Jump to content

AgriGold


Recommended Posts

  • 3 weeks later...
  • Replies 73
  • Created
  • Last Reply
  • 2 weeks later...
అగ్రిగోల్డ్‌ను 4 వేల కోట్లకు కొంటాం
04-08-2018 02:30:20
 
636689466220086004.jpg
  • మరోసారి ముందుకొచ్చిన సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌
  • డిపాజిటర్లకు నాలుగేళ్లలో చెల్లిస్తాం
  • హైకోర్టుకు నివేదించిన న్యాయవాది
హైదరాబాద్‌, న్యూఢిల్లీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల టేకోవర్‌ ప్రక్రియ మరో మలుపు తిరిగింది. టేకోవర్‌కు సై అంటూ ముందుకొచ్చి వెనక్కు తగ్గిన సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ మరోసారి ఆసక్తి కనబరిచింది. ఇరు రాష్ట్రాల సీఐడీ అధికారులు ఇప్పటి వరకు అటాచ్‌ చేసిన అగ్రిగోల్డ్‌ ఆస్తులను గంపగుత్తగా 4 వేల కోట్లకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సుభా్‌షచంద్ర ఫౌండేషన్‌ ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. ఈ కొనుగోలు ప్రక్రియను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని, ఈ నాలుగేళ్లలో దశలవారీగా డిపాజిటర్లకు డబ్బును చెల్లిస్తామని తెలిపింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.2200 కోట్లు మాత్రమే ఉందని, నాలుగేళ్లలో వీటి విలువ పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రూ.4 వేల కోట్లుకు ఆస్తులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సుభా్‌షచంద్ర ఫౌండేషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీరఘురామ్‌ నివేదించారు.
 
ఇప్పటి వరకు సీఐడీ గుర్తించి అటాచ్‌ చేసిన ఆస్తులను మాత్రమే ఫౌండేషన్‌ టేకోవర్‌ చేసుకునేందుకు ప్రస్తుతానికి సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో గుర్తించబోయే ఆస్తులను కూడా కొనుగోలు చేసేందుకు తమకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీరఘురామ్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘అగ్రిగోల్డ్‌ సంస్థను టేకోవర్‌ చేసే వ్యవహారం కీలక దశకు చేరింది. ఇప్పుడు మన ముందు మూడు ఆప్షన్స్‌ ఉన్నాయి. ఫౌండేషన్‌ ప్రతిపాదనను తిరస్కరించడం లేదా అంగీకరించడం. కాదంటే కొన్ని మార్పులతో కొత్త ప్రతిపాదనలు రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకెళ్లడం. ఫౌండేషన్‌ ప్రతిపాదనపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, అగ్రిగోల్డ్‌ సంస్థ, బ్యాంకులు, పిటిషనర్లు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయండి. ఆ తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటాం’’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను ఽఈ నెల 17కు వాయిదా వేసింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువను రూ.4 వేల కోట్లుగా లెక్కగట్టడం, నాలుగు సంవత్సరాల గడువు కోరడంపై తమకు అభ్యంతరం ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. తాజా ప్రతిపాదన నేపథ్యంలో ముందు రూ.500కోట్లు డిపాజిట్‌ చేసేలా ఆదేశించాలని కోరారు.
 
అగ్రిగోల్డ్‌ కేసు సీబీఐకి ఇవ్వండి
అగ్రిగోల్డ్‌ కేసును సీబీఐకి అప్పగించి త్వరగా బాధితులకు న్యాయంచేయాలంటూ ఎంపీ కొత్తపల్లి గీత లోక్‌సభ జీరో అవర్‌లో కోరారు. ‘అగ్రిగోల్డ్‌కు తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల మంది వినియోగదార్లు ఉన్నారు. వారికి రూ.6380కోట్లు చెల్లించాల్సి ఉంది. సంస్థ ఆస్తుల్ని వేలం వేసి బాధితులకు ఇప్పించడంలో సీఐడీ విఫలమైంది. అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేసి త్వరగా పరిష్కారం లభించేలా కేంద్రం ప్రయత్నించాలి’ అని కోరారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 1 month later...
హాయ్‌లాండ్‌ అమ్మకానికి రంగం సిద్ధం‌

