Jump to content

Recommended Posts

ఇవాళ అమరావతిలో పర్యటించనున్న ముఖేష్ అంబానీని రిసీవ్ చేసుకునేందుకు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు... ఈ సందర్భంగా అక్కడ మీడియాతో లోకేష్ మాట్లాడుతూ, రాయలసీమలో జియో ఫోన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని అంబానీని కోరామని చెప్పారు... వెనుకబడిన ప్రాంతం అయిన రాయలసీమలో, జియో ఫోన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తే ఎంతో లాభం ఉంటుంది అని చెప్పారు... దానికి సంబంధించి ముకేష్ అంబానీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం అన్నారు... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానం పలుకుతామన్నారు...

అయితే ఒక్కసారి చంద్రబాబు రంగంలోకి దిగితే, ఆ ప్రాజెక్ట్ ఓకే అయిపోయినట్టే అనే ప్రచారం అధికార వర్గాల్లో ఉంది... ఇప్పటికే అంబానీ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు... అక్కడ లోకేష్, గన్నవరం ఎమ్మల్యే వంశీ స్వాగతం పలికారు... అక్కడ నుంచి హెలికాప్టర్ లో, వెలగపూడి హెలిపాడ్ దగ్గరకు చేరుకొని, అక్కడ నుంచి ప్రత్యెక కాన్వాయ్ లో సచివాయలం చేరుకున్నారు... ప్రస్తుతం, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లో అంబానీ ఉన్నారు.. రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ఎలా పని చేస్తుంది, అధికారులు వివరిస్తున్నారు...

పెట్టుబడుల సమావేశం అయిపోయిన తరువాత, ముఖ్యమంత్రి నివాసంలో విందు భేటీలోనూ ముఖేష్ పాల్గుంటారు... తిరిగి 10 గంటలకు గన్నవరం చేరుకొని, ముంబై వెళ్తారు...ఈ భేటీలో పారిశ్రామిక రంగంతో పాటు, తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చించే అవకాసం ఉంది... ఇటీవల చంద్రబాబు, బీజేపీకు దూరం అవుతున్నారు అనే సంకేతాలు, దేశ వ్యాప్తంగా బలంగా వెళ్ళిన నేపధ్యంలో, ఆ విషయాలు పై కూడా, ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవకాసం ఉంది... మొత్తానికి ముకేష్ అంబానీ ఎలాంటి పెట్టుబడులు పెడతారు, ఎంత పెడతారు అనే దాని పై, ఆసక్తి నెలకొంది...

Edited by sonykongara
Link to post
Share on other sites

రోజుకు 10లక్షల ఫోన్లు తయారీ కంపెనీ తిరుపతిలో!
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు

అమరావతి: శివరాత్రి రోజున సీఎం చంద్రబాబుతో పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ సమావేశం జరగడం రాష్ట్రానికి శుభపరిణామమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత అంబానీ చంద్రబాబు భేటీకి సంబంధించిన పలు అంశాలను ఆయన మీడియాకు వివరించారు. ఆ భేటీ విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని అంబానీ అన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి రియల్ టైం గవర్నెన్స్‌ సందర్శించారు. ఇది అద్భుతంగా ఉందని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ  రియల్ టైం గవర్నెన్స్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రోజులో పది లక్షల  ఫోన్లు తయారు చేసే కంపెనీ తిరుపతిలో ఏర్పాటుకు అంబానీ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అనుమతులు వస్తే రెండు వారాల్లోనే శంకుస్థాపనకు సిద్ధమని చెప్పారు. విశాఖ భాగస్వామ్య సదస్సు గురించి ఎలాంటి చర్చ జరపలేదు. టెక్నాలజీ రంగంలో ఏపీ బాగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరిగేందుకు ఇదో గొప్ప అవకాశం అని అభిప్రాయపడ్డారు’’ అని కుటుంబ రావు వివరించారు.

Link to post
Share on other sites

గత 15 రోజుల నుంచి రాష్ట్రంలో అలజడి వాతావరణం.. ఎవరి రాజకీయ ప్రయత్నాలు వారివి... రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం ఎవరికీ పట్టదు... హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తూన్న వారు మరి కొందరు... ఇక మీడియా సంగతి చెప్పనే అవసరం లేదు... కాని, ఇన్ని ఇబ్బందులు మధ్య కూడా తనకు అప్పచెప్పిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్విహిస్తుంది మాత్రం, ఈ రాష్ట్రంలో ఒక్కరే ఒక్కరు... రాజకీయ ప్రయోజనాలు కంటే, ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం... అందుకే ఆయన ఫ్లో లో ఆయన ఉన్నారు... ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... 

