Jump to content

Amaravati


Recommended Posts

 

 
 

అమరావతి రాజధానిలో రివర్ ఫ్రంట్ ఏర్పాటుకు సీ అర్ డీ ఏ సిద్ధమయ్యింది. నగరవాసులకు ఉల్లాసానిచ్చే విధంగా పార్కులు,రెస్టారెంట్లు ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. సాంస్కృతిక నగరాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం,కృష్ణానది పొడవునా 16 కి మి మేర ప్రణాళిక రూపొందించింది.

DpDEGJCUYAE3Sck.jpg
Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

 

 
 

అమరావతి రాజధానిలో రివర్ ఫ్రంట్ ఏర్పాటుకు సీ అర్ డీ ఏ సిద్ధమయ్యింది. నగరవాసులకు ఉల్లాసానిచ్చే విధంగా పార్కులు,రెస్టారెంట్లు ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. సాంస్కృతిక నగరాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం,కృష్ణానది పొడవునా 16 కి మి మేర ప్రణాళిక రూపొందించింది.

DpDEGJCUYAE3Sck.jpg

Looking great 

Link to comment
Share on other sites

మందడం గ్రామానికి.. మహర్దశ
10-10-2018 09:28:09
 
636747604903728982.jpg
  • రూ3.5 కోట్లతో సిమెంటు రోడ్లు
  • జెడ్పీ పాఠశాలలో వర్చువల్‌ తరగతులు
  • పేదలకు 450 ప్లాట్లు
  • ఎన్టీఆర్‌ సుజల పథకం ఏర్పాటు\
తుళ్లూరు: రాజధాని గ్రామాల్లో ఒకటైన మందడం నేడు అభివృద్ధిలో ముందుకు వెళుతోంది. సచివాలయానికి అతి దగ్గరగా ఉండటం, సీఎం వచ్చి పోయే మార్గం మందడం గ్రామమే అవటంతో ప్రగతి పథంలో దూసుకుపోతోంది. గ్రామంలో రూ.కోట్ల సీఆర్డీయే, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామంలో రెండు కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్టీఆర్‌ గృహ కల్ప కింద 151 ఇళ్లను మంజూరు చేశారు. వాటిల్లో 76 ఇళ్లు పూర్తి చేశారు. మందడం పంచాయతీలోనే తాళ్లాయపాలెం ఊరు కలసి ఉంది. మందడంతోపాటే తాళ్లాయపాలెం అభివృద్ధి చెందుతోంది. గత ప్రభుత్వంలో మందడం గ్రామంలో 447 మందికి సామాజిక ఫింఛన్లు అందిస్తే.. టీడీపీ ప్రభుత్వంలో 719 మందికి ఈ ఫింఛన్లు అందుతున్నాయి. గతంలో రేషన్‌కార్డులు 1,304 ఉంటే, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వాటిని చేసి 2,214 కుటుంబాలకు రేషన్‌ను అందిస్తున్నారు. జిల్లా పరిషత్‌ పాఠశాలను మోడల్‌ పాఠశాలగా తీర్చిదిద్దారు వర్చువల్‌ క్లాసులు, డిజిటల్‌ క్లాసులు మొదటగా మందడం నుంచే సీఎం ప్రారంభించారు. అదనపు తరగతి గదులను రూ.కోటి వెచ్చించి నిర్మాణం చేశారు. గ్రామంలో ఇళ్లు, స్థలం లేని నిరుపేదలకు గ్రూపు ఇళ్లు నిర్మాణం చేసి త్వరలో అందించనున్నారు. దాదాపు 450 ప్లాట్లు నిర్మించారు. ఆ పనులు చివరి దశకు వచ్చాయి.
 
