Jump to content

Recommended Posts

Posted

visaalandhra mudranalayam vundhi aa road lo.. established 63 years ago on June 22, 1952 in Vijayawada anta, as of 2014 Circulation: 40000. Readership: 80000 

still feasible to survive ?

  • 2 weeks later...
Posted

వీరపనేనిగూడెంలో ఐటీ పార్క్‌..!
05-02-2018 08:01:43

ఫేజ్‌-2లో ఏపీఐఐసీకి 100 ఎకరాలు కేటాయించిన రెవెన్యూ
ఐటీతో పాటు మరో ఇండస్ర్టియల్‌ పార్క్‌!
 విజయవాడ (ఆంధ్రజ్యోతి): వీరపనేనిగూడెంలో ఐటీ పార్క్‌ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఐటీ పార్క్‌ ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. వీరపనేనిగూడెంలో ఫేజ్‌-2 కింద మరో 100 ఎకరాలను ఏపీఐఐసీకి, తాజాగా రెవెన్యూ శాఖ బదలాయించింది. ఇందులో మరో ఇండస్ర్టియల్‌ పార్క్‌ (ఐపీ)తో పాటుగా ఐటీకి కూడా కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. జిందాల్‌ వంటి సంస్థలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, వీరపనేనిగూడెంలో ఐటీ ఇండస్ర్టీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెవెన్యూ నుంచి 100 ఎకరాల భూములు స్వాధీనం కావటంతో ఏపీఐఐసీ వెంటనే రంగంలోకి దిగింది. లే అవుట్‌, అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
 
ఫేజ్‌-1లో.. పారిశ్రామిక సంస్థల పనులు ప్రారంభం
వీరపనేనిగూడెం మోడల్‌ ఇండస్ర్టియల్‌ లే అవుట్‌లో మొత్తం 79 ప్లాట్లకు గాను 74 ప్లాట్లలో పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఐపీలో ఇప్పటికే ఏపీఐఐసీ దాదాపుగా రూ.15 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టింది.
 
1000 దరఖాస్తులు
మల్లవల్లిలోని ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో పరిశ్రమల ఏర్పాటుకు మొత్తం 1000 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 7న ఉన్నతస్థాయి కమిటీలో వీటి కేటాయింపులకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. ఇన్నోవేటివ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో వివిధ అసోసియేషన్లు కోరికపై ప్లాట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 800 మంది ఎంఎ్‌సఎంఈ పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
అశోక్‌ లే ల్యాండ్‌ సంస్థ తనకు కేటాయించిన 75 ఎకరాలకు సంబంధించి ఏపీఐఐసీకి ఎకరానికి రూ. 16.50 లక్షల చొప్పున చెల్లింపులు చేసింది. స్థల రిజిస్ర్టేషన్‌కు సంప్రదింపులు జరుగుతున్నాయి. మోహన్‌ స్పిన్‌టెక్స్‌కు కూడా ఇదే ప్రాంతంలో భూములను కేటాయించింది. ఈ సంస్థ డబ్బు చెల్లించాల్సి ఉంది. 90 రోజుల్లో ఈ సంస్థ పనులను ప్రారంభించాల్సి ఉంది.
 
పనులు చేపట్టిన హెచ్‌సీఎల్‌
హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) టెక్నాలజీస్‌ పార్కు ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని ఆ సంస్థ స్వాధీనం చేసుకుంది. ఈ స్థలంలో చెట్ల తొలగింపు, నేల చదును పనులు ప్రారంభించింది. ప్రాథమికంగా ఇప్పటికే ఏపీఐఐసీతో, హెచ్‌సీఎల్‌ సంస్థ సేల్‌డీడ్‌ కుదుర్చుకుంది. హెచ్‌సీఎల్‌ ఏర్పాటు చేయబోయే స్థలానికి ఎదురుగా కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. గ్రాండ్‌ ఎంట్రన్స్‌ మార్గానికి ఇవి అడ్డుగా ఉండటంతో భూ సేకరణలో భాగంగా తొలగింపునకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. కొందరు దీనిపై మెరుగైన పరిహారానికి కోర్టుకు వెళ్ళారు. ప్రస్తుతానికి ఇద్దరు మాత్రమే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఈ సమస్యకు, హెచ్‌సీఎల్‌ పార్కు ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందిలేదు. నిర్మాణానికి ఇచ్చిన భూములకు సంబంధించి ఎలాంటి వివాదమూ లేదు.
 