ఇంత గొడవలు మధ్య కూడా దుబాయ్ వెళ్లి ఎమిరేట్స్ తో ఒప్పందం చేసుకుని వచ్చారు... ఇన్ని ఇబ్బందులు మధ్య కూడా, నెంబర్ వన్ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థల అధినేతని, అమరావతి రప్పించారు... అంబానీ లాంటి పారిశ్రామిక వేత్త, ఊరికే రారు కదా... చంద్రబాబు ఆ విధంగా పావులు కదిపారు... రెండు నెలల క్రితం ఐటి శాఖ మంత్రి లోకేష్ ని పంపించి, ప్రాధమిక చర్చలు జరిపించారు... రెండు నెలలు తిరక్కుండానే, అంబానీ అమరావతిలో అడుగు పెట్టారు...

మహా శివరాత్రి పర్వదినాన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించారు ముకేష్ అంబానీ.... రియల్ టైం గవర్నెన్స్ ప్రశంసలు, చంద్రబాబు విజన్ ప్రశంసలు పక్కన పెడితే, ఈ రోజు అంబానీ మన రాష్ట్రంలో పెద్ద ఎత్తన పెట్టుబడి పెట్టబోతున్నారు.... తిరుపతిలో ఫోన్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు సిద్ధమని అంబానీ ప్రకటించారు... నెలకు 10 లక్షల ఫోన్లు తయారు చేసే సామర్ధ్యం ఉన్న కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పారు... ఇది సౌత్ ఇండియాలోనే అతి పెద్ద హార్డువేర్ మాన్యుఫాక్చారింగ్ ప్లాంట్ కానుంది... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వటమే ఆలస్యం అని, రెండు వారాల్లోనే శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతాం అని చెప్పారు.

Link to post
Share on other sites
4 minutes ago, swarnandhra said:

Good !!!

what happened to Foxconn? have they decided on MH/Guj?

Finally Gadkari gave foxconn extra exemptions and accees at Mumbai port and they will go ahead....

Actually CBN got that to Andhra but Gadkari&Fadnavis took it away with Delhi getting into action....

Same Gadkari Vizag port lo state govt 5 acres adigite ivvakunda addam paddadu....

http://www.thehindubusinessline.com/news/electronic-major-eyes-200-acres-at-jnpt-sez-gadkari/article9925630.ece

Edited by AnnaGaru
Link to post
Share on other sites
6 minutes ago, DVSDev said:

House theesi - Eee Mukku ambani kooda Mana govt Oil N Natural gas meda Godava cheyya kundaa biscuits kaadu kadaa  

asalu daniki mana state ki sambandam ledu right now rules prakaram....even royalty also center share it's share and not the company that is drilling......

Link to post
Share on other sites

తిరుపతికి జియో!
14-02-2018 02:06:22

150 ఎకరాల్లో ఎలక్ర్టానిక్స్‌ పార్కు స్థాపన
ఏటా కోటి జియో ఫోన్ల తయారీ
చిప్‌ నుంచి సెట్‌టాప్‌ బాక్సుల వరకు అక్కడే ఉత్పత్తికి నిర్ణయం
5వేల గ్రామాల్లో సిటిజన్‌ సెంటర్లు
అమరావతిలో డిజిటల్‌ ఇన్‌ఫ్రా, టెలికాం, ఐటీ అభివృద్ధికి ఓకే
పెద్దాపురంలో సోలార్‌ ప్లాంట్‌
స్మార్ట్‌ అమరావతికి సహకారం
సాగు, విద్య, వైద్యంలో పెట్టుబడి
రిలయన్స్‌ చీఫ్‌ ముఖేశ్‌ ప్రకటన
అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): భారతదేశ పారిశ్రామిక దిగ్గజం ‘రిలయన్స్‌’ సంస్థ నవ్యాంధ్రకు జై కొట్టింది. రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ మంగళవారం అమరావతికి వచ్చారు. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్టీజీ) సెంటర్‌ను సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి ముఖేశ్‌ అంబానీకి చంద్రబాబు వివరించారు. పరిశ్రమల స్థాపనకు తాము ఇస్తున్న ప్రోత్సాహకాలను చెప్పి... నూతన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని ముఖేశ్‌ ప్రకటించారు.
 
తిరుపతిలో 150ఎకరాల్లో ఎలక్ర్టానిక్స్‌ పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ‘‘ఇందులో ఏటా కోటి జియో సెల్‌ఫోన్లు తయారు చేస్తాం. జియో ఫోన్లు, చిప్‌ డిజైన్‌, బ్యాటరీలు, సెట్‌టాప్‌ బాక్స్‌ల వంటివన్నీ ఈ ఎలకా్ట్రనిక్స్‌ పార్కులో తయారు చేస్తాం’’ అని ముఖేశ్‌ ప్రకటించారు. ఎలక్ర్టానిక్స్‌ వస్తువుల తయారీలో విద్యార్థులకు ఇందులోనే శిక్షణ కూడా ఇస్తామన్నారు.
 
