Jump to content

Recommended Posts

Posted
రాష్ట్రానికి.. వచ్చేయండి!
09-10-2018 09:05:08
 
636746727087773007.jpg
  • నైపుణ్యాన్ని వెలికితీయండి 
  • మీ ఉద్యోగానికి మాది భరోసా
  • హెచ్‌సీఎల్‌ నినాదం ఇది
  • హెచ్‌సీఎల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు భూమిపూజ చేసిన ఐటీ మంత్రి లోకేశ్‌
  • ఐటీ అభివృద్ధి నగరాల జాబితాలో అమరావతి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గన్నవరం): ‘కమ్‌ బ్యాక్‌ హోమ్‌! రాష్ర్టానికి వచ్చేయండి! రాజధానిలో మేం భరోసా కల్పిస్తున్నాం. మీ ప్రాంతంలోనే అత్యుత్తుమ ఐటీ కొలువులు పొందండి!! రాజధాని ప్రాంతంలో అతిపెద్ద ఐటీ ఇండస్ర్టీ హెచ్‌సీఎల్‌ పూరించిన నినాదం ఇది.. అంతర్జాతీయ విమానశ్రయానికి అభిముఖాన కేసరపల్లిలో దేశంలోనే భారీ హెచ్‌సీఎల్‌ ఐటీ క్యాంప్‌సకు సోమవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ భూమిపూజతో ఐటీ నగరాల జాబితాలో అమరావతి కూడా చేరింది. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లు కేంద్రంగా ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కృషితో నేడు వాటి సరసన అమరావతి సగర్వంగా నిలుస్తోంది. దేశంలో ఏ ఇతర ఐటీ సంస్థకు లేనివిధంగా అతిపెద్ద క్యాంపస్‌ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రూపంలో అమరావతి రాజధాని ప్రాంతంలోని కేసరపల్లిలో 27 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటు కావటం విశేషం. అమరావతి రాజధాని ప్రాంతంలో ఐటీ రంగం ఇపుడిపుడే విస్తరిస్తోంది. మంగళగిరి, కేసరపల్లిలు ఇప్పటికే సైబర్‌ వాడలుగా అభివృద్ధి చెందుతున్నాయి.
 
మంగళగిరిలో పై డేటా సెంటర్‌ అతిపెద్ద ఐటీ ఇండస్ర్టీగా రావటంతో జోష్‌ వచ్చింది. కేసరపల్లిలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ బిగ్‌ ఐటీ ఇండస్ర్టీ వచ్చింది. విజయవాడ, మంగళగిరి నగరాల్లో ఇప్పటికే చిన్న కంపెనీలు ఏర్పడ్డాయి. విజయవాడ నగరంలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ)ఐటీ, ఐటీయేతర స్టార్టప్స్‌కు ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పడింది. దీంతోపాటు మరో 60 వేలచదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+6 ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తికావస్తోంది. రాష్ట్రంలోనే సైబర్‌వాడగా నిలుస్తోన్న కేసరపల్లిలో ఐటీ రంగం విస్తరిస్తోంది. ఏస్‌ అర్బన్‌-ఏపీఐఐసీ హైటెక్‌సిటీలో మేథ టవర్‌లో ఒకప్పుడు రెండు, మూడు ఐటీ పరిశ్రమలు తప్పితే ఏమీ ఉండేవి కావు. ప్రస్తుతం 15 కంపెనీలకు పైగా కొలువుతీరాయి. హెచ్‌సీఎల్‌ భాగ స్వామ్యసంస్థ స్టేట్‌ స్ర్టీట్‌ సంస్థ ఇటీవలే కొలువుతీరింది. ప్రస్తుతం హెచ్‌సీఎల్‌ చెంతన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి తరహాలో ఐటీ పార్క్‌కు ఏపీఐఐసీ చర్యలు తీసుకుంటోంది.
 
కేసరపల్లి దశ తిరిగింది
భారీ ఐటీ ఇండస్ర్టీ హెచ్‌సీఎల్‌ ఏర్పాటుతో కేసరపల్లి సైబర్‌వాడగా అభివృద్ధి చెందుతోంది. హైటె క్‌సిటీ 34ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతోంది. 29.86ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి చెందనుంది. మరో 66ఎకరాల విస్తీర్ణంలో గచ్చిబౌలి తరహా ఐటీ పార్కుకు శ్రీకారం చుడుతున్నారు. కేసరపల్లిలో విజయవాడ విమానాశ్రయం అభిముఖాన ఒకేచోట 130 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది.
 
