Jump to content

AgriGold


Recommended Posts

  • Replies 73
  • Created
  • Last Reply
విజయవాడలో అగ్రిగోల్డ్‌పై రౌండ్‌ టేబుల్ సమావేశం
22-12-2018 12:25:48
 
636810783466187726.jpg
విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ నేత రామకృష్ణ, చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం తుదిదశకు చేరిందన్నారు. రేపటి నుంచి 27 వరకు బాధితుల దీక్షలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నాలుగేళ్లుగా అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రభుత్వం పట్టించుకోలేదని సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరకు వచ్చాయని హడావిడి చేస్తోందన్నారు. చలసాని మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘాన్ని చీల్చేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాధితుల కోసం ప్రభుత్వం రూ.12 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కొత్త ప్రతిపాదన’
03-01-2019 16:51:06
 
636821310673816886.jpg
విజయవాడ: అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. కోర్టు పరిధిలో లేని ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే రూ.300 కోట్లను.. రూ.5వేలు చెల్లించిన చిన్న ఇన్వెస్టర్లకు చెల్లించేలా ప్రతిపాదన తీసుకొచ్చినట్లు చెప్పారు. బాధితులతో కలిసి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా 5లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందని ఏబీఎన్‌తో ఆయన స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

రూ.5 వేల నుంచి మొదలు!
04-01-2019 03:52:37
 
  •  అగ్రిగోల్డ్‌ బాధితులకు త్వరలో చెల్లింపులు
  •  కొన్ని ఆస్తులను కొనుగోలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
  •  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వెల్లడి
అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ సంస్ధలో డిపాజిట్లు పెట్టి మోసపోయినవారికి ఊరట కలిగించే ఓ పరిష్కారాన్ని ఈ నెలలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. తొలుత రూ. ఐదు వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి నగదు చెల్లింపులు ప్రారంభించాలని భావిస్తున్నామని, హైకోర్టు అనుమతితో ఈ కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. రూ. ఐదు వేల లోపు డిపాజిట్లు పెట్టిన వారు ఐదు లక్షల మంది ఉన్నారని, వారికి సుమారు రూ.300 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ పరిష్కారంపై డిపాజిటర్ల సంఘం ప్రతినిధులతో ఉమ్మడిగా హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తామన్నారు. ‘ఇంకా కోర్టు స్వాధీనంలోకి రాని భూములు కొన్ని అగ్రిగోల్డ్‌ సంస్థ పేరిట ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గుర్తించాం. కోర్టు అనుమతితో వాటికి వేలంపాట నిర్వహిస్తాం. బయటి వారు ఎవరూ రాక పోతే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని భూ విలువ ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఈ భూములను ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి వినియోగించుకుంటుంది, ప్రభుత్వం ఇచ్చే డబ్బును డిపాజిట్‌ దారులకు చెల్లిస్తాం. ఆస్తుల వేలంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నాం’ అని తెలిపారు.
 
రూ. ఇరవై వేల లోపు డిపాజిట్‌ చేసిన వారు మొత్తం డిపాజిట్‌దారుల్లో ఎనభై శాతం ఉంటారని, దశలవారీగా వీరందరికీ చెల్లింపులు జరిగేలా చూడాలని ప్రభుత్వం అనుకుంటోందని పేర్కొన్నారు. జిల్లా స్ధాయిలో కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా న్యాయమూర్తి సభ్యులుగా కమిటీలు వేసి ఏ జిల్లాలో ఆస్తులు ఆ జిల్లాలోనే వేలంపాటలు నిర్వహించాలని కోరాలని భావిస్తున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాధితులు ఉన్నా కేసు నమోదు, విచారణ ఇక్కడే జరుగుతున్నందువల్ల ఈ కేసు ఏపీకి బదిలీ అవుతుందని ఆశిస్తున్నామని ఆయన వివరించారు. ‘ఎనిమిది రాష్ట్రాల్లో బాధితులు ఉన్నా ఏపీ తప్ప ఏ రాష్ట్రమూ ఈ సమస్యను పట్టించుకోలేదు. ఏది ఏమైనా బాధితులకు సంతృప్తికరంగా ఈ నెలలో సమస్య పరిష్కారాన్ని చూపిస్తాం’ అని కుటుంబరావు తెలిపారు.
 
ఈ కేసు పరిష్కారం కాకూడదని వైసీపీ కోరుకుంటోందని, దానివల్ల రాజకీయ లబ్ధి పొందొచ్చని ఆశిస్తోందని విమర్శించారు. ‘అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ రూ. 35 వేల కోట్లు ఉంటుందని ఆ పార్టీ చెబుతోంది. జగన్‌ వద్ద చాలా డబ్బు ఉంది. ఆ విలువలో పదో వంతుకు ఆయన పాడుకున్నా రూ.3500 కోట్లు వస్తాయి. ఆ డబ్బుతో చాలా మంది డిపాజిట్‌దారుల సమస్య తీరుతుంది. దానికి ముందుకు రావాలి’ అని కోరారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
వెతికేకొద్దీ వెలుగులోకి..!
25-01-2019 03:10:08
 