మరోవైపు అమరావతిలో 50 ఎకరాల్లో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, టెలికాం, ఐటీ సార్టప్‌ ఎకో సిస్టమ్‌ను అభివృద్ది చేసేందుకు ముఖేశ్‌ అంగీకరించారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 150మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌, డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అమరావతిని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు రిలయన్స్‌ సహకారం ఉంటుంది’’ అని తెలిపారు. మంత్రి లోకేశ్‌తోపాటు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Link to post
Share on other sites

తిరుపతి వద్ద 150 ఎకరాల్లో 
ఎలక్ట్రానిక్స్‌ పార్కు 
10 లక్షల జియోఫోన్లు, టీవీ, చిప్‌ డిజైన్లు, బ్యాటరీల తయారీ కేంద్రం
అమరావతిలో 50 ఎకరాల్లో డిజిటల్‌ పార్కు 
టెలికాం, ఐటీ స్టార్టప్‌ అనుకూల వాతావరణం అభివృద్ధికి సహకారం 
పెద్దాపురంలో 150 మెగావాట్ల సౌరవిద్యుత్తు ప్లాంటు, డేటా కేంద్రం 
ముఖ్యమంత్రితో భేటీలో ముకేశ్‌ అంబానీ వెల్లడి 
రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రానికి ప్రశంసలు 
ఈస్టోనియా కంటే ఏపీలోనే సాంకేతిక సుపరిపాలన బాగుందన్న రిలయన్స్‌ అధినేత 

ఈనాడు, అమరావతి: తిరుపతిలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్‌ పార్కు ఏర్పాటు చేయడానికి రిలయన్స్‌ సంస్థ ముందుకొచ్చింది. అందులో 10 లక్షల జియోఫోన్లు, టీవీలు, చిప్‌ డిజైన్లు, బ్యాటరీలు, సెట్‌టాప్‌ బాక్స్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఆకృతుల రూపకల్పన మొదలుకుని పూర్తిస్థాయిలో వస్తువుల తయారీ చేసేంతవరకూ అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించనుంది. ఈ ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలకు సంబంధించి రిలయన్స్‌ సంస్థ తన నిర్దేశిత లక్ష్యంలో 80 శాతం తయారీ ఏపీలోనే చేపట్టేందకు సంసిద్ధత తెలిపింది. ఈ పార్క్‌పై నాలుగు నెలల కిందటే మంత్రి లోకేష్‌ రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీతో చర్చించగా ఇప్పుడది కార్యరూపంలోకి వస్తోంది. ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల తయారీలో విద్యార్థులకు ఇక్కడది శిక్షణ ఇవ్వనుంది. ఈ విషయాన్ని రిలయన్స్‌ సంస్థల అధినేత ముకేశ్‌ అంబానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం వారు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన పలు ప్రతిపాదనలను ముకేశ్‌ సీఎం ఎదుట ఉంచారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే వివిధ రకాల అంతర్జాల ఆధారిత సేవలను అతి తక్కువ ధరకు అందించేందుకు 5 వేల గ్రామాల్లో పౌర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. అమరావతిలోని 50 ఎకరాల్లో డిజిటల్‌ మౌలికవసతుల పార్కు, టెలికాం, ఐటీ స్టార్టప్‌ అనుకూల వాతావరణాన్ని అభివృద్ధి చేస్తామని, డేటా సూపర్‌ పవర్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడంలో, అమరావతిని ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. పెద్దాపురంలో 150 మెగావాట్ల సౌరవిద్యుత్తు ప్లాంటు, డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వంద కొత్త పరిశ్రమల స్థాపనలో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఆసక్తిగా ఉందన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశాలు కల్పించాలని కోరారు. అన్ని రకాల ప్రతిపాదనలతో వస్తే పూర్తిగా సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు... ముకేశ్‌కు స్పష్టం చేశారు.
రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రం భేష్‌! 
‘‘మూడేళ్ల కిందట చంద్రబాబును కలిసినప్పుడు ఆయన తన పాలనకు సంబంధించిన దార్శనికతను వివరించారు. చేసినప్పుడు చూద్దాంలే అనుకున్నా. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని చూశాక ఆ కలలను సాకారం చేశారనిపించింది. ఈ కేంద్రం నిజంగా అద్భుతంగా ఉంది. ప్రపంచంలో నాకు తెలిసి ఇంకెక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. ఇది మేధోపరమైన సంపద, దీనిపై హక్కులు పొంది, ఏపీ ప్రభుత్వమే ఇతర రాష్ట్రాలకు ఈ సేవలను అందించి ప్రతిఫలంగా కొంత ఛార్జీలు వసూలు చేయొచ్చు. అలా చేస్తే ప్రపంచంలోనే డేటా సేవలు విక్రయించగలిగిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పేరు నిలిచిపోతుంది’’ అని ముకేశ్‌ అంబానీ అన్నారు. తొలుత వెలగపూడి సచివాలయంలోని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ కొంత సమయం గడిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ విధానాన్ని చంద్రబాబు వివరించగా.. దానిపైన ముకేశ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. 
‘‘రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని సందర్శించాలని ఇటీవల రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ప్రధానమంత్రికి చెప్పారు. ఆ విషయం తెలిసి నేను కూడా ఈ కేంద్రాన్ని ఒకసారి చూద్దామని వచ్చాను.