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ స్వరూపం
33335566.jpgఅమరావతి రాజధాని ప్రాంతంలో హెచ్‌సీఎల్‌ సంస్థ ఐటీ డెవల్‌పమెంట్‌ - ట్రెయినింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తుంది. రూ.700 కోట్ల వ్యయంతో మొత్తంగా ఈ రెంటుచోట్ల పెట్టుబడులు పెడుతుంది. కేసరపల్లిలో రూ.400 కోట్ల వ్యయంతో గ్లోబల్‌ ఐటీ డెవల్‌ప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులోనే ఆర్‌అండ్‌డీ విభాగం ఉంటుంది. తొలి దశలో నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా 1000 మందితో కూడిన ట్రైనింగ్‌ సెంటర్‌ను కూడా నెలకొల్పుతున్నారు.
 
ఏపీ ఐటీ రంగంలోనే పెను విప్లవం
రాష్ట్ర ఐటీ రంగంలోనే హెచ్‌సీఎల్‌ ఏర్పాటు ఒక పెనువిప్లవం. ఇదో చారిత్రాత్మక ఘట్టం. దేశంలోనే అతిపెద్ద ఐటీ క్యాంపస్‌ రాష్ర్టానికి గర్వకారణం. ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలన్న మా లక్ష్యానికి హెచ్‌సీఎల్‌ సంస్థ ఎంతో తోడ్పాటునందించింది. హెచ్‌సీఎల్‌ కొత్త శక్తినిచ్చింది. ఈ క్యాంపస్‌ నుంచి నాణ్యమైన సేవలు అందించటం జరుగుతుంది. నాలుగువేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వెయ్యిమందికి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది.
- నారా లోకేష్‌ ఐటీ శాఖ మంత్రి
 
తెలుగు నేర్చుకుంటా..
నాకు తమిళం ఇంగ్లీషు వచ్చు. ఏపీలో సంస్థను నెలకొల్పుతున్నందున తెలుగు నేర్చుకోవాలని, తెలుగులో మాట్లాడాలని ఉంది. స్థానికతకు దగ్గరగా ఉండాలన్న ప్రయత్నంతోనే నేను తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నాను.
- శిఖర్‌ మల్హోత్రా, వైస్‌ చైర్మన్‌ హెచ్‌సీఎల్‌
 
మా కమిట్‌మెంట్‌ చూడండి
మా కమిట్‌మెంట్‌ను అందరూ చూడండి. అందమైన అమరావతిలో అంతే అందమైన క్యాంప్‌సను ఏర్పాటు చేస్తున్నాం. స్థానికంగా చాలా టాలెంట్‌ ఉంది. వారి టాలెంట్‌కు మరింత మెరుగులు దిద్దుతాం. మీ నైపుణ్యాన్ని వెలికితీయండి. ఇక్కడి స్థానికులు వేరే రాష్ర్టాలలో పనిచేస్తున్నందున కమ్‌ బ్యాక్‌ హోమ్‌ నినాదంతో ముందుకు వెళుతున్నాం. లోకల్‌ టాలెంట్‌ అంతా ఇక్కడే ఉండాలన్నది మా అభిమతం.
- రోషిణీ నాడార్‌ మల్హోత్రా, సీఈవో, హెచ్‌సీఎల్‌
 
అద్భుతం.. హెచ్‌సీఎల్‌ డిజైన్స్‌
కేసరపల్లిలో ఏర్పాటు చేయనున్న హెచ్‌సీఎల్‌ సంస్థ క్యాంపస్‌ ఆర్కిటెక్చర్‌ చిత్రాలను ఈ సందర్భంగా ఆ సంస్థ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా ప్రదర్శించారు. జీ+6 విధానంలో నాలుగు భవన సముదాయ శ్రేణిలో నిర్మిస్తున్నారు. పూర్తిగా పచ్చదనంతో కూడిన వాతావరణంలో ఆహ్లాదకరంగా క్యాంప్‌సను తీర్చిదిద్దనున్నారు. భవన సముదాయాల మధ్య ల్యాండ్‌ స్కేపింగ్‌, ఇంటీరియర్‌ వినూత్నంగా ఉంటుంది. ట్రెయినింగ్‌ సెంటర్‌లో సౌకర్యాలు కల్పిస్తున్నారు.
Posted
ఐటీ ప్రస్థానంలో ముందడుగు
09-10-2018 02:24:27
 
