Jump to content

HCL Technologies IT SEZ (Special Economic Zone)


Recommended Posts

HCL State Street center inaugurated in Medha Towers Vijayawada. Spread over 63,000 sq ft, the joint venture is expected to provide 1,000 high-end jobs in capital markets, fund administration and investment. HCL will start construction of its SEZ near Vijayawada from October 8th.

lIJt6CB.jpg
DnBcg1jXsAApdhR.jpg
Link to comment
Share on other sites

  • Replies 102
  • Created
  • Last Reply

Top Posters In This Topic

బెజవాడకు బిగ్‌ ఐటీ ఇండస్ర్టీ
15-09-2018 07:52:43
 
636725947648188793.jpg
  • ‘స్టేట్‌ స్ర్టీట్‌’ ఏర్పాటుతో ఐటీకి ఊపు
  • ఇది హెచ్‌సీఎల్‌ అనుబంధ సంస్థ
  • ఐటీ ఆధారిత ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సేవలు లభ్యం
  • 1000 మందికి ఉద్యోగాలు
విజయవాడ: భారీ ఐటీ పరిశ్రమ ‘స్టేట్‌ స్ర్టీట్‌ హెచ్‌సీఎల్‌ సర్వీసెస్‌’ సంస్థ కేసరపల్లిలోని ఏస్‌ అర్బన్‌- ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలోని ‘మేథ’ టవర్‌లో గురువారం ప్రారంభమయింది. దీంతో భారీ ఐటీ కేంద్రంగా బెజవాడ వృద్ధి చెందటానికి మార్గం సుగమం అయింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థ సహకారంతో దాని భాగస్వామ్య సంస్థ ‘మేథ’ లో కొలువు తీరటంతో బిగ్‌ ఐటీ ఇండస్ర్టీ లేని లోటు తీరింది. ఇది ఒక ఐటీ ఆధారిత సంస్థ. క్యాపిటల్‌ మార్కెట్‌ సేవలను అందిస్తుంది. కామర్స్‌ పట్టభద్రులు, కామర్స్‌ పీజీ, సీఏ చేసిన వారికి క్యాపిటల్‌ మార్కెట్‌ సేవ లందించే ‘స్టేట్‌ స్ర్టీట్‌’ బెజవాడ కేంద్రంగా విస్తృత అవకాశాలను అందించనుంది. వినాయక చవితి పర్వదినాన రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌ అట్టహాసంగా ఈ బిగ్‌ ఐటీ కంపెనీని ప్రారంభించారు.
 
రాజధాని ప్రాంతం విజయవాడకు అను బంధంగా ‘సైబర్‌వాడ’గా అభివృద్ధి చెందుతున్న కేసరపల్లిలో ‘స్టేట్‌ స్ర్టీట్‌ హెచ్‌సీఎల్‌ సర్వీసెస్‌’ సంస్థ ప్రారంభంతో భవిష్యత్తులో ఐటీరంగం మహా విస్తరణకు బీజం పడింది. గన ్నవరానికి సిసలైన వరంగా తన టెక్నాలజీస్‌ సంస్థను నెలకొల్పటానికి సిద్ధపడిన హెచ్‌సీఎల్‌ సంస్థ తనతోపాటు అనేక భాగస్వామ్య పక్షాలను కూడా తీసుకు వస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. తన భాగస్వామ్య కంపెనీ అయిన ‘స్టేట్‌ స్ర్టీట్‌ హెచ్‌సీఎల్‌’ సంస్థను తన కంటే ముందుగా తీసుకు వచ్చింది. వచ్చే నెల 8న గన్నవరంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ పార్క్‌ ఏర్పాటుకు భూమి పూజ జరగనుంది. ఈక్రమంలో ముందుగానే తమ భాగస్వామ్య సంస్థ ‘మేథ’ టవర్‌ లోని 63 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయించింది. స్టేట్‌ స్ర్టీట్‌ అనేది ఒక అమెరికన్‌ బే్‌స్డ్‌ కంపెనీ. దీని వ్యాపార కేంద్రం కూడా యూఎస్‌ కావటం గమనార్హం. 2012వ సంవత్సరంలో హెచ్‌సీఎల్‌ సంస్థ ‘స్టేట్‌ స్ర్టీట్‌ ’ కంపెనీని తన ఖాతాదారులకు క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను అందించటానికి వీలుగా భాగ స్వామ్య సంస్థగా తీసుకుంది. విదేశాలలో మనీలాతోపాటు మన దేశంలో కోయం బత్తూరు, చెన్నై నగరాలలో ఈ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది.
 
అర్థ దశాబ్ద కాలానికి పైగా ఈ సంస్థ అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుతం నాలుగు వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. కేసరపల్లిలోని హైటెక్‌ సిటీలో మేథ టవర్‌లో భారీ విస్తీర్ణంలో నెలకొల్పిన అతి భారీ ఐటీ కంపెనీ కూడా ఇదే కావటం గమ నార్హం. ఈ కంపెనీ ఇక్కడ వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది. ప్రస్తుతం ఇప్పటికే 300 మందిని ఎంపిక చేశారు. మరో 700 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. స్టేట్‌ స్ర్టీట్‌ సంస్థ ఐటీ కంపెనీ కోవలోకి వస్తుంది. సాఫ్ట్‌వేర్స్‌ తయారు చేసే కంపెనీ కాదు. ఐటీ సంస్థలకు క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను అందిస్తుంది. ప్రధానంగా ఫండ్‌ అడ్మినిస్ర్టేషన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌, బ్రోకరేజ్‌, మిడిల్‌ అండ్‌ బ్యాక్‌ ఆఫీస్‌ (కస్టడీ అవసరాలు) తదితర సేవలను అందిస్తుంది. ఐటీ రంగం విభిన్న రంగాలలో విస్తృతం చెందుతుందనటానికి ‘స్టేట్‌ స్ర్టీట్‌’ కంపెనీ ఒక ఉదాహరణ. కామర్స్‌ పట్టభద్రులు, పీజీ కోర్సులు చేసిన వారు, సీఏ కోర్సులు చేసిన వారికి ఈ కంపెనీలో ఉద్యోగాలు లభిస్తాయి.
 
వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు
ఇప్పటి వర కు ‘మేథ’ టవర్‌లో చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో కంపెనీ 100 నుంచి 200 సంఖ్యలోపల ఉద్యోగులను తీసుకుంది. గతంలో ఇక్కడ ఒకటి, రెండు చిన్న ఐటీ కంపెనీలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వం కృషి వల్ల మేథ టవర్‌లోకి అనేక ఐటీ కంపెనీలు కొలువు తీరాయి. పెద్ద ఐటీ పరిశ్రమ వస్తే ఐటీ రంగం విస్తరణకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్న దశలో ప్రపంచ స్థాయి స్టేట్‌ స్ర్టీట్‌ ఏర్పడింది. ఒకేసారి వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించటంతోపాటు భారీ వేతనాలు కూడా అందుకునే అవకాశం ఉంది.
 
ఫార్చ్యూన్‌ 500 కంపెనీలలో ఇది ఒక్కటి మాత్రమే: ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌
ప్రపంచంలో ఫార్చ్యూన్‌- 500 కంపెనీలలో స్టేట్‌ స్ర్టీట్‌ హెచ్‌సీఎల్‌ సర్వీసెస్‌ కంపెనీ ఒకటి! ఐటీ అధారిత కంపెనీ అయిన ఇది ప్రధానంగా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను అందిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ 300 మందికి ఉపాధి కల్పించింది. రానున్న రోజుల్లో మిగిలిన 700 మందికి కూడా ఉద్యో గావకాశాలు కల్పించి మొత్తం 1000 మందికి ఉపాధి కల్పించనుంది. రాష్ట్ర విభజనకు ముందు మేథ ఐటీ టవర్‌లో 20 శాతం ఐటీ కంపెనీలు కూడా లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌కారణంగా అనేక ఐటీ కంపెనీలకు ఇక్కడకు తీసుకు రావటానికి తాము చేసిన కృషి ఫలించింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
రాజధానిలో ఐటీ విస్తరణకు అడుగులు
05-10-2018 07:44:37
 
636743222764135293.jpg
  • కేసరపల్లిలో 66 ఎకరాల వెటర్నరీ కళాశాల భూముల సేకరణ!
  • అంగీకరించని కాలేజీ యాజమాన్యం
  • సమీపంలోని భూముల కోసం అన్వేషణ
  • సంప్రదింపులతో సానుకూలత కోసం ప్రయత్నాలు
 
కేసరపల్లిలో ఐటీ పార్క్‌ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు అవసరమైన భూములపై దృష్టి సారించింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌కు సమీపంలోనే పశుసంవర్థక శాఖకు చెందిన 66 ఎకరాల భూములను ఇందుకు ఎంపిక చేసుకుంది. అయితే ఈ భూములు వెటర్నరీ కళాశాల వినియోగంలో ఉన్నాయి. ఆ శాఖకు ప్రత్యామ్నాయ భూములను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రతిపాదనకు కళాశాల యాజమాన్యం విముఖత వ్యక్తం చేస్తోంది. సంప్రదింపులతో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
 
 
సైబర్‌వాడగా రూపాంతరం చెందుతున్న కేసరపల్లిలో ‘గచ్చిబౌలి’ తరహా ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌కు కేటాయించిన పక్కనే పశు సంవర్థక శాఖకు చెందిన భూముల్లో ఐటీ పార్క్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాదాపుగా 66 ఎకరాల్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి తరహాలో ఐటీ పార్కును ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సంకల్పించింది. తాజాగా అధికారులు ఈ భూములను పరిశీలించారు. అయితే వెటర్నరీ కళాశాల యాజమాన్యం విముఖత వ్యక్తం చేస్తోంది. సంప్రదింపులతో ముందుకు వెళ్లాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.
 
 
విజయవాడ: రాజధాని ప్రాంతంలో ఐటీ పరిశ్రమ విస్తరణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చిన్న, మధ్య తరహా ఐటీ పరిశ్రమలన్నింటినీ ఒకే చోట కొలువు తీరటానికి వీలుగా తగిన మౌలిక సదుపాయాలతో ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం కేసరపల్లిలో పశు సంవర్థక శాఖ అధీనంలో ఉన్న భూములను సేకరించనుంది. తర్వాత వీటిని ఏపీఐఐసీకి స్వాధీనం చే స్తారు. ఏపీఐఐసీ ఇందులో లే అవుట్‌ వేసి ప్లాట్లుగా వర్గీకరణ చేపడుతుంది. వివిధ రకాల సైజులలో ప్లాట్లను వర్గీకరిస్తారు. లే అవుట్‌ ప్రకారం రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి కనెక్షన్‌, విద్యుత్తు వంటి సదుపాయాలను ఏపీఐఐసీ కల్పించనుంది.
 
