Jump to content

గన్నవరం 'హైటెక్' ప్రారంభం


satya

Recommended Posts

విజయవాడ : గన్నవరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హెటెక్ సిటీని గురువారంనాడు ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జాతికి అంకితం చేస్తున్నారు. ఈ హైటెక్ సిటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో 70 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టిన 1.92 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న మొదటి టవర్ 'మేథ'ను ముఖ్యమంత్రి రోశయ్య నేడు ప్రారంభిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవం ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. నిర్మాణ రంగంలో ప్రఖ్యాతి వహించిన ఎల్ అండ్ టి హైటెక్ సిటీ లిమిటెడ్, ఇన్ ఫో సిటీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ సిటీ నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి.

Link to comment
Share on other sites

చెన్నై - కోల్ కతా ఐదో నెంబర్ జాతీయ రహదారి పక్కన, గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా 30 ఎకరాల్లో ఈ హైటెక్ సిటీని నిర్మిస్తున్నారు. సిటీ నిర్మాణం మొత్తం అంచనా ఖర్చు 425 కోట్ల రూపాయలు. మొత్తం ఐదు టవర్లుగా నిర్మించే గన్నవరం హైటెక్ సిటీ తొలి టవర్ లో ఇప్పటికే రెండు సాఫ్ట్ వేర్ సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మొత్తం 11 లక్షల చదరవు అడుగుల విస్తీర్ణంలో వీటి నిర్మాణం జరుగుతుంది. దానితో పాటు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సిబ్బంది నివాస గృహాలు నిర్మించాలని కూడా ప్రణాళిక సిద్ధమైంది. హైటెక్ సిటీ మొత్తం పూర్తయితే ప్రత్యక్షంగా 12 వేల మందికి, పరోక్షంగా 36 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ టవర్ లో ఫుడ్ కోర్ట్, ఫిట్ నెస్ సెంటర్, బిజినెస్ సెంటర్, బ్యాంక్, ఎటిఎం, హెల్ప్ డెస్్, ఆంప్తి థియేటర్ ఏర్పాటు చేశారు.

Link to comment
Share on other sites

విజయవాడ : గన్నవరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హెటెక్ సిటీని గురువారంనాడు ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జాతికి అంకితం చేస్తున్నారు. ఈ హైటెక్ సిటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో 70 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టిన 1.92 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న మొదటి టవర్ 'మేథ'ను ముఖ్యమంత్రి రోశయ్య నేడు ప్రారంభిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవం ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. నిర్మాణ రంగంలో ప్రఖ్యాతి వహించిన ఎల్ అండ్ టి హైటెక్ సిటీ లిమిటెడ్, ఇన్ ఫో సిటీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ సిటీ నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి.

:shakehands::lol2:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...