10242028BRK152HAI.JPG

హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల్లో కీలకమైన హాయ్‌లాండ్‌ విహార కేంద్రం అమ్మకానికి రంగం సిద్ధమైంది. హాయ్‌లాండ్‌ను విక్రయించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు హైకోర్టు అనుమతినిచ్చింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్‌లాండ్‌ను తనఖా పెట్టి రూ.94.62 కోట్లు రుణం పొందినట్లు ఎస్బీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. హాయ్‌లాండ్‌ విలువ రూ.366 కోట్లుగా బ్యాంకు లెక్కించిందన్నారు. అయితే నాలుగేళ్ల కిందటే హాయ్ లాండ్ విలువ రూ.వెయ్యి కోట్లు ఉందని అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2017లో హాయ్ లాండ్ విలువ రూ.600 కోట్ల రూపాయలని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. ఈ నేపథ్యంలో హాయ్ లాండ్‌తో పాటు.. తొమ్మిది విలువైన ఆస్తుల విలువను నిర్థరించారని జీ ఎస్సెల్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. సర్ఫేసి చట్టం కింద అమ్మి సొమ్మును కోర్టుకు సమర్పిస్తామని.. ఆ తర్వాత న్యాయస్థానం నిర్ణయం తీసుకోవచ్చునని ఎస్బీఐ ప్రతిపాదించగా.. ధర్మాసనం అనుమతినిచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఐదున్నర ఎకరాలు, విజయవాడలో 630 గజాల స్థలం కొనుగోలు చేసిన వారికి, వాటిని అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అద్దెకు ఉంటున్న వారందరూ వాటిని ఖాళీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Link to comment
Share on other sites

  • 5 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
అగ్రిగోల్డ్‌ స్కాం జరిగింది వైఎస్‌ హయాంలోనే!
18-11-2018 02:53:25
 
  • జగన్‌పై ట్విటర్‌లో లోకేశ్‌ ధ్వజం
అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ కుంభకోణం మీ మహామేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే జరిగిందని మంత్రి లోకేశ్‌ వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై విరుచుకుపడ్డారు. హాయ్‌ల్యాండ్‌ను ప్రారంభించింది కూడా ఆయన సహచరులేనని ట్విటర్‌లో తెలిపారు. జైల్లో ఉండి మీరు, మీ అన్న గాలి జనార్దన్‌రెడ్డి వేసిన గాలి ప్లాన్లకు ఎందరు బలైపోయారో మరచిపోయారా అని నిలదీశారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. బాధితులకు న్యాయం జరగకుండా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం డ్రామా వెనుక ఉన్నవారి గుట్టును.. కోడికత్తి డ్రామాలాగే బయటపెడతామని స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

గ్రిగోల్డ్‌లో ‘హాయ్‌ల్యాండ్‌’ సెగలు
18-11-2018 02:52:50
 
636781063687153091.jpg
  • ఏజెంట్లు.. డిపాజిట్‌దారుల నిరసనలు
  •  కిరోసిన్‌ పోసుకుని.. వాటర్‌ ట్యాంకు ఎక్కి ఆందోళన
  • వినుకొండలో ఉద్రిక్త పరిస్థితి
  •  చిత్తూరులో గుండెపోటుతో ఒకరి మృతి
వినుకొండ, బుచ్చినాయుడుకండ్రిగ, నవంబరు 17: హాయ్‌ల్యాండ్‌ అగ్రిగోల్డ్‌ ఆస్తి కాదంటూ ఆ సంస్థ ఎండీ హైకోర్టులో పిటిషన్‌ వేయడం అగ్రిగోల్డ్‌ బాధితులను అభద్రతాభావానికి గురిచేసింది. కోట్లాది రూపాయల విలువైన హాయ్‌ల్యాండ్‌ వేలంతో తమ సొమ్ము చాలావరకు సమకూరుతుందని ఆశించిన ఏజెంట్లు ఇప్పుడు సంస్థ మాట మార్చడంతో ఆందోళనకు గురయ్యారు. ఏజెంట్ల ఆందోళనతో గుంటూరుజిల్లా వినుకొండలో శనివారం ఉద్రిక్తత ఏర్పడింది. అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు, కస్టమర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సుమారు 1500మంది బాధితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వినుకొండకు చెందిన ఆర్‌.మునివెంకటేశ్వర్లు కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, ఏజెంట్లు ఆయనను అడ్డుకున్నారు.
 