పారిశ్రామిక సంస్థల రిజిస్ర్టేషన్స్‌ కోసం కలెక్టర్‌ లేఖ
కృష్ణా జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు, భారీ పరిశ్రమలు, ఐటీ అనుబంధ తదితర పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు సంబంధించి తేలిగ్గా రిజిస్ర్టేషన్‌ జరిగేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, రిజిస్ర్టార్‌ ఐజీకి లేఖరాశారు. జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక సంస్థల వివరాలను జిల్లా యంత్రాంగం రిజిస్ర్టేషన్‌ శాఖకు అప్పగిస్తుంది.

Posted
హెచ్‌సీఎల్‌ పనులు ఆరంభం 
రాజధానిలో తొలి ఎంఎన్‌సీకి ముందడుగు 
దుర్గాపురంలోని 28 ఎకరాల్లో ప్రారంభం 
2019 మార్చి నాటికి సంస్థ తొలిదశ కార్యకలాపాలు 
amr-top1a.jpg

ఈనాడు-అమరావతి: అమరావతి రాజధాని పరిధిలో మొట్టమొదటి భారీ ఐటీ ప్రాంగణం ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. గన్నవరంలోని 28 ఎకరాలలో హెచ్‌సీఎల్‌ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు మొదలయ్యాయి. రాజధాని పరిధిలో ఇప్పటికే 37కు పైగా ఐటీ సంస్థలు ఏర్పాటైనప్పటికీ అవన్నీ 500లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీలే. తొలిసారి వేల మంది ఉద్యోగులకు ఉపాధిని కల్పించే పెద్ద ఐటీ ప్రాంగణం గన్నవరం విమానాశ్రయం ఎదురుగా దుర్గాపురంలో కేటాయించిన స్థలంలో రూపుదిద్దుకుంటోంది. రెండు దశల్లో 28 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాంగణం దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైనదిగా మారనుంది. 2019 మార్చి నాటికి తొలిదశ పనులను పూర్తిచేసి.. ఇక్కడ కార్యకలాపాలను  ప్రారంభించనున్నారు. ఈ ప్రాంగణం మొత్తం అందుబాటులోనికి తీసుకురావడం ద్వారా ఐదు వేల నుంచి ఏడు వేల మంది వరకూ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇదే ప్రాంగణంలో ఐటీ శిక్షణ సంస్థను కూడాహెచ్‌సీఎల్‌ సంస్థ నెలకొల్పనుంది. ఇక్కడే యువతకు శిక్షణ ఇచ్చి.. సంస్థలో ఉద్యోగులుగా తీసుకోనున్నారు. 
గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న ఆర్టీసీ స్థలాన్ని ప్రభుత్వం గత ఏడాది హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ కోసం కేటాయించింది. ఈ స్థలంలో ఆర్టీసీ అకాడమీకి సంబంధించిన భవనాలున్నాయి. వీటిని తొలగించే పనులు ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. 28 ఎకరాల ప్రాంగణం చుట్టూ తొలుత ప్రహరీ నిర్మాణం పనులు చేపడుతున్నారు. దానికోసమే చుట్టూ చదును చేస్తున్నారు. ఏడాదిలోగా తొలిదశ కార్యకలాపాలను ఇక్కడ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ సంస్థ ప్రారంభిస్తుందని ఐటీ మంత్రి నారా లోకేశ్‌ సైతం స్పష్టం చేశారు. కార్యకలాపాలు మొదలైతే మరిన్ని సంస్థలు త్వరితగతిన ముందుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. గన్నవరం విమానాశ్రయం ఇక్కడికి కేవలం పావు కిలోమీటరు దూరంలోనే ఉండడంతో ఈ ప్రాంతం ఐటీ పరిశ్రమలకు అనుకూలంగా ఉండబోతోంది.

