Jump to content

BRS Assam


Recommended Posts

36 minutes ago, sonykongara said:

CBN chilaki cheppinattu cheppadu vare thagu bhothu na konde manam eddaramu kalasi undamu, manam manam kottukunte national parties mana eddari kalapi mingutaru ani, vini chachada CBN ni vp laga chusthu , nenu  desh ki netha ni vedesh ki nethani sollu kabrulu mingadu ippudu  dula tirindi vedava ki..

😂😂

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

CBN chilaki cheppinattu cheppadu vare thagu bhothu na konde manam eddaramu kalasi undamu, manam manam kottukunte national parties mana eddari kalapi mingutaru ani, vini chachada CBN ni vp laga chusthu , nenu  desh ki netha ni vedesh ki nethani sollu kabrulu mingadu ippudu  dula tirindi vedava ki..

Avvali kodukki 

Link to comment
Share on other sites

Aroori Ramesh: భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ భాజపాలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు.

Link to comment
Share on other sites

Mallareddy: రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది నేనే: మల్లారెడ్డి

రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది తానేనని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు. 2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంలో తాను స్వయంగా రేవంత్‌రెడ్డితో ఈ విషయం చెప్పినట్లు ఆయన తెలిపారు.

Link to comment
Share on other sites

బీఎస్పీకి ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా

బహుజన సమాజ్‌పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన భారాస అధినేత కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Published : 17 Mar 2024 04:02 IST
 
 
 
 
 
 

భారాసతో పొత్తు రద్దు చేసుకోవాలన్న అధిష్ఠానం
ఆ ఆదేశాలపై అసంతృప్తితో నిర్ణయం
తమ పార్టీ తరఫున పోటీ చేయాలన్న కేసీఆర్‌
ఒకటిరెండు రోజుల్లో చెప్తానని ప్రవీణ్‌ వెల్లడి

gh160324politics8a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: బహుజన సమాజ్‌పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన భారాస అధినేత కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ పార్టీలో చేరి నాగర్‌కర్నూల్‌ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రవీణ్‌ను కేసీఆర్‌ ఆహ్వానించగా.. ఒకటి, రెండురోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం ప్రవీణ్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘లోక్‌సభ ఎన్నికల్లో భారాసతో పొత్తు పెట్టుకున్నాం. మాకు నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ సీట్లు కేటాయించారు.. బీఎస్పీ కేంద్ర సమన్వయకర్త అనుమతితోనే ఈరెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాం. తర్వాత కార్యకర్తల సమావేశం జరిపి.. విధివిధానాలు నిర్ణయించాం. ఇదంతా నచ్చని భాజపా, బీఎస్పీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొచ్చింది. భారాసతో పొత్తు రద్దు చేసుకోవాలని.. ఆ విషయం మీడియా సమావేశం పెట్టి చెప్పాలని నాకు ఆదేశాలొచ్చాయి. 26 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ రాజీ పడలేదు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చిన మాటను రద్దు చేసుకోవాలని భాజపా చేస్తున్న కుటిల యత్నాలకు తలొగ్గితే.. దేశవ్యాప్తంగా ఉన్న బహుజనులకు అన్యాయం చేసినవాడినవుతా. అందుకే నేను బీఎస్పీకి రాజీనామా చేశా. నా నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు స్వాగతించాలి’’ అని ప్రవీణ్‌కుమార్‌ వివరించారు. బీఎస్పీకి ప్రవీణ్‌ రాజీనామాతో భారాసతో పొత్తు విచ్ఛిన్నమైంది. దీంతో మొత్తం 17 స్థానాల్లో పోటీచేయాలని భారాస నిర్ణయించింది. ప్రవీణ్‌కుమార్‌ ఒకటి, రెండు రోజుల్లో భారాసలో చేరితే ఆయనకు నాగర్‌కర్నూల్‌ సీటిచ్చి, హైదరాబాద్‌కు మరో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

రాజీనామాపై ‘ఎక్స్‌’లో ఏం చెప్పారంటే..

బీఎస్పీకి రాజీనామాపై ప్రవీణ్‌కుమార్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ప్రియమైన బహుజనులారా.. కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చినందున నేను ఈ విషయాన్ని మీతో తప్పక పంచుకోవాలి. దయచేసి నన్ను క్షమించండి. బరువెక్కిన హృదయంతో బీఎస్పీని వీడాలని నిర్ణయించుకున్నాను. బీఎస్పీ-భారాస పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే భాజపా.. దీన్ని భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తోంది. బీఎస్పీ అధినేత మాయావతికి ధన్యవాదాలు. చివరివరకు బహుజన వాదాన్ని నా గుండెలో దాచుకుంటా’’ అని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

కాంగ్రెస్‌లో చేరిన వరంగల్‌ ఎంపీ పసునూరి

వరంగల్‌ భారాస ఎంపీ పసునూరి దయాకర్‌ పలువురు కార్పొరేటర్లు, అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. శనివారం గాంధీభవన్‌లో మంత్రి కొండా సురేఖ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Published : 17 Mar 2024 04:06 IST
 
 
 
 
 
 

gh160324politics6a.jpg

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ భారాస ఎంపీ పసునూరి దయాకర్‌ పలువురు కార్పొరేటర్లు, అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. శనివారం గాంధీభవన్‌లో మంత్రి కొండా సురేఖ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల సమయంలో చాలా మంది భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నా, కేసీఆర్‌ వాళ్లను బెదిరించి రాకుండా ఆపారన్నారు. ఎంపీ పసునూరి దయాకర్‌ మాట్లాడుతూ వరంగల్‌లో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి భారాసను భ్రష్టు పట్టించారని, తనకు సమాచారం ఇవ్వకుండా పార్టీ సమావేశాలు పెట్టారని తనపై వివక్ష చూపించారని ఆరోపించారు. వరంగల్‌లో ఏ కార్యక్రమాలకు వెళ్లాలన్నా నేను అనుమతి తీసుకోవాలా? అని పసునూరి ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...