Jump to content

Be humble....Be careful.....decimate YSRCP


nvkrishna

Recommended Posts

NTR reached peaks in 1987 but we knew what happened in 1989. Politics are dynamic and can change with one incident.
 
Even today, positive vote on CBN is saving the party. There is not much difference between several TDP MLAs and other party leaders.
 
 
RK wrote a good article.



abn.jpg

Link to comment
Share on other sites

ఏపీలో అదీ సంగతి! అయితే...
 
 
636400072232260713.jpg
ఎవరికి ఇష్టం అయినా కాకపోయినా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి. వయసు రీత్యా కూడా ఆయన అందరికంటే పెద్ద. ముఖ్యమంత్రి పదవిని, వయసును గౌరవించకుండా జగన్‌ అండ్‌ కో చేసిన వ్యాఖ్యలు రోత పుట్టించకుండా ఎలా ఉంటాయి? ముఖ్యమంత్రి కావాలని జగన్‌ కోరుకోవడంలో తప్పు లేదు. అయితే అందుకు తనలో ఉన్న అర్హతలు, అనర్హతలు ఏమిటో ముందుగా తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా 30 ఏళ్లు ఉండాలని జగన్‌ అనుకుంటూ ఉండవచ్చు. ప్రజలు కూడా అనుకోవాలి కదా! ఇంకేముంది రేపో మాపో ముఖ్యమంత్రిని అవుతున్నానని జగన్మోహన్‌రెడ్డి చెప్పుకోవడం వల్ల అభాసుపాలవుతున్నారు.
 
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల బలాబలాలపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు స్పష్టత ఏర్పడింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటిన తర్వాత ప్రజలలో ఆయన బలపడ్డారా?
బలహీనపడ్డారా? అన్నది తెలుసుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఉపయోగపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి బాగా పెరిగిపోయిందనీ, వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పడిపోయి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమన్న ప్రచారం ఢిల్లీ నుంచి గల్లీ వరకు విస్తృతంగా జరిగింది. ఎంతలా అంటే చంద్రబాబుకు తన పరిస్థితిపై తనకే అపనమ్మకం ఏర్పడేలా ఈ ప్రచారం జరిగింది. కొంతకాలం క్రితం ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రముఖ దర్శకుడు ఏబీఎన్‌ స్టూడియోకు వచ్చారు. ప్రోగ్రాం అయిన తర్వాత పిచ్చాపాటీ మాట్లాడుతూ ‘ఏపీలో చంద్రబాబు పరిస్థితి అంత బాగా లేదంట కదా!’ అని ప్రశ్నించారు. ‘అలా ఏమీ లేదే- అయినా తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని మీకు ఎవరు చెప్పారు?’ అని నేను ప్రశ్నించగా, ‘మీరు ఒక్కరే చంద్రబాబుకు ఢోకా లేదంటున్నారు గానీ నన్ను కలిసిన తెలుగుదేశం నాయకులు గానీ, విజయవాడకు చెందినవారు గానీ పరిస్థితి బాగా లేదనే చెబుతున్నారు’ అని సదరు దర్శకుడు చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షానికి చెందిన నాయకులు కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని స్పష్టమవుతోంది. దీనికి తోడు మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీలోని ఒక వర్గం కూడా చంద్రబాబు బలహీనపడిపోయారని తమ పార్టీ ఢిల్లీ పెద్దల చెవిలో అదే పనిగా నూరిపోస్తూ వచ్చారు. వారు చెబుతున్న దాన్ని ఢిల్లీ పెద్దలు కూడా నమ్ముతూ వచ్చారు. ఫలితమే చంద్రబాబును తమ అదుపులో పెట్టుకుని వచ్చే ఎన్నికలలో గరిష్ఠంగా సీట్లు పొందడానికై ఢిల్లీ బీజేపీ పెద్దలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని కూడా దువ్వుతూ వచ్చారు. ఇప్పుడు నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత చంద్రబాబు వ్యతిరేకులకు తత్వం బోధపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తెలుగుదేశం పార్టీని ‘విలువైన మిత్రపక్షం’గా గుర్తించారు. తాము ఎందుకు గెలుస్తామో, ఎందుకు ఓడిపోతామో తెలియనటువంటి వాళ్లు తెలుగుదేశంలో చాలామంది ఉన్నారు. అందుకే చంద్రబాబుకు వ్యతిరేకంగా సాగిన ప్రచారం చూసి నిజమేనని నమ్మేశారు. ఏదైతేనేమి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు గొప్ప రిలీఫ్‌ వచ్చింది. ఈ ఫలితాలతో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నీరసపడిపోగా, మిత్రపక్షమైన బీజేపీ దారిలోకి వస్తుందని తెలుగుదేశం నాయకులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
 