చేయాల్సినవి ఇవీ..
ggrgrg.jpgఅయితే గ్రామానికి ఇంకా కొంత అభివృద్ధి జరగాల్సి ఉందని మందడం వాసులు కోరుతున్నారు. మందడంకు జూనియర్‌ కాలేజి కావాలని కోరుతున్నారు. ఆరోగ్య ఉపకేంద్రం స్థానంలో హాస్పటల్‌ నిర్మించి ఎంబీబీఎస్‌ డాక్టర్‌ని నియమించాలని కోరుతున్నారు. గ్రామం కంఠంలో సర్వే నెంబరు 352లో ఉన్న ఇళ్లు, స్థలాలు రిజిస్ట్రేషన్లు జరగటం లేదని తాతల కాలం నుంచి వస్తున్న వాటిని దేవాదాయ శాఖ కింద పేర్కొంటున్నారని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో వీధిపోట్లు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
 
వేగంగా రాజధాని అభివృద్ధి..
సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత సమయం పడుతుందో అందరికీ తెలుసు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరగాలంటే ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలి.
                                                              - నూతక్కి కొండయ్య, మందడం గ్రామ రైతు
 
సంతోషంగా ఉంది..
లంక అసైన్డ్‌ రైతులను రాజధానిలో సీఎం భాగస్వాములను చేశారు. ల్యాండు పూలింగ్‌కి తీసుకొని ప్యాకేజీ ఇచ్చారు. సంతోషంగా ఉంది. అయితే లంక రైతులకు కౌలు సరిగా అందటం లేదు. లంక రైతులకిచ్చిన ప్లాట్లు ల్యాండు పూలింగ్‌కివ్వని వాటిలో వచ్చాయి. ఆ సమస్యను పరిష్కరించాలి.
- వెంగళదాసు సురేష్‌, మందడం
 
స్వచ్ఛందంగా భూమిలిచ్చాం..
సీఆర్డీయే నిధులతో గ్రామం అభివృద్ధి చెందుతోంది. స్వచ్ఛదంగా ల్యాండు పూలింగ్‌కి భూములిచ్చాం. అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది.
- వాకచర్ల వీరాంజనేయులు, మందడం
Link to comment
Share on other sites

ఐటీ నగరంగా అమరావతి
11-10-2018 00:17:26
 
636748138478069247.jpg
ఒక ఆటగాడు మొదటిసారి మైదానంలోకి దిగి సెంచరీ సాధించిన తర్వాతే అతని సామర్థ్యం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. అంతవరకు కేవలం సెలక్టర్ల మదిలో మాత్రమే అతని సామర్థ్యం పరిమితమై వుంటుంది. హెచ్‌సిఎల్ రాకతో అమరావతి ‘బిగ్ ఐటీ’ నగరాల సరసన చేరింది. బ్యాటింగ్ మొదలయింది!
 
అమరావతి – విజయవాడలో ఆదివారంనాడు హెచ్‌సిఎల్, క్యాంపస్ డెవెలప్మెంట్ సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. 400 కోట్ల మొదటి ఫేజ్ నిధులతో, 4000 మందికి ఉద్యోగ సౌకర్యంతో, ఒక సంవత్సర కాలంలో ఇది నిర్మాణమవుతుంది. భారత్‌లో తొలి అయిదు స్థానాల్లో నిలిచే హెచ్‌సిఎల్ లాంటి కంపెనీ అమరావతి – విజయవాడ లాంటి పట్టణంలో ఒక ప్యూర్ సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం, సాఫ్్ట‍వేర్ కంపెనీల ఏర్పాటు గురించి నిర్వహణ గురించి తెలిసిన వారికి ఆశ్చర్యకరమే. ఒక రకంగా 1998లో హైదరాబాదుకి చంద్రబాబు మైక్రోసాఫ్ట్ తేవడంలాంటిదే! ఇది ఎలా సాధ్యమైంది?
 
విమానాల సౌకర్యం మొదలుకొని, హోటళ్ళ, భూమి కేటాయింపు, అనుమతులు, మౌలిక సౌకర్యాలు ఎలా సాధ్యమయ్యాయి? అమరావతిని పరిశ్రమలకి అనుకూలంగా ఎలా మార్చగలిగారు? హెచ్‌సిఎల్ అధినేత శివనాడార్ లాంటి వారిని ఎలా మెప్పించగలిగారు?
 
