Jump to content

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా దర్శకేంద్రుడి కొత్త సినిమా


Ramesh39

Recommended Posts

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా దర్శకేంద్రుడి కొత్త సినిమా

28brk=ragha.jpg

హైదరాబాద్‌: అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా తన కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘నా యాభై ఏళ్ల సినీ జీవితంలో అన్నగారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఈ సినిమా ఎంతో ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాను’ అని పేర్కొంటూ.. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

ఆ ఫొటోలో.. ‘ముగ్గురు దర్శకులతో, ముగ్గురు హీరోయిన్స్‌తో దర్శకేంద్రుడి సినిమా. హీరో?’ అన్న క్యాప్షన్‌ కూడా రాసుంది. దీనిని బట్టి చూస్తే ఈ సినిమాను రాఘవేంద్రరావుతో పాటు మరో ఇద్దరు దర్శకులు కూడా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. 2017లో వచ్చిన ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...