Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
కూకట్‌పల్లి ఓటర్లకు నారా లోకేశ్ ఏం చెప్పారంటే...
17-11-2018 14:19:16
 
636780611542009564.jpg
హైదరాబాద్: కూకట్‌పల్లి శాసనసభ స్థానానికి మహాకూటమి అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని నామినేషన్ దాఖలు చేశారు. ఎన్టీఆర్, హరికృష్ణ వారసురాలిగా రాజకీయాల్లోకి వస్తున్న సుహాసినికి నందమూరి కుటుంబ సభ్యులు అండగా నిలుస్తున్నారు. నందమూరి బాలకృష్ణ దగ్గరుండి సుహాసిని చేత నామినేషన్ వేయించగా.. సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. తమ అక్కకు మద్దతివ్వాలంటూ ట్విట్టర్‌ ద్వారా ఓటర్లను అభ్యర్థించారు.
 
 
తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా సుహాసినికి మద్దతు కోరుతూ ట్వీట్ చేశారు. ‘‘పేదల పెన్నిధిగా, బడుగు వర్గాలకు ఆత్మీయునిగా సేవలందించిన ఎన్టీఆర్‌ను తెలంగాణ ప్రజలు గుండెకు హత్తుకున్న తీరు మరువలేనిది. ఈ గడ్డపై పార్టీ పెట్టిన ఎన్టీఆర్, ఈ గడ్డపైనే అమరులయ్యారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ సైతం తెలంగాణలోనే ఆఖరిశ్వాస తీసుకున్నారు. ఈరోజు ఎన్టీఆర్, హరికృష్ణల వారసురాలు నందమూరి సుహాసిని, తాతగారి ఆశయాలతో, తండ్రి ఆకాంక్షలతో, మావయ్య చంద్రబాబు గారి ఆశీస్సులతో ప్రజలకు సేవచేసేందుకు ముందుకొచ్చారు. ఆమెను అఖండ మెజారిటీతో గెలిపించి ఎన్టీఆర్, హరికృష్ణలకు అసలైన నివాళి అందించాలని కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను.’’ అంటూ నారా లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

సామ’కు ‘క్యామ’ మద్దతు
17-11-2018 02:01:28
 
636780168892152017.jpg
  • ఇబ్రహీంపట్నంలో అనూహ్య పరిణామం
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌)
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టికెట్‌ విషయంలో కాంగ్రెస్‌ స్ర్కీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌ కుమారుడు రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారని, మల్‌రెడ్డి రంగారెడ్డికి టికెట్‌ అమ్ముకున్నారని ఆరోపణలు గుప్పించిన రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మల్‌రెడ్డి రంగారెడ్డికి కాకుండా పొత్తులో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం టికెట్‌ కేటాయించడంతో నిర్ణయం మార్చుకున్నారు. ఈ మేరకు సామ రంగారెడ్డి శుక్రవారం మల్లేశ్‌ ఇంటికి వెళ్లి మద్దతు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.
Link to comment
Share on other sites

తిరుగుబాటు వద్దు 
టికెట్‌ రాని వారికి బుజ్జగింపులు 
హరికృష్ణ సేవల దృష్ట్యా సుహాసినికి టికెట్‌: చంద్రబాబు 
16hyd-main8a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: సీటు, టికెట్‌ రాలేదన్న ఆవేశంలో తిరుగుబాటు నామినేషన్లు వేయకుండా పార్టీ నేతలను తెలుగుదేశం పార్టీ బుజ్జగిస్తోంది. తెలంగాణకు చెందిన పలువురు నేతలను శుక్రవారం అమరావతికి పిలిపించి పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ.పెద్దిరెడ్డి, ఇబ్రహీంపట్నం తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆర్‌.భీంరెడ్డి, అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన సామ రంగారెడ్డి, కుత్బుల్లాపూర్‌ సీటు కోసం అక్కడి నేతలు హన్మంతరావు నాయకత్వంలో అమరావతి వెళ్లి చంద్రబాబును కలిశారు. మహాకూటమి ఏర్పాటు ఆవశ్యకత, జాతీయ స్థాయిలో పార్టీకి ఉన్న అవసరాలు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏర్పడే పొత్తు అంశాలను చంద్రబాబు వారికి వివరించారు. తప్పక గెలిచే స్థానాలనే తీసుకున్నామని, అక్కడ నేతలంతా సహకరించాలని కోరారు.