* చిన్న దేశమైన ఈస్టోనియా సుపరిపాలన రంగంలో అందరికీ ఆదర్శమని ఇప్పటివరకూ నేను భావించా. కానీ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సాంకేతిక పరిపాలన చూసిన తర్వాత ఇక్కడ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తోంది. ప్రస్తుతం ఈస్టోనియా ప్రభుత్వ ప్రతినిధి బృందం ముంబైలోని మా దగ్గర పరిశోధన చేస్తోంది. వారిని కూడా ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌పై అధ్యయనం చేయమని ఇక్కడికి పంపిస్తా.
* ప్రస్తుతం చాలా మంది వ్యాపార అనుకూల వాతావరణం గురించి మాట్లాడుతున్నారు. ఒక వ్యాపారవేత్తగా కాకుండా వ్యక్తిగతంగా చెప్పాలంటే వ్యాపార అనుకూల వాతావరణం కంటే కూడా... జీవించడానికి అనుకూల వాతావరణం, అవకాశాల సృష్టి, అందిపుచ్చుకునేందుకు అనుకూల వాతావరణం ఉన్నప్పుడే వృద్ధి సాధించగలం. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా పథకాలను అమలుచేస్తూ.. ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది.
* ప్రస్తుతం ప్రపంచాన్ని సాంకేతికత నడిపిస్తోంది. దానికి డేటా ఇంధనంగా మారింది. డేటా వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అంత విజయం సాధించగలం. మనదేశంలో నెలకు 30 గిగా బైట్ల డేటా మాత్రమే వినియోగమవుతోంది. రిలయన్స్‌ 10 వేల గిగా బైట్ల డేటా సామర్థ్యం సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
* ప్రజాసాధికార సర్వే ద్వారా కుటుంబ సమాచారాన్ని సేకరించి.. దాన్ని ప్రభుత్వ విభాగాలతో అనుసంధానించి సత్ఫలితాలు సాధించడం బాగుంది.
అన్ని అనుమతులు వస్తే రెండు వారాల్లోనే శంకుస్థాపన 
అన్ని రకాల అనుమతులు వస్తే రెండు వారాల్లోనే రిలయన్స్‌ సంస్థ తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌ పార్కుకు శంకుస్థాపన చేస్తుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వెల్లడించారు. శివరాత్రి రోజున సీఎం చంద్రబాబు, ముకేశ్‌ అంబానీ భేటీ కావడం రాష్ట్రానికి శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. సీఎంతో ముకేశ్‌ భేటీ వివరాలను ఆయన మంగళవారం విలేకరులకు వెల్లడించారు.
అమరావతిలో అయిదు గంటలు 
ముంబై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న ముకేశ్‌ అంబానీ అమరావతిలో దాదాపు అయిదు గంటల పాటు గడిపారు. ఆయనకు విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్‌ స్వాగతం పలికారు. అనంతరం వారిరువురు హెలికాఫ్టర్‌లో సచివాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7.50 వరకూ సచివాలయంలో ఉన్న ముకేశ్‌ అనంతరం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని ఆయనిచ్చిన విందును స్వీకరించారు. రాత్రి 11 గంటల సమయంలో ఆయన తిరుగు ప్రయాణమయ్యారు.
ధీరుబాయ్‌ అంబానీ టెలికాం రంగంలోకి ప్రవేశించడానికి అప్పట్లో పురిగొల్పింది ఒకరకంగా చంద్రబాబే. అదే టెలికాం రంగంలో పెద్ద విప్లవానికి దారితీసింది. పెట్రోలు రిఫైనరీ రంగంలోకి అడుగుపెట్టాలని నేను ధీరుబాయ్‌ అంబానీని రెండు గంటల్లో ఒప్పిస్తే అదే తరహాలో ఆయన్ను టెలికాం రంగంలోకి రావాలని చంద్రబాబు ఒప్పించారు.
- ముకేశ్‌ అంబానీ

Link to post
Share on other sites
17 minutes ago, sonykongara said:

:super:

CBN :no1:

Lokesh no2

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...