మేధాలో హెచ్‌సీఎల్‌ స్టేట్‌స్ట్రీట్‌ సంస్థ.. 
హెచ్‌సీఎల్‌ సంస్థ పనులు జరుగుతున్న స్థలానికి సమీపంలోని మేధాటవర్స్‌ ఉంది. దీనిలో ఇప్పటికే 12 ఐటీ సంస్థలు నడుస్తున్నాయి. 1200 మంది వరకూ ఉద్యోగులున్నారు. మేథాటవర్స్‌లో రెండు లక్షల చదరపు అడుగులు ఉండగా 70వేల వరకూ ఇంకా ఖాళీ ఉంది. దీనిలో త్వరలో హెచ్‌సీఎల్‌ స్టేట్‌స్ట్రీట్‌ సంస్థ తమ సంస్థను నెలకొల్పబోతోంది. ఈ సంస్థలో వెయ్యి మంది వరకూ ఉపాధి దొరకనుంది. ఈ సంస్థ ఏర్పాటు చేస్తే మేధాటవర్స్‌ పూర్తిగా నిండిపోతుంది. భవిష్యత్తులో వచ్చే కంపెనీల కోసం మేథాటవర్స్‌ వెనుకనే.. రెండో ఐటీ టవర్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ టవర్‌లో 4.4లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోనికి వస్తుంది. రెండు నెలల కిందట ఈ టవర్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో మరో 25వరకూ ఐటీ సంస్థలను నెలకొల్పనున్నారు.

  • 2 weeks later...
  • 1 month later...
  • 3 weeks later...
Posted
మేలో.. హెచ్‌సీఎల్‌
26-04-2018 10:07:50
 
636603340703416739.jpg
  • ఎయిర్‌పోర్టు ఎదురుగా భూమిపూజ
  • ప్రారంభం రోజు మేథలో కార్యకలాపాలు
  • టవర్‌లో పూర్తి కావస్తున్న ఇంటీరియర్‌ పనులు
విజయవాడ కేంద్రంగా హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) టెక్నాలజీస్‌ పార్క్‌ ఏర్పాటుకు ముహూర్తం సిద్ధమౌతోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎదురుగా ఆర్టీసీ జోనల్‌ కాలేజీ స్థలంలో హెచ్‌సీఎల్‌ టవర్‌ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టవర్‌ నిర్మాణ పనులకు భూమిపూజతో పాటు, విజయవాడ వేదికగా మేథ టవర్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభించటానికి అడుగు పడబోతోంది. మే రెండు, మూడో వారాల్లో టవర్‌కు భూమిపూజ, మేథ టవర్‌లో కార్యకలాపాలను ప్రారంభించటానికి ఇటు హెచ్‌సీఎల్‌, అటు ఏపీఐఐసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆర్టీసీ జోనల్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చెందిన 27 ఎకరాల్లో ఏర్పాటు కానున్నది. అక్కడ చెట్ల తొలగింపు, నేల చదును పనులను సంస్థ ముమ్మరం చేసింది. ఈ పనులు ఒక కొలిక్కి రాగానే సెజ్‌లో భాగంగా ప్రాజెక్టును ఏర్పాటు చేయటానికి వీలుగా ఽకేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదన పరిశీనలలో ఉంది. దాదాపుగా సెజ్‌ ప్రతిపాదనకు ఆమోదం దక్కనుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో టవర్‌ నిర్మాణ పనులు ప్రారంభించటానికి భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించటానికి కూడా హెచ్‌సీఎల్‌ సమాయత్తమైంది. టవర్‌ నిర్మాణ పనులు పూర్తి కావటానికి ఎంత లేదన్నా ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆగకుండా తక్షణం కార్యకలాపాలు ప్రారంభించటానికి వీలుగా హెచ్‌సీఎల్‌ సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. ఒక వైపు టవర్‌ నిర్మాణ పనులతో పాటే మరోవైపు ‘మేథ’ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకుంది.
 