అభివృద్ధి పరిచిన ప్లాట్లను లీజు ప్రాతిపదికన కానీ, ఔట్‌ రేట్‌ సేల్‌ (ఓఆర్‌ఎస్‌) విధానంలో విక్రయించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీఐఐసీ అభివృద్ధి చేపట్టిన ఇండస్ర్టియల్‌ పార్క్‌ (ఐపీ)లకు సంబంధించి చూస్తే అన్నింటి కీ ఔట్‌రేట్‌ సేల్‌ విధానాన్నే అనుసరిస్తున్నందున ఈ ఐటీ పార్క్‌ విషయంలో కూడా ఇదే అనుసరించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఐటీ పార్క్‌లో ప్లాట్లను దక్కించుకున్న సంస్థలు ఇక్కడే తమ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉంటుంది.
 
కేసరపల్లిలో ఇప్పటికే ఏస్‌ అర్బన్‌ - ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలో ఏర్పడిన మేథ ఐటీ టవర్‌లో ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీలు వచ్చాయి. ఇందులోనే దీనికి రెట్టింపు విస్తీర్ణంలో మరో భారీ ఐటీ టవర్‌ నిర్మాణం జరుగుతోంది. ఐటీ పార్క్‌కు కూతవేటు దూరంలోనే హెచ్‌ సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీకి 27 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూములు ఆర్టీసీకి చెందినవి. ఈ భూములలో ఆర్టీసీకి చెందిన జోనల్‌ డ్రైవింగ్‌ కాలేజీ, ఆర్టీసీ అకాడమీలు ఉండేవి. ఈ భూములను ఆర్టీసీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రత్యామ్నాయంగా ఆర్టీసీకి సూరంపల్లిలో భూములను కేటాయించింది. హెచ్‌ సీఎల్‌ టెక్నాలజీస్‌కు కేటాయించిన భూముల పక్కనే పశుసంవర్థక శాఖ భూములు ఉన్నాయి. ఎన్‌ టీఆర్‌ వెటరినరీ కళాశాల సమీపంలోనే ఉంది. ఈ భూములు వెటరినరీ కళాశాల వినియోగంలో ఉన్నాయి. వెటరినరీ కాలేజీకి చెందిన లైవ్‌స్టాక్‌ కాంప్లెక్స్‌ తో పాటు ఒకటి, రెండు చిన్నపాటి నిర్మాణాలు ఉన్నాయి. ఇవిపోతే దాదాపుగా ఖాళీ భూములు ఉన్నాయి.
 
ప్రత్యామ్నాయంగా కొండపావులూరులో భూములు
పశు సంవర్థక శాఖకు ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో రెవెన్యూ యంత్రాంగం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. బుధవారం పశుసంవర్థకశాఖ, వెటరినరీ కాలేజీ యాజమాన్యంతో పాటు, రాష్ట్ర ఐటీ విభాగం అధికారులు, రెవెన్యూ అధికారులు కొండపావులూరులో జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేశారు.
 
వెటర్నరీ కళాశాల యాజమాన్యం విముఖత
ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన భూములను పరిశీలించిన తర్వాత వెటరినరీ కళాశాల యాజమాన్యం ఆ భూములను తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ భూములు దూరాన ఉండటం వల్ల తమకు సమస్యగా ఉంటుందని రెవెన్యూ అధికారులకు సూచించినట్టు సమాచారం. కళాశాల ఒకచోట, లైవ్‌స్టాక్‌ దూరాన ఉంటే ఇబ్బందిగా ఉంటుందని తెలిపినట్టు సమాచారం. వెటర్నరీ కాలేజీ యాజమాన్యం నుంచి వచ్చిన ప్రతిస్పందనను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళనున్నారు.
 
 
సంప్రదింపులతో ముందుకు
వెటర్నరీ భూములను స్వాధీనంలోకి తీసుకు వెళ్ళటానికి, కాలేజీ పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏపీఐఐసీ, రెవెన్యూ యంత్రాంగాలు సంప్రదింపుల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వెళ్ళాలని ఈ రెండు సంస్థలు భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా దగ్గర్లో భూములు ఎక్కడ ఉన్నాయన్నదానిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది.
Link to comment
Share on other sites

Lokesh NaraVerified account @naralokesh 2m2 minutes ago

 
 

Come Monday and the IT sector in Andhra Pradesh will receive a major boost in the form of HCL Technologies Limited breaking ground for its Rs. 400 Cr. R&D and Development Center coming up on 28 acres in Kesarapalli village in Gannavaram under Phase 1.

Do0MmzWVAAA85YX.jpg
1 reply 0 retweets 1 like
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

 
 
 
 
 
 
 

HCL will invest a total of Rs. 750 Cr. in two phases creating 7500 jobs in 10 years' timeline from the start of the project. Phase-1 of HCL is expected to be completed in 7 years’ time, employing more than 4000 IT professionals.

 
 
 
 
 
 
 
 
 

Phase-2 of HCL will be taken up later in Amaravati, the new Capital of Andhra Pradesh in an extent of 20 acres. HCL will invest Rs. 350 Cr. in this phase and generate employment for 3500 IT professionals in 5 years’ time.

