Jump to content

HCL Technologies IT SEZ (Special Economic Zone)


Recommended Posts

సెజ్‌ పరిధిలోకి హెచ్‌సీఎల్‌..!
23-07-2018 09:38:10
 
636679354897615768.jpg
 • స్థల పరిశీలనలో సంస్థ ప్రతినిధులు
విజయవాడ: స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (సెజ్‌) పరిధిలోకి హెచ్‌సీఎల్‌ వచ్చినట్టు సమాచారం! దీనిపై అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది! దాదాపుగా సెజ్‌కు కేంద్రం నుంచి సూత్ర ప్రాయ అంగీకారం రావటంతో.. హెచ్‌సీఎల్‌ సంస్థ గన్నవరంలో తన పనులు ముమ్మరం చేసింది. గత పక్షంరోజులుగా పలుమార్లు హెచ్‌సీఎల్‌ ప్రతినిథులు గన్నవరంలో ప్రభుత్వం కేటాయించిన ఏపీఎ్‌సఆర్‌టీసీ జోనల్‌ కాలేజీ స్థలాన్ని పరిశీలిస్తున్నారు. భవన నిర్మాణ పనుల ప్రారంభోత్సవం, డిజైన్‌, మాస్టర్‌ ప్లాన్‌పై ప్రతినిథులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. తమకు కేటాయించిన 27 ఎకరాల స్థలాన్ని ఎప్పుడో స్వాధీనం చేసుకున్న హెచ్‌సీఎల్‌ ప్రతినిథులు ప్రకృతి నడుమ భవనాన్ని నిర్మించేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం స్వాధీనం చేసిన ఏపీఎ్‌సఆర్‌టీసీ జోనల్‌ కాలేజీ స్థలంలో ఉన్న భవనాలను మాత్రమే హెచ్‌సీఎల్‌ ప్రతినిథులు తొలగించారు. భవనాల తొలగింపు పూర్తయింది.
 
నేలను పూర్తిగా చదును చేశారు. భవన నిర్మాణానికి ఇబ్బందులు ఉన్నచోట మాత్రమే కొన్ని చెట్లను తొలగించారు. భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తే ఆరునెలల నుంచి సంవత్సర వ్యవధిలో పూర్తవుతాయి. అప్పటికి చెట్లను నాటి మహావృక్షాలను చేయాలంటే కనీసం 10 నుంచి 20 ఏళ్ళ సమయం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఆవరణలో ఉన్న వృక్షాలను అలానే ఉంచారు. ఈ వృక్షాల మధ్యన ఉన్న ప్రాంతంలోనే భవన నిర్మాణం జరుగుతుంది. భవన నిర్మాణానికి సంబంధించి డిజైన్లలో కొన్ని మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. మార్పులకు సంబంధించి హెచ్‌సీఎల్‌ ప్రతినిథులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. హె చ్‌సీఎల్‌కు సంబంధించిన వివరాలు అటు మేనేజ్‌మెంట్‌ నుంచి కానీ, ఇటు ఏపీఐఐసీ వర్గాల నుంచి కూడా బహిర్గతం కావటం లేదు. సెజ్‌ కోసం ఇప్పటి వరకు జాప్యం చేసిన హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రస్తుతం కేంద్రం నుంచి సానుకూలత రావటంతో అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తుంది. టెక్నాలజీస్‌ పార్క్‌ను వీలైనంత త్వరగా నిర్మించటానికి శంకుస్థాపనకు చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది.
Edited by sonykongara
Link to comment
Share on other sites