కేసనపల్లిలోని ఎల్‌అండ్‌టీ - ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలోని మేథ టవర్‌లో ఏకంగా ఒక ఫ్లోర్‌నే లీజుకు తీసుకుంది.కొద్ది రోజులుగా ఇంటీరియర్‌ వర్క్స్‌ నడుస్తున్నాయి. ఒకవైపు టవర్‌కు భూమిపూజ, రెండోవైపు అద్దె భవనంలో కార్యకలాపాలు ఒకేసారి ప్రారంభించేందుకు హెచ్‌సీఎల్‌ సంస్థ సన్నద్ధమైంది. ఏప్రిల్‌ నెలాఖరుకు మేథ టవర్‌లో ఇంటీరియర్‌ పనులు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నందున మేలో రెండింటికీ ఒకేసారి ప్రారంభిస్తే బాగుంటుందన్న ఆలోచనలో యాజమాన్యం ఉంది. దీనికి అనుగుణంగా మే రెండు, మూడు వారాలలో ముహూర్తపు తేదీని ప్రకటించాలని భావిస్తున్నారు.
 
zdg.jpgశరవేగంగా శంకుస్థాపనలు
జిల్లాలో శంకుస్థాపన కార్యక్రమాలను శరవేగంగా నిర్వహించటానికి ఏపీఐఐసీ చర్యలు చేపడుతోంది. శంకుస్థాపన కార్యక్రమాలకు జాబితాను తయారు చేస్తోంది. మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌లో భారీ పరిశ్రమల కేటగిరిలో ఇటీవలే అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీకి భూమిపూజ నిర్వహించటం జరిగింది. ఇదే శ్రేణిలో మోహన్‌ స్పిన్‌టెక్స్‌కు సంబంధించి కూడా ముహూర్త తేదీని నిర్ణయించే పనిలో అధికారులు ఉన్నారు. ఇక మధ్యశ్రేణి పరిశ్రమలకు సంబం ధించి వివిధ అసోసి యేషన్లకు ప్లాట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అసోసియే షన్లకు కేటాయించిన ప్లాట్లకు సంబంధించి సేల్‌డీడ్‌ ప్రక్రియను త్వరితగతిన ముగించేం దుకు చర్యలు చేప ట్టాలని అధికారులు భావిస్తున్నారు. సేల్‌డీడ్‌ ప్రక్రియ ముగిస్తే కానీ వెంటనే భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించటానికి వీలు ఉండదు.
Posted
17 hours ago, sonykongara said:

HCL panulu fast ga jarugutunnayanta.

Posted
18 hours ago, sonykongara said:

:super:

Posted
విల్లాలు.. ఐటీ ఖిల్లాలు
26ap-story4b.jpg
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జాతీయ రహదారి చెంతనే అత్యాధునిక సౌకర్యాలతో పదుల సంఖ్యలో విల్లాలను నిర్మించారు. వీటిల్లో ఎవరూ నివసించకపోడంతో మొన్నటివరకు ఖాళీగా దర్శనమిచ్చాయి. రాజధాని పరిధిలో ఐటీ రంగం అభివృద్ధిలోభాగంగా రెండునెలల క్రితం ఈ ప్రాంతంలో పలు ఐటీ కంపెనీలను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించారు. సంబంధిత ఉద్యోగాలకు అవసరమైన అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని అమీర్‌పేట నుంచి పెద్ద సంఖ్యలో ప్రైవేట్‌ కేంద్రాలు ఇక్కడికి తరలివచ్చి.. ఈ విల్లాల్లో వెలిశాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థలూ తమ కార్యకలాపాలను స్థానికంగా ప్రారంభించి విద్యార్థులకు ఉచిత శిక్షణ సహా వారి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చాయి. దీంతో మొన్నటివరకు నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఐటీ కోర్సులు నేర్చుకునే విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.
26ap-story4a.jpg
   -ఈనాడు, గుంటూరు