అంతేకాదు 2014 ఎన్నికలలో బీజేపీ, పవన్‌ కల్యాణ్‌ల మద్దతు కారణంగా చంద్రబాబు Untitled54454221.jpgఅధికారంలోకి వచ్చారన్న అభిప్రాయం చాలా మందిలో ఉండింది. నంద్యాల ఫలితం తర్వాత ఈ అభిప్రాయం వాస్తవం కాదని స్పష్టమైంది. బీజేపీ, పవన్‌ కల్యాణ్‌ మద్దతు లేకుండానే నంద్యాలను భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అంతేకాదు ఏపీలో తాము చాలా బలపడిపోయామని బీజేపీకి చెందిన కొంతమంది నాయకులు భావిస్తూ వచ్చారు. కాకినాడలోని ఒక వార్డులో పోటీ చేసిన తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడే అక్కడ ఓడిపోయారు. కాకినాడలో అభ్యర్థులు దొరకక వైసీపీకి చెందిన వారిని అరువు తెచ్చుకున్నారట! అంతేకాకుండా పోలింగ్‌ ఏజెంట్ల కోసం తెలుగుదేశం పార్టీపై ఆధారపడవలసి వచ్చింది. పొత్తులు ఉభయకుశలోపరిగా ఉంటేనే ఏ బంధమైనా దీర్ఘకాలం కొనసాగుతుంది. నిజానికి ఉప ఎన్నికల ఫలితాలను పెద్దగా సీరియస్‌గా తీసుకోనవసరం లేదు. ఉప ఫలితాలు ఎప్పుడూ అధికారపక్షానికి అనుకూలంగానే ఉంటాయి. అయితే మరో ఏడాది, ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలు జరుగుతాయన్నప్పుడు మాత్రం ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే ఉప ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో నంద్యాల ఫలితాన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీలులేదు. ఉప ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి అయిదు శాతం వరకు ప్రయోజనం ఉంటుంది. ఈ లెక్కన నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 27 వేల పైచిలుకు మెజారిటీలో పది వేలు తీసేసినా 17 వేల ఓట్ల మెజారిటీ మిగిలే ఉంటుంది. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం గెలుచుకున్న నంద్యాలలో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత 17 వేలతో గెలవడం ఆషామాషీ కాదు. నంద్యాలలోని మొత్తం రెండు లక్షల పైచిలుకు ఓటర్లలో లక్షా 20 వేల ఓటర్లు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నవారే! ఈ కారణంగానే నంద్యాలలో గెలుపు పట్ల తెలుగుదేశం నాయకులకే నమ్మకం లేకుండా పోయింది. ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే జగన్మోహన్‌రెడ్డికి మద్దతుదారులుగా ఉంటూ వచ్చిన ముస్లింలు, మాల సామాజిక వర్గం వారిలో కూడా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. లేని పక్షంలో నంద్యాల పట్టణంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చి ఉండేది కాదు.
 
