి. ఈ మేరకు బుధవారం రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏపీకి 16 మంది, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయించారు. రాజధాని అమరావతి పరిధిలో నిర్మిస్తున్న ‘జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌’లో ఏపీ హైకోర్టు ఏర్పాటవుతుంది. ఈ భవన నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది. ఇప్పటికే సిబ్బంది, కేసుల విభజన కూడా పూర్తయింది. సంక్రాంతి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేసుల విచారణ అమరావతి కేంద్రంగానే జరుగుతుంది.
 
 
ఇది 25వ హైకోర్టు...
హైదరాబాద్‌లో మూసీ నది ఒడ్డున ఉన్న చారిత్రక భవంతి సుమారు ఆరు దశాబ్దాలపాటు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టుగా సేవలందించింది. ఇకపై ఈ భవనంలో తెలంగాణ హైకోర్టు మాత్రమే నడుస్తుంది. అమరావతి కేంద్రంగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం దేశంలో 25వ హైకోర్టు. ‘‘ప్రతీ రాష్ట్రానికీ ప్రత్యేకంగా ఒక హైకోర్టు ఉండాలని రాజ్యాంగంలోని 214వ అధికరణం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని చట్టంలోని సెక్షన్‌ 31 ప్రకారం ఏపీకి ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు కావాలి. అది ఏర్పడేదాకా, ప్రస్తుత హైకోర్టే రెండు రాష్ట్రాలకూ ఉమ్మడిగా పనిచేయాలని సెక్షన్‌ 30(ఎ) చెబుతోంది.
 
హైకోర్టు విభజనకు సంబంధించి దాఖలైన ఓ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పులో జనవరి 1లోగా హైకోర్టు విభజనకు అభ్యంతరాల్లేవని, సంబంధిత అధికారి నోటిఫికేషన్‌ జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. దీనిపై తగు చర్యలు తీసుకొని జనవరి 1 నాటికి ఏర్పాటయ్యేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఏర్పాటుచేస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు జనవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా రూపాంతరం చెందుతుంది’’ అని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజీందర్‌ కశ్యప్‌ బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
ఉమ్మడి హైకోర్టు విభజన కోసం తెలంగాణ సర్కారు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఉమ్మడి హైకోర్టు భవనంలోనే విడిగా ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలని... లేదా హైదరాబాద్‌లో మరేదైనా భవనాలు కేటాయిస్తామని తెలిపింది. అయితే... ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంలోనే ఉండాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. అదే సమయంలో... అమరావతిలో నిర్మించే జ్యూడీషియల్‌ కాంప్లెక్స్‌లోనే తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రం అంగీకరించింది. భవనం నిర్మాణాన్ని కూడా వేగిరం చేసింది. అంతలోనే కేంద్రం తొందర ప్రదర్శిస్తూ... గతంలో ఇచ్చిన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. రాష్ట్ర విభజనకు సంబంధించి అనేక సమస్యలను పట్టించుకోకుండా... హైకోర్టు విభజనపైనే కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపడంపై రాష్ట్ర సర్కారు తన అఫిడవిట్‌లో మండిపడింది.
 
హైకోర్టు విభజనకు సంబంధించిన విధివిధానాల చర్చకు జడ్జి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని జడ్జిల కమిటీ నవంబరు 26న సీనియర్‌ లాయర్లు, ఇతర సిబ్బందితో ఓ సమావేశం నిర్వహించింది. అందులో కేసుల బదలాయింపు, పెండెన్సీ మొదలైన అంశాలను చర్చించారు. తదనుగుణంగా- కొత్త సంవత్సరానికల్లా అమరావతిలో హైకోర్టు ఏర్పాటవుతుందని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘం డిసెంబరు మొదటివారంలో ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అరగంట తరువాత రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ కావడం విశేషం.
 
రాష్ర్టానికి కేటాయించిన న్యాయమూర్తులు వీరే  
nyamurthulu-2--554.jpg 
 
nyamurthulu-1-555.jpg 
Link to comment
Share on other sites

High court and secretariat anevi entha twaraga “full fledged” ga erpadithey antha baaga develop avtundi state. 