Edited by sonykongara
Link to comment
Share on other sites

ఏపి ఐటి రంగంలో, రేపు కీలక మైలురాయి…

   
hcl-07102018.jpg
share.png

నవ్యాంధ్ర ఐటి రంగంలో, రేపు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అక్టోబర్ 8 న గన్నవరం, కీసరపల్లి గ్రామంలో హెచ్సిఎల్ భూమి పూజ కార్యక్రమం జరగనుంది.మధ్యాహ్నం 3 గంటలకు హెచ్సిఎల్ గన్నవరం క్యాంపస్ కి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.ఈ కార్యక్రమంలో హెచ్సిఎల్ అధినేత శివ్ నాడార్ కుమార్తె హెచ్సిఎల్ కార్పొరేషన్ సిఈఓ రోషిని నాడార్ పాల్గొననున్నారు.స్థానిక ప్రజాప్రతినిధులు,మంత్రులు దేవినేని ఉమ,కొల్లు.రవీంద్ర తదితరులు పాల్గొననున్నారు. మే 12,2017 న మంత్రి నారా లోకేష్ హెచ్సిఎల్ అధినేత శివ్ నాడార్ ని ఢిల్లీ లోని హెచ్సిఎల్ కార్యాలయంలో కలిసారు.ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1 అనడానికి ఈ భేటీ ఒక ఉదాహరణ గా నిలిచింది.హెచ్సిఎల్ తో ఒప్పందం చేసుకున్న 45 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చి,భూమి కేటాయించి,ఆ భూమి పాత్రలను తీసుకోని నేరుగా హెచ్సిఎల్ కంపెనీకి వెళ్లి అధినేత శివ్ నాడార్ కి అందజేసారు మంత్రి నారా లోకేష్.

 

hcl 07102018 2

నలభై ఏళ్ల చరిత్ర... ప్రపంచ ఐటీ రంగంలో హెచ్సిఎల్ ఒక నమ్మకమైన కంపెనీ గా పేరుగాంచింది.40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో హెచ్సిఎల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 250 కంపెనీలకు,గ్లోబల్ 2000 కంపెనీల్లో 650 కంపెనీలకు వివిధ ఐటీ సర్వీసెస్ అందించి అగ్రగామిగా ఎదిగింది.8 యూఎస్ బిలియన్ డాలర్ల రెవిన్యూ సాధించింది.41 దేశాల్లో కార్యకలాపాలు,ప్రపంచవ్యాప్తంగా 1 లాక్షా 24 వేల మంది ఉద్యోగులు హెచ్సిఎల్ కంపెనీలో పనిచేస్తున్నారు.ప్రపంచవ్యాపంగా ఐటీ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి,నూతన ఆవిష్కరణల పరిశోధన కేంద్రాలు,డెలివరీ కేంద్రాలు హెచ్సిఎల్ నిర్వహిస్తుంది.

hcl 07102018 3

నవ్యాంధ్రప్రదేశ్ లో హెచ్సిఎల్... ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మొదటి భారీ పెట్టుబడి హెచ్సిఎల్ పెట్టబోతోంది.750 కోట్ల పెట్టుబడి,7500 మందికి ఉద్యోగాలు పది ఏళ్లలో కల్పించబోతుంది. రెండు దశల్లో హెచ్సిఎల్ అమరావతి లో కంపెనీ కార్యకలాపాలు విస్తరించనుంది.గన్నవరం లోని కీసరపల్లి గ్రామంలో 28 ఎకరాల విస్తీర్ణంలో మొదటి దశ పనులు ప్రారంభించబోతుంది.ఇక్కడ 400 కోట్ల పెట్టుబడితో పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనుంది హెచ్సిఎల్.ఈ కేంద్రంలోనే 4000 మందికి హై ఎండ్ ఉద్యోగాలు రానున్నాయి.కేవలం ఒక్క సంవత్సరంలోనే మొదటి భవనం నిర్మాణం పూర్తి చేయనుంది హెచ్సిఎల్.మిగిలిన భవనాలను రానున్న ఏడేళ్లలో పూర్తి చేయనుంది.రెండొవ దశలో హెచ్సిఎల్ కంపెనీని అమరావతి నూతన రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది.20 ఎకరాల్లో కంపెనీ ఏర్పాటు కానుంది.5 సంవత్సరాల కాల వ్యవధిలో 350 కోట్ల పెట్టుబడి,3500 మందికి ఉద్యోగాలు రెండొవ దశలో భాగంగా హెచ్సిఎల్ కల్పించనుంది.