ఎన్నికలలో డబ్బు ప్రభావం పనిచేసిందనీ, దానికితోడు జగన్‌, రోజా వంటి వాళ్లు చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ ఓటమికి దోహదపడ్డాయన్న అభిప్రాయం కొంత వ్యక్తమైంది. అయితే ఇందులో వాస్తవం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే నామినేషన్ల సమయంలోనే ఆర్జీస్‌ ఫ్లాష్‌ టీమ్‌తో ‘ఆంధ్రజ్యోతి’ చేయించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి 11 శాతం మొగ్గు కనిపించింది. పోలింగ్‌ వారం రోజుల ముందు మరోమారు చేయించిన సర్వేలో ఈ మొగ్గు 13 శాతానికి పెరిగింది. పోలింగ్‌ తర్వాత చేయించిన సర్వేలో ఇది 16 శాతానికి చేరింది. ఫలితాలు కూడా ఇదే విధంగా వచ్చాయి. కాకినాడలో కూడా తెలుగుదేశం– వైసీపీ మధ్య వ్యత్యాసం దాదాపు 16 శాతం ఉంది. 30 ఏళ్ల నుంచి కాకినాడ నగర పాలక సంస్థపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు కనుక ఈ విజయాన్ని కూడా గుర్తించాలి. అంతేకాకుండా కాకినాడ పట్టణంలో కాపులు గణనీయంగా ఉన్నారు. దాదాపు 15 డివిజన్‌లలో ఫలితాలను ప్రభావితం చేయగల సంఖ్యలో కాపులు ఉన్నారు. అయినా ఈ 15 డివిజన్‌లలో పది తెలుగుదేశం– బీజేపీ ఖాతాలో పడగా, వైసీపీకి అయిదు మాత్రమే దక్కాయి. కాపు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ముద్రగడ పద్మనాభం వైసీపీకి ప్రయోజనం చేకూర్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని ఈ ఫలితాలే రుజువు చేస్తున్నాయి. మొత్తంమీద గత రెండు సంవత్సరాలుగా మిత్రపక్షం– శత్రుపక్షం అన్న తేడా లేకుండా ప్రత్యక్ష– పరోక్ష శక్తులు సాగించిన వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబడ్డారు. నిజానికి నంద్యాలలో తెలుగుదేశం అభ్యర్థి చాలా బలహీనుడు. అదే శిల్పా మోహన్‌రెడ్డి తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఉంటే మెజారిటీ 40 వేలు దాటి ఉండేది. వాస్తవం చెప్పాలంటే నంద్యాలలో పోటీ చంద్రబాబుకు, జగన్మోహన్‌రెడ్డికి మధ్య సాగింది. ఈ పోరులో జగన్‌ చిత్తు కాగా, చంద్రబాబు విజేతగా నిలిచారు. అంత మాత్రాన ఈ ఫలితాలను చూసి తెలుగుదేశం పార్టీ మురిసిపోతూ కూర్చోకూడదు.
 