636839826089098377.jpg
  • భారీగా అగ్రిగోల్డ్‌ ఆస్తులను పసిగట్టిన సీఐడీ
  • బినామీల పేరుతో ఉన్న 151 స్థిరాస్తులు గుర్తింపు
  • గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్‌లలో 33 ఆస్తుల జప్తు
  • ఏపీలోని 6 జిల్లాల్లో మరో 118 ఆస్తుల అటాచ్‌కు సిద్ధం
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ బినామీ ఆస్తులు వెతికే కొద్దీ బయటకొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా 151 స్థిరాస్తులను సీఐడీ గుర్తించింది. అగ్రిగోల్డ్‌కు ఒక్క మన రాష్ట్రంలోనే 20 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారు. ఈ కేసును సీఐడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తోంది. అమరావతి పరిధిలో రూ.600 కోట్లకుపైగా విలువైన హాయ్‌ల్యాండ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో భారీగా స్థిరాస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా తాజాగా అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విశాఖ, విజయనగరం జిల్లాలతోపాటు హైదరాబాద్‌ షేక్‌పేట్‌లో ఉన్న స్థిరాస్తులను సీఐడీ అధికారులు పసిగట్టారు.
 
 
ఈ అంశంపై 2 నెలలుగా చేసిన కసరత్తు ఫలితంగా ఈనెలలో 151 స్థిరాస్తులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో వేల చదరపు గజాల వెంచర్లు, వందల ఎకరాల భూములు ఉన్నాయి. వీటన్నింటి జప్తు కోసం సీఐడీ అడిషనల్‌ డీజీ అమిత్‌ గార్గ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని 15, కృష్ణా జిల్లాలో 17, ప్రకాశం జిల్లాలో 2 స్థిరాస్తుల జప్తునకు హోంశాఖ ఆదేశాలిచ్చేందుకు సిద్ధమైందని సమాచారం. మరో 118 ఆస్తులు గుంటూరు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ ఆస్తులు అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు, సిబ్బందితోపాటు, బినామీల పేర్లపై ఉన్నట్లు తెలిసింది. గడిచిన పదేళ్లుగా కొనుగోలు చేసిన ఈ ఆస్తుల విలువ ప్రకాశం జిల్లా మినహా ఇతర అన్నిప్రాంతాల్లోనూ రూ.కోట్లల్లోనే ఉంటుందని సీఐడీ అధికారి ఒకరు తెలిపారు.
 
 
ఎవరికి ఎంత చెల్లించాలంటే..!
డిపాజిటర్లలో ఎవరెవరికి ఎంత మొత్తం చెల్లించాలన్న వివరాలను సీఐడీ వెల్లడించింది. అత్యధికంగా రూ.లక్ష బాండ్‌ను పరిగణనలోకి తీసుకొని అంతలోపు ఉన్న మొత్తాన్ని 5 విభాగాలుగా విభజించింది. అంతకన్నా ఎక్కువ మొత్తం ఉన్నవారిని ఆరో విభాగంలో చేర్చారు. ఇందులో ఏపీ వరకూ 19.43లక్షల అకౌంట్లు ఉండగా, రూ.3965.78 కోట్లు చెల్లించాలి. ఇందులో రూ.5వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి ఇప్పటికిప్పుడు చెల్లించాలంటే రూ.122కోట్లు అవసరమని సీఐడీ తెలిపింది. రూ.5001-రూ.10వేల వరకూ 2.91లక్షల అకౌంట్లున్నాయి. రూ.241కోట్లు చెల్లిస్తే వీరికి క్లియర్‌ అవుతుంది. రూ.10,001- రూ.20 వేల మధ్యలో 5,89,644 అకౌంట్లుండగా.. రూ.819 కోట్లు అవసరమవుతాయి. రూ.20,001-రూ.50వేల మధ్యలో 4,16,579 మంది ఉండగా, వీరికి రూ.1417.14కోట్లు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. రూ.50,001-రూ.1లక్షల వరకూ 1,29,887 అకౌంట్లు ఉండగా, రూ.1013.40లక్షలు, ఆపైన 22,216 మందికి రూ.353కోట్లు చెల్లిస్తే మొత్తం డిపాజిటర్ల సమస్య పరిష్కారమవుతుందని వివరించారు.
 
 
సత్వర పరిష్కారమే లక్ష్యం: సీఐడీ
డిపాజిటర్లకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని సీఐడీ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటికే 212 ఆస్తుల వేలానికి సిద్ధం చేశామని, హైకోర్టు సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఏపీలో మొత్తం 17,546 ఎకరాల భూమి, 2.88లక్షల చ.గ.ల నివాస-వాణిజ్య స్థలం ఉందన్నారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో 9,189 సెంట్ల నివాస స్థలాలు, విజయనగరం జిల్లాలో 2840 చ.అ.ల నిర్మాణం, మొత్తం 8 జిల్లాల్లో 2,145 ప్లాట్లు ఉన్నట్లు సీఐడీ చీఫ్‌ అమిత్‌గార్గ్‌ వివరించారు. ఇవిగాక హాయ్‌ల్యాండ్‌ మరిన్ని ఆస్తులు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ విలువ ప్రకారం రూ.2,150 కోట్లు ఉంటుందన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...