Link to comment
Share on other sites

ఐటీ దిగ్గజం వచ్చేసింది
08-10-2018 02:48:44
 
636745637213011368.jpg
  • 750 కోట్లు.. 7,500 ఉద్యోగాలు
  • హెచ్‌సీఎల్‌కు నేడు భూమి పూజ
  • తొలి దశగా గన్నవరంలో శ్రీకారం
  • కేసరపల్లి వద్ద 28 ఎకరాల్లో క్యాంపస్‌
  • 400 కోట్ల పెట్టుబడితో 4 వేల ఉద్యోగాలు
  • రెండో క్యాంపస్‌ అమరావతిలో ఏర్పాటు
  • 350 కోట్లతో 3,500 మందికి ఉపాధి
  • విశాఖలో విప్రో క్రియాశీలం
  • 3 నెలల్లో 1000 ఉద్యోగాలకు ఓకే
  • రెండో దశ నిర్మాణానికీ అంగీకారం
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ వచ్చేసింది. రూ.750 కోట్ల పెట్టుబడితో 7,500 మందికి ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంతో సోమవారం గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఈ సంస్థ తొలి క్యాంప్‌సకు శంకుస్థాపన జరుగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌, హెచ్‌సీఎల్‌ అధినేత శివ్‌ నాడార్‌ కుమార్తె, హెచ్‌సీఎల్‌ సీఈవో రోషినీ నాడార్‌ పాల్గొననున్నారు. శివ్‌ నాడార్‌తో పలు దఫాలు లోకేశ్‌ చర్చలు జరిపి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించడమే గాక.. ఏడాది కాలంలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన దశకు తీసుకొచ్చారు. తొలి దశలో గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద 28 ఎకరాల్లో హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ భవనం నిర్మిస్తారు. ఏడాదిలోపు దీనిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ రూ.400 కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. అనంతరం రాజధాని అమరావతిలో 20 ఎకరాల్లో మరో క్యాంప్‌సను ప్రారంభిస్తారు. ఇక్కడ రూ.350 కోట్ల పెట్టుబడితో 3,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమరావతి క్యాంప్‌సను ఐదేళ్లలో సిద్ధం చేస్తారు. రాష్ట్ర ఐటీ రంగంలో హెచ్‌సీఎల్‌ ఆగమనం మెగా పెట్టుబడిగా భావించవచ్చు. ఇంకోవైపు.. జగద్విఖ్యాత విప్రో సంస్థ కూడా విశాఖలో తన కార్యకలాపాలను విస్తృతం చేసింది.
 
 
హెచ్‌సీఎల్‌.. 40 ఏళ్ల చరిత్ర
హెచ్‌సీఎల్‌ది 40 ఏళ్ల చరిత్ర. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో సగం, గ్లోబల్‌ 2వేల కంపెనీల జాబితాలో 650 సంస్థలకు ఇది ఐటీ సేవలు అందిస్తోంది. 41దేశాల్లో 1.24 లక్షల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణల పరిశోధన కేంద్రాలు, డెలివరీ కేంద్రాలను హెచ్‌సీఎల్‌ నిర్వహిస్తోంది.
 
 
45 రోజుల్లో భూమి పత్రాలు.. కంపెనీకే వెళ్లి ఇచ్చిన లోకేశ్‌
వాస్తవానికి హెచ్‌సీఎల్‌ లాంటి దిగ్గజ సంస్థను ఆకట్టుకోవడానికి అన్ని రాష్ట్రాలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. నూతన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అంటే చాలా ఆలోచించి కాని రారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌ ఆయన్ను ఇక్కడకు వచ్చేలా ఒప్పించారు. 2017లో హెచ్‌సీఎల్‌ అధినేత శివ్‌ నాడార్‌ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో లోకేశ్‌ కలిశారు. రాష్ట్రంలో ఐటీ ప్రోత్సాహానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో ఏపీ నంబర్‌వన్‌గా ఉందని.. అన్ని అనుమతులూ వేగంగా, పారదర్శకంగా ఇస్తోందని.. రాష్ట్రానికి రావాలని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కోరారు. నూతన రాష్ట్రంలో ఉన్న కష్టాలు, మౌలిక వసతుల కల్పనకు చంద్రబాబు పడుతున్న కష్టం గురించి వివరించారు. దేశంలో ఐటీ గురించి మొదట మాట్లాడింది, ఆ రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంది చంద్రబాబేనని ఆ రోజు శివ్‌ నాడార్‌ కూడా పేర్కొన్నారు. నవ్యాంధ్రకు వచ్చేందుకు అంగీకరించారు. అనంతరం సరిగ్గా 45 రోజుల్లోనే హెచ్‌సీఎల్‌కు భూ కేటాయింపు, ఇతర ప్రక్రియలను పూర్తిచేసేశారు. స్వయంగా లోకేశ్‌ ఆ పత్రాలను హెచ్‌సీఎల్‌ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి మరీ అందించారు. 2019 నాటికి ఐటీలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ర్టానిక్స్‌ రంగంలో రెండు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా చేస్తున్న కృషికి.. హెచ్‌సీఎల్‌ రాక తోడవుతుందని భావిస్తున్నారు.
 
 
విప్రో కార్యకలాపాలకు ఊపు..
మరోవైపు.. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నా.. తగిన స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించని విప్రో కంపెనీని చురుగ్గా వ్యవహరించేలా ప్రభుత్వం ఒప్పించింది. ఫలితంగా మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. విప్రో క్యాంప్‌సకు గత ప్రభుత్వాల కాలంలో ఏడెకరాలు కేటాయించారు. అందులో ఒక భవనాన్ని మాత్రమే ఆ సంస్థ నిర్మించింది. ఉద్యోగులు కూడా 200 మందే ఉన్నారు. దిగ్గజ కంపెనీ అయినా.. రాష్ట్రంలో తన కార్యక్రమాలను వేగవంతం చేయలేదు. దీంతో ఇటీవల లోకేశ్‌ ఆ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరిహెగ్డేతో భేటీ అయ్యారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగింది పక్కనపెట్టాలని.. ఇప్పుడు చురుగ్గా ఉండాలని కోరారు. ఆ దిశగా జరిపిన చర్చలు ఫలించాయి. మూడు నెలల్లో ఇప్పుడున్న విశాఖ క్యాంప్‌సలో ఉద్యోగుల సంఖ్యను 1000కి పెంచేందుకు విప్రో అంగీకరించింది. అదే సమయంలో ప్రస్తుతం విశాఖపట్నంలో ఐటీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ టు స్టార్ట్‌ భవనాల కొరత ఉంది. దీంతో విప్రో భవనంలో ఉన్న 1.6 లక్షల చదరపు అడుగుల్లో కొంత భాగాన్ని డీటీపీ విధానం కింద ఐటీ కంపెనీలకు అద్దెకిచ్చేందుకు అంగీకరించాలని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. దీనికి కూడా విప్రో సీఈవో అంగీకరించారని సమాచారం. అలాగే ఆ ఏడెకరాల్లో రెండో దశ భవన నిర్మాణ పనులను కూడా ప్రారంభించాలని కోరగా.. ఆ సంస్థ అంగీకరించింది.
 