పక్షం రోజుల్లో హెచ్‌సీఎల్‌ ప్రారంభం!
07-08-2018 08:29:14
 
636692273538326517.jpg
 • మేథలో హెచ్‌సీఎల్‌ బ్లాక్‌ ఇంటీరియర్‌ పనులు పూర్తి
 • ఐటీ మంత్రి నారా లోకేష్‌చే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
విజయవాడ: ఎప్పుడా.. ఎప్పుడెప్పుడా... అని ఎదురుచూస్తున్న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సేవలు మరో పక్షం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. కేసరపల్లి ఎల్‌అండ్‌టీ - ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలోని ‘మేథ’ టవర్‌లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో తన సేవలను ప్రారంభించటానికి హెచ్‌సీఎల్‌ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభించటానికి హెచ్‌సీఎల్‌ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఆ సంస్థకు చెందిన ప్రతినిథి బృందం మేథ టవర్‌ను సందర్శించింది. హెచ్‌సీఎల్‌ బ్లాకులో గత కొద్దినెలలుగా ఇంటీరియర్‌ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. పూర్తయిన ఇంటీరియర్‌ పనులను హెచ్‌సీఎల్‌ బృందం పరిశీలించింది. గన్నవరంలోని ఆర్టీసీ జోనల్‌ కాలేజీ స్థలంలో శాశ్వతంగా టెక్నాలజీస్‌ పార్క్‌ నిర్మాణానికి హెచ్‌సీఎల్‌ మరోవైపు చర్యలు తీసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఎయిర్‌పోర్టు ఉండటం వల్ల డిజైన్లకు కేంద్రం నుంచి ఇంకా కొన్ని అనుమతులు రావాల్సి ఉన్నందున ఇక్కడ శంకుస్థాపన, హైరైజ్‌ భవన నిర్మాణ పనులు ప్రారంభించటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ‘మేథ’ టవర్‌లో తాత్కాలికంగా తమ కార్యకలాపాలు ప్రారంభించాలని హెచ్‌సీఎల్‌ నిర్ణయించింది. లక్ష అడుగుల విస్తీర్ణాన్ని తీసుకుని గత ఆరు నెలలుగా పనులు చేయిస్తోంది.
 
హెచ్‌సీఎల్‌ కార్యకలాపాలు ప్రారంభించనున్న నేపథ్యంలో, స్థానిక యువత ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని ఇప్పటికే హెచ్‌సీఎల్‌ యాజమాన్యం ప్రకటించింది. మేథ టవర్‌ నుంచి తాత్కాలికంగా సేవలు అందించనున్న హెచ్‌సీఎల్‌ స్థానికంగా ఉన్న వారిని ఉద్యోగాలలోకి తీసుకుంటుందా అన్నదానిపై అనుమానంగా ఉంది. హెచ్‌సీఎల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం నూతనంగా నిర్మించబోయే హై రైజ్‌ బిల్డింగ్‌లో కార్యకలాపాలు ప్రారంభించటానికే స్థానికంగా ఉన్న యువతకు అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. ఇంకా శంకుస్థాపన కూడా అక్కడ జరగలేదు. ఈ క్రమంలో తాత్కాలికంగా మేథ టవర్‌ నుంచి సేవలు అందించటానికి సన్నాహకాలు చేస్తున్నా .. తమ పాత సిబ్బంది ద్వారా విధులు నిర్వహిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ఆ సంస్థ నిర్వాహకులు చేపట్టలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని చూస్తే.. పూర్తి స్థాయిలో గన్నవరంలో నిర్మించే టెక్నాలజీస్‌ పార్క్‌లో మాత్రమే స్థానికంగా ఉన్న యువతను ఉద్యోగాలలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోది.
Link to comment
Share on other sites

 • 4 weeks later...
13న స్టేట్‌ స్ర్టీట్‌ హెచ్‌సీఎల్‌ లిమిటెడ్‌ ప్రారంభం
01-09-2018 07:25:03
 
