Jump to content

Recommended Posts

Posted
సైకిల్‌పై...‘బడికి వస్తా’!
 
636234160751042215.jpg
  • తొమ్మిదో తరగతి విద్యార్థినులకు.. 1.82 లక్షల సైకిళ్ల పంపిణీ
  • ప్రభుత్వం వినూత్న పథకం
  • డ్రాపవుట్ల కట్టడికి భారీ కసరత్తు
  • మూడు సంస్థలకు సైకిళ్ల ఆర్డర్‌
  • విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : డ్రాపవుట్లను తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నెరవేరనుంది. తొ మ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లను పం పిణీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ‘బ డికి వస్తా’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,81,555 సైకిళ్లను అందించాలని నిర్ణయించింది. నిజానికి, తొమ్మిదో తరగతిలోనే డ్రాపవుట్లు ఎక్కువ. కీలక అడుగు పడే సమయం ఇది. ఈ ఒక్క క్లాసు దాటేస్తే.. చదువులో ముందుకు వెళ్లిపోతారు. సరిగ్గా ఈ దశలోనే పిల్లల తల్లిదండ్రుల్లో ఊగిసలాట ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల చదువుల విషయంలో ‘అడుగు ముందుకా- వెనక్కా’ అనేది తేలిపోయేది ఆ సమయంలోనే. ఈ విషయంలో ఆడపిల్లల పక్షా న నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ, మరోవైపు సౌకర్యవంతమైన, భద్రతతో కూడిన ప్ర యాణం చేసేలా.. ఈ తరగతి బాలికల కోసం వినూత్న పథకం ప్రవేశపెట్టింది.
 
అదే ‘బడికి వస్తా’. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, మున్సిపల్‌, మోడల్‌ పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు అందజేయనున్నారు. సైకిళ్ల పంపిణీ ఆర్డర్‌ను మూడు సంస్థలకు విద్యాశాఖ అప్పగించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు మొత్తం 99,796 సైకిళ్లను టీఐ సైకిల్స్‌ఆఫ్‌ ఇండియా (చెన్నై), గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు మొత్తం 41,929 సైకిళ్లను హీరో సైకిల్స్‌ లిమిటెడ్‌ (లూథియానా), కడప, కర్నూలు, అనంతపూర్‌ జిల్లాలకు మొత్తం 39,830 సైకిళ్లను ఎవాన్‌ సైకిల్స్‌ లిమిటెడ్‌ (లూథియానా).. సరఫరా చేస్తాయి. ఈ మేరకు విద్యాశాఖ బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
 
బిడ్డర్లదే పంపిణీ బాధ్యత
పాఠశాలలో విద్యార్థినులకు సైకిళ్లను అందజేసే బాధ్యత కూడా బిడ్డర్లకే అప్పగించారు. ప్రతి వెయ్యి సైకిళ్లను ఒక బ్యాచ్‌గా విభజించి సరఫరా చేస్తారు. పాఠశాలల వారీగా సైకిళ్లను ఉంచేందుకు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలం లేక రెండు గదులను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అలాగే, టెక్నీషియన్లను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. జిల్లా విద్యాశాఖాధికారులు పర్యవేక్షణలో పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది.

ఏ జిల్లాకు ఎన్ని..
తూర్పుగోదావరి-22,652, పశ్చిమ గోదావరి -16,841, చిత్తూరు-16,722, అనంతపూర్‌- 15,581, గుంటూరు -15,533, కర్నూలు -14,992, కృష్ణా-13,970, విశాఖపట్నం-12,962, శ్రీకాకుళం-12,916, ప్రకాశం-10,941, విజయనగరం- 9,874, నెల్లూరు- 9,674, కడప- 9,257.
Posted

 

cycles-for-girls-02062016.jpg

A request from a girl in Mahanadu, is approved by Andhra Pradesh Cabinet Yesterday. A young girl in her speech in Mahanadu, requested Chief Minister to give free cycles to girl students. She has recollected that, while she was studying, she has got free cycle from then TDP government and she used to go on to school and cycle. Now she has completed here PG. She, requested to implement this again, so that many girl students can use this opportunity to study in the schools. The dropout rate among the girls was high as the parents are not willing to send their wards to schools outside their village without a proper mode of transport.

As this is also one of the TDP promises in 2014 elections, AP Cabinet yesterday has decided to distribute bicycles to girl students studying in government, aided and municipal schools.

 

The government plans to implement the scheme in all 13 districts, and as many as 1.80 lakh girl students will be benefited.

 
Posted

Only for girls.. mari boys ki

 

naturally fragile ... protect them ... balisina kollu kaadu ... who know how to abuse the system with domestic violence cases 

  • 1 month later...
Guest Urban Legend
Posted

Only for girls.. mari boys ki

 

girls drop out is more in rural areas due to sanitation and long distances

Posted

Super if possible to provide scholarships to financially backward girls students to complete there studies

  • 1 year later...
  • 1 month later...
Posted
On 4/16/2017 at 11:40 AM, eshwarR said:

jagan anna vaste school pillalaku bikes college students ki cars istadu appudu  boys will take care of girls...

