Jump to content

ONGC Nagayalanka


Recommended Posts

నాగాయలంకలో చమురు వెలికితీతకు కేంద్రం అనుమతి

ఓఎన్‌జీసీ ఈడీ వెల్లడి

బంటుమిల్లి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా నాగాయలంకలోని ఓఎన్‌జీసీ బావుల నుంచి పెట్రో ఉత్పత్తుల వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు (ఈడీ) దిబాసిస్‌ సన్యాల్‌ వెల్లడించారు. ఆగస్టు నుంచి చమురు వెలికితీత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలోని బంటుమిల్లి మండలం చినపాండ్రక గ్రామాన్ని ఓఎన్‌జీసీ దత్తత తీసుకుంది. ఈ గ్రామంలో బుధవారం 370 కుటుంబాలకు వంటగ్యాస్‌ సిలెండర్లను సన్యాల్‌ పంపిణీ చేసి పొగ రహిత గ్రామంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు. నాగాయలంకలో భూగర్భ నిక్షేపాల అన్వేషణకు కెయిర్న్‌ ఎనర్జీ సంస్థతో కలిసి సంయుక్తంగా బావులు తవ్వామని తెలిపారు. జిల్లాలోని మల్లేశ్వరం ప్రాంతంలో అన్వేషణ కొనసాగుతోందని.. ఇక్కడ గతంలో ఆశించినంత ఉత్పత్తులు లభించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 2012 నుంచి కృష్ణా జిల్లాలో సామాజిక అవసరాలకు రూ.2.72 కోట్లు ఖర్చు చేశామని సన్యాల్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

ninna some godavari district lo gas leak ayindhi ga ONGC vaaladhu

అంతర్వేదిలో గ్యాస్‌ లీకేజీ

5ap-state6a.jpg

అంతర్వేది, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది తీరంలో ఓఎన్జీసీ గ్యాస్‌ పైపులైన్‌ నుంచి శుక్రవారం గ్యాస్‌ లీకైంది. దీంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మోరి జీసీఎస్‌ పరిధిలో అంతర్వేది, అంతర్వేది దేవస్థానం, పల్లిపాలెం, కేశవదాసుపాలెం గ్రామాల్లో 32 ఓఎన్జీసీ బావులున్నాయి. శుక్రవారం సాయంత్రం 5, 20 నెంబర్ల బావుల నుంచి వస్తున్న పైపులైన్లు రెండు చోట్ల లీకయ్యాయి. గ్యాస్‌ భారీగా ఎగసిపడింది. దీనిని గమనించిన స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు తెలపగా వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు. వెంటనే మోరి జీసీఎస్‌ వద్ద గ్యాస్‌ను నియంత్రించి పరిశీలించారు. అంతర్వేది తీరంలోని 5, 20 బావులకు సంబంధించిన పైపులైన్ల లీకేజీలను గుర్తించి అక్కడకు గ్యాస్‌ సరఫరా కాకుండా నిలిపివేశారు. అంతర్వేది తీరంలో ఇసుకను తవ్వేడంతో భూమిలోని పైపులైన్లు బయటపడుతున్నాయని, ఈ నేపథ్యంలో లీకేజీలు ఏర్పడుతున్నాయని సిబ్బంది తెలిపారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...