Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
 

Lemon Tree Hotel Group Has Signed an agreement with laila Group to Set-up a STAR Hotel with 90 rooms capacity This is 2nd Signed Property in Vijayawada Lemon Tree has STAR Hotels nearly 30 Cities Across India 1st Time They are entering into Sunrise State Operational by June 2020

DkusKjiU0AAdIkW.jpg
Link to comment
Share on other sites

విజయవాడకు శుభవార్త... బాంబే స్టాక్ ఎక్స్చేంజికి అదిరిపోయే న్యూస్ చెప్పిన లెమన్ ట్రీ గ్రూప్..

Super User
16 August 2018
Hits: 43
 
lemontree-16082018-1.jpg
share.png

ఆతిథ్య సేవ‌ల రంగంలోని ప్ర‌ముఖ సంస్థ లెమ‌న్ ట్రీ హోట‌ల్స్‌, విజయవాడ వాసులకి గుడ్ న్యూస్ వినిపించింది. ఈ రోజు, బాంబే స్టాక్ ఎక్స్చేంజికి ఇచ్చిన లెటర్ లో ఈ విషయం చెప్పింది. విజయవాడ నగరంలో, రెడ్ ఫాక్స్ హోటల్ బ్రాండ్ తో, హోటల్ కడుతునట్టు తెలిపింది. మొత్తం 90 గదులతో వచ్చే ఈ హోటల్, జూన్ 2020 నాటికి రెడీ అవుతుందని తెలిపింది. విజయవాడలో ఈ గ్రౌండ్ కడుతున్న రెండో హోటల్ ఇది. ఇప్పటికే కొన్ని ప్రముఖ కంపెనీలు అమరావతిలో హోటల్స్ కాట్టటానికి రెడీ అవుతున్నాయి. మరో పక్క విజయవాడలో నోవోటెల్ మొదటి ఫైవ్ స్టార్ హోటల్ కడుతుంది. వినాయాక్ ధియేటర్ దగ్గర కడుతున్న ఈ హోటల్ పనులు దాదాపుగా చివరకు వచ్చాయి.

 

lemontree 16082018 2

లెమ‌న్ ట్రీ కంపెనీ వివారాలు... 2002లో ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన లెమన్ ట్రీ హోటల్స్‌కి ప్రస్తుతం 28 పట్టణాల్లో 45 హోటళ్ళు ఉన్నాయి. విలాసవంతం, అందుబాటు ధరల్లో మొత్తం నాలుగు రకాల శ్రేణిలో 4697 గదులను(జనవరి 31, 2018 నాటికి) కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం రెడ్ ఫాక్స్, లెమన్ ట్రీ, లెమన్ ట్రీ ప్రీమియర్ పేరుతో 3 బాండ్లు ఉన్నాయి. NCR, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో పాటు టైర్-1, టైర్-2 పట్టణాలైన పూణే, అహ్మదాబాద్, ఛండీఘడ్, జైపూర్, ఇండోర్, ఔరంగాబాద్ తదితర నగరాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. తక్కువ బడ్జెట్‌తో మిడ్ మార్కెట్ హోటల్స్‌లో అగ్రగామి సంస్థల్లో ఒకటి లెమన్ ట్రీ హోటల్స్‌లో ప్రస్తుతం 5వేల మందికి పైగా ఉపాధిని పొందుతున్నారు.