16hyd-main8b.jpg

నేడు సుహాసిని నామినేషన్‌ 
నందమూరి హరికృష్ణ తెదేపాకు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఆయన కుమార్తె నందమూరి సుహాసినికి కూకట్‌పల్లి టికెట్‌ కేటాయించామని చంద్రబాబు వివరించారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అదే స్థానాన్ని ఆశిస్తున్న పెద్దిరెడ్డికి చెప్పారు. దీంతో ఆమె విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం సుహాసిని కూకట్‌పల్లి స్థానానికి నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక నేతలంతా పాల్గొనాలని నిర్ణయించినట్లు పెద్దిరెడ్డి చెప్పారు. శాసనసభా నియోజకవర్గాల వారీగా అసంతృప్తులను బుజ్జగించడానికి ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసింది. పార్టీ సీనియర్‌ నేతలకు ఒక్కొక్కరికీ పదేసి స్థానాల పర్యవేక్షణ అప్పగించింది. టికెట్‌ ఆశించి భంగపడిన నేతలకు మరో విధంగా అవకాశాలు కల్పిస్తామని సర్దిచెబుతున్నారు. తెదేపాకు కేటాయించిన 14 స్థానాల్లో నామినేషన్ల ఘట్టం సక్రమంగా జరిగేలా నియోజకవర్గానికి ఒక్కో న్యాయవాదిని నియమించారు. వీటిని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అసంతృప్త నేతలు ఎవరైనా తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తే వారితో ఉపసంహరింపచేయాలని నిర్ణయించారు. ఎల్‌బీనగర్‌ సీటు కోరిన సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా తెదేపా ప్రకటించింది. కానీ ఆ సీటు కోసం అక్కడి కాంగ్రెస్‌ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

తెదేపాలో చేరిన కూకట్‌పల్లి నాయకులు
ఈనాడు, అమరావతి: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్‌కు చెందిన కార్మికశాఖ మాజీ ఉప కమిషనర్‌ కె.వి.రవీంద్రనాథ్‌, మూసాపేటకు చెందిన ఉప్పు రామకృష్ణ శుక్రవారం తెదేపాలో చేరారు. రామకృష్ణ తెరాస నుంచి వచ్చారు. వారిద్దరూ పార్టీ సీనియర్‌ నాయకుడు ఇ.పెద్దిరెడ్డి సారథ్యంలో వచ్చి ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. మరోవైపు చంద్రబాబును బూరుగుబావి హనుమంతరావు కూడా కలిశారు. అనంతరం విలేకర్లతో  మాట్లాడుతూ తనకు పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే తాను కుత్బుల్లాపూర్‌ నుంచి స్వతంత్రంగానైనా పోటీ చేస్తానన్నారు.
రెండు సీట్లకు నేడు అభ్యర్థులు
మహాకూటమి పొత్తుల్లో భాగంగా తెదేపాకు 14 సీట్లు కేటాయించారు. వీటిలో 12 స్థానాలను, వాటికి అభ్యర్థులను ఇప్పటికే తెదేపా ప్రకటించింది. మరో రెండు సీట్లు కాంగ్రెస్‌ చెప్పాల్సి ఉందని తెదేపా వర్గాలు తెలిపాయి. ఈ వివరాలను శనివారం ప్రకటించనున్నారు. సనత్‌నగర్‌, పటాన్‌చెరు, ఎల్‌బీనగర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ గ్రామీణం స్థానాల్లో ఏవైనా రెండు వస్తాయని తెదేపా భావిస్తోంది. తాజాగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ సైతం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇది వస్తే కూకట్‌పల్లి టికెట్‌ ఆశించిన తెదేపా నేత పెద్దిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించనున్నారు. సనత్‌నగర్‌కు కూన వెంకటేశ్‌ గౌడ్‌, పటాన్‌చెరుకు నందీశ్వర్‌గౌడ్‌, నిజామాబాద్‌ గ్రామీణ స్థానాన్ని మండవ వెంకటేశ్వరరావు ఆశిస్తున్నారు. చివరిక్షణంలో ఇబ్రహీంపట్నంను కాంగ్రెస్‌ వెనక్కి తీసుకుని మరో స్థానాన్ని తెదేపాకు ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. శనివారం అన్నింటిపై స్పష్టత వస్తుందని తెతెదేపా అధ్యక్షుడు రమణ ‘ఈనాడు’కు చెప్పారు.
Link to comment
Share on other sites