636713835048453468.jpg
 • 900 మందితో కార్యకలాపాలు
 • ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
విజయవాడ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘హెచ్‌సీఎల్‌’ కల మరికొద్ది రోజులలో సాకారం కాబోతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అభిముఖంగా ‘ఏస్‌ అర్బన్‌ - ఏపీఐఐసీ హైటెక్‌ సిటీ’లోని ‘మేధ’ టవర్‌లో సెప్టెంబర్‌ 13న హెచ్‌సీఎల్‌ సంస్థకు చెందిన సోదర సంస్థ ‘స్టేట్‌ స్ర్టీట్‌ హెచ్‌సీఎల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఏర్పాటు కాబోతోంది. మొత్తం 900 మంది ఉద్యోగులతో ఈ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. ఇది పూర్తిగా సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ. ఈ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు రాకను దృష్టిలో ఉంచుకుని ఏస్‌ అర్బన్‌- ఏపీఐఐసీ హైటెక్‌ సిటీ ముస్తాబౌతోంది. ప్రధాన గ్రాండ్‌ ఎంట్రన్స్‌ మార్గాన్ని ఆధునికీకరించారు.
 
హైవే - 16 వెంబడి గ్రాండ్‌ ఎంట్రన్స్‌ మార్గంలో పైలాన్‌ను ఏర్పాటు చేశారు. హెచ్‌సీఎల్‌ సంస్థ మేధ టవర్‌లో తన సోదర సంస్థ కోసం 900 సీట్ల ఆక్యుపెన్సీ ఉన్న స్థలాన్ని తీసుకుంది. పూర్తిగా మేథ టవర్‌లో ఒక బ్లాక్‌ అన్నమాట. దాదాపుగా నాలుగునెలలుగా మేధ టవర్‌లో జరుగుతున్న ఇంటీరియర్‌ పనులు పూర్తయ్యాయి. ‘స్టేట్‌ స్ర్టీట్‌’ కార్యకలాపాలు నిర్వహించటానికి వీలుగా అధికారుల ఛాంబర్లు, సమావేశపు హాల్‌, వర్కింగ్‌ గ్రూప్‌లతో పాటు సిబ్బందికి రెస్ట్‌ రూమ్స్‌ వంటివి కూడా ఏర్పాటయ్యాయి. హెచ్‌సీఎల్‌ ఏర్పాటుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలిపేందుకు గోప్యత పాటిస్తున్నారు. ఇంకా సమయం ఉండటం వల్ల అధికారికంగా తర్వాత ప్రకటిద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
 
ఏస్‌ అర్బన్‌ సంస్థ నిర్వాహకులు మాత్రం మేధ టవర్‌లోకి మీడియాను అనుమతించటం లేదు. ప్రస్తుతం స్టేట్‌ స్ర్టీట్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నా.. హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రధాన కార్యకలాపాలు ప్రారంభించటానికి ఇంకాస్త సమయం ఉంది. హెచ్‌సీఎల్‌ సంస్థకు గన్నవరంలోని ఆర్టీసీ జోనల్‌ డ్రైవింగ్‌ కాలేజీకి చెందిన 27 ఎకరాలను కేటాయించారు. ఏపీఐఐసీ, హెచ్‌సీఎల్‌ సంస్థల మధ్య సేల్‌ డీడ్‌ కూడా జరిగింది. ప్రస్తుతం ఈ స్థలాన్ని హెచ్‌సీఎల్‌ అధికారులు చదును చేశారు. ఇక్కడ టెక్నాలజీస్‌ పార్కును ఏర్పాటు చేయనుంది. ఇక్కడ హై రైజ్‌ భవనం నిర్మించిన తర్వాత స్థానికంగా ఉన్న పట్టభద్రులకు ఉద్యోగాలలో అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం మేథ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించే తన సోదర సంస్థలో మాత్రం పాత ఉద్యోగులే ఉంటారని సమాచారం. హెచ్‌సీఎల్‌ సోదర సంస్థ మేధలో కాలు పెట్టనుండటంతో ఐటీ పార్క్‌కే కళ వచ్చింది.
 
