Jump to content

Vijayawada Riverfront


Recommended Posts

  • Replies 458
  • Created
  • Last Reply
విజయవాడ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రణాళిక Super User 09 February 2017 Hits: 209  
vijayawada-river-front-09022017-1.jpg

విజయవాడ నగరంలోని రివర్ ఫ్రంట్, కాలువలు పర్యాటక ప్రాంతాలుగానే కాదు, ఇక ఉంచి వాణిజ్య ప్రాంతాలుగా మారనున్నాయి. విజయవాడ నగరంలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పై ముఖ్యమంత్రి చంద్రబాబు, సమీక్ష నిర్వచించారు. ముఖ్యమంత్రికి, సంబంధింత కన్సల్లెంట్లు ప్రజెంటేషన్ అందించారు. ముఖ్యమంత్రి, ఈ ప్రణాళిక పరిశీలించి, మరిన్ని మార్పులతో రావాలని సూచించారు. ముఖ్యంగా, నగరంలో అధ్వాన స్థితిలో ఉన్న కాలువల పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.

దుర్గగుడి, నది తీరంలోని ఘాట్లు, నది చెంతనే ఉన్నకాలువలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలన్నింటిని ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందించారు. మిక్స్ డెవలప్మెంట్ అప్రోచ్ పేరిట ఈ ప్రాజెక్ట్నుఅభివృద్ధిచేస్తారు. ఇందులో బిజినెస్ హోటల్, కన్వెనన్ సెంటర్, సర్వీస్ అపార్ట్ మెంట్లు, మల్టీప్లెక్స్, ఫుడ్ కోర్ట్లు, సెంట్రల్ పార్క్, గ్రీనరీ, పైవంతెనలు, సైకిల్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు ఉంటాయి. అలాగే అంతర్గత జలరవాణా మార్గాల్ని కూడా అభివృద్ధి పరుస్తారు. మరిన్నిఅంశాలు జోడించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు.

 

ప్రస్తుతం ఇచ్చిన ప్రణాళికలు, డిజైన్ల పై అంతగా సంతృప్తి వ్యక్తం చేయని సీఎం తాను సూచించిన విధంగా మెరుగైన ప్రణాళికలు ఆకృతులతో రావాలని ఆదేశించారు.

vijayawada-river-front-09022017-2.jpg

vijayawada-river-front-09022017-3.jpg

vijayawada-river-front-09022017-4.jpg

vijayawada-river-front-09022017-5.jpg

 
 
 
Link to comment
Share on other sites

 
636222006268992897.jpg
  • మౌలిక వసతుల కల్పనకు హడ్కో నిధులు 
  • 33 సీవరేజ్‌ జోన్లుగా రాజధాని ప్రాంతం 
  • ప్లాట్ల స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ భారం ప్రభుత్వానిదే 
  • శరవేగంగా రాజధాని నిర్మాణం.. సమీక్షలో సీఎం 