తొలిసారి బరిలో నిలిచారు... 
కొన్ని నియోజకవర్గాల్లో ఆసక్తికరంగా మారిన పోటీ 
ఈనాడు, హైదరాబాద్‌ 
hyd-gen2a.jpg

చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థి పాతనే.. ప్రత్యర్థి పాతనే.. కొన్నిచోట్ల ప్రధాన అభ్యర్థులు వారే.. పార్టీలు మాత్రం వేరు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ... తలపడే నేతలు ఎక్కువ చోట్ల వారే ఉంటున్నారు. తాజా ఎన్నికలూ అందుకు మినహాయింపు కాకున్నా.. హఠాత్తుగా కొన్ని కొత్త ముఖాలు ప్రవేశించడంతో గ్రేటర్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వీరంతా తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతుండటంతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. 
* కూకట్‌పల్లి నియోజకవర్గం గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చ నడుస్తోంది. అక్కడ తెదేపా తరఫున హఠాత్తుగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని బరిలోకి దిగడం టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మారింది. ఈ  ఎన్నికల్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వ్యక్తిగతంగా రాజకీయాలు కొత్తైనా తెలుగుదేశం అభిమానులు అండగా నిలుస్తారనే ధీమాతో బరిలోకి దిగారు. 
* ఐటీ కేంద్రంగా ఉన్న శేరిలింగంపల్లిలోనూ వేర్వేరు పార్టీల నుంచి పోటీపడుతున్న అభ్యర్థులు కొత్తవారే. భాజపా నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థ మంజీరా గ్రూపు అధినేత జి.యోగానంద్‌ పోటీ చేస్తున్నారు. తెదేపా పక్షాన సినీ నిర్మాత భవ్య ఆనంద ప్రసాద్‌ బరిలో ఉన్నారు.   పార్టీలతో, రాజకీయాలతో ఉన్న అనుబంధంతో ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 
* మేడ్చల్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎవరూ పోటీ చేస్తారనే విషయమై  చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. తెరాస సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి పార్టీ నాయకత్వం మొదటి జాబితాలో టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ మొదలైంది. ఎవరూ ఊహించని విధంగా ఎంపీ మల్లారెడ్డి ఇక్కడ తెరాస నుంచి బరిలో ఉన్నారు. 
* చాంద్రాయణగుట్ట నియోజకవర్గంపైనా ఆసక్తి పెరిగింది. ఇక్కడ ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీకి పోటీగా భాజపా ముస్లిం మహిళా అభ్యర్థి సయ్యద్‌ షహజాది బేగంకు టికెట్‌ కేటాయించింది. ఏబీవీపీ నాయకురాలైన ఆమెను ఎన్నికల బరిలోకి దింపడం ద్వారా గట్టిపోటీ ఇవ్వొచ్చని భాజపా భావిస్తోంది. 
* గత సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ స్థానానికి తెదేపా నుంచి పోటీ చేసిన టి.వీరేందర్‌గౌడ్‌ ఈసారి ఉప్పల్‌ అసెంబ్లీ నుంచి బరిలో ఉండటంతో ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