High court and secretariat ki vache vaariki entha varaku facilities (like roads, restaurants, lodges, movie theatres etc) unnayo kuda oka sari check cheyyalsina avasaram undi.... 

 

these things will create great perception.

Link to comment
Share on other sites

రాజధానిలో.. మరో అధ్యాయం
27-12-2018 08:18:18
 
636814955497851499.jpg
  • శాశ్వత సచివాలయ పనులకు నేడు శంకుస్థాపన
  • ప్రపంచంలోనే ఎత్తైన ఐదు టవర్లతో రూపకల్పన
  • ఏర్పాట్లు పరిశీలించిన సీఆర్‌డీఏ కమిషనర్‌, రూరల్‌ ఎస్పీ
 
తుళ్లూరు, డిసెంబరు: రాజధాని అమరావతి నిర్మాణపనుల్లో గురువారం మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాశ్వత సచివాలయ టవర్‌ బిల్డింగ్‌ పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన ఐదు టవర్లతో సచివాలయ నిర్మాణానికి అధికారులు రూపొందించిన నమూనాకు ఆమోదం వచ్చింది. దీంతో రాజధాని పరిధిలోని కొండమరాజు, రాయపూడి తుళ్లూరు రెవెన్యూ పరిధిలో శాశ్వత సచివాలయాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయా పనులను శంకుస్థాపన చేయనున్నారు. సీడ్‌ రోడ్డు నుంచి శంకుస్థాపన జరిగే ప్రదేశానికి సీఎం చేరుకుంటారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జుడీషియల్‌ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి హెలికాఫ్టర్‌లో అనంతపురం వెళ్లనున్నారు. 300 మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.
 
నిరంతరాయంగా 72 గంటల పనులు
షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ ఈ టవర్‌ పనులను దక్కించుకుంది. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ టవర్ల డిజైన్‌ ఇంజనీరింగ్‌ పనులు పర్యవేక్షిస్తుంది. ప్రపంచంలోనే ఇటువంటి రాఫ్ట్‌ అమరావతిలో రెండోదిగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ రాఫ్ట్‌ పనుల్లో 1200 టన్నుల ఐరన్‌ వినియోగించారు. 10,800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వాడాల్సి ఉంది. పది మీటర్ల లోతు నుంచి 35 ఎంఎం రాడ్లను వాడుతూ వచ్చారు. క్వాలిటీ కంట్రోల్‌ బోర్డు 39 మంది సభ్యులు పనులు పర్యవేక్షిస్తారు. 72 గంటలు ఆపకుండా కాంక్రీట్‌ రాఫ్ట్‌ పనులు జరగాల్సి ఉంది. ఈ టవర్‌ నిర్మాణం 40 అంతస్తులతో జరుగుతుంది. సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ సీఎం శంకుస్థాపన జరిగే ప్రదేశాన్ని బుధవారం సాయంత్రం పరిశీలించారు. రూరల్‌ ఎస్పీ శేఖర్‌బాబు బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షించారు.
Link to comment
Share on other sites

అమరావతి నిర్మాణంలో మరో ముఖ్య ఘట్టం..
27-12-2018 06:50:30
 
636814902299555137.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముఖ్య ఘట్టం గురువారం ఆవిష్కృతం కానుంది. సచివాలయం ఐదు టవర్లకు ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ జరగనుంది. ఈ ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. 11వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌తో ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ జరుగుతుంది. 72 గంటలపాటు ఏకధాటిగా ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ పనులు జరగనున్నాయి.
Link to comment
Share on other sites

నవ్యాంధ్రకు సరికొత్త కళ
27-12-2018 04:11:56
 
636814807155889245.jpg
  • 65 ఏళ్ల తర్వాత మళ్లీ హైకోర్టు
  • ఇక ఇక్కడ నుంచే న్యాయపాలన
గుంటూరు/అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి సరికొత్త కళ వస్తోంది. 65 ఏళ్ల తర్వాత హైకోర్టుకు సీమాంధ్రకు తరలివస్తోంది. వాస్తవానికి ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి 1953 అక్టోబరు 1వ తేదీ నుంచి 1956 నవంబరు 1వ తేదీ వరకూ ప్రస్తుత గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లోనే హైకోర్టు ఉండేది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటంతో హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత గుంటూరు-విజయవాడ మధ్య హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత గుంటూరు జిల్లాలోని తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడంతో మొత్తం పరిస్థితులు మారిపోయాయి.
 