అమరావతి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి ఇతర మార్గాల్లోనూ ఆదాయం సమకూర్చుకోవడంలో భాగంగా తొలివిడతగా రూ.1000 కోట్ల విలువైన బాండ్లను జారీ చేసేందుకు సీఎం ఆమోదం తెలిపారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఏపీసీఆర్డీయే అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి సమీకరించిన భూముల్లో స్థలాల లేఔట్లను 3 దశల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు అందజేసే రిటర్నబుల్‌ ప్లాట్లన్నింటికీ ప్రభుత్వమే స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చు భరించాలని నిర్ణయించారు. సమావేశానికి హాజరైన అధికారులు తొలుత రాజధాని నగర నిర్మాణ ప్రణాళికలపై సీఎంకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాజధాని నగరాన్ని త్వరితగతిన నిర్మించాలంటే నిధుల సమస్య తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. నిధుల సమీకరణ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే బాండ్ల జారీ వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలని అధికారులకు సీఎం సూచించారు. తొలివిడతగా రూ.1000 కోట్ల బాండ్లను జారీ చేయాలని ఆదేశించారు. రాజధాని నగర ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. భవిష్యత్తులో నగరాభివృద్ధి, జనాభాను దృష్టిలో ఉంచుకుని రాజధాని నగర ప్రాంతాన్ని 33 సీవరేజ్‌ జోన్లుగా విభజించామని అధికారులు సీఎంకి వివరించారు. రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు త్వరలోనే హడ్కో నుంచి రుణం విడుదలవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. భూసమీకరణ ద్వారా సేకరించిన భూముల్లో లేఔట్లు వేసేందుకు వీలుగా త్వరలోనే టెండర్లను ఆహ్వానించాలని అధికారులను సీఎం ఆదేశించారు. టెండర్ల ప్రక్రియలో లిటిగేషన్లు పెట్టి కోర్టులకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు అమరావతిలో అడుగు పెట్టడమే రాజధానికి తొలి విజయంగా సీఎం అభివర్ణించారు. అమరావతికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న ప్రైవేటు విద్యాసంస్థల్లో కొన్నిటిని విశాఖ, తిరుపతికి తరలించి ఈ మూడు నగరాలను ఎడ్యుకేషన్‌ హబ్‌గా 9amaravati.jpgతీర్చిదిద్దాలన్నదే తన ఆలోచనని చంద్రబాబు చెప్పారు. విజయవాడలో రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిపై అధికారులు ప్రజెంటేషన్‌ను ఇచ్చారు. నగరసుందరీకరణ ప్రణాళిక పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. కనకదుర్గ గుడి వద్ద, నదీతీరంలోని స్నానఘట్టాలు, కాలువలు, బస్‌స్టేషన, రైల్వేస్టేషన తదితర ప్రాంతాలన్నింటినీ అతి పెద్ద వాణిజ్య, వినోద సముదాయాలుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రణాళికను అధికారులు సీఎంకి వివరించారు. ‘మిక్స్‌డ్‌ డెవలప్‌మెంట్‌ అప్రోచ’ పేరిట తలపెట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలోని రివర్‌, కెనాల్‌ఫ్రంట్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
 
ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఐఐఎంలు, బిజినెస్‌ స్కూళ్లు, ఆర్కిటెక్చరల్‌ కళాశాలల విద్యార్థులు సీఆర్డీయే అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు వీలుగా రూపొందించిన విధానానికి సీఎం ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యమివ్వాలన్న ఆయన తద్వారా మన రాజధానిని నిర్మించుకొనే సదవకాశాన్ని వారికి కల్పించాలన్నారు. పైగా దీనివల్ల రేపటి తరానికి అమరావతి నిర్మాణ ప్రక్రియపై సంపూర్ణ అవగాహన కలుగుతుందన్నారు. అమరావతిలోని 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్టార్టప్‌ ఏరియాను స్విస్‌ చాలెంజ్‌ విధానంలో అభివృద్ధి చేసేందుకు సీఎం ఆమోదం తెలిపారు. రాజధాని ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌రోడ్ల అలైనమెంట్లలో అవసరమైన మార్పుచేర్పులు చేసి, తుది డిజైన్లను అందించేందుకు 3 మాసాల గడువు ఇస్తున్నట్లు సీఎం చెప్పారు.
Link to comment
Share on other sites



బెజవాడ రివర్ ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది చూడండి !
Written by విశ్వ 


8-2-17-2-copy-1.png





0

SHARES




 


గలగలా పారే క్రిష్ణమ్మ అమరావతికి అందాల హారం కాబోతోంది. అటు రాజధానిలోనే కాదు ఇటు బెజవాడ వరకూ కొత్త బ్యూటిఫికేషన్ ప్లాన్ చూశాక కళ్లు చెదురుతున్నాయ్. భలే ఉందే అనుకునేలోపే మన కళ్లముందుకు వచ్చేస్తుంది ఈ ప్లాన్ అంటోంది ఏపీ !