hyd-gen2b.jpg
Link to comment
Share on other sites

కలిసి పనిచేద్దాం 
మందడితో బాలకృష్ణ, సుహాసిని వేర్వేరుగా భేటీ 
hyd-brk1a.jpg

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: కూకట్‌పల్లి సీటు ఆశించిన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావుతో  ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కూకట్‌పల్లి అభ్యర్థిని నందమూరి సుహాసిని వేర్వేరుగా భేటీ అయ్యారు. నామినేషన్‌ ముందు శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో సుహాసిని కుటుంబసభ్యులు పలువురు శ్రీనివాసరావుని కేపీహెచ్‌బీలోని ఆయన నివాసంలో కలిసి తమతో ఎన్నికల్లో కలిసి పనిచేయాల్సిందిగా కోరారు. శనివారం ఉదయం తన నామినేషన్‌ కార్యక్రమానికి రావాలని సుహాసిని స్వయంగా ఫోన్‌ చేశారు. కార్యక్రమానికి మందడి హాజరయ్యారు. అనంతరం ఆయనను బుజ్జగించేందుకు బాలకృష్ణ మందడి ఇంటికి వెళ్లారు. పార్టీకి చేసిన సేవలను అధిష్ఠానం గుర్తించిందని, మున్ముందు సముచిత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం సమయంలో సుహాసిని ఆయనతో కేపీహెచ్‌బీ భేటీ అయ్యారు. ఎన్నికల్లో సహకరించాలని  కోరగా కలిసికట్టుగా ఉంటూ పార్టీ విజయానికి కృషి చేస్తామని మందడి శ్రీనివాసరావు వివరించారు.

Link to comment
Share on other sites

పదేళ్ల తర్వాత టీడీపీ నేతకు అవకాశం.. అధికారికంగా ప్రకటించిన అధిష్ఠానం
18-11-2018 12:07:56
 
636781397364189970.jpg
  • సనత్‌నగర్‌ నుంచి బరిలో కూన
  • ఉత్కంఠకు తెర
  • అధికారికంగా ప్రకటించిన టీడీపీ
  • పదేళ్ల తర్వాత సొంత స్థానంలో పోటీకి అవకాశం
  • ప్రత్యర్థులుగా తలసాని, కూన
 
హైదరాబాద్‌: టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కూన వెంకటే్‌షగౌడ్‌ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. నమ్ముకున్న పార్టీ తరపున, సొంత నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగాలన్న ఆకాంక్ష నెరవేరింది. సనత్‌నగర్‌ మహాకూటమి అభ్యర్థిగా కూన వెంకటే్‌షగౌడ్‌ పేరును శనివారం టీడీపీ అధికారికంగా ప్రకటించింది. పొత్తు నేపథ్యంలో ఈ సీటు పై చివరి వరకు నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ అభ్యర్థిని ఖరారు చేశారు. రెండు దశాబ్దాల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2008లో కాంగ్రెస్‌ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. కూకట్‌పల్లి పీఆర్‌పీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. 2010లో అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. సనత్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీ కేడర్‌ తన వెంట ఉండేలా చేసుకోవడంలో ఆయన సఫలీకృతులయ్యారు.
 
చివరి నిమిషంలో...
కూన వెంకటే్‌షగౌడ్‌ నివాసం సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బేగంపేటలో ఉంటుంది. ఆయనకు నియోజకవర్గంలో అనుచరులు, బలమైన పార్టీ కేడర్‌ ఉంది. కానీ ఇప్పటివరకు సొంత అసెంబ్లీ పరిధిలో పోటీ చేయాలన్న ఆకాంక్ష నెరవేరలేదు. 2009లో పీఆర్‌పీ తరపున కూకట్‌పల్లి నుంచి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2014లో కూడా అదే పరిస్థితి. సనత్‌నగర్‌ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న కూనను నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో సికింద్రాబాద్‌కు పంపారు. అయినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచారు.
 
