Jump to content

CBN reaction to PK

Recommended Posts

పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్
15-03-2018 11:29:38
 
636567101796347477.jpg
విజయవాడ: ‘‘దుర్గగుడి పార్కింగ్ వద్ద నేను డబ్బులు వసూలు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సవాల్ విసిరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జలీల్ ఖాన్ మాట్లాడుతూ... బీజేపీ దగ్గర ప్యాకేజీ తీసుకుని పవన్ అకస్మాత్తుగా వైఖరి మార్చుకున్నారని మండిపడ్డారు. మంత్రి లోకేశ్ అవినీతిపై పవన్ కల్యాణ్ దగ్గర ఆధారాలున్నాయా...? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఒకసారి రాజధాని ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏమిటో కనిపిస్తుందన్నారు.
 
పవన్ సభ పెడుతున్నారంటే హోదాపైన గట్టి పోరాటం చేస్తారని ప్రజలంతా భావించారని, కానీ... ఆయనేమో అసలు విషయం వదిలేసి, లేనిపోని ఆరోపణలతో ముగించారని జలీల్ ఖాన్ విమర్శించారు. ‘‘రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేస్తున్న కేంద్రంపై పవన్ ఒక్క మాటైనా మాట్లాడారా?.. ఆ విషయంపై మోదీని నిలదీశారా?’’అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. నరేంద్రమోదీ, జగన్‌మోహన్‌రెడ్డి, పవన్ కల్యాణ్ కలిసొచ్చినా తెలుగుదేశం పార్టీకి ఏమీ కాదన్నారు. జనసేన వల్లే టీడీపీ గెలిచిందన్నట్లు పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని, జనసేన, బీజేపీ లేనప్పుడే పంచాయతీ, మునిసిపాలిటీల్లో అంతకన్నా మెరుగైన ఫలితాలు సాధించామని, ఆపార్టీలతో కలిశాకే తమ ఓట్లు తగ్గిపోయాయని జలీల్‌ఖాన్ ఎద్దేవా చేశారు.
Link to comment
Share on other sites

Just now, sonykongara said:

Super 

Link to comment
Share on other sites

ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును పవన్ చదివారు: వెంకట్రావు
15-03-2018 11:47:29
 
636567112511192748.jpg
అమరావతి: ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును పవన్ కల్యాణ్ చదివి వినిపించారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధికి పవన్ ఏం చేస్తారో చెప్పలేదన్నారు. తెరవెనుక కుట్రలో భాగంగానే పవన్ మాట్లాడారనని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి మాట్లాడుతున్నామన్నారు. మంత్రి లోకేష్‌పై లేనిపోని ఆరోపణలు తగవని, శేఖర్‌రెడ్డికి లోకేష్‌కు సంబంధం ఏంటని చంద్రబాబు అన్నారు
Link to comment
Share on other sites

22 minutes ago, sreentr said:

But already pk did lot of damage.

Now if we tell he took package people may get doubt previously we have given

bongu em kadu.. end this rotta... so mee uddesam, manam em matladina appudu ippudu pawan ne namutharu... this is your thinking...

leka vaademanna paid artist aa, eppudu evaru package isthe valla dikku matladataniki... "package kalyan" aa

Link to comment
Share on other sites

24 minutes ago, sreentr said:

But already pk did lot of damage.

Now if we tell he took package people may get doubt previously we have given

Manam ivvaledani evaru antunaru brother...andarakii telsina fact ee ga ichi hire cheskunaam Ani..ippudu he got better offer with huge hike..

Link to comment
Share on other sites

బీజేపీపై, మోదీపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
15-03-2018 12:00:18
 
636567120195724112.jpg
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందన్న అనుమానాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తపరచారు. ఏపీ ప్రజల సహేతుకమైన డిమాండ్‌ను పరిష్కరించడం మానేసి.. జగన్‌ను, పవన్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీపై విమర్శలు చేయించడం వెనుక బీజేపీ నైజం ఏంటో తెలుస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలో యాంటీ మోదీ, యాంటీ బీజేపీ భావన బలంగా ఉందని ఆయన చెప్పారు. ఇందుకు నిన్న వెల్లడైన యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Link to comment
Share on other sites

హిందీలో కానీ...ఇంగ్లీషులో కానీ...గుజరాతీ లో కానీ.... మోడీని ఒక్క మాట అన్నావా ? నువ్వు పొడుస్తావా ?