రాజధానిని తీర్చిదిద్దడంతోపాటు బెజవాడ రూపురేఖలు కూడా మారుతున్న ఏపీలో ! అమరావతికి ఆకర్షణ అద్దేందుకు నిర్మాణాలతోపాటు బ్యూటిఫికేషన్ పైనా దృష్టిపెట్టిన ఏపీ క్రిష్ణమ్మను కొంగొత్తగా ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతోంది. కావాలంటే ఈ దృశ్యాలు చూడండి !


view1.jpg


చుట్టూ కనుచూపుమేర ఆహ్లాదం పరుచుకున్నట్టు… జలరేఖ మన రూపురేఖలు తీర్చిదిద్దుతున్నట్టుగా ఉన్నాయ్ ఈ మోడల్స్. వెనిస్ తరహాలో…అంత భారీస్థాయిలో కాకపోయినా మనకున్నంతో ఇలా రాజధాని ప్రాంతాన్ని అందంగా అమర్చాలన్నది ప్లాన్.


view2.jpg


ఓ వైపు శాశ్వత కట్టడాలు జరుగుతుండగానే ఇలాంటి ఏర్పాట్లపై ఏపీ దృష్టిపెట్టబోతోంది. చూడముచ్చటగా ఉండడమే కాదు టూరిస్ట్ ఎట్రాక్షన్ కూడా అవ్వాలి…అపుడే పని ఒత్తిడి నగరం మీద ఉండదు అనే ఆలోచనతో అమరావతి ఇలా సిద్ధం అవుతోంది. ఇపుడు కనిపిస్తున్న దృశ్యాలు వాస్తవరూపం దాల్చడానికి మరో మూడేళ్లు పడుతుంది అంటున్నారు.





Link to comment
Share on other sites

 

కృష్ణా తీరాన సందడి చేసిన హాట్ ఎయిర్ బలూన్స్...

 

Super User

 

 

13 February 2017

 

Hits: 63

 

 

hot-air-13022017.jpg

గత మూడు రోజులుగా ఇబ్రహీంపట్నంలోని పవిత్రసంగమం వద్ద జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు , అదే విధంగా అమరావతి మ్యూజిక్, డాన్స్ ఫెస్టివల్ సంధ్రభంగా, కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన హాట్ ఎయిర్ బలూన్స్ , ప్యారాచూట్స్ ప్రదర్శన ఆకట్టుకుంది.

అమరావతిలో, కృష్ణా నది తీరాన, ప్రజలను పర్యాటకంగా ఆకట్టుకుంటానికి త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. విశాఖలో జరిగిన CII సమ్మిట్ లో, కొన్ని కంపెనీలతో ప్రభుత్వం ఇందుకు గాను, అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

Link to comment
Share on other sites

@swarnandhra,

 

Also, This one was tweeted by Sagarika Ghosh but the power lines spoiled it same as above.

But the view from there is best that you don't get any city in India with such fresh water and green hills.

 

C4YJJBUWYAAKk-Q.jpg

ee Pic Lotus Hotel nunchi karakatta medhaki enter ayye place lodhi..

 

kondaveeti vaagu n krishna river kalise place.. Okapakka Kondaveeti vaagu inko pakka krishna river madhyalo Road

:cheers:

Link to comment
Share on other sites

Our camp on the river island of Krishna river at Amaravati - shot from hot air balloon #travel #travelphotography #ttot #arialshot

 

 

:super:

 

/************************

Very soon we will see Asia's first floating piers connecting Bhavani islands(not the ones below)

 

C4sk5jGWYAApUn6.jpg

Link to comment
Share on other sites

Our camp on the river island of Krishna river at Amaravati - shot from hot air balloon #travel #travelphotography #ttot #arialshot

 

 

:super:

 

/************************

Very soon we will see Asia's first floating piers connecting Bhavani islands(not the ones below)

 

C4sk5jGWYAApUn6.jpg

island peru emiti bro

Link to comment
Share on other sites

This one is away from Bhavani/Barrage and near Ibrahimpatnam. AP Tourism just named it Bhavani island#7

 

This is the smallest and not well known but they found better location for Adventure camping

bro e islands mottam photos pedtava river lo unna islands lanakalu anii kaliapi plzz try cheyyi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...