636746486675842468.jpg
  • హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌కు భూమిపూజ
  • ఇది ఆరంభమే.. అంచెలంచెలుగా ఎదిగి చూపిస్తాం
  • ఐటీ, ఎలక్ర్టానిక్స్‌లో 2 లక్షల ఉద్యోగాలు..
  • ఇప్పటికే 43 వేలమందికి 
    మిగతావారికీ ఏడాదిలోపే..
  • ఉద్యోగాలెలా ఇస్తారన్నవారికి జవాబిదే: లోకేశ్‌
విజయవాడ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ ఏర్పాటు చరిత్రాత్మకం. ఇది ప్రారంభం మాత్రమే. హైదరాబాద్‌లో ఐటీకి ఏ విధంగా సీఎం చంద్రబాబు పునాదులు వేశారో.. ఏపీలో కూడా అలాగే ముందుకెళుతున్నారు. ఐటీ పునాదుల మీద అంచెలంచెలుగా ఎదుగుతాం. అనేక సంస్థలు మాతో మాట్లాడుతున్నాయి. ఎక్కడా లేనివిధంగా మనదగ్గర యువ నైపుణ్యాలు ఉన్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు’’ అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఐటీలో ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారని, 43 వేల ఉద్యోగాలను ఈ రంగంలో కల్పించి.. అదెలా సాధ్యమనేది చేతల్లో చేసి చూపించామని మంత్రి పేర్కొన్నారు. ‘‘ఐటీరంగంలో లక్ష ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఎలక్ర్టానిక్స్‌ రంగంలో మరో లక్ష ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నాం. ఈ రెండు రంగాల్లో కలిపి 2019 నాటికి మొత్తం రెండు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నాం’’ అని వివరించారు. సోమవారం కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ పాల్గొన్నారు.
 
నాయకత్వం, దూరదృష్టి ఉంటే ఏదైనా సాధించవచ్చునని, దీనికి హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు తమ రంగాల్లో ఎదిగిన తీరే నిదర్శనమని ఈ సందర్భంగానూ, అనంతరం మీడియా సమావేశంలోనూ లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ‘‘1965లో సింగపూర్‌ వెనుకబడిన ఓ మత్స్యకార ప్రాంతం. లీ కువాన్‌ అనే నాయకుడి విజన్‌తో బలమైన ఆర్థిక, పర్యాటక శక్తిగా సింగపూర్‌ ఎదిగింది. చైనా, ఇండియా తలసరి ఆదాయం 1988లో సమానం. జియోపింగ్‌ ఆర్థిక సంస్కరణల కారణంగా భారతదేశం కంటే నాలుగురెట్లు అధికంగా తలసరి ఆదాయం ఇప్పుడు చైనా పొందుతోంది. ఇదే కోవలో తమిళనాడులోని ఒక చిన్నగ్రామంలో పుట్టి, సాధారణ స్కూల్‌లో చదువుకున్న శివనాడార్‌..దేశంలోనే ఐదు ఉత్తమ ఐటీ సంస్థలలో ఒకటిగా హెచ్‌సీఎల్‌ ని నిలిపారు’’ అని కొనియాడారు. కేసరపల్లిలో ఏర్పాటుచేస్తున్న హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ దేశంలోనే అతిపెద్ద సెంటర్‌గా ఉండబోతున్నదన్నారు.కాగా, యువనేస్తం ద్వారా 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరికి నిరుద్యోగ భృతిని ఇవ్వడమే కాదు..స్కిల్‌ డెవల్‌పమెంట్‌, పోటీ పరీక్షలకు సన్నద్ధత ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారిని ఇబ్బంది పెట్టడానికే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. 16 కేసులు ఎదుర్కొంటున్న వారు.. విశ్వసనీయత, అవినీతి రహిత పాలన గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుందంటూ పరోక్షంగా జగన్‌పై విరుచుకుపడ్డారు. మొత్తం 19 బృందాలు, 200 మంది అంత భారీ హడావుడి చేస్తున్నప్పుడు.. అనుమానం రాకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రైవేటు సంస్థలపై దాడులు చేస్తుంటే ఎందుకు స్పందిస్తున్నారన్న పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆంరఽధా సంస్థలపై దాడులు చేస్తున్నప్పుడు, స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదా అని ప్రశ్నించారు.
 