lemontree 16082018 3

మరో పక్క అమరావతిలో 5 స్టార్‌ కేటగిరిలో హోటళ్లను నెలకొల్పే అవకాశాన్ని నోవాటెల్‌, హిల్టన్‌, క్రౌన్‌ ప్లాజా, డబుల్‌ ట్రీ అనే ప్రఖ్యాత గ్రూపులు దక్కించుకున్నాయి. ఒక్కో హోటల్‌లో 200 గదులుంటాయి. ఇవి కాకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలున్న రెస్టారెంట్లు, లాంజ్‌లు, బాంక్వెట్‌ హాళ్లు, పార్కింగ్‌ వసతులు కొలువు దీరతాయి. ఇక.. 4 స్టార్‌ హోటళ్లను స్థాపించేందుకు హాలిడే ఇన్‌, గ్రీన్‌ పార్క్‌, జీఆర్‌టీ, దసపల్లా గ్రూపులు ఎంపికయ్యాయి. ఇప్పటికే వీటి ఏర్పాటుకు సంబంధించిన ఎల్‌ఓఐ (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌- అంగీకారపత్రాలు)లను ఆయా హోటల్‌ గ్రూపులకు జారీ చేసిన సీఆర్డీయే.. మిగిలిన అధికారిక లాంఛనాలను కూడా త్వరలోనే పూర్తి చేయనుంది.

 
Advertisements
Link to comment
Share on other sites

విజయవాడలో ‘స్మార్ట్‌’గా పార్కింగ్‌ ప్రారంభం
17-08-2018 08:00:27
 
636700896287253213.jpg
  • కాళేశ్వర్రావు మార్కెట్లో పైలెట్‌ ప్రాజెక్టు
  • హాజరైన మేయర్‌, కమిషనర్‌
  • మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ
 
అదిగో.. ఇదిగో అంటూ కొంత కాలంగా నగర ప్రజలను ఊరిస్తున్న స్మార్ట్‌ పార్కింగ్‌ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. అక్రమార్జనకు, అడ్డగోలు వసూళ్లకు చెక్‌ పెడుతూ, నగర పాలక సంస్థ ఖజానా నింపే అధునాతన పార్కింగ్‌ ప్రారంభమయింది. స్మార్ట్‌ పార్కింగ్‌ను పైలెట్‌ ప్రాజెక్టుగా పశ్చిమ నియోజకవర్గంలోని కాళేశ్వర్రావు మార్కెట్‌ సెల్లార్లో గురువారం మేయర్‌ కోనేరు శ్రీధర్‌, కమిషనర్‌ జె.నివాస్‌ ప్రారంభించారు. దీంతో పాటు ఎన్టీఆర్‌ కాంప్లెక్సు, కేబీఎన్‌ కాంప్లెక్స్‌ల్లో స్మార్ట్‌ పార్కింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వాహకులు శుక్రవారం నుంచి ఈ పార్కింగ్‌ను అమలు చేయనున్నారు.
 
 
విజయవాడ: మీ వాహనాల పార్కింగ్‌ను ఇక నుంచి మొబైల్‌ యాప్‌ నిర్ణయిస్తుంది. ఇంటి నుంచే పార్కింగ్‌ బిల్లును మీ జేబు లోంచి వసూలు చేస్తుంది. పార్కింగ్‌లో పెట్టిన వాహనానికి ’’నాది గ్యారెంటీ’’ అని భరోసానిస్తుంది. నగర పాలక సంస్థ ఖజనా కు కాసులు నింపుతోంది. అక్రమార్జనకు, అడ్డగోలు పార్కింగ్‌ వసూళ్లకు చెక్‌ పెడుతూ అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ పార్కిం గ్‌ను పైలైట్‌ ప్రాజెక్టుగా పశ్చిమ నియోజక వర్గంలోని కాళేశ్వరరావుమార్కెట్‌ సెల్లార్లో గురువారం ప్రారంభించారు. మేయర్‌ కోనేరు శ్రీధర్‌, కమిషనర్‌ జె.నివాస్‌ ఈ పైలైట్‌ ప్రాజెక్టును ఆరంభించారు. దీంతో పాటు ఎన్టీయార్‌ కాంప్లెక్సు సెల్లార్‌ పార్కిం గ్‌, కేబీఎన్‌ కాంప్లెక్సులోని పార్కింగ్‌లో కూడా స్మార్ట్‌ పార్కింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వాహకులు ఎక్విప్‌మెంట్‌ను అభివృద్ధి చేశారు.
 