ఇదేదో పొగడటానికి చేస్తున్న ప్రయత్నం కానే కాదు. ఎందుకంటే, నిజాయితీగా, సాఫ్ట్‌వేర్ కోడింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టేంత మౌలిక సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయా అంటే, వెంటనే, పాజిటివ్ రెస్పాన్స్ రాదు. ‘అమరావతికి ఇంతవరకు పెద్ద పరిశ్రమలు రాలేదు, చంద్రబాబు ప్రభుత్వం, ఏమీ చేయలేదు’ అని మాట్లాడే వారికి, ఆ పరిశ్రమలు రావాలంటే అసలు ఏమి కావాలో, ఎలాంటి సౌకర్యాలు ఉంటే అవి వస్తాయో, రాగలవో కూడా అర్థం కావాలి. పరిశ్రమలు వూరికే రావు. ముందుగా వాటికి కావాల్సిన ‘ఎకో సిస్టం’ను ఏర్పర్చగలిగితేనే అవి రాగలవు. లేకుంటే, అవి రాలేవు, వచ్చినా పని చేయలేవు. ఒక్కసారి, విభజన సమయానికి, మన మౌలిక సౌకర్యాల స్థితి ఏ విధంగా వుందో అవలోకనం చేసుకొంటే, సాఫ్ట్‌వేర్ కంపెనీలే కాదు, అధునాతన పరిశ్రమలు రావాలంటే కావాల్సిన సౌకర్యాల లేమి, విభజన సమయానికి దాని గ్రావిటీ అర్థం అవుతుంది. విభజన ఇంకా అధికారికంగా జరుగక మునుపు, హైదరాబాదులో అమెరికాకు చెందిన ఒక ప్రఖ్యాత బిగ్ 4 అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ కంపెనీ భారత అధిపతితో మాట్లాడుతూ, మీకు భారత్‌లో 25000 మంది, ప్రత్యేకించి హైదరాబాదులో ఇరవైవేలమందికి పైగా ఉద్యోగులు వున్నారు కదా, ఒక 1000 మంది యూనిట్, ఉద్యోగ రిసోర్స్ పవర్ బాగా వున్న మా విజయవాడలో పెట్టచ్చు కదా, అని ప్రశ్నించాను. దానికి జవాబుగా, ‘‘సరే విజయ్, నువ్వన్నట్టు రిసోర్స్ సప్లై వుంది కాబట్టి 1000 మందితో పెట్టానే అనుకో, మౌలిక సౌకర్యాలు ఎక్కడ నుంచి తెస్తావు?
 
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని క్యాంపస్ కావాలి. భూమితో పాటుగా అంతర్గత రోడ్లు, సిటీ నుంచి అప్ప్రోచ్ రోడ్లు, డ్రైనేజీ, పబ్లిక్ లైటింగ్, రవాణా, మంచి పరిసరాలు ఇతరత్రా మౌలిక సౌకర్యాలు కావాలి. భవనాలను కంపెనీ తన స్వంత డబ్బులతో కట్టుకొంటుంది. కానీ, వెయ్యి మందికి, విజయవాడలో ఇప్పటికిప్పుడు (2014లో) వెంటనే చేరిపోగలిగే, ఆధునిక సౌకర్యాలతో, గేటెడ్ కమ్యూనిటీ లాంటివి కనీసం 1000 ఫ్లాట్లు ఉన్నాయా? ఉన్నత మేనేజ్మెంట్ వ్యక్తులకి వంద వరకు ఇండిపెండెంట్ ఇళ్లు కావాలి. అదీ క్యాంపస్‌కు నాలుగైదు కిలోమీటర్లలోనే.
 