 
ఉద్యోగాలు కల్పించడమే తప్పా: లోకేశ్‌
ఐటీ సంస్థలకు భూముల కేటాయింపులపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించటమే తాము చేసిన తప్పా అని లోకేశ్‌ ప్రశ్నించారు. ‘‘హెచ్‌సీఎల్‌, జోహో, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ వంటి పెద్ద సంస్థలను రాష్ట్రానికి తీసుకు రావటం తప్పా? వాటికి భూములు ఇవ్వడం తప్పా? ఏపీలో పుట్టిపెరిగిన కంపెనీలకు భూములు ఇవ్వడం తప్పా?’’ అంటూ నిలదీశారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ సీఈవో రోషిణీ నాడార్‌ మల్హోత్రా వివరించారు. వేయిమందితో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, హెచ్‌సీఎల్‌ వైస్‌ చైర్మన్‌ శిఖర్‌ మల్హోత్రా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, విజయానంద్‌, బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Advertiseme

Posted
ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం
హెచ్‌సీఎల్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షురాలు శ్రీమతి శివశంకర్‌
8ap-state5a.jpg

ఈనాడు, అమరావతి: అమరావతి స్థూపం, స్థానిక తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా విజయవాడ హెచ్‌సీఎల్‌ ప్రాంగణంలోని భవనాల నిర్మాణం, అలంకరణ ఉంటుందని సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షురాలు శ్రీమతి శివశంకర్‌ వెల్లడించారు. ఎక్కడ పనిచేస్తే అక్కడి  సంస్కృతి, సంప్రదాయాల్లో తాము భాగమవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. హెచ్‌సీఎల్‌ ప్రాంగణం భవన నిర్మాణాల శంకుస్థాపనలో పాల్గొన్న ఆమె.. ‘ఈనాడు-ఈటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘దేశంలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో విజయవాడ ఒకటి. మొదటి దశ నిర్మాణాలను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిచేసి 1200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నాం. స్థానికులకే ప్రాధాన్యమివ్వనున్నాం. కళాశాలల నుంచి కొత్తగా బయటకు వచ్చే ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఈ ప్రాంగణంలో ఎక్కువ అవకాశాలను కల్పిస్తాం. విజయవాడలోని కళాశాలల వారే కాకుండా, ఇక్కడివాళ్లు ప్రపంచంలో ఎక్కడ చదువుకున్నా అవకాశం ఇస్తాం. ఈ ప్రాంతానికి చెందిన సీనియర్‌ ఇంజినీర్లు సైతం ఎక్కడెక్కడో పనిచేస్తున్న వాళ్లు స్వస్థలానికి రావాలని కోరుకుంటే అలాంటివారికీ ప్రాధాన్యమిస్తాం. సొంతూరు, కుటుంబాలకు దగ్గరిగా రావడానికి వారికి ఇది సదవకాశం. ఒకేసారి వెయ్యి మంది విద్యార్థులకు శిక్షణనిచ్చే కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటుచేస్తున్నాం. ఇక్కడి యువతకు ఇది ఉపయోగకరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అవసరమైన ఐటీ రంగ ఉత్పత్తులు, అప్లికేషన్ల అభివృద్ధిపై ఈ ప్రాంగణం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పరిశోధనలకు ప్రాధాన్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ఐటీ విధానం చాలా బాగుంది. అతి తక్కువ సమయంలోనే అన్ని అనుమతులనిచ్చి భవన నిర్మాణాలు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం సహకరించింది..’ అని శ్రీమతి శివశంకర్‌ వెల్లడించారు.

ఇబ్బంది పెట్టాలనే ఐటీ సోదాలు: లోకేశ్‌
ఈనాడు, అమరావతి: ఇక్కడివారిని భయపెట్టాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో ఒకేసారి 19 బృందాలుగా 200 మంది ఐటీ సిబ్బంది సోదాలు చేశారని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఒకేసారి కక్ష కట్టినట్టు 20కిపైగా సంస్థలపై దాడులు చేస్తే ప్రభుత్వం స్పందించకుండా ఎందుకుంటుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వాళ్లను భయపెడుతుంటే, వారిని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నారు. మూకుమ్మడిగా అందరిపై దాడులంటే కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని స్పష్టమవుతోందని వివరించారు.

