rajanani Posted June 30, 2021 Posted June 30, 2021 NITI Aayog: ఆ వైద్యాలయాలు.. లాభాలు చూసుకోవు! సత్యసాయి... బసవతారకం ఆసుపత్రుల సేవలు ఓ ఉదాహరణ వాటికిచ్చే విరాళాలకు వంద శాతం పన్ను మినహాయింపునివ్వాలి ప్రభుత్వాల నుంచి రీఎంబర్స్‌మెంట్ వేగంగా అందించాలి నీతి ఆయోగ్ నివేదికలో ప్రస్తావన ఈనాడు, దిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి తెలుగురాష్ట్రాల్లో లాభాపేక్ష లేకుండా ఉన్నత వైద్యాన్ని అందిస్తున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలో లాభాపేక్షలేని ఆసుపత్రుల విధానం (నాట్ ఫర్ ప్రాఫిట్ ఆసుపత్రి మోడల్) పేరుతో మంగళవారం విడుదల చేసిన నివేదికలో తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు ఆసుపత్రులు అందిస్తున్న వైద్యసేవల గురించి ప్రస్తావించింది. ‘లాభాలకోసం పనిచేసే ప్రైవేటు ఆసుపత్రుల గురించిన వివరాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నా, లాభాపేక్ష లేకుండా పనిచేసేవాటి గురించి సరైన సమాచారం లేదు. ఇప్పుడు ఆ లోటును భర్తీచేస్తున్నాం. అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్న ఆసుపత్రుల సేవల గురించి తెలియజేయడానికే ఈ నివేదికను తీసుకొస్తున్నాం’ అని నీతిఆయోగ్ పేర్కొంది. ఈ వైద్యాలయాలు వ్యాధి వచ్చిన వారికి సేవలందించడమే కాకుండా, అసలు రోగం రాకుండా ముందుగానే నియంత్రించేందుకు సేవలు అందిస్తున్నట్లు నివేదికలో ప్రశంసించింది. ప్రైవేటుతో పోలిస్తే ఇలాంటి ఆసుపత్రుల్లో వైద్యఖర్చులు ఇన్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్‌లో 25% తక్కువ ఉన్నట్లు పేర్కొంది. డాక్టర్లు, సర్జన్ల ఛార్జీలు 36%, పడకలు ఛార్జీలు 44%మేర తక్కువ ఉన్నట్లు తెలిపింది. ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్యసేవలు అందించడం కోసం మార్కెట్‌తో పోలిస్తే డాక్టర్లకు 50-75%, ఇతర సిబ్బందికి 20-30% తక్కువ వేతనాలు అందిస్తున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. ఈ ఆసుపత్రులకు సెక్షన్ 80 జీ కింద విరాళాలు ఇచ్చే వారికి పన్ను మినహాయింపును 50%కి పరిమితం చేయకుండా దాన్ని 100%కి విస్తరించాలని సూచించింది. తక్కువ వడ్డీతో వర్కింగ్ కేపిటల్ రుణాలు అందించాలనీ ప్రభుత్వాన్ని కోరింది. కోఆపరేటివ్ ట్రస్ట్ ఆసుపత్రుల సభ్యత్వ రుసుములకు ఆదాయపన్ను మినహాయంపునివ్వాలని పేర్కొంది. ఈ ఆసుపత్రులు పేదలకు అందించిన వైద్యసేవలకు ప్రభుత్వాల నుంచి సకాలంలో రీఎంబర్స్‌మెంట్ రావడంలేదని, నిరంతరం ఇందుకోసం వెంటపడినా దీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి సింగిల్‌విండో క్లియరెన్స్ విధానం ప్రవేశపెట్టాలని సూచించింది. సకాలంలో బిల్లులు చెల్లించడంవల్ల ఈ ఆసుపత్రులకు వర్కింగ్‌కేపిటల్ సమస్య కొంతమేర తీరుతుందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.
aditya369 Posted June 30, 2021 Posted June 30, 2021 Puttaparti hospital evaru maintenance chestunnaru
rajanani Posted June 30, 2021 Author Posted June 30, 2021 41 minutes ago, aditya369 said: Puttaparti hospital evaru maintenance chestunnaru
Telugunadu Posted June 30, 2021 Posted June 30, 2021 Balayya......Man with a Golden heart. దైవం మానుష రూపేణా.
Uravakonda Posted June 30, 2021 Posted June 30, 2021 4 hours ago, Telugunadu said: Balayya......Man with a Golden heart. దైవం మానుష రూపేణా.
raavikp Posted June 30, 2021 Posted June 30, 2021 Hospital... a great initiative by NTR garu and hats off 👏to NBK for his dedication to run this with high quality...
aditya369 Posted July 1, 2021 Posted July 1, 2021 12 hours ago, God Of Masses said: Meelanti donors valla chala help avutundi
Yaswanth526 Posted July 1, 2021 Posted July 1, 2021 అవార్డులు , రివార్డుల కోసం కాదు. లాభాపేక్ష లేని ఆస్పత్రి మాది - హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.