తలసానిపై గెలుపే లక్ష్యంగా...
2014 ఎన్నికల్లో సనత్‌నగర్‌ నుంచి పోటీ చేసేందుకు కూనకు దాదాపు మార్గం సుగమమైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అప్పుడు టీడీపీలో ఉన్న తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెచ్చి చివరి నిమిషంలో సనత్‌నగర్‌ టికెట్‌ దక్కించుకున్నారని, తనకు అన్యాయం చేశారని కూన ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. విధిలేని పరిస్థితుల్లో సికింద్రాబాద్‌లో పోటీ చేయాల్సి వచ్చిందని పేర్కొంటారు. తాను సర్వం సిద్ధం చేసిన చోట బరిలో నిలిచి తలసాని అలవోకగా గెలిచారని, తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తుంటారు. నాటినుంచి తలసానిపై పోటీచేసి గెలవాలన్న లక్ష్యం తనకిపుడు చేరువైందని ఆయన పేర్కొంటున్నారు.
 
కూన విజ్ఞప్తితో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా సనత్‌నగర్‌ టీడీపీకి వచ్చే లా పట్టుబట్టారని సమాచారం. సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డిని పక్కన పెట్టి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కూన బరిలోకి దిగుతున్నారు. తలసాని, కూన ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులుగా మారనున్నారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభించి నామినేషన్‌ దాఖలు చేసిన కూన అధికారిక ప్రకటనలో విస్తృతంగా పర్యటించేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.
Link to comment
Share on other sites

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ తెరాస ఇంచార్జి కొలను హనుమంత్ రెడ్డి గారు మరియు వారి అనుచరులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. #TelanganaElections2018IndiaStateElections_2018.png @santulikky @sushilrTOI @Mirchi9 @DonitaJose

DsczfIVV4AIzekI.jpg
Link to comment
Share on other sites

119 స్థానలలో పోటీ చేస్తున్న KCR కి... 14 స్థానలలో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీని చూసి ఎ౦దుకు భయం..? -చంద్రబాబు
......
 

Link to comment
Share on other sites

27 minutes ago, Saichandra said:

119 స్థానలలో పోటీ చేస్తున్న KCR కి... 14 స్థానలలో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీని చూసి ఎ౦దుకు భయం..? -చంద్రబాబు
......
 

 

Deeniki answer jesi gani votelu adagoddu ra KCR anali?

Link to comment
Share on other sites

టీడీపీలోకి కొలను హన్మంతరెడ్డి
21-11-2018 04:33:26
 
  • కాంగ్రెస్‌లోకి పలువురు టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): టీఆర్‌ఎస్‌ కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలను హన్మంతరెడ్డి టీడీపీలో చేరారు. మంగళవారం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హన్మంతరెడ్డితో పాటు మరికొందరు కార్యకర్తలు టీడీపీలో చేరారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నేత మహ్మద్‌ జబ్బార్‌ఖాన్‌ కాంగ్రె్‌సలో చేరారు. పెద్దపల్లి సెగ్మెంట్‌ పరిధిలోని ఎలిగేడు జడ్పీటీసీ సభ్యురాలు పడాల తార, కాల్వశ్రీరాంపూర్‌ జడ్పీటీసీ సభ్యుడు లంక సదయ్య టీఆర్‌ఎస్ కు రాజీమానా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి, రెండు రోజుల్లో తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు.
 
కాగా, నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం జడ్పీటీసీ జాదవ్‌శోభ, మాజీ ఎంపీటీసీ సురేశ్‌బాబు టీఆర్‌ఎస్ కు రాజీనామా చేసి ఎన్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముథోల్‌ ఎన్సీపీ అభ్యర్థి బోస్లే నారాయణరావ్‌ పటేల్‌ ఆధ్వర్యంలో 500 మంది అనుచరులతో కలిసి ఆ పార్టీలో చేరారు. మరోవైపు జగిత్యాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు ముస్కు గంగారెడ్డి, బండ భాస్కర్‌రెడ్డి, బల్దియా టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ తాటపర్తి సరళాదేవి, శరత్‌రెడ్డి, బాపురెడ్డి, గుంటి జగదీశ్వర్‌, ముద్దం ప్రభాకర్‌, కొలగాని చందు తదితరులు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
Link to comment
Share on other sites