Posted
హెచ్‌సీఎల్‌ వచ్చేసింది
అంతర్జాతీయ ఐటీ సంస్థకు భూమి పూజ
పదేళ్లలో పది వేల ఉద్యోగాలు
చిరస్మరణీయ ఘట్టమన్న మంత్రి లోకేశ్‌
8ap-main1a.jpg

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ఐటీ రంగ చరిత్రలో హెచ్‌సీఎల్‌ రాక ప్రత్యేకమైనదని, చిరస్మరణీయమవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఏర్పాటుచేస్తున్న హెచ్‌సీఎల్‌ సంస్థ భవన నిర్మాణాల భూమి పూజలో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇప్పటివరకూ వచ్చిన ఐటీ సంస్థల్లో హెచ్‌సీఎల్‌ అతి పెద్దదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హెచ్‌సీఎల్‌ అధినేత శివ్‌నాడార్‌ల మధ్య చర్చల ఫలితంగానే రాష్ట్రానికి హెచ్‌సీఎల్‌ వచ్చిందని వివరించారు. రాజధానిలో ఏర్పాటవుతున్న హెచ్‌సీఎల్‌ ప్రాంగణం దేశంలోనే అతిపెద్ద శాఖగా మారనుందని, రూ.750 కోట్ల పెట్టుబడిని రెండు దశల్లో పెడుతున్నారని వివరించారు. పదేళ్లలో పది వేల ఉద్యోగాలను అంతర్జాతీయ సంస్థ హెచ్‌సీఎల్‌ ఒక్కటే కల్పిస్తున్నట్టు వివరించారు. తాజాగా శంకుస్థాపన చేసిన మొదటి భవనాన్ని ఏడాదిలోపే పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. ఇక్కడ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని కూడా హెచ్‌సీఎల్‌ ఏర్పాటుచేసి స్థానిక యువతకు శిక్షణ అందించనుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌సీఎల్‌ కొత్త ప్రాంగణం ఏర్పాటు సంతోషదాయకమని సంస్థ సీఈవో రోషిణి నాడార్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంగణం ఐటీ రంగంలోని అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ఎదుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, హెచ్‌సీఎల్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షురాలు శ్రీమతి శివశంకర్‌, ముఖ్య మానవ వనరుల అధికారి వి.వి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Posted
కేసరపల్లి చెరువుకు కొత్త అందాలు..
కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి చెరువును సుందరంగా తీర్చిదిద్దేందుకు కూడా సీఆర్డీయే బిడ్లను పిలిచింది. విజయవాడ- గన్నవరంల మధ్య జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ చెరువును అభివృద్ధి పరచేందుకు ఇప్పటికే సంస్థ చర్యలు తీసుకుంది. అయితే ఇంకొన్ని పనులు మాత్రం మిగిలి ఉన్నాయి. నిత్యం వేలాదిమంది ప్రజలు, విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే వందలాదిమంది దేశ, విదేశ ప్రముఖులు ఈ చెరువు పక్కగా ప్రయాణిస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేయించాలని సీఆర్డీయే నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ చెరువుకు సుందరమైన ప్రవేశద్వారాలు (ఆర్చ్‌లు), చుట్టూ ఆకర్షణీయంగా కనిపించే కంచెను ఏర్పాటు చేయించనుంది. వీటికి రూ.32.97 లక్షలు అవసరమని అంచనా వేసింది. ఆసక్తి ఉన్న వారు తమ టెండర్లను సమర్పించేందుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువునిచ్చింది.
  • 2 weeks later...
  • 2 weeks later...
Posted
హెచ్‌సీఎల్‌’లో మరో 500 ఉద్యోగాలు
గన్నవరం మేథాటవర్స్‌లో ప్రారంభించిన హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ర్టీట్‌ నెలరోజుల్లోనే విస్తరణకు సిద్ధమైంది. ప్రారంభ సమయంలో సుమారు 900 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ క్రమంలో చాలా త్వరలోనే అది విస్తరణ బాటకు సిద్ధమైంది. మరో 500 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు త్వరలోనే నియామకాలు చేపడతామని ప్రభుత్వానికి మాటిచ్చింది.
  • 2 weeks later...
  • 3 weeks later...
Posted
హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ పనులు.. శరవేగంగా..
01-12-2018 08:40:53
 
