Jump to content

Amaravati


Recommended Posts

ఐకానిక్ వారధుల నిర్మాణ ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష
 
636246022533958322.jpg
అమరావతి: రాజధాని రహదారులు, ఐకానిక్ వారధుల నిర్మాణ ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.సీఆర్‌డీఏ సమావేశంలో కూచిపూడి ముద్రను పోలివుండే ఐకానిక్ వారధి ఆకృతిపై సీఎం చంద్రబాబు ఆసక్తి చూపారు.పైభాగంలో రిక్రియేషన్ కోసం, కింది భాగంలో రెగ్యులర్ ట్రాఫిక్ కోసం డబుల్ డెక్కర్ వారధిగా నిర్మించాలని ప్రతిపాదించారు. పవిత్ర సంగమం దగ్గర ప్రారంభమై కృష్ణానది మీదుగా రాజధాని ప్రాంతాన్ని వారధితో కలపనున్నారు. ఎల్అండ్‌టీ సంస్థ ఆరు డిజైన్లు రూపొందించింది. కూచిపూడి వారధి రానున్న కాలంలో సన్ రైజ్ వ్యూ పాయింటుగా ప్రపంచ ప్రసిద్ధి పొందేలా తీర్చిదిద్దాలని చంద్రబాబు యోచన
Link to comment
Share on other sites

ఐకానిక్ వారధుల నిర్మాణ ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష

 

636246022533958322.jpg

అమరావతి: రాజధాని రహదారులు, ఐకానిక్ వారధుల నిర్మాణ ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.సీఆర్‌డీఏ సమావేశంలో కూచిపూడి ముద్రను పోలివుండే ఐకానిక్ వారధి ఆకృతిపై సీఎం చంద్రబాబు ఆసక్తి చూపారు.పైభాగంలో రిక్రియేషన్ కోసం, కింది భాగంలో రెగ్యులర్ ట్రాఫిక్ కోసం డబుల్ డెక్కర్ వారధిగా నిర్మించాలని ప్రతిపాదించారు. పవిత్ర సంగమం దగ్గర ప్రారంభమై కృష్ణానది మీదుగా రాజధాని ప్రాంతాన్ని వారధితో కలపనున్నారు. ఎల్అండ్‌టీ సంస్థ ఆరు డిజైన్లు రూపొందించింది. కూచిపూడి వారధి రానున్న కాలంలో సన్ రైజ్ వ్యూ పాయింటుగా ప్రపంచ ప్రసిద్ధి పొందేలా తీర్చిదిద్దాలని చంద్రబాబు యోచన

2+4 super combination

Imagine Happy Sunday events on the upper deck with river view

Link to comment
Share on other sites

ఐకానిక్‌ వంతెనపై కూచిపూడి ‘ముద్ర’
 
636246168925180291.jpg
  • అమరావతి రోడ్లు, ఐకానిక్‌ వంతెనలపై సమీక్ష
 
అమరావతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): అమరావతిని, సంగమస్థలాన్ని కలుపుతూ కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్‌ బ్రిడ్జిలలో మొదటి వారధి నిర్మాణానికి తొలి అడుగుపడింది. కూచిపూడి ముద్ర ఆకృతిలో, రెండంతస్తులతో వంతెన నిర్మితం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిలోని పవిత్ర సంగమ ప్రదేశం నుంచి కృష్ణానది మీదుగా రాజధాని ప్రాంతాన్ని కలుపుతూ నిర్మించబోయే ఈ వంతెన కోసం ఎల్‌ అండ్‌ టీ సమర్పించిన ఆరు రకాల ఆకృతులను పరిశీలించిన అనంతరం ఆయన ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన ఏపీసీఆర్డీయే సమీక్షా సమావేశం ఇందుకు వేదికైంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఎల్‌ అండ్‌ టీ ఆరు ప్రతిపాదనలు సమర్పించింది. అవి.. 1. నమస్కార ముద్ర, 2. కూచిపూడి నృత్య భంగిమ, 3.కూచిపూడి నృత్యంలో అరళ ముద్రగా, బౌద్ధంలో వితర్క ముద్రగా, యోగాలో చిన్ముద్రగా వ్యవహరించే భంగిమ, 4. డబుల్‌డెకర్‌ (అంటే రెండంతస్తుల బ్రిడ్జి. పై దాంట్లో నడక, పరుగు, యోగా, స్ట్రీట్‌ ఫెస్టివల్స్‌, స్ట్రీట్‌ ఫుడ్‌, సైక్లింగ్‌, ఈవెంట్లు నిర్వహించుకునేలా, కింది అంతస్తులో వాహనాల రాకపోకలు జరిగేలా), 5.స్తూప తోరణం నమూనాలో రాష్ట్రంలోని 13 జిల్లాలకు ప్రతీకగా 13 రమణీయ పిల్లర్లతో నిర్మాణం,6. కొండపల్లి బొమ్మల స్ఫూర్తితో రూపొందిన ఆకృతి.
 