pk-14032018.jpg
share.png

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ స్థితికి రావటానికి కారణమైన కెసిఆర్ ని, ఆహా ఓహో అంటూ భజన చేస్తున్నప్పుడు ఈ మనషి ఎలాంటోడో కొంచెం అర్ధమైంది... నేను వైఎస్ఆర్ కి విశ్వాసం ఉన్న కుక్కని అని అనే ఉండవల్లి లాంటి వాడు పక్కన చేరినప్పుడు, అమరావతి పై విషం చిమ్మే ఐవైయ్యార్ కృష్ణా రావు లాంటి వాడిని పక్కన కూర్చో బెట్టుకున్నప్పుడు కూడా ఈ మనిషి గురించి అర్ధం కాలేదు... 4 ఏళ్ళు హైదరాబాద్ లో కులికి కులికి వచ్చి, ఇప్పుడు వచ్చి 4 ఏళ్ళలో నువ్వేమి చేస్తున్నావ్ అని అడుగుతున్నాడు పవన్... నువ్వేమి చేసివి ఈ 4 ఏళ్ళ నుంచి అంటే ? ఏమి చెప్తావ్... ఒక మహేష్ కత్తి అనే ఒక చిన్న పురుగు దెబ్బకి నెల రోజులు బయటకి రాని నువ్వు, కూడా మాట్లాడతావా ?

pk 14032018 2

అరుణ్ జైట్లీకి ఇంగ్లీష్ లో చెప్పిన నువ్వు, మోడీ అనే వాడికి హిందీలో కాని...ఇంగ్లీషులో కాని...గుజరాతీ లో కాని ఒక్క మాట ఎందుకు చెప్ప లేక పోయావ్ ? మోడీ అంటే ఎవడికి భయం ? నిత్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మోడీ మోడీ మోడీ అని పేరు పెట్టి, నువ్వు అన్యాయం చేసావ్ అంటుంటే కనిపించటం లేదా ? ఎవరు భయపడుతున్నారు ? 3 గంటలు మాట్లాడి, ఒక్క సారి అయినా మోడీ అనే మాట అన్నావా ? నువ్వా మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది ? కరప్షన్ గురించి నీ దగ్గర అంట సమాచారం ఉంటే, ఎందుకు కోర్ట్ కి వెళ్ళలేదు ?

pk 14032018 3

24 గంటలు కరెంటు ఇస్తున్నాడు అని కెసిఆర్ ని కలిసి మరీ పోగిడావే, ఒక్కసారి అయినా పట్టిసీమ గురించి మాట్లాడవా ? హైదరాబాద్ నుంచి వచ్చి, మా రాష్ట్ర పరువు తియ్యటానికి వస్తున్నావా ? ఇదే కరప్షన్ నీకు కెసిఆర్ దగ్గర కనిపించలేదా ? తెలంగణా నుంచి మాకు 5 వేల కోట్లు విద్యుత్ బకాయలు ఉన్నాయి, ఒక్కసారి అయినా అడిగే దమ్ము నీకు ఉందా ? ఉమ్మడి ఆస్తులు పంచమనే దమ్ము నీకు ఉందా ? కెసిఆర్ ని ఒక్క మాట అనటం నీకు చేత కావటం లేదా ? మోదీ ఎదురుగా నిలబడి మిష్టర్ ప్రైమ్ మినిష్టర్ అని గొంతెత్తి నిరసన తెలిపింది, చంద్రబాబు నాయకత్వంలో ఉన్న గల్లా జయదేవ్... నీకు దమ్ము ఉంటే ముందు మోడీని ఒక మాట అను... చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏమి చేసాడో, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు పవన్... కనీసం ఒక్క మాట మోడీ అనే మాట నీ నోటి వెంట వచ్చిందా ? మోడీ ని ఒక్క మాట కూడా అనని, నీ ఎజెండా కూడా తెలుసు... పూర్తి వివరాలు త్వరలోనే వస్తాయి... గెట్ రెడీ.. చివరగా అమరావతి జోలికి వస్తే తొక్క తీస్తాం.. ప్రాధాన ప్రతి పక్షం జగన్ కూడా ఇలాగే ఏడ్చి, చివరకు ఏమవుతున్నాడో చూడు... అమరావతి మీద ఏడుపులు ఆపు...

Link to comment
Share on other sites

Guest Urban Legend

ట్రూత్ ఈజ్ ట్రూత్’. నిజం నిప్పులాంటిది. నిప్పుతో చెలగాటమాడాలని చూడొద్దు భవిష్యత్ లో ఎవరికీ కలిసి రాదు’

లాలూచీ పడ్డ వారెవరో త్వరలోనే బయటపెడతా, అన్నిటికీ రెండుమూడ్రోజుల్లో సమాధానం చెబుతా...

అసెంబ్లీలో చంద్రబాబు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...