636792504508684824.jpg
  • ఏకకాలంలో సమాంతరంగా పనులు
  • నాలుగు టవర్లు, కేఫ్‌టీరియా, సబ్‌స్టేషన్‌ పనులు షురూ
  • అత్యద్భుత ఆర్కిటెక్చర్‌ డిజైన్‌తో కేఫ్‌టీరియా
  • ఆవరణలోనే రెడీమిక్స్‌ ప్లాంట్‌
విజయవాడ(ఆంధ్రజ్యోతి): సైబర్‌ వాడ కేసరపల్లిలో ఐటీ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్‌ తన ఆర్‌అండ్‌డీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ భవన సముదాయ నిర్మాణ పనులను ప్రారంభించింది. హెచ్‌సీఎల్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 29.7 ఎకరాల విస్తీర్ణం చుట్టూ ముందు ప్రహరీ గోడ పనులను ప్రారంభించింది. ప్రహరీ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. సమాంతరంగా లోపల విస్తీర్ణంలో భవన సముదాయ నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. భవన సముదాయ నిర్మాణ పనులకు సంబంధించి నిర్దేశించుకున్న మార్కింగ్‌ ప్రకారం పిల్లర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. టవర్‌ - 1 అనేది ఏస్‌ అర్బన్‌ హైటెక్‌ సిటీ వైపుగా దక్షిణం దిక్కున నిర్మించటానికి మార్కింగ్‌ చేశారు.
 
టవర్‌ - 1ను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కార్యకలాపాల కోసం వినియోగించుకుంటారు. భవన సముదాయాలలో ప్రధానంగా ముందు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పనులు చేపడుతున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పూర్తికాగానే.. ఇందులో స్థానికంగా ఉండే యువతకు పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ముందుగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పనులను ప్రారంభిస్తోంది. ఆ తర్వాత సమాంతరంగా మూడు టవర్లు, ఒక కేఫ్‌టేరియా, సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులను చేపట్టడా నికి శ్రీకారం చుట్టారు.
 
టవర్‌ - 1 కు అభిముఖంగా తూర్పు దిక్కున కేఫ్టీరియా ఏర్పాటుకు మార్కింగ్‌ చేశారు. పనులు ప్రారంభించారు. సంస్థలో పనిచేసే సిబ్బంది కోసం ఫలహారశాలను తీర్చిద్దటానికి శ్రీకారం చుట్టారు. కేఫ్‌టేరియా అనేది గొడుగు ఆకారంలో ఉంటుంది. ఇందులోనే ఫుడ్‌కోర్టులు, కాఫీ క్లబ్‌లు, జిమ్‌లు కూడా ఉంటాయి. టవర్‌ - 1, కేఫ్‌ టేరియా వెనుక భాగంలో టవర్‌ - 2, టవర్‌ - 3 , టవర్‌ - 4 నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. టవర్‌ - 1, టవర్‌ - 3 సమీపంలో వెనుక భాగంలో సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులకు ఉపక్రమించారు. క్షేత్రస్థాయిలో పనులు చేపట్టడానికి భారీక్రేన్‌ను కాంట్రాక్టు సంస్థ రప్పించిం ది. నిర్మాణ పనుల కోసం క్రేన్‌ను బిగించారు. స్థానికం గానే రెడీ మిక్స్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయటానికి సామాగ్రిని తెప్పించారు. రెండు, మూడు రోజుల్లో రెడీమిక్స్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. సువిశాల 29 ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టే దగ్గర తప్పితే ఎక్కడా ఒక్క వృక్షాన్ని కూడా కదిలించకుండా నిర్మాణ పనులు చేపడుతుండటం విశేషం.
  • 2 months later...
Posted
 

విజయవాడలోని వి.ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో 2019 ఫిబ్రవరి 2 న 'క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్' #APSSDC నిర్వహిస్తోంది. అర్హత గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను. #APSSDCJOBFAIR2019

DyOLtHxU0AI4OP9.jpg
 
  •  
  • 4 weeks later...
Posted

హెచ్సిఎల్ విజయవాడ ఉద్యోగాలు కేవలం 520 521 ,522 ,534 పిన్ కోడ్ తో మొదలయ్యే adress proof లు ఉన్న అభ్యర్థులు అర్హులు అంట.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...