baabuu Posted January 23, 2018 Posted January 23, 2018 nenu use chesukuntunna idi 3 months nundi http://www.apsrtclivetrack.com/#/ TOO GOOD, VILLAGE BUS data kuda ila undatam, but no publicity as useual TGR and APDevFreak 2
sonykongara Posted January 23, 2018 Author Posted January 23, 2018 జలవనరుల శాఖలో ఈ-మెజర్‌మెంట్23-01-2018 07:58:37 విజయవాడతో కలిపి గుంటూరు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక నేడు గుంటూరులో ఇంజనీరింగ్ సిబ్బందికి శిక్షణ గుంటూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఇప్పటివరకు ఇంజనీరింగ్ శాఖల్లో మాన్యువల్ మెజర్‌మెంట్ బుక్స్ రికార్డింగ్ విధానం అమలు జరుగుతుండగా జలవనరుల శాఖలో ప్రయోగాత్మకంగా ఈ-మెజర్‌మెంట్ విధానాన్ని తీసుకొస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలన్న సీఎం ఆదేశాల అమలులో భాగంగా విజయవాడ, గుంటూరులను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ-మెజర్‌మెంట్ విధానంలో పూర్తి అయిన అభివృద్ధి పనుల కొలతలను ఏ విధంగా నమోదు చేయాలి, వాటిని రియల్‌టైంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడింగ్ వంటి అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తారు. నెల వ్యవధిలో శిక్షణ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసి జిల్లా వ్యాప్తంగా జలవనరుల శాఖలో ఈ-మెజర్‌మెంట్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని అధికారవర్గాలు తెలిపాయు. జలవనరుల శాఖ పరిధిలో ఏటా రూ.వందల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. అయితే ఆయా నిర్మాణ పనులు ఏరోజుకు ఆరోజు కాకుండా ఎప్పటికో ఎంబుక్స్‌లో రికార్డింగ్ చేసేవారు. ఈ క్రమంలో ఎన్నో అవినీతి, అక్రమాలు చోటు చేసుకొనేవి. కాంట్రాక్టర్ల వద్ద ముడుపులు తీసుకొని ఎంబుక్స్ రికార్డింగ్ చేస్తోన్నారన్న ఆరోపణలు కూడా పలుమార్లు వచ్చాయి. చాలామంది ఇంజనీరింగ్ అధికారులకు ఎంబుక్‌ల నమోదుపై స్పష్టమైన అవగాహన కూడా లేదు. ఆ శాఖలో సీనియర్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ఆధారపడి వారు తయారు చేసి తీసుకొచ్చిన బుక్స్‌పై సంతకాలు చేస్తుండేవారు. ఈ విధానాన్ని స్వస్తి చెప్పాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు ఈ-మెజర్‌మెంట్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. కొత్త విధానంలో అభివృద్ధి పనులు జరుగుతోన్న వాటిని నిత్యం సందర్శించాలి. ప్రతీ రోజు మెజర్‌మెంట్స్‌ని రికార్డు చేసి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలి. దీని వలన ఏ పని ఎన్ని రోజులకు ఎంత శాతం పూర్తి అయింది వంటి వివరాలు రియల్‌టైంలో తెలిసిపోతాయి. ఇలా నిరంతరం పర్యవేక్షణ ఉండటం వలన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయని అధికారులు చెబుతోన్నారు. ఈ నూతన ఎలకా్ట్రనిక్ విధానంపై జలవనరుల శాఖలో పని చేస్తోన్న అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోన్నారు. ఇప్పటికే ఒక దఫా ఆ శాఖ ఎస్‌ఈ బాబురావు సమావేశం నిర్వహించి మార్గదర్శకాలను తెలిపారు. రెండో విడత సమావేశం మంగళవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో జరగనుంది. ఎలకా్ట్రనిక్ మెజర్‌మెంట్ విధానం బుక్‌లెట్‌లను కూడా సిబ్బందికి అందజేస్తారని అధికారవర్గాలు తెలిపాయి. శిక్షణ పూర్తి చేసిన వెంటనే ఈ-ఎంబుక్ విధానం అమలులోకి తీసుకొస్తామని వివరించాయి.