 
పదేళ్లు ఖాళీ.. నేడు ఫుల్‌
గన్నవరం సమీపంలోని మేథా టవర్స్‌ పదేళ్లు ఖాళీగా ఉంది. ఐటీ కంపెనీల కోసం ఈ భవనం నిర్మించినా అవేమీ రాలేదు. అయితే గత రెండేళ్ల కాలంలో ఈ టవర్స్‌ నిండిపోయింది. పలు ఐటీ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అదే సమయంలో హెచ్‌సీఎల్‌ అనుబంధ కంపెనీ హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ర్టీట్‌ కూడా మేథా టవర్స్‌కు వచ్చి కార్యక్రమాలు ప్రారంభించింది. మొత్తం ఈ టవర్స్‌లోని 2లక్షల చదరపు అడుగుల నిర్మిత స్థలంలోనూ ఇప్పుడు ఐటీ కంపెనీలు కొలువుదీరా యి. అంతేకాకుండా మేథాటవర్స్‌-2ను 4 లక్షల చదరపు అడుగులతో నిర్మించనున్నారు. లోకేశ్‌ జరిపిన చర్చలు ఫలించడంతో ఇది సాధ్యమైంది.
Link to comment
Share on other sites

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అంకురార్పణ నేడే
08-10-2018 08:30:38
 
636745842388628467.jpg
  • రూ.750 కోట్ల వ్యయంతో పెట్టుబడులు
  • కేసరపల్లిలో మొదటి ఫేజ్‌గా రూ.400కోట్ల పెట్టుబడి
  • 27 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల భవన సముదాయాలు
రాజధాని ప్రాంతానికి అత్యంత ప్రతిష్ఠాత్మక అతిపెద్ద కార్పొరేట్‌ ఐటీ ఇండస్ర్టీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ్‌సకు సోమవారం బీజం పడనుంది. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ విజయవాడ సమీపంలోని సైబర్‌వాడ కేసరపల్లిలో భారీ ఐటీ ఇండస్ర్టీ ఏర్పాటుకు సోమవారం భూమిపూజ చేయనుంది. తర్వాతి దశలో అమరావతిలో సంస్థ టెక్నాలజీస్‌ పార్కును ఏర్పాటు చేస్తుంది.
 
విజయవాడ: హెచ్‌సీఎల్‌ రాకతో అమరావతి రాజధాని ఐటీ ముఖచిత్రమే మారుతుందనడంలో సందేహం లేదు. కేసరపల్లిలో రాష్ట్ర ప్రభు త్వం కేటాయించిన 27ఎకరాల ‘ఆర్టీసీ’ భూముల్లో ‘హెచ్‌సీఎల్‌’ తన ఆర్‌అండ్‌డీ టెక్నాలజీస్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. గన్నవరం విమానాశ్రయానికి అభిముఖంగా జాతీయ రహదారి-16 వెంబడి రూ.750 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న టెక్నాలజీస్‌ పార్క్‌ డిజైన్లను ఇప్పటికే సంస్థ విడుదలచేసింది.
 
సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ భూమిపూజ కార్యక్రమానికి హజరుకానున్నారు. కార్యక్రమంలో సంస్థ సీఈవో రోషిణీ నాడార్‌ మల్హోత్రా, హెల్త్‌కేర్‌ వైస్‌ చైర్మన్‌ శిఖర్‌ మల్హోత్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ విజయవాడ డైరెక్టర్‌ ఆర్‌.శ్రీనివాసన్‌లు పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల్లో హెచ్‌సీఎల్‌ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆటోమోటివ్‌, బ్యాంకింగ్‌, క్యాపిటల్‌ మార్కెట్స్‌, కెమికల్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ర్టీస్‌, ఇన్సూరెన్స్‌, ఏరోస్పేస్‌-డిఫెన్స్‌, కన్జ్యూమర్‌ గూడ్స్‌, అయిల్‌-గ్యాస్‌, రీటైల్‌ వంటి రంగాల్లో తన సేవలను అందిస్తోంది.
 
స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (సెజ్‌) కింద ఏర్పాటు...
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కేసరపల్లిలో స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (సెజ్‌) కింద ఏర్పడుతోంది. కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వశాఖకు కొంతకాలం కిందటి హెచ్‌సీఎల్‌ సెజ్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. గత జూన్‌లో కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖసెజ్‌కు అనుమతించింది. మొత్తంగా 27 ఎకరాల విస్తీర్ణంలో సెజ్‌ ప్రాతిపదికన టెక్నాలజీస్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది.
 
