Jump to content

లోకేశ్‌ పై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు


rajanani

Recommended Posts

Posted

లోకేశ్‌ సహా తెదేపా నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సహా మరికొందరికిపై మంగళగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. తెదేపా కార్యాలయంపై దాడి అనంతరం అక్కడికి వచ్చిన సీఐ నాయక్‌పై దాడి చేశారననే అభియోగంపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఏ-1గా నారా లోకేశ్‌, ఏ-2గా అశోక్‌బాబు, ఏ-3గా ఆలపాటి రాజా, ఏ-4గా తెనాలి శ్రవణ్‌ కుమార్‌, ఏ-5గా పోతినేని శ్రీనివాసరావు సహా మరికొందరిపై  ఈ కేసులు నమోదు చేశారు. 

Posted

టీడీపీ ఆఫీసులో దొరికింది “సీఐ”నే..కాకపోతే రివర్స్ కేసులు ! 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన సమయంలో ఒకరిని టీడీపీ నేతలు పట్టుకున్నారు. అతన్ని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. తాను డీజీపీ కార్యాలయంలో పని చేస్తున్నానని అతను చెబుతున్నారని.. అల్లరి మూకలతో కలిసి ఆయన ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఆయన నిజంగా డీజీపీ ఆఫీసులో పని చేస్తూ ఉంటే అది స్టేట్ స్పాన్సర్డ్ దాడులేనని అశోక్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్ వంటి వారు స్పష్టంచేశారు. తర్వాత ఆయనను తీసుకెళ్లి మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో అప్పగించి.. దాడుల్లో పాల్గొన్న వ్యక్తిగా ఫిర్యాదు ఇచ్చారు. అయితే టీడీపీ ఆఫీసులో సివిల్ డ్రెస్‌లో ఉండి.. ఎలాంటి గుర్తింపు కార్డులు లేని ఆ వ్యక్తి నిజంగానే డీజీపీ ఆఫీసులో పని చేస్తున్నారని గుర్తించారు. ఆయన పేరు నాయక్ అని తేలింది. అదీ కూడా పోలీసులు టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సీఐ నాయక్‌పై దాడి చేశారని పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడంతోనే తెలిసింది. నారా లోకేషన్‌ను ఈ కేసులో ఎ-వన్‌గా చేర్చారు. ఏ-2గా అశోక్ బాబు, ఏ -3గా ఆలపాటి రాజాను పేర్కొన్నారు. హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై రెండు వందల మంది దాడి చేసినా.. ఓ డీఎస్పీ, మరో పోలీసు మాత్రమే వచ్చారని .. కనీస భద్రత కూడా కల్పించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అనూహ్యంగా సివిల్ డ్రెస్‌లో ఎలాంటి ఐడీ కార్డు కూడా లేకుండా సీఐ తమ ఆఫీసులో ఉండటం.. విధ్వంసం జరుగుతున్నప్పుడు అతను కూడా అక్కడే ఉండటాన్ని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పోలీసులతో కలిసే వైసీపీ నేతలు దాడులు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అల్లరి మూకలతో పాటు సీఐ వచ్చారని ఆరోపిస్తూ.. తమకు దొరికిన వ్యక్తిని మీడియా ముందు వ్యక్తిని ప్రవేశ పెట్టడం.. అతను నిజంగానే పోలీసుగా తేలడం.. రివర్స్‌లో కేసులు పెట్టడం రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది.

Posted

ఒక సర్కిల్ ఇన్ స్పెక్టర్ ను హత్య చేయబోయాడు అని నారా లోకేష్ ను A1 గా హత్యా యత్నం కేసు పెట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వం

A1 నారా లోకేష్ A2 అశోక్ బాబు A3 ఆలపాటి రాజా A4 శ్రవణ్ కుమార్

Posted

పార్టీ ఆఫీస్ కి 8:30 కి వచ్చిన నా మీద 6:30 ఎటాక్ చేశాను అని కేసు పెట్టారు the great AP police - Nara Lokesh

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...