 
కొత్త భవనం విశేషాలు
పేరుకు తాత్కాలిక భవనమే అయినప్పటికీ జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను హైకోర్టు నిర్వహణకు అనువుగా ఉండేలాగా 4 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ కాంప్లెక్స్‌ బిల్టప్‌ విస్తీర్ణం 2.5లక్షల చదరపు అడుగులు. 23 కోర్టు హాళ్లుంటాయి. జీ ప్లస్‌ టు పద్ధతిలో ఉండే ఈ భవనంలో న్యాయమూర్తుల చాంబర్లతోపాటు న్యాయవాదులు, కక్షిదారులు, ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలూ ఉంటాయి. విశాలమైన పార్కింగ్‌ స్థలం, ఆకట్టుకునే పచ్చదనం, క్లాక్‌ టవర్‌ ఆకర్షణగా నిలవనున్నాయి.
 
 
ఒకటో తేదీకి రెడీ!
జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులు, ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు మొదటి నుంచీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. పనులను పరుగులు పెట్టిస్తున్నారు. అంతర్గత పనులు కూడా త్వరలో పూర్తి చేయబోతున్నారు. మొత్తం మీద 2019 జనవరి 1వ తేదీకల్లా జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ హైకోర్టు నిర్వహణకు అనువుగా సిద్ధం చేస్తున్నారు.
 
 
హైకోర్టు రాకతో వచ్చేవి ఏమంటే..!
  • ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన న్యాయ పాలన అంతా ఇక్కడ నుంచే జరుగుతుంది.
  • సివిల్‌, క్రిమినల్‌ అప్పీళ్లతోపాటు రిట్‌ పిటిషన్ల దాఖలుకు గతంలో మాదిరి హైదరాబాద్‌ వెళ్లాల్సిన పని ఉండదు.
  • కక్షిదారులకు, న్యాయవాదులకు సమయం, డబ్బు ఆదా అవుతుంది.
  • ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 70ు ఏపీకి చెందినవే.
  • ఏపీ బార్‌ కౌన్సిల్‌లో దాదాపుగా 29వేల మంది న్యాయవాదులు నమోదై ఉన్నారు. వీరిలో 10,400 మంది హైకోర్టు న్యాయవాదులు.
  • ఇప్పటికే దేవదాయశాఖ ట్రైబ్యునల్‌ గుంటూరుకు, రాష్ట్ర వినియోగదారుల ఫోరం విజయవాడకు తరలివచ్చాయి.
 
ఇళ్ల కోసం వెతుకులాట!
అమరావతి రావాలని నిర్ణయించుకొన్న చాలా మంది హై కోర్టు న్యాయవాదులు ఎ ప్పటి నుంచో ఈ ప్రాం తంలో ఇళ్ల కొనుగోలుపై దృష్టి పెట్టారు. ఎక్కువ మంది తాడేపల్లిలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు. మరికొందరు మంగళగిరి, కాజ టోల్‌గేట్‌, ఉండవల్లి పరిసరాల్లో ఇళ్లు చూసుకొన్నారు. ఈ మధ్య సీఆర్డీయే విడుదల చేసిన హ్యాపీనె్‌స్టలోనూ ఫ్లాట్లు బుక్‌ చేసుకున్నట్లు సమాచారం. గుంటూరు, విజయవాడల్లో ఇళ్ల రేట్లు, అద్దెలు ఒక రేంజ్‌లో ఉండటంతో ఈ నగరాలపై దృష్టి పెట్టిన న్యాయవాదుల సంఖ్య తక్కువగానే ఉంది. మొత్తానికి ప్రతిపాదిత జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌కు 18 నుంచి 20కి.మీ. దూరంలో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. కాగా, అమరావతిలో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని గుంటూరు ఎంపీ జయదేవ్‌ ప్రైవే టు మెంబర్‌ బిల్లును లోక్‌సభలో ఇప్పటికే ప్రవేశపెట్టారు.
 
