Jump to content

మా’లో ముసలం


RamaSiddhu J

Recommended Posts

హైదరాబాద్‌: ‘మేమంతా ఒకే కుటుంబం. మాది సినిమా కుటుంబం. అందరం కలిసే ఉంటాం’ గత కొద్ది రోజులు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల సందర్భంగా వినిపించిన మాటలివి. త్వరలో ‘మా’ కుటుంబం ముక్కలు కానుందా? ఎన్నికల ముగిసినా అభిప్రాయ భేదాలు ఇంకా సద్దుమణగలేదా? అంటే ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లో గెలిచిన సభ్యులూ ‘మా’ని వీడతారని తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రచారం మొదలైంది. ‘మా’కు పోటీగా మరో అసోసియేషన్‌ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ‘ఆల్‌ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(ఆత్మా) పేరుతో కొత్త అసోసియేషన్‌ ఉండనుందని సమాచారం.  ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయవాదం ప్రచారాస్త్రంగా మంచు విష్ణు ప్యానెల్‌ ప్రచారం చేసింది. తెలుగు నటీనటులు ఉన్న అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా తెలుగువాడినే ఎన్నుకోవాలని పలువురు నటులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీనిపై ప్రకాశ్‌రాజ్‌ కూడా పలు వేదికల మీద స్పందించారు. తాను తెలుగు వాడిని కాకపోవటం దురదృష్టకరమని అన్నారు. తన తల్లిదండ్రులు తెలుగువాళ్లు కాకపోవటం తన తప్పా? అంటూ వాపోయారు.

 

ఆదివారం జరిగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. దీంతో ప్రాంతీయవాదం ఉన్న ‘మా’లో తాము కొనసాగలేమని అసోసియేషన్‌ ప్రాథమిక సభ్యత్వానికి సినీ నటుడు నాగబాబు రాజీనామా చేయగా, మరుసటి రోజే ప్రకాశ్‌రాజ్‌ కూడా అదే బాటలో నడిచారు. ‘అతిథిలా వచ్చాను.. అతిథిలానే ఉంటాను’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. చివరిగా ‘ఇప్పుడే మొదలైంది’ అంటూ ప్రెస్‌మీట్‌ ముగించడంతో ఏదో జరగబోతోందని చిత్ర పరిశ్రమలో టాక్‌ మొదలైంది. అన్నట్లుగానే ఇప్పుడు మరో అసోసియేషన్‌ ఏర్పాటుపై ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో తాను గెలిచి తమ ప్యానెల్‌ అధ్యక్షుడు ప్రకాశ్‌రాజ్‌ గెలవకపోవటం దురదృష్టకరమని శ్రీకాంత్‌ సైతం విచారం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి గెలిచిన సభ్యులు కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మంగళవారం సాయంత్రం 5గంటల తర్వాత ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ ప్రెస్‌మీట్‌ పెట్టనుండటంతో వారు ఏం మాట్లాడతారా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.

 

 

Link to comment
Share on other sites

  • Replies 129
  • Created
  • Last Reply
1 minute ago, Hero123 said:

ATMAA anta gaa.. Mohan uncle gattiga thaluchukunte 1 month lo cheelchesthadu.. appudu anniya Anthrathmaa ani pettukovali..

ప్రేతాత్మ అని పెడితే ఇంకా బాగుంటుంది

Link to comment
Share on other sites

హైదరాబాద్‌: ‘సినిమా బిడ్డలం’ ప్యానెల్‌ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని అన్నారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్‌ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారని అన్నారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని అన్నారు. తమ ప్యానెల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి, ‘మా’ సభ్యుల తరపున నిలబడతామని స్పష్టం చేశారు.

అప్పుడే రాజీనామా వెనక్కి తీసుకుంటా..

‘‘నేను మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. అందుకు మంచు విష్ణు స్వీకరించనని అన్నారు. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. కానీ, ఒక షరతు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘మా’ నియమ, నిబంధనలు మార్చి, ‘తెలుగువాడు కాని వ్యక్తి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదు’ అని మీరు మార్చకపోతే మా సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటా. ఒకవేళ మారిస్తే, ఓటు వేయడానికో, గెలిపించడానికో నాకు ఇష్టం లేదు’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు

Link to comment
Share on other sites

20 minutes ago, krish2015 said:

Nothing will happen 

New association petti nadapaleka handsup chesi memu VP gallam ani malli okkasari prove chesukuntaru.

జరిగేది అదే. ఈ లేకిబ్యాచ్ జెబులోనుంచి పైసా తియ్యరు గానీ, అందరూ వీళ్ళు చెప్పినట్టు చెయ్యాలి

Link to comment
Share on other sites

పదవులు లేకపోయినా అండగా ఉంటాం: శ్రీకాంత్

పదవులు లేకపోయినా విష్ణుకు అండగా ఉంటామని కథానాయకుడు శ్రీకాంత్‌ అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌నుంచి విజయం సాధించిన ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎవరు ఓటు వేసినా, ఒక ప్యానెల్‌ మొత్తానికి ఓటేయండి అని మేము మొదటి నుంచి ‘మా’ సభ్యులను కోరుతున్నాం. పని బాగా జరగాలంటే అది ముఖ్యం. మెంబర్స్‌ ఉన్న వాళ్లలో అందరూ అందరికీ నచ్చాలని లేదు. ఆ ప్యానెల్‌లో కొంతమంది, ఈ ప్యానెల్‌లో కొంతమంది గెలిచాం. అన్నేసి మాటలు అనుకున్నాకా కలిసి పనిచేయగలమా అనిపించింది. మా ప్యానెల్‌లోని సభ్యులు నిన్నే రాజీనామా చేస్తానని అన్నారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో ఇలాగే కలిసి పనిచేసినప్పుడు విభేదాలు తలెత్తాయి. ఏ సమస్య ఎత్తి చూపినా ‘మమ్మల్ని పనిచేయనీయడం లేదు’ అని అంటారు. విష్ణు నాకు సోదరుడులాంటి వారు. నరేశ్‌గారు చాలా అద్భుతంగా ఎన్నికలను నడిపించారు. తన అనుభవంతో కృష్ణుడిలా చక్రం తిప్పి విష్ణుకు విజయం చేకూర్చారు. ఆయన విష్ణు వెనుక ఉన్నప్పుడు మేము ఏదైనా అంటే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. మా ప్యానెల్‌లో ఉన్న వారంతా తప్పు జరిగితే ప్రశ్నించే ధైర్యవంతులు. మేం వెళ్లి ప్రశ్నిస్తే మళ్లీ గొడవలు అవుతాయి. పదవులు లేకపోయినా అందరికీ మేం అండగా ఉంటాం. మా అసోసియేషన్‌లో పరిణామాలపై చాలా సహిస్తూ వచ్చాను. నరేశ్‌ నన్ను అనేక మాటలు అన్నా భరించాను’’అని శ్రీకాంత్‌ అన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...