ఆ తర్వాత బాధితులు ప్రదర్శనగా వెళుతున్న సమయంలో అప్పారావు, అరిగెల నాగేశ్వరరావు, సురేశ్‌, ఏటి సత్యనారాయణలు వాటర్‌ట్యాంక్‌ ఎక్కి, దూకేస్తామని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే ఆంజనేయులు ఆందోళనకారుల వద్దకు వచ్చి ప్రభుత్వం తరపున బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, చిత్తూరుజిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలం కారణిమిట్టలో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ మదనంబేడు సుబ్రమణ్యం(55) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. కోర్టు తీర్పు వచ్చాక డబ్బులు వస్తాయని ఇంతకాలం డిపాజిట్‌దారులకు నచ్చజెప్పిన ఆయన.. హాయ్‌ల్యాండ్‌ విషయం బయటకు రావడంతో గుండెపోటుకు గురైనట్లు చెప్తున్నారు.
Link to comment
Share on other sites

4 hours ago, ramntr said:

Cbn garu close cheyyandi sir, intha కాలం నడపడం వల్ల party ke negative avvuddemo, ఇలాంటి వాటికి fast track courts vaadara to close the case.. 

high court paridi lo vicharan jarugutundi,court cheppindi cheytame govt pai ippudu.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
అగ్రిగోల్డ్‌ బాధితులకు సత్వర న్యాయం
17-12-2018 02:54:19
 
636806120573557921.jpg
  • పరిహారం వీలువెంబడి అందేలా చర్యలు
  • విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
  • అడ్వకేట్‌ జనరల్‌కు సీఎం సూచన
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘‘అగ్రిగోల్డ్‌ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఈ కేసులో వాస్తవ స్థితి నివేదికను న్యాయస్థానానికి సమర్పించడమే కాకుండా నష్టపోయిన ప్రతి ఒక్కరికీ త్వరతగతిన పరిహారం అందేలా చూడాలి. బాధితుల సమస్యలను వెంటనే న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలి’’ అని సీఎం చంద్రబాబు అడ్వకేట్‌ జనరల్‌కు సూచించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులపై ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ కేసు పురోగతిని అడ్వకేట్‌ జనరల్‌ను అడిగి తెలుసుకున్నారు.
 
‘‘ఆస్తుల విక్రయాన్ని వేగవంతం చేసి, పరిహారం అందించే ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. కోర్టు ఇచ్చిన ఆదేశాలను తూ.చ. తప్పకుండా అమలు చేయాలి. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. న్యాయస్థానం ఆదేశాలకు వేరే ఉద్దేశాలు ఆపాదించే విధంగా మాట్లాడి బాధితుల్ని రెచ్చగొడుతున్న వారి గురించి కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలి. కోర్టు పర్యవేక్షణలో సజావుగా సాగాల్సిన ప్రక్రియకు రాజకీయ దురుద్దేశాలు కల్పించి, బాధితుల్ని రెచ్చగొట్టేలా ప్రయత్నించడం దురదృష్టకరం. కొన్ని శక్తులు దీనిని అడ్డం పెట్టుకుని, రాజకీయం చేయాలని చూస్తున్నాయి. బాధితుల్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో అలజడి లేవదీయడానికి కుటిల యత్నాలు చేస్తున్నాయి. రెచ్చగొట్టే శక్తుల దుష్ట పన్నాగాలతో సహా వాస్తవ పరిస్థితుల్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలి’’ అని అడ్వకేట్‌ జనరల్‌కు సీఎం చంద్రబాబు సూచించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...