Palnadu Posted April 15, 2018 Posted April 15, 2018 Annaii Andhra lo panchyathi paridhi lo nii intiki online tax paying site chepandii
sonykongara Posted April 19, 2018 Author Posted April 19, 2018 On 4/15/2018 at 9:33 PM, Palnadu said: Annaii Andhra lo panchyathi paridhi lo nii intiki online tax paying site chepandii http://mpanchayat.ap.gov.in/
sonykongara Posted April 19, 2018 Author Posted April 19, 2018 (edited) http://epmis.ap.nic.in/epmishtaxGetDetails.jsp Edited April 19, 2018 by sonykongara
sonykongara Posted April 19, 2018 Author Posted April 19, 2018 On 4/15/2018 at 9:33 PM, Palnadu said: Annaii Andhra lo panchyathi paridhi lo nii intiki online tax paying site chepandii http://epmis.ap.nic.in/epmishtaxGetDetails.jsp
gopi089 Posted April 25, 2018 Posted April 25, 2018 Personal experience: came for a visit to India. I bought a new car for my parents and taken special number and selected number though aprta.citizen.epragathi website bidding process got number in one day. What a smooth process no agent no money. 3mar, Hello26 and Saichandra 3
Saichandra Posted April 25, 2018 Posted April 25, 2018 1 minute ago, gopi089 said: Personal experience: came for a visit to India. I bought a new car for my parents and taken special number and selected number though aprta.citizen.epragathi website bidding process got number in one day. What a smooth process no agent no money. Tfs bro
Hello26 Posted April 25, 2018 Posted April 25, 2018 39 minutes ago, gopi089 said: Personal experience: came for a visit to India. I bought a new car for my parents and taken special number and selected number though aprta.citizen.epragathi website bidding process got number in one day. What a smooth process no agent no money. Excellent. Brother, meeku twitter id vunte andulo tweet cheyyandi please
sonykongara Posted May 23, 2018 Author Posted May 23, 2018 ఈ-ప్రగతి ద్వారా 106 లైసెన్సులు!: సీఎం23-05-2018 03:10:09 అమరావతి, మే 22, (ఆంధ్రజ్యోతి): ఈ-ప్రగతి ద్వారా పలు పనులు, సేవలకు అనుమతులు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. తొలి దశలో 106 లైసెన్సులను ఈ-ప్రగతి ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు. ఆయా సేవలు, పనులకు అనుమతి కోసం దరఖాస్తు చేయడం దగ్గరి నుంచి...అనుమతి మంజూరు వరకు అంతా ఈ-ప్రగతి ద్వారానే నిర్వహించనున్నారు. దీనికోసం రూపొందించిన లైసెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం ఎలా పనిచేస్తోందో అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. పైలట్ ప్రాజెక్టు పురోగతిలో ఉందని తెలిపారు. ఈ-ప్రగతిపై సీఎం మంగళవారమిక్కడ సమీక్ష నిర్వహించారు. సర్టిఫికెట్ రహిత పాలనా పద్ధతి(సీఎల్‌జీఎస్) దిశగా చేస్తున్న కసరత్తుపై అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. కోర్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటుకు అవసరమైన పనులు నడుస్తున్నాయన్నారు. ప్రతి శాఖ ఈ-ప్రగతితో అనుసంధానం అయ్యేందుకు ఒక డెడ్‌లైన్ ఏర్పరుచుకోవాలని, దానిప్రకారం వేగంగా అనుసంధానం కావాలని సీఎం నిర్దేశించారు. విద్య, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, పురపాలక, పరిశ్రమల శాఖల్లో ఈ-ప్రగతి పురోగతిపై ఆయన సమీక్షించారు. రవాణా, విద్య, వ్యవసాయం, రెరాలకు సంబంధించి ఏపీ వన్ పోర్టల్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రజా సాధికార సర్వేతో సమాచార అనుసంధానం చేసే ప్రక్రియ పురోగతిలో ఉందని ఆర్టీజీ సీఈవో అహ్మద్‌బాబు చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 150 కెమెరాలు, వాటి అనలిటిక్స్‌ను వచ్చే సోమవారం ప్రజంట్ చేస్తామన్నారు. వర్చువల్ క్లాస్‌రూమ్‌ల కంటెంట్ రూపొందించే పనిని పూర్తిచేశామన్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now