ఇక అందరూ ముప్పై ఏళ్ళ లోపలి వారే కాబట్టి, స్కూళ్ళకి పోయే పిల్లలే వుంటారు. కనీసం మూడో వంతు పిల్లలకి సరిపడే అధునాతన స్కూళ్ళు పది దాకా ఉన్నాయా? సీట్లు లభిస్తాయా? దేశంలో వుండే మిగతా యూనిట్ల నుంచి రాకపోకలు ఎక్కువ కాబట్టి రోజుకి 100 మంది కోసం దగ్గరలోనే ఒక మూడు నాలుగు స్టార్ హోటళ్ళు ఉన్నాయా? ఇప్పటికైతే (2014) విజయవాడకి రెండో మూడో విమానాలు వున్నాయి, అదీ హైదరాబాదు నుంచి మాత్రమే. రాకపోకలు ఎలా? లోకల్ కన్వేయన్స్ కోసం ఉబర్, ఓలా, మేరు లాంటి టాక్సీ సర్వీసులు ఎలా? వారాంతాల్లో ఆటవిడుపు ఎలా? ఉద్యోగులుగా ఒక్క ఆంధ్రా వారినే తీసుకొలేముగా? ఒక అధునాతన జీవన విధానానికి అలవాటుపడ్డ మిగతా ప్రాంతాల ఉద్యోగులు అసలు విజయవాడకు వస్తారా? కొంతమంది ఆంధ్ర ఉద్యోగులు స్వంత ప్రాంతం మీద అభిమానంతో రావచ్చు గాక. ఇవన్నీ ఒక కంపెనీ అవసరాలు మాత్రమే. కంపెనీల సంఖ్య పెరిగే కొద్దీ అవసరాలు హెచ్చింపబడుతాయి. ఇవేవీ గొంతెమ్మ కోరికలు కాదు. ఒక కంపెనీ అంటే, కొంతమంది పౌరుల సమూహం. వారికి ఒక సమర్థమైన, బహువిధమైన జీవన విధానం ఏర్పరచటం. ప్రభుత్వాల లాగే, కంపెనీ అంటే బాధ్యత, విధి.
 
ఆంధ్రప్రదేశ్ మీద ద్వేషంతో చెబుతున్న మాట కాదు. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ అధిపతిగా చంద్రబాబు అంటే నాకు అభిమానమే. ఉద్యోగులు ఎక్కడ విరివిగా లభిస్తారో అక్కడికే వెళ్లి సెంటర్ పెట్టడం ఏ కంపెనీకైనా నిపుణత ఆధారంగా లాభదాయకమే. కానీ, మంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల లభ్యత ఒక్కటే సరిపోదుగా. ఒక నాలుగైదు సంవత్సరాల కాలంలో తప్పకుండా మీరు అవన్నీ సాధిస్తారనే నమ్మకం మాకుంది. తప్పకుండా మేము విజయవాడలో యూనిట్ పెడతాము’’ అని ముగించాడు. ప్రాంతీయ అభిమానంతో నేను ఆ అధిపతిని అడిగిన మాట వాస్తవమే కానీ నిజంగా ఆలోచిస్తే, ఆ రోజుకి మనకు అన్ని మౌలిక సౌకర్యాలు లేవు. కట్టుబట్టలతో కాకపోయినా, దాదాపు అదే పరిస్థితిలో, ఇదీ మా రాజధాని అని చెప్పుకొనే పట్టణం కూడా లేని స్థితిలో వచ్చాము. అమరావతి రాజధాని అనుకొన్నప్పుడు, దురదృష్టవశాత్తు మనకు సరైన విమానాశ్రయం కూడా లేదు. హోటళ్ళు లేవు. రోడ్లు లేవు. లేకపోవడంలో ఎవ్వరి తప్పు కూడా లేదు. తప్పో ఒప్పో, మన ఫోకస్ అంతా హైదరాబాదు మీదే పెట్టాము. రాష్ట్రంలోని మిగతా నగరాలని, ఇప్పటి తెలంగాణ నగరాలతో సహా, కనీసం టియర్ -2 నగరాల స్థాయిలో కూడా మనము అభివృద్ధి పరచలేదు. దానికి చారిత్రక కారణాలెన్నో.
 
ఒక్క సారిగా హైదరాబాదును కోల్పోయి, ఆదాయం అడుగంటిపోయి, కొత్త కాపురం మళ్ళీ ప్రారంభించాము. కొత్త సమాజపు పోకడల ప్రకారం, నగరాలలోనే, మిగులు డబ్బులు ఖర్చుపెట్టే వారి దగ్గర నుంచే అభివృద్ధికి నిధులు వస్తున్నాయి. కొత్త కంపెనీలు వస్తే, కొత్త ఉద్యోగులు వస్తారు. వారి కోసం హౌసింగ్, స్టీలు, సిమెంటు, నిర్మాణ పరిశ్రమ, టీవీలు, ఫ్రిజ్ లు, ఏసిలు, వంటింటి సామాన్ల వరకు గృహోపయోగ పరిశ్రమ, హోటళ్ళు, ఆటవిడుపు, ప్రయాణాలు, విమానాలు, కార్లు వరకు సేవా పరిశ్రమ అన్నీ వస్తాయి.
 