దిద్దుబాటు తరుణమిదే!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నట్టుగానే ఈ ఫలితాలు ఆయనపై ఉన్న బాధ్యతను మరింత పెంచాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మూడేళ్ల తర్వాత కూడా ఆయనపై ఉన్న నమ్మకం చెదరలేదని రుజువైనందున వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపై ఉంది. విజయాలు వినయాన్ని నేర్పాలని అంటారు. ఈ ఫలితాల తర్వాత కొంతమంది తెలుగుదేశం నాయకులు శ్రుతి మించిన వ్యాఖ్యలు చేశారు. అవి ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. చంద్రబాబుకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు గానీ, ఆయన తీసుకోవలసిన విరుగుడు చర్యలు చాలానే ఉన్నాయి. ముందుగా పార్టీ శాసనసభ్యులను కట్టడి చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం శాసనసభ్యులు, మంత్రులలో సగం మందికి పైగా బరి తెగించారు. ఆయా నియోజకవర్గాలలో గాలి పీల్చుకోవాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలకు మేలు చేద్దామని ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడితే అందులో కూడా బొక్కుతున్నారు. మంత్రులలో బాధ్యతారాహిత్యం పెరిగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం వారికి ఫ్యాషన్‌గా మారిపోయింది. పార్టీపైన, ప్రభుత్వంపైన చంద్రబాబు పట్టు కోల్పోయారన్న అభిప్రాయం కూడా బలంగా ఏర్పడింది. ప్రభుత్వ యంత్రాంగంలో రెడ్‌ టేపిజం పెరిగిపోయింది. లంచాలు ఇవ్వనిదే ఫైళ్లు కదలని పరిస్థితి ఉంది. చంద్రబాబు కూడా తన సమయాన్ని అంతా అధికారిక సమీక్షలకే కేటాయిస్తూ, ప్రజాప్రతినిధులు తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదన్న అభిప్రాయం ఉంది. పార్టీ కార్యకర్తలకు సాంత్వన చేకూర్చేవారే కరువయ్యారు. పోలీసు శాఖను కూడా ప్రక్షాళన చేయాలి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులలో అలసత్వం పెరిగిపోయింది. ముఖ్యమంత్రి బాగా కష్టపడుతున్నారన్న సానుభూతి ప్రజలలో ఉంది గానీ, ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదన్న అభిప్రాయం మాత్రం ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది చివరిలోనే జరుగుతాయని అంటున్నారు కనుక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు పార్టీపరంగా, ప్రభుత్వపరంగా ఉన్న లోటుపాట్లపై దృష్టి సారించడం అవసరం. సమష్టి కృషి ఉంటేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ప్రభుత్వ విషయంలో గానీ, పార్టీ విషయంలో గానీ ఇందుకు మినహాయింపు ఉండదు. ప్రభుత్వ అధికారులు ఎన్నికలలో ఓట్లు వేయించరు. అలాగే పార్టీ శ్రేణులు గుడ్‌ గవర్నెన్స్‌కు ఉపయోగపడరు. ఈ రెండు విభాగాలను సమన్వయం చేసుకుని ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాలి.
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత విస్తృతంగా ప్రచారం జరిగినా నంద్యాల, కాకినాడలో తెలుగుదేశం పార్టీనే గెలిచిందంటే చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో పాటు ప్రతిపక్షాలలో ఆయనకు సమఉజ్జీ లేకపోవడం కూడా కారణం. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్‌రెడ్డి ఉన్నంతవరకు చంద్రబాబు అధికారానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని నేను గతంలోనే స్పష్టంచేశాను. అంత మాత్రాన ప్రజలను తక్కువ అంచనా వేయకూడదు. 1989లో ఎన్టీఆర్‌ ఓడిపోయినప్పుడు కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా డాక్టర్‌ చెన్నారెడ్డి ప్రొజెక్ట్‌ అయ్యారు. అప్పుడు ఆయన ఆరోగ్యం ఏ మాత్రం బాగుండేది కాదు. చూపు సరిగ్గా ఉండేది కాదు. నడవడానికి కూడా ఇబ్బందిపడేవారు. తరచుగా డయాలసిస్‌ చేయాల్సి వచ్చేది. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ఎన్టీఆర్‌పై ఏర్పడిన కోపంతో ప్రజలు చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వెళ్లిన చెన్నారెడ్డి తన ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకున్నారనుకోండి. అది వేరే విషయం!
 
చంద్రబాబుకు జ్ఞాపకశక్తి బాగా ఎక్కువ. అయినా ఇటీవలకాలంలో అన్నీ మర్చిపోతున్నారని సొంత పార్టీ వాళ్లే ప్రచారం చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటినీ సమీక్షించుకోవలసిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ప్రభుత్వ వ్యవహారాలకు ఎంత సమయం కేటాయిస్తున్నారో, పార్టీ వ్యవహారాలకు అంతే సమయం కేటాయించుకోవాలి. పార్టీలో తలెత్తిన సమస్యలను, అపోహలను పరిష్కరించడానికి సమన్వయ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. బాధ్యతల పంపిణీ జరగాలి. తప్పు చేసేవారిపై చర్యలు తీసుకునే విషయంలో మొహమాటాలకు స్వస్తి చెప్పాలి. పార్టీలో, ప్రభుత్వంలో అవినీతిని అదుపు చేయడానికి వెంటనే చర్యలు ప్రారంభించాలి. నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత మంత్రులు, ఇతర నాయకులు తలెగరేసే పరిస్థితి లేదు కనుక పార్టీలో, ప్రభుత్వంలో క్రమశిక్షణ తీసుకురావడానికి చంద్రబాబుకు ఇదే అదునైన సమయం.
 