9court1225.jpg 
 
నాకల నెరవేరుతోంది
తెనాలి: ఒక న్యాయవాదిగా నేను ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో హైకోర్టుకు చెన్నై వెళుతుంటే పరాయి దేశానికి వెళ్తున్నట్లు ఉండేది. ఆంధ్ర రాష్ట్రంగా విడిపోయిన తర్వాత గుంటూరుకు హైకోర్టు రావడంతో సొంత రాష్ర్టానికి వచ్చిందని సంతోషపడ్డాం. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుతో ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. హైదరాబాద్‌ రాజధాని అయినా అప్పట్లో గుంటూరుకు హైకోర్టు వస్తే బాగుంటుందని ఆశించిన వారిలో నేనూ ఒకడిని. గుంటూరుకు హైకోర్టు వస్తే చూడాలన్న కోరిక అప్పటి నుంచి ఉండేది. ఆ కల నా నూరో ఏట నెరవేరుతుండడం సంతోషంగా ఉంది.
- యడ్లపాటి వెంకటరావు, టీడీపీ సీనియర్‌ నేత
Link to comment
Share on other sites

ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ పనులు ప్రారంభించిన చంద్రబాబు
27-12-2018 09:27:22
 
636814996415795511.jpg
 
అమరావతి నిర్మాణంలో మరొక కిలక ఘట్టం ఆవిష్కృతమైంది. సచివాలయం ఐదు టవర్ల నిర్మాణంలో భాగంగా ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం ప్రారంభించారు. శాంతి హోమం నిర్వహించిన తర్వాత సరిగ్గా ముహూర్త సమయం 8-50 గంటలకు ర్యాప్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి, దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే శ్రవణ్‌, స్థానిక నేతలు తదితరులు హాజరయ్యారు.
 
దేశంలోనే తొలిసారి అమరావతిలో ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ పనులను చంద్రబాబు ప్రారంభించారు. 11వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌తో సచివాలయ టవర్లకు ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ వేస్తున్నారు. 13 అడుగుల లోతులో 4 మీటర్ల ఎత్తున ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ నిర్మాణం జరుగుతోంది. 72 గంటలపాటు ఏకధాటిగా ఈ పనులు జరగనున్నాయి. ఐదు టవర్లలో సచివాలయం, హెచ్‌వోడీల భవనాలు, డయాగ్రిడ్‌ నమూనాలో ఫ్రేమ్‌ ఆధారంగా టవర్ల నిర్మాణం జరగనుంది. 41 ఎకరాల్లో 69 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయ నిర్మాణం జరుగుతుంది. 50 అంతస్థులతో ఐకానిక్‌గా జీఏడీ టవర్‌ నిర్మాణం జరుగుతుంది. 225 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన సచివాలయ భవనం నిర్మించనున్నారు. భూకంపాలు, పెనుగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా డిజైన్‌ రూపొందించారు.
Link to comment
Share on other sites

అమరావతిలో వేయి పడకల క్యాన్సర్‌ ఆసుపత్రి

 

ఫిబ్రవరిలో భూమిపూజ
బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌ బాలకృష్ణ వెల్లడి

26ap-state1a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తలపెట్టిన క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి ఫిబ్రవరి మొదటి వారంలో భూమి పూజ చేయనున్నట్లు బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రి, పరిశోధన సంస్థ ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ తెలిపారు. వేయి పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలకు మెరుగైన చికిత్సలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఆసుపత్రికి సంబంధించిన సమాచారంతో రూపొందించిన న్యూస్‌ లెటర్‌ను బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నెలకోసారి ప్రచురించే ఈ న్యూస్‌ లెటర్‌లో అరుదైన క్యాన్సర్‌ శస్త్ర చికిత్సలు, రోగులకు అందే సేవలతోపాటు ఉద్యోగులకు సంబంధించిన సమాచారం, సంస్థ చేపట్టే కార్యకలాపాలను వివరిస్తారన్నారు. తన తల్లి బసవతారకం పేరుతో నిర్మితమైన ఈ ఆసుపత్రి సాధిస్తున్న ప్రగతి తనకెంతో సంతృప్తినిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీఈవో డాక్టర్‌ ఆర్‌.వి.ప్రభాకర్‌రావు, సీవోవో జి.రవికుమార్‌, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టీఎస్‌ రావు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కల్పనా రఘునాథ్‌, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

అమరావతిలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాము. సచివాలయం ఐదు టవర్లకు ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ పనులు ప్రారంభించాము. నా జీవితంలో ఇది మరచిపోలేని సంఘటన. 11వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ లక్ష్యంతో 72 గంటలపాటు ఏకధాటిగా ఈ ఫౌండేషన్‌ పనులు జరగనున్నాయి.

DvaSkWpXcAEXV_5.jpg
DvaSmzAXgAIQS8c.jpg
DvaSmyqXgAEkJ3P.jpg
Link to comment
Share on other sites

ఈ రోజు రాష్ట్రంలో రెండు పెద్ద ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాము. ప్రపంచానికే తలమానికంగా సచివాలయం నిర్మాణం ఒకటైతే రాష్ట్ర ప్రజల హక్కు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు రెండవది.

DvaTR4OX4AAgK1f.jpg
Link to comment
Share on other sites

Important Unique Features of the AP Secretariat

By Sambasiva Rao | THE HANS INDIA |   Dec 27,2018 , 11:21 AM IST
   

 
 
Important Unique Features of the AP Secretariat
Important Unique Features of the AP Secretariat
 
 
 Amaravati:The AP Secretariat building will create many milestones and has unique features.
 
This is the first time in India to host both Secretariats and HODs in India with integrated and collaboration for increased efficiency and productivity.
 
 
 
The new Secretariat Building Complex is the tallest secretariat building in the world. Tallest office building in the South India with height of 225 meters, according to the information given by the AP Capital Region Development Authority (AP CRDA).
 
 
 
The building is structurally stable and is resistant to earthquakes and high wind speeds.
 
For the first time in India, the structure is designed on the unique structural system called diagrid without the conventional columns. This gives column free spaces and flexibility.
 
The structure consists of perimeter frame, it has a column free interior space. It gives more usable area without any obstacles and a beautiful view for high rise towers. It saves considerable amount of structural steel compared with conventional columns. Moreover, it acts a self-shading and reduces the heat gain from the sun and helps in reducing the HVAC costs.
 
The core of the building consists of all the necessary services needed for the functionality of the building.
 
The building will have a Destination Control System (DCS) for quick vertical transportation.
 
First time in India, CRDA using the twin lift technology. In this twin lift system there are two elevators operating in same lift shaft. This saves increases usable office area.
 
Top considerations have been made for life safety as per NBC norms. Additionally, helipad is also provided on General Administration Department (GAD) tower, serving as means of evacuation.
 
Top class amenities have been planned, apart from health care facilities in the campus along with fitness centres and sports complex.
 
Recreational zones provided in the sports complex with swimming pool, gym, indoor sports area with badminton and Table tennis and others.
 
Canteens and restaurants provided next to scenic Palavagu zone for the visitors and employees usage.
 
Conference rooms and auditoriums to host the employee meetings and seminars when required are also planned.
 
Plaza spaces designed with landscape elements to provide shade and comfort to the employees and visitors.
 
The towers has futuristic office spaces along with 3 breakout areas, conferencing halls and dining provisions strategically provided in the tower.
 
Banking facilities and e-seva facilities incorporated with the information kiosks and retail outlets for the benefit of public for faster process of the work..
 
All the towers are connected via elevated high speed connecting corridor which also acts as pedestrian bridge for the employees for efficient circulation and connectivity.
 
The building is connected with the District Cooling System grid for enhanced HVAC systems to lower maintenance costs. It will provide 20,000 tonnes of refrigeration for the overall government complex.
 
District cooling system will being the cost of air conditioning will come down by 37% every month compared to the conventional air conditioning systems, explained Chief Minister N Chandrababu Naidu in a press conference after commencing raft foundation concrete works on Thursday.
 
District cooling system is being developed by National Central Cooling Company PJSC (TABREED), a reputed company from the middle-east on PPP basis.
 