చిత్రమేమిటంటే, పరిశ్రమలు వస్తే ఇంత ఆదాయ మార్గాలు వస్తాయి సరే; కానీ, అన్ని సౌకర్యాలు వుంటే కానీ పరిశ్రమలు రావు. విత్తు ముందా, చెట్టు ముందా అంటే చెప్పలేని పరిస్థితి. సరిగ్గా విభజన తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఇదే. అమరావతి అని పేరైతే పెట్టుకొన్నాము. ప్రపంచ ఖ్యాతి రాజధాని కావాలని కలలు కన్నాము. కానీ ఎలా?
 
అక్కడే ఆంధ్రప్రదేశ్ నిజంగా పని చేయడం ప్రారంభించింది. ముందుగా రాజధాని ప్రాంతాన్ని గుర్తించింది. పూలింగ్ ద్వారా భూమిని సేకరించింది. మౌలిక సౌకర్యాల కల్పన ప్రారంభించింది. ఆరు లక్షల అడుగుల సచివాలయం నిర్మించింది. అసెంబ్లీ, కౌన్సిల్ నిర్మాణం గావించింది. కొన్నివందల కిలోమీటర్ల నిడివితో ఆరులేన్ల ట్రంక్ రోడ్లు, ఆర్టీరియల్ రోడ్లు, సబ్ ఆర్టీరియల్ రోడ్లు నిర్మాణం చేపట్టింది. పలు నిర్మాణ సంస్థలతో మాట్లాడి డిజైన్లను రూపొందించింది. రాజధాని నిర్మాణ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం మొదలుకొని పలు అంతర్జాతీయ బై-లేటరల్ సంస్థలతో సంభాషణలు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో సచివాలయము, అసెంబ్లీ నిర్మాణం మొదలుపెడుతోంది. పలు విద్యాసంస్థలతో చర్చలు జరిగాయి.
ఎస్ఆర్ఎం, వీఐటీ లాంటివి ఇప్పటికే, బహుళ అంతస్తుల భవనాలు కట్టి విద్యా సంస్థలు ప్రారంభించగా, అమృత లాంటివి నిర్మాణాలు చేస్తున్నాయి. శెట్టీ లాంటివి ఆసుపత్రుల నిర్మాణాలను శరవేగంతో పూర్తి చేస్తున్నాయి. పలు బ్యాంకులు, ఇతర ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలకు వారి ఆఫీసులకు స్థలాలు కేటాయించింది.
 
సింగపూర్ సహాయంతో ఒక ప్రత్యేక ఆర్థిక సిటీని నిర్మిస్తోంది. తన వంతుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సివిల్ సర్వీస్, ఇతర ఉన్నతాధికార్ల కోసం బహుళ అంతస్తుల హర్మ్యాలు దాదాపు పూర్తి చేస్తోంది. హైకోర్టు నిర్మాణం డిసెంబర్‌కు పూర్తి అవుతుంది. భూమి ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తి చేస్తోంది. విమానయాన శాఖతో నిరంతర సంప్రదింపుల ఫలితంగా విజయవాడ విమానాశ్రయానికి రోజుకి ఇరవైకి పైగా విమానాలు వస్తున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పది లక్షల ప్రయాణికుల మార్క్ దాటేస్తోంది. అమరావతిలో, గుంటూరు, విజయవాడలో కొత్తగా 4, 5 స్టార్ హోటళ్లు వచ్చేసాయి. హెచ్‌సిఎల్‌కి ఇచ్చిన హామీలు నెలలో పూర్తి చేసి, భూమి పత్రాలను మంత్రి లోకేష్ స్వయంగా వెళ్లి శివనాడార్‌కి అందజేశారు. ఒక్క మాటలో పరిశ్రమలకు కావాల్సిన ఎకో సిస్టంను కల్పించారు.
 