రెండుదశల్లో రూ.750కోట్ల వ్యయంతో ఏర్పాటు
హెచ్‌సీఎల్‌ సంస్థ రెండు దశల్లో టెక్నాలజీస్‌ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది. మొదటి దశలో కేసరపల్లిలో రూ.400 కోట్ల వ్యయంతో టెక్నాలజీస్‌ పార్క్‌ను ప్రారంభించనుంది. ఇక్కడ ఆర్‌అండ్‌డీ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ సదుపాయాలు కల్పిస్తుంది. మొత్తం 4వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తర్వాత అమరావతి రాజధాని నగరంలో రూ.350 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో టెక్నాలజీస్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. అమరావతి నగరంలో 3500 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు.
 
7500 మందికి ఉపాధి
రాజధాని ప్రాంతంలో హెచ్‌సీఎల్‌ సంస్థ ఏర్పాటుచేయనున్న టెక్నాలజీస్‌ పార్కుల ద్వారా మొత్తం 7500 మందికి ఐటీ కొలువులు దక్కనున్నాయి. ఇక ఈ ప్రాంతంలో శరవేగంగా ఐటీ విస్తరించటానికి అవకాశం ఏర్పడుతుంది.
 
సైబర్‌వాడగా కేసరపల్లి..
అమరావతి రాజధాని ప్రాంతానికి కేసరపల్లి సైబర్‌వాడగా నిలుస్తోంది. ఇప్పటికే కేసరపల్లిలో ఏస్‌ అర్బన్‌-ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలో మేధ టవర్‌ ఐటీ కంపెనీలతో నిండిపోయాయి. దీనికి రెండు రెట్ల విస్తీర్ణంలో రెండో ఐటీ టవర్‌ నిర్మాణం జరుగుతోంది. దీనికి అత్యంత సమీపంలోనే హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఐటీ సెజ్‌ ఏర్పడనుంది. దీనికి సమీపానే గచ్చిబౌలీ తరహా ఐటీ పార్కు ఏర్పాటు చేయటానికి అడుగులు పడుతున్నాయి. వరుస ఐటీ కంపెనీలతో కేసరపల్లి ముఖచిత్రమే మారిపోతోంది.
Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌కు హెచ్‌సీఎల్‌ టెక్‌
రెండు దశల్లో రూ.750 కోట్ల పెట్టుబడులు
7,500 మందికి ఉద్యోగ అవకాశాలు
కేసరపల్లిలో భవనాల నిర్మాణానికి నేడు శంకుస్థాపన
7busi6a.jpg

ఈనాడు-అమరావతి/ దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రెండు విడతల్లో రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఐటీ సేవల దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రకటించింది. ఇందువల్ల రానున్న పదేళ్లలో 7,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ ప్రకటించింది. నోయిడా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థ, ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో నిర్మించేందుకు సోమవారం శంకుస్థాపన చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే భూమి పూజలో ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, ఎలక్ట్రానిక్‌శాఖల మంత్రి లోకేశ్‌, హెచ్‌సీఎల్‌ అధినేత శివ్‌ నాడార్‌ కుమార్తె, సంస్థ సీఈవో రోషిని నాడార్‌ పాల్గొంటారు.

* తొలిదశ కేసరపల్లిలో 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న భవన సముదాయానికి రూ.400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో 4 వేల మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయి. ఏడాది కాలంలో మొదటి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, మిగతావి ఏడేళ్లలో పూర్తి చేస్తామని సంస్థ తెలిపింది.

* రెండో దశలో అమరావతి (నూతన రాజధాని ప్రాంతం)లో 20 ఎకరాల్లో కంపెనీ కేంద్రం ఏర్పాటవుతుందని సంస్థ ప్రకటించింది. ఈ విడతలో రూ.350 కోట్ల పెట్టుబడి పెడతామని, అయిదేళ్లలో 3,500 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ  వెల్లడించింది. అంటే పదేళ్ల కాలవ్యవధిలో మొత్తం 7,500 మందికి ఉద్యోగావకాశాలను హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కల్పించనుంది.

41 దేశాల్లో సేవలు
ప్రపంచ ఐటీ రంగంలో 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కలిగిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రపంచ వ్యాప్తంగా వందల కంపెనీలకు ఐటీ సేవలు అందిస్తోంది. 41 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో 1.24 లక్షల మంది ఉద్యోగులున్నారు. 2017 మే 12న ఐటీశాఖ మంత్రి లోకేశ్‌, హెచ్‌సీఎల్‌ అధినేత శివ్‌ నాడార్‌ని దిల్లీలోని హెచ్‌సీఎల్‌ కార్యాలయంలో కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు కోసం విజ్ఞప్తి చేసి వ్యాపార అనుకూలతలు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వివరించడంతో, ఆయన సానుకూలంగా స్పందించి అవగాహనా ఒప్పందం చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. 45 రోజుల్లోనే అన్ని అనుమతులతో పాటు భూమి కేటాయింపు పత్రాలను శివ్‌ నాడర్‌కు మంత్రి లోకేశ్‌   స్వయంగా అందజేశారు. గన్నవరంలోని మేధా టవర్స్‌లో హెచ్‌సీఎల్‌ భాగస్వామ్య కంపెనీ స్టేట్‌ స్ట్రీట్‌ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Link to comment
Share on other sites

HCL Technologies to invest ₹750 cr. in A.P.

author-deafault.png PTI
New Delhi, October 07, 2018 22:14 IST
Updated: October 07, 2018 22:22 IST
HCL Technologies Ltd office at Noida.