Posted

మే నెల నుంచి, గన్నవరంలో హెచ్‌సీఎల్‌ కార్యకలాపాలు ప్రారంభం...

hcl-27042018.jpg
share.png

గన్నవరం సమీపంలో, అతి పెద్ద ఐటి కంపెనీ హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌), తమ కార్యకలాపాలని మే నెల నుంచి ప్రారంభించనుంది.. గన్నవరంలని మేధా టవర్స్ లో, హెచ్‌సీఎల్‌ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది.. గన్నవరం ఎయిర్ పోర్ట్ ఎదురుగా, ఆర్టీసీ జోనల్‌ కాలేజీ స్థలంలో, హెచ్‌సీఎల్‌ శాశ్వత భవనాలకు కూడా మే నెలలోనే భూమిపూజ జరగనుంది. ఒకే రోజు, అటు శాశ్వత భవనాలకు భూమి పూజ, మేధా టవర్స్ లో కార్యకలాపాలు మొదలు పెట్టటానికి, హెచ్‌సీఎల్‌ సిద్ధమైంది.. ఆర్టీసీ జోనల్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చెందిన 27 ఎకరాలను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్‌సీఎల్‌ కు కేటాయించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ భూమిలో, చెట్ల తొలగింపు, నేల చదును పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఈ పనులు అన్నీ మరో 10 రోజుల్లో పూర్తవుతాయని, వెంటనే భూమి పూజ చేసి, నిర్మాణ పనులు మొదలు పెడతామని, చెప్తున్నారు... ఇక్కడ నిర్మించే ఐటి టవర్ నిర్మాణానికి, సంవత్సరం దాకా పడుతుంది అని, అందుకే మేధా టవర్స్ లో, కార్యకలాపాలు కూడా మొదలు పెట్టనుంది... ఒక వైపు టవర్‌ నిర్మాణ పనులతో పాటే మరోవైపు మేథ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకుంది... దీని కోసం, మేథ టవర్‌లో ఏకంగా ఒక ఫ్లోర్‌నే లీజుకు తీసుకుంది.. ఇప్పటికే, ఇక్కడ ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి... ఐటి టవర్ భూమి పూజ, మేధాలో కార్యకలాపాలు ఒకేసారి ప్రారంభించేందుకు హెచ్‌సీఎల్‌ పూనుకుంది. మే రెండో వారంలో కానీ, మూడో వారంలో కాని, ఇవి మొదలు కానున్నాయి...

కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో హెచ్‌సీఎల్‌ ఐటి టవర్ నిర్మాణం జరగనుంది.. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి.. దాదాపు వెయ్య మంది వరకు, ఇక్కడ ఉద్యోగాలు చేసే అవకాసం ఉంది. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ కొలువుదీరుతుందని, ఇప్పటికే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత, ఐటీ దిగ్గజం శివనాడార్ చెప్పారు... మరో పక్క, గన్నవరంలోనే కాక, అమరావతిలో కూడా మరో ఐటి టవర్ నిర్మించేందుకు హెచ్‌సీఎల్‌ ప్రణాలికలు రూపొందిస్తుంది...