తప్పు మీద తప్పు!
ఇక ఇప్పుడు వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విషయానికి వద్దాం. నంద్యాల ఎన్నికకు ప్రాధాన్యం తెచ్చిందే జగన్మోహన్‌రెడ్డి! నంద్యాల ఎన్నికను రెఫరెండంగా పోల్చడంతో పాటు, ఒక నియోజకవర్గంలో 13 రోజులపాటు మకాం చేసి తానే అభ్యర్థి అన్నట్లు ప్రచారం చేయడం, వచ్చే ఎన్నికల ఫలితాలకు ఈ ఎన్నిక ఫలితంతో నాంది పలకాలనడం ఆయన చేసిన ప్రధాన తప్పిదాలు. ఆత్మ విశ్వాసం అతి విశ్వాసం కాకూడదు. రాజకీయ నాయకులు తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని తెరచి ఉంచుకోవాలి. ప్రజల తీర్పును టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా భావించకూడదు. అందుకే నంద్యాల ఫలితం రెఫరెండం అవుతుందని జగన్మోహన్‌రెడ్డి ప్రకటించినా, ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఆ సవాల్‌ను స్వీకరించలేదు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చిపారేయాలనీ, ఉరి తీయాలనీ చేసిన వ్యాఖ్యలు ప్రజలకు రోత పుట్టించాయి. జగన్మోహన్‌రెడ్డి మాత్రమే కాదు రోజా, కరుణాకర్‌రెడ్డి, కొడాలి నాని వంటివారు చేసిన వ్యాఖ్యలు వెగటు పుట్టించడంతో పాటు ప్రజలలో వారి పార్టీ పట్ల చులకన భావం ఏర్పడటానికి కారణం అయ్యాయి. దేశ రాజకీయాలలోనే చంద్రబాబు అంతటి నీచుడు లేడని కరుణాకర్‌రెడ్డి విమర్శించగా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవుతుందో వాడే నంద్యాల, కాకినాడ ఓటర్‌ అని, ఎన్నికల ఫలితాలతో అప్‌ అండ్‌ డౌన్‌ అదిరిపోవాలంటూ రోజా చేసిన వ్యాఖ్యలు ఆకర్షణీయంగా ఉండవచ్చు గానీ, తటస్థ ఓటర్లను ఆలోచింపజేశాయి. ఇక కొడాలి నాని వాడే భాష గురించి చెప్పే పనే లేదు.
 