అమరావతిని పరిశ్రమలకు అనుకూలంగా చేయటం, మౌలిక సౌకర్యాల కల్పన, అనేది ఒక రోజు పని కాదు ఇంత కష్టం కాగితం మీద సులభంగానే ఉండచ్చు. కానీ ఏమీ లేని చోట నుంచి, ఈవేళ, అమరావతిలో నిర్మాణం జరుగుతున్న తీరును నిర్మాణాత్మక దృక్పథంలో చూస్తే, ఒక అద్భుతమైన నగరం ఆనుపానులు, పరిశ్రమ రంగంలో అనుభవమున్న వారికి బాగానే కనపడుతాయి. మరి అంత అనుభవుజ్ఞుడైన హెచ్‌సిఎల్ అధినేత ‘శివ నాడార్’కి అమరావతి అనే యజ్ఞం అద్భుత భవిషత్తు కనపడ్డంలో ఆశ్చర్యమేముంది?
 
ఒక ఆటగాడు మొదటిసారి మైదానంలోకి దిగి సెంచరీ సాధించిన తర్వాతే అతని సామర్థ్యం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. అంతవరకు కేవలం సెలక్టర్ల మదిలో మాత్రమే అతని సామర్ధ్యం పరిమితమై వుంటుంది. హెచ్‌సిఎల్ రాకతో అమరావతి ‘బిగ్ ఐటీ’ నగరాల సరసన చేరింది. బ్యాటింగ్ మొదలయింది!
 
 విజయ్‌కుమార్
Link to comment
Share on other sites

లింగాయపాలెం కొత్త రూపు
12-10-2018 08:35:38
 
636749301398746924.jpg
  • ఊరిని ఆనుకొని ప్రభుత్వ కాంప్లెక్స్‌
  • బీసీ, ఎస్సీ కాలనీ సిమెంటు రోడ్లు
 
తుళ్లూరు: రాజధాని గ్రామాల్లో ఒకటైన లింగాయపాలెం ప్రగతి పథంలో పయనిస్తోంది. నదికి ఆనుకుని ఉన్న ఈ గ్రామం మరోవైపు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, పడమర భాగంలో రాజధాని రోడ్లలో ఒక ప్రధాన రోడ్డు వెళుతోంది. దీంతో గ్రామానికి రవాణా వ్యవస్థ అత్యద్భుతంగా ఉంది. ఎస్సీ, బీసీ కాలనీ మొత్తం సిమెంటు రోడ్లను పరచుకున్నాయి. గ్రామంలో ఎన్టీఆర్‌ సుజల పథకం ఏర్పాటు చేశారు. దగ్గరలోనే సీఆర్డీయే జోనల్‌ కార్యాలయం, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నిర్మాణాలు జరుగుతున్నాయి.
 
అందరికీ సంక్షేమ ఫలాలు..
ggff.jpgగ్రామంలో అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గత ప్రభుత్వంలో 43మందికి సామాజిక ఫింఛన్లు అందుతుంటే టీడీపీ ప్రభుత్వంలో 185మంది పేదలకు అందజేస్తున్నారు. దీపం పథకం కింద గ్రామంలో పేదలందరికీ గ్యాస్‌ కనెక్షన్లు అదజేశారు. కోటిన్నర సీఆర్డీయే నిధులతో సిమెంటు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. 300 మరుగుదొడ్లు నిర్మాణం జరిగాయి. ఎస్సీ కాలనీలో రూ.35 లక్షలతో సైడు కాల్వలు, సిమెంటు రోడ్లు వేశారు. 300 మందికి అమరావతి జీవన భృతి ఫిం ఛన్లు అందుతున్నాయి. రాజధానిలో పేదలకు అందించే ఇళ్ల ప్లాట్లకు 145మందిని ఎంపిక చేశారు. లింగాయపాలెం పంచాయతీ కింద ఉన్న మోదులింగాయపాలెం గ్రామంలో కూడా సిమెంటు రోడ్లు వేశారు. రెండు అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. అందులో ఒక దానికి బిల్డింగ్‌ అవసరం ఉంది. ల్యాం డు అక్విజేషన్‌లో కొన్ని ప్లాట్లు వచ్చాయి. వాటిని సరిచేయాల్సి ఉంది. లంక భూముల సమస్యలను సీఆర్డీయే అధికారులు పట్టిం చుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
 