మేధ టవర్‌ పూర్తిగా ఐటీ కంపెనీలతో నిండిపోయింది. ఐదేళ్ల కిందట ఐటీ కంపెనీలు లేక వెలవెలపోయింది. రెండు మూడు చిన్న కంపెనీలు తప్పితే ఖాళీగా ఉండేది. అలాంటిది అనేక ఐటీ కంపెనీలు ఏర్పాటు కావటంతో పాటు బిగ్‌ ఐటీ కంపెనీగా ‘స్టేట్‌ స్ర్టీట్‌ ’ సంస్థ రంగ ప్రవేశం చేయటంతో కేసర పల్లికి మహర్దశ పట్టుకుంది
Link to comment
Share on other sites

 • 2 weeks later...
1 hour ago, BalayyaTarak said:

2004 ke complete ayina building ki ippatiki companies vastunnay malli babu garu vachaka.  :super:

Medha towers, almost 10 years vacant ga vundi

2004 lo gelichi vunte, VJA area lo kuda IT companies vatchi vundevi. devp. vere ga vundedhi.

in 2003 itself, they installed network infra (T1 lines) at ITI/polytechnic college - later scrapped that one

Edited by rk09
Link to comment
Share on other sites

1 hour ago, rk09 said:

Medha towers, almost 10 years vacant ga vundi

2004 lo gelichi vunte, VJA area lo kuda IT companies vatchi vundevi. devp. vere ga vundedhi.

in 2003 itself, they installed network infra (T1 lines) at ITI/polytechnic college - later scrapped that one

Add Vizag and Tirupathi/Anantapur to that list

Link to comment
Share on other sites

డు హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ట్రీట్‌ ప్రారంభం
13-09-2018 05:27:26
 
636724132474038100.jpg
అమరావతి: ఫైనాన్షియల్‌ సర్వీసె్‌సలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న అంతర్జాతీయ కంపెనీ హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ట్రీట్‌ రాష్ట్రంలో కొలువుదీరనుంది. గన్నవరం సమీపంలోని మేధాటవర్స్‌లో ఏర్పాటుకానున్న ఈ కంపెనీని ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం ప్రారంభిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వాస్తవానికి హెచ్‌సీఎల్‌-అమెరికాకు చెందిన స్టేట్‌ స్ట్రీట్‌ కంపెనీలు కలిసి ఈ భాగస్వామ్య సంస్థను ఏర్పాటుచేశాయి. అమెరికా, కెనడా, యూరప్‌, మిడిల్‌ ఈస్ట్‌, ఆసియా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హెచ్‌సీఎల్‌-స్టేట్‌ స్ట్రీట్‌లు సంయుక్తంగా ఏర్పడ్డాక మన దేశంలోని కోయంబత్తూరులో తొలిశాఖను ప్రారంభించారు. అక్కడ 4వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. కాగా, అక్టోబరు 8న హెచ్‌సీఎల్‌ కంపెనీ కూడా మేధాటవర్స్‌లో ప్రారంభం కానుంది. తద్వారా మరింత పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు రానున్నాయి.
Link to comment
Share on other sites

నేడు హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ట్రీట్‌ ప్రారంభం
13-09-2018 05:27:26
 
636724132474038100.jpg
అమరావతి: ఫైనాన్షియల్‌ సర్వీసె్‌సలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న అంతర్జాతీయ కంపెనీ హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ట్రీట్‌ రాష్ట్రంలో కొలువుదీరనుంది. గన్నవరం సమీపంలోని మేధాటవర్స్‌లో ఏర్పాటుకానున్న ఈ కంపెనీని ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం ప్రారంభిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వాస్తవానికి హెచ్‌సీఎల్‌-అమెరికాకు చెందిన స్టేట్‌ స్ట్రీట్‌ కంపెనీలు కలిసి ఈ భాగస్వామ్య సంస్థను ఏర్పాటుచేశాయి. అమెరికా, కెనడా, యూరప్‌, మిడిల్‌ ఈస్ట్‌, ఆసియా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హెచ్‌సీఎల్‌-స్టేట్‌ స్ట్రీట్‌లు సంయుక్తంగా ఏర్పడ్డాక మన దేశంలోని కోయంబత్తూరులో తొలిశాఖను ప్రారంభించారు. అక్కడ 4వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. కాగా, అక్టోబరు 8న హెచ్‌సీఎల్‌ కంపెనీ కూడా మేధాటవర్స్‌లో ప్రారంభం కానుంది. తద్వారా మరింత పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు రానున్నాయి.
Link to comment
Share on other sites