సుహసిని పొలిటికల్ ఎంట్రీ వెనుక జరిగిన స్టోరీ ఇదేనా..?
21-11-2018 12:06:16
 
636783988940457197.jpg
ఒక నిర్ణయం వంద వ్యూహాలకు తెరతీసింది. అదే నిర్ణయం ప్రత్యర్ధులను ఇబ్బందుల్లోకి నెట్టింది. కుటుంబాన్ని రంగంలోకి దించింది. నిన్నమొన్నటివరకూ అంటీముట్టనట్టుగా ఉన్న కుటుంబసభ్యులను కూడా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావితం చేసింది. ట్వీట్ల రూపంలోనో, బహిరంగంగానో లేదా అంతర్గతంగానో ఆమెకు అందరూ మద్దతు పలకక తప్పలేదు. తెలంగాణలో పార్టీకి నైతిక బలాన్ని ఇచ్చే ఈ నిర్ణయం వెనుక పెద్ద కసరత్తే జరిగిందట. ఆ సంగతులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
 
 
   రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రత్యర్ధుల వ్యూహాలకు తగ్గట్టుగా ప్రతివ్యూహాలు రచించడంలో చంద్రబాబు తనకు తానే సాటి! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల్లో తన ముద్రవేయగలిగిన చంద్రబాబు.. ఇక అధికారం చేతిలో ఉంటే ఏంచేస్తారో వేరే చెప్పనక్కరలేదు!తెలంగాణలో మహాకూటమిలో చేరిన వెంటనే చంద్రబాబుపై టీఆర్ఎస్ విరుచుకుపడింది. తెలుగుదేశం మౌలిక స్వరూపాన్నే చంద్రబాబు దెబ్బతీశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎన్‌టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని కూడా శాపనార్ధాలు పెట్టారు. నిజానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో బాబు చేతులు కలపడంపై ఆంధ్రాలోనూ కొందరు అసంతృప్తికి గురయ్యారు. కానీ ఎవరూ బయటపడలేదు.
 
 
   ఈ అంశాలన్నింటనీ చంద్రబాబు నిశితంగా గమనించారు. ప్రత్యర్ధులను తిప్పికొట్టేందుకు జాగ్రత్తగా పావులు కదిపారు. ఆచితూచి అడుగులు వేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలలో ఒకసారి అన్నను, మరోసారి తండ్రిని కోల్పోయిన హరికృష్ణ తనయ సుహాసినిని ఎన్నికల బరిలోకి దించేలా చంద్రబాబు పావులు కదిపారు. తెలుగుదేశం పాలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్న హరికృష్ణ స్థానంలో వారి కుటుంబం నుంచి ఎవరో ఒకరిని తెలంగాణ ఎన్నికలలో నిలబెట్టాలన్నదే బాబు సంకల్పం. చివరకు ఎన్‌టీఆర్ కుటుంబంలోకి ఈ ఫీలర్‌ను వదిలారు. కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్‌టీఆర్ తమకు సినిమా భవిషత్ ఉండటంతో రాజకీయాలలోకి ఇప్పట్లో రాలేమని తేల్చిచెప్పారు. చిన్నవయసు నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న సుహాసినిని చంద్రబాబు అడగటంతో ఆమె వెంటనే ఒప్పుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి తన నిర్ణయం ఆమె చెప్పడంతో చంద్రబాబు తర్వాత తంతుని పూర్తిచేశారు. కూకట్‌పల్లి టీడీపీ నేతలను ఒప్పించి సుహాసిని పేరును ప్రకటించారు.
 