అన్నీ చాలా బాగున్నాయని కితాబిచ్చిన సీఎం.. 2,4 ఆకృతులను కలగలిపి తుది రూపు కల్పించాలన్నారు. పై అంతస్తును వినోద, క్రీడా ప్రదేశంగా తీర్చిదిద్దడమే కాక.. అక్కడి నుంచి నేరుగా దిగువన ఉన్న నదికి చేరేలా ఉపమార్గాలను ఏర్పాటు చేసి, అక్కడ జలక్రీడలకు అనువైన థీమ్‌ పార్కులను అభివృద్ధి పరచవచ్చునని సూచించారు. త్వరలోనే జలరవాణా కోసం కృష్ణానదిలో పూడికతీత పనులు జరగనున్నాయని, ఆ సమయంలోనే జలక్రీడలకు అనువుగా ఈ ఐకానిక్‌ బ్రిడ్జిని నిర్మించే ప్రాంతంలో నదిలో కృత్రిమ ద్వీపాలను ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. కన్యాకుమారి తరహాలో ఈ వారధిలోని పైభాగం భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత పేరొందిన సూర్యోదయ వీక్షణ కేంద్రం (సనరైజ్‌ వ్యూ పాయింట్‌)గా నిలిచిపోగలదన్నారు. అయితే.. ఎల్‌ అండ్‌ టీ సమర్పించిన అన్ని కాన్సెప్టులనూ ప్రజలకు చూపి వాటిపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.
 
ముఖ్యంగా ఇంజనీరింగ్‌, ఆర్కిటెక్చరల్‌ కోర్సుల విధ్యార్థులకు వాటి గురించి తెలియజేసి, వారి స్పందన తీసుకోవాలన్నారు. విద్యార్థుల మధ్య డిజైన్లపై పోటీలు నిర్వహించి, వారి నుంచి అత్యుత్తుమ ఆకృతులను పొందేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే.. అమరావతిలో చేపడుతున్న రహదారులన్నింటినీ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. తొలిదశలో నిర్మించబోయే 7 రోడ్లకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ ముగిసిందని, నిర్మాణసంస్థల ఎంపిక కూడా పూర్తయిందని ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి ముఖ్యమంత్రికి తెలిపారు. రూ.187 కోట్లతో నిర్మిస్తున్న సీడ్‌యాక్సెస్‌ రోడ్డు పురోగతిని చంద్రబాబు తెలుసుకున్నారు. విజయవాడలో కొత్త రహదారులు, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలు, మెట్రో రైలు నిర్మాణపు పనులు త్వరలో ఆరంభమవుతున్న దృష్ట్యా వాటి కారణంగా రెగ్యులర్‌ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, మార్గాలను సత్వ రం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆ భూములను గ్రీనబెల్ట్‌ కింద ప్రకటిద్దాం


రాజధాని భూసమీకరణకు అంగీకరించని రైతుల భూములను గ్రీన బెల్ట్‌ కింద ప్రకటించి, వాటిల్లో వ్యవసాయం మినహా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునేందుకు ఏమాత్రం అవకాశం లేని విధంగా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.
 
 
 
నమస్కార ముద్ర
namaskaram.jpg
Link to comment
Share on other sites

 
namaskaramm.jpg 
కూచిపూడి నృత్య భంగిమ
nat.jpg
 
natt.jpg 
చిన్‌ముద్ర
hand.jpg
 
handd.jpg 
వృత్తాకార బల్ల
ringggg.jpg
 
ringg.jpg 
బౌద్ధ స్తూప తోరణం
thor.jpg
 
thorr.jpg 

రథంపై కృష్ణార్జునులు.. కొండపల్లి బొమ్మ


 
padd.jpg
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...