ఎవరికి ఇష్టం అయినా కాకపోయినా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి. వయసు రీత్యా కూడా ఆయన అందరికంటే పెద్ద. ముఖ్యమంత్రి పదవిని, వయసును గౌరవించకుండా జగన్‌ అండ్‌ కో చేసిన వ్యాఖ్యలు రోత పుట్టించకుండా ఎలా ఉంటాయి? ముఖ్యమంత్రి కావాలని జగన్‌ కోరుకోవడంలో తప్పు లేదు. అయితే అందుకు తనలో ఉన్న అర్హతలు, అనర్హతలు ఏమిటో ముందుగా తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా 30 ఏళ్లు ఉండాలని జగన్‌ అనుకుంటూ ఉండవచ్చు. ప్రజలు కూడా అనుకోవాలి కదా! ఇంకేముంది రేపో మాపో ముఖ్యమంత్రిని అవుతున్నానని జగన్మోహన్‌రెడ్డి చెప్పుకోవడం వల్ల అభాసుపాలవుతున్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించే హక్కు ప్రతిపక్షానికి కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ హక్కును దుర్వినియోగపర్చుకోకూడదు. ప్రభుత్వం ఈ మూడేళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మూడు లక్షల కోట్లే అయినప్పుడు మూడు లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎంపీ సబ్బం హరి చేసిన వ్యాఖ్యలో వాస్తవం ఉంది. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెంచడానికి ప్రతిపక్షం కృషి చేయడంలో తప్పు లేదు. అంత మాత్రాన చేతిలో సొంత మీడియా ఉందని చెప్పి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఇంకేముంది పెద్దబాబుకు లేదా చిన్నబాబుకు వందల వేల కోట్లు ముట్టాయని ప్రచారం చేయడం వికటించకుండా ఎలా ఉంటుంది? దీంతో ప్రభుత్వంలో నిజంగా అవినీతి జరిగినా ప్రజలు నమ్మని పరిస్థితి ఏర్పడింది. తమ సొంత మీడియా వండి వార్చిన వార్తలతో ప్రజలలో వ్యతిరేకత ఏర్పడిందని జగన్‌ అండ్‌ కో నమ్ముతూ వచ్చింది. ఈ కారణంగానే ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదేననీ, జగన్‌ ముఖ్యమంత్రి అయిపోయినట్టేననీ భ్రమించారు. తాము భ్రమల్లో బతకడమే కాకుండా ఇతరులు కూడా భ్రమల్లోనే బతకాలని కోరుకున్నారు. పార్టీ శ్రేణులలో ఆత్మ విశ్వాసం నెలకొల్పడానికై త్వరలో అధికారంలోకి వస్తామని చెప్పుకోవడం వేరు. వచ్చేసినట్టుగానే కలలు కనడం వేరు. నంద్యాలలో జరిగిన పోరును నీతికి-– అవినీతికి, ధర్మానికి– అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని జగన్మోహన్‌ రెడ్డి అభివర్ణించడం కూడా హాస్యాస్పదంగా ఉంది. అవినీతికి సంబంధించిన కేసులలో నిందితుడిగా ఉండి తాను నీతివంతుడనని చెప్పుకొంటే ప్రజలు నమ్మవద్దా? జగన్‌ వెనుక ఒక వర్గం ప్రజలు ఉన్నారంటే ఆయన నీతివంతుడని కాదు– రాజశేఖర్‌రెడ్డి కొడుకుగా ఆయనను అభిమానిస్తున్నారు. మరికొందరు కులం, మతం కారణంగా ఆయన వెనుక చేరారు. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నారు. చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా జగన్‌ అండ్‌ కో చేసిన ప్రచారం వికటించింది. చంద్రబాబును తిట్టిపోయడాన్ని కాసేపు పక్కనపెట్టి తనను ఎందుకు ఆదరించాలో జగన్మోహన్‌రెడ్డి ఇంతవరకు చెప్పుకొనే ప్రయత్నం చేయలేదు. నంద్యాలలో అధికార దుర్వినియోగం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచిందని జగన్‌ అండ్‌ కో చెబుతోంది. పార్టీ శ్రేణుల కోసం ఈ మాట అంటే ఫర్వాలేదు గానీ, నిజంగానే అలానే జరిగిందని వారూ నమ్మితే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఎన్నికలలో జయాపజయాలకు డబ్బు ప్రధాన కారణం అయితే అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఏ ఎన్నికల్లోనూ ఓడిపోదు. ఇక అధికార దుర్వినియోగం అంటారా? జగన్మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నా అదే పని చేస్తారు. ఇలాంటివి ఆత్మ వంచనే అవుతాయి.
 