HCL Technologies Ltd office at Noida.   | Photo Credit: REUTERS

 

Firm to create 7,500 jobs in 10 years

IT services major HCL Technologies will invest ₹750 crore to set up two facilities in Andhra Pradesh that will help create 7,500 jobs in 10 years. The company is setting up its operations in Andhra Pradesh in two phases, said a statement.

In the first phase, the Noida-based company will invest ₹400 crore to build a R&D centre in Kesarapalli village in Gannavaram.

The facility is expected to accommodate more than 4,000 IT professionals.

Laying foundation stone

Work on phase-I will commence with the foundation stone laying ceremony on October 8 and is expected to be completed in seven years time.

Work on phase II will be taken up later in Amaravati, the new capital of Andhra Pradesh, in a campus of 20 acres. The investment for this phase is expected to be ₹350 crore and will employ about 3,500 IT professionals in five years’ time.

Link to comment
Share on other sites

హెచ్‌సీఎల్‌ని ఏపీకి తీసుకురావడంలోలోకేష్ కీలక పాత్ర
08-10-2018 16:32:45
 
636746131660556831.jpg
విజయవాడ: కీసరవల్లిలో హెచ్‌సీఎల్ గన్నవరం క్యాంపస్‌కి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎల్ సీఈవో రోషిణీ నాడార్ పాల్గొననున్నారు. రెండు దశల్లో హెచ్‌సీఎల్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించనుంది. ఐటీ రంగంలో మొదటి మెగా ఇన్‌వెస్ట్‌మెంట్, రెండు దశల్లో రూ. 750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. హెచ్‌సీఎల్ ద్వారా 7500 మంది ఉద్యోగాలు రానున్నాయి. మొదటి దశలో రూ.400 కోట్ల పెట్టుబడి, 4వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొదటి దశలో ఐటీ రంగంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ప్రారంభించనున్నారు.
 
 
హెచ్‌సీఎల్‌ని ఏపీకి తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర వహించారు. హెచ్‌సీఎల్‌తో ఒప్పందం చేసుకున్న 45 రోజుల్లోనే అన్ని అనుమతులతో భూమి పత్రాలను ఈయన సంస్థకు అందజేశారు. ఐటీ రంగంలో 2019నాటికి లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా హెచ్‌సీఎల్ పెట్టుకుంది. ఇప్పటికే ఐటీ రంగంలో 36వేల ఉద్యోగాల కల్పన లభిస్తోంది.
 
 
సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా హెచ్‌సీఎల్ క్యాంపస్ ఏర్పాటు చేశామని హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ తెలిపారు. హెచ్‌సీఎల్ కంపెనీ ఏపీకి రావడానికి మంత్రి లోకేష్ కృషి చేశారని, తొలి దశలో 28 ఎకరాల్లో భారీ క్యాంపస్ నిర్మిస్తున్నామని చెప్పారు. నాలుగేళ్లలో క్యాంపస్ పనులు ప్రారంభిస్తుందని, ఐటీ నాలెడ్జ్ ఉన్న యువత ఏపీలో పుష్కలంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరు తర్వాత ఐటీకి అవకాశం ఉన్న ప్రాంతం అమరావతేనని శివశంకర్ అన్నారు.
Link to comment
Share on other sites

మంత్రి లోకేష్ ఎంతో కృషి చేశారు’’
08-10-2018 17:05:00
 
అమరావతి: సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా హెచ్‌సీఎల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ తెలిపారు. కంపెనీ ఏపీకి రావడానికి మంత్రి లోకేష్ ఎంతగానో కృషి చేశారని చెప్పారు. తొలి దశలో 28 ఎకరాల్లో భారీ క్యాంపస్ నిర్మిస్తున్నామని వివరించారు. నాలుగేళ్లలో క్యాంపస్ పనులు ప్రారంభిస్తుందన్నారు. ఐటీ నాలెడ్జ్ ఉన్న యువత ఏపీలో పుష్కలంగా ఉన్నారని అన్నారు. హైదరాబాద్, బెంగళూరు తర్వాత.. ఐటీకి అవకాశం ఉన్న ప్రాంతం అమరావతి అని అన్నారు.
Link to comment
Share on other sites

17 minutes ago, sonykongara said:
మంత్రి లోకేష్ ఎంతో కృషి చేశారు’’
08-10-2018 17:05:00
 
అమరావతి: సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా హెచ్‌సీఎల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ తెలిపారు. కంపెనీ ఏపీకి రావడానికి మంత్రి లోకేష్ ఎంతగానో కృషి చేశారని చెప్పారు. తొలి దశలో 28 ఎకరాల్లో భారీ క్యాంపస్ నిర్మిస్తున్నామని వివరించారు. నాలుగేళ్లలో క్యాంపస్ పనులు ప్రారంభిస్తుందన్నారు. ఐటీ నాలెడ్జ్ ఉన్న యువత ఏపీలో పుష్కలంగా ఉన్నారని అన్నారు. హైదరాబాద్, బెంగళూరు తర్వాత.. ఐటీకి అవకాశం ఉన్న ప్రాంతం అమరావతి అని అన్నారు.

Good job Lokesh ???

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...