Jump to content

AndhraPradesh Tourism


Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply
రాష్ట్ర పర్యాటక శాఖకు అంతర్జాతీయ అవార్డు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర పర్యాటక శాఖకు మరో అంతర్జాతీయ అవార్డు లభించినట్లు ఆ శాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా చేపడుతున్న పలు కార్యక్రమాలకు గుర్తింపుగా ఉత్తమ పర్యాటక గమ్యస్థాన నిర్వహణ(బెస్ట్‌ అవార్డ్‌ ఫర్‌ మేనేజ్డ్‌ టూరిస్ట్‌ డెస్టినేషన్‌-ఏపీ టూరిజం) అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖకు అంతర్జాతీయ పర్యాటక, ప్రయాణాల అవార్డుల వేదిక ప్రకటించిందని తెలిపారు. ఈ నెల 29న దిల్లీలో ఈ అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ సంచాలకుడు హిమాన్షు శుక్లా స్వీకరిస్తారని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2017-07-27/Lumbini-Park-to-get-facelift/314893

park_3380.jpgVisakhapatnam: After having initial hiccups for redevelopment works of Lumbini Park, located on the Beach Road opposite AP Tourism Haritha Hotel, the project worth Rs 1.8 crore has been grounded finally to give a facelift for one of the first-generation parks in the Port City, bringing cheers to residents of MVP colony.

 

Highlights:

 
  • The project worth Rs 1.8 crore has been grounded finally to give a facelift for one of the first-generation parks in the Port City 
  •  The new Lumbini park having idyllic hills on one side and the blue sea on the other will get ready in six months and serves as a great tourist attraction, APUGBC official Appanna

According to Greater Visakhapatnam Municipal Corporation (GVMC) officials, the redevelopment project that got selected under Atal Mission for Rejuvenation and Urban Transformation (AMRUT) 2015-16 scheme has been handed over to executing agency AP Urban Greening and Beautification Corporation.

 
 

Though GVMC planned to redevelop the park for the International Fleet Review (IFR) that was held in February this year, but could not able to do so for unknown reasons. 

 

This apart, cyclone Hudhud also caused immense damage to the park in October 2014. A sum of Rs 7 lakh was also spent to prepare a detailed project report (DRP), according to sources.

 

“Earlier, GVMC called for tenders two times but none responded. Later, Visakhapatnam Urban Development Authority (VUDA) came forward to take up the project, but that, too, didn’t pan out. This was the reason for delay. Finally, it was handed over to AP Urban Greening and Beautification Corporation (APUGBC), which will execute the works. The ground levelling works began four days ago,” said Avtar Meher Baba, GVMC executive engineer.
 
“An interactivity space, a still water lotus pond, a children's play area, an entrance plaza, landscaping, a canteen, walking tracks, lighting, parking area and compound wall works will be part of the project,” said APUGBC official Appanna.

 

Emphasising that the idea of the project was not to disturb the earlier mood of the park, Appanna said shaky Buddha statue in the middle of the park will be replaced with a bigger Buddha meditation pose statute and also old sculptures will be used.
The new Lumbini park having idyllic hills on one side and the blue sea on the other will get ready in six months and serves as a great tourist attraction, he added.   

 

Earlier, the locals complained that the historic park has turned into a place for anti-social activities, but this would not be the case any further as the works in the park are going on at a brisk pace, a GVMC official said.  

Link to comment
Share on other sites

దిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ పర్యాటక, ప్రయాణాల అవార్డుల సదస్సు వేదికగా రాష్ట్ర పర్యాటక శాఖకు బెస్ట్ అవార్డ్ ఫర్ మేనేజ్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమములో ఐటిసిటిఎ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ గుప్తా చేతుల మీదుగా ఏపీ పర్యాటక శాఖ ఉప సంచాలకులు కంచర్ల జయ రావు ఈ అవార్డును అందుకున్నారు. ఏపీ టూరిజం నిర్వహిస్తోన్న కార్యక్రమాలు దేశ, విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించటంతో పాటు... ఇక్కడకు వచ్చిన వారికి విశేష అనుభూతుల్ని మిగిల్చేలా ఉన్నాయని వారు తెలిపారు. అందుకే ఈ అవార్డు అందజేస్తున్నట్లు నిర్వాహ‌కులు ప్రకటించారు.

Link to comment
Share on other sites

మేఘాలలో..తేలిపోదామిలా!