వేగంగా అభివృద్ధి
garg.jpgప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పఽథకాలు అమలు చేయటంలో ఎక్కడా రాజీ లేదు. అర్హులందరికీ ఫింఛన్లు, రుణాలు అందజేస్తున్నాము. అవి పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నాము. చంద్రబాబు మీద నమ్మకంతో భూములిచ్చాము. అభివృద్ధి వేగంగా జరుగుతోంది.
 - ఎ.కృష్ణకుమారి, మాజీ సర్పంచి
 
 
 
లంక రైతులకు న్యాయం చేయాలి..
లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం జరగాల్సి ఉంది. సాగులో ఉన్న వాటిని కొన్నిటిని మాత్రమే సర్వే చేశారు. ప్యాకేజీ తక్కువ ఇస్తామని చెపుతున్నారు. 150 మంది లంక రైతులు ఆందోళన చెందుతున్నాము. నిష్పక్షపాతంగా సర్వే చేసి న్యాయం చేయాలి.
- జి.వెంకటేశ్వరావు, లింగాయపాలెం
Link to comment
Share on other sites

19 minutes ago, ramntr said:

Judicial complex ante permanent one? 

Judicical complex ante city civil court , dni ni L&T vadu kadutunnadu,dini pakkane high court vasthundi shapoorji pallonji vadu dini ni kadatadu work punadula daggra  unnadi anukunta.

Link to comment
Share on other sites

రాయపూడి గ్రామానికి రాజధాని కళ
13-10-2018 08:21:03
 
636750156644469114.jpg
  • నాడు రాయలు కాలు మోపిన నేల
  • నేడు అభివృద్ధి పథంలో ముందుకు..
  • గ్రామానికి ఆనుకొని సివిల్‌ సర్వీస్‌ అధికారుల నివాస భవనాలు, సీడ్‌ రోడ్డు
తుళ్లూరు: రాజధాని గ్రామాలు ఒక్కోదానికి ఒక్కో చరిత్ర ఉంది. రాయపూడి పూర్వం శ్రీకృష్ణదేవరాయులు కాలు మోపిన ప్రదేశంగా చరిత్ర చెపుతోంది. రాజధాని నిర్మాణంలో భాగంగా గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గ్రామానికి ఆనుకొని ఆలిండియా సర్వీసు అధికారుల భవనాల నిర్మాణం జరుగుతోంది. ఎస్సీ కాలనీలో నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెళుతుంది. దీంతో 65 కుటుంబాల వారు ఇళ్ల స్థలాలు కోల్పోయారు. వారికి ప్రత్యామ్నాయంగా పునరావాస కాలనీని సీఆర్డీయే ఏర్పాటు చేసింది. అందులో మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. నిర్వాసితులు ఇళ్ళ నిర్మాణాలు చేసుకుంటున్నారు. దానికి ప్రగతినగర్‌ అని నామకరణం చేశారు.
 
అందరికీ సంక్షేమ పథకాలు..
srgergerg.jpgగ్రామంలో అర్హులందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. గతంలో 263 సామాజిక ఫింఛన్లు అందిస్తే టీడిపీ ప్రభుత్వంలో ఆ సంఖ్య 476కి పెరిగింది. గ్రామంలో కోటి ఖర్చు చేసి సిమెంటు రోడ్లు వేశారు. అర్హులైన భూమిలేని 987 కుటుంబాలకు జీవన భృతి కింద నెల నెలా రూ.2,500 అందజేస్తున్నారు. స్వచ్ఛందంగా ల్యాండు పూలింగ్‌ భూములిచ్చిన రాయపూడి రైతులు ఆ ప్రదేశం అభివృద్ధికి చిరునామా కావటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతి కొద్దిమంది రైతులు ల్యాండు పూలింగ్‌లో భూములివ్వలేదు. తమకు కొన్ని అనుమానాలున్నాయని, అవి తీరిస్తే ఇవ్వటానికి సంసిద్ధమని చెపుతున్నారు. గ్రామానికి తూర్పున ఎన్‌ఆర్టీ టవర్స్‌ నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్‌ 36 అంతస్థులతో నిర్మాణం జరగనుంది. సీఎం చేతుల మీదగా దానికి శంకుస్థాపన చేశారు.
 