 

  • 3 weeks later...
  • 5 months later...
Posted
త్వరలో ‘బడికొస్తా’ సైకిళ్లు
02-01-2019 10:46:22
 
636820227828574622.jpg
  • జిల్లాలో 28వేల మంది విద్యార్థినులు అర్హులు
  • నెలాఖరులోగా పంపిణీకి ప్రణాళిక
ఉన్నత పాఠశాల స్థాయిలో విద్యార్థినులు చదువుకు దూరంగా కాకుండా వారిని ప్రొత్సహించడానికి ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘బడికొస్తా’ పథకం ద్వారా సైకిళ్ళ పంపిణీ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే జాప్యమైన సైకిళ్ల పంపిణీని ఈనెలాఖరులోగా పూర్తిచేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యాశాఖకు సంబంధించిన శ్వేత పత్రాల విడుదల సమయంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
 
గుంటూరు (విద్య): జిల్లాలో ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థినులు దాదాపు 52 వేల మంది ఉన్నారు. వీరిలో 8, 9వ తరగతుల విద్యార్థినులకు ప్రత్యేకంగా ప్రభుత్వం ‘బడికొస్తా’ పథకం ద్వారా సైకిళ్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది జిల్లాలో దాదాపు 15 వేలకు పైగా సైకిళ్ళు పంపిణీ చేశారు. ఈ ఏడాది అర్హులైన విద్యార్థినులు, బడికి దూరంగా నివాసం ఉంటూ రోజూ ఆటోలు, ప్రత్యామ్నాయ రవాణా మార్గాల ద్వారా పాఠశాలకు వచ్చే విద్యార్థినులు సంఖ్య 8వ తరగతి స్థాయిలో 14 వేల 800 మంది, తొమ్మిదో తరగతిలో 13 వేల 600 మంది మొత్తం 28 వేల 400 మంది అర్హులు ఉన్నట్లు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. వారికి సంబంధించిన ప్రతిపాదనలు ఇతర మార్గదర్శకాలను ప్రభుత్వానికి గత ఏడాదే పంపారు. అయితే ఇంకా అర్హులైన విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ చేయలేదు. ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో దీనికి సంబంధించి టెండర్‌ దశ కూడా పూర్తికాలేదని, కొన్ని ప్రముఖ సైకిల్‌ తయారీ సంస్థల ద్వారా జిల్లా కేంద్రాలకు త్వరలో పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
 
వాస్తవంగా గతేడాది తొమ్మిదో తరగతి చదివే విద్యార్థినులకు ఈ సైకిళ్ళు అందజేయాలి. అయితే ఇప్పుడు వారు పదో తరగతికి వచ్చి సగం విద్యాసంవత్సం పూర్తయ్యాక సైకిళ్ళు పంపిణీచేస్తే ఉపయోగం ఏమిటనేది ప్రశ్నార్ధకంగా మారింది.
 
పంపిణీ ప్రసహనానికి చెక్‌పడేనా?
ప్రభుత్వం ఏటా సైకిళ్ళు పంపిణీచేసే పథకం ఓ ప్రసహనంగా మారింది. అర్హులైన విద్యార్థినులకు రాష్ట్రస్థాయిలో సైకిళ్ళు కొనుగోలు చేసి జిల్లా కేంద్రానికి పంపుతారు. అక్కడ నుంచి మండల కేంద్రానికి ఆ తరువాత పాఠశాల స్థాయికి అవి పంపాలి. అక్కడ రికార్డులో నమోదుచేసి అర్హులైన విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ చేయాలి. అయితే జిల్లా కేంద్రానికి వచ్చిన తరువాత ఆ సైకిళ్ళు గురించి పట్టించుకోవడం లేదు. గతేడాది స్టాల్‌ గరల్స్‌ హైస్కూల్‌లో దాదాపు మూడునెలల పాటు సైకిళ్ళు ఎండకు ఎండి... వానకు తడుస్తూ ఉండిపోయాయి. కారణం మండల స్థాయికి పంపడానికి రవాణా చార్జీలు చెల్లించడం లేదని... దీంతో సైకిళ్ళు తీసుకెళ్ళడానికి ప్రధా నోపాధ్యాయులు ముందుకురావడం లేదని ఓ అధికారి వెల్లడించారు. పాఠశాలకు సంబంధించిన కొన్ని నిధులను మండల స్థాయిలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పోగుచేసి లారీల ద్వారా సైకిళ్ళను తరలించారు.
 
ఏడాది ప్రారంభంలోనే జీవో జారీ
ఈ విద్యాసంవత్సరానికిగాను ప్రభుత్వం 2018 మే 28న జీవో నం 113ని జారీ చేసింది. ఈ జీవో విడుదలై నాలుగు నెలలు గడుస్తున్నా ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాలేదని అధికారులు చెబుతున్నారు. సైకిళ్ళు పంపిణీ చేసే ప్రధాన సంస్థల నుంచి కొటేషన్లు మా త్రమే తీసుకున్నారు. ఇంకా వారికి అర్డర్‌ ఇవ్వ లేదని ఓ ఉపాధ్యాయ సంఘానికి చెందిన రా ష్ట్ర నాయకుడొకరు తెలిపారు. ఆర్డర్‌ తీసుకుని విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీచేసే సరికి మరో మూడు నెలలు సమయం పట్టవచ్చునని వెల్లడించారు. అయితే ఈ విషయమై జిల్లా స్థాయిలో అధికారుల వద్ద సమాచారం లేదు. ఇప్పటివరకు ప్రతిపాదనలు మాత్రమే తాము పంపామని వారు చెబుతున్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...