హెలీటూరిజానికి త్వరలో శ్రీకారం

ctr-sty1a.jpg

ఆధ్యాత్మిక నగరి తిరుపతికి వచ్చే పర్యాటకులకు త్వరలో సరికొత్త అనుభూతి సొంతం కానుంది. సమయాన్ని ఆదా చేసుకుంటూ సమీపంలోని పలు పర్యాటక ప్రదేశాలను రివ్వున హెలికాప్టర్‌లో చుట్టి వచ్చే అవకాశం త్వరలోనే సాకారం కానుంది. తిరుపతి హెలీటూరిజం ప్రాజెక్టుపై ఇటీవలే అమెరికాకు చెందిన మ్యాక్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వారు దీనిపై పూర్తి ఆసక్తితో ఉండటంతో.. వెంటనే ప్రాజెక్టును ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి.

తిరుపతి: రాష్ట్ర పర్యటక శాఖకు తిరుపతి-తిరుచానూరు మార్గంలోని శిల్పారామం వెనుకభాగంలో సుమారు 14 ఎకరాల స్థలం ఉంది. ప్రస్తుతం ఇది వినియోగంలో లేదు. ముళ్లకంపలు పెరిగి అడవిని తలపిస్తోంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి.. ఇక్కడ శాశ్వత హెలీప్యాడ్‌ నిర్మించాలనేది పర్యాటక శాఖ ప్రతిపాదన. దీనిపై గతంలోనే నివేదికలు పంపారు. ఇప్పుడు తిరుపతికి శాశ్వతమైన పర్యాటక ప్యాకేజీలు వస్తే... ఇక్కడి నుంచే యాత్రికులు వెళ్లేందుకు అనువుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పర్యాటక శాఖ పరిధిలో ఉన్న ఆ భూమిలో నాలుగు ఎకరాలను సుందరంగా తీర్చిదిద్ది.. హెలీప్యాడ్‌తో పాటు చుట్టూ ప్రహరీ, బుక్‌ కౌంటరును ఏర్పాటు చేసేందుకు రూ.60 లక్షలతో ప్రణాళికను పంపారు. హెలీప్యాడ్‌ వైపు వెళ్లే మార్గం, తిరుచానూరు రోడ్డు వైపు నుంచి లోపలికి వెళ్లే దారి ముళ్ల కంపలతో నిండి ఉంది. వీటిని బాగు చేయడంతో పాటు హెలీప్యాడ్‌ సమీపం నుంచి నగరంలోకి శ్రీపురం, కొర్రమేనుగుంట వరకు వచ్చే మార్గలను విస్తరించాలని భావిస్తున్నారు. శిల్పారామం నుంచి బయల్దేరి.. కాణిపాకం, శ్రీకాళహస్తి, చెన్నై నగరాలను కలుపుతూ హెలీటూరిజంలో ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించాలన్నది పర్యాటక శాఖ ప్రతిపాదన. గతంలో బ్రహ్మోత్సవాల సమయంలో పవన్‌ హాన్స్‌ ఆధ్వర్యంలో ఆరు సీట్ల హెలీకాప్టర్లను తిరుపతి నగరంలోనే రెండు ట్రిప్పులు తిప్పేలా ప్రణాళిక వేశారు. సరదాగా ఒకసారి హెలీకాప్టర్‌ ఎక్కాలనుకునే వారికి ఇది బాగానే ఉంది. దీంతో నగరవాసులు చాలామంది దీనిపై ఆసక్తి చూపారు. అది అలా విజయవంతమైంది. కేవలం రూ.2వేల టిక్కెట్‌ను పెట్టడం వల్ల ఆదరణ బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

డిమాండ్‌కు అనుగుణంగా..