 
    ఎన్‌టీఆర్ కుటుంబంలో మెజారిటీ సభ్యులు సుహాసినికి అండగా నిలిచారు. చివరకు గత కొంతకాలంగా టీడీపీతో అంతగా సన్నిహితంగా మెలగని జూనియర్ ఎన్‌టీఆర్, సుహాసిని మరో సోదరుడు కళ్యాణ్‌రామ్ కూడా తమ సోదరి సుహాసినికి ట్విట్టర్ ద్వారా మద్దతు పలికారు. తెలుగుదేశం అంటే తమకు పవిత్రమైందని పేర్కొన్నారు. సుహాసినిని రంగంలోకి తీసుకురావడంలో ఎన్‌టీఆర్ కుమార్తెలు కీలకపాత్ర పోషించారని కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సమయంలో వారి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, కేటీఆర్‌లకు ప్రస్తుతం హరికృష్ణ కుమార్తె సుహాసిని టీడీపీ అభ్యర్ధిగా కూకట్‌పల్లి నుంచి పోటీచేస్తుండటంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి పక్షాన ఆమె బరిలోకి దిగుతుండటంతో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్‌టీఆర్ ఆత్మ క్షోభిస్తుందంటూ వచ్చిన విమర్శలను తన రంగప్రవేశం ద్వారా సుహాసిని తిప్పికొట్టినట్టు అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు.
 
   భవిషత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో కూడా సుహాసిని రాజకీయ రంగప్రవేశం ప్రభావం చూపనుంది. కాంగ్రెస్‌తో చేతులు కలిపినప్పటికీ తెలుగుదేశానికి ఎన్‌టీఆర్ కుటుంబం అండగా ఉందన్న సంకేతం బలంగా ప్రజల్లోకి వెళుతుంది. ఇలా బహుముఖ కోణాలలో ఆలోచించి సుహాసినిని రంగంలోకి దించారు చంద్రబాబు. తద్వారా అటు ఎన్‌టీఆర్ కుటుంబంలోనూ, ఇటు టీడీపీ కార్యకర్తల్లోనూ నైతికంగా బలం చేకూర్చారు. చంద్రబాబు తాజా నిర్ణయం పట్ల టీ-టీడీపీ నేతలతోపాటు ఏపీ టీడీపీ నేతలు కూడా హర్షం వెలిబుచ్చారు. వచ్చే రోజుల్లో ఈ పరిణామం తమకు కలిసొస్తుందని వారు బలంగా విశ్వసిస్తున్నారు.
Link to comment
Share on other sites

టీడీపీలో చేరిన టీఆర్‌ఎస్‌ నాయకులు
23-11-2018 11:40:50
 
636785700916085562.jpg
హైదరాబాద్: ఎల్లమ్మబండకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ కార్పొరేటర్‌ మంచికలపూడి భానుప్రసాద్‌ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం ఏర్పడిన ప్రజాకూటమికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో అశోక్‌, రాజుగౌడ్‌, సదానంద్‌, దిలీప్‌, రవి ఉన్నారు.
 
సనత్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో..
రాంగోపాల్‌పేట డివిజన్‌కు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం టీడీపీ సనత్‌నగర్‌ నియోజకవర్గ అభ్యర్థి కూన వెంక టేశ్‌ గౌడ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం టీడీపీ అభ్యర్థి వెంకటేశ్‌ గౌడ్‌ ఈ ప్రాంతానికి వచ్చారు. టీఆర్‌ఎ్‌సలో గత కొంతకాలంగా పనిచేస్తున్న శ్రీకాంత్‌చారి, నాగరాజ్‌, శ్రీధర్‌, నరసింహతో పాటు పలువురు ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ఉద్యమాలు చేసిన వారికి విలువలేదన్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోమహాకూటమిలోభాగంగాటడీపీ అభ్యర్థి వెంకటేశ్‌ గౌడ్‌ విజయం కోసం తాము పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు రవి యాదవ్‌, నర్సింగ్‌, సువర ్ణ, కనకయ్య, జహంగీర్‌, కృష్ణ పూజారి, అనురాధ పాల్గొన్నారు.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...