అయితే ఆర్‌అండ్‌బీ ప్రఽధాన రహదారి ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించాల్సి ఉంది. వర్షం పడితే రోడ్డుమీదే నీరు నిలబడి ప్రస్తుతం ఉంటుంది. పంచాయతీ బజారు కొంతమేర సిమెంటు రోడ్డు వేశారు మిగిలింది కూడా పూర్తి చేయాలని కోరుతున్నారు. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా పాల వాగును పూడ్చి ప్లాట్లు వేశారు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
వేగంగా రాజధాని నిర్మాణం
hbh.jpgరాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భవనాల సముదాయం అంతా రాయపూడికి దగ్గర్లోనే ఉంది. అర్హత ఉన్న ప్రతి పేదవానికి సంక్షేమ పఽథకాలు అందుతున్నాయి. చంద్రబాబు నాయుడి పాలనలోనే ఇది సాధ్యం అయింది.
- వడ్లమూడి పద్మలత, ఎంపీపీ
Link to comment
Share on other sites

హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌కు.. శంకుస్థాపన
13-10-2018 08:24:17
 
636750158583529687.jpg
 
  • జపాన్‌ సంస్థ, సీఆర్డీయే సంయుక్త నిర్మాణం
  • సంస్కృతిని ప్రతిబింబించేలా రెండెకరాల్లో భవంతి
అమరావతి, తుళ్లూరు(ఆంధ్రజ్యోతి): రాజధానిలోని లింగా యపాలెం- కొండమరాజుపాలెంల మధ్య జపాన్‌కు చెందిన కునిఉమి సంస్థ, సీఆర్డీయే సంయుక్తంగా నిర్మించనున్న హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌ భవంతికి కునిఉమి సంస్థ అధ్యక్షుడు యమజాకి యసుయో, సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఈ నిర్మాణ విశేషాలను యసుమో శ్రీధర్‌కు వివరించారు. 2 ఎకరాల ప్రాంగణంలో, 1,000 చదరపు మీటర్లలో 6 మీటర్ల ఎత్తుతో దీనిని నిర్మిస్తామని, భవంతి మొత్తాన్ని పేపర్‌ కోర్‌ కోటెడ్‌ విధానంలో వాడేసిన కాగితంతో రూపొందించిన స్తంభాలపై, ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ సామగ్రితో రూపొందిస్తామని పేర్కొన్నారు. ఇందులో జపాన్‌ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శన శాలతోపాటు 700 మంది కూర్చునేందుకు వీలైన హాలును నిర్మిస్తామన్నారు.
 
arfgaergaerg.jpg ప్రదర్శన శాలలో విశ్వాన్ని ప్రతిబింబించే గోళం (గ్లోబ్‌) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. దీనిని సందర్శకులు తాకి, తాము కోరుకున్న ప్రాంతాన్ని జూమ్‌ చేసి, చూసుకోగలిగే వీలుంటుందన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రజలకు పరిచయం చేసేందుకు సందర్శకుల హాలును వినియో గించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండ లాధ్యక్షురాలు వడ్లమూడి పద్మలత, సీఆర్డీయే ల్యాండ్స్‌ డైరెక్టర్‌ బి.ఎల్‌.చెన్నకేశవరావు, సీఈ ఎం.జక్రయ్య, ఎస్‌.ఇ. సీహెచ్‌ ధనుంజయ, సీసీడీపీ జేడీ ఎం.ఎ.క్యు.జిలానీ, కునిఉమి సంస్థ ఉపాధ్యక్షుడు అఖిలేష్‌కుమార్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ అకి ఇచిజుకా, భవంతి ఆర్కిటెక్ట్‌ సొంకె హూఫ్‌, బి.ఎస్‌.చక్రవర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...