హెలీటూరిజానికి శాశ్వత ప్రాతిపదికన ప్యాకేజీలు తయారు చేస్తున్నారు. తిరుపతికి వచ్చే యాత్రికుల్లో ఎక్కువ మంది ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్దామనుకుంటున్నారు? వారిలో సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఎంత శాతం ఉంటారు? ఎలాంటి వారు ఈ హెలీటూరిజానికి ఆకర్షితులవుతారనే విషయాలను త్వరలోనే మ్యాక్‌ ఏవియేషన్‌ ప్రతినిధులు సర్వే చేయనున్నారు. దీన్ని బట్టి ఏ ప్రాంతాలకు తమ సర్వీసులు తిప్పవచ్చో ఓ అంచనాకు వస్తారు. ఇక పర్యాటక శాఖ అధికారులు మాత్రం ప్రాథమికంగా కాణిపాకం, శ్రీకాళహస్తి, చెన్నై ప్రాంతాలకు ఎక్కువ డిమాండ్‌ ఉందని చెబుతున్నారు. తిరుమలకు వచ్చే యాత్రికుల్లో అధికశాతం ఈ మూడు ప్రాంతాలకు ఎక్కువ వెళ్తారని అంచనా వేస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఈ రెండు ఆలయాలకు ఎక్కువగా వెళ్తున్నారని, ఈ సంఖ్య రోజుకు 10 వేల వరకు ఉండొచ్చని అంచనా. వీరిలో ఒక శాతం మందిని హెలీటూరిజం వైపు మళ్లించగలిగినా.. ప్రాజెక్టు విజయవంతం అవుతుందని భావిస్తున్నారు.

త్వరలో కంపెనీ ప్రతినిధుల రాక

మ్యాక్‌ ఏవియేషన్‌ సంస్థ ప్రతినిధులు ఆగస్టు 5వ తేదీ తర్వాత తిరుపతికి వస్తారని పర్యాటక అధికారులు భావిస్తున్నారు. మొదటి విడతలో సాంకేతిక అంశాలను పరిశీలించి వెళతారు. హెలీప్యాడ్‌ ఎక్కడ ఏర్పాటు చేయాలి? పర్యటక అధికారులు ఇచ్చిన ప్రాంతాల్లో హెలీకాప్టర్‌ దిగేందుకు ఉన్న అనువైన పరిస్థితులేంటి? ఎంతమంది రోజుకు తిరుపతికి వచ్చి... ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారనే అన్ని విషయాలను మ్యాక్‌ ప్రతినిధుల బృందం ప్రాథమిక సర్వే చేయనుంది. ఆయా ప్రాంతాలను పరిశీలించేందుకు మరోసారి రానున్నారు. మొదట 6 సీటర్ల హెలీకాప్టర్‌ను ఇస్తామని ఇప్పటికే సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఇది మొదటి విజయవంతంగా నడిస్తే.. మరో రెండు హెలీకాప్టర్లను ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది.

ప్రత్యేక కేంద్రాలు.. ప్రచారం

శాశ్వత హెలీప్యాడ్‌తో పాటు సర్వీసులు మొదలైతే దీనిపై విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు తొలుత తక్కువ ధరతోనే టిక్కెట్లు ఇచ్చి.. రాన్రాను ఆదరణను బట్టి రేట్లు నిర్ణయించనున్నారు. వీటిని ప్రచారం చేసుకోవడానికి, టిక్కెట్లు బుక్‌ చేసుకోవడానికి కార్యాలయాలను తెరవాల్సి ఉంటుంది. దీనికోసం నగరంతో పాటు తిరుమల కొండపై తమకు వెసులుబాటు ఇవ్వాలని సంస్థ ప్రతినిధులు ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే.. ఇప్పటికే ఆధ్యాత్మికంగా అగ్రగామిగా ఉన్న తిరుపతికి వినోదం పరంగానూ ప్రాధాన్యం దక్కనుంది. మధురై నుంచి ప్రత్యేకంగా చిన్న విమానం నడిపేందుకు తంబి ఏవియేషన్‌ సంస్థ ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు. మధురైతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఎక్కువమంది తిరుమలకు వస్తున్నారని దీనికోసం ప్రత్యేక విమానం నడుపుతామని, పర్యాటకశాఖ తరఫున ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. దీన్ని పౌర విమానయాన శాఖ ఆమోదించాల్సి ఉంది.

మాకు సమాచారం వచ్చింది

- సురేష్‌కుమార్‌, డివిజనల్‌ మేనేజరు, పర్యాటకశాఖ

హెలీటూరిజంపై మాకు సమాచారం ఉంది. ఇటీవల ప్రభుత్వంతో ఎంఓయూ కుదిరింది. కంపెనీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలోని సాంకేతిక సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి త్వరలోనే వస్తారు. తర్వాత వీలును బట్టి అతి త్వరలోనే వారు హెలీకాప్టర్లను నడిపేందుకు ఆసక్తితో ఉన్నారు. రకరకాల టూర్లు, ప్యాకేజీలు ఇందులో ఉంటాయి. మొత్తం వారి పరిశీలన పూర్తి అయిన తర్వాతే స్పష్టత వస్తుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...