Posted
సాఫ్ట్‌వేర్‌ శిక్షణ కేంద్రంగా అమరావతి
ఏపీ ఎన్‌ఆర్‌టీ చొరవ
ఇప్పటికే కొలువుదీరిన 15 సంస్థలు
1ap-main8a.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కోర్సుల శిక్షణ ఇకపై రాజధాని ప్రాంతంలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఎస్‌ఏపీ, ఒరాకిల్‌, పీహెచ్‌పీ, ఎస్‌క్యూఎల్‌, డాట్‌ నెట్‌ వంటి రకరకాల సాఫ్ట్‌వేర్‌ కోర్సులకు అమరావతిని హబ్‌గా మార్చేందుకు ప్రవాసాంధ్రుల సంఘం (ఏపీ ఎన్‌ఆర్‌టీ) చొరవ చూపుతోంది. ప్రస్తుతం యువత ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసుకుని వివిధ సాఫ్ట్‌వేర్‌ కోర్సులను నేర్చుకునేందుకు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాల బాట పడుతున్నారు. అక్కడే ఉద్యోగాలు వెతుక్కుని స్థిరపడుతున్నారు. అదే సాఫ్ట్‌వేర్‌ శిక్షణ సంస్థలు స్థానికంగా అందుబాటులో ఉంటే రాజధాని ప్రాంతంలో ఐటీ రంగం వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఈ ఉద్దేశంతోనే బెంగళూరు, పుణె, హైదరాబాద్‌ నగరాల్లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ శిక్షణ సంస్థలు తమ శాఖలను అమరావతిలో నెలకొల్పేలా ఏపీ ఎన్‌ఆర్‌టీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి అవసరమైన కార్యాలయ స్థలంతోపాటు, రూ.కోటిన్నర వరకూ ఏకకాల పెట్టుబడిని ప్రభుత్వమే సమకూరుస్తోంది. ఈ క్రమంలో ఏడాది కాలంలో 15 శిక్షణ సంస్థలు అమరావతిలో తమ శాఖలను నెలకొల్పి కార్యకలాపాలు ప్రారంభించాయి. మరిన్ని శిక్షణ సంస్థల కోసం మంగళగిరి-గుంటూరు జాతీయ రహదారి పక్కనే ఓ వాణిజ్య భవనాన్ని లీజుకు తీసుకున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో 60 వరకూ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఉండగా.. వాటికి నైపుణ్యాలున్న ఉద్యోగులు దొరకడం కష్టంగా మారింది. దీనివల్ల కొన్ని కంపెనీలు తిరిగి వెళ్లిపోయే పరిస్థితికొచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా సంస్థల అవసరాల మేరకు శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు కల్పించనున్నారు.

ఏడాదిలోపు 20 వేల ఉద్యోగాలు లక్ష్యం
సాఫ్ట్‌వేర్‌ శిక్షణ సంస్థలు, ఐటీ కంపెనీల మూలాలు విదేశాల్లో ఉన్నందున అవి రాజధాని ప్రాంతంలో శాఖలు నెలకొల్పేందుకు అవసరమైన సహకారాన్ని ఏపీ ఎన్‌ఆర్‌టీ అందిస్తోంది. ప్రోత్సాహకాలను  ప్రభుత్వం అందిస్తోంది. శాఖల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చాలా కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. రానున్న ఆరు నెలల్లో 6 సాఫ్ట్‌వేర్‌ సంస్థలు నగరానికి రానున్నాయి. వీటికి నైపుణ్యాలున్న మానవ వనరులను అందిస్తాం. ఈ ఏడాదిలోగా 20వేల ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం.

- రాజశేఖర్‌ చప్పిడి, డైరెక్టర్‌, మైగ్రెంట్‌ రీసోర్స్‌ సెంటర్‌, ఏపీ ఎన్‌ఆర్‌టీ
  • 3 weeks later...
Posted
10 hours ago, sonykongara said:

gannavaram ante ne vasthara db ki

Ledu brother. Ee madhya koncham busy aiyyanu. News paper choose time kooda dorakadam ledu.

Quick ga ikkada meeru post chestunna news choostunnanu.  Really appreciate your efforts.

Koncham time dorakagane malli post chesta. 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...