ఆత్మస్తుతి-– పరనింద వల్ల ప్రయోజనం ఉండదు. ఓటమిని గెలుపునకు మెట్టుగా మార్చుకోవడం విజ్ఞులు చేసే పని! ఆత్మ పరిశీలన చేసుకునే అలవాటు జగన్‌ అండ్‌ కోకు ఉంటే తక్షణమే వారు అందుకు ఉపక్రమించాలి. అలా కాకుండా కింద పడినా మాదే పైచేయి అనుకుంటే అది వారి ఇష్టం. తన వద్ద ఉన్న నాయకులు ప్రత్యామ్నాయం లేకనే తనతో ఉంటున్నారన్న నిజాన్ని జగన్‌ గ్రహించడం లేదు. తన కోసం జనం పరితపిస్తున్నారని భ్రమించడం వల్లనే పార్టీలో సహచరుల మాటకు ఆయన విలువ ఇవ్వరు. నంద్యాలలో 13 రోజులపాటు ప్రచారం వద్దని ఎంత మంది చెప్పినా వినలేదు. వైసీపీ కొత్తగా నియమించుకున్న పీకే అనే ఆయన ఈ సలహా ఇచ్చారని చెబుతున్నారు. ఉత్తరాది ప్రజలు వేరు-– దక్షిణాది ప్రజలు వేరు అని పీకేకి బహుశా తెలిసి ఉండదు. అన్నింటికీ దేవుడు ఉన్నాడు అని జగన్‌ చెబుతూ ఉంటారు. కానీ అదేమి దురదృష్టమో గానీ దేవుడు ఏ సందర్భంలోనూ ఆయన పక్షం వహించడం లేదు. అదృష్టవంతులను చెరిపేవారు ఉండరు– దురదృష్టవంతులను బాగు చేసేవారు ఉండరు అని అంటారు. దేవుడే తనను ముఖ్యమంత్రిని చేస్తాడని నమ్ముతూ కూర్చునే బదులు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి ఏమి చేయాలో జగన్‌ అండ్‌ కో ఆలోచిస్తే వారికే మంచిది. లేదు-– మా మార్గమే రాచమార్గం అని అనుకుంటే అది వారి ఇష్టం. అవును... పైన దేవుడు ఉన్నాడు!
 
Link to comment
Share on other sites

Ika Jagan & Roja elections lo vesina satires ki replies ivvadam aapaali.  Vaallaki replies ivvaalante.... vaalla level ki digajaaraalsi vastundi.  Enduku manam koodaa ade cheyyadam.

 

Before yesterday in a pressmeet of Amarnath Reddy, he tried to ask Roja about what she means about Up and Down adiripoddi.  Suddenly, it seems he also going in to the same path of being vulgar.  Ofcourse, it is not he who said that, but still by repeating it... he was dragging himself into that mud.  That's why... TDP leaders should refrain themselves now and concentrate on development of each constituency... which in return will get them back to power ... by default.

Link to comment
Share on other sites

Common sense vunna evaraina ide chepthaaru, there is clear positive wave for CBN in AP at the same time anti on some of the TDP MLAs due to local corruption & non development. Few MLAs are doing good job in development in there constituencies.

 

Even some of strong YSRCP supporters also agreeing on the same. Neutrals lo vunna koddipaati YSRCP supporters also will come towards TDP if TDP does development works on par with Nandyala in most of constituencies in AP.

Link to comment
Share on other sites

Common sense vunna evaraina ide chepthaaru, there is clear positive wave for CBN in AP at the same time anti on some of the TDP MLAs due to local corruption & non development. Few MLAs are doing good job in development in there constituencies.

 

Even some of strong YSRCP supporters also agreeing on the same. Neutrals lo vunna koddipaati YSRCP supporters also will come towards TDP if TDP does development works on par with Nandyala in most of constituencies in AP.

Link to comment
Share on other sites

Very much agreed.

 

  • Jagan, Roja and etc YSRCP leaders vade language nu criticize cheyyadam ...please maneyyandi. 
  •  
  • Elections ayipoyay. So, now come back to Governance mode and focus 200% on continuing and multiplying the development. 

 

What the above 2 points mean is "JUST FOCUS ON YOUR WORK FOR PEOPLE". That's all. 

Link to comment
Share on other sites

Very much agreed.

 

  • Jagan, Roja and etc YSRCP leaders vade language nu criticize cheyyadam ...please maneyyandi. 
  •  
  • Elections ayipoyay. So, now come back to Governance mode and focus 200% on continuing and multiplying the development. 

 

What the above 2 points mean is "JUST FOCUS ON YOUR WORK FOR PEOPLE". That's all. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...