శుక్రవారం నుంచి ఆయా ప్రాంతాల్లో కూడా ఈ స్మార్ట్‌ పార్కింగ్‌ అమలవ్వబోతోంది. కార్యక్రమానికి హాజరైన స్మార్ట్‌ పార్కింగ్‌ సంస్థ సీఈవో స్మార్ట్‌ పార్కింగ్‌కు సంబంధించిన ’’పార్క్‌ ఇన్‌ స్లాట్‌’’ పేరుతో ఉన్న మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ సాయంతో నగర వాసులతో పాటు నగరానికి రాకపోక లు సాగించే వారు కూడా వారి వాహనాల ను పార్కింగ్‌ చేసుకునే సౌలభ్యాన్ని ఈ యాప్‌ ద్వారా అందిస్తున్నారు. పైలైట్‌ ప్రాజెక్టు ఫలితాలను బట్టి రాబోయే రోజుల్లో నగరంలోని మరో 17 ప్రాంతాల్లో ఈ స్మార్ట్‌ పార్కింగ్‌ను అభివృద్ధి చేయబోతున్నారు.
 
ఇంటి నుంచి బయల్దేరే నగర వాసి మొద లుకుని, ఇతర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకునే ప్రయాణికుడి వరకు వారి వాహ నాల భద్రతను స్మార్ట్‌గా హ్యాండిల్‌ చేయడా నికి నగర పాలక సంస్థ రెండేళ్లుగా చేస్తున్న కృషి గురువారంతో సాకారమైంది. యాప్‌ ద్వారా గానీ నేరుగా వచ్చిన వాహనదారుల నుం చైనా సైకిల్‌, బైక్స్‌కు రూ.10లు, ఆటో లకు రూ.15లు, ఫోర్‌ వీలర్లకు రూ.30లు చొప్పున మొదటి మూడు గంటలకు పార్కిం గ్‌ సిబ్బంది వసూలు చేస్తారు. ఆ తరువాత ప్రతి రెండు గంటలకూ అదే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
 
మొబైల్‌ యాప్‌ ప్రత్యేకతలు
పార్క్‌ ఇన్‌ స్లాట్‌ అనే ఈ యాప్‌ ద్వారా నగరంలోని ఏయే ప్రాంతాల్లో, ఎన్ని పార్కిం గ్‌ స్లాట్లు అందుబాటులో ఉన్నాయో ముం దుగానే తెలుసుకోవచ్చు. ఆయా స్లాట్‌ పై క్లిక్‌ చేయగానే టూ, త్రీ, ఫోర్‌ వీలర్లకు కావాల్సిన ఖాళీ పార్కింగ్‌ వివరాలు డిస్‌ప్లే అవుతాయి. దాన్ని ఎంపిక చేసుకుని బుక్‌ నౌ అని క్లిక్‌ చేయగానే బుకింగ్‌ స్లాట్‌ కనిపిస్తుంది. అనంతరం డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా చెల్లింపులు చేయాలి. వెంటనే బుక్‌ చేసిన స్మార్ట్‌ ఫోన్‌కు ఓటీపీ(వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) వస్తుంది.
 
 
ఎమ్మెల్యే జలీల్‌ గైర్హాజరు
పార్కింగ్‌ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ను కూడా వీఎంసీ ఆహ్వానించింది. అయితే నియోజకవర్గ స్థాయి బూత్‌కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆయన ఆ ప్రా రంభోత్సవానికి రాలేకపోయారు. అయి తే ఆయన పాల్గొన్న ఆ కార్యక్రమంలో స్మార్ట్‌ పార్కింగ్‌పై పలు విమర్శలు జరి గాయని సమాచారం. వద్దంటే వినకుం డా మేయర్‌, కమిషనర్‌ ఒంటెత్తుపోక డతో స్మార్ట్‌ పార్కింగ్‌ను తీసుకొచ్చారని, దాని వల్ల గతంలో కాంట్రాక్టులు నిర్వ హించుకున్న ప్రైవేటు వ్యక్తులు ఇబ్బం దులు పడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయినట్లుగా తెలుస్తోంది.
 