నేడు మేధా టవర్స్‌లో హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ట్రీట్‌ ప్రారంభం
13-09-2018 03:21:15
 
 •  వెయ్యిమందికి ఉద్యోగాలు
 •  వచ్చే నెల 8న హెచ్‌సీఎల్‌ ఆరంభం
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఫైనాన్షియల్‌ సర్వీసె్‌సలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న అంతర్జాతీయ కంపెనీ హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ట్రీట్‌ రాష్ట్రంలో కొలువుదీరనుంది. గన్నవరం సమీపంలోని మేధాటవర్స్‌లో ఏర్పాటుకానున్న ఈ కంపెనీని ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం ప్రారంభిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వాస్తవానికి హెచ్‌సీఎల్‌-అమెరికాకు చెందిన స్టేట్‌ స్ట్రీట్‌ కంపెనీలు కలిసి ఈ భాగస్వామ్య సంస్థను ఏర్పాటుచేశాయి. అమెరికా, కెనడా, యూరప్‌, మిడిల్‌ ఈస్ట్‌, ఆసియా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హెచ్‌సీఎల్‌-స్టేట్‌ స్ట్రీట్‌లు సంయుక్తంగా ఏర్పడ్డాక మన దేశంలోని కోయంబత్తూరులో తొలిశాఖను ప్రారంభించారు. అక్కడ 4వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. కాగా, అక్టోబరు 8న హెచ్‌సీఎల్‌ కంపెనీ కూడా మేధాటవర్స్‌లో ప్రారంభం కానుంది. తద్వారా మరింత పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు రానున్నాయి.
Link to comment
Share on other sites

మేధా టవర్స్ వేదికగా క్యాపిటల్ మార్కెట్స్,ఫండ్ అడ్మినిస్ట్రేషన్, ఇన్వెస్ట్మెంట్ మ్యానేజ్మెంట్ సర్వీసెస్ అందించనున్న హెచ్ సిఎల్ స్టేట్ స్ట్రీట్ హెచ్ సిఎల్ కంపెనీ మరియు అమెరికాకి చెందిన స్టేట్ స్ట్రీట్ కంపెనీ భాగస్వామ్యంతో హెచ్ సిఎల్ స్టేట్ స్ట్రీట్ ఏర్పాటు

Link to comment
Share on other sites

హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ట్రీట్‌’ నేడు ప్రారంభం

ఈనాడు-అమరావతి: హిందుస్థాన్‌ కంప్యూటర్స్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌), అమెరికాకు చెందిన స్టేట్‌ స్ట్రీట్‌ కంపెనీ సంయుక్త భాగస్వామ్యంతో గన్నవరం మేధాటవర్స్‌లో గురువారం ‘హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ట్రీట్‌’ కంపెనీని ఐటీశాఖ మంత్రి లోకేశ్‌ ప్రారంభించనున్నారు. అమెరికా, కెనడా, యూరప్‌, మధ్య, తూర్పు ఆసియా దేశాల్లో స్టేట్‌ స్ట్రీట్‌ కంపెనీ ఫైనాన్షియల్‌ సేవలు అందిస్తోంది. హెచ్‌సీఎల్‌ భాగస్వామ్యంతో కంపెనీ కార్యకలాపాలను ఇప్పుడు మేధాటవర్స్‌లోని మూడో అంతస్థులో నిర్వహించనుంది. కంపెనీ ప్రారంభంతో వివిధ దశల్లో వెయ్యి మందికిపైగా ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు

Link to comment
Share on other sites

2019కల్లా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాం
విశాఖలో ఐటీ కంపెనీలే లేవని జగన్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది
ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌
12042313BRK74A.JPG