Highest sustainability standards
 
The building generates partial electricity by roof top solar panels and reduces the load on the city electricity grid and helps in reducing carbon foot print.
 
The building is targeted to achieve IGBC platinum rating. 
Link to comment
Share on other sites

ఏపీ సచివాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన

271218brk-37188a.jpg

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముఖ్య ఘట్టానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ భవనాల నిర్మాణానికి ఉద్దేశించిన రాఫ్ట్‌ ఫౌండేషన్‌ను కాంక్రీట్‌తో నింపే కార్యక్రమాన్ని రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఏకబిగిన మూడున్నర రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాలను అయిదు టవర్లుగా నిర్మిస్తున్నారు. ఇందులో రెండో భవన పునాది పనులకు చంద్రబాబు ఈరోజు శంకుస్థాపన చేశారు. రాఫ్ట్‌ ఫౌండేషస్‌ మాస్‌కాంక్రీట్‌ విధానంలో పునాది వేస్తున్నారు. 13 అడుగుల లోతు, 12 వేల క్యూబిక్‌ మీటర్ల మేర ఫౌండేషన్‌కు ఏర్పాట్లు చేశారు.

69.8లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐదు టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. 40 అంతస్థులతో నాలుగు, 50 అంతస్థులతో ఒక భవన నిర్మాణం పూర్తి చేస్తారు. ఈ ఐదు సచివాలయ భవనాల్లో ఒకటి, రెండు టవర్లను షాపూర్జీ పల్లోంజీ, మూడు, నాలుగు టవర్లను ఎల్‌ అండ్‌ టీ,  ఐదో టవర్‌ను ఎన్‌సీసీ సంస్థలు నిర్మించనున్నాయి.

271218brk-37188b.jpg

రాఫ్ట్‌ ఫౌండేషన్‌ విధానం అంటే..

నిర్ణీత ప్రాంతం మొత్తాన్ని కాంక్రీట్‌తో నింపే ప్రక్రియనే రాఫ్ట్‌ ఫౌండేషన్‌ విధానంగా పేర్కొంటారు. ఒక రకంగా చెప్పాలంటే స్టీలు, కాంక్రీటుతో అత్యంత పటిష్ఠమైన, మందపాటి కాంక్రీట్‌ దిమ్మెను నిర్మించడమే.

* సాధారణంగా నేల లోతు నుంచి స్తంభాలు వేసి పునాది నిర్మించాలంటే గుంతలు తవ్వాలి. బోర్లు వేసి స్టీలు పెట్టాలి. కాంక్రీట్‌ పోయాలి.. కనీసం నెలన్నర వ్యవధి పడుతుంది. అదే రాఫ్ట్‌లో అయితే మూడు రోజుల్లో పునాది వేయొచ్చు. ఫైల్‌ విధానంతో పోలిస్తే ఖర్చు ఎక్కువైనా నిర్మాణం పటిష్ఠంగా ఉంటుంది.

నేల స్వభావానికి అనుగుణంగా

 నేల స్వభావానికి అనుగుణంగా భవన విస్తీర్ణం, ఎత్తుకు తగినట్లు పునాది ఎలా ఉండాలనేది నిర్ణయిస్తారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటిదాకా ఫైల్‌ ఫౌండేషన్‌ విధానంలో పనులు చేస్తున్నారు. సచివాలయ భవనాలకే రాఫ్ట్‌ ఫౌండేషన్‌లో పునాది వేస్తున్నారు. 72 గంటలపాటు నిరాటంకంగా పనులు చేస్తారు. మూడోపార్టీగా వ్యవహరిస్తున్న ఐఐటీ చెన్నై నిపుణులు కాంక్రీట్‌మిక్స్‌ను డిజైన్‌ చేశారు.

P5T7g6L.jpg

భారీ యంత్రాల వినియోగం

* 60, 40 టన్నుల సామర్థ్యపు క్రేన్లు

* 10 మీటర్ల వరకు వినియోగించే హైడ్రాస్‌

* కాంక్రీట్‌ వేసే నాలుగు పంపులు

* 30 ట్రాన్సిట్‌ మిక్సర్లు (అందుబాటులో అదనంగా మరో ఆరు)

 

Edited by sonykongara
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...