 
అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట : మేయర్‌
రాష్ట్రంలో మొదటిసారిగా ప్రారంభించిన ఈస్మార్ట్‌ పార్కింగ్‌ ద్వారా అక్రమ వసూళ్లకు, అడ్డగోలు పార్కింగ్‌లకు తెరపడు తుందని నమ్ముతున్నాం. గతంలో ఈ పార్కింగ్‌ విధానాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంవల్ల కార్పొరేషన్‌క తక్కువ ఆదాయం, ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చేవని గుర్తు చేశారు. పార్కింగ్‌ ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించడం వల్ల వాహ నాలకు భద్రత, వీఎంసీకి ఆదాయం అందుతుంది. కమిషనర్‌ ఈస్మార్ట్‌ పార్కింగ్‌ ప్రారంభించడం ఆనందంగా ఉంది.
 
 
20 ప్రదేశాల్లో స్మార్ట్‌ పార్కింగ్‌ : కమిషనర్‌
నగరంలోని ప్రధాన షాపింగ్‌ కాంప్లెక్సుల్లో, పలు కూడళ్లలోని 20 ప్రాంతాల్లో ఈ స్మార్ట్‌ పార్కింగ్‌ను అమలు చేస్తున్నాం. తొలి విడతగా కాళేశ్వరరావు మార్కెట్‌ సెల్లార్లో ప్రారంభించాం. నగర ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా వీలుగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో కూడా తెలుసుకునేందు, రూట్‌మ్యాప్‌లు తెలిసేలా సౌకర్యాలు ఉన్నాయి. అలాగే పార్కింగ్‌ ఫీజులను కూడా డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా చేసుకోవచ్చు. దీని వల్ల చెల్లింపులన్నీ పారదర్శకంగా జరుగుతాయి.
Link to comment
Share on other sites

8 minutes ago, sonykongara said:

1xfp7hK.jpg

How many people/voters aware of the issue that Central Government is not giving approvals? Are TDP Leaders and karyakarthas bringing the awareness in the people? Polavaram vishayam lo kuda konnintiki still NO approvals. Benz Circle Fly Over and Vijayawada Bypass also same troubles from Central Government.

How long will this kind of non-cooperation continue? 

Link to comment
Share on other sites

ప్రకాశం బ్యారేజీ ఇరువైపులా హరితవర్ణంగా మారాలి: చంద్రబాబు
23-08-2018 15:11:01
 
636706338635988356.jpg
 
అమరావతి: విజయవాడ నుంచి ప్రవహించే బందరు కాలువతోపాటు మరో మూడు కాలువలను సుందరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గురువారం సీఆర్డీఏపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోడవరం నుంచి అమరావతి వరకు నదీ తీరప్రాంతం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 27 కిలోమీటర్ల మేర నీలి-హరిత సుందర ప్రాంతంగా తీర్చిదిద్దాలని, ప్రకాశం బ్యారేజీకి ఇరువైపులా హరితవర్ణంగా మారాలని చంద్రబాబు పేర్కొన్నారు.
 
దుర్గగుడికి చుట్టుపక్కల 25 ఎకరాల్లో అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులతో అన్నారు. కన్వెన్షన్ సెంటర్లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్‌, షాపింగ్ కాంప్లెక్స్, సర్వీస్ అపార్టుమెంట్లు, పార్కులు నిర్మించాలన్నారు. కాగా రైల్వే స్టేషన్ నుంచి నేరుగా దుర్గ గుడికి వెళ్లేలా మార్గాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు.
Link to comment
Share on other sites

12 minutes ago, AndhraBullodu said:

Mice convention centre annaduga, idhi varaki mice vaadu convention centre kadathaa annaduga. vizag summit lo anukunta

 

 

bro, MICE ante Meetings, Incentives, Conferencing and Exhibitions (MICE) ani, adi peru kadu anukunta

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...