గన్నవరం: 2019 కల్లా రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడ శివారులోని గన్నవరం మేధా టవర్స్ లో హెచ్‌సీఎల్, స్టేట్ స్ట్రీట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీని మంత్రి గురువారం ప్రారంభించారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో 36 వేల ఐటీ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. చంద్రబాబు గతంలో సీఎం గా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. అదే విధంగా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఐటీ రంగం వేళ్ళూనుకుంటోందని తెలిపారు. మేధా టవర్స్ పక్కన మరో భవనం ఐటి కంపెనీల కోసం నిర్మిస్తున్నట్లు వివరించారు. ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని తెలిపారు. కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. తద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్నారు. విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు లోకేశ్‌ తెలిపారు. విశాఖలో ఐటి కంపెనీలు లేవని ప్రతిపక్ష నేత జగన్ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఐటీ అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రకటించామని... జగన్ అసెంబ్లీకి రాకుండా ఐటీ గురించి మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

విజయవాడలో హెచ్‌సీఎల్‌ ఎస్‌ఎస్‌హెచ్‌ఎస్‌

043335BRK105-HCL.JPG

న్యూదిల్లీ: వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలో ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌.. అమెరికాకు చెందిన స్టేట్‌ స్ట్రీట్‌ కార్పొరేషన్‌తో కలిసి ఐటీ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 63వేల చదరపు అడుగల విస్త్రీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్‌ ఏర్పాటు ద్వారా 1000మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

బ్యాక్‌ ఆఫీస్‌, పెట్టుబడి నిర్వహణ, పరిపాలన విభాగం, బ్రోకరేజ్‌ సేవలు మొదలైన వాటిని ప్రారంభిస్తామని బీఎస్‌ఈ ఫైలింగ్‌ సందర్భంగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించింది.

‘ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మా సేవలు మరింత విస్తరిస్తాయని విశ్వాసంతో ఉన్నాం. అంతేకాదు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. యువత సొంత రాష్ట్రంలో ఉపాధి పొందేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కార్పొరేట్‌ ఉపాధ్యక్షుడు అనూప్‌ తివారి తెలిపారు.

Link to comment
Share on other sites

https://www.deccanchronicle.com/business/companies/130918/hcl-sshs-sets-up-centre-in-vijayawada-to-create-jobs-for-over-1000-p.html

HCL SSHS sets up centre in Vijayawada, to create jobs for over 1,000 people

PTI
Published Sep 13, 2018, 2:30 pm IST
Updated Sep 13, 2018, 2:30 pm IST
The centre will cater to global clients of HCL Technologies.
HCL SSHS (State Street HCL Services) Facility, a joint venture between HCL Technologies and US-based State Street Corporation, on Thursday said it has set up an IT centre in Vijayawada.
 HCL SSHS (State Street HCL Services) Facility, a joint venture between HCL Technologies and US-based State Street Corporation, on Thursday said it has set up an IT centre in Vijayawada.

New Delhi: HCL SSHS (State Street HCL Services) Facility, a joint venture between HCL Technologies and US-based State Street Corporation, on Thursday said it has set up an IT centre in Vijayawada.

Spread over 63,000 sq ft, the centre will create employment opportunities for over 1,000 people in the areas of capital markets - middle and back office for custody, fund administration, investment management and brokerage services, HCL Technologies said in a BSE filing.

 

 

Post-graduates and graduates in areas like commerce and accountancy finance will be recruited for these profiles, it added.

The centre will cater to global clients of HCL Technologies, it said.

"We are confident that our expanding presence across Andhra Pradesh will boost employment and skill development opportunities for the youth of the state who will be able to access these opportunities in their home towns," HCL Technologies Corporate Vice President Anoop Tiwari said.

The JV with HCL was set up in 2012 across Chennai, Coimbatore and Manila and has seen steady growth with the employee strength crossing 4,000 recently.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  • No registered users viewing this page.
×
×
 • Create New...