Jump to content

AndhraPradesh Tourism


Guest Urban Legend

Recommended Posts

పర్యటనలోనూ యోగా యోగం

తొలివిడతగా అరకు, విశాఖలో అందుబాటులోకి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో యోగా పర్యాటకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఏర్పాట్లు చేస్తోంది. ప్రయోగాత్మకంగా విశాఖ, అరకులో ఈ నెలలోనే అమలులోకి తీసుకువచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులకు యోగా తరగతులు నిర్వహించేందుకు ఇందులో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం యోగా శిక్షకుడిని నియమించినట్లు ఏపీటీడీసీ ఇన్‌ఛార్జీ ఎండీ హిమాన్షు శుక్లా వెల్లడించారు. ఈ నెల 16 నుంచి అక్టోబరు వరకు ప్రతి వారంతంలో ఉదయం 7:30 నుంచి 8:30 వరకు ఈ తరగతులను నిర్వహించనున్నారు. విశాఖపట్నం రుషికొండలోని యాత్రి నివాస్‌ సమావేశమందిరంలో ఈ నెల 16, 17 తేదీల్లో, విశాఖలోనే మరోచోట(స్థలం తర్వాత ప్రకటించనున్నారు) అక్టోబరు 30, 31 తేదీల్లో చేపట్టనున్నారు. అలాగే అరకులో ఈ నెల 23న, అక్టోబరు 7న, అరకులోనే మయూరి అతిథి గృహంలో ఈ నెల 24, అక్టోబరు 8న యోగా తరగతులను నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు.

Link to comment
Share on other sites

  • Replies 1.5k
  • Created
  • Last Reply
  • 3 weeks later...
పర్యాటక రంగంలో రూ.11వేల కోట్ల పెట్టుబడులు: మీనా
 
 
విశాఖపట్నం: రాబోయే రెండేళ్లలో పర్యాటక రంగంలో రూ.11వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని మీనా తెలిపారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య 60వేలు కాగా ఇప్పుడు అది 2లక్షలకు చేరిందని, 2020 నాటికి 5లక్షలకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. యుద్ధ నౌక విరాట్‌ను మ్యూజియంగా మార్చే ప్రతిపాదన పరిశీలనలో వుందని, దీనిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై అక్టోబరులో సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పిస్తామన్నారు. 3,4 నెలల్లో రాష్ట్రానికి విరాట్‌ను తీసుకొస్తామన్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

ఆర్థిక రాజధాని విశాఖ

ప్రపంచం మెచ్చుకునే సుందరనగరంగా తీర్చిదిద్దుతా

రోటరీ మోడ్‌ సపరేట్‌ వంతెన ఇంజినీర్లకు ఓ ప్రయోగం: సీఎం

ఆకట్టుకుంటున్న జలంతర్గామి ‘కురుసురా’, ‘టి.యు.-142’ యుద్ధ విమాన ప్రదర్శన

17ap-main3c.jpg

ఈనాడు, విశాఖపట్నం, ఆంధ్రవిశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజధాని అమరావతి అయినా.. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ నగరాన్ని పర్యాటకంగా సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని, ప్రపంచంలో అందరూ ఎప్పుడెప్పుడు విశాఖకు వెళ్తామా..? అని భావించే పరిస్థితి తీసుకొస్తానని చెప్పారు. విశాఖలో మంగళవారం వివిధ అభివృద్ది పనుల శంకుస్థాపన, యుద్ధవిమాన ప్రదర్శనశాల, ఆనంద దీపావళి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విశాఖలో అత్యంత రద్దీగా ఉండే ఎన్‌ఏడీ కూడలిలో రూ.113 కోట్ల అంచనా వ్యయంతో రోటరీ సపరేట్‌ మోడల్‌ పైవంతెనను నిర్మించనున్నారు. దీనికి ఆయన భూమిపూజ చేశారు. తొలుత కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మురికివాడలులేని విశాఖను తీర్చిదిద్దాలన్నది తన ఆలోచన అన్నారు. అందుకే అర్హులకు గృహాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రోటరీ మోడ్‌ సపరేట్‌ తరహా పైవంతెనను పాదచారులకు, పైన.. కింద నుంచి వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండంతస్థులుగా నిర్మిస్తున్నారని, దేశంలోనే ఇలాంటిది తొలి నిర్మాణమని వివరించారు. ఇంజినీర్లకు ఇదో ప్రయోగం అని వ్యాఖ్యానించారు. 18 నుంచి 24 నెలల్లో పనులు పూర్తిచేయాలని గుత్తేదారుకుఆదేశించినట్లు చెప్పారు.

విశాఖలో యుద్ధ విమాన మ్యూజియం

భావితరాల్లో దేశభక్తి, స్ఫూర్తి నింపేందుకే విశాఖలో టి.యు.-142 యుద్ధవిమాన మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనశాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నౌకాదళానికి చెందిన టి.యు.-142 యుద్ధవిమానం కార్గిల్‌ యుద్ధంతో పాటు, పలు ఆపరేషన్లలో 29 సంవత్సరాలు కీలక సేవలందించి... 30 వేల కిలోమీటర్లు తిరిగి శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని వివరించారు. ఈ ప్రదర్శనశాల పిల్లల్లో స్ఫూర్తి నింపుతుందని, పర్యాటకానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మిగిలిన పనులు కూడా వేగంగా పూర్తి చేసి డిసెంబరులో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తామని ప్రకటించారు. రాష్ట్రవాసులకు దీపావళి కానుకగా ఈ ప్రదర్శనశాలను ఇస్తున్నట్టు ప్రకటించారు. జలాంతర్గామి, యుద్ధవిమాన మ్యూజియం ఒకేచోట కొలువుదీరినప్రదేశం ప్రపంచంలోనే ఎక్కడా లేదని మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు. తూర్పునౌకాదళాధిపతి హెచ్‌.సి.ఎస్‌.బిస్త్‌ మాట్లాడుతూ విశాఖ సాగరతీరంలో ఒక పక్క ‘కిల్లర్‌’గా గుర్తింపు పొందిన జలాంతర్గామి ‘కురుసురా’... మరో పక్క జలాంతర్గాములను వేటాడే హంటర్‌గా పేరున్న ‘టి.యు.-142’ యుద్ధవిమానాన్ని మ్యూజియాలుగా ఏర్పాటు చేయడం అరుదైన ఘటనని పేర్కొన్నారు. వుడా వీసీ పి.బసంత్‌కుమార్‌ మాట్లాడుతూ ఎరోబ్రిడ్జ్‌, లిఫ్ట్‌, సావనీర్‌షాప్‌, సిమ్యులేషన్‌ గేమ్స్‌ తదితరాలెన్నింటినో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

17ap-main3b.jpg

రాష్ట్రవ్యాప్తంగా ఆనంద దీపావళి

దీపావళి పండగను ఆనందంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో ‘ఆనంద దీపావళి’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖసాగరతీరంలోఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖ అభివృద్ధికి ఉక్కు సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. విశాఖ నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్‌ను పెద్దఎత్తున అభివృద్ధి చేసి ప్రతిరోజూ సాయంత్రం లక్షల మంది సాగరతీరంలోసేద తీరేలా ఏర్పాట్లు చేయనున్నామని ప్రకటించారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...